24-10-2013 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
”వర్తమాన వాయుమండలం అనుసారంగా మనసా శక్తి ద్వారా పవర్‌ఫుల్ సకాశ్ ఇచ్చేసేవను చెయ్యండి, వృత్తి ద్వారా వృత్తులను పరివర్తన చెయ్యండి”
పిల్లలు ప్రతి ఒక్కరి ప్రేమ బాబాకు చేరుకుంటుంది. ప్రేమకు స్పందిస్తూ బాప్ దాదా కూడా పిల్లలందరికీ పదమారెట్ల ప్రేమను ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో ఇమిడి ఉన్నారు. బాప్ దాదా కూడా స్నేహీ పిల్లలను చూసి పదే పదే మనసులో వాహ్ పిల్లలూ వాహ్! అని అనుకుంటున్నారు. పిల్లలు లేకపోతే బాబాకు బోసిగా అనిపిస్తుంది, అలాగే పిల్లలకు కూడా బాబా లేకపోతే బోసిగా అనిపిస్తుంది.
ఈ రోజు పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో బాబా స్నేహం ఇమిడి ఉంది. బాబా హృదయం పిల్లలందరినీ వాహ్ పిల్లలూ వాహ్ అని అంటుంది. ఈరోజు విశేషంగా డబుల్ విదేశీయుల మిలనము రోజు. బాప్ దాదా విదేశీ సేవలతో సంతుష్టంగా ఉన్నారు. భారతదేశ సేవ కూడా తక్కువేమీ కాదు. కానీ ఈనాటి ప్రమాణంగా బాప్ దాదా విదేశీ సేవల విస్తారం బాగా జరగడాన్ని చూసారు. తప్పిపోయిన మంచి మంచి పిల్లలు తమ వారసత్వాన్ని తీసుకోవడానికి వస్తున్నారు. సమయము తన దృశ్యాలను చూపిస్తుంది కానీ పిల్లలు, దేశం వారైనా, విదేశీయులైనా, తమ సేవలో ముందుకు వెళ్తున్నారు. బాప్ దాదా పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు. ప్రతి శ్రేష్ఠ కార్యం యొక్క రిజల్టును చూసి మనస్ఫూర్తిగా వాహ్ పిల్లలూ వాహ్! అని అంటున్నారు. డబుల్ విదేశీయులు కూడా నలువైపులా సందేశాన్ని ఇవ్వడంలో, పరిచయాన్ని ఇవ్వడంలో తక్కువగా ఏమీ లేరు. అలాగే భారతదేశ పిల్లలు కూడా సేవలో తక్కువగా లేరు. బాప్ దాదా ఇద్దరి సేవలనూ చూసి సంతోషిస్తున్నారు. అలాగే మానసిక స్థితిలో కూడా నంబరువారీగా ఉన్నారు. ఇప్పుడు స్వ స్థితి మరియు సేవా స్థితి రెండింటిలో తీవ్రంగా ఉండాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సదా అచలంగా, నిశ్చలంగా ఉండి మున్ముందుకు సాగాలని బాప్ దాదా కోరుకుంటున్నారు. ప్రపంచ వాయుమండలం అనుసారంగా ఇప్పుడు పిల్లలు మెజారిటీ పవర్ ఫుల్ సకాష్ తో వాయుమండలాన్ని పరివర్తన చేసే మనసా శక్తి ఈ సమయంలో అవసరముంది. మనసా శక్తిని మరింత పవర్‌ఫుల్ గా చేసి మనసా శక్తి ద్వారా ఈ రోజుల్లో కలిగే ప్రభావాలను పరివర్తన చేయడంపై ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం అవసరము. ఈరోజుల్లో వినడము మరియు వినిపించే శక్తికి బదులుగా వృత్తి ద్వారా వృత్తులను మార్చే అవసరముంది. వృత్తులను (ఆలోచనా విధానాలను) మార్చే శక్తిని ఇంకా ఎక్కువగా కార్యంలో వినియోగించాల్సి ఉండటాన్ని బాప్ దాదా చూసారు.
