25-12-2014 అవ్యక్త మురళి

 25-12-2014         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“నూతన సంవత్సరంలో తీవ్ర పురుషార్థపు లక్ష్యాన్ని పెట్టుకుని సదా ముందుకు సాగుతూ ఉండండి, చెకింగ్ చేసుకుని స్వయాన్ని పరివర్తన చేసుకోండి, అంతిమ పరీక్ష అకస్మాత్తుగా రానుంది కావున ప్రతి సబ్జెక్టులో పాస్ మార్కులు తీసుకోవాలి, సదా కలసి ఉండండి మరియు కలసి రాజ్యంలోకి రండి"

 నూతన సంవత్సరానికి నవీనతా సంపన్న అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాప్ దాదా తమ తీవ్ర పురుషార్థీ పిల్లలను చూసి, పిల్లలందరికీ నూతన సంవత్సరానికి నవీనత కోసం అభినందనలు తెలుపుతున్నారు. ఈ నూతన సంవత్సర ఆరంభంలో పిల్లలు ప్రతి ఒక్కరూ మనసా-వాచ-సంబంధ సంపర్కములలో తమలో ఏదో ఒక నవీన లక్ష్యాన్ని ప్రాక్టికల్ గా పెట్టుకుని సంవత్సరపు నవీనతను బుద్ధిలో పెట్టుకుని ఉండవచ్చు. పురుషార్థంలో అడుగును, విశేషతను తమ బుద్ధిలోకి తెచ్చుకుని ఉండవచ్చు. అందరూ నడుస్తున్నారు, పురుషార్ధి అంటేనే అడుగు ముందుకు పడటము అని అర్థం. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థాన్ని మున్ముందుకు తీసుకువెళ్ళే శ్రేష్ఠ సంకల్పాన్ని చేసి ఉండవచ్చునని బాప్ దాదా చూస్తున్నారు! ఎవరైతే స్వయం గురించి ముందుకు వెళ్ళాలని సంకల్పం తీసుకున్నారో వారు చేతులెత్తండి. ఒకవేళ సంకల్పం తీసుకుని ఉన్నట్లయితే వెనుక ఉన్నవారు కూడా చేతులెత్తండి. అడుగును ముందుకు వేసే యుగమే సంగమయుగం. కనుక, తమ కోసం తప్పకుండా ముందుకు వెళ్ళే సాధనాన్ని లేక విధిని ఆలోచించుకుని ఉండవచ్చు. సహజమైన మరియు శ్రేష్ఠమైన సాధనాన్ని తప్పకుండా స్వయం కోసం లక్ష్యం రూపంలో ఇమర్జ్ రూపంలో పెట్టుకుని ఉండవచ్చు! ఎవరైతే ఇక ముందు మనసా-వాచ-కర్మణ మరియు సంబంధ సంపర్కాలలో అడుగును ముందుకు వెయ్యాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారో వారు చేతులెత్తండి. మంచిది. చేతులైతే బాగా ఎత్తుతారు. వెనుకవారు కూడా చేతులెత్తుతున్నారు. చేతులు కొంచెం పొడవుగా ఎత్తండి, ఇలా పొడవుగా చేతులు బాగా ఎత్తుతున్నారు. బాప్ దాదా కూడా పురుషార్థపు చేతిని చూసి సంతోషిస్తారు. లక్ష్యం మరియు లక్షణాలు కలిసి ఉంటాయి. ఇటువంటి ప్లాన్‌ను స్వయం కోసం తప్పకుండా తయారు చేసుకుని ఉండవచ్చు, తయారు చేసుకున్నారు కూడా. కొంతమంది పిల్లలు ప్లాన్‌ను తయారు చేసుకోవడాన్ని బాప్ దాదా చూసారు. ప్లాన్ మరియు ప్రాక్టికల్, లక్ష్యమును బట్టి లక్షణాలను తప్పకుండా తెచ్చుకుంటారని బాప్ దాదాకు సంతోషంగా