31-12-2015 అవ్యక్త మురళి

  31-12-2015         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“డ్రామాలో ఈ సంగమమిలనము చాలా చాలా అమూల్యమైనది మరియు అతీతమైనది, ప్రియమైనది, భాగ్యశాలి పిల్లలకు మాత్రమే అకస్మాత్తుగా లభించే లాటరీ ఇది" 

* ఈ రోజు ప్రేమికులైన పిల్లలందరూ తమ ప్రియుడైన బాబాతో మిలనం జరుపుకోవడానికి వచ్చారు. బాప్ దాదా కూడా నలువైపుల ఉన్న పిల్లలందరినీ చూసి వాహ్ అంటూ సంతోషిస్తున్నారు, నా నయనాలలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఇమిడి ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది, ఆ విశేషత వలనే పిల్లలు మరియు తండ్రి మిలనం జరుగుతుంది. 

* ప్రతి ఒక్కరి నయనాలు ఈ మిలనంలో ఎంత సంతోషంగా ఉన్నాయంటే ఈ సాకార ప్రపంచంలో సాకార రూపంలో తండ్రి మరియు పిల్లల ఈ మిలనము అద్భుతమైనదని అందరూ భావిస్తున్నారు. ఈ విధంగా బాబా మిలనం అవుతుందని మేము అస్సలు అనుకోలేదు. ఇటువంటి మిలనము సాధ్యపడుతుందని కలలో కూడా అనుకోలేదు. 

* పిల్లలు తండ్రితో ఉన్నప్పటికీ తమ తోటివారిని కలుసుకునే అవకాశం చూసి అకస్మాత్తుగా లభించిన లాటరీలా భావిస్తున్నారు. ఈ విధంగా సాకార రూపంలో మిలనము అన్నది చాలా పెద్ద అమూల్యమైన మిలనము. కనుక ఈ మిలనాన్ని ఎలా జరుపుకోవాలంటే తర్వాత ఈ మిలనపు స్వరూపం నుండి హృదయంలో పదే పదే బాబా కనిపించాలి, ఇప్పుడు కూడా మిలనం చేసుకుంటున్నామన్న అనుభవం కలగాలి. తండ్రి మరియు పిల్లల మిలనము ఎంతటి ప్రియమైనది మరియు ఎంత సంతోషాన్ని ఇస్తుంది. బాబా నా వారు, నన్ను కలిసారు. 

* మరి ఈరోజు అందరి మనసులలో తండ్రి మరియు పిల్లల అవ్యక్త మిలనము ఎలా ఉంటుంది, ఆ అనుభవం పిల్లలందరికీ బాప్ దాదా అనుభవం చేయిస్తున్నారు. అందరూ ఈ మిలనమును జరుపుకున్నారా! సాధారణ విషయం కాదు. ఈ మిలనపు భాగ్యాన్ని తీసుకోవడం, ఇది అందరికీ లభిస్తుంది. కానీ లభించిన భాగ్యాన్ని అనుభవంలోకి తీసుకురావడం, ఈ అనుభవాలు చాలా ఉన్నాకానీ రియల్ గా అనుభవం చేసుకోవడం ఇది భాగ్యపు విషయము. ఇటువంటి భాగ్యాన్ని భాగ్యశాలురే పొందగలరు. 

* అందరి హృదయాలలో ఎవరు నిండి ఉన్నారు? బాబా. నా బాబా, ప్రియమైన బాబా. బాబా హృదయంలో అయితే రాత్రి పగలు పిల్లలే పిల్లలుంటారు ఎందుకంటే అందరి హృదయాలు స్మృతి చేసేది బాబానే. మిలనము కూడా బాబాదే. బాబా ఎంత భోలా భండారీ కదా, స్మృతి చేయగానే ప్రాప్తి ఇచ్చేస్తారు. కొంతమంది ఎంత బంధనమున్నా కానీ వారు ఆలోచించే పద్ధతులను చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తారు. ఇంకెవ్వరి ఆలోచనకు రానంత విధంగా ఉపాయాలను ఆలోచిస్తారు. అందుకే సంగమయుగంలో మాతలు ఎంత ధైర్యవంతులు వచ్చారంటే ఏమవుతుందోనన్న భయమే లేదు..., దెబ్బలు కూడా తింటారు కానీ బాబా లభించారు అంటే అన్నీ లభించినట్లే. బాబా వారి చతురతను చూసి, ఏ విధంగా బంధనాన్ని తొలగించుకున్నారు, ఏ విధంగా లాభాన్ని పొందారు, ఈ కథలు విని బాబా కూడా ఆనందిస్తారు. 

* నూతన సంవత్సర ఆగమనం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు:- బాబా ఆజ్ఞ అనుసారంగా వెళ్తున్నారు, ముందుకు, ఇంకా ముందుకు వెళ్తారు. విజయమైతే నిశ్చితమై ఉంది. విజయదాత మన తోడుగా ఉన్నారు, అలాంటప్పుడు విజయం ఇంకెక్కడికి వెళ్తుంది! 

* ఈరోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. నూతన సంవత్సరం మొదలవుతుంది అంటే అందులో నవీనతను తేవాలన్న ఆలోచన తప్పక ఉంటుంది. ప్రారంభమయ్యే ఈ క్రొత్త సంవత్సరంలో ఏదో ఒక నవీనతను తీసుకురావాలి. ఇందుకోసం ఎవరికైనా ఏమైనా ఆలోచనలు ఉంటే, కొత్తగా ఉండాలి అనుకుంటే వ్రాసి పంపించండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Comments