31-12-2017 అవ్యక్త మురళి

   31-12-2017         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“నూతన సంవత్సరాన్ని సమాప్తిసంవత్సరము, శ్రేష్ఠసంవత్సరము మరియు ప్రపంచాన్ని మేలుకొలిపే సంవత్సరము, ఈ రూపంగా జరుపుకోండి" 

ఓంశాంతి. ఇక్కడ కూర్చున్నవారంతా ఒకే పరివారానికి చెందినవారు. ఇటువంటి పరివారం గురించి ఎప్పుడైనా విన్నారా, చూసారా! లేదు. ఇటువంటి అలౌకిక పరివారాన్ని ఇప్పుడే చూసారు. ఇప్పుడు అందరూ భవిష్యత్తు కోసం తయారవుతున్నారు. అందరూ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. ఇప్పుడు మీ ఆ కొత్త ప్రపంచం రానుంది, ఎంత బాగుంటుంది, మీరందరూ కూడా భవిష్య పరివారానికి పాత్రులుగా తయారై ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.

కొత్త సంవత్సరంలో కొత్తగా ఏదైనా చూపించవవలసిందే కానీ ఎలా చూపించాలంటే జన్మజన్మల వరకు దాని ప్రాలబ్దం తోడుగా ఉండాలి.
 
(నిర్వైర్ అన్నయ్య మరియు బృజ్ మోహన్ అన్నయ్యలు బాప్ దాదాను విశేషంగా క్రొత్త సంవత్సరం కోసం ప్రేరణలను అడిగారు - క్రొత్త సంవత్సరానికి ఏ పేరును ఇవ్వాలి, ఏ అటెన్షన్ ను ఉంచాలి, చేయవలసిన పురుషార్థం ఏమిటి వంటివి.)

నూతన సంవత్సరాన్ని సమాప్తి సంవత్సరం, శ్రేష్ఠ సంవత్సరం మరియు ప్రపంచాన్ని మేలుకొలిపే సంవత్సరంగా చూడండి. ఈ సంవత్సరం కూడా ఎలా అద్భుతం చెయ్యనున్నదో చూడండి. 

ఇక ముందు ఏమి జరుగనున్నదో అని బ్రాహ్మణులంతా ఎంతో ఉల్లాసంతో ఎదురు చూస్తున్నారు. ఏమి జరుగనున్నదో తెలుసు కూడా! ఇప్పుడైతే అందరూ కొత్త ప్రపంచాన్ని కళగా చూస్తున్నారు. ఇప్పుడిక నూతన సంవత్సరం, నూతన రీతి, నూతన ప్రీతి అన్నీ క్రొత్త క్రొత్తగా మారుతున్నాయి. యుగం మారుతున్నట్లుగా యుగంతో పాటు రీతి-ఆచారము, పద్ధతులు అన్నీ అదే విధంగా జరుగనున్నాయి. మరి ఈ రోజు తమ కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇదే సంకల్పం చెయ్యండి - మేము పాస్ అవ్వవలసిందే. రెండు పాస్ లు - ఒకటి పరీక్షలో పాస్ అవ్వడము, రెండవ పాస్ దగ్గరగా ఉండటము, అది కూడా పాస్ లభించనుంది. పాస్ అయితే అవుతారు. దగ్గరగా ఉండటంతో పాటు పిల్లలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా పాస్ తప్పకుండా అవ్వాలి అని బాప్ దాదా కోరుకుంటున్నారు. ఈ సమయాన్నే పాస్ చెయ్యాలి, ఇందుకోసం స్వయాన్ని చెక్ చేసుకోండి మరియు భవిష్యత్తుపై అటెన్షన్ పెట్టండి. ఈ సమయంలోనే పాస్ అవ్వవలసి ఉంది. పాస్ అవ్వడము అంటే అన్నీ ఉన్నప్పటికీ భవిష్యత్తును సమీపంగా చూడాలంటే ఎంతగా పురుషార్థం చెయ్యాలంటే ఈ భవిష్యత్తే తోడుగా ఉండాలి మరియు అందరి నుండి ఇదే మాట రావాలి - పాస్ పాస్ పాస్. అందరి ముఖాలు ఏమని చెబుతున్నాయంటే ఇప్పటి వరకు చేసిన పురుషార్థం, ముందు చేసారో లేదో వేరే విషయము, కానీ ఇప్పుడు ఈ సమయంలో మాత్రం ఫుల్ పాస్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్రాహ్మణులే పాస్ అవుతారు. బ్రాహ్మణులు కదా, కనుక బ్రాహ్మణులకు మొదటగా బహుమతిగా ఇదే ఇస్తున్నాము. పూర్తి సభలో ఇప్పుడు ఉన్న ఉల్లాసము ఇదే - ఇప్పుడు త్వరత్వరగా మేము పాస్ అయిపోవాలి అప్పుడు ఎంతగా అందరికీ సంతోషం ఉంటుంది! ఇప్పుడు మేము పరివర్తన అవ్వబోతున్నాము అన్న సంతోషం అందరికీ ఉంది.

(నూతన సంవత్సరం కోసం మీరివ్వబోయే ప్రేరణలను వినాలని దేశవిదేశాల సోదరసోదరీలు వినాలనుకుంటున్నారు)

అందరూ స్వయాన్ని ఎలా భావిస్తున్నారు! మా అధికారమైతే ఉండనే ఉంది అని అనుకుంటున్నారా లేక ఏమో తెలియదు, ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారా! ఈ ఆలోచన వచ్చినా కానీ నిలవకూడదు. ఇది నిలిచి ఉండటం మంచిది కాదు. ఇప్పుడైతే మనం రాజ్యభాగ్యాన్ని తీసుకోవలసి ఉంది. ముందుగా స్వయం పైన రాజ్యం, ఇతరులపై అయితే ఎలాగూ ఉండనుంది. స్వ రాజ్యం చాలా పెద్దది అనైతే ప్రసిద్ధి అవుతుంది. అన్ని ప్రశ్నలు ఈ విషయం పైననే ఉన్నాయా లేక ఇంకే ప్రశ్నలైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ రాజ్యం ఉన్నట్లుగా భవిష్యత్తులో దీనికన్నా పటిష్టమైన మీ రాజ్యం రానుంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు మరియు ప్రేరణ కూడా తీసుకుంటున్నారు. బాప్ దాదా కూడా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. చాలా లభించింది, ఇంకా లభించనుంది అని కూడా అనుకుంటున్నారు. 

సేవ టర్న్ మహారాష్ట్ర, ముంబయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారిది, 15 వేలమంది సేవాధారులు వచ్చారు, మొత్తం 25 వేల మంది ఉన్నారు, 600 మంది డబుల్ విదేశీయులు ఉన్నారు: - అందరూ ఉల్లాస ఉత్సాహాలలో ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పురుషార్ధం చేసి స్వయం మరియు తండ్రి పేరును ప్రసిద్ధం చేస్తున్నారని బాప్ దాదా కూడా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు.

Comments