31-12-2016 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“దిల్ వాలా ఒక్కరు, దిల్ వాలాలు అనేకులు, అందరి హృదయాలలో నా బాబా నిండి ఉన్నారు. ఈ సుఖమయ జీవితంలోనే మజా ఉంది, ఏమి జరిగినా కానీ సూచన లభించిన వెంటనే ఏకరస అవస్థలో స్థితి అయ్యే అభ్యాసం చెయ్యండి. ఆజ్ఞ అనుసారంగా అతీంద్రియ సుఖంలో ఇమిడిపోండి”
ఓంశాంతి. అందరి మనసులలో ఎవరు నిండి ఉన్నారు? సభలో ఇంతమంది ఉన్నా కానీ అందరూ ఒక్క బాబా నుండి ఎంతో ప్రేమతో దృష్టి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి దృష్టిలో బాబా ఉన్నారు. పిల్లలు అతి స్నేహ రూపంలో ఉన్నారు. అందరి హృదయాలు ఒకే మాటను పలుకుతున్నాయి - నా బాబా, నా బాబా. అందరూ ఎంతో ప్రేమతో తమ స్మృతిని అందిస్తున్నారు. ఎంతమంది కూర్చున్నాకానీ, ఎక్కడ కూర్చున్నాకానీ, అందరి హృదయాలలో ఒక్కటే స్మృతి, అదేమిటి? నా బాబా. అందరి హృదయాలలో ఏమి ఉంది? కేవలం నా బాబా. అందరి హృదయాలు బాబాపై ప్రేమ గీతాలు, కవితలతో నిండి ఉన్నాయి. అందరి హృదయాలలో ఒకే పాట మ్రోగుతుంది - వాహ్ నా హృదయపు బాబా! బాబా మరియు నేను, అందరి హృదయాలలో ఇదే ఉంది కదా! నేను మరియు నా బాబా. ఇద్దరే అయినా కానీ ఒక్కరిగా ఉన్నారు. అందరి హృదయాలలో బాబాయే నిండి ఉన్నారు. నా హృదయంలో ఎవరు ఉన్నారు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోండి. అద్భుతం ఏమిటంటే, హృదయాలు అనేకమైనా కానీ అందులో నిండి ఉన్నది ఒక్కటే. చేతులు ఎత్తండి, మీ హృదయంలో ఎవరు నిండి ఉన్నారు? ఎంతమంది దిల్ వాలాలు ఉన్నారు కానీ అందరి హృదయాలలో నిండి ఉన్నది ఒక్కరే. ఇదే అద్భుతము. అందరి హృదయాలలో ఒక్కరు ఉన్నారు. ఈ ఒక్కరు ఎంత ప్రియమైన వారంటే వారిని ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా కానీ మర్చిపోలేరు. స్మృతి పెరుగుతూనే ఉంటుంది. ఇంత పెద్ద సభ కూడా ఏమంటుంది? నా బాబా. అందరి హృదయాలలో ఒక్కరి స్మృతియే ఉంది, నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా. ఇందులో ప్రేమ ఎంత నిండి ఉంది! అందరి హృదయాలలో ఒక్క బాబాయే నిండి ఉన్నారు. ఎంతమంది కూర్చుని ఉన్నారు! కానీ అందరి హృదయాలలో నిండి ఉన్నది ఒక్కరే. వీరి హృదయంలో ఈ సమయంలో ఎవరు ఉన్నారు అని తెలుసా? మెజారిటీ హృదయాలలో ఒక్కరే నిండి ఉన్నారు. చాలామంది కూర్చుని ఉన్నా కానీ తమ హృదయాలలో బాబాను నింపుకున్న వారి సభ ఇది. అందరి హృదయాలలో ఎవరు ఉన్నారు? నా బాబా. బాబా ఎంత ప్రియమైనవారు? ఇంతమంది ఉన్నాకానీ మెజారిటీ అందరి హృదయాలలో బాబాయే నిండి ఉన్నారు. నా బాబా అన్నది హృదయంలో ఎంతగా నిండిపోయి ఉందంటే దానిని హృదయం నుండి వెలుపలకు తీసుకురావడమే కష్టంగా ఉంది. అందరూ ప్రేమతో ఏమని అంటారు, ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఏమంటారు? నా బాబా ఎలా ఉన్నారు, నా బాబా ఏమి చేస్తున్నారు! నా బాబా, నా బాబా. పాట కూడా ఉంది కదా - పాట పాడినా కానీ ఆ ఒక్కటే పాడుతారు. ఇక్కడ కూర్చున్న ఇంతమంది ముందు అందరి హృదయాలలో ఎవరు ఉన్నారు అంటే అందరూ నా బాబా, నా బాబా అని అంటారు. అందరూ పైకి చేతులెత్తండి. అందరూ చేతులెత్తితే ఈ దృశ్యం ఎంత మజాగా ఉంది. బయటకు పాట పాడకపోయినా కానీ, ఎందుకంటే బయటకు పాడితే పాడటంలో తేడా వస్తుంది. హృదయంలో అందరిదీ ఒకటేగా ఉంటుంది. అందరి హృదయాలు ఏమంటున్నాయి? నా బాబా, నా బాబా. అందరూ ఒక్క బాబాను గుర్తు చేస్తూ ఎంతో సంతోషిస్తున్నారు. చూడండి, అందరి ముఖాలు చూడండి. అందరి హృదయాలు ఒక్కటే పాట పాడుతున్నాయి - నా బాబా, మధురమైన బాబా. ఇన్ని హృదయాలు ఉన్నప్పటికీ అందరి హృదయాలలో ఎవరు ఉన్నారు? నా బాబా. ఎంత మజా వస్తుంది. ఏమి జరిగినా కానీ మన హృదయంలో నా బాబా, నా బాబా. ఇలా సదా నా బాబా సదా నా హృదయంలో ఉంటారు అని చూసుకుని అందరూ సంతోషిస్తున్నారు. సభలో ఇంతమంది కూర్చున్నా కానీ అందరి హృదయాలలో ఒక్కరే ఉన్నారు, అంతే కదా! అందరి హృదయాలలో ఎవరు ఉన్నారు? బాబా. హృదయంలో ఒక్కరే ఉన్నారు. మీరు కూడా నా బాబా అంటారు, వారు కూడా నా బాబా అంటారు, వారు కూడా నా బాబా అంటారు. ఎంత బాగుంది. మరి సదా అటువంటి హృదయంలో బాబా ఉండనే ఉంటారు. ఎవరు చూసినా కానీ ఏమి కనిపించాలి? నా బాబా కూర్చుని ఉన్నారు. నాలుగు వైపుల చూసినా కానీ ఎవరు కూర్చుని ఉన్నారు? నా బాబా. నా బాబాను ఎంతగా దాచి పెట్టుకుని ఉండాలంటే ఎవ్వరూ ఇక దానిని బయటకు తియ్యలేకపోవాలి అని ఎప్పుడూ బాబా చెప్తూ ఉంటారు. అందరి ముఖాలు చూడండి, ఇప్పుడు కూర్చున్నవారి హృదయాలలో నా బాబా మాత్రమే ఉంది. అందరి ముఖాలు ఎలా ఉన్నాయో చూడండి! చిరునవ్వుతో ఉన్నాయి. ఎంతగానో లోలోపల నాట్యం చేస్తున్నారు. నా బాబా, నా అన్నది వచ్చింది కదా, నా హృదయ బాబా. చెప్పడానికి కూడా ఎంత మధురంగా ఉంది! నా బాబా. ఇదే విధంగా ఏ పని చేసినా కానీ నా బాబాను మర్చిపోవద్దు. అందరి హృదయాలలో ఒక్కరే ఉన్నారు. కొంతమంది హృదయాలలో ఉండకపోవచ్చు కానీ వాస్తవానికి ఈ సభ ఎటువంటిది? హృదయంలో హృదయాభిరాముడు. అందరి హృదయాలలో చూస్తే