18-01-1990 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘స్వయం మరియు సేవలో తీవ్రగతిలో పరివర్తనకు గల గుహ్యమైన రహస్యము’’
ఈ రోజు పిల్లలందరి యొక్క స్నేహీ మాతా-పిత, తమ స్నేహీ పిల్లల యొక్క స్నేహంతో కూడిన హృదయం యొక్క శబ్దాన్ని మరియు స్నేహభరితమైన అమూల్యమైన ముత్యాల మాలలను చూస్తూ-చూస్తూ, పిల్లలకు స్నేహానికి రిటర్న్ లో విశేషమైన వరదానాలను ఇస్తున్నారు - ‘‘సదా సమీప భవ, సమాన సమర్థ భవ, సదా సంపన్న సంతుష్ట భవ’’. మీ హృదయంలో సంకల్పం ఉత్పన్నమైన వెంటనే అందరి హృదయంలోని స్నేహము బాప్ దాదా వద్దకు అత్యంత తీవ్రమైన వేగంతో చేరుకుంటుంది. నలువైపులా ఉన్న దేశ-విదేశాలలోని పిల్లలు ఈ రోజు ప్రేమసాగరునిలో లవలీనులై ఉన్నారు. బాప్ దాదా, అందులోనూ విశేషంగా బ్రహ్మా తల్లి పిల్లలను స్నేహంలో లవలీనులై ఉండడం చూసి స్వయం కూడా పిల్లల ప్రేమలో, స్నేహంలో లీనమై ఉన్నారు. బ్రహ్మా తల్లికి పిల్లల పట్ల విశేషమైన స్నేహం ఉండేదని మరియు ఇప్పుడు కూడా ఉందని పిల్లలకు తెలుసు. పాలన చేసే తల్లికి స్వతహాగానే విశేషమైన స్నేహం ఉండనే ఉంటుంది. కనుక ఈరోజు బ్రహ్మా తల్లి పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి హర్షిస్తున్నారు, ఏమనంటే, పిల్లల మనసులో, బుద్ధిలో, హృదయంలో, నయనాలలో మాత-పితలు తప్ప ఇంకెవ్వరూ లేరు. పిల్లలందరూ ‘‘ఒకే బలము, ఒకే భరోసాతో ముందుకు వెళ్తున్నారు’’ ఒకవేళ ఎక్కడైనా ఆగినా కూడా, మాత-పితల స్నేహ హస్తం మళ్ళీ వారిని సమర్థంగా చేసి ముందుకు తీసుకువెళ్తుంది.
ఈ రోజు మాత-పితలు పిల్లల శ్రేష్ఠ భాగ్యపు పాటలను పాడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజు విశేషంగా సూర్యుడు, చంద్రునికి బ్యాక్ బోన్ గా అయ్యి నక్షత్రాలను విశ్వం యొక్క ఆకాశంలో ప్రత్యక్షం చేసే రోజు. ఎలాగైతే యజ్ఞ స్థాపన యొక్క ఆదిలో బ్రహ్మా తండ్రి పిల్లల ముందు తమ సర్వస్వాన్ని సమర్పితం చేసారు అనగా వీలునామా చేసారు, అలాగే ఈ రోజున బ్రహ్మా తండ్రి పిల్లలకు సర్వశక్తులను వీలునామా చేసారు అనగా విల్ పవర్స్ ను ఇచ్చారు. ఈరోజు నయనాల ద్వారా మరియు సంకల్పం ద్వారా తండ్రి పిల్లలకు విశేషంగా ‘‘సన్ షోస్ ఫాదర్’’ (కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు) అన్న విశేషమైన కానుకనిచ్చారు. ఈ రోజు తండ్రి ప్రత్యక్ష సాకార రూపంలో చేయించేవారి పాత్రను అభినయించే ప్రత్యక్ష రూపాన్ని చూపించారు. బ్రహ్మా తండ్రి కూడా ఈ రోజు ప్రత్యక్ష రూపంలో, చేయించేటువంటి తండ్రికి సహచరునిగా అయ్యారు, చేసేవారిగా పిల్లలను నిమిత్తంగా చేసారు మరియు చేయించే మాత-పితలు సహచరులుగా అయ్యారు. ఈ రోజు బ్రహ్మా తండ్రి తమ సేవ యొక్క పద్ధతిని మరియు వేగాన్ని