22-03-2013 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“భగవంతుడు మరియు భాగ్యము యొక్క స్మృతితో సదా హర్షితంగా ఉండండి, హర్షితంగా చెయ్యండి. వ్యర్థ విషయాలను హోలీ చేసి హోలీగా అవ్వండి"
ఈరోజు బాప్ దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. అన్నిటికన్నా పెద్ద భాగ్యము అందరి మస్తకంపై మెరుస్తున్న సితార, ప్రకాశిస్తూ కనపించింది. అందరి మస్తకము మెరుస్తూ ఉంది. దానితో పాటు అందరి నోటిలో జ్ఞాన వాణి యొక్క ప్రకాశము కనిపిస్తుంది. అందరి పెదవులపై చిరునవ్వు ఎంతో సుందరంగా మెరుస్తుంది. ప్రతి ఒక్కరి హృదయాలలో హృదయాభిరాముడైన తండ్రి లవ్ లీన్ మూర్తిగా ఉన్న దృశ్యం కనిపిస్తుంది. అందరి హస్తాలలో జ్ఞాన ఖజానాల ప్రకాశము కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి పాదాలలో, అడుగులో పదమాల దృశ్యము కనిపిస్తుంది. చెప్పండి, ఎంత పెద్ద భాగ్యము, ఎంత మెరుపుతో ప్రకాశిస్తున్నారు! ఆలోచించండి, ఇంత పెద్ద భాగ్యము ఎలా తయారయింది! స్వయంగా భాగ్య విధాత అయిన తండ్రి భాగ్యాన్ని తయారు చేసారు. భాగ్య విధాతయే స్వయంగా మీ భాగ్యాన్ని తయారు చేసారు. మరి మీ భాగ్యాన్ని చూసుకుని హర్షిస్తూ ఉంటారు కదా! అలాగే రోజూ అమృతవేళ మీ భాగ్యాన్ని చూసుకుంటూ ఉంటారు కదా! సంగమయుగము ఉన్నదే భాగ్యము తయారుచేసేదిగా.
బాప్ దాదా చూస్తున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉంటారు, అందుకే 'భాగ్యము చూడాలంటే పరమాత్మ పిల్లల భాగ్యమును చూడు' అన్న గాయనము కూడా ఉంది. మీ అందరికీ కూడా మీ భాగ్యాన్ని చూసి సంతోషం కలుగుతుంది కదూ! హృదయం నుండి ఏమని వెలువడుతుంది? వాహ్ నా భాగ్యము! మీ భాగ్యాన్ని చూసి ఇతర ఆత్మల కోసం ఉల్లాసము కలుగుతుంది, దయ కూడా కలుగుతుంది కానీ ఈ ఆత్మలందరి భాగ్యము ఉజ్జ్వలంగా అవ్వాలి అన్న ఉల్లాసం కూడా కలుగుతుంది. బాప్ దాదా ఏమి చూసారంటే, భాగ్యమైతే అందరికీ ప్రాప్తించింది కానీ భాగ్యపు సుఖము, ఆనందము నంబరు వారీగా అనుభవం చేసుకుంటున్నారు. కొంతమంది పిల్లల ముఖము భాగ్యముతో సంపన్నంగా ఉన్న ముఖముగా కనిపిస్తుంది. అటువంటి పిల్లలకు బాబా కూడా స్నేహస్వరూపంగా వాహ్ భాగ్యశాలి ఆత్మలు వాహ్! అని అంటారు. సంతోషం కలుగుతుందా, తల ఊపండి. కలుగుతుంది! అచ్చా, చేతులు ఊపండి. వాహ్! పిల్లలు సదా భాగ్య స్వరూపులుగా ఉంటున్నారా లేక అప్పుడప్పుడూ ఉంటున్నారా అని పిల్లలందరినీ బాబా పరిశీలిస్తూ ఉంటారని బాప్ దాదా చాలాసార్లు చెప్పి ఉన్నారు. మేము సదా భాగ్యశాలి పిల్లలము మరియు భాగ్యశాలిగా తయారు చేస్తాము అని స్వయం గురించి భావించేవారు చేతులెత్తండి. వెనుక ఉన్నవారు కూడా చేతులెత్తుతున్నారు. బాప్ దాదా చూస్తున్నారు, అభినందనలు. భాగ్యశాలి ముఖము సదా అదృష్టవంతంగా మరియు సంతోషంగా ఉంటుంది. మరి నేను అమృతవేళ నుండి రాత్రి వరకు సంతోషంగా మరియు అదృష్టశాలిగా ఉన్నానా అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి. సంతోషం ఎప్పుడూ తగ్గకూడదు. కొంతమంది పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారంటే వారి ముఖమును చూసి ఇతరులు కూడా మారిపోవడాన్ని బాప్ దాదా చూసారు.
ఈరోజు బాప్ దాదా ఒక మాటను పిల్లల నుండి తీసుకోవాలనుకుంటున్నారు. తయారుగా ఉన్నారా! తయారేనా? చేతులెత్తండి, ఇస్తారా? మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. చేతులెత్తండి, బాగా ఆలోచించి చేతులెత్తండి. 'మేము శక్తి స్వరూపులుగా లేక సంతోషంగా ఉంటున్నాము కానీ అప్పుడప్పుడూ' అని బాప్ దాదాకు కొంతమంది పిల్లలు చెప్తుంటారు. ఈ 'అప్పుడప్పుడూ' అన్న పదం బాప్ దాదాకు నచ్చదు ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరిపై బాబాకు అతి ప్రేమ ఉంది. అప్పుడప్పుడూ అన్న పదము బాబాకు నచ్చదు, సదా బాబా సమానంగా కనిపించాలి. ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారు కానీ పిల్లలందరూ సదా సంతోషంలో ఎగురుతూ ఉండాలని, సదా ఆత్మికతతో చిరునవ్వు నవ్వుతూ ఇతరులను కూడా చిరునవ్వు నవ్వేలా చెయ్యాలని బాబా ఆశిస్తున్నారు. మీకు ఇష్టమేనా, సదా ఇష్టమా లేక అప్పుడప్పుడూ ఇష్టమా? ఎవరికైతే సదా అన్న పదము ఇష్టమో మరియు ప్రాక్టికల్ గా అది ఉందో వారు చేతులెత్తండి. వెనుకవారు చేతులు ఊపండి, ఎందుకంటే ఈరోజు హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా. హోలీ అంటే అర్థము గడిచిపోయినదానికి హో లీ(జరిగిపోయింది) చెయ్యడము. భవిష్యత్తు సదా శ్రేష్ఠమైనది, ఉంటుంది కూడా. మేము బాబాతో ఉంటాము, బాబాతోటే ఉంటాము అని పిల్లలందరూ సంకల్పం చేసారు. బాప్ వాదా కూడా సంతోషిస్తారు. బాప్ దాదాకు కూడా ఒంటరిగా ఉండటం ఇష్టముండదు, పిల్లలందరితోటే మంచిగా అనిపిస్తుంది. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు అని బాప్ దాదా అనేకసార్లు చెప్పి ఉన్నారు. అంతేకాక సంతోషం చేసే అద్భుతం మరేదీ చెయ్యదు కూడా. తెలుసు కదా, మరేదైనా వస్తువు ఇస్తే తరుగుతుంది కానీ సంతోషాన్ని ఎవరికైనా ఇస్తే పెరుగుతుందా లేక తరుగుతుందా? ఇలా సదా పెరుగుతూ ఉండే సంతోషాన్ని ఎప్పుడూ వదిలిపెట్టద్దు. మీ ముఖము ఎవరు చూసినా కానీ సదా సంతోషంగా ఉండాలి. పరిస్థితులైతే వస్తాయి, కలియుగము అంటే అర్థము ఏమిటి? కలియుగము అని ఎందుకంటారు? కలహ క్లేశాలు ఉంటాయి కాబట్టే కలియుగము అని అంటున్నారు కదా! కానీ మనం అప్పుడు ఏమి చెయ్యాలి? పరివర్తన. పరిస్థితుల్లోకి వెళ్ళద్దు కానీ పరిస్థితులను మార్చి సేవ కోసం సదా ఎవరెడీగా ఉండండి. మరి సదా మీ భాగ్యము గుర్తుంటుందా? భగవంతుడు మరియు భాగ్యము, దీనితో సదా హర్షితముఖము, ఆ హర్షిత ముఖాన్ని చూసి ఇతరులు కూడా హర్షితమవ్వాలి.