ఎవరున్నారు? హృదయాభిరాముడు. ఏమి జరిగినా కానీ ఇలాగే నా బాబాను హృదయంలోనే నింపుకుని ఉండాలి అని బాబా ఆశిస్తున్నారు. అందరి హృదయాలలో ఏముంది? పూర్తి సభలో ఉన్న వారందరి హృదయాలలో ఇప్పుడు ఎవరు ఉన్నారు? మధురమైన బాబా. హృదయంలో కేవలం ఒక్క హృదయాభిరాముడిని నింపుకున్నవారి సభ ఇది. హృదయాభిరాముడు ఒక్కరు, దిల్ వాలాలు అనేకులు. అందరి హృదయాలలో ఒక్క బాబాయే నిండి ఉన్నారు. ఎవరు ఏమన్నాకానీ, హృదయంలో మరొకరు ఉంటే వారు నిలువలేరు. నా బాబా. అందరి హృదయాలలో ఒక్కరే ఉండటం ఎంత మజాగా ఉంది. వాతావరణం ఎంతో సుఖప్రదంగా, అతీంద్రియ సుఖంతో ఉన్నవారి సభను చూడాలంటే చూడండి. ఏది జరిగినా కానీ అందరి మనసుల నుండి వాహ్ బాబా వాహ్ అనే వెలువడుతుంది. అందరి హృదయాలలో ఎవరు ఉన్నారు! ఇంతమంది ఉన్నప్పటికీ, మధ్యలో మరెవరో ఉన్నాకానీ మెజారిటీ ఈ సమయంలో బాబా, బాబా అంటున్నప్పుడు అందరి హృదయాలలో ఒక్క బాబాయే ఉన్నారు. ఇందులో మజా ఎంత వస్తుంది! ఈ సభలోని వైబ్రేషన్లు ఎలా అనిపిస్తున్నాయి? ఒక్క బాబా స్మృతి. మీ హృదయంలో ఎవరున్నారు అని అందరినీ అడుగుతాము. నా బాబా అని అందరూ అంటారు. మరి మజాగా ఉంది కదా! సభ ఒక్కటే కానీ ఒక్కటిలో ఒకరు ఉన్నారు, ఒక్కటే సభ, ఒక్కరే ఇంద్రజాలికుడు. అందరి హృదయాలలో ఏ పాట వస్తుంది? వాహ్ నా బాబా వాహ్! చెప్పండి ఇప్పుడు. రోజూ ఉదయం తయారై బయటకు వెళ్ళేముందు, అన్ని కర్మలు చేస్తూ కూడా బాబా స్మృతి ఉంటుంది, కానీ ఒకవేళ తయారయ్యాక స్మృతి చేసి పని చెయ్యడానికి, లేక ఇంకేదైనా చెయ్యడానికి వెళ్తే ఎంతో మజా వస్తుంది. ఎవరికైనా ఇప్పుడు, సత్యయుగంలో కాదు, ఇప్పుడు బాబా స్మృతి లేకుండా ఉన్నదా? బాబా స్మృతిలో శ్రమించేవారు ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి. చూడండి, సభ ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూడండి, సభ ఎంతో అందంగా కనిపిస్తుంఉంటే ఎంత మజా వస్తుంది! ఎంతటి సుఖప్రదమైన జీవితము, వాహ్! మా వర్తమాన జీవితము సుఖప్రదంగా ఉంది అని భావించేవారు చేతులెత్తండి. అచ్చా. ముందు, వెనక ఉన్నవారంతా మీ ముఖాన్ని చూసుకోండి, ఏముంది? ఎంత సమయం చెప్పినా ఇది చెయ్యగలరు, కాకపోతే అభ్యాసం కావాలి. ఇప్పుడు అందరూ ఒక్క సెకండులో కాదు, ఒక్క నిమిషంలో వాహ్ నా అతీంద్రియ సుఖమయ జవితము అని అనుకోవాలి. మరి ఇలా ఒక్క సెకండులో తమ అవస్థను తయారు చేసుకోవాలి అని బాబా అంటే చేసుకోగలరా? చేతులెత్తండి. అందరూ మీ చేతులను పొడవుగా ఎత్తండి. సభ ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడకు వచ్చి చూడండి. ఈ అభ్యాసము కావాలి. ఏమి జరిగినా కానీ, నొప్పి లేక ఇంకేదైనా జరిగినా కానీ మన ముఖంలో మార్పు రాకూడదు, చిరునవ్వుతో ఉండాలి. ఇటువంటి అభ్యాసము కావాలి. ఇప్పుడు వెంటనే అతీంద్రియ సుఖంలో ఉండండి అని ఆర్డర్ లభిస్తే అందులో స్థితులవ్వగలరా? ఇప్పుడు రెండు నిమిషాలు అందరూ ఒకే రసంలో కూర్చోండి. అతీంద్రియ సుఖపు అలలో కూర్చుని చూడండి, ఎంతగానో మజా వస్తుంది. అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగితే ఎంత సుఖం ఉంటుందో తెలుస్తుంది. ఏ విషయమైనా, ఏది ఎదురైనా ఈ సుఖాన్ని మర్చిపోవద్దు, ఇది వీలవుతుందా! వీలవుతుందా? వీలవుతుందో లేదో మీరు చెప్పండి. వీలవుతుంది ఎందుకంటే మన జీవితం ఎటువంటిది? మీ హృదయంలో ఎవరున్నారు అని మనస్పూర్తిగా స్వయాన్ని ప్రశ్నించుకోండి. మీ హృదయంలో ఏదైనా దుఃఖము, అశాంతి ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటి కారణాన్ని అడిగి తెలుసుకుని వాటిని సమాప్తం చేసేయ్యవచ్చు. నా పిల్లలు అని బాబా అంటారు. బాబా ఎప్పుడూ నా పిల్లలు అని అంటారు. మరి నా పిల్లలై ఉండి సంతోషంగా ఉండకపోవడం అన్నది వీలవ్వదు. నా పిల్లలు మెజారిటీ సంతోషంగా ఉంటారు. లోపల ఏదైనా దుఃఖం ఉంటే సత్యం చెప్పండి. అసలు మన జీవితం ఎటువంటిది! పరిచయం ఇచ్చేటప్పుడు ఏమని చెప్తారు? సుఖము, శాంతి, ప్రేమ ఇవి మన జీవితము. అంతే కదా? ఎప్పుడు కూడా ఈ నా జీవితం నాకు వద్దు అని అనుకోవద్దు. రెండో జీవితం ఎందుకు కావాలి? ఇప్పుడు ఇందులోనే ఉండాలి అని బాబా ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు విడిచిపెడ్తారు? ఈ సుఖమయ జీవితపు అవస్థ ఎప్పటికీ ఉండాలి. మెజారిటీ ఇలా ఉంటున్నాము అని భావించేవారు ఎంతమంది? వారు చేతులెత్తండి. చేతులైతే బాగా ఎత్తుతారు! పురుషార్థం చేస్తే ఏమంత పెద్ద విషయము! మనం మన అవస్థను ఎంత స్థితి చేసుకుంటే అంత అవుతుంది. అసలు యజమాని ఎవరు! మనమే కదా యజమానులం! కేవలం ఇందులో అటెన్షన్ కావాలి. అటెన్షన్ అక్కడ ఇక్కడ పెడితే అది కూడా షికార్లు చేస్తుంది. రోజంతా ఇది అనుభవం చెయ్యాలి ఎందుకంటే ఈ అభ్యాసం చాలా అవసరం. ఏవైనా పరిస్థితులు వచ్చినా కానీ, మీకు ఏకరస అవస్థ యొక్క సూచన లభించగానే అందులో నిలవాలి. ఈ అభ్యాసం రోజంతా, ప్రతి ఒక్కరూ అభ్యసించాలి. అచ్చా - ఒక గంట ఈ అవస్థలో కూర్చుంటే అదేమంత పెద్ద విషయము కాదు, నా అవస్థ కదా! ఒకవేళ కూర్చోలేకపోతే అది మన బలహీనత. ఇటువంటి