20-03-2012 అవ్యక్త మురళి

            20-03-2012         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“సంతుష్టత శక్తిని ముఖములో మరియు నడవడికలో ధారణ చేసుకుని బ్రహ్మబాబా సమానంగా అవ్వండి. సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచండి." 

ఈరోజు సమ్ముఖంలో ఉన్నవారైనా, దూరంగా ఉన్న సంతుష్టమణులనైనా అందరినీ బాబా చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ సంతుష్టత శక్తితో మెరుస్తూ చిరునవ్వుతో మిలనమును జరుపుకుంటున్నారు. ఈ సంతుష్టత శక్తి అన్నిటికన్నా గొప్పది కావున ఇందులో సర్వ ప్రాప్తులు ఉన్నాయి. సంతుష్టత శక్తిని ధారణ చేసే సంతుష్టమణులు స్వయానికి కూడా ప్రియులుగా, బాబాకు కూడా ప్రియులుగా, పరివారానికి కూడా ప్రియులుగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ సర్వశక్తులు సంతుష్టతలో ఇమిడి ఉంటాయి. సంతుష్టత శక్తి యొక్క వాయుమండలం నలువైపుల వ్యాపిస్తుంది. సంతుష్టమణి ఆత్మలు మాయతో ఎప్పుడూ ఓడిపోలేరు, మాయనే ఓడిపోతుంది. సంతుష్టమణి ఆత్మలు సర్వుల హృదయాలను గెలుచుకోగలరు. సంతుష్టమణి ఆత్మ మాయ లేక ప్రకృతి ద్వారా వచ్చే భిన్న భిన్న అలజడులను కార్టూను చూస్తున్నట్లుగా అనుభవం చేస్తుంది.

పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఈ విధంగా సంతుష్టత శక్తిలో సంపన్నంగా ఉన్నట్లుగా భావిస్తున్నారా? 'నేను సంతుష్టమణిగా ఉన్నానా' అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. కొంతమంది పిల్లలంటారు, అప్పుడప్పుడూ సంతుష్టంగా ఉంటున్నాము, సదా ఉండటం లేదు అని. కానీ 'అప్పుడప్పుడూ', బాప్ దాదాకు 'అప్పుడప్పుడూ' అన్న పదం నచ్చదు. బాప్ దాదా అయితే సదా పిల్లలందరికీ ప్రియస్మృతులను ఇస్తుంటారు, సంతోషాలను ఇస్తుంటారు. కనుక, బాప్ దాదాకు 'అప్పుడప్పుడూ' అన్న పదం నచ్చదు, సదా సంతోషంతో ఉండాలి. ఈ 'అప్పుడప్పుడూ' అన్న పదాన్ని పరివర్తన చేయాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. ఇది వీలవుతుందా! 'అప్పుడప్పుడూ' అన్న పదము బ్రాహ్మణుల డిక్షనరీలోనే లేదు, సదా. బాబాకు ప్రియంగా, మాయ ప్రభావానికి అతీతంగా అయిన పిల్లలు ఈ రోజు ఈ 'అప్పుడప్పుడూ' అన్న పదాన్ని సమాప్తం చెయ్యగలరా? చెయ్యగలరా? ఎందుకంటే ఏ అలజడి అయినా అకస్మాత్తుగా రానుంది అని బాప్ దాదా చాలా సమయం నుండి చెప్తూ ఉన్నారు. ఆ తయారీలో ఒకవేళ ఇప్పటికీ 'అప్పుడప్పుడూ' అనే సంస్కారం ఉన్నట్లయితే సదాకాలికమైన రాజ్యభాగ్యానికి అధికారులుగా అవ్వగలరా? బ్రహ్మబాబాపై అందరికీ హృదయపూర్వక ప్రేమ ఉంది కదా. 