20-03-2017 అవ్యక్త మురళి

  20-03-2017         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“మీ సాధారణ స్వరూపాన్ని మార్చి కొద్ది సమయమైనా సంగమయుగ ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేసి చూడండి, ఇది చక్కని చిరునవ్వు కలిగిన మీ ప్రకాశమయ రూపము”

ఓంశాంతి. ఈరోజు బాప్ దాదా విశేషంగా యోగయుక్త పిల్లలను, అందరి మధ్యన యోగయుక్తులుగా అయ్యి ఇతరులను కూడా యోగయుక్తులుగా తయారు చేసే వారిని చూసి హర్షితులవుతున్నారు. మనసులోనే చాలా చాలా ప్రేమ నిండిన హృదయపూర్వక ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఇంతమంది పిల్లలు కలిసి యోగంలో కూర్చోవాలి మరియు యోగంలో కూడా ఇటువంటి యోగ స్థితి ప్రాక్టికల్ లో ఉండాలన్నదే బాప్ దాదా కోరుకుంటున్నారు, మరి ఇది చూసి బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు. ఎలా అయితే బాబా చూసి చూసి సంతోషిస్తున్నారో అలాగే పిల్లలు కూడా బాబాను చిరునవ్వుతో చూసి మనసులో ఎంతో సంతోషిస్తూ రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటి ఈ సభ యొక్క శోభ చాలా బాగా చిరునవ్వుతో ఉన్నవారిని చూసి, బాబా కూడా ఈరోజు పిల్లల ముఖంలో ప్రేమను చూసి చిరునవ్వు చిందిస్తున్నారు. మరి పిల్లలు ఏమి చేస్తున్నారు? పిల్లలు కూడా చిరునవ్వుతో ఉన్నారు కదా! బాబా కూడా వాహ్ పిల్లలూ వాహ్! అంటున్నారు. పిల్లల చిరునవ్వు మరియు బాబా చిరునవ్వు చాలా సుందరంగా కనిపిస్తుంది. బాప్ దాదా దేనినైతే చూడాలనుకున్నారో దానిని నలువైపుల చూసి బాబా కూడా చిరునవ్వు చిందిస్తున్నారు. పూర్తి సభలో ఉన్న పిల్లలు చిరునవ్వుతో ఉండటాన్ని చూసి బాబా ఇప్పటివరకు మనసులో చిరునవ్వు కలిగి ఉన్నారు. వాహ్ పిల్లలూ వాహ్! గుప్తమైన శక్తి అద్భుతమైనది మరియు దాని ప్రభావాన్ని కూడా కనబరుస్తుంది. బాబా పిల్లలు ప్రతి ఒక్కరూ ఎలా చిరునవ్వుతో ఉన్నారంటే ప్రతి ఒక్కరి ముఖంపై చాలా మంచి సంతోషపు ప్రకాశము ఉంది. ప్రతి ఒక్కరి చిరునవ్వుతో ఉన్న ముఖమును చూసి బాబా కూడా ఎంతో మధురంగా చిరునవ్వును చిందిస్తున్నారు.

ఈనాటి సభ మెజారిటీ చిరునవ్వు కలిగిన నిశ్చింత చక్రవర్తులది, చిరునవ్వు కలిగిన ముఖాలు దూరం నుండే చాలా సుందరంగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఒకరినొకరు ఇదే రూపంలో చూసుకుంటున్నారు కదా! ఒకరినొకరు బాగా గుర్తుపట్టి చిరునవ్వు నవ్వినట్లుగా అనిపిస్తుంది. ఈనాటి సభలో విశేషంగా చిరునవ్వు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకని? అందరి మనసులలో ఒకటే పాట, మీఠా బాబా, ప్యారా బాబా (మధురమైన బాబా, ప్రియమైన బాబా)... అందరి ముఖము నుండి ఓ మీఠా బాబా, ప్యారా బాబా... అని వస్తున్నట్లుగానే అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ప్రతి ఒక్కరి నుండి మీఠా బాబా, ప్యారా బాబా ... అని అనే పిల్లల సభ చూస్తున్నట్లుగా బాబాకు అనిపిస్తుంది. చివరలో ఉన్న ముఖం కూడా ఇదే విధిలో ఉంది.

