31-12-2012 అవ్యక్త మురళి

             31-12-2012         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టత శక్తి ద్వారా సమస్యా ప్రూఫ్ గా, సమాధాన స్వరూపులుగా అవ్వండి" 


ఈరోజు బాప్ దాదా తమ నలువైపుల ఉన్న సంతుష్టమణులను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి లైట్ చాలా చక్కగా ప్రకాశిస్తుంది ఎందుకంటే సంతుష్టత శక్తి చాలా శ్రేష్ఠమైనది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడకు ఇతర శక్తులు కూడా వచ్చేస్తాయి. సంతుష్టత శక్తి ఎటువంటి సమస్యనైనా సహజంగా సమాప్తం చెయ్యగలదు. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అప్రాప్తి శక్తి అంటూ ఉండదు. సంతుష్టత శక్తి ఎటువంటి వాతావరణమునైనా, ఎటువంటి పరిస్థితినైనా సహజంగా పరివర్తన చెయ్యగలదు. సంతుష్టత మాయ మరియు ప్రకృతిల అలజడులను పరివర్తన చేసేస్తుంది. కావున, 'నేను సంతుష్టమణిగా ఉన్నానా? ఎటువంటి మనుష్యాత్మ పరిస్థితినైనా పరివర్తన చేసి వాతావరణాన్ని పరివర్తన చెయ్యగలనా?' అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి.

బాప్ దాదా కూడా ఈ రోజు తమ సంతుష్టమణి ఆత్మలను చూసి చాలా సంతోషిస్తున్నారు. ఇక్కడ సేవలో, తోటివారిలో ఉన్న సంతుష్టత శక్తి వాతావరణాన్ని పరివర్తన చేసెయ్యడాన్ని బాప్ దాదా చూసారు. మరి స్వయాన్ని ఇటువంటి సంతుష్టమణిగా అనుభవం చేసుకుంటున్నారా? ఎవరిలో అయితే స్వయంలో సంతుష్టత శక్తి ఉంది అని భావిస్తూ దానిని సమయానికి కార్యంలో వినియోగిస్తూ సఫలతను అనుభవం చేసుకుంటున్నాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అచ్చా. చేతులు బాగా పైకి ఎత్తండి. చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాప్ దాదా కూడా అందరి చేతులను చూసి చాలా సంతోషిస్తారు. కానీ, మీ తోటివారిలో అలజడి కలిగినప్పుడు ఈ శక్తి పరివర్తన చేస్తుందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. దాని రిజల్టుగా ముందు తమ తమ స్థానాలను శక్తిశాలిగా చేసేందులో సక్సెస్ (విజయవంతం) అయ్యారా?

బాప్ దాదా ఏమి చూసారంటే కొన్ని స్థానాలలో ఇప్పటికీ సహనశక్తితో స్థానాలను సదా నిర్విఘ్నంగా చేసే ఆవశ్యకత యొక్క అవసరం ఉన్నది! ప్రతి ఒక్క స్థానము అనగా సేవాకేంద్రము, జోన్ నిర్విఘ్నంగా ఉన్న రిపోర్టును ఇవ్వండి అని బాప్ దాదా కార్యమును ఇచ్చారు. గుర్తుందా? గుర్తుందా? ఆ లెక్కతో సమయపు ఆవశ్యకత అనుసారంగా ఇప్పుడు ప్రతి స్థానము నిర్విఘ్నంగా అయ్యే ఆవశ్యకత ఉంది. సేవాస్థానము కావచ్చు, ప్రవృత్తి కావచ్చు, ప్రతి స్థానము నిర్విఘ్నంగా, సంతుష్టత శక్తితో సంపన్నంగా అవ్వాలి. సమయపు వేగాన్ని చూస్తున్నారు. కావున సంతుష్ట శక్తిపై స్వయంలో కావచ్చు, సంగఠనలో కావచ్చు ఇప్పుడు అటెన్షన్ ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది.