పరివర్తన చేసారు. ఈ రోజున విశేషంగా బ్రహ్మా తండ్రి దేహం నుండి సూక్ష్మ ఫరిశ్తా స్వరూపాన్ని ధారణ చేసి ఉన్నతమైన వతనము, సూక్ష్మవతన నివాసిగా అయ్యారు, ఎందుకు? పిల్లలను తీవ్ర వేగంతో ఉన్నతిలోకి తీసుకువెళ్ళేందుకు, పిల్లలను ఫరిశ్తా రూపంతో ఎగిరేలా చేసేందుకు. ఈ రోజు ఇంతటి శ్రేష్ఠమైన మహత్వం కలది! కేవలం స్నేహం యొక్క రోజు మాత్రమే కాదు కానీ విశ్వంలోని ఆత్మల యొక్క, బ్రాహ్మణాత్మల యొక్క మరియు సేవా వేగం యొక్క పరివర్తన డ్రామాలో నిశ్చితమై ఉంది, దానిని పిల్లలు కూడా చూస్తున్నారు. విశ్వాత్మల పట్ల బుద్ధివంతుల బుద్ధిగా అయ్యారు. బుద్ధి పరివర్తన అయ్యింది, సంపర్కంలోకి వచ్చారు, సహయోగులుగా అయ్యారు. బ్రాహ్మణాత్మలలో శ్రేష్ఠ సంకల్పాల ద్వారా తీవ్ర వేగంతో వృద్ధి జరిగింది. సేవ విషయంలో ‘‘కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు’’ అన్న కానుకతో విహంగ మార్గపు సేవను ఆరంభించారు. ఈ కానుక సేవలో లిఫ్ట్ గా అయింది. పరివర్తన జరిగింది కదా! ఇప్పుడిక మున్ముందు సేవలో మరింత పరివర్తనను చూస్తారు.
ఇప్పటి వరకు బ్రాహ్మణాత్మలైన మీరు మీ తనువు, మనసు యొక్క శ్రమతో ప్రోగ్రామ్ లు తయారుచేస్తారు, స్టేజ్ ను తయారుచేస్తారు, ఆహ్వాన పత్రికలను ముద్రిస్తారు, ఎవరైనా వి.ఐ.పి.లను పిలుస్తారు, రేడియో, టి.వి వారిని సహయోగులుగా తయారుచేస్తారు, ధనాన్ని కూడా పెడతారు. కానీ మున్ముందు మీరు స్వయం వి.ఐ.పి.లుగా అవుతారు. మీకన్నా గొప్పవారు ఎవ్వరూ కనిపించరు. తయారుగా ఉన్న స్టేజ్ పైకి ఇతరులు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. తమ తనువు, మనసు, ధనములను సేవల్లో స్వయం ఆఫర్ చేస్తారు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. మీరు శ్రమించరు, మీరు మా వద్దకు రండి అని వారే రిక్వెస్ట్ చేస్తారు, అప్పుడే ప్రత్యక్షతా ధ్వని గట్టిగా వినిపిస్తుంది మరియు అందరి అటెన్షన్ పిల్లలైన మీ ద్వారా తండ్రి వైపుకు వెళ్తుంది. ఇది ఎక్కువ సమయం కొనసాగదు. అందరి దృష్టి తండ్రి వైపుకు వెళ్ళడము అనగా ప్రత్యక్షత జరగడము మరియు నలువైపులా జయ-జయకారాల యొక్క గంటలు మ్రోగుతాయి. డ్రామాలో ఈ సూక్ష్మ రహస్యము తయారై ఉంది. ప్రత్యక్షత తర్వాత అనేకమంది ఆత్మలు పశ్చాత్తాపపడతారు. మరియు పిల్లల పశ్చాత్తాపాన్ని తండ్రి చూడలేరు, అందుకే పరివర్తన అయిపోతుంది. ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మీ ఉన్నతమైన స్థితి సదాకాలం కోసం తయారవుతుంది. మీ ఉన్నతమైన స్థితి, సేవా స్టేజ్ పైకి ఆహ్వానాన్ని ఇప్పిస్తుంది. మరియు అనంతమైన విశ్వం యొక్క స్టేజ్ పై జయ-జయకారాల పాత్రను అభినయిస్తారు. మరి, విన్నారా, సేవ యొక్క పరివర్తన గురించి.