ఈరోజు రాత్రి ఎప్పటివరకు మేలుకుని ఉంటారో, అప్పటివరకు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ మధురమైన చిరునవ్వుతో ఉండండి. బాబా మరియు సభలోని చిరునవ్వుతో కూడిన ముఖాన్ని చూడండి. ఈ వైపున ఉన్న మీ చిరునవ్వుతో కూడిన ముఖం యొక్క ప్రభావము పూర్తి సభలో పడుతుంది. అవస్థ ఎలా ఉన్నా కానీ ఇప్పుడు అందరి ముఖాలు చిరునవ్వుతో కనిపిస్తున్నాయి. అందరి ముఖాలు ఎంత చిరునవ్వుతో ఉన్నాయంటే ఒక్క సెకండులో పూర్తి సభయే మారిపోయింది. ఎవరు ఎలా ఉన్నా కానీ బాబా వారిని మార్చి అందరిదీ అదే ముఖాలను చూపిస్తున్నారు. అందరి ముఖాలు ప్రకాశిస్తూ కనిపిస్తున్నాయి. వతనంలో అందరి ముఖాలు ఎలా ఉంటాయో అలా ఇక్కడ , ఈరోజు మీరు కూడా అటువంటి ప్రకాశిస్తున్న దీపాలుగా కనిపిస్తున్నారు. బాబా చాలా నెమ్మది నెమ్మదిగా మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడుతున్నారు? పిల్లలు ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రకాశిస్తున్న ముఖము మరియు మూర్తితో ఇప్పుడు ఎలా అయితే చిత్రంలో కనిపిస్తున్నారో అలాగే ప్రకాశిస్తున్న సితారలుగా చాలా బాగా మెరుస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఈ మెరుస్తున్న సితార యొక్క ప్రకాశము చాలా సుందరంగా ఉంది, ఎందుకు? పిల్లలు ప్రతి ఒక్కరూ తమ చమత్కారి ముఖంతో కనిపిస్తున్నారు. ఈ చిత్రం మీదే కానీ ఇటువంటి మెరుస్తున్న సితార, ఇప్పటివరకు కనిపించిన విధంగా, ఇటువంటి తెల్లని మెరుస్తున్న, సాధారణ రూపం కాదు, మెరుస్తున్న ముఖము, ఇటువంటి సభ చాలా బాగా అనిపిస్తుంది. అందరూ మెరుస్తున్నారు. ప్రకాశము లేకుండా ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బాబాను ప్రకాశిస్తూ చూస్తున్నారు, అలాగే బాబా సమానంగా పూర్తి సభ ప్రకాశిస్తుంది. బాప్ దాదా వినిపించినట్లుగా, పై నుండి ఫరిస్తాలు ఈ భూమి మీదకు వచ్చాయా అన్నట్లుగా ఉంది. మీ ఈ రూపం చాలా ప్రియమైనది ఎందుకంటే ఇప్పుడిక మరింకేదీ లేదు, అందరూ సంపూర్ణ మూర్తులుగా అయ్యారు మరియు పిల్లల ఈ రూపము కొందరికి కనిపిస్తుంది. అందరూ చాలా సంతోషిస్తున్నారు. అందరూ తమను ఫరిస్తా రూపంలో చూసుకుని చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడైతే ఎక్కువ సమయం కూర్చోలేరు ఎందుకంటే అందరికీ సంగమయుగ తమ స్వరూపం బాగా మెరుస్తూ కనిపిస్తుంది. మరి ఈ ఫరిస్తా రూపంలోనే ఇంతకముందు ఇమర్జ్ అయినట్లుగా ఇప్పుడిప్పుడే ఫరిస్తా రూపంలో కనిపిస్తున్నారు. ఇక్కడకు వచ్చి చూడండి, పూర్తి సభ ఇంతలో ఎలా మారిపోయిందో! ఇంతమంది కిరీటధారులు ఎక్కడికి వెళ్తారు! ఇప్పుడు గుప్తంగా, మర్జ్ రూపంలో ఉన్నారు, తర్వాత ఇమర్జ్ రూపంలో చూస్తారు. పూర్తి సభ అంతా ఎంత మెరుస్తూ కనిపిస్తుందో చూడండి. కొందరు వంకరగా ఉన్నా, టింకరగా ఉన్నా కానీ అందరూ మెరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకుని సంతోషిస్తున్నారు. ఏది ఇష్టము? మెరుస్తున్న తమ ఫరిస్తా రూపము ఇష్టమే కదా! సెకండులో మెరుస్తున్న వారిగా అయిపోయారు. పూర్తి సభ మెరుస్తూ ఉంది. మీ మెరుస్తున్న రూపాన్ని బాగా చూసుకోండి. మీ మెరుస్తున్న స్వరూపాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. మీ ఈ మెరుస్తున్న రూపాన్ని బాబా కొద్ది సమయం కోసం ఇమర్జ్ చేసి చూపించారు. ఇలా మీరు ఫరిస్తాలుగా ఉన్నారని చెప్తున్నారు. ఆ ఫరిస్తా రూపంలో బాబా మీకు మీ అందరినీ చూపించారు. సెకండులో మారిపోయారు. పూర్తి సభ మెరుస్తున్న వస్త్రాలతో ఎంతో సుందరంగా కనిపిస్తుంది. మీ ముఖాన్ని మీరే చూసుకోండి, ఎంత ప్రియంగా ఉన్నారో! ఎందుకంటే సంపూర్ణంగా ఉన్నారు కదా. ఎంత సుందరంగా ఉన్నారో చూడండి. ఇప్పుడు సాధారణ రూపాన్ని మార్చి ఫరిస్తా రూపాన్ని చూస్తున్నారు కదా! ముందు వెనక ఏమి కనిపిస్తుంది? ఫరిస్తా. పూర్తి సభ ఎంత ప్రకాశమయంగా ఉంది! ఎవ్వరిదీ సాధారణ రూపం లేదు. అందరిదీ ఫరిస్తా రూపం కనిపిస్తుంది. లోపల ఎవరు ఎంత తేడా కలిగి ఉన్నా కానీ, అది స్వయానికి తెలుసు, అందులోకి మనమెందుకు వెళ్ళడము! మనకైతే మన ఫరిస్తా రూపము ప్రత్యేకముగా కనిపించాలి, కేవలం పూర్తిగా ఫరిస్తా. ఫరిస్తా రూపంలోకి మారినప్పుడు పూర్తి సభ ఎలా మారిపోయిందో చూడండి. స్వయంగానే మీ ఫరిస్తా రూపం ఇమర్జ్ అయింది. మీదైనటువంటి మెరుస్తున్న స్వరూపము కొంత సమయము మీతోనే ఉంటుంది. మరి మీ ఫరిస్తా స్వరూపము పక్కా అయిందా! నేను ఫరిస్తా స్వరూపధారిని, కొంత సమయం దీనిని అనుభవం చేసి చూడండి, ఎంతో మధురంగా ఉంటుంది.