బ్రహ్మ బాబా నలు వైపుల చుట్టి వస్తారు. సంపూర్ణంగా అవ్వడానికి అన్నిటికన్నా సహజ సాధనమేంటో తెలుసా? ఫాలో ఫాదర్. ఆది నుండి అంతిమం వరకు బ్రహ్మ బాబా తమ సంతుష్టత శక్తితో ప్రతి పరిస్థితిపై విజయాన్ని పొందారు. కావున బాప్ దాదా ఈరోజు అందరికీ విశేషమైన సూచనను ఇస్తున్నారు, ప్రతి ఒక్కరూ సంతుష్టమణిగా అయ్యి సంతుష్టత శక్తిని విశేషంగా కార్యంలో వినియోగిస్తూ ఉండండి.
ఇప్పుడు నూతన సంవత్సరం రాబోతుంది, ఇందులో ప్రతి ఒక్కరూ ఇది పరిశీలించుకోండి - సంతుష్టత శక్తితో స్వయం కూడా సంతుష్టము, తోటివారు కూడా సంతుష్టము, బాప్ దాదా కోరుకుంటున్న విధంగా సంతుష్టంగా ఉన్నానా? ఏ సమస్య అయినా సంతుష్టతతో సమాప్తమయిందా? ఎందుకంటే ప్రపంచంలో రోజురోజుకీ అసంతుష్టత పెరగనుంది, అందుకోసం స్వయాన్ని చూసుకోండి, నేను రోజంతా సంతుష్టమణిగా ఉన్నానా? ఇందుకు సహజమైన సాధనము - ఫాలో ఫాదర్ ఎందుకంటే ఈ రోజుల్లో అసంతుష్టత పెరగవలసిందే.

ఇకపోతే బాప్ దాదా పిల్లలందరికీ నూతన సంవత్సరం కోసం విశేషంగా అమృతవేళ సహజ వరదాన రూపంలో వరదానాలను ఇచ్చే ప్లాన్‌ను తయారు చేసుకున్నారు. క్రొత్త సంవత్సరంలో ఏమవుతుంది అని అందరూ అడుగుతారు కదా. దృఢ సంకల్పం ఉన్న వారికి విశేషంగా బాప్ దాదా సహయోగము లభిస్తుంది, మరి క్రొత్త సంవత్సర బహుమతి సహజమైపోతుంది. అమృతవేళలో ఇచ్చే ఈ బహుమతి నచ్చిందా? నచ్చిందా! చేస్తూనే ఉన్నారు కానీ బాప్ దాదావైపు నుండి విశేషంగా సహయోగము, స్నేహము, శక్తి ప్రాప్తిస్తాయి. సరేనా! సరేనా? ఎందుకంటే అందరిలో లగనము మంచిగా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఏదో ఒకటి చెయ్యాలి అన్నలగనము బాగుంది కానీ మధ్యలో ఏదో ఒక పరిస్థితి వచ్చేస్తుంది, అందుకోసం ఈ సంవత్సరంలో సంతుష్టత శక్తిని విశేషంగా కార్యంలోకి తీసుకురండి. పరిశీలించుకుంటూ ఉండండి ముందుకు స్వతహాగానే సాగుతూ ఉంటారు. అచ్చా.

అందరూ అనేక స్థానాల నుండి వచ్చారు. నలువైపుల కూడా మధువనంలో లగనముతో గుర్తు చేస్తూ ఉంటారు. మరి మీరు ఏమవుతారు? సంతుమణి. నచ్చిందా! సంతుమణిగా అవ్వడం ఇష్టమయితే చేయి ఊపండి. ఒకవేళ ప్రతి ఒక్కరూ సంతుష్టంగా ఉంటే నలువైపుల ఏమి జరుగుతుంది? వాహ్ వాహ్! అన్న పాట మ్రోగుతుంది. మరి మీరందరూ ఎవరు? ఎవరు మీరు? అందరూ సంతుష్టమణులు! సంతుష్టమణులేనా లేక కొంచెం కొంచెమా? చెప్పండి, మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతారు! బాప్ దాదా భ్రమణకు వెళ్ళినప్పుడు ఏమి చూడాలి? ప్రతి స్థానంలో సంతుష్టమణుల లైట్ ప్రకాశిస్తూ ఉండాలి ఎందుకంటే బాప్ దాదా నలువైపులకు భ్రమణము చెయ్యడానికి ఎక్కువ సమయము పట్టదు. మరి ఈ సంవత్సరం నలువైపుల సంతుష్టమణుల లైట్ ఎంత ప్రకాశిస్తుంది అన్న రిజల్టును చూస్తాము.
ఈ సంవత్సరము స్వయంలో సమస్యా ప్రూఫ్, సమాధాన స్వరూపమును విశేషంగా రిజల్టులో చూడాలి. నలువైపుల ఉన్న పిల్లలు మెజారిటీ మనసుతో మధువనానికి చేరుకున్నారు. నలువైపుల ఉన్న పిల్లలు ఎంత లగనముతో మనసు ద్వారా మధువనానికి చేరుకున్నారో బాప్ దాదా చూస్తున్నారు. మీరు సాకారంలో చేరుకున్నారు, నలువైపుల ఉన్న పిల్లలకు కూడా బాప్ దాదా విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. మరియు విశేషంగా సంతుష్టత శక్తి యొక్క వరదానాన్ని నలువైపుల ఉన్న పిల్లలకు ఇస్తున్నారు. సంతుష్టంగా ఉండండి, సంతుష్టం చెయ్యండి మరియు సంతుష్టత శక్తితో విశ్వంలో కూడా సంతుష్టత వైబ్రేషన్లను వ్యాప్తి చెయ్యండి. అచ్చా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నట్లయితే రెండు రెండు చేతులెత్తండి. బాప్ దాదా కూడా పిల్లలను మధువనంలో చూసి సంతోషిస్తున్నారు. ఏమి జరిగినా కానీ, ఏదైనా చిన్న పెద్ద సమస్యలు వచ్చినా కానీ మీరు మధువనానికి చేరుకోండి, మనసుతో, తనవుతో కాదు మనసుతో. బాప్ దాదా పిల్లల మనసులో ఎక్స్ ట్రా సంతోష ఔషధాన్ని నింపుతారు. బాగుంది, మధుబనానికి రావడము అంటే పురుషార్థంలో అడుగులు ముందుకు వేయడము. ఇప్పుడు కూడా పరిశీలించుకోండి, మధువనానికి వచ్చారంటే ముందుకు వెళ్ళేందుకు స్వయం ఎంత సహయోగమును పొందారు? మధువనంలో సహజంగానే రోజంతా ఏమి గుర్తుంటుంది? బాబా, బాబా, బాబా... విన్నా బాబా విషయాలే, నడిచినా అది మధువన పావన స్థానంలో, తింటే బ్రహ్మ భోజనము, పవర్‌ఫుల్ ఎందుకంటే ఇక్కడ విశేషంగా డ్యూటీవారికి గుర్తు తెప్పించడం జరుగుతుంది కావున మధుబనానికి రావడము అంటే స్వయంలో జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవలో అడుగును ముందుకు వెయ్యడము. మరి అందరూ మధువనం ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత ఉంది. అచ్ఛా,

