31-01-2014 అవ్యక్త మురళి

 31-01-2014         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“అకస్మాత్తు కన్నా ముందుగానే అలర్ట్ అయ్యి స్వయాన్ని పవర్‌ఫుల్ గా చేసుకోండి, సంతోషంగా ఉంటూ సంతుష్టత వాయుమండలాన్ని తయారు చేయండి, దానితోపాటు ప్రతి ఏరియాలో సందేశమునిచ్చే కార్యమును పూర్తి చెయ్యండి, ఇప్పుడిక ఎవ్వరి ఫిర్యాదు ఉండకూడదు"

ఈనాటి సభ స్నేహి మరియు స్మృతి స్వరూప స్థితిలో స్థితి అయినట్లుగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి మనసులో విశ్వ కళ్యాణపు ఉల్లాస ఉత్సాహాలు నిండి ఉన్నాయి. సమ్ముఖంగా ఉన్నవారైనా కానీ దూరంగా ఉన్నవారైనా కానీ, పూర్తి బ్రాహ్మణ పరివారమంతా హృదయపూర్వక స్నేహములో ఇమిడి ఉంది. ఈ స్నేహము, పరమాత్మ మరియు ఆత్మల మిలనపు స్నేహము అతి ప్రియమైనది మరియు అతి అతీతమైనది. ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలను సమర్థ రూపంలో చూస్తున్నారు. ఎక్కడ సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థము స్వతహాగానే సమాప్తమైపోతుంది. సమర్థ తండ్రి మరియు సమర్థ పిల్లలు, ఈ సమర్థమైన ఆత్మ పరమాత్మల మిలనము అతి ప్రియమైనది మరియు అతీతమైనది. ఈ మిలనము కేవలం సంగమంలోనే లభిస్తుంది. పరమాత్మ మరియు ఆత్మల ఈ సాకార మిలనము కోట్లలో కొద్దిమంది ఆత్మలకే అనుభవం అవుతుంది. ఈ పరమాత్మ మరియు ఆత్మల మిలనము కల్పమంతటిలోకి ఇప్పుడు సంగమంలో అవుతుంది, అటువంటివారు సౌభాగ్యశాలులేమిటి, పదమా సౌభాగ్యశాలురైన మీరు సమ్ముఖంలో మిలనము జరుపుకుంటున్నారు. అందరి హృదయాలలో ఈ సమయంలో ఈ మిలనము యొక్క భాగ్యమే ప్రాప్తి అవుతుంది. అందరి మనసులలో నా బాబా, నా వారు అని ఉంది.