బాబా అవ్యక్తమవ్వడం వెనుక డ్రామాలో గుప్తమైన రహస్యాలు నిండి ఉన్నాయి. చాలామంది పిల్లలు - బ్రహ్మాబాబా కనీసం సెలవు తీసుకొని వెళ్ళాల్సింది కదా అని అనుకుంటారు. మరి మీరు సెలవు ఇచ్చేవారా? ఇవ్వరు కదా. మరి శక్తిశాలి ఎవరైనట్లు? ఒకవేళ సెలవు తీసుకుని ఉంటే కర్మాతీతులుగా అవ్వలేరు ఎందుకంటే రక్త సంబంధం కంటే పదమాల రెట్లు ఎక్కువగా ఆత్మిక సంబంధం ఉంటుంది. బ్రహ్మాకు అయితే కర్మాతీతంగా అయ్యేది ఉందా లేక స్నేహ బంధనంలోకి వెళ్ళేది ఉందా? బ్రహ్మా తండ్రి కూడా ఉంటారు - డ్రామా కర్మాతీతంగా అయ్యే బంధనంలో బంధించింది అని. మరియు ఎంత సమయంలో బంధించింది! సమయం ఉండి ఉంటే పాత్ర వేరేగా ఉండేది, అందుకే క్షణం యొక్క ఆట అయింది. పిల్లలకు కూడా తెలియకుండా చేసింది, తండ్రికి కూడా తెలియకుండా చేసింది. దీనినే వాహ్ డ్రామా వాహ్! అని అంటారు. అంతే కదా. ‘‘వాహ్ డ్రామా వాహ్’’ అని అన్నప్పుడు ఇక వేరే సంకల్పాలేవీ తలెత్తలేవు. ఫుల్ స్టాప్ పెట్టేసారు కదా! లేదంటే పిల్లలు కనీసం - ఏం జరుగుతుంది అని అడగవచ్చు కదా. కానీ తండ్రి కూడా మౌనంగా ఉన్నారు, పిల్లలు కూడా మౌనంగా ఉన్నారు. దీనినే డ్రామా యొక్క ఫుల్ స్టాప్ అని అంటారు. ఆ క్షణమైతే ఫుల్ స్టాప్ యే పెట్టడం జరిగింది కదా. ఆ తర్వాత ఎన్ని ప్రశ్నలు తలెత్తినా కానీ ఆ క్షణంలో తలెత్తలేదు. కనుక వాహ్ డ్రామా వాహ్ అని అంటారు కదా! బాబా-బాబా అని కూడా తర్వాత పిలిచారు, ముందు పిలవలేదు. డ్రామాలో ఈ విచిత్రమైన విధి జరగాల్సే ఉంది మరియు జరిగేదే ఉంది. పరివర్తనాశీలి అయిన డ్రామా, పాత్రను కూడా పరివర్తన చేసేస్తుంది.
ఈ టీచర్లందరిలో మెజారిటీ వారు అవ్యక్త రచననే. సాకార పాలనను తీసుకున్న టీచర్లు చాలా తక్కువమంది ఉన్నారు. తీవ్ర వేగంతో జన్మించారు ఎందుకంటే సంకల్పాల వేగం అన్నింటికన్నా తీవ్రమైనది. ఆది రత్నాలు ముఖవంశావళి మరియు మీరు సంకల్ప వంశావళి, అందుకే బ్రహ్మా యొక్క రెండు రచనలు మహిమ చేయబడ్డాయి. ఒకటి ముఖవంశావళి, ఇంకొకటి సంకల్పం ద్వారా సృష్టిని రచించారు. వాస్తవానికి బ్రహ్మా రచనయే, అందుకే బి.కె.లుగా పిలవబడతారు. శివ కుమారీలు అనైతే పిలవబడరు కదా. డబల్ విదేశీయులందరూ కూడా సంకల్ప రచనే. ఇటువంటి తీవ్ర వేగంతో టీచర్లందరూ ముందుకు వెళ్తున్నారా? రచనయే తీవ్ర వేగంతో జరిగినప్పుడు పురుషార్థం కూడా తీవ్ర వేగంతో జరగాలి. సదా ఇది చెక్ చేసుకోండి, సదా తీవ్ర పురుషార్థినా లేక అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థినా? అర్థమయిందా! ఇప్పుడు ‘‘ఏమిటి’’, ‘‘ఎందుకు’’ అనే పాటను సమాప్తం చేయండి. ‘‘వాహ్-వాహ్’’ యొక్క పాటలను పాడండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ స్నేహీ మరియు శక్తి సంపన్నులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా తండ్రితో పాటు తీవ్ర వేగంతో పరివర్తనలో సహచరులైన సమీప ఆత్మలకు, సదా తమ ఎగిరే కళ ద్వారా ఇతరాత్మలను కూడా ఎగిరేలా చేసే నిర్బంధన ఎగిరే పక్షులైన ఆత్మలకు, సదా ‘‘కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు’’ అనే కానుక ద్వారా స్వయం మరియు సేవలో తీవ్ర వేగంతో పరివర్తన తీసుకొచ్చేవారు, ఇలాంటి సర్వ లవలీనులైన పిల్లలకు ఈ మహత్వపూర్ణమైన రోజు యొక్క మహత్వంతో పాటు మాత-పితల విశేషమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
