24-02-2017 అవ్యక్త మురళి

  24-02-2017         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“మాల మీ విశేషమైన స్మృతిచిహ్నము, ఈ మాలను ధరించి సదా మాలధారులుగా అయి ఉండండి, మెరుస్తున్న ఈ మాలయే ఈనాటి విశేషమైన బహుమతి"

(శివ జయంతి సందర్భంగా పూర్తి హాలును చాలా సుందరమైన మాలలతో, జెండాలతో అలంకరించడం జరిగింది. బాప్ దాదా పిల్లల విశేష సభను చూసి పిల్లలందరి మెడలో బాహువుల మెరిసే మాలను వేస్తున్నారు)

ఈరోజు శివ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అందరి హృదయాలలో ఎంత సంతోషం ఉంది? అందరి హృదయాలలోకి బాబా వచ్చేసారు. అందరి హృదయాలలో ఇప్పుడు ఎవరు ఉన్నారు? బాబా. కేవలం బాబానే చూడండి. ఎక్కడ చూస్తే అక్కడ బాబాయే బాబా, బాబాయే బాబా, బాబాయే బాబా. మరి ఈరోజు అందరూ చాలా హర్షితులవుతున్నారు. ఎందుకని? బాబా స్వయంగా పిల్లలకు మాలను వెయ్యడానికి వచ్చారు. అందరూ మాలధారులుగా ఎంతో శోభాయమానంగా ఉన్నారు. అందరూ ఒకరి మాలను ఒకరు చూసుకుని సంతోషిస్తున్నారు. సదా బాప్ దాదా తరఫు నుండి మాల తప్పకుండా ఉంటుంది. మాలతో కూడిన మన స్మృతిచిహ్నము ఎంతగానో గాయనం చెయ్యబడ్డది కనుక ఈ రోజు కూడా ఆ స్మృతిచిహ్నము గుర్తుకు వచ్చింది. మాలలోని పూసలను ధరించి ఉన్న అందరూ ఎంతో ప్రకాశిస్తున్నారు. వాహ్! అద్భుతము! అక్కడక్కడ మాలలను వేసారు, హాలు పూర్తిగా మాలలతో అలంకరింపబడి ఉంది. మరి మాలల స్మృతిచిహ్నము ఎవరిది? తండ్రి మరియు పిల్లలది. ఎవరు ఎంత చెప్పినా కానీ, బాబా స్మృతి చాలా చాలా మంచిది. బాబా స్మృతి అయితే ఉండనే ఉన్నది, బాబా లేకుండా మీరు ఏమి చేస్తారు? ఉన్నదే స్మృతిచిహ్నము. మొదటి నంబరు స్మృతిచిహ్నము సోదరసోదరీలది. వారు నిజంగా ఎంతో శ్రమ చేసి తమను కూడా అలంకరించుకున్నారు మరియు హాలును కూడా అలంకరించారు. నలువైపుల సంతోషపు మేళా జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎంత మంచి ఫంక్షన్ అనిపిస్తుంది, ఇప్పుడిప్పుడే బాబా మిమ్మల్ని మాలలతో అలంకరించి కూర్చోబెట్టినట్లుగా ఉంది. ఎందుకంటే బాబాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. బాబాతో పాటు సోదరులు, సోదరీలు అందరూ కొంతైనా అలంకరించుకోవాలి. మీ మాలలు దూరంనుండే అలంకరింపబడి ఉన్నాయి. బాబా కూడా చూస్తూ చూస్తూ, నలువైపుల ఉన్న మాలలను చూసి ఎంతో సంతోషిస్తున్నారు. వాహ్! ఈరోజు పిల్లలు మాలలోని పూసలను ధరించి ఎంతగానో అలంకరింపబడి ఉన్నారు. ఈనాటి సభలోని అలంకారాన్ని చూసి బాబా సంతోషిస్తున్నారు వాహ్ నా పిల్లలు వాహ్! ఒకరికొకరు తమ అలంకారాన్ని చూసుకుని సంతోషిస్తున్నారు. మరి బాబాకు ఎంత సంతోషంగా ఉండి ఉండవచ్చు! పిల్లలు ఒక్కొక్కరిని చూస్తూ బాబా కూడా ఎలా చిరునవ్వు చిందిస్తారంటే అది మీరు చూస్తూనే ఉన్నారు. ఇది