బాప్ దాదా ఈ రోజు అందరికీ ఇదే గుర్తు చేయిస్తున్నారు, సదా హర్షితంగా ఉండండి మరియు హర్షితంగా తయారు చెయ్యండి. పిల్లలందరూ మధువనానికి చేరుకున్నారు. టెంట్ లో కూడా పడుకోవలసి రావడాన్ని బాప్ దాదా చూసారు. టెంట్ లో పడుకునేవారు చేతులెత్తండి. టెంట్ లో పడుకున్నవారు చేతులెత్తండి. చాలా కొద్దిమంది ఉన్నారు, వెనుక ఉన్నవారిలో ఉన్నారు. అచ్చా. మరి టెంట్ లో ఉంటూ సంతోషం పోయిందా లేక ఉందా? టెంట్ వారు చేతులెత్తండి. సంతోషంగా ఉన్నారా? బయట కూడా కూర్చుని ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నారని బచ్చీ అంతటా తిరిగి వచ్చారు. కానీ వారు బాబా హృదయంలో ఉంటారు అని వారికోసం బాబా అంటారు. హృదయాభిరాముడు మరియు మీ హృదయము, హృదయాభిరాముడు మీతో పడుకున్నారు. చూడండి, ఎవ్వరినీ రావద్దు అని చెప్పలేము. వెల్కమ్ చెయ్యవలసి వస్తుంది. కానీ టెంట్ వారికి ఏమైనా కష్టం కలిగిందా, ఎవరికైతే కష్టం కలిగిందో వారు చెతులెత్తండి. ఎవ్వరూ చేతులెత్తడం లేదు. మరి అందరి తరఫు నుండి టెంట్ వారికి పదమారెట్లు సుఖశాంతుల ప్రపంచంలో హక్కు లభిస్తుంది. మంచి ధైర్యవంతులు. బాబాపై ప్రేమ ఉంది, ఆ ప్రేమలో కష్టం అనిపించకపోవడాన్ని బాప్ దాదా చూసారు. కాకపోతే కొంచెం అయ్యి ఉంటుంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు, వచ్చారు, రండి, మీ ఇంటికి రండి.
ఇప్పుడు ఈ అద్భుతం చెయ్యండి, ఇది కూడా సహనశక్తితో అద్భుతం చేసారు, అందుకు థ్యాంక్స్. కానీ ఇక ముందు, ప్రతి ఒక్కరికీ బాబాపై ప్రేమ ఉంది, బాబాకు కూడా పిల్లలపై ప్రేమ ఉంది మరి పిల్లలందరూ కనీసం బ్రహ్మాబాబా సమానంగా త్యాగము, తపస్సు మరియు సేవ... చెయ్యాలని ఆశిస్తున్నారు, సమ్మతమేనా! బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యాలి, తయారుగా ఉన్నారా, ఇందులో రెండ్రెండు చేతులెత్తండి. చాలా మంచిది. అభినందనలు.
