31-12-2013 అవ్యక్త మురళి

                         31-12-2013         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడంతో పాటు స్వప్నమాత్రంలోనైనా ఉన్న బలహీనతను విడిచిపెట్టి ఉల్లాన-ఉత్సాహాల గుణాలను ధారణ చేసుకునేందుకు దృఢతా సంపన్న సంకల్పం చేసి సదా వాహ్ వాహ్ గా ఉండండి, రోజూ అమృతవేళ ఆ సంకల్పాన్ని రిపీట్ చేసుకున్నట్లయితే బాప్ దాదా నుండి ఎక్స్ ట్రా సహాయం లభిస్తుంది"  

బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. మెజారిటీ పిల్లలందరూ సంతోషంగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయంలో బాప్ దాదా ఉన్నారు. ఎలా అయితే పిల్లలు స్నేహమనే విమానంలో ఇక్కడకు చేరుకున్నారో అలాగే బాప్ దాదా కూడా పిల్లలందరి స్నేహ మూర్తిని చూసి సంతోషిస్తున్నారు. వాహ్ స్నేహీ పిల్లలూ వాహ్! పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో ప్రకాశిస్తున్న సంతోషం కనిపిస్తుంది. ఇటువంటి సంతోషమయ పిల్లలను చూసి బాబా కూడా మనసులో వాహ్ పిల్లలూ వాహ్! అని పాటను పాడుతున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న బిందు ఆత్మ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి హృదయాలలో దిలారాముడైన బాబా కనిపిస్తున్నారు. బాప్ దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి సంతోషిస్తున్నారు మరియు మనసులో వాహ్ పిల్లలూ వాహ్! అని పాటను పాడుతున్నారు. ప్రతి ఒక్కరి మనసులలో స్నేహము ఉంది.

అందరూ ఈరోజు పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి క్రొత్త సంవత్సరాన్ని నయనాలలో నింపుకున్నారు. బాప్ దాదా అడుగుతున్నారు - అందరూ ఈ రోజు తమలో ఏదో ఒక విశేషతను ధారణ చేసుకుని సాధారణతను విడిచిపెట్టారా? ఈ క్రొత్త సంవత్సరంలో పురుషార్థీ జీవితానికి అవసరమైన విశేషతను సంకల్పంలోకి, స్మృతిలోకి తీసుకువచ్చారా పాతది విడిచి క్రొత్తది ధారణ చేసారా? ప్రతి ఒక్కరూ తమ సంస్కారాలలో నవీనతను ఆలోచించారా? లేక ధారణ చేసారా? విడిచిపెట్టడం కూడా వచ్చు, ధారణ చేసుకోవడం కూడా వచ్చు.