ఇతర ఆత్మలకు కూడా “నా బాబా”ను అనుభవం చేయించి, వారసత్వానికి అధికారులుగా చేయాలని బాప్ దాదా ఈ సమయంలో కోరుకుంటున్నారు. ఈరోజు ప్రపంచంలో దుఃఖము, అశాంతి మరియు అల్పకాలిక సుఖము వ్యాపించి ఉన్నాయి. ఆ ఆత్మలకు సదా యొక్క సుఖశాంతులను కొంతైనా అనుభవం తప్పకుండా చేయించండి, ఎందుకంటే ఈ సమయంలోనే అనుభవం చేయించగలరు. ఆత్మలు పరమాత్మతో కలిసే వరదానము ఈ సమయంలోనే ఉంది. పూర్తి కల్పంలోకల్లా ఆత్మ-పరమాత్మల మిలనము, పరిచయము, సంబంధము, వారసత్వము ఈ సమయంలోనే ప్రాప్తిస్తాయి. కావున పిల్లలు ప్రతి ఒక్కరూ, అధికారి పిల్లలు సదా అటువంటి ఆత్మల పట్ల దయ చూపించాలి. ఏ ఆత్మలైనా కావచ్చు, దేశం కావచ్చు లేక విదేశం కావచ్చు, ఎవ్వరూ వంచితులై ఉండకూడదు. ఏ విధంగానూ ఏ ఏరియా నుండి కూడా 'మాకు పరిచయం లభించలేదు' అన్న ఫిర్యాదు రాకుండా చూసుకోవడమే మీ విశేషమైన కార్యము. సేవనైతే నలువైపుల చేస్తూనే ఉన్నారు కానీ మీ చుట్టుప్రక్కల ఏ ఏరియా కూడా ఉండిపోకూడదు, ఫిర్యాదు రాకూడదు, మా బాబా వచ్చారు కానీ మాకు తెలీలేదు అని అనకూడదు. నిమిత్తంగా ఉన్న పిల్లల కర్తవ్యము ఇది. ఎంత వీలైతే అంత సందేశాన్ని ఇవ్వండి. ఏ ఏరియా మిగిలి ఉందో నోట్ చేసుకోండి! మాకు తెలీలేదు అన్న ఫిర్యాదు రాకూడదు. తెలియజేయడం మీ కర్తవ్యం, తెలుసుకోవడం లేక తెలుసుకోకపోవడం, అది వారికి సంబంధించిన విషయము. ప్రతి ఒక్కరూ మీ చుట్టుప్రక్కల ఉన్న ఏరియాను గమనించండి, ఏ ఏరియా కూడా సందేశం అందకుండా మిగిలిపోకూడదు. అందరికీ వారి వారి భాగ్యము ఉంటుంది, కానీ సందేశమునివ్వడం భాగ్యశాలి ఆత్మలైన మీ కర్తవ్యము. 'మాకు తెలీలేదు' అన్న ఫిర్యాదు వచ్చేలా మా ఏరియా గానీ, ప్రక్క ఏరియా గానీ ఉన్నదా అని ప్రతి ఒక్కరూ పరిశీలించండి. చిన్న గ్రామమైనా, పెద్ద గ్రామమైనా, పట్టణమైనా కానీ సందేమునివ్వడం భాగ్యశాలి ఆత్మలైన మీ పని, మా చుట్టుప్రక్కల ఉన్న ఏరియాలో సందేశం అందిందా అని చూసుకోండి. ఏ ఏరియా వారు కూడా ఫిర్యాదు చెయ్యకూడదు, ఎందుకంటే మెజారిటీ ముఖ్య పట్టణాలలోకైతే చేరుకున్నారు ఐనప్పటికీ కూడా ఏదైనా ఏరియా మిగిలి ఉందా అని చూసుకోండి, 'మా బాబా వచ్చారు కానీ మాకెవ్వరూ చెప్పలేదు' అని అనకూడదు. చెక్ చేసుకుంటూ ఉండండి, బాప్ దాదా చూస్తూ ఉంటారు అయినప్పటికీ మీ మీ ఏరియాలో ఎక్కడెక్కడి వరకు చేరుకోగలరో, ఎక్కడికైతే ఎవ్వరూ ఇంకా చేరుకోలేదో అక్కడ సందేశమును ఇవ్వడం మీ కర్తవ్యము. చిన్న ఏరియా అయినా కానీ మీ ఏరియాకు దగ్గరగా ఆ ఏరియా ఉంటే మీరు నోట్ చేసుకోండి. చిన్న చిన్న ఏరియా వారు కూడా మీకు ఫిర్యాదు చెయ్యవచ్చు, మా తండ్రి వచ్చారు కానీ మాకు తెలీలేదు, మా తండ్రి అని అంటారు, ఎందుకంటే అందరి తండ్రి కదా, మరి మీరెందుకు చెప్పలేదు! అందుకే