'కలిసి ఉన్నాము, కలిసి వెళ్తాము, కలిసి రాజ్యం చేస్తాము' అని బ్రహ్మబాబాతో ప్రతిజ్ఞ చేసారు. ఈ ప్రతిజ్ఞ పక్కా కదా! తల ఊపండి. పక్కా? ఎంత పక్కా? బ్రహ్మబాబా ఎప్పుడైనా 'అప్పుడప్పుడూ' అని అన్నారా! మీ అందరికీ కూడా సదా అమృతవేళలో ప్రియస్మృతులను ఇవ్వడం జరిగింది, సదా బాబాతో కలిసి జ్ఞాన విషయాలు, స్నేహ విషయాలు, ఉల్లాస-ఉత్సాహ విషయాలను వినిపించాము. బాప్ దాదాపై ప్రేమ ఉంటే చేతులెత్తండి అని ఒకవేళ అంటే అందరూ రెండ్రెండు చేతులు ఎత్తుతారు. అవును కదా! ప్రేమ ఉంటే, ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి ప్రతి మాటపై కూడా ప్రేమ ఉంటుంది. బ్రహ్మబాబా ఎప్పుడూ శివబాబాకు 'అప్పుడప్పుడూ అవుతుంది' అని చెప్పలేదు. సదా ఫాలో ఫాదర్ చేసారు అంతేకాక మీతో కూడా చేయించారు ఎందుకంటే బ్రహ్మబాబాకు పిల్లలపై గాఢమైన ప్రేమ ఉంది అందుకే మీ పేరు కూడా ఏమిటి? బ్రహ్మకుమారి, శివకుమారి కాదు. మరి బ్రహ్మబాబాపై ప్రేమ అంటే బ్రహ్మబాబా చెప్పడము మరియు బ్రహ్మకుమారి బ్రహ్మకుమార్ మాట వినడము. ప్రేమ అంటే బలిహారము. దేనిపై బలిహారమవుతారు? వారి ఆజ్ఞలపై. ఏది చెప్తారో అది చెయ్యడము ఎందుకంటే బ్రహ్మబాబాతో పాటు శివబాబా ఉన్నారు. ఒంటరిగా లేరు. బాప్ దాదా, బాప్ దాదా అంటారు కదా.

ఈరోజు బాప్ దాదా పిల్లలందరి నోటి నుండి 'అప్పుడప్పుడూ' అన్న మాటను సమాప్తం చేయించాలనుకుంటున్నారు. మరి పిల్లలైన మీరందరూ బాబాతో ఉన్నారు. ప్రేమ ఉంది కదా! ప్రేమలో అయితే తమను తాము కూడా బలిహారం చేసేసుకుంటారు ఇక్కడైతే కేవలం ఒక పదాన్ని బలిహారం చేసెయ్యాలి ఎందుకంటే బాప్ దాదా పిల్లలందరినీ మాలలోని విజయి రత్నాలుగా చేయాలనుకుంటున్నారు. మరి స్వయాన్ని మాలలోని పూసగా భావిస్తున్నారా? విజయిగా భావిస్తున్నారా? 'బ్రాహ్మణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, మాల అయితే 108 మాత్రమే అంటే 108మందే వస్తారు కదా' అని కొంతమంది పిల్లలు అంటారు. ఒకవేళ మీరు సంపన్నంగా అయితే, విజయులుగా అయితే 108 మాలయే ఉంది కదా అని అనుకోకండి, మీ కోసం బాప్ దాదా మధ్యలో వరుసలను జోడిస్తారు కూడా. కానీ మీరు విజయులుగా అవ్వండి. 'ఏమో తెలీదు, నంబరు లభిస్తుందో లేదో' అని భావించే పిల్లలు కూడా ఉన్నారు. మీరు ఒకవేళ సంపన్నంగా అయితే బాబా నంబర్ తప్పక ఇస్తారు ఎందుకంటే బాబాకు పిల్లలందరిపై ప్రేమ ఉంది. వినిపించి ఉన్నాము కదా, చివరి పిల్లవాడే అయినా కానీ, వారిపై కూడా బాబాకు ప్రేమ ఉంటుంది ఎందుకంటే ఆ పిల్లవాడు స్వభావానికి వశమై ఉన్నాకానీ బాబాను తెలుసుకుని 'నా బాబా' అనైతే అన్నారు కదా. ప్రపంచంలోని అతి పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు కూడా బాబాను గుర్తించలేదు కానీ ఈ చివరి పిల్లవాడైతే గుర్తించారు కదా. ఏదో ఒక బలహీనతకు వశమై ఉన్నా కానీ బాబానైతే గుర్తించారు. 'నా బాబా' అని ప్రేమతో అన్నారు కదా అందుకే బాబా ముందు కూడా వినిపించి ఉన్నారు, చివరి పిల్లవాడిపై బాబాకు ప్రేమ ఉండనే ఉంది, అంతేకాక అతడిపై ప్రత్యేకంగా కళ్యాణ దృష్టి, కళ్యాణ వృత్తి కూడా ఉంటాయి - ఈ పిల్లవాడు ఎలాగైనా ముందుకు వెళ్తూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు.