ఉంది. చేస్తారు కదా! ఇందులో చేతులెత్తండి, అచ్ఛా, చేస్తారు. ఎందుకంటే స్వయంగా బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి చార్టును సమయానుసారంగా చూస్తుంటారు మరియు మున్ముందుకు వెళ్తూ ఉండాలని అప్పుడు వరదానాన్ని ఇస్తుంటారు. లక్ష్యం చాలా మంది పిల్లలది మంచిగా ఉండటాన్ని చూసారు కానీ నడుస్తూ నడుస్తూ ఏదో ఒక పరిస్థితి లక్ష్యాన్ని కొంచెం ఢీలా చేసేస్తుంది. లక్ష్యమైతే మంచిగా పెట్టుకున్నారు, బాప్ దాదా లక్ష్యాన్ని చూసి సంతోషిస్తున్నారు కానీ దానికి తగ్గట్లుగా ముందుకు సాగడంలో మాత్రం కొంచెం తేడా కనిపిస్తుంది. అయినప్పటికీ మెజారిటీ పిల్లల లక్ష్యం మంచిగా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఇప్పుడు లక్ష్యం మరియు లక్షణం రెండూ కలిసి ముందుకు సాగాలి, ఈ అటెన్షన్ ను ఉంచండి, ఇప్పుడు దీని ఆవశ్యకత ఉంది. ఆలోచించారు మరియు చేసారు, రెండూ కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. విషయాలు ఎలాంటివి జరుగుతున్నా కానీ, ఇవి చిన్న చిన్న పరీక్షలే అయినా కానీ, ఈ విషయంలో అటెన్షన్ కొంచెం ఎక్కువ అవసరం ఎందుకంటే బాప్ దాదా వద్ద పిల్లలు ప్రతి ఒక్కరి రికార్డు ఉంటుంది. ఎలా అయితే మీరు మీ రికార్డును పెట్టుకుంటారో అలాగే బాప్ దాదా కూడా పిల్లలందరి రికార్డును మధ్యమధ్యలో చూస్తూ ఉంటారు. లక్ష్యం చాలా బాగుంది, ప్లాన్ తయారు చేస్తున్న సమయంలో చాలా ఉల్లాస-ఉత్సాహాలతో తయారు చేస్తారు కానీ తర్వాత అటెన్షన్ ఇవ్వవలసి వస్తుంది ఎందుకంటే లక్ష్యాన్ని పూర్తి చెయ్యడానికి ప్రతి ఒక్కరూ కొంచెం అటెన్షను అయితే ఇస్తున్నారు కానీ అందులో నంబరు ఉంది. మరి స్వయాన్ని ఏ నంబరులో భావిస్తున్నారు, తెలివి చాలా బాగుండటాన్ని బాప్ దాదా చూసారు, తెలివితో పాటు స్వ చెకింగ్ కూడా బాగా చేసుకుంటారు కానీ నడుస్తూ-నడుస్తూ కొన్ని విషయాలు ఎలా వస్తాయంటే అవి తీవ్ర పురుషార్థాన్ని సాధారణ పురుషార్థంలోకి మార్చేస్తాయి. అటెన్షన్ ను అవినాశిగా ఉంచండి, పరిస్థితులైతే వస్తాయి కానీ పరిస్థితుల కారణంగా అటెన్షన్ తగ్గకూడదు అని బాప్ దాదా ప్రతి ఒక్కరినీ చూసి చెప్తున్నారు. కొంతమంది పిల్లలు మంచి లక్ష్యాన్ని పెట్టుకోవడాన్ని బాప్ దాదా చూసారు, దానిపై నడుస్తారు కూడా కానీ..... కానీ వస్తుంది. సమయం ఇప్పుడు మీ అందరి కోసం వేచి ఉంది. లక్ష్యం బాగుంది, చెకింగ్ కూడా బాగుంది కానీ మధ్య మధ్యలో ఏదో ఒక విషయం తన వైపుకు ఆకర్షిస్తుంది. ఫైనల్ రిజల్టు అకస్మాత్తుగా రానుంది, దీనికోసం తారీఖు ఫిక్స్ అయి లేదు.

బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ పురుషార్థపు విధితో నంబర్ వన్ గా చూడాలనుకుంటున్నారు. పిల్లలు కూడా ఇదే కోరుకోవడాన్ని బాప్ దాదా చూసారు, కేవలం అక్కడక్కడ నిర్లక్ష్యం అనే సాంగత్యపు రంగు అంటుకుంటుంది. అవుతాములే, రెండిటినీ అనుభవం చేసాము కదా. సమయం వచ్చినప్పుడు ఆలోచించాము కదా, ఏముందిలే అటెన్షన్ పెట్టాములే అని అంటారు. కానీ ఇక్కడ అటెన్షన్ నోట్ అవుతుంది కానీ బహుకాలము లేక బహుకాలంలో మధ్యమధ్యలో బహుకాలపు రివాజీ ఆట జరుగుతుంది, ఆ రిజల్టు ఎక్కువగా ఉంది. ఉండకూడని సాధారణత స్వభావం ఒక్కోసారి ఒక్కోలా వస్తుంది. సదా తమపై దృష్టి ఉండాలి, సాధారణ ఉండకూడదు అని బాప్ దాదా కోరుకుంటున్నారు. ఇప్పుడైతే మీరంతా పాతవాళ్ళ జాబితాలో ఉన్నారు, కొద్దిమంది కొత్తవారు ఉన్నారు, మెజారిటీ పాతవాళ్ళ లిస్టులోనే ఉన్నారు. అంతిమ పరీక్ష అకస్మాత్తుగా రానుంది, అందుకు తారీఖు ఫిక్స్ అయి లేదు. కావున తమలోని ఏదైనా ఒక విశేషతను సదాకాలికంగా చేసుకోవడం అవసరం ఎందుకంటే పరీక్ష సదా రాదు, మధ్య మధ్యలో పరీక్ష డ్రామానుసారంగా వస్తుంది కనుక సదా అటెన్షన్ అవసరం. చాలా మంది అటెన్షన్ పెడ్తారు కూడా, వారిని బాప్ దాదా తీవ్ర పురుషార్థీల లిస్టులో పెడ్తారు, అటెన్షన్ ఇస్తున్నారు కానీ కొంచెం సమయం తీవ్రంగా ఉంటే, మరి కొంత సమయం మధ్యలో పేపర్ వస్తుంది, అప్పుడు కొంచెం తేడా కనిపిస్తుంది రోజురోజుకూ స్వయంపై అటెన్షన్ ను తప్పక పెడ్తున్నారు, అటెన్షన్ ను పూర్తిగా విడిచిపెడ్తున్నారు అని కూడా కాదు, ఇది పిల్లలందరిలో చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు, కానీ నంబరు ఉంది. బాప్ దాదా మధ్యమధ్యలో సంఘటిత రూపంలో కలుసుకోవడంపై ప్రత్యేకంగా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ప్రతి ఒక్కరి పురుషార్థపు గతిలో కూడా తేడా ఉంది, ఇందులో కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తుంది. అవుతుందిలే అవుతుందిలే... ఇది కొంచెం ఎడిషన్ అవుతుంది. ఈ పిల్లలు కోట్లలో కొద్దిమంది పిల్లలు, కోట్లలో కొద్ది మంది అయిన వీరికైతే అటెన్షన్ ఉండాలి కదా అని బాప్ దాదా కోరుకుంటున్నారు. అంతిమ పరీక్ష అకస్మాత్తుగా రానున్నదని బాప్ దాదాకు తెలుసు, పరిస్థితులు కూడా అలాగే వస్తాయి కనుక మీరు చేసుకునే చెకింగ్ ను కూడా పరిశీలించుకోండి. బాప్ దాదా కోరుకుంటున్నట్లుగా, వర్ణించినట్లుగా నా చెకింగ్ జరుగుతుందా? వినడమైతే జరుగుతూనే ఉంటుంది, అయినా బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? కనీసం రాత్రి పడుకునే ముందు ప్రతి రోజూ చెకింగ్ తప్పకుండా జరగాలి ఎందుకంటే పనుల కారణంగా అలసిపోతారు కదా, సమయాన్ని ఇస్తారు, కానీ అలసట తన వైపుకు లాగుతుంది. బాప్ దాదా సమయాన్ని చూసి అటెన్షన్ ఇప్పిస్తూ ఉంటారు. అటెన్షన్ పెట్టడంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండద్దు. పురుషార్థాన్ని చాలా విధాలుగా చెయ్యడాన్ని, అటెన్షన్ ను ఇవ్వడాన్ని బాప్ దాదా చూసారు, పూర్తిగా నిర్లక్ష్యంగా కూడా లేరు కానీ సమయం అకస్మాత్తుగా రానుంది, ఎప్పుడైనా సమయం రావచ్చు కనుక బాప్ దాదా జనరల్ గా ఆలోచించి, పిల్లలందరికీ చెప్తున్నారు - అటెన్షన్ ప్లీజ్. ప్రతి సబ్జెక్టులో కనీసం పాస్ మార్కులైతే రావాలి కదా. నంబరు కొంచెం తక్కువగా ఉంది, అది వేరే విషయం కానీ అటెన్షన్ ఉన్నదా, పరివర్తన కూడా ఉన్నదా అని చెక్ చేసుకోండి. నిర్లక్ష్యం రావడం లేదు కదా? అవుతాములే, అవుతాములే... ఇదేమంత పెద్ద విషయం, దీనిని అటెన్షన్లో నిర్లక్ష్యం అని అంటారు. బాప్ దాదా మెజారిటీ పిల్లల పురుషార్థంతో సంతోషంగా ఉన్నారు కానీ మధ్య మధ్యలో మాయ కూడా తన ఛాన్సును తీసుకుంటుంది. బాప్ దాదా అభినందనలు కూడా తెలుపుతున్నారు, దానితో పాటు అటెన్షన్, అటెన్షన్ అంటే నో టెన్షన్. ఏ విధమైన టెన్షన్ వద్దు. సబ్జెక్టు ఏదైనాకానీ అందులో అటెన్షన్ పూర్తిగా ఉండాలి. ఇలా ఉంటే ఫర్వాలేదులే అని అనుకోకండి. ఒక్కోసారి ఒక్క నంబరు తక్కువైనా చాలా నష్టం జరుగుతుంది, కనుక బాప్ దాదా పిల్లలు ఎవ్వరినీ సాధారణ పురుషార్థంలో చూడాలనుకోవడం లేదు. ఈ సంగఠన అయితే మధ్య మధ్యలో జరుగుతూ ఉంటుంది, ఇది మంచిది, సంగఠనను చూసి, బాప్ దాదాను కలుసుకోవడంతో ఉత్సాహంలోకి వస్తారు కానీ ఈ ఉత్సాహం ముందు కూడా నిలచి ఉండాలి, ఇందులో చిన్న చిన్న విషయాలు పురుషార్థాన్ని సమాప్తం చెయ్యడం లేదు కానీ ఢీలా చేస్తున్నాయి. మధ్య మధ్యలో కలుసుకునే కార్యక్రమాలనే ఎక్కువగా పెడ్తుండటాన్ని బాప్ దాదా చూసారు. సమ్ముఖంలో కలుసుకోవడం ద్వారా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి, ఇదైతే బాప్ దాదా కూడా చూస్తున్నారు. కనుక, ప్రతి ఒక్కరూ తమను తాము బాధ్యులుగా భావించి చెక్ చేసుకోండి, మీకు మీరు సావధానంగా ఉండండి.

అందరూ బాగున్నారా, చేతులెత్తండి. చేతులెత్తుతారు, బాప్ దాదా ఇందులో సంతోషిస్తున్నారు కానీ పిల్లలు కూడా చతురులు. ఆ సమయంలో మేము బాగానే ఉన్నాం కదా అందుకే చేతులెత్తాము అని అంటారు, ఇది కూడా నిజమే. కానీ మీరందరూ ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళేవారు, బాగానే ఉన్నారు సరే, బాబా కూడా ఒప్పుకుంటున్నారు కానీ ఈ సర్టిఫికేట్ సదా ఉండాలి అనగా అంతటి అటెన్షన్ స్వయంపై సదా ఉండాలి, అప్పుడు ఏమి జరుగుతుంది? బాప్ దాదా కూడా సంతోషిస్తారు మరియు స్వయం పురుషార్థం చేసేవారు కూడా మంచిగా ఉంటారు. వారితో ఉన్నవారు కూడా మంచిగా