మీ ఏరియాలో నాలుగు వైపులకూ సందేశం చేరుతుందా అని పరిశీలించుకోండి. అప్పుడు మీ బాధ్యత పూర్తవుతుంది. చిన్న ఏరియానే కదా అని అనుకోకండి, ఆ ఏరియాలోనివారు కూడా పిల్లలే కదా! ఎవరినైనా పంపించండి, కనీసం మనందరి తండ్రి వచ్చారు అనైతే తెలియాలి కదా. ఎటువంటి ప్రోగ్రాము చేసైనా కానీ మీ ఏరియాను పూర్తిగా కవర్ చెయ్యండి. చిన్న ఏరియా అయితే చిన్నవారిని పంపించండి కానీ ఎవ్వరూ వంచితమవ్వకూడదు ఎందుకంటే సమయం అకస్మాత్తుగా రానుంది, చెప్పి రాదు. మీ నలువైపుల సందేశమును ఇచ్చే కర్తవ్యమును గురించి తప్పకుండా చూడండి. మీ ఏరియాలో ఏ సేవ లేదు అనుకోకండి, మీ ప్రక్కన ఉన్న ఏరియా వారికి చెప్పి, వారిని నిమిత్తం చెయ్యండి, ఏ ఆత్మ కూడా ఉండిపోకూడదు. సందేశం లభించాలి, ఇక తర్వాత వారి భాగ్యము. కావున ప్రతి ఒక్కరూ తమ ఏరియాను చెక్ చేసుకోండి, అది చిన్నని వీధి కావచ్చు, సాధారణమైనవారు ఉండే ఏరియా కావచ్చు, కానీ పిల్లలే కదా. బాబా వచ్చారు అని తెలియాలి. ఏ రీతిలోనైనా సరే ఆ పని చెయ్యండి కానీ మాకు తెలీలేదు అన్న ఫిర్యాదు రాకూడదు. ఇది పిల్లలైన మీ బాధ్యత, ఎందుకంటే ఏ పరిస్థితి అయినా అకస్మాత్తుగా ఏ సమయంలోనైనా రావచ్చు. మీ బాధ్యతను పూర్తి చెయ్యండి. ఎవ్వరినైనా పంపించండి కానీ మాకు తెలీలేదు అన్న ఫిర్యాదు మాత్రం రాకూడదు. ఏదో ఒక ఏరియాకు దగ్గరగా అయితే ఉంటారు కదా! ఎందుకంటే అకస్మాత్తుగా ఎటువంటి గొడవ అయినా జరగవచ్చు. మీ చుట్టుప్రక్కల ఉన్న ఏరియాను గమనించుకుని ఎవ్వరూ మిగలలేదు కదా అని చెక్ చేసుకోవడం మీ బాధ్యత. ఒకవేళ వేరేవారి ఏరియా అయితే వారి సలహా తీసుకోండి, సలహా తీసుకోకుండా చెయ్యకండి. సలహా తీసుకోండి మరియు పూర్తి చెయ్యండి ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు కావుననే ఈరోజు బాప్ దాదా దేశంవారు కావచ్చు, విదేశంవారు కావచ్చు, అందరికీ సూచన ఏమిస్తున్నారంటే, మీ ఏరియాను చూసుకోండి, పెద్దల నుండి సలహా తీసుకుని వారి ద్వారా చేయించండి కానీ మిగిలిపోకూడదు. మీటింగ్ చేసుకుంటారు కదా, అందులో ఒకరికొకరు సలహాలు తీసుకోవచ్చు. సమయం అకస్మాత్తుగా రానుంది అని బాప్ దాదా చెప్తున్నారు, కనుక, చేస్తాములే, అయిపోతుందిలే, అని కొంతమంది సంస్కారం ఉంటుంది, కావున ఎవ్వరూ సందేశం అందకుండా మిగిలిపోకూడదు. ఇది బాప్ దాదా అందరికీ సూచనను ఇస్తున్నారు. మీ ఏరియాను చెక్ చేసుకోండి. ఒకవేళ వేరే ఎవరైనా చేయాలనుకుంటే వారిచేత కూడా చేయించండి, ఎందుకంటే సమయంపై ఏమీ నమ్మకం లేదు, చిన్న చిన్న విషయాలైతే అకస్మాత్తుగా జరుగుతూనే ఉంటాయి. మీరు మీ ఏరియాను చూసుకోండి, మీ చుట్టుప్రక్కల ఉన్న మీ ఏరియాలో సందేశం చేరుతుందా లేదా అని పరిశీలించుకోండి! ఫిర్యాదు రాదు కదా!