మరి ఈరోజు డబుల్ విదేశీయుల విశేషమైన రోజు. బాప్ దాదా డబుల్ విదేశీయులకు పదమారెట్లు శభాష్ చెప్తున్నారు. ఎందుకని? దేశంవారు కూడా తక్కువ కాదు. కానీ విదేశాల వాతావరణం అనుసారంగా సేవ యొక్క వృద్ధిని బాగా చేస్తున్నారు కావున ఈ రోజు విశేషంగా వారి రోజు. బాప్ దాదా అన్ని విదేశాలను చుట్టి వచ్చినప్పుడు మెజారిటీ సేవపై అటెన్షన్ ఉంచటాన్ని చూసారు. భారతదేశం కూడా తక్కువ కాదు, భారతదేశం వారు కూడా భిన్న భిన్న కార్యక్రమాలు, భిన్న భిన్న ఉల్లాస ఉత్సాహాలను కలిగించే సాధనాలను తయారు చేస్తున్నారు. బాప్ దాదా సేవను చూసి రెండు వైపులా సంతోషిస్తున్నారు కానీ వర్తమాన వాతావరణం అనుసారంగా మనసా శక్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే అవసరం ఉంది. ఇకపోతే బాప్ దాదా పిల్లల ఉల్లాసాన్ని చూసి సంతోషిస్తున్నారు.
మీరందరూ కూడా, దేశం వారు కావచ్చు, విదేశం వారు కావచ్చు, పిల్లలందరూ తమ స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతిని చూసి సంతోషిస్తున్నారా? ఇప్పుడు మనసా శక్తి ద్వారా వైబ్రేషన్లను, వాతావరణాన్ని ఛేంజ్ చేసే అవసరముంది. ఇది వినడము, వినిపించడం వలన జరగదు. కానీ మీ మనసులోని శుభ కామన మనుష్యుల వృత్తిని, దృష్టిని, కృతిని పరివర్తన చెయ్యగలదు. మరి ఈరోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ, దేశం వారు మరియు విదేశం వారు అందరికీ సేవల వృద్ధి కోసం అభినందనలు తెలుపుతున్నారు. అచ్చా.
విదేశీయులు పరస్పరంలో మంచి సంగఠనను ఏర్పాటు చేసుకుని సేవల గురించి చర్చ జరుపుకుని చక్కగా ముందుకు సాగుతున్నారు. మధువనంలో మంచి అవకాశం లభిస్తుంది. పరస్పరంలో కలుసుకోవడానికి, పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేసుకోవడానికి, సేవా ప్లాన్లు వేసుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. పిల్లలు ఎలా పరస్పరంలో సంగఠన ఏర్పాటు చేసుకుని సేవలో ముందుకు వెళ్తున్నారో అంతా బాగా చూస్తున్నారు. బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. భారతదేశం కూడా తక్కువేమీ కాదు. బాప్ దాదా ఇద్దరినీ చూస్తున్నారు. సేవ పట్ల ఉల్లాస ఉత్సాహాలు రెండు వైపులా మంచిగా ఉన్నాయి. రిజల్టు కూడా బాగుంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు స్వరాజ్యాధికారిగా అయ్యే విధిని, ఆ విధిని ప్రాక్టికల్ లో అనుభవం చేసే దిశగా అటెన్షన్ ఉంచండి. మనసా శక్తి ద్వారా పరివర్తన చెయ్యడం, మానసిక వృత్తులను పరివర్తన చెయ్యడం ఇప్పుడు అవసరం. ఇప్పుడు నలువైపులా భ్రష్టాచారం, భ్రష్టాచారం యొక్క మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వాతావరణాన్ని మనసా శక్తి ద్వారా పరివర్తన చేసి అందరి మనసులలో పరమాత్మ స్మృతి పట్ల ఉల్లాస ఉత్సాహాలను పెంపొందించండి. అచ్చా. ఇప్పుడు ఏమి చెయ్యాలి?