ఇప్పుడు బాబా ఫరిస్తా భవ అన్న వరదానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్క సెకండులో ఫరిస్తా, ఒక్క సెకండులో సాధారణము, ఈ అభ్యాసము చేస్తూ చేస్తూ ఫరిస్తాగా అయిపోతారు. ఇప్పుడు ఫరిస్తా స్వరూపంలో ఉండండి, ఎక్కువ సమయం ఫరిస్తా స్వరూపంలో, ఈ ప్రపంచంలో ఈ సంగమయుగ ఫరిస్తా రూపం కొద్ది సమయం ఉంటుంది. ఈ ఫరిస్తా రూపం కొంత సమయం మీతో ఉంటుంది. ఈ ఫరిస్తా రూపం ఎంత మంచిదో మీరు కూడా అనుభవం చేసుకుంటారు. ఎంత సమయం ఫరిస్తా రూపంలో ఉండాలనుకుంటే అంత సమయం ఉండగలగాలి కానీ ఆ(సూక్ష్మవతనపు) ఫరిస్తా రూపము ఇప్పుడు మన చేతులలో లేదు. ఇది ఫరిస్తా జీవితంలో ఉంది. అచ్చా \

సేవ టర్న్ గుజరాత్ మరియు భోపాల్ వారిది. మొత్తం 24 వేల మంది వచ్చారు, అందులో ఒక వెయ్యి మంది విదేశీయులు 75 దేశాల నుండి వచ్చారు. - (13 వేల మంది గుజరాత్ నుండి, 4 వేల మంది భోపాల్ నుండి వచ్చారు): చాలా మంచిది.