రియల్ పుష్పాల హారమే కానీ బాబా పిల్లలందరి మెడలో ఎటువంటి ఒరిజినల్ (నిజమైన) మాలను వేసారు? మెరుస్తున్న మాలల హారం చూడండి అందరి మెడలో ఉంది. పూలతో అలంకరణ చేసినా చెయ్యకపోయినా కానీ అందరి నోటి నుండి వాహ్ వాహ్ అని వెలువడుతుంది. అదే మాల. ఈ మాల ఎంత అలంకరింపబడి ఉంది. మాల అలంకరణ. ఈ దేశంలో ఇప్పుడు అందరికన్నా ఎక్కువ అలంకారం ఎవరికి ఉంది? బాబాకు. అందరి మెడలో హారము ఉంది చూడండి. బాబాయే స్వయంగా మాలల హారాన్ని వేసారు. సాధారణ హారమైతే వేస్తూనే ఉంటారు, అది సాధారణమే, కానీ ఈ మాల యొక్క అర్థం మంచిది, గొప్పది. ఈ మాల స్మృతిచిహ్న మాల. అందరినీ చూడండి, అందరి ముఖాలు ఎంతగానో ప్రకాశిస్తున్నాయి. ఒకరినొకరు చూసుకోండి. ఎన్ని కంఠములు కంఠహారాలతో అలంకరింపడి ఉన్నాయో చూడండి. అందరి కంఠములను చూసి అందరూ ఎంతో సంతోషిస్తున్నారు, వాహ్!వాహ్! అందరూ మాలధారులుగా ఉన్నారు, అందరి ముఖాలు ఎలా ఉన్నాయి? ఎర్ర ఎర్రగా ఉన్నాయి. మరి ఇటువంటి మాలలతో అలంకరింపబడి ప్రకాశిస్తున్న మాలధారి పిల్లలు, ఇక్కడకు వచ్చి చూడండి. పూర్తిగా ప్రకాశిస్తున్న మాలలు కనిపిస్తాయి. అందరి మాలలు మెరుస్తున్నాయి. అందరి మెడలో బాబా తరఫు నుండి లభించిన మాలలు ఉన్నాయి. అందరి మెడలో ఉన్నాయి. ఈ కంఠహారములు ఎంతగానో అలంకరింపబడి ఉన్నాయి. ప్రతి ఒక్కరి మెడలో బాబా ఉన్నారు. అందరి కంఠములు ఎంతగానో ప్రకాశిస్తున్నాయి ఎందుకంటే మాల మీకు స్మృతిచిహ్నముగా గాయనము చెయ్యబడ్డది. ఈ రోజు నేరుగా తండ్రియే మీకు మాలను వేసారు. చూడండి, ఈ మాల ఎంతో మెరుస్తుంది. మాలకు ఉన్న ప్రకాశము అద్భుతము. ఒకరి మాలను మరొకరు చూసుకుని ఎంతగానో సంతోషిస్తున్నారు. ఈరోజు హాలు మాలలతో చక్కగా అలంకరింపబడి ఉంది. అందరూ మీ మీ మాలలను చూసుకుంటున్నారు కదా! హాలులో ఉన్న మాలలన్నీ చూడండి ఎంతగానో అవి ప్రకాశిస్తున్నాయి. అతీతంగా ఉండి చూడండి. మీరు లేచాక మాలలను తప్పకుండా చూడండి. ఇలా అలంకరింపబడి ఉన్నాయి, అంతే. మాలలతో అలంకరింపబడి ఉన్న అందరూ ఎంతో సుందరంగా ఉన్నారు. ఈ హారము మెడలో ఉంటే మాయ కూడా హార్(ఓడిపోతుంది) అవుతుంది. మాలలను చూస్తేనే మాయ పారిపోతుంది, మీరు విజయులుగా అవుతారు. మరి మీ మాల యొక్క అద్భుతాన్ని చూస్తున్నారు కదా! వెనక ఉన్నవారు, కుడివైపు ఉన్నవారు, అందరూ, మాలలు ఉన్నా లేకపోయినా కానీ ఎంతో అలంకరింపబడి ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు బాబా అందరికీ మాల యొక్క పరిచయాన్ని ఇచ్చి కూర్చోబెట్టారు. పిల్లలు ప్రతి ఒక్కరూ మాలతో ఎంతగా అలంకరింపబడి ఉన్నారంటే ఎప్పటికీ ఈ మాల మీ కంఠహారంగా ఉంటుంది. మీ మాలలను చూసుకుంటున్నారా! ప్రతి ఒక్కరి మెడలో మాల ఎంత ప్రకాశిస్తుందో చూడండి. అది చూసి మీరు చాలా సంతోషిస్తారు. అక్కడక్కడ రష్ అయితే ఉంటుంది.

