27-02-2014 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“శివ అవతరణ సందర్భంగా వ్యర్థాన్ని నమాప్తం చేసే బహుమతిని బాబాకు ఇవ్వండి, విశేషమైన అటెన్షన్ ఇచ్చి ఒక నెల నిర్ఫిష్ను అవస్థను అనుభూతి చెయ్యండి"
ఈరోజు గారాల పిల్లలందరికీ శివ అవతరణ, శివ జయంతికి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం నుండే అందరి హృదయాలలో పరమాత్మ అవతరణకు, స్మృతిచిహ్నానికి ఎంతో సంతోషాన్ని బాప్ దాదా చూసారు. ఎందుకంటే బాబా అవతరణతో పాటు పిల్లలైన మీ దివ్య జన్మ కూడా జరిగింది. అంటే పిల్లలు తండ్రికి శుభాకాంక్షలు తెలిపితే బాప్ దాదా కూడా ఒక్కొక్కరికీ మీ దివ్య జన్మ కోసం లక్షరెట్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జన్మించినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న సంగమయుగ స్మృతులు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్నాయి. ఈ రోజు అందరి మనసులలో శివ అవతరణ జరిగిన సంతోషం కనిపిస్తుంది అలాగే బాబాకు కూడా పిల్లల దివ్య జన్మ జరిగిన సంతోషం చాలా చాలా ఉంది. వాహ్ గారాల మధురమైన పిల్లలూ వాహ్! ఎందుకంటే బాబాతో పాటు పిల్లలైన మీది కూడా ఇది అలౌకికమైన, దివ్యమైన, పూజ్యనీయ జన్మ. ఈ సంగమంలో బాబాతో పాటు అవతరించారు అంటే క్రొత్త జన్మ తీసుకుని విశ్వ కళ్యాణ కర్తవ్యానికి నిమిత్తులుగా అయ్యారు. బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా ప్రతి కర్తవ్యంలో కలిసి ఉన్నారు. ఈ విశ్వాన్ని పరివర్తన చెయ్యవలసిందే అన్న ఉల్లాస-ఉత్సాహాలు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. మనసులో ఉత్సాహం ఉంది కదా! ఉత్సాహం ఉంటే చేతులెత్తండి. అచ్ఛా.
మెజారిటీ పిల్లలలో తమ రాజ్యం రాబోతుందన్న సంతోషం చాలా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఎందుకంటే మా రాజ్యం ఇక వచ్చేసినట్లే అని తెలుసు. ఈ శివరాత్రి, పిల్లలందరికీ తండ్రి అవతరణ యొక్క సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు అందరి మనసులలో శివబాబా స్మృతి నిండి ఉంది. మా బాబా వచ్చేసారు. మా రాజ్యం వచ్చేసినట్లే. బాప్ దాదా కూడా పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి పిల్లల గురించి వాహ్ పిల్లలూ వాహ్! అన్న పాటను పాడుతున్నారు. విశేషంగా సేవలో మునిగి ఉన్న పిల్లలు రాత్రింబవళ్ళు తమ మనసులో 'మా రాజ్యం వచ్చేస్తుంది' అన్న పాటను పాడుకోవడం బాబా చూసారు. ఇప్పుడు ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి అవసరమైన తయారీలు ఏమిటో తెలుసు కదా!
ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ తమ మనసు యొక్క చార్టును చూసుకోండి. తమ రాజ్యంలోకి వెళ్ళడానికి తమలో సంపూర్ణతను ఎంతవరకు తీసుకువచ్చారని చూసుకోండి. ఎందుకంటే సంపూర్ణ రాజ్యంలోకి వెళ్ళాలి, అక్కడ దుఃఖము నామమాత్రానికి కూడా ఉండదు. కనుక ఇప్పటి నుండే మీ మనసులో సదా నిర్విఘ్నంగా ఉండే సంస్కారాన్ని చూస్తున్నారా? విఘ్నం వచ్చే కన్నా ముందే నిర్విఘ్న స్థితి అనుభూతి అవుతుందా? ఇప్పుడు బాప్ దాదా పిల్లలలో విఘ్న వినాశక స్థితిని చూస్తున్నారు మరియు చూడాలని కూడా అనుకుంటున్నారు. బాబాకు నిర్విఘ్న సహచరుడిగా అయ్యి ఉండాలన్న పక్కా సంస్కారము కొంతమంది పిల్లలలో ఉంది, అటెన్షన్ ఉంది కానీ అటెన్షన్ అంటే అర్థము నో టెన్షన్, ఈ విషయంపై మంచి శ్రద్ధనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిమిత్తంగా ఉన్న పిల్లలైన మీరు నిర్విఘ్న స్థితిని అనుభూతి చేసుకుంటేనే మీ నిర్విఘ్నత యొక్క వైబ్రేషన్లు పురుషార్థీ పిల్లల వరకు చేరుకుంటాయి.
నిర్విఘ్న స్థితి ఎంతవరకు ఉంటుంది అని ఈరోజు బాప్ దాదా చూసారు. కొంతమంది పిల్లల రిజల్టులో మంచి అటెన్షను చూసారు. ఆ పిల్లలకు బాప్ దాదా ఈరోజు శివ అవతరణ రోజున, శివ అవతరణకు గుర్తు అయిన ఈ రోజున ఇటువంటి నిర్విఘ్నంగా ఉండాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న వారికి బాప్ దాదా అవతరణ రోజున శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు మరియు హృదయాభిరాముడు తమ హృదయ ప్రేమను కూడా ఇస్తున్నారు. వాహ్ పిల్లలూ వాహ్! అని మనసులో పాట కూడా పాడుకుంటున్నారు. అటెన్షన్ ఇవ్వడమంటే టెన్షన్ లేకుండా ఉండటము, అందుకు గుర్తు అటెన్షన్, టెన్షన్ లేకుండా ఉండటము. ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారు, ఇది బాప్ దాదా గమనించారు కానీ సదా అటెన్షన్లో ఉండేవారు బాబా అనుకున్నదాని కన్నా తక్కువగా ఉన్నారు. మరి ఈనాటి అవతరణ దివసము రోజున పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము అనుసారంగా తమ వద్ద నోట్ చేసుకోండి, మీ అనుసారంగా మీ సమయాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి, అంత సమయము నిర్విఘ్నంగా ఉండండి. ఎందుకంటే రాబోయే సమయంలో నిర్విఘ్నంగా ఉండే అటెన్షన్ అవసరమవుతుంది. అందుకే విశ్వంలో నలువైపుల ఉన్న పిల్లలు ఇప్పుడు తమ ధైర్యము అనుసారంగా నేను ఇంత సమయము నిర్విఘ్నంగా