30-11-2014 అవ్యక్త మురళి

  30-11-2014         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

”హృదయాభిరాముడ్ని హృదయంలో నిలుపుకుని మిలనం జరుపుకుంటూ సదా సంతోషంగా ఉండండి, అమృతవేళ
రోజు ఆరంభమయ్యే సమయము కావున అమృతవేళపు అమృతాన్ని తప్పకుండా త్రాగాలి” 

ఈరోజు పిల్లల ఈ మేళాను చూసి బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు మరియు వాహ్ పిల్లలూ, వాహ్ అని మనసు అంటుంది. బాబా మరియు పిల్లల ఈ మిలనము ఎంత ప్రియమైనది. పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహము మరియు ఉత్సాహంతో మిలనాన్ని జరుపుకుంటున్నారు. ఈ స్నేహము అన్ని దుఃఖాలను మరిపింపజేస్తుంది. బాబా స్నేహము మరియు సంబంధంలో వాహ్ బాబా మరియు పిల్లల మిలనము వాహ్! పిల్లలను చూసి బాబా సంతోషిస్తున్నారు మరియు బాబాను చూసి పిల్లలు సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఉన్నారు. పిల్లలు సమీపంగా ఉన్నా లేక దూరంగా ఉన్నా కానీ, అందరినీ చూసి బాబా హర్షిస్తున్నారు. బాబా మరియు పిల్లల ఈ మిలనము అలౌకిక మిలనము. పిల్లలు ఒక్కొక్కరినీ చూసి బాబా సంతోషిస్తున్నారు మరియు పిల్లలు కూడా బాబాను సాకారంలో చూసి సంతోషిస్తున్నారు. ఈ అలౌకిక మిలనము ఎంత అతీతమైనది మరియు ప్రియమైనది. మెజారిటీ ప్రతి ఒక్కరి ముఖాలు చిరునవ్వుతో ఉన్నాయి. బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలను చూసి వాహ్ మధురమైన పిల్లలూ, వాహ్ అని పాట పాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మనసులలో ఉన్న మిలనపు సంతోషం వారి ముఖాలలో కనిపిస్తుంది. పిల్లలు ఒక్కొక్కరినీ చూసి బాప్ దాదా వాహ్ పిల్లలూ, వాహ్! అంటూ మిలనం జరుపుతున్నారు. చివరలో కూర్చున్నాకానీ బాబాకు మాత్రం సమీపంగానే ఉన్నారు. 

ఈరోజు సీజన్ మొదటి రోజు ఎంతటి మనోహరమైన రోజు! పిల్లల మనసులో కూడా వాహ్ బాబా, వాహ్ ఉంది. బాబా మనసులో కూడా పిల్లలందరి పట్ల, ముందు కూర్చున్నా, వెనుక కూర్చున్నా కానీ, వెనుక ఉన్నవారు కూడా బాబా ఎదురుగా ఉన్నారు. ఈనాటి ఈ మిలనపు రోజును గుర్తు చేసుకుంటూ ఇప్పుడు సమ్ముఖంలో మిలనాన్ని జరుపుకుంటున్నారు. బాబా కూడా పిల్లలందరి భాగ్యాన్ని చూసి ఏ పాటను పాడుకుంటున్నారు? పిల్లలు ప్రతి ఒక్కరూ, ముందున్నవారు కావచ్చు, చివర ఉన్నవారు కావచ్చు అందరూ బాబా హృదయంలో మాత్రం సమ్ముఖంలో ఉన్నారు. బాబా కూడా పిల్లల మిలనాన్ని చూసి పిల్లల పాటను పాడుతున్నారు. విశ్వంలో ఉన్న ఎంతోమంది పిల్లలు తమ హృదయ సంబంధాన్ని బాబాతో పెట్టుకున్నారు, మనసులోని ఈ సంబంధం ముఖంలో కనిపిస్తుంది మరియు బాబా ఇదే పాటను పాడుతున్నారు - వాహ్ గారాల పిల్లలూ, ముద్దు పిల్లలూ, వాహ్! ఇంత సమయం కూడా హృదయంలో కలుస్తూ ఉంటారు, బాబాకు కూడా పిల్లలు లేనిదే మనసు నిలువదు. పిల్లలకు కూడా సదా మనసులో బాబా స్మృతి ఉండనే ఉంటుంది. మీ అందరి హృదయాలలో ఎవరి స్మృతి ఉంది? బాబా అని అంటారు కదా. బాబా మనసులో ఎవరున్నారు? పిల్లలు ఒక్కొక్కరినీ బాబా మర్చిపోగలరా! నంబరువారీగా ఉన్నాకానీ పిల్లలు కదా! 