మరి ఈరోజు మాలల మెరుపు చాలా ఉంది. ప్రతి ఒక్కరూ తమ మెరిసే మాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మాలల ప్రకాశాన్ని ఇక్కడికి వచ్చి చూడండి, ఒక్కొక్కరి మాల యొక్క విశేషత. ఇంతగా అలంకరించేది ఎవరు?? నా బాబా. అందరూ ఏమని అంటారు? నా బాబా. ఒక్కొక్కరూ ముందు వెనుక ఉన్న అందరినీ చూడండి, మాలలు ఎంతో వచ్చాయి కూడా మరియు కంఠహారములుగా అయ్యాయి కూడా. అందరి మెడలో మాలలు ఎంతో సుందరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇతరుల మాలను చూస్తున్నారు, అందరూ మాలధారులుగా ఉన్నారు. బాబాకు ఇటువంటి ఫంక్షన్లలో సన్నటి మాల కూడా నచ్చుతుంది. ఇప్పుడు చూడండి, మీరు వచ్చారు, కొందరు మాలను వేసుకుని ఉన్నారు, అది కనిపిస్తుంది. మాలను చూసి, ఆ మాలలో నా పేరు ఉంది కదా అని అందరూ చూసుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న వారందరి పేర్లు మాలలో ఉన్నాయా? చేతులెత్తండి. అందరికీ నిశ్చయం ఉంది. అరె, మన కోసమే బాబా మాల తయారు
చేయించారు. అందరి ముఖాలు ఎంతగా అలంకరింపబడి ఉన్నాయో చూడండి. స్థూలంగా ఎంత అలంకరించుకున్నా కానీ, అందరి మాలలు మెరుస్తున్నాయి. మెరుస్తున్న మాలల చిత్రము అందరికీ బాగా నచ్చుతుంది. తమ వద్ద పెట్టుకునే యోగ్యంగా ఉంటుంది. బాబా నుండి ఈ బహుమతిని తీసుకుని వెళ్ళండి. ఈ రోజు ఇచ్చే బహుమతి, మాల. ప్రతి ఒక్కరూ స్వయాన్ని మాలలోని పూసగా భావిస్తున్నారా? మేము కంఠహారముగా ఉన్నాము అని భావించేవారు చేతులెత్తండి. వాహ్!వాహ్! చూడండి, మాలతో ఎంతో చక్కగా అలంకరింపబడి కనిపిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ రోజు కోసం బాబా మాలలను తయారు చేయిస్తారు. మీకు లభించినప్పుడు వాటి ప్రకాశాన్ని చూడండి. హాలు మొత్తం మాలలతో అలంకరించారు, మాలామాల్ గా ఉంది. నా మెడలో మాల ఉంది కదా అని పిల్లలందరూ తమ తమ మెడలో చూసుకుంటున్నారు. ఎంతగా చూస్తారో అంతగా మాలలు పెరుగుతాయి. మాలలు ఉన్న సభను చూసి బాప్ దాదా హర్షితులవుతున్నారు వాహ్, వాహ్ మాలధారులారా, వాహ్! ఈ స్మృతిచిహ్నమైతే మీదే కదా, మాలలు. పూల మాల వేసుకున్నా లేక మరింకేదైనా మాలను వేసుకున్నా కానీ మాల స్మృతిచిహ్నము. వాహ్, ఫలానా వారు కూడా మాలను వేసుకున్నారు అని ఒకరినొకరు చూసుకుని ఎంతగానో సంతోషిస్తున్నారు. మాలధారులైన పిల్లలను చూసి చిరునవ్వును చిందిస్తున్నారు. సెకండులో అందరూ వేసుకున్నారు, చూడండి ఎంతో బాగా అనిపిస్తుంది. మాలను చూస్తే మాలను వేసినవారు గుర్తుకు వస్తారు.