బాప్ దాదాకు ప్రతి ఒక్కరి ముఖంలో ఇప్పుడు ఈ సమయంలో స్నేహము, మిలనము యొక్క దృశ్యాలు కనిపిస్తున్నాయి. మీరందరూ కూడా ఈరోజంతటిలో ఏదైనా విడిచి ఏదైనా ధారణ చేసారా? బాప్ దాదా మెజారిటీ పిల్లలను ఈ సమయంలో సంతోషంగా చూస్తున్నారు మరియు ఏ పాటను పాడుతున్నారు? వాహ్ పిల్లలూ వాహ్! ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి విడిచిపెట్టాలి మరియు ఏదో ఒక క్రొత్త గుణాన్ని ధారణ కూడా చెయ్యాలి. చెయ్యగలరా? చెయ్యగలము అని అనుకునేవారు చేతులెత్తండి, చెయ్యగలరా? ఇప్పటినుండి అందరి మస్తకంలో ఉల్లాస ఉత్సాహాల అలను చూస్తున్నాము. ఇప్పుడున్న ఈ అల సదా ఉండాలి, ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద ఉంచండి. మీ మనసులో ఏదో ఒక విశేష ఉల్లాసాన్ని తీసుకురండి మరియు ఆ ఉల్లాసము సదా ఉంటుందా లేక మారుతుందా అని పరిశీలించుకుంటూ ఉండండి. పిల్లలు ప్రతి ఒక్కరి ముఖంలో సదా ఏదో ఒక గుణాన్ని ధారణ చెయ్యాలన్న ఉల్లాసాన్ని బాప్ దాదా చూడాలనుకుంటున్నారు, గుణాలు ధారణ చేసినప్పుడు అవగుణాలు సమాప్తం అయిపోతాయి కదా. బాప్ దాదా ఈ రోజు సంతోషంగా ఉన్నారు. పిల్లలందరూ ఏదైనా విశేషమైన బలహీనతను, ఏదైతే మీరు వద్దనుకుంటున్నా కానీ వచ్చేస్తుందో, ఆ సంకల్పాన్ని, ధారణను ఈరోజు, ఈ సమయంలో దృఢ సంకల్పం ద్వారా విడిచిపెట్టగలరా? విడిచిపెట్టగలరా? విడిచిపెట్టగలము అని భావించేవారు చేతులెత్తండి. చేతులైతే బాగా ఎత్తుతున్నారు, ధైర్యమును ఉంచారు మరియు బాబా సహాయము కూడా మీకు తోడుగా ఉంటుంది. అందరూ దేనినైతే మనస్పూర్తిగా వదలాలి అని అనుకుంటున్నా కానీ ఆలోచనలలోనే ఉండిపోతుందో దానిని ఈ రోజు దృఢ సంకల్పంతో బాబాకు ఇవ్వగలరా? ఇవ్వగలరా? చేతులెత్తండి. ఇవ్వగలిగితే మళ్ళీ తిరిగి తీసుకోవద్దు. దాని కోసం బాప్ దాదా విశేషంగా అమృతవేళ విశేషమైన సహాయాన్ని అందిస్తారు, ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వదలాలని అనుకుంటున్నారు, కానీ..., కానీలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ రోజు ఎవరిలో ఏ బలహీనత అయితే ఉందో, ఏమీ లేకపోతే అభినందనలు. ఒకవేళ కొంచెమైనా స్వప్నమాత్రంలోనైనా ఉంటే ఈరోజు దృఢ సంకల్పంతో బాబాకు ఇచ్చేయండి. ఇవ్వడం వచ్చు కదా! సంకల్పం చెయ్యండి, ఈరోజు ఈ దృఢ సంకల్పం చేసినట్లయితే ఈ రోజు చేసిన దృఢ సంకల్పానికి మీ అందరికీ ఎక్స్ ట్రా సహాయం లభిస్తుంది. ఉదయం అమృతవేళ, అమృతవేళ చేసాక సంకల్పాలను పరిశీలించుకోండి మరియు మనసులో దృఢ సంకల్పం చేసుకోండి, అప్పుడు బాప్ దాదా నుండి ఎక్స్ ట్రా సహాయం లభిస్తుంది. సత్యమైన హృదయంతో, అంతే కానీ అవుతుందో లేదో చూస్తాను అని అనుకుని చెయ్యద్దు! సత్యమైన హృదయంతో ఒకవేళ సంకల్పం చేసినట్లయితే తప్పకుండా ఎక్స్ ట్రా సహాయం లభిస్తుంది, ఎందుకంటే క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే పిల్లలందరూ క్రొత్త సంవత్సరం ఆరంభం అవ్వగానే ఉదయమే తమ హృదయంతో పురుషార్థం చెయ్యండి అప్పుడు సహాయం కూడా లభిస్తుంది. రేపు ఉదయం దృఢ సంకల్పం చెయ్యండి, విడిచిపెట్టాలి అని దృఢతా సంపన్న సంకల్పం చెయ్యండి, ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే సంకల్పం అయితే అందరూ చేస్తారు, కానీ సంకల్పంతో పాటు రోజూ ఆ బలహీనతను బాబాకిచ్చేసి దృఢ సంకల్పం చెయ్యడము, ఉల్లాస ఉత్సాహాల గుణాలు ధారణ చేసుకుని 'చెయ్యాల్సిందే' అన్న దృఢ సంకల్పం చేసి, చేసి చూపించాల్సిందే, చెయ్యాల్సిందే, ఇందులో ఎవరైనా మహారథుల సహాయం కావాలంటే కూడా తీసుకోవచ్చు.