ఉండగలను అని అనుకుని అటెన్షన్లో ఉండి చూడాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. నిర్విఘ్నంగా ఉండటము సహజమా లేక కష్టమా? అటెన్షన్ తో సహజము అని భావించేవారు చేతులెత్తండి. అచ్చా. శక్తి లేకపోతే చేతులెత్తకండి. మరి బాప్ దాదా ఒక నెల రిజల్టును చూడాలనుకుంటున్నారు, కేవలం ఒక్క నెల. ఎక్కువ చెప్పడం లేదు. ఒక నెల సంకల్పంలో కూడా నిర్విఘ్నము, వ్యర్థ సంకల్పాలు కూడా వద్దు, స్టాప్ అనగానే స్టాప్ అవ్వాలి. ఇప్పుడు సంకల్పంపై అటెన్షన్ అవసరము. ప్రతి సంకల్పంలో నిర్విఘ్నంగా ఉన్నామా అని పరిశీలించుకోండి. వ్యర్థ సంకల్పాలు కూడా వద్దు. మీ సంకల్ప శక్తి పై ఇంతటి అటెన్షన్ ఉందా? సంకల్పం మీ శక్తి కదా! కావున నిర్విఘ్నంగా ఉండే ప్లాన్‌ను ఆలోచించండి, ఒక నెల పరిశీలించుకోండి, అనుకున్నది జరిగిందా అని గమనించుకోండి. ఎందుకంటే మాయ కూడా వింటుంది. వాతావరణం ఎంతగా మాయతో కూడినదిగా ఉన్నాకానీ, వాతావరణ ప్రభావం మనసులోని శుభ సంకల్పాలకు విఘ్న రూపం అవ్వకూడదు, ఇందులో సఫలత రావాలి, మరి 15 రోజులలో వ్యర్థం కూడా లేకుండా సదా హృదయంలో బాబా నిండి ఉన్నారా అని పరిశీలించుకోండి. ఇప్పుడు కొంత సమయం, సంకల్పాల పురుషార్థంపై అటెన్షన్ ఇవ్వండి. వాణి మరియు కర్మలైతే పెద్ద విషయాలు కానీ సంకల్పాలలో కూడా వ్యర్థం ఉండకూడదు. ఎందుకంటే ఒక్కొక్క సంకల్పం యొక్క చెకింగ్ అవసరము. వాచ మరియు కర్మణ కూడా ఉన్నా కానీ మనసా శక్తి పవర్‌ఫుల్ అయిన కారణంగా అది వాచ మరియు కర్మణను ప్రభావితం చేస్తుంది. బాప్ దాదా ఈరోజు మనసా సంకల్పాలపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు, నిమిత్తంగా ఉన్న మహారథులు ఇప్పుడు మనసా శక్తిపై అటెన్షన్ ఇవ్వాలి. అప్పుడు వాణి మరియు కర్మలు స్వతహాగా సరి అయిపోతాయి. కావున బాప్ దాదా ఈ రోజు మనసా సంకల్పాలపై సూచనను ఇస్తున్నారు, ఎందుకంటే అవసరం లేని వేస్ట్ థాట్స్ (వ్యర్థ సంకల్పాలు) కూడా సమయాన్ని తీసుకుంటాయి. ఆ సమయాన్ని కాపాడుకోవాలి. వీలవుతుందా? వీలవుతుంది అని అనుకుంటే చేతులెత్తండి. అచ్చా. చాలా మంచి ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నవారు మీరు, ఇందుకు శభాష్. ఇప్పుడు ఈ ఉల్లాస-ఉత్సాహాలను కర్మ వరకు తీసుకురండి. ఇందులో కూడా పాస్ అయిపోతారు. ఎందుకంటే బాబాను తోడు పెట్టుకుంటారు కదా, బాబా తోడు ఉన్నప్పుడు వ్యర్థము స్వతహాగానే సమాప్తం అయిపోతుంది.