ఇప్పుడు అందరూ కలిసి ఈ దృఢ సంకల్పమును చెయ్యండి, తయారుగా ఉన్నారు కదా, పదే పదే చేతులెత్తమని చెప్పము. పిల్లలు మంచివారని బాప్ దాదాకు నిశ్చయము ఉంది. పురుషార్థంలో అప్పుడప్పుడూ విఘ్నాలు వస్తూ ఉండవచ్చు కానీ బాబా మరియు నేను కంబైన్డుగా ఉన్నాము, కంబైన్డుగా ఉంటాము అని పక్కా నిశ్చయబుద్ధి కలవారు. నిజమే చెప్పాము కదా! తల ఇలా అనండి. ఎవరెవరైతే తమ తమ స్థానాల నుండి వచ్చారో, ఆ పిల్లలు ఒక్కొక్కరికీ పేరుతో సహా వారి ముఖాన్ని ఎదురుగా ఊహించుకుని బాప్ దాదా వరదానము ఇస్తున్నారు - సదా ఏ విషయము వచ్చినా కానీ, నియమానుసారంగా అలా జరగకూడదు కానీ జరిగితే అటువంటి పరిస్థితిలో దానిని ఆ సమయంలోనే మనసు నుండి తీసేసి బాబాకు ఇచ్చేయండి. బాబాయే దానిని సంభాళిస్తారు. ఇవ్వడమైతే వచ్చు కదా? ఇవ్వడం వచ్చా? ఇందులో తల ఊపండి, ఇవ్వడం వచ్చా! తీసుకోవడం వచ్చు, ఇవ్వడం కూడా వచ్చా?
మరి ఈరోజు హోలీ, హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా! హోలీ అర్థము ఏమిటి? హో లీ (జరిగిపోయింది). ఇలాంటి విషయాలు ఏమైనా జరిగితే హో లీ. మనసులో పెట్టుకోకండి. హోలీ బహుమతి ఇదే - వ్యర్థ విషయాలేవైనా వస్తే హోలీ చెయ్యండి. సదా హోలీ చెయ్యండి మరియు హోలీ (పవిత్రంగా) అవ్వండి. ఒకటి హిందీ, ఒకటి ఇంగ్లీష్, రెండు పదాలు. హో లీ చెయ్యడము మరియు హోలీగా అవ్వడము. 'మేము ఎప్పుడూ సంతోషాన్ని పోగొట్టుకోము' అని మీ మనసులో ప్రతిజ్ఞ చెయ్యండి. చెయ్యగలరా? సంతోషాన్ని పోగొట్టుకోవద్దు, ఎవరైతే ఇది చెయ్యగలరో వారు చేతులెత్తండి. ఎవరైతే ప్రతిజ్ఞ చేసారో వారికి బాప్ దాదా తరఫున హృదయపూర్వక అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా, హోలీకి ఏమి తయారుచేసారు? ఏమైనా చేసారా?
సేవ టర్న్ - యు.పి, బెనారస్, పశ్చిమ బెంగాల్ వారిది:- తమ ఇంటికి విచ్చేయండి. నేను బ్రహ్మాబాబా సమానంగా అవ్వవలసిందే అని ప్రతి ఒక్కరూ సంకల్పం చెయ్యండి. ఫాలో బ్రహ్మా బాబా. ఏ కార్యమైనా దానిని బ్రహ్మాబాబా చేసారా అని పరిశీలించుకోండి. మీవద్ద 10 పాయింట్లు వెలువడి ఉన్నాయి. ఆ 10 పాయింట్లలో బ్రహ్మా బాబా ఏమేమి చేసారో చూడండి. బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యాలి. ఏ గ్రూపులు అయితే వచ్చాయో బాప్ దాదా ప్రతి గ్రూపువారికి అభినందనలు తెలుపుతున్నారు. ప్రతి గ్రూపుకు ఉల్లాస ఉత్సాహాలు ఉండటాన్ని బాప్ దాదా చూసారు, మేము చేసి చూపిస్తాము అని అంటున్నారు. చేసి చూపించే శక్తి కూడా ప్రతి గ్రూపులో ఉంది. బాప్ దాదా ప్రతి గ్రూపువారికి చాలా చాలా - చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు. మరియు ఈ వరదానము కూడా ఇస్తున్నారు - ప్రతి గ్రూపు ప్రతి సబ్జెక్టులో మున్ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇలా ముందుకు వెళ్ళే వరదానము బాప్ దాదా అన్ని గ్రూపులకు ఇస్తున్నారు. లాస్ట్ లో వచ్చినా కానీ ఫాస్ట్ గా వెళ్తారు. ధైర్యం ఉంది కదా! మంచిగా ఉన్నారు. అందరూ ఉల్లాస ఉత్సాహాలతో ఉండటాన్ని బాప్ దాదా చూస్తున్నారు. ప్రతి గ్రూపు ఇక్కడి నుండి విశేషంగా ఉల్లాస ఉత్సాహాలు నింపుకుని వెళ్తూండటాన్ని బాప్ దాదా చూసారు. ఈ ఉల్లాస ఉత్సాహాలు నిలకడగా ఉంటే అద్భుతాన్ని చేసి చూపిస్తారు. బాప్ దాదా అన్ని గ్రూపులను ఆశావాదిగా, విజయి గ్రూపుగా చూస్తున్నారు. ఒక్కొక్కరికీ బాప్ దాదా శుభ భావన మరియు శుభ కామనల వరదానాన్ని ఇస్తున్నారు.