హుబ్లీ జోన్ సోదరీ-సోదరులతో అవ్యక్త బాప్ దాదా కలయిక
సదా స్వయాన్ని ప్రతి అడుగులోనూ పదమాల సంపాదనను చేసుకునే పదమాపదమ భాగ్యవంతులుగా భావిస్తున్నారా? ప్రతి అడుగులోనూ పదమాలు... అన్న గాయనం ఏదైతే ఉందో, ఇది ఎవరి గాయనము? మొత్తం రోజంతటిలో ఎన్ని పదమాలను జమ చేసుకుంటారు? సంగమయుగము అత్యంత ఎక్కువగా సంపాదనను చేసుకునే సీజన్ యొక్క యుగము. మరి సీజన్ సమయంలో ఏం చేయడం జరుగుతుంది? అంత అటెన్షన్ పెడుతున్నారా? ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అని ప్రతి సమయం గుర్తుండాలి. ఏ క్షణమైతే గడిచిపోయిందో, అది ఇక మళ్ళీ రాదు. ఒక్క క్షణం వ్యర్థంగా పోయింది అంటే ఎన్ని అడుగులు వ్యర్థంగా పోయినట్లు? పదమాలు వ్యర్థంగా పోయినట్లు! అందుకే ప్రతి క్షణం ఈ స్లోగన్ గుర్తుండాలి - ‘‘ఎవరికైతే సమయం యొక్క మహత్వం తెలుసో, వారు స్వతహాగానే మహాన్ గా అవుతారు’’ స్వయాన్ని కూడా తెలుసుకోవాలి మరియు సమయాన్ని కూడా తెలుసుకోవాలి. రెండూ విశేషమైనవే. ఈ స్మృతి దివసం నాడు విశేషంగా సదా సమర్థులుగా అయ్యే శ్రేష్ఠ సంకల్పాన్ని చేసారా? ఇది వ్యర్థ సంకల్పాలను, మాటలను అన్ని రూపాలలోనూ వ్యర్థాన్ని సమాప్తం చేసే రోజు. ఎప్పుడైతే వ్యర్థమేమిటి, సమర్థమేమిటి అన్న జ్ఞానం లభిస్తుందో, అప్పుడు జ్ఞాన సంపన్నమైన ఆత్మ ఎప్పుడూ సమర్థాన్ని వదిలి వ్యర్థం వైపుకు వెళ్ళలేదు. మరియు ఎంతగా స్వయం సమర్థులుగా అవుతారో, అంతగా ఇతరులను సమర్థులుగా చేయగలరు. 63 జన్మలు పోగొట్టుకున్నారు మరియు సమర్థంగా అయ్యే జన్మ ఇది ఒక్కటే. కనుక ఈ సమయాన్ని వ్యర్థం చేయకూడదు కదా! అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు తమ దినచర్యను చెక్ చేసుకోండి. కేవలం రాత్రివేళనే తమ చార్టును చెక్ చేసుకోవడం కాదు, కానీ మధ్య-మధ్యలో చెక్ చేసుకోండి, పదే-పదే చెక్ చేసుకోవడంతో చేంజ్ చేసుకోగలరు. ఒకవేళ రాత్రివేళ చెక్ చేసుకున్నట్లయితే ఏదైతే వ్యర్థంగా పోయిందో, అది వ్యర్థం యొక్క ఖాతాలోనే చేరిపోతుంది. అందుకే బాప్ దాదా మధ్య-మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ సమయాన్ని ఫిక్స్ చేసారు. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారా లేక దినంలో బిజీగా ఉంటారా? మీ నియమం స్థిరంగా ఉండాలి. సమయం కొద్దిగా అటు ఇటు అయినా కానీ, ఒకవేళ అటెన్షన్ ఉన్నట్లయితే సంపాదన జమ అవుతుంది. ఒకవేళ ఆ సమయంలో ఏదైనా పని ఉన్నట్లయితే అరగంట తర్వాత చేయండి కానీ చేయడమైతే చేయగలరు కదా. గడియారం ఆధారంపైన అయినా ఎందుకు నడవాలి. మీ బుద్ధియే గడియారము, దివ్య బుద్ధి గడియారాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏ విషయమైతే అలవాటు అయిపోతుందో, అలవాటు అనేది ఎటువంటిదంటే అది వద్దు అనుకున్నా దాని వైపుకు ఆకర్షిస్తుంది. చెడ్డ అలవాట్లు మిమ్మల్ని ఉండనివ్వకుండా వాటి వైపుకు ఆకర్షిస్తున్నాయి అంటే, మంచి సంస్కారాలను తమవిగా ఎందుకు చేసుకోలేరు. కనుక సదా చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి, అప్పుడు సదా కోసం సంపాదన జమ అవుతూ ఉంటుంది. అచ్ఛా!