ఇకపోతే బాబాకు అతి గారాల పిల్లలైన మీరు, బాబా పిల్లలుగా అయిన మీరు, ఎంత ప్రియమైనవారు! బాప్ దాదా కూడా అతి ప్రియమైన
పిల్లలను చూసి సంతోషిస్తున్నారు, వాహ్ పిల్లలూ వాహ్! పురుషార్థంలో అలసిపోవద్దు, ఒకవేళ ఏవైనా చిన్న చిన్న విషయాలు వస్తే సహాయాన్ని తీసుకోండి. ఒకవేళ ఎవరి నుండి సహాయాన్ని తీసుకోవడం ఇష్టం లేకపోతే యోగబలంతో పరిశీలించుకుని అందుకు తగ్గ ఏదో ఒక సహయోగాన్ని వెతకండి.

మీ ఏరియాను మీరు చూసుకోండి, మాకు సందేశం లభించలేదు అని అనేవారు లేకుండా చూసుకోండి. బాప్ దాదా ఈరోజు ఇలా ఎందుకు చెప్తున్నారు అని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే కొంతమందికి దగ్గరగా ఉన్న ఏరియా, వారి బాధ్యత అయిన ఏరియా అయినా దాన్ని పూర్తి చెయ్యడం లేదు, కనుక ఏ కారణం చేతనైనా ఏదైనా ఏరియా మిగిలిపోయి ఉంటే దానికి పరిష్కారాన్ని ఆలోచించండి, సందేశాన్ని తప్పకుండా అందించండి. ఎవ్వరి నుండీ ఫిర్యాదు రాకూడదు అని బాప్ దాదా ఈరోజు సూచన ఇస్తున్నారు, ఎందుకంటే మీరు చూస్తారు, వారి ఏరియాను పరిశీలిస్తారు, వారితో పురుషార్థం చేయిస్తారు, అందులో కూడా సమయం పోతుంది. కావున ఇప్పుడు మీ మీ ఏరియాలను చూసుకోండి. మాకు తెలీలేదు అన్న ఫిర్యాదు రాకూడదు. ఒకవేళ సేవ చేసేవారి సహాయం కావాలంటే మీ జోన్ వారికి చెప్పండి, వారు సహాయం చేస్తారు. ఈ రోజు సేవ కోసం సూచనను ఇస్తున్నారు, సేవతో పాటు ఇంకెందులో సూచన ఉంటుంది? స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి. అంతేకానీ స్వయాన్ని కూడా చూసుకునేందుకు వీలు లేనంతగా సేవలోనే బిజీగా అవ్వకండి. స్వయాన్ని కూడా చూసుకోండి మరియు సమయాన్ని కూడా చూడండి. ఇకపోతే అందరూ సంతోషంగా ఉంటున్నారా, ఒకవేళ సంతోషంగా లేకపోతే ఎవరి మీదైతే ఫెయిత్ (నమ్మకం) ఉంటుందో, భావన ఉంటుందో వారి సహకారం తీసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న విషయాలు ఎప్పుడైనా రావచ్చు, ఇది బాప్ దాదాకు తెలుసు, అందుకే స్వయాన్ని అలర్ట్ గా పెట్టుకోవడం మీ బాధ్యత. ఎవరు ఏమన్నా కానీ స్వయం, స్వయాన్ని అలర్ట్ గా పెట్టుకోవాలి.