(మున్ని అక్కయ్య బాబాతో ఇలా అన్నారు, బాబా ఈ రోజు మీరు చాలా బాగా అందరితో కలిసారు, చాలా మంచి మురళి వినిపించారు)

కొందరు తమకు చివరలో లభించింది అని అనుకుంటారు, ఆలస్యమయిందేమో అనుకుంటారు అందుకని త్వరత్వరగా కలిపిస్తుంటారు. కానీ అలా కాదు, సమయం గురించి ఇక్కడ చూడము. కానీ ఎవరైనా ఆలస్యంగా వస్తే వారి కోసం వేచి ఉండటం జరగదు అని బాబా కూడా చూపిస్తారు, దాదీలు తప్ప. దాదీలు అయితే పునాది. అచ్చా. 

(ఇండియా వన్ సోలార్ ప్లాంట్ యొక్క ఉద్ఘాటన బాప్ దాదా ద్వారా చేయించారు)

ఏది చేసినా కానీ యజ్ఞంలో చేసారు మరియు ఇదే విధంగా నడిపిస్తూ ఉంటారు. అంతా బాగుంది. 

ఈరోజు బాప్ దాదా విశేషంగా సంగమయుగ ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేసుకోమని చెప్పారు, ఆ అనుభూతి కోసం విశేషంగా శ్రద్ధ వహించవలసిన పాయింట్లు 

1. సంపన్నత యొక్క సమయం సమీపిస్తున్న కారణంగా దేహ భాన రహితమైన ఫరిస్తా రూపాన్ని అనుభవం చేసుకోండి. ఎలా అయితే సాకరంలో కర్మ చేస్తూ, మాట్లాడుతూ, డైరెక్షన్లు ఇస్తూ, ఉల్లాస ఉత్సాహాలను పెంచుతూ కూడా దేహం నుండి అతీతంగా, సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభూతి చేయించారో అలాగే మాట్లాడుతున్నప్పటికీ మీ దృష్టిలో అలౌకికత కనిపించాలి. ఈ విధంగా ఎంతగా దేహ భానం నుండి అతీతంగా ఉండాలంటే ఇతరులకు కూడా దేహభానం కలగకూడదు. 

2. ప్రతి విషయంలో, వృత్తి, దృష్టి, కర్మ... అన్నింటిలో అతీతతనము అనుభవం కావాలి. వీరు మాట్లాడుతున్నారు కానీ అతీతంగా, ఆత్మిక ప్రేమతో మాట్లాడుతున్నారు అన్నంతగా ఫరిస్తా స్థితి యొక్క అనుభూతి స్వయం కూడా చెయ్యండి మరియు ఇతరులకు కూడా చేయించండి. ఫరిస్తా రూపంలో మీ అందరికీ తోడుగా ఉన్న బ్రహ్మబాబా సమానంగా మీ అందరూ ఫరిస్తాలుగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి, ఇందుకోసం మనసు యొక్క ఏకాగ్రతపై అటెన్షన్ ఉంచండి. ఆర్డర్ అనుసారంగా మనసును నడిపించండి. 

3. సదా తమ ఆకారీ రూపము, లైట్ యొక్క ప్రకాశ స్వరూపము మీ ముందు కనిపించాలి. నేను ఇలా అవ్వాలి అని అనుకోవాలి, అలాగే మీ భవిష్య రూపం కూడా కనిపించాలి. ఇప్పుడు ఇది వదలాలి, అది తీసుకోవాలి. ఇటువంటి అనుభూతి కలిగినప్పుడు సంపూర్ణతకు సమీపంగా ఉన్నట్లుగా భావించండి. ఈ పురుషార్థీ శరీరము పూర్తిగా మర్జ్ అయిపోవాలి. 