మనసులో గుర్తు చేసేవారిని ఈరోజు సమ్ముఖంలో చూసినందుకు బాప్ దాదాకు ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలు ఒక్కొక్కరినీ చూసి మనసు వాహ్ పిల్లలూ, వాహ్ అంటుంది. పిల్లలు కూడా, మా హృదయంలో ఎవరున్నారు అని అంటారు? బాబా కూడా, మా హృదయంలో ఎవరున్నారు అని అంటున్నారు. అందరికీ తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం లేదు. బాబా కూడా పిల్లల్ని మర్చిపోలేరు, పిల్లలు కూడా బాబాను మర్చిపోలేరు. హృదయంలో సదా బాబా స్మృతి ఉంది, బాబా హాజరై ఉన్నారు. సూక్ష్మంలో అయితే మిలనం జరుగుతూనే ఉంటుంది కానీ సాకారంలో పిల్లలు ఒక్కొక్కరినీ చూసి, దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా కానీ బాబా హృదయంలో మాత్రం పిల్లలందరూ నంబరువారీగా స్మృతిలో ఉంటారు. మరి ఈ రోజు పిల్లలు ఒక్కొక్కరినీ సాకారంలో చూసి, సమీపంగా చూసి, సమ్ముఖంగా చూసి వాహ్ పిల్లలూ, వాహ్! అనే పాటను పాడుకుంటున్నారు. అందరి హృదయాలలో ఎవరున్నారు? నా బాబా అని అంటారు. బాబా కూడా ఏమంటారు? పిల్లలు ఎంతమందైనా ఉండచ్చు, ఎక్కడైనా ఉండచ్చు కానీ పిల్లలందరూ బాబా హృదయంలో ఉన్నారు. అందుకే బాబాను హృదయాభిరాముడు అని అంటారు. పిల్లలను సాకార రూపంలో చూసి బాబాకు ఎంతో సంతోషంగా ఉంది, ఈ విషయం బాబాకు కూడా తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. అందరూ మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నారా? చేతులెత్తండి. మనసులో సంతోషంగా ఉన్నారా! ఎందుకని? బాబాకు తెలుసు, ఏదైనా విషయం వచ్చినా కూడా గుర్తు చేస్తారు, గుర్తు చెయ్యడం ద్వారా ఇమర్జ్ అవుతుంది.
పిల్లలు ఎంతమందైనా కావచ్చు కానీ పిల్లలు బాబాను మర్చిపోరు, బాబా పిల్లలను ఈ పిల్లలను మర్చిపోరు. ఇదైతే చిన్న హాలు, ఇందులో ఈ హాలు అనుసారంగా సాకార రూపంలో కూర్చున్నారు కానీ ఆకారీ రూపంలో ఇమర్జ్ చేసుకుంటే ఎంతమంది పిల్లలు ఇమర్జ్ అవుతారు! ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అయితే గుర్తు చేస్తారు కదా. బాప్ దాదా వద్ద ఆకారీ రూపంలో ఇమర్జ్ అవుతారు. ఇది పిల్లలు కూడా
అనుభవం చేసుకుంటారు, బాబా కూడా అనుభవం చేస్తారు ఎందుకంటే పిల్లలు బాబా మిలనం లేనిదే ఒంటరి వారవుతారు. బాబా కూడా పిల్లలతో మిలనం లేనిదే ఒంటరి వారైపోతారు. సూక్ష్మంలో అయితే అందరినీ ఇమర్జ్ చేసుకోవచ్చు కానీ సాకార మరియు సూక్ష్మ మిలనంలో తేడా ఉంది. ఇది మీకు కూడా అనుభవమే కదా! మరి ఈరోజు సీజన్ మొదటి రోజు, ఏదో ఒక ప్రోగ్రాము ఉంటుంది, ఈ కారణంగా ఈరోజు ఎంతమందైతే వచ్చారో వారు సాకారంలో మిలనం జరుపుకుంటున్నారు. మరి పిల్లలందరూ సదా సంతోషంలో ఉంటున్నారా లేక అప్పుడప్పుడూ సంతోషంగా ఉంటున్నారా? ఏ విషయమైనా రావచ్చు ఎందుకంటే ఇది కలియుగం కదా, కానీ బాబా మరియు పిల్లల ఈ సంబంధం ఎటువంటిదంటే పిల్లలు బాబా అంటారు, బాబా పిల్లలూ అంటారు, మిలనం జరుగుతూ ఉంటుంది, జరుగుతుంది కదా! చేతులెత్తండి, జరుగుతుంది కదా? ఇక్కడ కూడా కనిపిస్తుంది. చూడండి, బాబా పాత్రతో పాటు ఈ సాధనాలు కూడా వచ్చాయి. దూరంగా, చివరలో కూర్చున్నవారు కూడా సమీపంగా కనిపిస్తున్నారు. సంగమ సమయంలో బాబా వచ్చినప్పుడు సైన్సు కూడా మనకు మంచి సహయోగిగా అవుతుంది. అక్కడ కూర్చుని కూడా మురళి వినాలనుకుంటే వినగలరు కదా. సాధనాలు కావాలి. మీరెలా అయితే బాబాను స్మృతి చెయ్యకుండా ఉండలేరో అలాగే బాబా కూడా పిల్లలను గుర్తు చెయ్యనిదే ఉండలేరు. బాబా కూడా ఇమర్జ్ చేసుకుని కలుస్తారు, ఉండలేరు. మరి ఈరోజు సాకారంలో మిలనం జరుపుకునే రోజు. బాబా పిల్లల్ని చూస్తున్నారు మరియు పిల్లలు బాబాను చూస్తున్నారు. అందరూ సదా సంతోషంలో ఉంటున్నారా? కొంతమంది అప్పుడప్పుడూ సంతోషంగా ఉంటున్నారు, మరికొందరు సదా సంతోషంగా ఉంటున్నారు. సదా సంతోషంగా ఉండేవారు బాబా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటారు ఎందుకంటే బాబా కూడా పిల్లలు లేనిదే ఉండలేరు. పిల్లలకు ఏదైనా పరిస్థితి వస్తే వారు మర్చిపోరు, బాబా వద్దకు చేరుకుంటుంది. ఇది మర్చిపోలేని అనుబంధం. బాబా అంటారు, నా గారాల పిల్లలు అని, పిల్లలు నా బాబా అని అంటారు. ఒక్క రోజైనా మర్చిపోయి ఉండగలరా! మర్చిపోగలరా? మర్చిపోలేరు ఎందుకంటే బాబా మరియు పిల్లలది హృదయపూర్వక సంబంధం, హృదయంలో తప్పకుండా ఉంటుంది. బాబా కూడా ఉండలేరు, పిల్లలు కూడా ఉండలేరు. ఈరోజు స్థూలంగా సమ్ముఖంలో మిలనం జరుగుతున్నట్లుగా బాబా పిల్లలను ఇమర్జ్ చేసుకుని కలుస్తూనే ఉంటారు, పిల్లలు కూడా కలుస్తూ ఉంటారు కదా.