ఉంటారు. మరి మంచి పురుషార్థీలు. చేతులెత్తినప్పుడు బాప్ దాదా కూడా సంతోషిస్తారు. చేతులెత్తాము అని అంటారు, అలా చేతులెత్తినప్పుడు ముందు కోసం శక్తి లభిస్తుంది కదా. మీకు మీరే ఆలోచిస్తారు కదా. ఒకవేళ రేపే ఎవరికైనా పేపరు రావచ్చు, అప్పుడు ఎందులో చేతులెత్తాము అని ఆలోచన అయితే వస్తుంది కదా. అప్పుడు కరెక్షన్ చేసుకుని ముందుకు వెళ్తారు. పిల్లలందరూ ఇప్పుడెలా అయితే సంతోషంగా కలిసి కూర్చున్నారో అలాగే అంతిమంలో ఉండాలని ఆశిస్తున్నారు. ప్రతి విషయంలోనూ పాస్, పాస్, పాస్. ఆలోచిస్తాము, చూస్తాము అని అనద్దు. పాస్ అయ్యే ఉన్నారు. మరి ఏమని భావిస్తున్నారు? పాస్ అవ్వాల్సిందే అంటారా లేక కొంచెం కొంచెం అవుతారా! ఇప్పుడు పాస్ అయ్యి చూపిస్తాము అని అనేవారు చేతులెత్తండి. చూడండి, చేతులెత్తడంతో బాప్ దాదా సంతోషిస్తారు. మంచిగా అనిపిస్తుంది, ఉత్సాహం ఉంది కానీ చిన్న చిన్న విషయాలు అడ్డు పడుంటాయి. ఇప్పుడు వీటిని తొలగించే ప్రయత్నం చెయ్యండి. ఇక మీదట ఇలా జరగకూడదు అని కూడా ఆలోచిస్తారు కానీ జరిగిపోతుంటుంది. ఇప్పటివరకున్న రిజల్టు అనుసారంగా ఇప్పటినుండి పరివర్తన జరగాలి అని ఆలోచిస్తుంటే, స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే చేతులెత్తండి. చేతులెంత బాగా ఎత్తుతారంటే బాప్ దాదా సంతోషపడిపోతారు. మంచిది. బాప్ దాదా తోడుగా ఉంటే చేయి కూడా తోడుగా నిలుస్తుంది. కానీ బాప్ దాదాను సదా తోడుగా పెట్టుకోవాలి. ఇదైతే రెండు గంటల తోడు. ఇలాగే సదా తోడు యొక్క అనుభవాన్ని పెట్టుకోండి, అంతే. స్వయాన్ని ఒంటరిగా చేసుకోవద్దు. బాప్ దాదాను సదా తోడుగా పెట్టుకోండి.

మరి ఇప్పుడు అందరూ మరుసటిసారి బాప్ దాదాను కలిసే వరకు చేతిని ఇలాగే ఉంచుతారా? ఇందులో రెండ్రెండు చేతులు ఎత్తండి. మరి ఇప్పుడిక రోజూ రాత్రి బాప్ దాదాను ఎదురుగా పెట్టుకుని, ఇమర్జ్ చేసుకుని మీ రిజల్టును పెంచి బాప్ దాదాను సంతోషపెట్టండి. మనసా, వాచ, కర్మణలో ఎటువంటి పొరపాటు జరగకూడదు, వీలవుతుందా? ఇందులో చేతులెత్తండి. అచ్చా. చేతులైతే ఎత్తారు, దీనికి బాప్ దాదా సంతోషిస్తున్నారు కానీ ఎప్పుడైనా ఏదైనా జరిగితే, మీ తోటివారికి, పురుషార్థీలకు చెప్పి ఇక ముందు కోసం వాగ్దానం చెయ్యండి, ఇతరుల ముందు వాగ్దానం చెయ్యకపోయినా ఫర్వాలేదు, కానీ మీతో మీరైతే చెయ్యచ్చు కదా. బాబాను ఎదురుగా పెట్టుకుని ప్రామిస్ చెయ్యండి ఎందుకంటే రిజల్టులో, ఎంత సమయం ఉన్నారు అని సమయాన్ని కూడా లెక్కించడం జరుగుతుంది కదా. అచ్చా, ఆ సమయంలో అయితే మంచిగా ఉన్నారు, అది కూడా మంచిదే కానీ ఫైనల్ రిజల్టులో సమయాన్ని కూడా చెక్ చెయ్యడం జరుగుతుంది కదా! కనుక ఇప్పుడు మీతో మీరు రోజూ రాత్రి ఈ సభను మరియు ఈ చేతిని