4. ఫరిస్తాగా అవ్వడము అంటే సాకార శరీరధారిగా ఉంటూనే లైట్ రూపంలో ఉండటము అనగా సదా బుద్ది ద్వారా ఉన్నత స్థితిలో ఉండాలి. ఫరిస్తా పాదాలు భూమిపై ఉండవు, బుద్ధి రూపి పాదము సదా ఉన్నత స్థితిలో ఉండాలి. ఫరిస్తాలకు ప్రకాశమయ శరీరాన్ని చూపిస్తారు. ఎంతగా స్వయాన్ని ప్రకాశ స్వరూపంగా భావిస్తారో, నడుస్తూ తిరుగుతూ అనుభవం చేసుకున్నప్పుడు అంతగా ప్రకాశమయ శరీరము కలిగిన ఫరిస్తాలుగా నడుస్తారు. 

5. ఫరిస్తా అనగా తమ దేహ భానంతో కూడా సంబంధం లేదు, దేహభానంతో సంబంధం తెగడము అంటే ఫరిస్తా. దేహంతో కాదు, దేహ భానంతో, దేహంతో సంబంధం పూర్తయినప్పుడు వెళ్ళిపోతాము కానీ దేహభానము యొక్క సంబంధము సమాప్తం కావాలి. ఎలా అయితే బాప్ దాదా పాత శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు కానీ శరీరంలో ఇరుక్కోరో అలాగే మీరు కూడా కర్మ కోసం ఆధారం తీసుకోండి తర్వాత తమ ఫరిస్తా స్వరూపంలో, నిరాకారి స్వరూపంలో స్థితులవ్వండి. 

6. బాబాకు అయ్యాక, నాది అంతటినీ నీదిగా చేసిన తర్వాత ఇక తేలికైన ఫరిస్తాలుగా అయినట్లే. ఇందుకోసం కేవలం ఒక్క మాటను గుర్తుంచుకోండి - ఇదంతా బాబాది, నాది ఏమీ లేదు. నాది వచ్చిన చోట నీది అనండి అప్పుడు ఎటువంటి భారము అనిపించదు. 

7. ఫరిస్తా అనగా డబల్ లైట్. ఫరిస్తా సదా మెరుస్తున్న కారణంగా సర్వులను తమ వైపుకు స్వతహాగా ఆకర్షిస్తాయి. ఫరిస్తాలు సదా ఎత్తులో ఉంటాయి. ఫరిస్తాలకు రెక్కలు చూపిస్తారు ఎందుకంటే ఎగిరే పక్షులు. బాబా లభించారు, ఉన్నత స్థానం లభించింది, ఉన్నత స్థితి లభించింది కనుక సదా ఎగురుతూ ఉండండి మరియు అనంతమైన సేవను చేస్తూ ఉండండి. 

8. ఎవరికైతే దేహము మరియు దైహిక ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదో వారే ఫరిస్తా అవుతారు. శరీరంలోనే ఉంటారు కానీ సేవ కోసం, సంబంధాల ఆధారంతో కాదు. సంబంధం అనుకుని ప్రవృత్తిలోకి రాకండి, సేవగా భావించి ఉండండి. కర్మ బంధనానికి వశమైన ఉండకండి. ఎక్కడ సేవా భావము ఉంటుందో అక్కడ సదా శుభ భావన ఉంటుంది, మరే భావము ఉండదు, ఇదే అతి అతీతము మరియు అతి ప్రియము, కమల సమానము. 

9. ఫరిస్తా స్వరూపము అనగా లైట్ ఆధారము, అందులో ఎటువంటి వ్యాధి లేదు, పాత స్వభావ సంస్కారాల అంశము లేదు, ఎటువంటి దైహిక బంధము లేదు, మానసిక చంచలత లేదు, బుద్ధి భ్రమించడము లేదు - ఇటువంటి ఫరిస్తా స్వరూపము, ప్రకాశమయ శరీరమును అనుభవం చేసినప్పుడు దైహిక స్వార్థపూరిత సంబంధాలు, సుఖశాంతులను కోల్పోయేట్లు చేసే వినాశి సంబంధాలు, మోహపు దారాలలో బంధించేటువంటి అనేక సంబంధాలు స్వతహాగానే తొలగుతాయి. ఒక్క సుఖదాయి సంబంధంలోనే ఎప్పటికీ ఉంటారు. 