అయిదు వింగ్స్ - గ్రామ వికాస్, మెడికల్, ట్రాన్స్ పోర్టు, ఎడ్మినిస్ట్రేటర్, యూథ్ వింగ్స్ వచ్చాయి:- ప్రతి వింగ్ ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్ళడాన్ని బాప్ దాదా చూసారు. సేవలో సఫలత కూడా లభిస్తుంది. కావున ఆశావాదిగా అయ్యి ఎంత సేవ చేసారో, అది మంచిగా చేసారు. ఇకముందు కూడా ఎంతో మంచి ఉల్లాస ఉత్సాహాలతో ఇప్పుడు వారసులను తయారు చెయ్యండి. ఇప్పుడు ఈ లిస్టు రాలేదు. వింగ్స్ ప్రారంభమైనప్పటి నుండి మంచి మంచివారు సంబంధ సంపర్కంలోకి వచ్చారు, అందుకు బాగా అభినందనలు తెలుపుతున్నారు. కానీ వారస క్వాలిటీ వారెవరైనా తయారై ఉంటే వారిని బాబా ముందుకు తీసుకురండి. సేవ బాగుంది, ఇది బాప్ దాదా చూసారు. సేవలో ఎవ్వరూ వెనుకంజ వెయ్యరు, మున్ముందుకు సాగుతున్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. బిజీ అయిపొయ్యారు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక తమ ప్రోగ్రామును తయారు చేస్తున్నారు. ఇప్పుడు కూడా శివరాత్రికి ఎక్కడెక్కడ ప్రోగ్రాములు జరిగాయో అక్కడ బాగా జరిగాయి, రిజల్టు బాగుంది. పెద్దవారూ చేసారు, చిన్నవారూ చేసారు. ఢిల్లీ మరియు బాంబే పెద్ద ప్రోగ్రాములను పెద్ద మనసుతో చేసాయి. బాప్ దాదా వారికి అభినందనలు తెలుపుతున్నారు.
నిజార్ అన్నయ్యతో:- బాగా చేస్తున్నారు. రిజల్టు బాప్ దాదాకు నచ్చుతుంది. ఇక ముందు కోసం కూడా ఏ ప్లాన్ అయితే ఆలోచిస్తున్నారో అది బాగుంది, రిజల్టు బాగుంది. ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు, చేస్తూ ఉండండి. నిమిత్తంగా అయితే అయ్యారు కదా. చేయించేవారు బాబాయే అయినా కానీ నిమిత్తమై చేసేవారికి కూడా బాప్ దాదా ప్రియస్మృతులు లభిస్తాయి.