బాప్ దాదా ఈరోజు స్పష్టంగా వినిపిస్తున్నారు - ఇది ఎలా జరుగుతుంది, ఇది ఏమిటి అంటూ మీరు మరే విషయాలనూ మిమ్మల్ని యోగ్యంగా చేసుకోండి. కర్మయోగి ఆత్మగా తయారవ్వండి. అంతేకాక బాబా పిల్లలు ఎవరైతే ఈ విధంగా యోగ్యంగా అవుతారో వారికి సర్వ ప్రాప్తుల వరదానమును కూడా ఇచ్చి ముందుకు పంపుతారు, వెనుకనే ఉంచరు.

ఈరోజు బాప్ దాదా అమృతవేళలో నలువైపులా దేశంలో, విదేశంలో చుట్టి వచ్చారు. ఇలా బాప్ దాదా మెజారిటీ తిరిగి వస్తూనే ఉంటారు కానీ ఈ రోజు తిరిగినప్పుడు, బాప్ దాదాతో పాటు విశేషంగా మీ పూర్వీకులైన దాదీలు కూడా బాబాతో కలిసి వచ్చారు. మరి అలా తిరుగుతున్నప్పుడు ఏమి చూసారు? మీకు కూడా తెలుసు. మంచి మంచి సంకల్పాలు చేస్తారు, 'చేసే చూపిస్తాము, అయ్యి చూపిస్తాము, చేతిలో చేయి వేసే నడుస్తాము' అని అనుకుంటారు. మరి చేయి అంటే ఏమిటి? శివబాబాకైతే ఫరిస్తా రూపం కూడా లేదు. మరి చేయి ఏమిటి? శ్రీమతము అనే చేయి. విదేశాలలో చేతిలో చేయి వేసి నడవడం ఫ్యాషన్ కదా. మరి ఇక్కడ చేయి అంటే శ్రీమతము. అందరూ చేతిలో చేయి వేసి నడిచేవారే కదా! శక్తి ఉందా? బ్రహ్మబాబా చూడండి, అడుగడుగులో శ్రీమతంపై నడిచి మీ అందరికీ చేసి చూపించారు. ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఉదాహరణగా నిలిచారు. సాకారంలో ఉదాహరణగా అయ్యారు. నిరాకారుని విషయం వదిలిపెట్టండి కానీ బ్రహ్మబాబా సాకారంలో మీకు తోడుగా ఉన్నారు కదా. ఎలా అయితే బ్రహ్మబాబా శ్రీమతం అనే చేతిలో చేయి వేసి ఫరిస్తాగా అయిపొయ్యారో అలాగే ఫాలో ఫాదర్! ఫాలో ఫాదర్ గుర్తుంది కదా! మరి ఏమి ఫాలో చెయ్యాలి? అన్ని విషయాలూ స్పష్టం చేసి చూపించారు. బ్రహ్మబాబా ముఖము మరియు నడవడిక అందరికీ తెలుసు కదా! మీ బుద్ధి ద్వారా అయితే బ్రహ్మబాబాను ఇమర్జ్ చేసుకోగలరు కదా! బ్రహ్మబాబా ఏ దినచర్య, ఎటువంటి దినచర్యను సాకర తనువులో ఉండి చేసారో, సాకారంలో కూడా అన్నీ అనుభవం చేసారు. బ్రహ్మబాబా చరిత్ర అయితే అందరికీ తెలుసు. మరి ఫాలో ఫాదర్. మిమ్మల్ని పక్కా చెయ్యడానికే బ్రహ్మబాబా ప్రతి అడుగు రివైజ్ చెయ్యబడ్డది. ఏమేమి చేసారు అని 8 అడుగులు చదువుతారు కదా! కేవలం వాటిని ఫాలో చెయ్యండి. ఫాలో చెయ్యడము అంటే బ్రహ్మబాబా సమానంగా అవ్వడము. మరి ఆలోచించండి, ఇద్దరు తండ్రులపై ప్రేమ ఉంది. ప్రేమ అంటే, ముందు కూడా వినిపించి ఉన్నాము కదా, ప్రేమకు ప్రాక్టికల్ రూపము బ్రహ్మబాబా చెప్పింది, చేసింది పిల్లలు చేసి బాబా సమానంగా అవ్వడము. సత్యమైన హృదయపూర్వక ప్రేమంటే ఇదే. కొంతమంది పిల్లలు ఏమి చేస్తారు? బ్రహ్మబాబా