1) యు.కె, యూరప్, మిడిల్ ఈస్ట్:- ఒక్కొక్క రత్నము మహాన్ మరియు మహావీర్ ఉన్నారు, బాప్ దాదా ఒక్కొక్క మహావీర్ సంతానమునకు విశేషంగా హృదయపూర్వక ప్రియస్మృతులను తెలుపుతున్నారు. బాగుంది, సంగఠన పెరుగుతూ ఉంది, ఇందుకు అభినందనలు. అచ్చా.
2) ఆస్ట్రేలియా, ఆసియా:- మంచి సంగఠన ఇది. బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి, పిల్లలు ఒక్కొక్కరి గుణాలను హృదయంలో గానం చేస్తున్నారు. వాహ్ పిల్లలూ వాహ్!
3) అమెరికా, కరేబియన్ తో సహా:- బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి, వారి భాగ్యాన్ని చూసి వాహ్! ప్రతి ఒక్కరి భాగ్యము! అని సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరి మహిమ చాలా గొప్పగా ఉంది. చాలా చక్కని సంగఠనలో కలిసి వచ్చారు, ఎన్ని అడుగులు వేసారో అన్ని పదమాలు జమ చేసుకున్నారు కావున పిల్లలు ప్రతి ఒక్కరికీ, ఎంత మంది కూర్చుని ఉన్నారో, దేశం వారు కావచ్చు. విదేశం వారు కావచ్చు, పిల్లలు ప్రతి ఒక్కరికీ బాప్ దాదా పదమారెట్ల అభినందనలు తెలుపుతున్నారు.
4) ఆఫ్రికా, మారిషస్:- చేతులూపండి. సదా ముందుకు వెళ్తూ ఇతరులను ముందుకు తీసుకువెళ్ళే ఆత్మలు. బాప్ దాదా పిల్లల వర్తమానము మరియు భవిష్యత్తును చూసి సంతోషిస్తున్నారు. సదా ముందుకు వెళ్తూ, అందరినీ ముందుకు తీసుకువెళ్ళండి. ఎవరైనా కొంచం బలహీనంగా ఉంటే వారికి మీ సహయోగము ద్వారా, మీ ద్వారా లేక పెద్దల ద్వారా సహయోగాన్ని అందిస్తూ ఉండండి. పరోపకారిగా అయ్యి స్వ ఉపకారము మరియు పర-ఉపకారము రెండింటిపై అటెన్షన్ ఉంచుతూ మున్ముందుకు వెళ్తున్నామా అని పరిశీలించుకుంటూ, ముందుకు సాగుతూ ఉండండి మరియు ముందుకు తీసుకువెళ్తూ కూడా ఉండండి. బాప్ దాదా పూర్తి విదేశీయుల గ్రూపును చూసి సంతోషిస్తున్నారు. వృద్ధిని పొంది విధిపూర్వకంగా ఎగురుతున్నారు, ఎగురుతూ ఉంటారు.
5) రష్యా:- టీచర్లు, వీరి కోసం చప్పట్లు కొట్టండి. టీచర్లు అంటే వారి ఫీచర్ల ద్వారా (ముఖము ద్వారా) బాప్ దాదా కనిపించాలి. వారి నయనాలతో, వారి ప్రతి మాటతో నా బాబా, ప్రియమైన బాబా అనుభవం కావాలి. టీచర్లను చూడకూడదు, టీచర్లలో బాగా కనిపించాలి. ఇలా ఉన్నారు. ముందుకు వెళ్ళండి మరియు ముందుకు తీసుకువెళ్తూ బాబా సమానంగా తయారు చేస్తూ ఉండండి అని బాప్ దాదా ప్రతి టీచరకు చెప్తున్నారు. వాహ్ టీచర్లు వాహ్! కృషికి ఫలితాన్ని చూస్తున్నారు. మీ కృషికి ఫలితాన్ని చూస్తున్నారా! చాలా బాగుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫీచర్స్ లో ఫ్యూచర్ (భవిష్యత్తు) కనిపించేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చెయ్యండి. ఆశా దీపాలుగా కనిపించాలి. ఇప్పుడిక మన రాజ్యం వచ్చేసినట్లే. ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలు ప్రతి ఒక్కరి ఫీచర్స్ లో కనిపించాలి. చాలా మంచిది.