డబుల్ విదేశీయులు 65 దేశాలనుండి 800మంది సోదర సోదరీలు వచ్చారు: - డబుల్ విదేశీయులకు డబుల్ అభినందనలు. బాప్ దాదా విదేశీయుల గురించి ఒక విషయంలో చాలా సంతోషిస్తారు. విదేశీయులు మధువన లాభాన్ని చాలా చక్కగా తీసుకుంటారు. దూరంగా ఉన్నాకానీ మధుబనం యొక్క లాభాన్ని పొందేందుకు మంచి ప్లాన్ వేస్తూ ఉంటారు. అందరూ రిఫ్రెష్ కూడా అవుతారు, సేవా ప్లాన్లు కూడా వేస్తారు మరియు సేవలో మంచి ఉల్లాస ఉత్సాహాలను కూడా చూపిస్తారు. బాప్ దాదా రిజల్టు విన్నారు. బాప్ దాదాకు నచ్చింది. గ్రూపుకు అటెన్షన్ ఇచ్చి బాగా రిఫ్రెష్ చేసారు, ఇలాగే చేస్తూ ముందుకు సాగుతూ ఉండండి. భిన్న భిన్న దేశాలవారు మధువనానికి వచ్చి సేవా ప్లాన్లు మరియు అవస్థలలో ఉల్లాస ఉత్సాహాలు, మిలనానికి మిలనము మరియు స్వ ఉన్నతి యొక్క అల కూడా బాగా కనిపిస్తుంది కావున బాప్ దాదాకు డబుల్ పురుషార్థీలు, డబుల్ విదేశీయులు కాదు, డబుల్ పురుషార్థీలు మంచిగా అనిపిస్తారు. ఇటువంటి ప్లాన్లు తయారుచేస్తూ విదేశంలో ఉన్నప్పటికీ మధువనానికి సమీపంగా అయ్యేందుకు ఏ ప్లానైతే చేస్తున్నారో అది చాలా బాగుంది. అభినందనలు, అభినందనలు, అభినందనలు. విదేశాలు సేవలో ఏమీ తక్కువగా లేకపోవడాన్ని బాప్ దాదా చూసారు. ఇండియా ఎలా అయితే భిన్న భిన్న ప్రోగ్రాములతో ముందుకు వెళ్తుందో అలాగే విదేశాలు కూడా ప్రతి సంవత్సరం చేస్తున్న ప్రోగ్రాములు చాలా బాగున్నాయి మరియు తయారుచేసిన ప్లాన్‌ను అమలులోకి కూడా తీసుకువస్తారు, అందుకే బాప్ దాదా ఇండియన్ సోదరసోదరీల తరఫున మీకు విశేషమైన అభినందనలను ఇస్తున్నారు.
ఈ గ్రూపులో 2000 మంది టీచర్ అక్కయ్యలు వచ్చారు:- అందరూ వెనక్కి తిరిగి సభకు చేయి ఊపండి. బాగుంది. సేవను బాగా ముందుకు తీసుకువెళ్ళడానికి టీచర్లు నిమిత్తమయ్యారు. మెజారిటీ సేవా ప్లాన్లను తయారు చేస్తారు కూడా, ఇది బాప్ దాదా కూడా చూసారు కానీ ప్రతి జోన్ కలిసి ఒకట్రెండు ప్రోగ్రాములను చెయ్యాలి. దీనితో ఏమవుతుంది! ఒకరితో ఒకరు కలుసుకునే ఛాన్సు లభిస్తుంది మరియు ఒకరికొకరు సహయోగిగా అయ్యే ఛాన్సు కూడా లభిస్తుంది. ఇకపోతే సేవ చేస్తున్నారు, చెయ్యడం లేదని కాదు, చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. ప్రతి జోన్ కలిసి ఇప్పుడు పెద్ద ప్రోగ్రాము చెయ్యాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. చిన్న చిన్నవైతే చేస్తూనే ఉంటారు కానీ ఇటువైపు కూడా సేవ జరుగుతుందని అందరికీ తెలియాలి. ఏదో ఒక ప్రోగ్రామును తయారు చెయ్యండి, ముందుకు వెళ్తూ ఉండండి. టీచర్లను బాప్ దాదా తమ తోటివారు అని అంటారు. ఎలా అయితే తండ్రి ఉన్నారో అలా టీచర్లు కూడా బాబా సమానంగా మున్ముందుకు వెళ్తూ ఉండాలి, ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి.