సమానంగా చెయ్యాలి అని అనుకుంటారు కానీ ముందు చేసి తర్వాత ఆలోచిస్తారు అంటే బ్రహ్మబాబా సమానంగా చేసినట్లు కాదు కదా. చేసేసారు. కానీ ఫాలో చెయ్యడమంటే ముందు ఆలోచించండి, ఆలోచించే ముందు కూడా ఆలోచించండి - ఈ సంకల్పం బ్రహ్మబాబా సమానంగా ఉన్నదా? ఒకవేళ చేసుంటే ప్రాక్టికల్ లో చెయ్యండి. చేసిన తర్వాత ఆలోచించకండి. ముందు ఆలోచించి తర్వాత ఫాలో చెయ్యండి. బ్రహ్మబాబాను ఫాలో చెయ్యడమంటే బ్రహ్మబాబా సమానంగా అవ్వడము. ధైర్యముందా? ఫాలో చేసే ధైర్యముందా? చెయ్యాల్సిందేనని భావించేవారు చేతులెత్తండి. ముందు ఆలోచించండి తర్వాత చెయ్యండి. చేసిన తర్వాత ఆలోచించడం కాదు.

ఈ రోజు బాప్ దాదా విశేషంగా సంతుష్టత శక్తిని పిల్లలందరిలో బ్రహ్మబాబా సమానంగా చూడాలనుకుంటున్నారు. ఈ ఒక్క సంతుష్టత శక్తిలో అన్ని శక్తులూ వచ్చేస్తాయి. మరి ఈరోజు బాప్ దాదా ఇస్తున్న విశేషమైన వరదానము - సంతుష్టత శక్తి భవ! ఏమి జరిగినా కానీ మీ సంతుష్టత శక్తిని వదిలి పెట్టకండి. కొంతమంది ఆత్మిక సంభాషణలో ఏమంటారంటే, సంతుష్టంగా అవ్వడం సహజమే కానీ సంతుష్టపరచడం చాలా కష్టము అని. ఎవరు ఏమి చేసినా కానీ, అది మంచిది కాదని మీకు అర్థమయింది. అప్పుడు మనసులో ఏమి పెట్టుకుంటారు? వీరిలా చేసారు, వీరిలా చేసారు, వీరి స్వభావమిలా ఉంది, వీరిది ఇలా ఉంది. మనసులో పెట్టుకోకండి ఎందుకంటే మీరు మీ మనసులో బాబాను పెట్టుకున్నారు. పెట్టుకున్నారు కదా? తల ఊపండి. పక్కాగా పెట్టుకున్నారా? లేక తీస్తూ పెట్టుకుంటూ ఉంటారా? ఒకవేళ మీ మనసులో బాబాను పెట్టుకుంటే, ఆ మనసులో బాబాతో పాటు విషయాన్ని కూడా పెట్టారా! కనుక, మనసులో పెట్టుకోకండి. ఇందుకు యుక్తి కూడా బాప్ దాదా ముందే వినిపించి ఉన్నారు, సదా అటువంటి ఆత్మల పట్ల శుభ భావన, శుభ కామన ఉంచి మీ శుభ కామనను ఉపయోగించండి. వీరు మంచిగా చెయ్యలేదు అని మీకు తెలుసు, అంటే మంచి వస్తువు కాదు అని అర్థం కదా! మీకు ఎవరైనా పాడైన వస్తువును ఇస్తే తీసుకుంటారా? మంచిది కాదని తెలిసినప్పుడు బుద్ధిలో పెట్టుకోవడము, మనసులో పెట్టుకోవడము ఎందుకు? పాడైన వస్తువును అసలెందుకు తీసుకున్నారు? ఇలా సదా మీ మనసులో బాబానే పెట్టుకుంటూ ఉంటే బాబా సమానంగా అయిపోతారు. ఈ ప్రతిజ్ఞ అయితే ఉంది కదా, బాబా సమానంగా అవ్వాలి కదా! పక్కాగా అవ్వాలా? లేక అవుతామో లేదో తెలీదు అని అంటారా? ఇలా అయితే ఆలోచించడం లేదు కదా? ప్రేమ అంటే ఫాలో ఫాదర్. బాప్ దాదా ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కరినీ శుభ భావన, శుభ కామనలతో సంపన్నంగా చూడాలనుకుంటున్నారు.

