30-11-2012 అవ్యక్త మురళి

 30-11-2012         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“సంతుష్టమణుల భాగ్యము, మనసు పాడే పాట - పొందాల్సినది పొందేసాము"

ఈ రోజు పిల్లల స్మృతి మరియు ప్రేమ బాప్ దాదాను ఈ సాకార ప్రపంచంలోకి తమ ఆకర్షణతో పిలిపించాయి. బాప్ దాదా కూడా పిల్లలను సాకార ప్రపంచంలో సాకార రూపంలో చూస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలు కూడా బాబాను చూస్తున్నారు మరియు బాబా కూడా సాకార స్వరూపంలో చూస్తున్నారు. మనసులో నలువైపల ఉన్న పిల్లల పట్ల వాహ్! పిల్లలు, కల్ప కల్పానికి పాత్రులైన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ముఖములో మెరుస్తున్న భాగ్యము కనిపిస్తుంది. మస్తకంపై లైట్ యొక్క ప్రాప్తి మెరుస్తుంది. హస్తములో జ్ఞాన భాండాగారము కనిపిస్తుంది. హృదయములో హృదయాభిరాముడు కనిపిస్తున్నాడు. పాదాలలో అడుగులో పదమాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి భాగ్యమును చూసి ప్రతి ఒక్కరి ముఖము ప్రకాశముతో మెరుస్తుంది. నలువైపుల ఉన్న పిల్లలందరూ సంతుష్ట స్వరూపులుగా కనిపిస్తున్నారు. ఇటువంటి మెరుస్తున్న ముఖాలను చూసి ఇతర ఆత్మలు కూడా 'వీరికేమి లభించింది' అని ఆలోచిస్తారు. అప్పుడు మీరు ఏమని జవాబు ఇస్తారు? పొందాల్సినది పొందేసాము... అందరూ సంతుష్టమణుల రూపంలో మెరుస్తున్నారు. ఈ విధంగా మీరు కూడా మీ మూర్తిని చూసుకుంటున్నారు కదా! బాప్ దాదా కూడా ఇటువంటి సంతుష్టమణులైన ఆత్మలను చూసి ఏ పాటను పాడుతారు? వాహ్ నా సంతుష్ట ఆత్మలూ వాహ్!

మరి ఈ రోజు కేవలం పిల్లల అభ్యర్థనను పూర్తి చెయ్యడానికి మాత్రమే వచ్చాము. మీ అందరి అభ్యర్ధన పూర్తయింది కదా! మున్ముందు ఎలా డ్రామా నిమిత్తం చేస్తుందో అలా కలుస్తూ ఉంటాము. ఈరోజు డ్రామాలో ఇంతే కలయిక ఉంది. 

పిల్లలందరూ చాలా మంచిగా రథం యొక్క సేవను చేసారు. సేవకు నిమిత్తమైన వారందరికీ బాప్ దాదా విశేషమైన అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు కేవలం పిల్లల అభ్యర్థనను పూర్తి చెయ్యడానికి వచ్చాము. మరి అందరూ మంచిగా ఉన్నారా! మంచిగా ఉంటే చేతులెత్తండి. రథానికి సేవ చేసిన వారికి కూడా హృదయపూర్వక అభినందనలు. రథం ఎక్కడ ఉండవలసి వచ్చినా కానీ, బాప్ దాదా ఏమి చూసారంటే గుజరాత్ కూడా తక్కువేమీ కాదు. గుజరాత్ వారెక్కడ ఉన్నారు! బాప్ దాదా మరియు వారితో పాటు నిమిత్తంగా అయిన పాండవ్ నిర్వైర్ బచ్చా చాలా సహకరించారు. రండి. (సరళ అక్కయ్యతో) చాలా మంచిగా చేసారు. నిమిత్తంగా అయ్యి దాదీలందరినీ సంభాళించినందుకు మీకు మరియు మీ తోటివారికి చాలా చాలా అభినందనలు. 

(దాదీ జానకి గురించి) :- అవును, విన్నాము, అంతా మంచిగా అయిపోయేదే ఉంది. 