మొదటిసారి వచ్చిన డబుల్ విదేశీయులు:- మీ ఇంటికి స్వాగతం. తప్పిపోయిన పిల్లలు తమ వారసత్వాన్ని తీసుకోవడానికి ఇంటికి చేరుకుంటున్నందుకు బాప్ దాదాకు చాలా సంతోషంగా ఉంది. అందరి తరఫున, మొత్తం పరివారం తరఫున మీ అందరికీ కోటానురెట్ల అభినందనలు, అభినందనలు.
టీచర్లకు టీచరు ఎవరు? బాప్ దాదా అయితే ఉన్నారు కానీ బాప్ దాదాకు మీరు కూడా (దాదీ జానకి) సహచరులు కదా. మంచి అటెన్షన్ ను ఉంచుతున్నారు. భారతదేశ టీచర్లు కావచ్చు, విదేశాల టీచర్లు కావచ్చు, టీచర్లందరికీ ఈరోజు బాప్ దాదా హృదయపూర్వక ప్రేమను అందిస్తున్నారు. అచ్చా. ఈరోజు డబుల్ విదేశీయుల రోజు. బాప్ దాదాకు సంతోషంగా ఉంది, సదా సంతోషంగా అయితే ఉంటారు కానీ ఈరోజు సంతోషంలో మరో సంతోషం. భారతదేశ పిల్లలందరికీ విదేశీ సేవను చూసి సంతోషం కలుగుతుంది కదా? సంతోషమే కదా? బాప్ దాదాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకని? విశ్వానికి తండ్రి కదా. భారతదేశానికి మాత్రమే తండ్రి కాదు, విశ్వానికి తండ్రి. విశ్వ పితను ప్రత్యక్షం చేసేది ఈ భిన్న భిన్న విదేశీ పిల్లలే. కావున ఈరోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ అభినందనలు కూడా తెలుపుతున్నారు, వాహ్ సేవాధారీ పిల్లలూ వాహ్! అచ్ఛా (బాప్ దాదా దృష్టి ఇచ్చి వెళ్ళిపోయారు, మళ్ళీ ఆహ్వానించడం జరిగింది).
దాదీలతో:- దాగుడు మూతలాట జరిగింది (బాబా, మీరింత సంతోషాన్నిచ్చారు, నేనేమి ఇవ్వను అని దాదీ జానకి అడిగారు) మీరు అంతా ఇచ్చేసారు. ఏమీ లేనేలేదు, అంతా ఇచ్చేసారు.
విదేశీ సోదరీలతో:- మంచి పూదోటను తయారుచేసారు, బాప్ దాదాకు నచ్చింది. మంచి ఉల్లాస ఉత్సాహాలతో నడుస్తున్నారు. మీ అందరి కృషికి మంచి ఫలితము వచ్చింది.
అందరికీ విశేషమైన ప్రియస్మృతులు. సేవకు అభినందనలు. సదా ముందుకు వెళ్తూ ఉండండి, తీసుకెళ్తూ ఉండండి.
కమల మణి దాదీతో :- బాగున్నారు, ఇప్పుడిక లేవండి. మంచం మీదకు వెళ్ళకండి. కూర్చుని సేవ చెయ్యండి.
రుక్మిణి దాదీతో :- బాగున్నారు కదా. ఎంత ఆరోగ్యాన్ని నడిపించగలరో అంతగా నడిపించండి. ఎక్కువ పని చెయ్యకండి. మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడింకా సమయముంది కదా. మీరింకా సేవ చెయ్యాలి. సంభాళించుకోండి, సేవ కూడా చెయ్యండి. చక్కగా సంభాళించుకోండి.