ఈరోజు బాప్ దాదా సేవ మరియు స్వయము రెండిటినీ ఎవరెడీగా చేసుకోమని సూచన ఇస్తున్నారు. సంతుష్టతా వాయుమండలం ప్రతి స్థానంలోనూ ఉండాలి. ఒకవేళ అసంతుష్టత ఉన్నట్లయితే ఎవరి సహకారంతోనైనా, ఎందుకంటే చిన్న చిన్నవైనా లేక పెద్దదైనా కానీ అందుకోసం స్వయాన్ని పవర్‌ఫుల్ గా తప్పకుండా చేసుకోవాలి. అకస్మాత్తు కోసం తయారుగా ఉండండి అని బాప్ దాదా ఈరోజు సూచనను ఇస్తున్నారు. ఇలా అవుతుందని మాకు తెలీదు అని మళ్ళీ అనకండి. అలా జరగాల్సిందే జరుగుతుంది, అది కూడా అకస్మాత్తుగా జరుగుతుంది. మీరందరూ మనసుతో తేలికగా అయినప్పుడు జరుగుతుంది, కనుక స్వయాన్ని పరిశీలించుకోమని బాప్ దాదా సూచనను ఇస్తున్నారు. బాబా సమానంగా, ఏదైతే బాబా కోరుకుంటున్నారో, తెలుసుకోవడంలో అయితే అందరూ తెలివైనవారే, మరి బాబా, పిల్లల మనసా-వాచ-కర్మ, సంబంధ సంపర్కం అన్ని విషయాలలో అకస్మాత్తుగా ఏమి జరిగినా కానీ ఎదుర్కోగలరా? ఆత్మలోని ఇంటర్నల్ పవర్, ఆత్మ సదా అటెన్షన్లో ఉండాలి, సదా తీవ్ర పురుషార్థిగా అవ్వండి. స్వ పరివర్తన మరియు నలువైపుల కూడా పరివర్తనలో సహయోగిగా అవ్వడంలో, రెండింటిలో పరిశీలించుకోండి. 

ఇకపోతే అందరూ ఓ.కెగా ఉన్నారా, చేతులెత్తండి. ఓ.కె, ఓ.కె, ఓ.కె? అచ్చా, బాప్ దాదా ముందున్న వారి చేతులను చూస్తున్నారు, వెనుక వారి చేతులు కనిపించడం లేదు. ఇప్పుడు వెనుక ఉన్నవారు చేతులెత్తండి. అచ్చా - అందరూ బాప్ దాదా నుండి చాలా చాలా ప్రేమ మరియు గారాబాల సహితమైన ప్రియస్మృతులను స్వీకరించండి. మాకైతే బాబా ప్రేమ అంటే తెలీదు అని అనుకోకండి, అటువంటి వారెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేరు కదా? తెలుసు కదా! పరమాత్మ ప్రేమ ఏమిటో తెలుసు కదా! తెలుసు కదా? అచ్చా, తెలుసు అనేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తుతున్నారు, చేతులు పొడవుగా ఎత్తండి. చేతులు దించండి. చూడండి, చేతులైతే మెజారిటీ పిల్లలు ఎత్తడం బాప్ దాదా చూసారు, ఎవరైనా మధ్యలో ఉండిపోయినా కానీ మెజారిటీ మంది చేతులెత్తారు. ఒకవేళ ఎవరైనా లోపల అర్థం చేసుకుని, చేయి ఎత్తడానికి మొహమాటపడితే, అప్పుడు కూడా ఏదైనా విఘ్నమున్నా కానీ లేక ఏదైనా అలజడి ఉన్నాకానీ మీ దాదీలకు లేదా ఎవరి మీదైతే మీకు నమ్మకం ఉందో, పెద్ద దాదీ లేక దాదీలపై నమ్మకం ఉంటే వారికి వినిపించండి, లోపల పెట్టుకోకండి, లోపలి కోసం ఏదో ఒక వైద్యం తీసుకోండి, ఎందుకంటే జరగాల్సిందే, అయితే అకస్మాత్తుగా జరుగుతాయి. ఆ సమయంలో పురుషార్థం చెయ్యలేరు. ఇప్పుడు పరిశీలించుకోండి, ఏదైనా అకస్మాత్తుగా జరిగితే, అలజడి మొదలైనా స్వయాన్ని రక్షించుకుని, వాయుమండలంపై ప్రభావం వేసి ఇతరులకు సహయోగులుగా అవ్వాలి, ఇది పరిశీలించుకోండి. అందరికీ అర్థమయిందా? అర్థమయింది. అందరూ తెలివైనవారే. కాదు, బాప్ దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఇలా అనడం లేదు. తెలివైనవారే కానీ అప్పుడప్పుడూ సమయం వచ్చినప్పుడు సమయం తీసుకుంటారు.