దాదీ జానకితో :- అందరూ కలిసి మంచి పాత్రను వహించారు. దాదీ మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రోజు కేవలం కలవడానికి మాత్రమే వచ్చాము. ఇక వస్తూ ఉంటాము మరియు కలుస్తూ ఉంటాము. అచ్ఛా.

ముగ్గురు పెద్దన్నయ్యలతో :- ఇప్పుడు బాప్ దాదా అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారు, ఎటువంటి అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారు? పరివారానికి మీ ముగ్గురిపై ఎన్నో ఆశలున్నాయి. వేర్వేరు ఆలోచనలు ఉంటాయని బాప్ దాదా కూడా అర్థం చేసుకుంటారు కానీ ఆలోచనలను కలపడము మన చేతిలో ఉంటుంది. మరి బాప్ దాదా కూడా నిమిత్తమైన మీ పాండవులలో ఈ అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారు. ఆలోచనలు భిన్న భిన్నంగా ఉంటాయి కానీ కలపవలసి కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ముగ్గరూ ఈ అద్భుతాన్ని చేసి చూపించండి. ముగ్గురు కాదు ముగ్గురు ఒక్కరిగా ఉండాలి, ఇకపోతే అంతా మంచిగా ఉన్నారు. నిమిత్తమై అంతా నడిపిస్తున్నారు. అచ్చా.

దేశ విదేశాలలోని సోదరసోదరీలకు చాలా చాలా అభినందనలు, ఎందుకంటే నిమిత్తమైన ఇద్దరు దాదీలను చాలా మంచిగా సంభాళించారు. అందుకు విశేషమైన అభినందనలు. అన్ని వైపుల ఉన్న సోదరసోదరీలకు విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నాము మరియు సదా మనసులో ఇమిడి ఉంటారు. కావున సదా స్మృతిలో ఉండండి మరియు స్మృతిని కలిగించండి. అచ్ఛా.

ఈరోజు కేవలం, అందరి సంకల్పం ఉంది కలవాలి, కలవాలి, కలవాలి అని అది శరీర లెక్కతో పూర్తయింది. ఇక మున్ముందు డ్రామాలో ఎలా ఉంటే అలా కలుస్తూ ఉంటాము. బాప్ దాదా ఎప్పుడూ పిల్లలనుండి దూరంగా ఉండలేరు. ఎలా అయితే పిల్లలు బాబా నుండి దూరంగా ఉండలేరో అలాగే బాబా కూడా పిల్లల నుండి దూరంగా ఉండలేరు. బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు, అభినందనలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇలా భావించండి - నేను ఈ అనంతమైన కార్యం కోసం, కేవలం స్వయం కోసం మాత్రమే కాదు, స్వయంతో పాటు సేవ కోసం కూడా నిమిత్తంగా ఉన్నాను. ఇప్పుడు ఇటువంటి అద్భుతాన్ని చేసి చూపించండి. ప్రపంచంలో అలజడి ఉంది, అలజడిని అచలంగా మార్చేందుకు నిమిత్తులు మీరు. వారు తమ కార్యాన్ని విడిచిపెట్టరు కావున మీరు కూడా స్వయాన్ని నిమిత్తంగా భావించండి. వారు అలజడి, మీరు అచలము, ఇద్దరూ ఒకేసారి పాత్రను అభినయించండి. అచ్ఛా. ఈ రోజు కేవలం కలవడానికి వచ్చాము.

మహారాష్ట్ర, ముంబయి, ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీల సేవ టర్న్ :- అందరూ చేయి ఊపుతున్నారు. ప్రతి ఒక్క జోన్‌కు నిమిత్తంగా అయ్యే పాత్ర లభించింది. ప్రతి ఒక్కరూ పాత్రను నిర్వహించారు, ఇక మీదట కూడా నిర్వహిస్తారు అన్నది కూడా బాప్ దాదా చూసారు.

నాలుగు వింగ్స్ - ఎడ్యుకేషన్, ధార్మిక, సైన్సు ఇంజినీర్, కల్చరల్ మరియు క్యాడ్ గ్రూపులు కూడా వచ్చాయి. వింగ్స్ వారు ఎవరెవరు ఉన్నారో, ప్రతి ఒక్క వింగ్ మరొకదానికన్నా ముందు ఉంది, అటెన్షన్ ఇచ్చి కార్యాన్ని ముందుకు కూడా నడిపిస్తున్నారు, అందుకు అభినందనలు, అభినందనలు.