టీచర్లు తయారవుతారా? టీచర్లపై బాప్ దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకని ప్రేమ? ఎందుకంటే బాప్ దాదా గద్దెపై కూర్చునే ధైర్యమును చేసారు కనుక. అంటే టీచర్లలో ధైర్యముంది కదా? ప్రతి టీచర్ నుండి బాబా ఏమి ఆశిస్తున్నారంటే ప్రతి ఒక్కరి ఫీచర్ తో ఫ్యూచర్ కనిపించాలి. నిమిత్తమైన టీచర్లకు బాప్ దాదా చెప్తున్నారు కానీ మీరు కూడా తోడుగా ఉన్నారు కదా! బాప్ దాదా 75 సంవత్సరాల క్రితం చిన్న చిన్న పిల్లలకు బోర్డింగ్ లో ఈ శిక్షణే ఇచ్చారు - సంతోషకర ముఖము, సంతోషకర అదృష్టము కలిగిన ఆత్మగా ప్రతి ఒక్కరి ముఖం ఉండాలి అని. ఇప్పుడు కూడా బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, 'వీరు సంతోషంగా, అదృష్టంగా ఉన్నారు అని పిల్లలందరి ముఖము ద్వారా కనిపించాలి.' మీ వాణి ద్వారా చాలా సేవను చేసారు, మంచిగా చేసినందుకు సర్టిఫికేట్ అయితే ఉంది కానీ ఇప్పుడు మీ ముఖము మరియు నడవడికతో సేవలో ముందుకు వెళ్ళండి. ఎలా అయితే ఒక పేదవాడికి లాటరీ వస్తే అతడి ముఖము మరియు నడవడిక మాట్లాడుతుంది కదా! అతడి ముఖం చూసి అందరికీ అర్థమవుతుంది ఇతడికేదో లభించిందని! ఇదే విధంగా మీ ముఖము మరియు నడవడికతో వీరికి విశేషమైన ప్రాప్తి ఏదో లభించింది అని తెలుసుకోవాలి.

ఈ రోజు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? బ్రహ్మబాబా సమానంగా అవ్వండి. ఫాలో ఫాదర్ ఎందుకంటే సమయపు పరిస్థితులు అలజడిలోకి వస్తున్నాయి కూడా, మరింత రానున్నాయి అందుకే బాప్ దాదా పిల్లలందరికీ ఇవ్వాలనుకుంటున్న శిక్షణ ఏమిటంటే - 'సదా సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి. ఎంతగా సంతోషాన్ని పంచుతారో అంతగా సంతోషము పెరుగుతుంది.' మిమ్మల్ని సంతోషంగా చూసి ఎదుటివారు 5 నిమిషాలైనా సంతోషపడనివ్వండి. దుఃఖంతో ఉన్న ఆత్మలు ఒకవేళ మిమ్మల్ని చూసి 5 నిమిషాలైనా సంతోషపడితే ఇది వారికి బాగా మనసుకు నచ్చిన విషయం అవుతుంది. ఈ రోజు బాప్ దాదా విశేషంగా, 'సంతుష్టత శక్తిని పిల్లలందరూ తమ ముఖము మరియు నడవడికలో ధారణ చేసుకుని ఇతరులకు కూడా చేయించడంలో విశేషమైన శ్రద్ధ వహించాలని చెప్తున్నారు.' అచ్చా.