ఈరోజు దృఢత దివసంగా జరుపుకోండి. జరగాల్సిందే, చెయ్యాల్సిందే. చేద్దాములే అని అనద్దు, చెయ్యాల్సిందే, ఇందులో బాప్ దాదా మీకు సహాయకులుగా ఉన్నారు. ఉత్సాహాన్ని ఢీలా పర్చవద్దు, రోజూ రిపీట్ చేసుకోండి బలహీనతను బాబాకు ఇచ్చేయండి, ఇచ్చిన వస్తువును మళ్ళీ తిరిగి తీసుకోరు. మెజారిటీ పిల్లలు కోరుకుంటున్నారు, అది బాప్ దాదా చూసారు, కానీ మీ బలహీనతను బాబాకు ఇచ్చేయండి, ఇచ్చిన వస్తువును మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. మెజారిటీ పిల్లలు కోరుకుంటున్నారు, అందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు కానీ కోరికతో పాటు కావలసిన శక్తి వైపుకు అటెన్షను తక్కువగా ఇస్తున్నారు. అయిపోతుందిలే... ఇది మధ్యలో విఘ్నం వేస్తుంది. దృఢ సంకల్పాలను మీ తోడుగా పెట్టుకోండి. మరి ఈరోజు పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, క్రొత్తది వస్తుంది, ప్రతి ఒక్కరూ తమ మనసులో ఏదో ఒక దృఢ సంకల్పాన్ని చెయ్యండి, విడిచిపెట్టాలి, మీ మనసులో ఆలోచించండి కానీ, నేను చేసిన సంకల్పం దృఢంగా ఉన్నదా అని రోజూ అమృతవేళ తర్వాత దానిని పరిశీలించుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇందులో అలక్ష్యము కూడా వస్తుంది. మరి ఈరోజు ఏదో ఒక శ్రేష్ఠ ధారణ మీ మనసులో చేసుకోండి మరియు రోజూ అమృతవేళ దానిని రిపీట్ చేసుకోండి, ఇచ్చిన వస్తువును మళ్ళీ తిరిగి తీసుకోకూడదు, ఎందుకంటే బాప్ దాదా రానున్న సమయాన్ని చూసి ప్రతి ఒక్కరి సంకల్పంలో దృఢత్వం కావాలి అని చెప్తున్నారు, చేసిన సంకల్పం ఎంత వరకు పూర్తయ్యింది అని రిజల్టు చూసుకోండి. ఒకవేళ పర్సంటేజ్ తక్కువగా ఉంటే, మొదట్లో ఉత్సాహం ఎంతగానో ఉంటుంది, తర్వాత కొంచెం కొంచెంగా ఢీలా అవుతూ ఉంటుంది. ఢీలా అవ్వనివ్వద్దు. చేసి చూపించాల్సిందే అన్న దృఢ సంకల్పం చెయ్యండి. మీరు మాస్టర్ సర్వశక్తిమంతులు, సాధారణమైనవారు కాదు. కావున రేపు ఏదో ఒక దృఢ సంకల్పాన్ని ఎదురుగా తీసుకుని రండి మరియు రోజూ అమృతవేళ రిపీట్ చేసుకోండి, పరిశీలించుకోండి. బాప్ దాదా నుండి సహాయాన్ని తీసుకుంటూ ఉండండి.

మరి అందరూ ఇప్పుడు సంతోషంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కదా, చేతులెత్తండి. ఇప్పుడెలా అయితే ఉన్నారో అలాగే మీ స్థితిని గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఇప్పుడు బాప్ దాదా తోడు ఉంది, ఇలాగే మనసులో ఎప్పుడూ కలిసి ఉండండి. హృదయం యొక్క హృదయాభిరాముడు కదా. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ తమ స్వ ఉన్నతి అనుసారంగా ఏదో ఒకటి పరిశీలించుకుని సంకల్పంలో పెట్టుకోండి మరియు రోజూ ఉదయం అమృతవేళ తర్వాత రిపీట్ చేసుకోండి. అచ్చా..

అందరూ సంతోషంగా ఉన్నారు కదా! ఇప్పుడు ఎలా అయితే సంతోషంగా ఉన్నారో, ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా! సంతోషంగా ఉన్నట్లయితే చేతులెత్తండి. ఈ సమయాన్ని గుర్తుంచుకోండి. సంతోషంగా ఉన్న ఈ సమయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండండి. బాప్ దాదా పిల్లలందరి ఫోటో తీస్తారు. ఆ ఫోటో సాధారణమైనదిగా ఉండదు. మరి సదా సంతోషంగా, సదా సంతోషంగా ఉంటారా? పక్కా? ఎంత పక్కా? సంతోషాన్ని అస్సలు వెళ్ళనివ్వద్దు. సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి. బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారీలు మీరు. మీ టైటిల్ ఏమిటి! నేను బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారిని అని గుర్తుంచుకోండి. నేను సాధారణం కాదు. బ్రహ్మాబాబాను తెలుసుకున్నారు, వారిని చూడకపోయినా తెలుసుకున్నారు కదా! నా బాబా, ఎంతగా బాబాపై నావారు అని తీసుకువస్తారో, నా బాబా, నా బాబా, అంత సహజంగా గుర్తుంటుంది, ఎందుకంటే నాది అన్నది ఎన్నటికీ మరపు రాదు. కావున బాబాను నావారిగా చేసుకోండి, నాది అన్నది మర్చిపోరు. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, ఉదయాన్నే లేచి మీ ముఖాన్ని చూసుకోండి, మనసు యొక్క ముఖము, ఈ ముఖము కాదు. మనసు యొక్క ముఖాన్ని చూసుకోండి, బాబాకు నచ్చినట్లుగా ఉన్నదా? అచ్ఛా

పిల్లలందరినీ చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు, వాహ్ పిల్లలూ వాహ్! అందరూ వాహ్ వాహ్ కదా. అవునా? వాహ్ వాహ్ కదా? రెండు రెండు చేతులెత్తండి. మరి సదా ఉంటారా లేక ఇప్పుడేనా? సదా వాహ్ వాహ్. బాబా సదా వాహ్ వాగా అనిపిస్తారు కదా! అందుకే గుర్తు చేసుకుంటారు కదా. మరి బాబా వాహ్ వాహ్ అయితే పిల్లలు కూడా వాహ్ వాహ్. ఉదయాన్నే లేచి నేను ఎటువంటి సంతానమును అని గుర్తు చేసుకోండి. వాహ్ వాహ్ సంతానమును. అచ్చా. సదా వాహ్ వాహ్ అంటారు కదా! ఇందులో అటెన్షన్ ఇవ్వాల్సి ఉంది, ఇందులో చేతులెత్తండి. ఉదయం లేవగానే ఈ వాహ్ వాహ్ పదాన్ని గుర్తు తెచ్చుకోండి. బాబా చూసి వాహ్ వాహ్. అచ్ఛా.

ఇక్కడకు వచ్చిన పిల్లలందరికీ బాప్ దాదా విశేషంగా దృష్టినిస్తున్నారు, ఎందుకోసం? వాహ్ వాహ్ గా ఉంటున్నందుకు. ఉంటారా? ఉంటారా? చేతులెత్తండి. ఉంటారు. కావున వాహ్ వాహ్ పదాన్ని మర్చిపోవద్దు. ఈ సభలో చేతులెత్తారు, మర్చిపోవద్దు. నేను ఎవరిని? వాహ్ వాహ్. సులభం కదా. నేనున్నదే వాహ్ వాహ్, అప్పుడేమవుతుంది? సంతోషము. ఏమి జరిగినా కానీ, అది వస్తుంది వెళ్తుంది, మీరెందుకు దానిని పట్టుకుని ఉంటారు? ఏ విషయమూ నిలవదు, వెళ్ళిపోతుంది. మీరెందుకు పట్టుకుంటారు? మరి రేపటినుండి రోజూ అమృతవేళ మీ ముఖాన్ని చూసుకోండి, లోపలి ముఖాన్ని, బయటి ముఖాన్ని కాదు. వాహ్ వాగా ఉన్నానా అని పరిశీలించుకోండి. ఎందుకు? బాప్ దాదా వాహ్ వాహ్ అయితే పిల్లలు ఏమవుతారు? వాహ్ వాహ్! కేవలం వాహ్ వాహ్ పదాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అయితే, వాహ్ వాహ్ పదాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అచ్ఛా.

బాప్ దాదా కలిసారు కదా! బాబాకు కూడా పిల్లలు లేనిదే శాంతి ఉండదు. బాప్ దాదా అమృతవేళ అంతటా తిరుగుతూ పూర్తి పరివారానికి దృష్టిని ఇస్తారు. బాప్ దాదాకు చుట్టి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఎందుకంటే పిల్లలంటే ప్రేమ కదా! కావున రోజూ అమృతవేళ తర్వాత బాప్ దాదా చుట్టి వస్తారు, అందరినీ చూస్తారు. అప్పుడు ఎలా కనిపిస్తారు? వాహ్ వాహ్! ఈ వాహ్ వాహ్ పదాన్ని మర్చిపోవద్దు. వాహ్ వాహ్! అచ్ఛా - పిల్లలు ఎవరు ఎక్కడున్నా, బాప్ దాదా అందరినీ వాహ్ వాహ్ పిల్లలూ అంటూ తిరిగి వస్తారు. రోజూ అమృతవేళ లేచి ఏమని గుర్తు చేసుకోవాలి, నేను ఎవరిని? వాహ్ వాహ్ సంతానమును. ఏ విషయము వచ్చినా కానీ, దానిని వాహ్ వాహ్ లో కలిపేయండి. విషయాన్ని ఉంచకండి. బాబా మరియు కేవలం మీరు. అచ్చా. గుడ్ నైట్.