నలువైపుల ఉన్న పిల్లలకు తమ తమ కార్యాలను చేస్తున్నందుకు అభినందనలు, ఇక ముందు కూడా ప్రతి వింగ్ మరియు ప్రతి జోన్ మున్ముందుకు వెళ్తూ ఉంటుంది, ఇందుకు బాప్ దాదా అభినందనలు.

డబుల్ విదేశీయులు ఎవరైతే వచ్చారో వారు నిల్చోండి. బాప్ దాదా ఇక డబుల్ విదేశీయులు అని అనరు, డబుల్ పురుషార్థి. ఎందుకంటే డబుల్ పురుషార్థీలు ఇంకా నలువైపుల పెరుగుతున్నారు. చిన్న చిన్న స్థానాలలో కూడా అటెన్షన్ పెడ్తున్నారు కావున సేవకు కూడా అభినందనలు మరియు డబుల్ పురుషార్థానికి కూడా అభినందనలు. ఇప్పుడు డబుల్ విదేశి అని అనకండి, డబుల్ తీవ్ర పురుషార్థి అని అనండి. సరేనా. డబుల్ పురుషార్థి, డబుల్ అంటే తీవ్ర పురుషార్థి. మరి డబుల్ పురుషార్థీలు ఎక్కడెక్కడి నుండి వచ్చారో బాబాకు గుర్తుంది, కానీ అందరికంటే దూరంగా ఉన్నది ఎవరు? అందరికంటే దూరంగా ఉన్నది ఎవరు? అమెరికా వారా! వారు కూడా ఈ ప్రపంచంవారే కదా. కానీ బాప్ దాదా ఎక్కడినుండి వచ్చారు? పిల్లలు పిలిచారు బాబా హాజరు. శరీరం ఎలా ఉన్నాకానీ పిల్లలు పిల్లలే. బాబా సదా జీ హాజరు అని అంటారు. అచ్ఛా, నలువైపుల చాలా చాలా మంచిగా తమ పాత్రను చేసేవారు, బాబా చెప్పారు - పిల్లలు చేసారు అన్నట్లుగా ఉండే పిల్లలు బాబా హృదయంలో ఉంటారు. నలువైపుల ఉన్న ఇటువంటి పిల్లలకు పదమారెట్ల ప్రియస్మృతులు.

(దాదీ జానకి తలకు దెబ్బ తగిలింది) ఇవి జరుగుతూనే ఉంటాయి, ఏమీ ఫర్వాలేదు. ఇంకా సుందరంగా అయ్యారు. (దాదీ జానకి తల మీద కప్పుకుని ఉన్నారు) దాదీ, దాదీ అని అంటారు, మరి దాదీ రూపాన్ని కూడా చూడాలి కదా. (జయంతి అక్కయ్యతో) వీరు మంచిగా ఉన్నారా? (హంసా అక్కయ్య మరియు ప్రవీణ అక్కయ్యతో) అలసిపోవడం లేదు కదా. మంచిది. (హంసా అక్కయ్యతో) సేవ మంచిగా చేస్తున్నారు. మీరు చేసే సేవ చూసి వారికి కూడా ఉల్లాసం వస్తుంది కావున వారి అభినందనలు కూడా లభిస్తూ ఉంటాయి, నిమిత్తంగా అయినవారివి. డాక్టర్లకు కూడా స్మృతిని పంపండి.

(ఇలా ఇద్దరు దాదీలకూ ఎందుకు జరిగింది) ఇందుకు జవాబు డ్రామా ఇస్తుంది. డ్రామా. ఇంతకు మించి ఎవ్వరూ ఏమీ చెప్పలేరు. డ్రామా, డ్రామాయే. (నీలూ అక్కయ్య ఫిర్యాదు చేస్తున్నారు) ఏమి అనాలనుకుంటే అది అనండి. అచ్చా, అందరూ బిందు రూపంలో స్థితులవ్వండి.

Comments