ఈరోజు మొదటిసారి వచ్చినవారు లేవండి. చూడండి, మీకు కనిపిస్తుందా! సగం క్లాసు క్రొత్తవారే ఉన్నారు. చేతులెత్తండి. చూడండి, అందరి చేతులు చూడండి. మీ క్రొత్త సోదరసోదరీలు ఎంతమంది మీతో కలిసారో చూడండి. అభినందనలు, చాలా చాలా అభినందనలు. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడవరకు చేరుకున్నారో, బాప్ దాదాను కలుసుకునేంత వరకు చేరుకున్నారు కదా, ఇకముందు ఏమి చెయ్యాలి? ఫాలో ఫాదర్ బ్రహ్మబాబా. బాప్ దాదాకు కూడా పిల్లలైన మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఉంది, వాహ్! పిల్లవాడు వచ్చేసాడు! మా సోదరసోదరీలు వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేసారు అని పరివారానికంతా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఫాలో బ్రహ్మబాబా. ఎప్పుడైనా ఏమైనా జరిగినా కానీ, ఏదైనా ప్రశ్న ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా, ఇది సమస్యల ప్రపంచమే కదా! వెంటనే మీ టీచర్ ద్వారా దాని పరిష్కారాన్ని పొందండి. రెండు రోజులు గడిచిపోయినా ఇలాగే సమస్య ఉంది అని అనకండి ఎందుకంటే వెనుక వచ్చారు, వెళ్ళాల్సింది ముందుకు కదా! వెనుక ఉండాలనుకుంటున్నారా? కాదు. ముందుకు వెళ్ళాలనుకుంటున్నట్లయితే ముందుకు వెళ్ళేందుకు ఈ ఒక్క విషయం చెయ్యండి - మనసులో ఎటువంటి వ్యర్థమునూ పెట్టుకోకండి. ఇందుకు అమృతవేళ బాబాతో మిలనము అయ్యాక, ఒకటైతే అమృతవేళ తప్పకుండా చెయ్యాలి. దాని తర్వాత రోజంతటి దినచర్య, అందులో మనసు బిజీగా ఉండాలి. ఏదో ఒక డ్రిల్, అనేక డ్రిల్స్ బాప్ దాదా వినిపించి ఉన్నారు, ఏదో ఒక డ్రిల్ ను తప్పక చెయ్యండి. మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి, క్రొత్తవారైనా పాతవారైనా కానీ పూర్తిగా అశరీరిగా అయ్యే డ్రిల్ ను తప్పకుండా చెయ్యండి ఎందుకంటే రానున్న సమయంలో ఒక్క సెకండులో అశరీరిగా అవ్వవలసి ఉంటుంది. ఈ డ్రిల్ కు మాకు సమయం లేదు అనంటే, ఎంత బిజీగా ఉన్నా, దప్పిక వేస్తే నీళ్ళు త్రాగడానికి లేవరా? తప్పదు అని భావించి లేస్తారు కదా. అలాగే అశరీరిగా అయ్యే ఈ ఒక్క నిమిషపు అభ్యాసాన్ని తప్పకుండా చెయ్యండి. ఆ సమయంలో ప్రాక్టీస్ చెయ్యలేరు. సమయము వచ్చినప్పుడు చేసేద్దాములే అని కొందరు అనుకుంటారు. కానీ కాదు. జన్మజన్మల నుండి ఉన్న ఈ దేహ అభిమానము ఆ సమయంలో అశరీరిగా అవ్వనివ్వదు కావున ఇప్పటినుండే సమయాన్ని కేటాయించి రోజంతటిలో పదే పదే ఏ సమయమైతే నిశ్చితం చేసుకున్నారో, ఆ సమయంలో ఒక్క క్షణంలో 'నేను అశరీరి ఆత్మను' అని ఆత్మ స్వరూపంలో స్థితులైపోండి. దేహాభిమానము తన వైపుకు ఆకర్షించకూడదు. ఈ అభ్యాసము అందరూ చెయ్యాలి. క్రొత్తవారైనా పాతవారైనా కానీ ఈ అభ్యాసం చెయ్యాల్సిందే ఎందుకంటే బాప్ దాదా కొంత సమయం నుండి ఈ విషయాన్ని చెప్తూ వచ్చారు. తప్పకుండా చెయ్యాల్సిందే. లేకపోతే శ్రీమతము అనే చేతిలో చేయి వేసి నడవలేము. కలిసి వెళ్తాము, కలిసి రాజ్యంలోకి వస్తాము అన్నది మీ ప్రతిజ్ఞ కదా. ఈ డ్రిల్ ను అందరూ చెయ్యాలి. ఇకపోతే వచ్చిన క్రొత్తవారు సంతోషంగా ఉండండి, సమృద్ధిగా ఉండండి, మున్ముందుకు వెళ్తా ఉండండి. అచ్ఛా. .