ఈరోజు ప్రత్యేకంగా మాలాధారులైన పిల్లలు. మాల స్మృతిచిహ్నముగా ఉంది కదా. అలాగే ఈ మాల కూడా స్మృతిచిహ్నము. అందరూ ఎంత మంచిగా అనిపిస్తున్నారు. అందరి మెడలో మాలలు ప్రకాశిస్తున్నాయి. అందరి మెడలు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. బాబా మూర్తికి కూడా మాల ఉంది. మాల చాలా మంచి స్మృతిచిహ్నము. అందరూ ఎక్కడ కూర్చున్నారు? హాలులో. బాబా మెడలో అందరూ కూర్చుని ఉన్నారు. మాలను చూసారు కదా! మాల ఎంతగానో మెరుస్తుంది కానీ మీరు పదే పదే అలజడి లోకి వస్తే మాల అందం ఏముంటుంది? ఇప్పుడు అందరూ మాలధారులైన పిల్లలుగా అయ్యి మీ చిత్రమును చూడండి. అందరి కంఠములు ఎంతగానో అలంకరింపబడి ఉన్నాయి. ఈ మాలలన్నీ ఎవరికి వచ్చాయి? బాబాకు. బాబా అయితే సంగమంలో మాలను వేసుకోరు. బాబా పిల్లలతో కలిసి మాలను వేసుకుంటారు. ఎవరికైనా మాల లేకపోయినా, ఏదైనా పూస పోయినా కానీ వారు తమ పూసల మాలను తీసుకువెళ్ళండి.

ఈరోజు అందరి మెడలో మెరుస్తున్నా మాలలను చూసి ఎంతో సంతోషిస్తున్నాము! వాహ్! ఒకరికొకరు తమ తమ మాలలను చూసుకుంటున్నారు. అందరి హృదయాల నుండి వాహ్ వాహ్ అని వెలువడుతుంది. అచ్చా. ఇప్పుడిక ఆలస్యమవుతుంది,
పిల్లలను మాలధారులుగా చేసి మాలలో చూపించాము. 

సేవ టర్న్ ఈస్టర్న్, తమిళనాడు వారిది. బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం నుండి 15 వేలమంది వచ్చారు. మొత్తం 26 వేల మంది వచ్చారు:- అందరూ ఒకరినొకరు చూసుకుంటూ అలంకరించుకున్నారు. వాహ్, ఇది చూసి చూసి బాబా కూడా నవ్వుతున్నారు, వాహ్ పిల్లలు వాహ్! ఇప్పుడు కూడా అందరూ కూర్చుని తమ చిత్రాన్ని తీయించుకుని వెళ్ళండి, పారిపోకండి. 

నేపాల్ (2500 మంచి వచ్చారు):- నా మాల ఎంత ప్రకాశిస్తుంది అని మాలను వేసుకున్న ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ప్రకాశము కూడా చూడండి ఎంతో ఉంది. ఒక్కొక్క మాలలోని పూస ప్రకాశము చూడండి చాలా ఉంది. . 

తమిళనాడు(3000 మంది వచ్చారు):- అందరి ప్రకాశము బాగుంది. బాగా తయారు కూడా చేయించారు. అందరూ మాలలను చేతిలో పట్టుకుని చూడండి. మెరుస్తున్న మాలలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నవారంతా కూర్చుని తమ మాల యొక్క షో చూపించండి. ఇప్పుడు కూర్చోండి, ఎక్కువగా అలంకరించుకోవద్దు, ఎంత చేసారో అంతే చూపించండి. 