ఇమర్జ్ చేసుకోండి, నేను బాబా ఎదుట ఎందులో చెయ్యి ఎత్తాను, పరివర్తన అవుతాను అనా లేక ఆలోచిస్తాను అనా? మరి ఇంత ధైర్యం ఉందా? ఈ రోజు నుండి, సంపూర్ణంగా అవ్వాలని ఏదైతే ఆలోచించారో ఆ ఆలోచన అవినాశిగా ఉండాలి. వీలవుతుందా? గడిచినదేదో గడిచిపోయింది. ఈరోజు మీ హృదయంతో సభ మధ్యలో స్వయాన్ని చూసుకుంటూ, అందరూ చూస్తున్నారు అని ఆలోచించద్దు, బాబా ఎదుట వాగ్దానం చేస్తున్నాను, బాబా చూసారు అంటే అందరూ చూసినట్లే. ఇది వీలవుతుందా? ఎవరిలో అయితే ధైర్యం ఉందో, ఇక ముందు మధ్య మధ్యలో ఏ కారణం చేతనైనా, కారణాలైతే వస్తూ ఉంటాయి కానీ కారణం ఏదైనా కానీ సంపూర్ణత సీట్ ను విడిచిపెట్టము అని అనుకునే వారు చేతులెత్తండి. అచ్చా, అభినందనలు. ఇప్పుడు ఎవరైతే చేతులెత్తలేదో, వారికి సిగ్గుగా అనిపిస్తుంది కనుక ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి, చెయ్యి ఎత్తి చేసి చూపిస్తాము అనేవారు చేతులెత్తండి. చేతులు ఎందుకు ఎత్తిస్తామంటే, బాబాకైతే రిజల్టు తెలుసు కానీ చేయి ఎత్తితే దాని వలన సహాయం లభిస్తుంది. ఇంత సంగఠన మధ్య చేతులెత్తారు, ఇది మామూలు విషయమా! కనుక, ఇప్పుడు పరివర్తన అంటే ఏమిటి అని ఆలోచించండి. అచ్ఛా, ఇప్పుడు సాహసం అయితే చేసారు కదా. ఇటువంటి వాగ్దానం చేసి కూడా చెయ్యకపోతే, కనీసం ఆ లైన్ లోకైతే వస్తారు కదా. కనుక, ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే సభ మధ్యలో చేయి ఎత్తాము కదా అని గుర్తు తెచ్చుకోండి. స్వయానికే లాభం. బాబాకైతే సంతోషం ఉంటుంది కానీ చెయ్యాల్సింది మీరే కదా. ఎప్పుడైనా పరిస్థితి వస్తే మీ చేతిని గుర్తు తెచ్చుకోండి. సహాయం లభిస్తుంది. ఊరికే గుర్తు తెచ్చుకుంటే కాదు. ఇంతమంది సోదరీ సోదరుల మధ్య మీ మీ మనసుతో వాగ్దానం చేసారు, ఆ సహాయం లభిస్తుంది. ఎందుకంటే బాప్ దాదాకు తెలుసు ఇక్కడ హాజరైన పిల్లలందరూ ధైర్యాన్ని ఉంచారు అని. అవ్వాలి అని అయితే కోరుకుంటున్నారు కదా, లేకపోతే చేతులు ఎందుకు ఎత్తుతారు. చేతులెత్తకపోతే ఎవరు చూస్తారు, కానీ ఆలోచిస్తారు, ధైర్యాన్ని ఉంచుతారు, ఆ ధైర్యాన్ని నీటిగా అందిస్తూ ఉండండి. వాగ్దానం చేసాక దానిని మర్చిపోతుంటారు. ఎంతమంది సభలో చేయిని ఎత్తారు అని సదా గుర్తుంచుకోండి. బాబా అయితే ఉండనే ఉన్నారు. బాబా ఎదుటనే కాదు, ఇంతమంది బ్రాహ్మణుల మధ్య సంకల్పం చేసారు, దీనిని తేలికగా తీసుకోవద్దు. కోరుకుంటున్నారు కనుకనే చేయి ఎత్తారు. చేయి ఎత్తలేదు అని కొందరు అంటారు. నా మనసులోని కోరిక ప్రకారంగా చేయి ఎత్తాను అంటారు, దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. పరిస్థితిని చూడకుండా ముందుకు సాగే విషయాన్ని ఆలోచించండి. అయిపోతుంది. ఇంకెవరు అవుతారు! మీరే