సేవ టర్న్ మహరాష్ట్ర, ఆంధ్ర మరియు ముంబయి వారిది:- అచ్చా. ఈ జోన్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పేరు ఉంది మహారాష్ట్ర అని మరి 'మహా'న్ గా ఉంటారు కదా. పేరును బట్టి సంఖ్య కూడా మహాన్ గా ఉంది. ముంబయి మరియు ఢిల్లీ రెండు స్థానాలలో బాబాకు ఒక్క విషయం చూసి ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి. సేవ అయితే చేస్తున్నారు, అందులో చెప్పేదేమీ లేదు. మంచిగా చేస్తున్నారు, చేస్తూ ఉంటారు కానీ బాప్ దాదా ఢిల్లీ మరియు ముంబయి నుండి ఏమి కోరుకుంటున్నారంటే మీ సంబంధ సంపర్కంలోకి వచ్చిన విశేష ఆత్మలు, మైక్ గా కూడా అవ్వగలవు, తర్వాత వారిని వారసులుగా కూడా చెయ్యవచ్చు. ఇటువంటి గ్రూప్ ను తయారు చెయ్యండి ఎందుకంటే మెజారిటీ వర్గాలు తమ లిస్టును బాబాకు ఇచ్చేసాయి. ఆ లిస్టును చూసాము. లిస్టులో మంచి మంచివారున్నారు, వారు మంచి పేరును తీసుకురాగలరు. ఇప్పుడు వారిని ప్రత్యక్షం చెయ్యండి. మీ బదులు వారు భాషణ చెయ్యాలి. మీ అనుభవాన్ని వారు వినిపించాలి, జ్ఞానము ఏమిటి, ఇక్కడకు వచ్చాక జీవితంలో కలిగిన తేడా ఏమిటి అని వర్ణించాలి. ఫంక్షన్ జరిగినప్పుడు, ఇప్పుడు కూడా కొంతమంది తమ అనుభవాలను చక్కగా వినిపిస్తారు కానీ అదైతే ఫంక్షన్లో వినిపించారు, కానీ నిరంతరం జీవితంలో అనుభవించాలి. ఇలా అటెన్షన్ ఉంచితే తయారయ్యేవారున్నారు ఎందుకంటే బాప్ దాదా ఏ లిస్టునైతే చూసారో, అందరి లిస్టు ఎంతో యోగ్యంగా ఉంది కానీ కొద్దిగా పురుషార్థం చేసి వారిని ముందుకు తీసుకురండి. ప్రతి ఒక్క వర్గం వారు వాస్తవానికి ఈ లిస్టును ప్రత్యక్ష రూపంలో పరివారము మరియు బాబా ఎదుటకు తీసుకురావాలి. వర్గాలవారు కార్యమునైతే చేసారు. కార్యమునైతే చేసారు కానీ బాప్ దాదా ఏమి చూసారంటే చాలాకాలం నుండి చేస్తున్నారు, ఇప్పుడు ఏదైనా నవీనతను తీసుకురండి. నవీనత ఏమిటంటే వారసులుగా చెయ్యండి. కనీసం సంపర్కంలో ఉండేవారు సంబంధంలోకి రావాలి, సంబంధం తర్వాత సేవలోకి రావాలి. సంబంధం అంటే కేవలం వచ్చిపోయే సంబంధం కాదు. బాబా మరియు పరివారానికి తోడుగా నిలవాలి. ఇది కూడా జరిగేది ఉంది, ఇప్పుడు బాప్ దాదా ఏమి చూసారంటే బ్రాహ్మణులు కలిసి ఏదైనా ఒక సంకల్పం చేస్తే అది జరిగి తీరవలసిందే కానీ అందరిదీ ఒకే సంకల్పము అయి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వాయుమండలం మారిపోయింది. ఎప్పటినుండైతే మీరు 75 