ఈరోజు బాప్ దాదా గుడ్ నైట్ చెప్పారు. మీరూ పరస్పరంలో గుడ్ నైట్ చెప్పుకుని పడుకోండి. పిల్లలందరూ ఎవరు ఎక్కడున్నా, అందరినీ బాప్ దాదా చూస్తున్నారు. ఎంత సమయంలో చుట్టి రాగలరు? అందరికీ, నలువైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా గుడ్ నైట్ చెప్తున్నారు.

సేవా టర్న్ మహారాష్ట్ర వారిది, మహారాష్ట్ర, ఆంధ్ర మరియు బాంబే నుండి 13 వేలమంది వచ్చారు:- మంచిది, పేరే మహారాష్ట్ర, కనుక మహాన్ గా ఉంటారు. ఉన్నారు, కానీ కొంచెం కొంచెం మర్చిపోతారు, కానీ ఉన్నారు. అచ్ఛా - గుడ్ నైట్. ఈరోజు వెళ్ళి తిని పడుకోండి, గుడ్ నైట్ గుర్తుంచుకోండి. 

డబుల్ విదేశీ సోదరసోదరీలు మరియు సింధీ సోదరసోదరీలు షుమారుగా 500మంది వచ్చారు:- చూసాము. చాలా మంచి స్నేహీలు. సహయోగులు కూడా, స్నేహీలు కూడా. అచ్చా.

మొదటిసారి వచ్చినవారు:- (బాప్ దాదా చేయి ఊపి అందరికీ దృష్టిని ఇచ్చారు) 

అచ్చా, నలువైపుల ఉన్న దేశవిదేశాల పిల్లలందరినీ బాప్ దాదా ఎదురుగా పెట్టుకుని ప్రియస్మృతులు తెలుపుతున్నారు. బాప్ దాదా ఎదురుగా అందరూ ఒక్క సెకండులో ఇమర్జ్ అయిపోతారు, అన్ని వైపులనూ బాబా చుట్టి వచ్చి పూర్తి బ్రాహ్మణ పరివారానికి ప్రియస్మృతులను తెలుపుతున్నారు. 

నీలూ అక్కయ్యతో :- వీరు మంచి సేవను చేసారు. వీరు చేసిన సేవా లాభము అందరికీ లభిస్తుంది. అన్ని సెంటర్లలో ఉన్న బ్రాహ్మణులకు లభిస్తుంది, మరియు ప్రేమతో చేస్తారు. వీరి మనసులో అందరి పట్ల ఎంతో ప్రేమ ఉంది. (మీరు వస్తూ ఉండండి, మేము ప్రేమతో సేవ చేస్తూ ఉంటాము) సరే. సంతోషంగా ఉన్నారు కదా! సదా సంతోషంగా ఉండండి. 

రేపు మోహిని అక్కయ్య పుట్టినరోజు:- శుభాకాంక్షలు. ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు.  

ఎవరైతే వచ్చారో అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. 

నిర్వైర్ అన్నయ్యతో:- అందరూ సేవను బాగా చేసారు. సేవ యొక్క మేవ అందరికీ లభిస్తుంది. 

రమేష్ అన్నయ్యతో:- (స్త్రీ శక్తిపై సీరియల్ తీసాము) సరే, చూస్తాము. (చాలా మంది స్మృతిని తెలిపారు) ఎవరెవరు స్మృతిని తెలిపారో వారిని బాప్ దాదా గుర్తు చేసారని పేరు తీసుకుని చెప్పండి. 

డా. బనారసీ అన్నయ్యతో : - వీరు కూడా రథానికి మంచి సేవను చేసారు. మనస్పూర్తిగా సేవ చేస్తారు, ఇది కూడా అందరికీ అనిపిస్తుంది. పేషంట్లకు భాసన కలుగుతుంది.

Comments