మరి ఈ రోజు బాప్ దాదా వేస్ట్ థాట్స్ పై అటెన్షన్ ఇప్పిస్తున్నారు, ఎందుకంటే ఇందులో చాలా సమయం వృధా అవుతుంది. సమయాన్ని అయితే తీవ్ర పురుషార్థంలో పెట్టాలి. ఈరోజు బాప్ దాదా వ్యర్థంపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు, ఎందుకంటే చెడు ఆలోచనలైతే రావడం లేదు కదా అని పిల్లలంటారు. ఇవి చిన్న చిన్న వ్యర్థ సంకల్పాలే కానీ ఎప్పుడైనా సమయానికి మోసం చేస్తాయి అందుకే వ్యర్థాన్ని కూడా తగ్గించండి. కావున మనసా, వాచ, కర్మణ (సంబంధ సంపర్కాలు) అన్నింటిలో వేస్ట్ ఎంత ఉంది, బెస్ట్ ఎంత ఉంది అని పరిశీలించుకోండి. ఎందుకంటే ఈ శివరాత్రి నాడు బాబాకు ఏదైనా బహుమతిని ఇవ్వాలి కదా? చేతులెత్తండి. వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాలన్న బహుమతినే బాబా కోరుకుంటున్నారు. అటెన్షన్ ఇవ్వండి. చెడుపై అయితే అటెన్షన్ ఉంది కానీ వ్యర్థంపై కూడా అటెన్షన్ ఇవ్వాలి, ఎందుకంటే వ్యర్థంలో సమయం చాలా వృధా అవుతుంది. ఈరోజు శివరాత్రి సందర్భంగా వ్యర్థంపై అటెన్షన్ అనే హోమ్ వర్కును బాప్ దాదా ఇస్తున్నారు. ఇష్టమే కదా! ఇష్టమేనా? చేతులెత్తండి. ఇష్టమైతే అందరూ పాస్ అయిపోతారు. ఇష్టమైతే నచ్చినదాన్ని మనస్ఫూర్తిగా చెయ్యడం జరుగుతుంది. అయితే అభినందనలు, అభినందనలు, అభినందనలు. కష్టంగా అనిపించడం లేదు కదా. అరే, అటెన్షన్ ఉంటే శ్రమ తగ్గిపోతుంది. చేసి చూడండి, అందరూ పాస్ అవుతారు, ఒక నెల తర్వాత రిజల్టు అడిగినప్పుడు మెజారిటీ పాస్ అవ్వాలి. వీలవుతుంది కదా? వీలవుతుందని అనుకుంటే చేతులెత్తండి. అచ్చా. మరి అందరూ అయితే చేతులెత్తుతున్నారు. బాప్ దాదా వాహ్ పిల్లలూ వాహ్! అని అంటున్నారు. లక్ష్యంతో లక్షణాలు స్వతహాగా, సహజంగా వచ్చేస్తాయి. అచ్ఛా.
పిల్లలందరికీ బాప్ దాదా తీవ్ర పురుషార్థమును బహుమతిగా ఇస్తున్నారు. ఇష్టమే కదా! అచ్చా. ఈ రోజు శివరాత్రి. నేటి కోసం ప్రత్యేకమైన అభినందనలు, హృదయపూర్వక ప్రేమ. ఈరోజు డబుల్ విదేశీయులు ఎక్కువగా ఉండటాన్ని బాప్ దాదా చూస్తున్నారు. లేవండి, ఎంతమంది ఉన్నారో చూస్తాము! చూడండి, వాహ్! వాహ్! బాప్ దాదా సంతోషిస్తున్నారు. అటెన్షన్ బాగుంది. బాప్ దాదా హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. భారతవాసులకు కూడా. ఇప్పుడు విదేశీయుల సీజన్ కదా! చాలా వైపుల నుండి వచ్చారు, చాలా దేశాల నుండి రావడాన్ని బాప్ దాదా చూసారు. (80 దేశాలనుండి 1200మంది డబుల్ విదేశీయులు వచ్చారు) అందరూ డబుల్ సంతోషంగా ఉన్నారు కదా! తనువుతో, మనసుతో కూడా? బాగుంది. సేవ వైపు కూడా అటెన్షన్ ఉంది, సేవను ఇంకా ఎంత పెంచగలరో అంత పెంచుతూ వెళ్ళండి, ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. అందుకే