చంద్రా అక్కయ్య (మారిషస్):- మంచి పాత్రను వహించారు. బాగున్నారు కదా. ప్రతి రోజూ అమృతవేళ లేచి వాహ్ బాబా, వాహ్ నా బాబా వాహ్ అని అంటూ ఉండండి. శరీరంలో శక్తి ఉన్నంత వరకు కూర్చునే సేవనను చెయ్యండి. క్లాస్ చేయించద్దు కానీ పర్సనల్ సేవ చెయ్యండి. నిర్విఘ్నంగా ఉన్నారు.
మోహినీ అక్కయ్య:- ఇప్పుడింకా ఆయుష్షు ఉంది, అందుకే నడుస్తారు.
చార్లీ అన్నయ్య:- మంచి సేవను చేస్తున్నారు. (ఆంటీ మరియు పరివారము యొక్క స్మృతిని గాయత్రి అక్కయ్య అందించారు) బాప్ దాదా యొక్క అమితమైన ప్రేమను వారికి అందించండి. బాగున్నారు. శక్తి ఉన్నంతవరకు మంచిగా తమను నడిపించుకుంటున్నారు. అలాగే వీలైనంత మనసా సేవను చేస్తున్నారు. సేవ లేకుండా ఉండేవారు కాదు. మంచిది.
దీపావళి సందర్భంగా బాప్ దాదా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు:- విశ్వంలోని నలువైపులా ఉన్న మధురాతి మధురమైన ప్రియ సంతానానికి ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్. రాబోయే దీపావళి, మీరైతే చైతన్యమైన దీపాలు, మరి రాబోయే దీపావళి కోసం వెలిగే చైతన్య దీపాలైన మీకు చాలా చాలా చాలా శుభాకాంక్షలు. నలువైపులా ఉన్న పిల్లలకు, దేశం వారైనా, విదేశం వారైనా, పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓ.కే. ఓ.కే. సదా ఓ.కే. ఏ చింత ఉంది! చింత వస్తే బాబాకు ఇచ్చేయండి. మీరు సదా ఓ.కే. దీపావళి యొక్క దీపాలమైన మేము సదా వెలుగుతూ ఉంటాము, వేలిగే ఉంటాము మరియు మన రాజ్యంలోకి వెళ్ళి అక్కడ కూడా దీపావళి జరుపుకుంటాము అని అందరి లక్ష్యము ఉంది కదా. మీ రాజ్యము గుర్తుంది కదా. ఇక వచ్చేసినట్లే.
(ఇక్కడి దీపావళికి, అక్కడి దీపావళికి తేడా ఏమిటి) అక్కడి అలంకారమే చాలా అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. అలంకారము మరియు ప్రేమ, హృదయపూర్వక ప్రేమ. ఇక్కడైతే చిర్రుబుర్రులాడే వారు కూడా దీపాలను వెలిగిస్తారు కానీ అక్కడ అందరూ సంతోషంగా దీపాలను వెలిగిస్తారు, ఆనందాలను జరుపుకుంటారు, ఆనందాల రాజ్యము. ఇక్కడైతే తప్పదని కూడా వెలిగిస్తూ ఉంటారు. (అక్కడ దీపావళి జరుపుకోవడానికి మీకు ఆహ్వానము పలుకుతున్నాము) చూస్తాము. చెయ్యము, కానీ దూరం నుండి చూస్తాము. మీరు వెలిగిస్తారు, బాబా చూస్తారు. (బాప్ దాదా అక్కడకు వచ్చి మాతో దీపావళి జరుపుకుంటే బాగుంటుంది) అక్కడ పిల్లల పాత్ర ఉంటుంది. అచ్ఛా.
నలువైపులా ఉన్న మధురాతి మధురమైన ప్రియ సంతానమునకు ఈనాటి ప్రియస్మృతులు మరియు దీపావళి ప్రియస్మృతులు.
Comments
Post a Comment