మరి అందరూ ఈరోజు నుండి ఎందులో వృద్ధి చెందుతారు? ఎందుకంటే ప్రతి సమయము ముందుకు సాగుతూ ఉండాలి. ఎందులో ముందుకు సాగుతారు? ముందుకు సాగడము అంటే హృదయంలో బాబాను నిలపడము. మనసులోని విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేము. మనసులో సదా గుర్తుంటుంది. గుర్తుంటుంది కదా! హృదయంలో ఉంటుంది, సమ్ముఖంలో ఉండటం వేరే విషయం కానీ హృదయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబాతో మిలనం చేసుకోవచ్చు. బాబా కూడా మిలనం జరుపుతూ ఉంటారు. బాబాకు కూడా పిల్లలు లేనిదే శాంతి ఉండదు. కనుక, బాబా మరియు పిల్లలు సదా ఈ సంగమయుగంలో మిలనం జరుపుకునే పాత్ర తయారై ఉంది, ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఇమర్జ్ చేసుకోవచ్చు. సమ్ముఖంలో మిలనం జరుపుకునే ప్రోగ్రామును చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు కావున బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. పిల్లలైతే సంతోషిస్తారు కానీ బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. మరి అందరూ సదా సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండాలా లేక మధ్య మధ్యలో సంతోషానికి బదులు మరొక స్థితి ఉండాలా? సదా సంతోషంగా ఉండండి, మాయ రూపం ఎటువంటిదైనా కానీ సురక్షితంగా ఉండండి, ఎందుకంటే మాయ భిన్న భిన్న రూపాలతో వస్తుంది. కేవలం సంతోషం రూపంలోనే కాదు, విచారం రూపంలో కూడా మాయ తన వారిగా చేసుకుంటుంది. ఇప్పుడు ఈ మిలనం తర్వాత మనసులో బాబాను కూర్చుబెట్టుకోండి. హృదయాభిరాముడికి హృదయమే ఇష్టం. హృదయంలో గుర్తు చేసుకుంటే అన్ని విధాలుగా గుర్తు వచ్చినట్లే. కనీసం ప్రతి ఒక్కరూ అమృతవేళ అయితే చేస్తున్నారు కదా! ఎవరైతే అమృతవేళ రోజూ జరుపుకుంటున్నారో వారు చేతులెత్తండి. మెజారిటీ ఉన్నారు. ప్రతి స్థానంలో అమృతవేళ సాధననైతే మీ సొంతం చేసుకుంటున్నారు, ప్రయత్నం బాగా చేస్తున్నారు, అమృతవేళకు మహత్వాన్ని ఇస్తున్నారు కానీ ఎవరైతే అమృతవేళ అప్పుడప్పుడూ చేస్తారో, వారు ముందుకు సాగండి ఎందుకంటే అమృతవేళ రోజు ఆరంభ సమయము, అప్పుడు తప్పకుండా స్మృతిలో ఉండాలి. రోజంతటి కోసం ప్రభావం పడుతుంది. అందరూ సంతోషంగా ఉంటున్నారా లేక మాయ ఛాన్స్ తీసుకుంటుందా? సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. మాయ వచ్చినా కానీ వెంటనే బాబాకు వినిపించేసి ఛేంజ్ అయిపోండి. ఒకవేళ బాబాను చేరుకోలేకపోతే నిమిత్తంగా ఉన్న మీ పెద్దవారికి తప్పకుండా వినిపించండి. ఒక్క రోజు కంటే ఎక్కువ పొడిగించద్దు, లేకపోతే అలవాటైపోతుంది. ఈ అమృతవేళపు అమృతాన్ని త్రాగడం ఆవశ్యకము, కనుక తప్పకుండా ఈ సమయాన్ని సఫలం చేసుకుంటూ ఉండండి. అచ్ఛా.