కదా తయారయ్యేది! కనుక మీపై మీరు విశ్వాసాన్ని ఉంచండి, ఏదైతే చెప్పారో దానిని చేసి చూపించాలి. సరేనా! మీరు మాట్లాడింది గుర్తుంచుకోండి అని సామెత కూడా ఉంది కదా, ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఆ సమయంలో ఇప్పటి ఈ సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి ఎందుకంటే ఇప్పుడు కూడా అవ్వాలి అని ఏదైతే చెప్తున్నారో, అది మనసులో కోరిక ఉంది కనుకనే చెప్తున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు పక్కా చేసుకుంటూ ఉండండి. నేను చేసిన సంకల్పం ఏమిటి అన్న దృశ్యాన్ని అమృతవేళ గుర్తు తెచ్చుకోండి. బాప్ దాదా మరియు ఇంతమంది సోదరీ సోదరులు మిమ్మల్ని చూసి సంతోషించారు, అంటే ఇంతమందికి మీరు సంతోషాన్ని ఇచ్చారు. అవును అని చేతులెత్తారు, అందరూ సంతోషించారు. మరి ఇంతమంది సోదరీ సోదరుల సంతోషాన్ని మర్చిపోవద్దు. గుర్తుంచుకోగలరు కదా. నేను ఫలానా ఫలానా వాతావరణంలో అనుభవం చేసాను అని గుర్తుంచుకోగలరు కదా? పరివర్తన జరగాల్సి ఉంది. పరివర్తన లేనిదే అక్కడ కూడా కలిసి ఉండరు, దూరదూరంగా ఉంటారు. అప్పుడు మంచిగా అనిపిస్తుందా? సత్యయుగంలో అయితే తెలీదు అని అనుకున్నా కానీ, ఇక్కడ అంతిమంలో రిజల్టులో ఏ నంబరు వచ్చిందని తెలిస్తే, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా మంచిగా అనిపించదు. అందుకే సంకల్పం దృఢంగా చేసుకోండి. పరిస్థితులు వస్తాయి, ఇదైతే తెలిసిందే, అనుభవం ఉన్నవారే. చెయ్యాల్సిందే, సంపూర్ణంగా అవ్వవలసిందే, ఈ నిశ్చయాన్ని పెట్టుకోండి. లక్ష్యం ఏమిటి? ఇంతమంది ఇక్కడ కూర్చుని ఉన్నారు, ఎంతమంది ఇలా వస్తున్నారు? మరి లక్ష్యం ఏమిటి? సంపూర్ణంగా అవ్వడం కదా! ప్రతి ఒక్కరినీ చూడండి, రాత్రి నోట్ చేసుకోండి, ఏ లక్ష్యం గురించైతే చేతులెత్తానో ఆ లక్ష్యం అనుసారంగానే రోజంతా లక్షణాలు ఉన్నాయా? స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇతరులు చేసినా చేయకపోయినా కానీ, మిమ్మల్ని మీరైతే చెక్ చేసుకోండి.

అందరూ సంతోషంగా ఉన్నారా, ఎంత సంతోషంగా ఉన్నారు? మంచిది. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఇది కలియుగ అంతిమమైనా కానీ సంతోషంగా అయితే ఉన్నారు కదా. సంతోషంగా ఉన్నారు మరియు సదా సంతోషంగా ఉంటారు. నిజమే చెప్పామా! ఇందులో రెండు రెండు చేతులు ఎత్తండి. అచ్చా. ఇప్పుడు ఇక ఏ విషయం వచ్చినా కానీ, నేను సభలో ఇంతమంది బ్రాహ్మణుల మధ్య చెయ్యి ఎత్తాను అని గుర్తు తెచ్చుకోండి. చెయ్యి అయితే ఎత్తారు కదా ఇప్పుడు. ఇందులో పక్కాగా ఉండండి ఎందుకంటే సత్యయుగంలో కూడా కలిసి ఉండాలి కదా లేక విడిగా ఉంటారా! కలిసి ఉంటారు కదా. రాజ్యం చేసినా కానీ కలిసి చేస్తారు కదా. వేరుగా ఎక్కడ ఉంటారు? కనుక మీ తోడు అర్థ కల్పం ఉంటుందని సదా గుర్తుంచుకోండి. తర్వాత ఏమి జరిగినా కానీ అర్థ కల్పమైతే కలిసి ఉంటారు. ఎవరైతే నిశ్చయబుద్దితో ఉన్నారో వారు ఏమని అనుకుంటారు - ఆరంభం నుండి చివరి వరకు భిన్న భిన్న రూపాలలో కలిసి ఉంటాము. బాప్ దాదా పిల్లలు ఒక్కరిని కూడా వేరు చెయ్యాలని అనుకోవడం లేదు. పిల్లలు ప్రతి ఒక్కరూ రోజూ అమృతవేళ గుర్తు తెచ్చుకోండి - కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము, కలిసి రాజ్యం చేస్తాము. మంచిది. బాప్ దాదాకు సంగఠన మంచిగా అనిపిస్తుంది. సమానంగా అయితే ఇలాగే సత్యయుగంలో కూడా కలిసి ఉంటారు. పరస్పరంలో వస్తారు, వెళ్తారు, కలుసుకుంటారు. అందరూ కలిసి ఉన్నారు కదా. కలిసి ఉన్నారు, చేతులెత్తండి. మంచిది. పరస్పరంలో సహచరులు కలిసి ఉంటారు, ఎంత బాగుంది. వేరుగా ఉన్నప్పటికీ మనసు యొక్క తోడు ఉంటుంది. డ్రెస్ ఛేంజ్ అవుతుంది కానీ మనసు ఛేంజ్ అవ్వదు. అచ్చా. ఇక మళ్ళీ కలుద్దాం. 

సేవ టర్న్ గుజరాత్ వారిది, 15వేల మంది సోదరీ సోదరులు వచ్చారు: - మంచిది. ఇప్పుడు కూడా గుజరాత్ ఎక్కువగా ఉంది. వారి టర్న్ కదా. గుజరాత్ విశేషత ఒకటి ఉంది, ఆ విశేషత ఏమిటంటే వారు కలిసి ఉంటారు అలాగే హృదయంలో కూడా కలిసి ఉన్నారు. ఏదైనా ఆజ్ఞ ఇస్తే గుజరాత్ వచ్చేస్తుంది. సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది కూడా సేవా ఫలితమే. గుజరాత్ లో సంఖ్య బాగుంది. మంచిది, గుజరాత్ దగ్గరగా కూడా ఉంది, ప్రతి విషయంలోనూ తోడుగా నిలుస్తారు. 

డబుల్ విదేశీయులు 500 మంది సోదరీసోదరులు వచ్చారు:- మంచిది. డబుల్ విదేశీయులు, విదేశాల నుండి వచ్చినా కానీ దేశం వారే, వారు లేవండి. అచ్చా.

ఒక్క నిమిషం సైలెన్స్. హాలులో ఎవ్వరూ లేనట్లుగా అనిపించాలి. 

నలువైపుల ఉన్న పిల్లలకు, ప్రతి ఒక్కరికీ బాప్ దాదా విశేషంగా ప్రియస్మృతులు ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి బాప్ దాదా ఎంతో సంతోషిస్తున్నారు, ఎక్కడి వారైనా కానీ, విదేశం కావచ్చు, దేశం కావచ్చు కానీ బాబాకైతే అయ్యారు, ఈ సంతోషం పిల్లలందరికీ ఉంది. 

(న్యూయార్క్ మోహినీ అక్కయ్య స్మృతిని అందించారు, మోకాళ్ళ ఆపరేషన్ జరిగింది) - మంచిగా అయిపోతారు, ఏమీ ఫర్వాలేదు, నడిచేస్తారు, అందరికంటే ముందుంటారు, ఉత్సాహం ఉంది, ఉత్సాహం కారణంగానే నడుస్తారు. 

దాదీ జానకితో: - (బాబా, దాదీకి శరీరం ద్వారా చాలా పెద్ద పేపర్ వచ్చింది, మీరేదైనా మాయ చెయ్యండి) అరె, బాబా వేరుగా లేనే లేరు. మాయ అయితే చేస్తూనే ఉన్నారు. పూర్తి యజ్ఞం తోడుగా ఉంది, ఏమి జరిగినా కానీ యజ్ఞానికి మూర్తి వంటివారు. మిమ్మల్ని చూసి అందరికీ ఉత్సాహం కలుగుతుంది. నిమిత్తంగా ఉన్నారు.

Comments