సభలో కొంతమంది వి.ఐ.పిలు కూర్చుని ఉన్నారు, వారిలో విశేషంగా అన్నా హజారే కూడా ఉన్నారు:- మీ ఇంటికి చేరుకున్నారు, మంచిది, సమ్ముఖంగా వచ్చినందుకు చూసారు, విన్నారు, దానితో సమీపంగా వచ్చారు, ఇకముందు కూడా సమీపంగా వస్తూ ఉంటారు. బాగా చేసారు. అందరిదీ విన్నారు, వినిపించారు కూడా. బాప్ దాదా అందరికీ విశేషంగా స్మృతిని ఇస్తున్నారు.
అచ్ఛా. నలువైపుల ఉన్న పిల్లలు చూస్తున్నారు కూడా, వింటున్నారు కూడా. ఈ సైన్సు సాధనాలు పిల్లలకు సుఖాన్ని అనుభవం చేయిస్తున్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. అందుకే, ఈ సైన్సు మీకు ఎంతో సహయోగాన్ని అందిస్తుంది అని బాప్ దాదా ముందే చెప్పి ఉన్నారు. అలాగే ఇస్తుంది, ఇక ముందు కూడా ఇస్తూ ఉంటుంది. అందరూ ఎలా సమ్ముఖంలో చూడటానికి ప్రయత్నాలు చేస్తారో బాబా చూసారు. వారికి అనుభవం కూడా అవుతూ ఉంది. కావున సైన్సు వారికి అభినందనలు, పిల్లలకు సాల్వేషన్ లభించింది. అందరూ చూస్తారు కూడా, వింటారు కూడా. మెజారిటీ దీని లాభాన్ని తీసుకుంటున్నారు, అందుకే బాప్ దాదా పిల్లల ఉల్లాస ఉత్సాహాలు చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో, వారందరికీ ఈనాటి హోలీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. హోలీ ఉంది, హోలీగా (పవిత్రంగా) ఉంటారు మరియు హోలీ (పవిత్ర) ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు, అందులో కూడా అందరూ సంతోషిస్తారు. అందరికీ, పిల్లలు ఒక్కొక్కరికీ, దూరంగా కూర్చుని కూడా సమీపతను అనుభవం చేసేవారికి చాలా చాలా ప్రియస్మృతులు మరియు ఎవరైతే సైన్సు సాధనాలతో ముక్తులై కూర్చున్నారో, ఏదో ఒక పద్దతితో మిలనము జరుపుకుంటున్నారో వారికి కూడా చాలా చాలా ప్రియస్మృతులు. పిల్లలందరూ దూరంగా కూర్చున్నాకానీ బాబాకు సమీపంగా ఉన్నారు, చూస్తున్నారు మరియు బాప్ దాదా కూడా చూస్తున్నారు కావున హోలీకి అభినందనలు, అభినందనలు, అభినందనలు.
దాదీలతో:- ప్రతి ఒక్కరూ గారాబమైన వారే. ప్రతి ఒక్కరూ హృదయానికి అధికారులు, అధికారము తీసుకుంటున్నారు.
(దాదీ జానకి బాబాను కౌగిలించుకున్నారు) అందరికీ ప్రేమ.
మోహినీ అక్కయ్య:- బాగా చేస్తున్నారు, ధైర్యం బాగుంది. ఎక్కడ ధైర్యముంటుందో అక్కడ సహాయము ఉంటుంది.
రుక్మిణి అక్కయ్యతో :- చాలా ధైర్యవంతులు, బాగా చేసారు. వారి పాలనకు రిజల్టు బాగుంది. ఏది జరిగిందో అది డ్రామా. ఆయువు కూడా ఎక్కువ కదా.
విద్య అక్కయ్య (కాన్పూర్)తో:- చాలా ధైర్యం చేసి వచ్చారు, మంచి పని చేసారు. లెక్కాచారాలు పూర్తయ్యాయి. సేవకు నిమిత్తంగా అయి ఉన్నారు. బాగుంది. డ్రామా జరిగింది, డ్రామాతో ఏ చింత ఉండదు, నిశ్చింత.