సేవను పెంచుతూ వెళ్ళండి, ఎందుకంటే మీ రాజ్యం రానుంది కదా. మరి మీ రాజ్యంలో రాజ్యమైతే చెయ్యాలి కదా. ఎంత వీలైతే అంత ఆత్మలకు బాబా పరిచయాన్ని ఇచ్చేయండి, బాబా వచ్చారు, వెళ్ళిపోయారు కానీ పిల్లలకు తెలియకపోతే ఎలా. కావున ఎంత వీలైతే అంత సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి. బాబా వచ్చారు, మాకు చెప్పారు కూడా, కానీ మేము నడుచుకోలేదే అని తర్వాత వారు పశ్చాత్తాపం చెందుతారు. సందేశం ఇచ్చే మీ కార్యాన్ని మాత్రం పెంచుతూ ఉండండి. మేమైతే దగ్గరలోనే ఉంటాము, మేమైతే ఈ వీధిలో ఉంటాము, అయినా మాకు తెలీలేదు అన్న ఫిర్యాదు రాకూడదు. మంచిది, విదేశీయుల రిజల్టు కూడా బాగుంది. మధువనంపై ప్రేమ ఉంది. మీ సేవ తర్వాత బాప్ దాదా విశ్వ సేవాధారిగా ప్రసిద్ధి అయ్యారని ముందు కూడా చెప్పి ఉన్నాము. మీరు కూడా ఎక్కడ ఎవరు మిగిలిపోయి ఉన్నా, ముందు కూడా వినిపించాము కదా, ఎంత వీలైతే అంత 'మా తండ్రి వచ్చారు' అన్న సందేశమైతే అందాలి. నడవడమా లేదా అన్నది వారిపై ఉంటుంది కానీ మీ వైపు నుండి పరిచయమైతే లభించాలి, తర్వాత పశ్చాత్తాపం చెందుతారు కానీ అసలు తెలియాలి కదా! అయినా కానీ రిజల్టు బాగుంది. చాలా మంచిది. కష్టపడి ఎక్కడినుండి వచ్చినా కానీ, కష్టానికి ఫలితం మీకు లభిస్తుంది మరియు జమ కూడా అయ్యింది. చాలా మంచిది, కూర్చోండి. డబుల్ విదేశీయులు, టైటిల్ చూడండి ఏమిటో? మేము డబుల్ విదేశీయులము అన్న విషయాన్ని డబుల్ విదేశీయులు మర్చిపోకపోవచ్చు.
సేవ టర్న్ రాజస్థాన్ జోన్ వారిది, 5000 మంది వచ్చారు:- ప్రతి ఒక్క జోన్ వారి డ్యూటీ ఉన్న కారణంగా మంచి రిజల్టు ఉండటాన్ని బాప్ దాదా చూస్తున్నారు. ఆ జోన్ వారు ప్రత్యేకంగా అటెన్షన్ ఇస్తారు. మెజారిటీ రిజల్టు బాగుంది. మీరేమనుకుంటున్నారు? రిజల్టు బాగుంది కదా? ఇలా జోన్ జోన్ కు లభించడం ద్వారా సేవలో మంచి సహయోగిగా అవ్వడమే కాకుండా జోన్ కూడా విశేషంగా కలుస్తుంది. దాదీల అటెన్షన్ కూడా జోన్ పై పడుతుంది. ఇది మంచిగా అనిపిస్తుంది కదా, చేతులెత్తండి.
మెదటిసారి చాలామంది వచ్చారు:- మొదటి సారి వచ్చినవారు మొదటి నంబరు తీసుకోవాలి ఎందుకంటే ఇంత సమయం ఏదైతే మిస్ చేసారో, ఆ సమయాన్ని పూర్తి చెయ్యాలి, ఎందుకంటే తీవ్ర పురుషార్థీగా అవ్వాలి, ఢీలా ఢీలాగా కాదు, తీవ్ర పురుషార్థి. సమ్మతమేనా? తీవ్ర పురుషార్థి.
దాదీ రతన్‌మోహిని గారికి డాక్టరేట్ డిగ్రీ లభించింది:- ఇది కూడా సంస్థకు పేరు తెచ్చే విషయము, బ్రహ్మాకుమారీస్ అన్నీ చెయ్యగలరని అర్థం చేసుకుంటారు. లేకపోతే బ్రహ్మాకుమారీలు ఏమి చేస్తున్నారో అని అనుకుంటారు. ఇటువంటి వాటి వలన బ్రహ్మాకుమారీలు ఆల్ రౌండర్లు, అన్ని వైపులకు చేరుకోగలరు అని అనుకుంటారు. అచ్చా.
దాదీ జానకి - (వండర్ ఫుల్ బాబా, అద్భుతం చేస్తారు, అందరి మనసులను ఇట్టే ఆకర్షిస్తారు) దిలారామ్ కదా. దిలారామ్ వద్దకు దిల్ చేరుకుంది. (అందరికీ ఎలా తెలుస్తుంది) తెలుస్తుంది. మిగిలి ఉన్న వారికి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉల్లాస ఉత్సాహాలతో మిగిలి ఉన్న స్థానాల వరకు అందరినీ పంపించండి. మీరు చేయించండి. బాబా చేయిస్తున్నారు, బాబా ఇప్పుడు కూడా చేయిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? (శరీరం ఇబ్బంది పెడుతూ ఉంటుంది) ఏమీ ఫర్వాలేదు. పిల్లలను ముందుంచేందుకు నిమిత్తమయ్యారు ఎందుకంటే పిల్లలే ఎదుర్కోవలసి వస్తుంది. అయినా కానీ పిల్లల ద్వారానే చేయాల్సి ఉంటుంది.
మోహినీ అక్కయ్య బాప్ దాదాకు శుభాకాంక్షలు తెలిపారు:- మీకు లక్ష రెట్లు శుభాకాంక్షలు.
రమేష్ అన్నయ్య కార్డు ఇచ్చారు:- మీకు వేయి రెట్లు, పదమారెట్లు శుభాకాంక్షలు.
బృజ్ మోహన్ అన్నయ్యతో: - అటెన్షన్ ఉంది మరియు ముందుకు వెళ్తూ ఉండండి.
భూపాల్ అన్నయ్యతో: - బాగుంది, చాలా మంచిది.
బాప్ దాదాకు అందరూ పంపించిన కార్డులను చూపించడం జరిగింది: - (రష్యా మరియు నళిని అక్కయ్యలు పంపిన కార్డులను చూపించారు) బాప్ దాదా చూసారు అని వారికి చెప్పండి. వారికి ఫలం కానీ టోలీ కానీ పంపండి.
విదేశాల పెద్దక్కయ్యలతో:- మహారథులంతా ఒక చోట కలిసారు, దేశంవారు మరియు విదేశంవారు. ఈ సంగఠన మంచిగా అనిపిస్తుంది. (అన్ని దేశాలు కలిసి ఒక్కసారి ఏదైనా సేవ చెయ్యాలి) పురుషార్థం కూడా చేస్తున్నారు, సేవ కూడా చేస్తున్నారు మరియు సఫలత కూడా ఉంది. దేశంవారైనా, విదేశంవారైనా కావచ్చు, బాప్ దాదా సంతోషిస్తున్నారు. కృషి చేస్తున్నారు, కృషికి ఫలితం కూడా వస్తుంది అందుకని అభినందనలు, అభినందనలు. నిమిత్తమైతే మీరే కదా. బాప్ దాదా అయితే మీకు బలాన్ని ఇస్తారు కానీ ప్రపంచం ముందైతే పిల్లలే చెయ్యాలి కదా.
(కోయంబత్తూరు నుండి డాక్టరు వచ్చారు) ఇప్పుడు డబుల్ డాక్టర్, సింగల్ కాదు. పక్కా అయిపోయారు. పక్కా. మంచిది, ముందుకు వెళ్తూ ఉండండి. సేవలో ముందుకు సాగుతూ ఉండండి. మీ వద్ద అయితే సందేశాన్ని ఇవ్వడానికి తయారై ఉన్న సాధనము ఉంది, చాలా సేవను చెయ్యండి. చేస్తారు. మంచిది.
బాప్ దాదా తమ హస్తాలతో శివధ్వజాన్ని ఎగురవేసారు:- అందరి మనసులు ఒకే మాటను చెప్తున్నాయి, వాహ్ శివ జయంతి వాహ్! వాహ్ శివబాబా వాహ్!
Comments
Post a Comment