స్థితిలో స్థితి అయ్యే ప్రయత్నం చేస్తే మీ జీవితం చాలా చక్కగా, మీకు సుఖమయ శయ్యపై పడుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ అభ్యాసం తప్పకుండా చెయ్యాలి. ఏమి జరిగినా కానీ నా అవస్థ నా చేతుల్లోనే ఉండాలి. మరి ఇంతమంది కూర్చుని ఉన్నారు, అటువంటి సమయంలో స్థితి నిలవగలిగిందా అని చూసుకోండి. మీ ఈ పురుషార్థం చూసుకోండి. వీరు కూడా ఉన్నారు, వీరు కూడా కూర్చుని ఉన్నారు అని ఆలోచించకండి. మీ చేతుల్లో ఉండాలి. స్థితిలో స్థితి అవ్వాలనుకుంటే అవ్వాలి కదా. అవ్వలేకపోతే దీనిని ఏమని అంటారు? యోగి? నెమ్మది నెమ్మదిగా ఈ అభ్యాసం జరిగితే, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితి అవ్వాలి. స్థితి అయ్యే ప్రయత్నం రోజంతా చేస్తూనే ఉండవచ్చు. మీ చెకింగ్ మీరే చేసుకోండి. రోజంతా చెయ్యగలగడం అన్నది మీ చేతుల్లో ఉంది. మీ బుద్ధిని స్థితిపర్చుకోవడము మీ చేతుల్లో ఉంది. చెయ్యగలరు. ఇప్పుడు అందరూ కూర్చున్నారు కదా, మరి స్వయం మంచి స్థితిని అనుభవం చేసారా? ఎవరైతే చేసారో, మనస్పూర్తిగా చేసాము అని అన్నవారు చేతులెత్తండి. అచ్చా. చేతులైతే అందరూ ఎత్తారు. అచ్చా, కొందరిది తక్కువ ఉండవచ్చు, కొందరిది ఎక్కువ ఉండవచ్చు. కానీ ఎంత సమయం చెబితే అంత సమయం తప్పకుండా ఉండాలి. అందరూ ట్రయల్ వేసారు, ఈ ట్రయల్ వేస్తూ ఉండండి. ఏ సమయంలోనైనా ఈ అవస్థను ఎప్పుడు, ఎలా కావాలంటే అప్పుడు చేసేవారిని యోగేశ్వరుల వరుసలోకి తీసుకురావచ్చు. ఈ సమయంలో ఇటువంటి వాతావరణంలో కూడా నేను ఏ అవస్థను కావాలంటే ఆ అవస్థను తీసుకురాగలను అని అనుకునేవారు చేతులెత్తండి. చెయ్యగలరా? చేతులైతే చాలామంది ఎత్తారు. మంచిది, అలాంటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అర్థగంట కూర్చోగలగాలి. ఈ అభ్యాసాన్ని మధ్యమధ్యలో మీ అంతట మీరే చేస్తూ ఉండాలి. కేవలం అటెన్షన్ కొంచెం ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే కంట్రోల్ ఆఫ్ మైండ్ (మనసు నియంత్రణ) స్థితితో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంతమంది కలిసి కూర్చున్నా కానీ అర్థగంట, పావుగంట కోసం ఆజ్ఞ లభిస్తే, ఎప్పుడు ఎలా కావాలంటే అలా అంత సమయం స్వయాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి, ఈ అభ్యాసం తప్పకుండా చెయ్యాలి. ఎప్పుడు ఏ అవస్థ అయినా ఉండవచ్చు కానీ ఆ అవస్థ కూడా ఎప్పుడు, ఎలా కావాలంటే అంత ఉండాలి. ఇప్పుడు రోజుల సమయం ఉంది కనుక ఇటువంటి సమయంలో కంట్రోల్ చేసుకోవాలంటే చేసుకోగలగాలి, ఈ ప్రాక్టీసు ఉండాలి. చెయ్యగలరు, ఇంత చెయ్యగలరా? ఇప్పుడు సాధారణ రూపంలో కూర్చున్నారు, ఇప్పుడు కంట్రోల్ యొక్క ఆర్డర్ లభిస్తుంది. అర్థగంట మీరు ఈ అవస్థలో స్థితులవ్వాలి అంటే చెయ్యగలరా లేక పదే పదే అటెన్షన్ ఇవ్వవలసి ఉంటుందా? ఒకవేళ అది ఇచ్చినా కానీ అవసరమైనప్పుడు స్వయాన్ని నిలిపే విధంగా అభ్యాసం ఉండాలి. అలా మీరు ఆగమన్నప్పుడు ఆగే విధమైన స్థితి ఎవరికి ఉంది, వారు చేతులెత్తండి. ఆపాలి అనుకున్నప్పుడు ఆగాలి. ఈ అభ్యాసం కూడా అవసరము ఎందుకంటే సమయం ఇప్పుడు ఎలా రానున్నదంటే, ఏ ఆర్డర్ లభిస్తే అది మీరు చెయ్యగలగాలి. ఆర్డర్ అంటే ఆర్డర్. అంతేకానీ ఇప్పుడు ఆర్డర్ లభిస్తే ప్రాక్టికల్ లోకి వచ్చేసరికి సమయం పట్టకూడదు. ఈ ప్రాక్టీసు తప్పకుండా ఉండాలి. రోజంతటిలో మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఒకవేళ ఆర్డర్ చేస్తే ఆర్డర్ అమలు చేస్తారా! ఇటువంటి అవస్థ కోసం పురుషార్థం చెయ్యాలి. అభ్యాసం అవసరము. సరే, 10 నిమిషాలు కూర్చోవాలి అనుకున్నారు, 5 నిమిషాలు కూర్చోగలిగారు, ఏమి జరిగినా కానీ ఆర్డరు పాటించడం రావాలి. అలా ఇప్పుడు అవ్వగలదు అని మీరు భావిస్తున్నారా? అచ్ఛా .
సేవ టర్న్ యు.పి, బనారస్, పశ్చిమ నేపాల్ వారిది, యు.పి నుండి 11 వేల మంది వచ్చారు. మొత్తం 23 వేల మంది వచ్చారు:- అందరూ ఇటువంటి పురుషార్ధం చేస్తున్నారా, చేస్తూ ఉండాలి కూడా ఎందుకంటే మనకు అభ్యాసం ఉంటే మనం ఇతరులకు చెప్పగలము. లేకపోతే చెప్పడానికి మనకు సిగ్గు అనిపిస్తుంది. కనుక ఈ అభ్యాసం ఉండాలి. ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా మనం పేపరు ఇవ్వవలసి రావచ్చు కనుక ఈ అభ్యాసం చెయ్యాలి. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? చేతులెత్తండి. అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే అంతా సహజమైపోతుంది. ఏదీ కష్టం కాదు. కేవలం చేస్తూ ఉండండి. ఎప్పుడైనా కొద్ది సమయమే లభించినా కానీ ఆ కొద్ది సమయంలో కూడా అభ్యాసం చెయ్యవచ్చు. ఇటువంటి అభ్యాసాన్ని విడిచిపెట్టవద్దు. ఈ అభ్యాసాన్ని మీకు మీరే చేస్తూ ఉండండి. ఎంత సమయం కావాలంటే అంత సమయంలో అభ్యాసాన్ని పూర్తి చెయ్యండి. ఇప్పుడైతే రోజంతటి అలసట ఉండవచ్చు, అందుకని బాప్ దాదా చేయించడం లేదు. ప్రశాంతంగానే చెయ్యండి, కానీ చేస్తూ ఉండండి. ఎంత సమయం కావాలంటే అంత సమయం నెమ్మది నెమ్మదిగా అభ్యాసం చేస్తూ ఉండండి. అయిపోతుంది. బాబా వరదానము ఉంది.