2) సదా స్వయాన్ని రూప్ బసంత్ గా అనుభవం చేస్తున్నారా? రూప్ అనగా జ్ఞాన స్వరూప ఆత్మలు కూడా మరియు యోగ స్వరూప ఆత్మలు కూడా. ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో రూప్ గా అయిపోవాలి మరియు ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో బసంత్ గా అయిపోవాలి. అందుకే మీ స్లోగన్ - ‘‘యోగీగా అవ్వండి, పవిత్రంగా అవ్వండి అనగా జ్ఞానీగా అవ్వండి’’ ఇతరులకు ఈ స్లోగన్ ను గుర్తు తెప్పిస్తారు కదా. కనుక రెండు స్థితులు క్షణంలో తయారవ్వగలవు. అంతేకానీ రూప్ గా అవ్వాలనుకుంటే జ్ఞానం యొక్క విషయాలు గుర్తుకు వస్తూ ఉండడం కాదు. క్షణం కన్నా కూడా తక్కువ సమయంలో ఫుల్ స్టాప్ పడాలి. అలా కాకుండా, ఫుల్ స్టాప్ పెట్టింది ఇప్పుడు మరియు అది 5 నిముషాల తర్వాత పడింది అన్నట్లు ఉండకూడదు. దీనిని పవర్ ఫుల్ బ్రేక్ అని అనరు. పవర్ ఫుల్ బ్రేక్ పని ఏమిటంటే, అది ఎక్కడ వేస్తే అక్కడే పడాలి. ఒక్క క్షణం ఆలస్యంగా పడినా కానీ ఆక్సిడెంట్ అయిపోతుంది. ఫుల్ స్టాప్ అనగా బ్రేక్ పవర్ ఫుల్ గా ఉండాలి. మనసు, బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలగాలి. ఈ మనసు-బుద్ధి-సంస్కారాలు ఆత్మలైన మీ శక్తులు కనుక సదా ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి - ఏ సమయంలో, ఏ విధితో మనసు, బుద్ధిని పెట్టాలనుకుంటే అలా పెట్టగలుగుతున్నారా లేక సమయం పడుతుందా? చెక్ చేసుకుంటారా లేక మొత్తం రోజంతా గడిచిపోయిన తర్వాత రాత్రివేళ చెక్ చేసుకుంటారా? మధ్య-మధ్యలో చెక్ చేసుకోండి. ఏ సమయంలోనైతే బుద్ధి చాలా బిజీగా ఉంటుందో, ఆ సమయంలో ట్రయల్ వేసి చూడండి - ఒకవేళ ఇప్పుడిప్పుడే బుద్ధిని ఇటువైపు నుండి తొలగించి తండ్రి వైపు జోడించాలనుకుంటే క్షణంలో జోడించగలనా? ఆ మాటకొస్తే క్షణం కూడా ఎక్కువే. దీనిని కంట్రోలింగ్ పవర్ అని అంటారు. ఎవరిలోనైతే కంట్రోలింగ్ పవర్ లేదో, వారు రూలింగ్ పవర్ యొక్క అధికారులుగా అవ్వలేరు. స్వరాజ్యం లెక్కలో చూస్తే ఇప్పుడు కూడా మీరు రూలర్ (శాసకులు). స్వరాజ్యం లభించింది కదా! కంటికి ఇది చూడు అని చెప్తే అది ఇంకేదో చూడడము మరియు చెవులకు ఇది వినవద్దు అని చెప్తే అవి వింటూనే ఉండడము అన్నట్లు ఉండకూడదు. దీనిని కంట్రోలింగ్ పవర్ అని అనరు. ఎప్పుడూ ఏ కర్మేంద్రియమూ మోసం చేయకూడదు - దీనిని స్వరాజ్యము అని అంటారు. మరి రాజ్యాన్ని నడిపించడం వచ్చు కదా? ఒకవేళ రాజును ప్రజలు అంగీకరించకపోతే, వారిని పేరుకు రాజు అంటారా లేక పని చేసే రాజు అని అంటారా? ఆత్మ యొక్క అనాది స్వరూపమే రాజు, యజమాని స్వరూపము. ఇదైతే తర్వాత పరతంత్రము అయింది కానీ ఆది మరియు అనాది స్వరూపము స్వతంత్రానిది. కనుక ఆది మరియు అనాది స్వరూపాలు స్వతంత్రమైనవి. కనుక ఆది మరియు అనాది స్వరూపాలు సహజంగా గుర్తుకు రావాలి కదా. స్వతంత్రులా లేక కొద్ది కొద్దిగా పరతంత్రులా? మనసు యొక్క బంధనం కూడా ఉండకూడదు. ఒకవేళ మనసు యొక్క బంధనం ఉన్నట్లయితే ఈ బంధనం మరిన్ని బంధనాలను తీసుకొస్తుంది. ఎన్ని జన్మలు బంధనాలలో ఉండి చూసారు! ఇప్పటికీ బంధనం బాగా అనిపిస్తుందా ఏమిటి? బంధనముక్త్ అనగా రాజు, స్వరాజ్యాధికారి ఎందుకంటే బంధనము ప్రాప్తులను అనుభవం చేయనివ్వదు, అందుకే బ్రేక్ ను సదా పవర్ ఫుల్ గా ఉంచుకోండి. అప్పుడు అంతిమంలో పాస్ విత్ ఆనర్ గా అవుతారు (గౌరవప్రదంగా ఉత్తీర్ణులవుతారు) అనగా ఫస్ట్ డివిజన్ లోకి వస్తారు. ఫస్ట్ అనగా ఫాస్ట్, అంతేకానీ సోమరులుగా కాదు. బ్రేక్ ఫాస్ట్ గా పడాలి. ఎప్పుడైనా ఎత్తైన స్థానానికి వెళ్ళేటప్పుడు మొదట బ్రేక్ ను చెక్ చేస్తారు. మరి, మీరు ఎంత ఉన్నత స్థానానికి వెళ్తారు! కనుక బ్రేక్ పవర్ ఫుల్ గా ఉండాలి కదా! పదే-పదే చెక్ చేసుకోండి. బ్రేక్ చాలా బాగుంది అని మీరు అనుకుంటారు కానీ అది సమయానికి పడదు అన్నట్లు ఉండకూడదు, అలా జరిగితే మోసపోతారు, అందుకే అభ్యాసం చేయండి, స్టాప్ అని అనగానే స్టాప్ అయిపోవాలి. రిద్ధి-సిద్ధి (మంత్ర తంత్రాలు) చేసేవారు ఏం చేస్తారు? సిద్ధిని చూపిస్తారు - నడుస్తున్న ట్రైనును ఆపేస్తారు. కానీ దాని వలన ఏం లాభముంది. మీరు సంకల్పాల ట్రాఫిక్ ను స్టాప్ చేస్తారు. దీనితో చాలా లాభాలు ఉంటాయి. మీది ‘‘విధి ద్వారా సిద్ధి మరియు వారిది రిద్ధి-సిద్ధి’’. అది అల్పకాలికమైనది, ఇది సదాకాలికమైనది. మరి అందరూ జ్ఞానసంపన్నులుగా అయ్యారు. రచయిత మరియు రచన యొక్క మొత్తం జ్ఞానం వచ్చేసింది. మాతలు ఏం చేస్తారు అని ప్రపంచం వారు అనుకుంటారు! కానీ మాతలు అసంభవాన్ని కూడా సంభవం చేస్తారు. ఇటువంటి శక్తులు కదా? అచ్ఛా!
Comments
Post a Comment