సేవ టర్న్ ఢిల్లీ, ఆగ్రా వారిది:- ఢిల్లీవారు లేవండి. (అందరి చేతుల్లో కొవ్వొత్తులు ఉన్నాయి). ఢిల్లీవారు లైట్-మైట్ రూపులై వచ్చారు. హాల్ లో మంచి శోభ వచ్చింది. అచ్చా. ఢిల్లీవారైతే రాజధానిని తయారు చెయ్యాల్సి ఉంది. ఎందుకంటే అందరూ రాజ్యం చెయ్యవలసిందే కదా. సింహాసనంపై కూర్చోకపోయినా కానీ రాజ్యాధికారులుగా అయితే అవుతారు కదా. బాగుంది, ఢిల్లీవారికి సేవా ఉత్సాహం బాగుంది. ఇప్పుడు ఢిల్లీవారు నంబర్ వన్ నిర్విఘ్న జోన్ యొక్క రిజల్టు ఇవ్వాలి. ఉత్సాహం బాగుంది కానీ ఇప్పుడు ఋజువు ఇవ్వాలి. ఢిల్లీవారు చేస్తారు కదా! చేతులెత్తండి. ఎందుకంటే ఇప్పటివరకు బాప్ దాదాకు ఏ జోన్ నుండి కూడా రిజల్టు రాలేదు. మరి ఇందులో కూడా ఢిల్లీ నంబర్‌వన్ తీసుకుంటుంది కదా. చెప్పండి టీచర్లు, చేతులెత్తండి. మరి తీసుకుంటారా? కొంచెం ఢీలాగా ఎత్తారు. సోదరులు ఎత్తారు. అచ్చా. భిన్న భిన్న స్థానాలలో కూర్చున్నారు. బాగుంది, సేవా ఉత్సాహము అన్ని జోన్లలో ఉండటాన్ని బాప్ దాదా చూసారు మరియు ఈ సంవత్సరం నలువైపుల అందరూ తమ యథా శక్తి ప్రోగ్రాములు కూడా బాగా చేసారు. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు నలువైపుల ఉన్నాయి. ఈ సేవా ఉత్సాహాన్ని పెంచుకుంటూ వెళ్తే ఏమవుతుంది? భారతదేశము మహాన్ గా అయిపోతుంది. అచ్చా. ఢిల్లీవారికి అభినందనలు.

బాప్ దాదా చూసారు. రిట్రీట్ చేసుకున్నా, ప్రోగ్రాము చేసుకున్నా కానీ సంగఠనలో పరస్పరం లభించిన సహకారం మరియు ధైర్యానికి రిజల్టు మంచిగా ఉంది అందుకే బాప్ దాదా డబుల్ విదేశీయులకు 100సార్లు లాభాన్ని పొందినంత అభినందనలు తెలుపుతున్నారు. డబుల్ విదేశీయులకు బాప్ దాదా ఏ టైటిల్ ను ఇచ్చారు? డబుల్ పురుషార్ధి. డబుల్ ఫారెనర్ కాదు, డబుల్ పురుషార్థి. ఎప్పుడైనా ఎవరైనా డబుల్ అంటే డబుల్ ఫారెనర్స్ మాత్రమే కాదు, డబుల్ పురుషార్థీలము కూడా అని చెప్పండి. మరియు స్వయాన్ని పరిశీలించుకోండి. అటెన్షన్ ఉంది, అది బాప్ దాదాకు తెలుసు, విశేషమైన అటెన్షన్ ను ఇప్పించడం కూడా జరుగుతుంది అందుకే బాప్ దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఆలస్యంగా వచ్చినాకానీ పురుషార్థంలో వెనుక లేరు. ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది కూడా బాప్ దాదా చూస్తున్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇందుకు చప్పట్లు కొట్టండి.

జ్యూరిస్ట్ మరియు ఐ.టి. వారి మీటింగ్:- బాప్ దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు, అన్ని వర్గాలవారు సేవ మంచిగా చేస్తున్నారు. జ్యూరిస్టు అయినా మరింకేదైనా కావచ్చు, కానీ ఎప్పటినుండైతే వర్గాలు తయారయ్యాయో, బాధ్యత లభించిందో, బాధ్యతలు వేరువేరుగా లభించిన కారణంగా పురుషార్థం కూడా బాగా చేస్తున్నారు మరియు ప్రోగ్రాముల గురించి కూడా బాప్ దాదా వింటూ ఉన్నారు. ప్రతి వర్గంవారు చేసే ప్రోగ్రామ్ రిజల్టు కూడా బాగా వస్తుంది. అలాగే జ్యూరిస్టుల సేవ కూడా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరి అటెన్షన్ సేవ వైపు మంచిగా ఉంది, ఇందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి అని అనుకుంటూ చేస్తున్నారు కూడా. జూరిస్టు సేవ కూడా అనేక స్థానాలలో జరుగుతుంది, జరుగుతూ ఉంటుంది. చాలా మంచిది. అచ్చా.