అచ్చా. నలువైపుల ఉన్న పిల్లలకు దూరం ఉన్నవారికి కూడా మరియు దగ్గరగా ఉన్న వారికి కూడా, స్వయంపై అటెన్షన్ ఉన్నవారికి కూడా చాలా చాలా అభినందనలు. మోసపోవద్దు, అటెన్షన్ పెట్టండి, ఇస్తున్నారు మరియు ఇస్తూ ఉండండి. ఏ సహాయం కావాలన్నా నిమిత్తమైనవారి నుండి సహాయాన్ని తీసుకోండి. ఎవరి నుండి సహాయం తీసుకోవాలి అని కూడా ఆలోచించద్దు, నిమిత్తం వారి గురించి తెలుసు కదా, దాదీలున్నారు కదా! దాదాలు ఉన్నారు, దాదీలు కూడా ఉన్నారు. ఏ పొరపాటునూ మీ లోపల పెట్టుకోకండి, ఒకవేళ ఏదైనా విషయం ఉన్నా కానీ మనసులో పశ్చాత్తాపం చెంది దానిని సమాప్తం చేసెయ్యండి. జమ చేసుకోకండి. బాప్ దాదా ప్రతి ఒక్కరి ఖాతాను చూస్తే ఎటువంటి ఖాతా కనిపిస్తుంది? ఓ.కె, వెరీ గుడ్ అని ఉంటుందా? అచ్చా, ఇందులో చేతులెత్తండి. చేయి అయితే అందరూ ఎత్తుతున్నారు. చూడండి దాదీ,

మీరు రండి, చేతులు చూడండి. చేతులెత్తండి, అందరూ మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారా? రండి దాదీ, దాదీను తీసుకురండి. ఈ రోజు మోహిని రాలేదా? అచ్చా, వచ్చారు.

సేవ టర్న్ పంజాబ్ జోన్ వారిది, 8000 మంది వచ్చారు:- పంజాబ్ వారికి వరదానము ఉంది. మొట్టమొదటగా అమృత్ సర్ లో సెంటరు తెరవబడింది, కానీ పంజాబ్ వారు అందరిపై విజయాన్ని పొందారు మరియు తమ సెంటరును నిర్విఘ్నంగా నడిచేలా చూసారు, అందుకే పంజాబ్ వారికి బాప్ దాదా కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. గురువుల స్థానంలో సద్గురువుకి విజయాన్ని చేకూర్చి పెట్టారు. మంచిగా చేసారు. గురువుల గద్దెల మధ్యలో బ్రహ్మాకుమారీల సెంటరు అమరంగా ఉంది, నిర్విఘ్నంగా నడిచింది. నిర్విఘ్నంగా నడిచింది కదా, పంజాబ్ టీచర్లు చేతులెత్తండి. అచ్చా. బాగా శ్రమించారు, ఇప్పుడు కూడా పంజాబ్ టర్న్ కదా. 

మోహిని అక్కయ్యతో :- బాగున్నారు కదా! (బాబా, మీ వరదానంతో నేను మంచిగా ఉన్నాను) అభినందనలు. బాగున్నారు మరియు బాగా ఉంటారు కూడా. ఏది ఏమి జరిగినా కానీ, బాబా నా బాబా, ఇదే మందు. మంచిగా ఉంటారు. ఇది మధ్య మధ్యలో అవుతూనే ఉంటాయి. అచ్ఛా. 