డబల్ విదేశీయులు 75 దేశాల నుండి 1000 మంచి వచ్చారు:- ఈ గ్రూపులో అన్ని గ్రూపుల కన్నా ఎక్కువమంది డబల్ విదేశీయులు వచ్చారు. ఎంత మంచి ప్రకాశము! హాలు యొక్క ప్రకాశము చూడండి, అద్భుతము, ఎంతో సుందరంగా ఉంది. హారమున్న ప్రతి ఒక్కరూ తమ గుర్తును తమ వద్దనే పెట్టుకోవాలనుకుంటే బాప్ దాదా అన్ని మాలలకు స్మృతిచిహ్నమై ఉన్నారు. ఇలా చేస్తే ఈ అరచేయి ఎంతగానో అలంకరింపబడి ఉంది. ఇప్పుడే స్వర్గానికి వచ్చామా అన్నంత మెరుస్తుంది. చూడండి, మీరు మీ హారాన్ని ఇలా చేసి చూడండి, ఇతరులను చూడకండి, మిమ్మల్ని మాత్రమే చూడండి, ఎంత ప్రకాశము ఉందో! ఇక్కడు కూర్చున్న మీరు, హారము వెయ్యగానే మీరే మారిపోతారు. ఒకటి, స్వయంగా ఆయనే యజమానిగా అయి హారమును ప్రకాశింపజేస్తున్నారు, రెండవ హారము (పుష్పాలది) కూడా లభించింది, అది కూడా చాలా ప్రకాశిస్తుంది. మూడవది, ఈ హారము (బాహువులది) కూడా ఉంది. దీని మహిమ అన్నింటికన్నా ఎక్కువ. ఇప్పుడు కేవలం చూడండి, తర్వాత మరో సమయంలో బాబా ఎత్తుకుని చూపిస్తారు.

ఇప్పుడు ఇచ్చిన మాలలు ప్రకాశిస్తున్నాయి. అన్నిటినీ దాచి పెట్టి, మాలల హారాన్ని అలంకరించుకుని చూడండి, సభ ఎలా ఉంది!

బాప్ దాదా తమ హస్తాలతో జెండాను ఎగురవేసారు మరియు 81వ త్రిమూర్తి శివ జయంతి కోసం అందరికీ శుభాకాంక్షలను తెలిపారు 
ఓంశాంతి. ఇప్పుడు ఇక్కడకు అందరూ ఎందుకోసం వచ్చారు? ఇక్కడ మీకున్న ముఖ్యమైన పని ఏమిటి? పరివర్తన చేసుకోవడము. మరి పరివర్తన చేసుకున్నారా? ఇప్పుడు అందరూ ఎవరెడీగా ఉండండి. చెయ్యాలి, జరిగిపోయింది. చెయ్యకపోతే తిరిగి రండి. అందరూ ప్రేమగా చూస్తున్నారు. ప్రశాంతంగా చూసారు కదా. పూర్తి సంవత్సరం కోసం శివ జయంతి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈ రోజు ప్రత్యేకంగా జరుపుకునే రోజు. అందరూ తమలో దీపాన్ని వెలిగించారు, జెండా ఎగురవేసారు, దీపం కూడా వెలిగించారు. అందరి ముఖాలలో ప్రకాశము వచ్చింది. సంతోషం ఉంది కదా, అందరి ముఖాలలో సంతోషపు దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెనుక ఉన్నవారు ఏమనుకుంటున్నారు? అందరి హృదయాలలో హృదయాభిరాముడు ఉన్నారా? కేవలం దిలారామ్ మరియు దిల్ వాలాలు. ఎన్ని వస్తువులు కావాలనుకుంటే అన్ని వస్తాయి కానీ కేవలం ఇప్పటి వరకు సంగమ నివాసులు నేర్చుకుంటున్నారు. తెలుసుకోవడం కాదు, నేర్చుకుంటున్నారు. ఒక్కసారి బాబా ఓంశాంతి అని పలికితే ఎంతగా హర్షితమవ్వాలంటే మన సూర్యచంద్రులు అలంకరించుకున్న సమానంగా అవ్వాలి. ఎంత బాగా అలంకరించుకుని వచ్చారో చూసారు కదా. ఈనాటి కోసం అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
 

Comments