ఇప్పుడు సేవకోసమైతే బాప్ దాదా అందరికీ అభినందనలు తెలిపారు, ఏ వర్గం వారైనా కావచ్చు. ఇప్పుడు బాప్ దాదా ప్రతి ఒక్కరి పురుషార్థంలో ప్రోగ్రెస్ చూడాలనుకుంటున్నారు. అందుకోసం బాప్ దాదా వినిపించి ఉన్నట్లుగా ప్రతి జోన్ వారు తమ జోనును నిర్విఘ్నంగా తయారు చెయ్యండి. ఇప్పుడు ఈ రిజల్టు రాలేదు. కేవలం తమ సెంటరు కాదు, జోన్ నిర్విఘ్నంగా అవ్వాలి. ప్రతి జోన్లోనూ ఎవ్వరూ పురుషార్థంలో బలహీనంగా ఉండకుండా ఉండేట్లుగా ప్లాన్ ను తయారు చెయ్యండి. ఇప్పుడు ఎలా అయితే కలిసి ఉన్నారో అలా పురుషార్థంలో కూడా ఎంతో మంచి సహచరులుగా అయ్యి నడుచుకోండి ఎందుకంటే మీరు నిర్విఘ్నంగా అయితే ఆ వాతావరణం విశ్వంలో వ్యాపిస్తుంది. పూర్తి విశ్వము పరివర్తన అవుతుంది. అచ్ఛా.

నలువైపుల ఉన్నవారికి బాప్ దాదా ప్రియస్మృతులనైతే ఇచ్చేసారు కానీ ఈ సంవత్సరంలో పురుషార్థంలో నలు వైపుల అందరూ నంబర్ వన్ అవ్వాలి. ఇది వీలవుతుందా? వీలవుతుందా? దాదీలు వినిపించండి, వీలవుతుందా? చెప్పండి, వీలవుతుందా? (మేము చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు, మేమే కదా చేస్తాము) చేతులెత్తండి, డబుల్ పురుషార్థీలుగా అవుతాము! ఎక్కడనుండి ఎవరు వింటున్నా కానీ, చూస్తున్నా కానీ అందరూ ఈ సంకల్పం చెయ్యండి - చెయ్యాల్సిందే. ధైర్యవంతులైతే, 'బాబా, ఇదేమంత పెద్ద విషయము, జరిగే ఉంది' అని అంటారు. (పవర్ ఆఫ్ ఫ్యూచర్ సేవ కూడా నిజార్ అన్నయ్య మరియు వారి పార్టీ బాగా చేస్తున్నారు) భారతదేశము కూడా చేస్తుంది, ఫారెన్ కూడా చేస్తుంది. ఉల్లాసము అందరికీ ఉంది కానీ 'నిర్విఘ్నము' అన్న రిపోర్టు రావాలి, ప్రతి జోన్ నిర్విఘ్నము, నంబర్ వన్ పురుషార్థీలు ఎందుకంటే మీ వైబ్రేషన్ ప్రపంచం వరకు వెళ్ళాలి. మీరు పురుషార్థంలో ఒకవేళ ముందుకు వెళ్తే ఆ వైబ్రేషన్లు ప్రపంచంలోని దుఃఖిత ప్రజల వరకు చేరుకుంటాయి. ఈ రోజుల్లో దుఃఖము ఎంత పెరుగుతుంది! అతి దుఃఖాన్ని తీసుకువచ్చే కారణాలు తయారువుతున్నాయి. అచ్ఛా -

అందరికీ స్మృతి, వచ్చే సంవత్సరం ఏమి చెయ్యాలి? మరి ఇటువంటి పురుషార్థము చేసి ముందుకు సాగండి మరియు ముందుకు తీసుకువెళ్ళండి. అచ్చా. (ఈశ్వరీయ సేవ కోసం ఏదైనా కొత్త ప్లాను) అది చెప్తాము, సరేనా.