డబుల్ విదేశీ సోదరసోదరీలు 50 దేశాల నుండి 600 మంది వచ్చారు:- (చిన్న పిల్లలు పాట పాడుతున్నారు) పెద్దగా పాడండి (మేరే సంగ్ సంగ్ చల్తే బాబా)
దాదీలతో:- మీరేమనుకుంటున్నారు, వీలవుతుందా? అటెన్షన్ పెడితే జరగనిది ఏమైనా ఉంటుందా? అన్నీ అవుతాయి కానీ దృఢ నిశ్చయం ఉండాలి. చెయ్యవలసిందే. ఇప్పుడు మొదలు పెట్టలేదు అనుకోండి, రేపు అకస్మాత్తుగా రేపటి నుండి ఒక గంట చెయ్యాలి అంటే చెయ్యగలరా? చెయ్యగలము అనుకునేవారు చేతులెత్తండి. కొద్దిమంది ఉన్నారు. ఏమీ ఫర్వాలేదు.
బాబా, క్రొత్త సంవత్సరము (నిర్వైర్ అన్నయ్యతో):- మీరు చెప్పండి. మీరు హ్యాపీ న్యూ ఇయర్ అంటే అందరూ చెప్తారు. అందరూ ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో చెప్పారు, చాలా మంచిది. హ్యాపీ న్యూ ఇయర్.
(బృజ్ మోహన్ అన్నయ్య ఇలా చెప్పారు - దాదీ జానకిగారి 101వ పుట్టినరోజు, వారి పుట్టినరోజును రేపు సాయంత్రం వేడుకగా జరుపుకోబోతున్నాము, దాదీ జానకి గారికి అందరి తరఫున చాలా చాలా అభినందనలు)
రమేష్ అన్నయ్య ట్రామా సెంటర్, శాంతివన్ లో ఉన్నారు, బాప్ దాదాకు వారి స్మృతిని అందించారు):- రమేష్ అన్నయ్యకు నూతన సంవత్సర చాలా చాలా స్మృతిని అందించండి. డాక్టర్లు ఇస్తున్న చికిత్సను కొనసాగించండి. వారు బాప్ దాదా దృష్టిలో ఉన్నారు. బాప్ దాదా శక్తి ఇస్తున్నారు.
బాప్ దాదా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విని మంచిగా అనిపిస్తుంది కదా అందరూ లోలోపల సంతోషిస్తున్నారు. కాకపోతే సమయం ఎటువంటిదంటే అందరికీ ఆకలి వేసే సమయం, అందుకే వెళ్తున్నారు. ఇప్పుడు ప్రారంభమయ్యే నూతన సంవత్సరం కోసం మీ అందరికీ చాలా చాలా అభినందనలు. అందరికీ అభినందనలు లభించాయి. ఈ అభినందనలను అందరూ సంభాళించి పెట్టుకోండి, ఇతరులకు ఇవ్వండి.
(నిర్వైర్ అన్నయ్య - బాప్ దాదా మనకు ఇచ్చిన ఈ అభినందనల కోసం మీ అందరి తరఫున బాప్ దాదాకు కోటి కోటి ధన్యవాదాలు) దాదీ ఇలా అన్నారు - బాబా మీ అందరికీ చాలా చాలా ప్రియస్మృతులను పంపారు. మీ అందరి తరఫున మేము కూడా బాబాకు అభినందనలు
Comments
Post a Comment