సుందర్‌లాల్ అన్నయ్య (ఢిల్లీ హరినగర్)తో:- ఆది నుండి నిమిత్తమై ఉన్నారు. నిశ్చింతగా ఉండండి. కొంచెం చింత వస్తుంది. ఇక్కడకు వచ్చారు, చెక్ చేయించుకోండి. ఆపరేషన్ అవసరం లేకుండా ఉండచ్చు.
(ముగ్గురు అన్నయ్యలు బాప్ దాదాకు పుష్పగుచ్ఛాలను ఇచ్చారు) బాంబే మరియు ఢిల్లీ రెండు చోట్ల సేవ బాగా జరగడాన్ని బాబా చూసారు. ఏ లక్ష్యము పెట్టుకున్నారో అది బాగుంది. (హైదరాబాదులో కూడా సేవ బాగా జరిగింది) హైదరాబాదు వారికి అభినందనలు పంపండి, టోలీ పంపండి. సేవాధారీ బిడ్డ (జస్టిస్ ఈశ్వరయ్య అన్నయ్య) మంచివారు, వారి పేరు బాగుంది.
(సైన్సు సాధనాలు బాగున్నాయి కానీ విఘ్నాలు కూడా వస్తున్నాయి) మన రాజ్యం కాదు కదా, ఈ కొంచెం కష్టమయితే ఉంటుంది. కలిసి ఏదైనా సాధన తయారు చెయ్యండి. తయారయ్యాయి కనుక తప్పకుండా ముందుకు వెళ్తాయి. అందరికీ ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి, సేవను పెంచండి. చిన్న చిన్న సెంటర్లు ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి.
(సేవలో ఏ నవీనత ఉండాలి) వచ్చినవారిని సమీపంగా తీసుకువచ్చే క్రొత్తదనాన్ని తీసుకురండి. కనీసం స్టూడెంట్ గా అయితే అవ్వాలి, అప్పుడప్పుడూ వచ్చేవారు స్వయంగా సంపర్కాన్ని పెంచుకోవాలి. మేము వెళ్ళాలి అని వారికే అనిపించాలి, రాబోయే వారి రిజల్టు ఇలా ఉండాలి. ఇప్పుడు వచ్చారు, మంచిది, మంచిది అని వెళ్ళిపోతారు. ఇప్పుడు సమీపంగా తీసుకురండి. కనీసం స్టూడెంట్ గా కాకపోయినా కానీ వచ్చేవారిగా, కలిసేవారిగా, వినేవారిగా అవ్వాలి, కనీసం మురళి అయితే వినాలి. (పరమాత్మ వచ్చేసారు అన్న టాపిక్ పెట్టవచ్చా) పెట్టవచ్చు ఏదైనా మాట చెప్పి తర్వాత ఇది చెప్పండి. అంతేకానీ బాబా వచ్చేసారు, బాబా వచ్చేసారు అని కాదు. ఏ కారణంతో అంటున్నారు. (ఇన్నర్ పీస్, గ్లోబల్ హార్మనీ టాపిక్ పెట్టవచ్చా) అటువంటి ఏ టాపిక్ అయినా పెట్టవచ్చు, అయినా కానీ పరస్పరంలో కూర్చోండి. చాలా టాపిక్స్ పరస్పరంలో కూర్చుని తయారు చెయ్యవచ్చు.
క్రొత్త వెబ్ సైట్ తయారు చేసారు, దీని ద్వారా ఇంటర్నెట్లోనే ఎవరైనా కోర్సు చెయ్యవచ్చు:- అందరూ పాస్ చేసారు కనుక నడిపించండి. బాగా చేసారు, బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఏమి చేసినా లాభము.
(11వేల మురుమురాలపై ఓం శాంతి అని వ్రాసి వాటితో చేసిన మాలను బాప్ దాదాకు ఇచ్చారు)
Comments
Post a Comment