మున్నీ అక్కయ్యతో:- చాలా బాగా కృషి చేస్తున్నారు. అందుకు సఫలత ఉంది మరియు ఎలా అయితే నడుచుకుంటున్నారో అంతకంటే మంచిగా చూసుకుంటున్నారు, చూసుకుంటారు కూడా. ఎక్కడినుండి సూచన వచ్చినాకానీ దానిని చేసెయ్యండి, అంతే. ఇక అంతా మంచిగా జరుగుతుంది.

డబుల్ విదేశీ సోదరసోదరీలతో :- అచ్ఛా, వీరంతా డబుల్ విదేశీయులు. (200మంది వచ్చారు) ఈ రోజుల్లో ప్రతి గ్రూపులో డబుల్ విదేశీయులు ఉంటున్నారు. అచ్చా, తమ పాత్రను వహిస్తున్నారు. విదేశాల సేవ కూడా మంచిగా చేస్తున్నారు కానీ ఎంత సేవ చేస్తారో అంతగా సమాచారాన్ని తక్కువగా అందిస్తారు. ఎవరైనా ఒకరు, నెలకు లేక రెండు నెలలకు ఒకసారి అన్ని వైపుల రిజల్టును వ్రాసి పంపుతూ ఉండాలి. సేవలో మంచి వృద్ధి ఉంది, పురుషార్థం కూడా మంచిగా చేస్తున్నారు. (కరాచీ నుండి ఒక్క సోదరుడు వచ్చారు) మంచిది, కరాచీ జన్మ స్థానము కదా. అటువంటి స్థానము నుండి బహుమతి వచ్చిందంటే ఎంతటి మహాన్ ఉన్నారు కదా! అచ్చా, బాప్ దాదాకు సమాచారము లభిస్తుంది, మంచిగా నడుస్తుంది. ఎవరు వచ్చినా కానీ, ఇందులో కరాచీ వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కరే ఉన్నారు. చాలా మంచిది, బాగా అనిపిస్తుంది కదా! విదేశీయులను చూస్తే బాప్ దాదాకు తమ వరల్డ్ కళ్యాణకారి టైటిల్ గుర్తుకొస్తుంది, ఎందుకంటే ముందు ఇండియా కళ్యాణకారిగా ఉన్న బాబా ఇప్పుడు విదేశీ కళ్యాణకారిగా ఉన్నారు, అందుకే బాప్ దాదా సదా విదేశీ సేవను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముందు కేవలం ఇండియా కళ్యాణకారిగా ఉన్నారు, ఇప్పుడు నలువైపుల వ్యాప్తి చేస్తున్నారు. ఏదైనా ఏరియా మిగిలి ఉంటే దానిని యాడ్ చేసుకోండి. కృషి మంచిగా చేసారు. రిజల్టలు కూడా మంచిగా ఉంది. అచ్ఛా. 

నిర్వైర్ అన్నయ్యతో:- ఆరోగ్యం బాగుందా, బాగవుతున్నారు. హాస్పిటల్ చింత చెయ్యకండి. అందరి సలహా తీసుకుని మీటింగ్ లో ఫైనల్ చేసుకోండి. కేవలం ఇది ఆలోచించండి - ఒక హాస్పిటల్ ఆబూ కారణంగా ఖాళీగా ఉంది, మరి ఇంత పెద్ద ప్రోగ్రాము చేస్తే ఆబూకి ఎవరు వస్తారు? హాస్పిటల్‌కు సంబంధించి అందరి సలహాను ముందు తీసుకోండి. ఆబూలో మరో హాస్పిటల్ తెరవాలా వద్దా అని సలహా తీసుకోండి. (ఆ హాస్పిటల్ తోటే జత చేస్తాము) కానీ అది రెండవదే అవుతుంది కదా. ఆ ప్లాన్‌ను తయారు చెయ్యండి, చూద్దాము. ప్లాన్ చూపించండి. 