అందరూ సంతోషంగా ఉన్నారు మరియు సంతోషంగా ఉంటారు, పక్కా! చిన్న పెద్ద విషయాలు వచ్చినా కానీ సంతోషం మాత్రం పోకూడదు. ఎవరైనా అకస్మాత్తుగా మిమ్మల్ని చూసినా కానీ సదా సంతోషంగా కనిపించాలి.

సేవ టర్న్ పంజాబ్ మరియు రాజస్థాన్ జోన్ వారిది: - (పంజాబ్ నుండి 10వేల మంది, రాజస్థాన్ నుండి 5వేలమంది వచ్చారు) చేతులెత్తండి. చాలా మంచిది. (రెండు గ్రూపులవారిని విడివిడిగా లేపారు, రెండు జోన్లవారు కలిసి మంచిగా సేవ చేసారు)

మంచిది. సేవాధారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు లేచి నిల్చుంటే సగం సగం ఉంటారు, మంచిది. రెండు జోన్లవారికి అభినందనలు, అభినందనలు. బాగుంది. ఎందుకు? యజ్ఞ సేవకు అవకాశం లభిస్తుంది. మామూలుగా అయితే ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి రారు. సేవ జరగాలి. కానీ ఇది యజ్ఞ సేవ చేసేందుకు అవకాశము. ఇందులో చాలా ఛాన్సు తీసుకోవచ్చు, అలాగే అన్ని సబ్జెక్టులలో కూడా ఛాన్సు తీసుకోవాలి. ఆల్ రౌండ్ గా ఉండాలి. మంచిది. 

డబుల్ విదేశీయులు 300మంది వచ్చారు:- విదేశీయులు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇది విదేశీయుల టర్నా? (ప్రతి టర్న్ లో విదేశీయులు వస్తారు) బాగుంది. మంచి సిస్టమ్ తయారు చేసారు. ప్రతి ఒక్కరికీ అవకాశం లభిస్తుంది. అచ్ఛా.

పిల్లలు ప్రతి ఒక్కరూ తమ సమయం (సేవా సమయం) ఫిక్స్ అయి ఉన్న కారణంగా మంచి సహకారాన్ని అందించడాన్ని బాప్ దాదా చూసారు. పిల్లలు సమయానికి సహాయాన్ని అందిస్తున్నందుకు బాప్ దాదా వేయిసార్లు ప్రియస్మృతులను తెలుపుతున్నారు. 

(దాదీలు బాప్ దాదాతో మిలనం జరుపుకుంటున్నారు) మోహిని అక్కయ్య న్యూయార్క్ నుండి ప్రియస్మృతులను పంపారు:- మోహినికి ప్రత్యేకమైన ప్రియస్మృతులను పంపండి. 

మోహిని అక్కయ్య: - ఆరోగ్యం బాగుందా, ముక్తులయ్యారా? మంచిది.

Comments