10. మనం బ్రాహ్మణ్ సో ఫరిశాలము, ఈ కంబైన్డ్ రూపము యొక్క అనుభూతి విశ్వం ఎదుట సాక్షాత్కారమూర్తులుగా చేస్తుంది. బ్రాహ్మణ్ సో ఫరిస్తా అన్న స్మృతి ద్వారా నడుస్తూ-తిరుగుతూ స్వయాన్ని వ్యక్త శరీరము, వ్యక్త దేశంలో పాత్రను పోషిస్తూ కూడా బ్రహ్మబాబాకు తోడుగా అవ్యక్త వతనంలో ఫరిస్తాగా, అవ్యక్త రూపధారిగా అనుభవం చేసుకుంటారు. ఈ అవ్యక్త భావము వ్యక్తతనము నిండిన మాటలు-వ్యవహారము, వ్యక్త భావపు స్వభావాన్ని, వ్యక్త భావపు సంస్కారాన్ని సహజంగానే పరివర్తన చేస్తాయి. 

11. ఫరిస్తా అనగా దివ్య స్వరూపము. దివ్యత యొక్క శక్తి సాధారణతను సమాప్తం చేస్తుంది. ఎంతెంతగా దివ్యత శక్తి ప్రతి కర్మలోకి వస్తుందో అంతగా అందరి మనసుల నుండి, నోటి నుండి స్వతహాగా 'వీరు దివ్య దర్శనీయమూర్తులు' అన్న మాటలు వస్తాయి. దర్శనం కోసం అభిలషిస్తున్న అనేక భక్తుల ఎదుట మీరు స్వయం దివ్య దర్శన మూర్తిగా ప్రత్యక్షమవుతారు అప్పుడే సర్వ ఆత్మలు దర్శనం చేసుకుని ప్రసన్నమవుతారు. 

12. ఫరిస్తా అనగా వారి ప్రపంచమే ఒక్క బాబా. నిమిత్తమాత్రంగా దేహంలో ఉంటారు మరియు దైహిక సంబంధాలతో కార్యం చేస్తారు కానీ ఆకర్షణ ఉండదు. ఇప్పుడిప్పుడే దేహంలోకి కర్మ చెయ్యడానికి రావాలి మరియు ఇప్పుడిప్పుడే దేహం నుండి అతీతమవ్వాలి. ఫరిస్తా సెకండులో ఇక్కడ, సెకండులో అక్కడ ఉంటుంది ఎందుకంటే ఎగురుతారు కదా. కర్మ చెయ్యడానికి దేహము యొక్క ఆధారము తీసుకోవాలి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలి - ఇప్పుడు ఈ అభ్యాసాన్నే పెంచుకోండి. 

13. ఫరిస్తా జీవితం యొక్క విశేషత - ఇచ్చా మాత్రమే అవిద్య. దైవీ జీవితంలో అయితే కోరికల విషయమే ఉండదు. ఎప్పుడు బ్రాహ్మణ్ సో ఫరిస్తా జీవితం అవుతుందో అనగా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారో అప్పుడు ఎటువంటి శుద్ద కర్మ, వ్యర్ధ కర్మ, వికర్మ లేక గత కర్మల ఎటువంటి బంధనంలో బంధింపబడలేరు. 

14. ఫరిస్తా స్థితిని అనుభవం చేసుకోవడానికి విశాల బుద్ధి కలిగిన అనంతమైన స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఎక్కడ అనంతము ఉంటుందో అక్కడ ఎటువంటి హద్దు తన వైపుకు ఆకర్షించలేదు. కర్మాతీతము అంటే అర్థము - సర్వ ప్రకారాల హద్దు యొక్క స్వభావ-సంస్కారాలకు అతీతము. 

15. ఫరిస్తా జీవితము బంధనముక్త జీవితము. సేవా బంధనము ఉన్నప్పటికీ ఎంతగా ఫాస్ట్ గతిలో ఉండాలంటే ఎంత చేస్తున్నా అంత ఫ్రీగా ఉండాలి. ఎంత ప్రియంగా ఉంటారో అంత అతీతంగా ఉండాలి. సదా స్వతంత్రత స్థితిని అనుభవం చేసుకుంటారు. శరీరం మరియు కర్మకు అధీనులు కాదు, ఒకవేళ దేహధారుల సంబంధంలోకి వచ్చినప్పటికీ పైనుండి రావాలి, సందేశం ఇవ్వాలి మరియు ఎగిరిపోవాలి.

Comments