బృజ్ మోహన్ అన్నయ్యతో:- (గీతా భగవంతుడి విషయంలో) దానికోసం టాపిక్ కొంచెం మార్చండి. (మీరు చెప్పిన అహింస అన్న టాపిక్ నే కొనసాగించమంటారా?) కొంచెం మార్చండి. అహింసా పరమోధర్మం అన్నది కొత్త విషయమే కానీ ఆకర్షణ కలిగించే ఏదైనా పాయింటును ఆలోచించండి, కొంచెం మార్చండి. ఆలోచించండి కొంచెం. అందరూ ఆలోచించండి, అందులో టాపిక్ ఆకర్షణీయంగా ఉండాలి. మాకేముందిలే, ఏమైనా కానీ అని ఇప్పటి వరకు ఆలోచించారు, కానీ, ఇందులో నా లాభం కూడా ఉంది అని ఆలోచించండి. 

పంజాబ్ యొక్క పెద్దక్కయ్యలతో :- పంజాబ్ అయితే చాలా ప్రసిద్ధి. పంజాబ్ నుండి కన్యలు చాలామంది తయారయ్యారు. అన్నయ్యలు కూడా చాలామంది తయారయ్యారు. దీనితో పూర్తి పంజాబ్ చక్కగా నడుస్తుంది. ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకుంటూ మంచి ఉన్నతిని పొందుతున్నారు. ఇప్పుడు మరింత ఉన్నతిని పొందండి, సందేశం అందించండి. సందేశం అందలేదు. (హరిద్వార్ లో సాధువుల సమ్మేళనం చెయ్యమంటారా) ఏదైనా అలజడి చెయ్యండి. శాంతిగా వింటున్నారు, కొంత వారిది, కొంత వీరిది అన్నీ మిక్స్ అవుతున్నాయి కానీ ఓరిజినల్ గా ఏమిటి అన్నదానిని కొంచెం ప్రసిద్ది చెయ్యండి. అప్పుడు మనవారెవరైతే ఉన్నారో వారు వెలువడుతారు. ఎందుకని? అక్కడున్న ప్రసిద్ది చెందిన సాధువులలో ఒకరిని తయారు చెయ్యండి. ఈ సేవను చెయ్యండి. బ్రహ్మాకుమారీల జ్ఞానము మేము జీవితంలోకి తీసుకువచ్చాము అని చెప్పే ఉదాహరణ మూర్తులను తయారు చెయ్యండి. అందరూ అయితే కూర్చుని ఉన్నారు, పంజాబ్లో ఎవరి నుండైనా సహాయం తీసుకోండి. ఇండియాది తీసుకోవచ్చు, అందరిదీ తీసుకోవచ్చు. కృష్ణుడి బదులుగా శివుడు అని బ్రహ్మాకుమారీలు అంటారు అని అందరికీ తెలియాలి. ఈ సందేశం వెలువడాలి. ఇది పంజాబ్ సేవ. మరి ఈ ధ్వని వెలువడాలి కదా. ఒకవేళ ఈ ధ్వని వెలువడితే పంజాబ్ కు బహుమతిని ఇస్తాము. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ వీరిది ఈ మతము అని వారు అనాలి. దీని గురించి అందరి ఆలోచనలు జరగాలి. ఏదైనా అద్భుతం చేసి చూపించండి. అందరూ కలిసి సలహా తీసుకోండి. బాగుంది. శాంతిగా జరుగుతుంది, అందరూ మౌనంగా ఉంటున్నారు. 

జలంధర్ రాజ్ దీదీ అనారోగ్యంతో ఉన్నారు కనుక రాలేకపోయారు:- వారి కోసం టోలీ తీసుకోండి. 

జయంతి అక్కయ్య ఇలా అన్నారు - బాబా, జానకి దాదీని మీరు 8 రోజుల కోసం లండన్ పంపించారు, అందుకోసం చాలా చాలా థ్యాంక్స్: అందరూ సంతోషించారు కదా. బాగుంది, డ్రామాలో ఏమి ఉన్నదో అది బాగా జరిగింది.

Comments