బాగుంది. అచ్చా. దాదీలతో:- (ఈసారి టీచర్ల సంగఠనలో కూడా సంగఠనను ఎలా పవర్ ఫుల్ గా చెయ్యాలి అన్న చర్చ జరిగింది)

మోహిని అక్కయ్యతో:- ఇప్పుడు కూడా వీరి పాత్ర ఉంది మరియు సహయోగము కూడా ఉంది. ఇప్పుడు మంచిగా ఉన్నారా? మంచిగా అయిపోతారు. ఏమీ చింతించకండి, మంచిగా అయిపోతుంది. కొంచెం మధ్యలో అవుతుంది కదా. ఇప్పుడు సరైన డైరెక్షన్ లభించింది కాబట్టి మంచిగా అయిపోతారు. సంతోషంగా ఉన్నారు కదా. కొంచెం అలజడి జరిగింది అందుకే జరుగుతుంది, మంచిగా అయిపోతుంది. రోగం పెరిగింది కదా అప్పుడు కొంచెం అటూ ఇటూ అవుతుంది. ఇప్పుడు నిరంతరం ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వెళ్ళండి, అంతే, అయిపోతుంది. అయినా కానీ బాగున్నారు. తయారైతే అప్పుడిక పరిగెట్టారు. (రేపు వీరి జన్మదినము, 72 సంత్సరాలు)

ముగ్గురు అన్నయ్యలు:- మధువనం సదా నిర్విఘ్నంగా అవ్వడానికి ముగ్గురూ కలిసి ప్రోగ్రామును తయారు చెయ్యండి. అందరూ సంతుష్టంగా కూడా ఉండాలి, త్యాగిగా కూడా ఉండాలి, సంతుష్టంగా కూడా ఉండాలి, రెండూ ఉండాలి. శ్రద్ధ వహిస్తున్నారు, మరింత ఇస్తూ ఉండండి. ముగురూ కలిసి పరస్పరంలో సంప్రదించుకుని ఒక ఆలోచన కలవారిగా అవ్వండి. ముగురిలో ఒకే అల ఉండాలి. ఆలోచనలు భిన్న భిన్నంగా ఉంటాయి, కానీ ఆలోచనలను కూడా కలుపుకోవలసి ఉంటుంది. ముగ్గురిదీ ఒకే ఆలోచన ఉండాలి, ఒకరికొకరు కలుసుకుని ఒకే విధమైన సంకల్పము చెయ్యండి. బాగుంది. ఎలా అయితే సోదరీలు పరస్పరం కలుసుకుంటారో అలాగే సోదరులు కూడా ఏకమతంతో ఉండాలి. ఎవరి ఆలోచన ఏమిటో తెలుసుకోండి కానీ ఒకటిగా నడుచుకోండి.

బాప్ దాదా పిల్లలందరికీ నూతన సంవత్సరం 2018కు శుభాకాంక్షలను ఇచ్చారు: నలువైపుల ఉన్న పిల్లలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఏదో ఒక నవీనతను స్వయంలో తీసుకురావాలి. ఇప్పుటివరకు ఏదైతే పరివర్తన చేసుకోలేదో, కష్టమనిపిస్తుందో అది ఈ నూతన సంవత్సరంలో చేసి సమాచారాన్ని వ్రాయండి. స్వయాన్ని నిర్విఘ్నంగా చేసుకుని ఇతరులను కూడా నిర్విఘ్నులుగా చెయ్యడంలో సహయోగులుగా అవ్వండి. సంతుష్టమణులందరూ మెరుస్తూ ఉండాలి, అలా బాప్ దాదా చూడాలని ఆశిస్తున్నారు.

అచ్ఛా - నలువైపుల ఉన్న పిల్లలకు చాలా చాలా చాలా ప్రియస్మృతులు మరియు పరివర్తన జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.

Comments