సంవత్సరాలు జరుపుకుంటున్నారో అప్పటినుండి బ్రహ్మకుమారీలు ఏదో చేస్తున్నారు, ఏదో మంచే చెప్తున్నారు, చెయ్యగలరు అని లోకులు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు ఛేంజ్ వచ్చింది. మీరు కూడా ఛేంజ్ కు తగ్గట్లుగా కొద్దిగా కృషి చేస్తే మీ పరివారము ఎంతగా పెరిగిపోతుంది! ఇటువంటి వారి సంగఠన ఎక్కడైనా చెయ్యండని బాప్ దాదా చెప్తున్నారు. మధువనంలో కలవడానికి రావడం వేరే విషయము కానీ పరివారానికి చెందిన వారిగా అయ్యి రావాలి ఎందుకంటే సేవలో ఏదో ఒక నవీనత అయితే కావాలి కదా! అచ్చా. బాప్ దాదా సంతోషిస్తున్నారు ఎందుకంటే వీరు లేచారు కదా అది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. బాప్ దాదా ఆశ ఒకటి ఇంకా మిగిలిపోయి ఉంది. జోన్ వారి పట్ల. అది ఏమిటి? ప్రతి సెంటరు ఈ శుభవార్తను వ్రాయాలి, మా సెంటరు నిర్విఘ్నంగా ఉంది. కలుపుగోలుగా ఉంది. బాబా పిల్లలందరూ ఎక్యురేట్ గా, తయారు చేయబడ్డ ప్రోగ్రామ్ అనుసారంగా బిజీగా ఉన్నారు, నిర్విఘ్నంగా ఉన్నారు అని వ్రాయాలి. ఇలా ఇప్పటివరకు ఏ జోన్ నుండి రాలేదు. మరి మహారాష్ట్ర అయితే మహాన్ కార్యాలు చేస్తుంది కదా! ఇప్పటివరకు ఏ జోన్ వారూ ఈ శుభవార్తను పంపలేదు. అవ్వాలి. అవ్వాల్సిందే. మీరే కదా, ఇంకెవరు అవుతారు! మీ తపస్సు తక్కువైనదేమీ కాదు. టీచరైనా, విద్యార్థి అయినా ప్రపంచం దృష్టిలో ప్రతి ఒక్కరూ మహాన్ ఆత్మలే. ఇప్పుడిప్పుడే మీరు ఈ నిర్విఘ్నము గురించి కొద్దిగా పురుషార్ధం చేసినా కానీ, ఎలా అయితే మీ జడ చిత్రాలను ఎంతో శుభ భావనతో చూస్తారో అలాగే మిమ్మల్ని చైతన్య దేవీదేవతల రూపంలో చూస్తారు. సేవ అయితే అందరూ చాలా బాగా చేసారు. ఇందుకు బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు.

నిజార్ లేవండి. (బాప్ దాదా నిజార్ సోదరుడిని లేవమన్నారు) బాప్ దాదా సమాచారమును విన్నారు. మీరు ఏ రూపురేఖలనైతే తయారు చేసారో అది మంచిగా ఉంది ఇకముందు కూడా ఇంకా మంచిగా అవుతూ ఉంటుంది కనుక ముందుకు సాగుతూ వెళ్ళండి. బాప్ దాదా సమాచారాన్ని విన్నారు.

ఐ.టి. గ్రూప్:- చిత్రాలు మరియు బోర్డును కూడా మంచిగా చేస్తారు. బాప్ దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు, బాప్ దాదా ఏమి చూసారంటే ప్రతి వర్గంవారు ఏదో ఒక నవీనతను చేస్తున్నారు కూడా. ఇప్పుడు ప్రతి వర్గం ద్వారా సందేశం కూడా బాగా వ్యాపించింది. ఎలా అయితే డాక్టర్ల సేవలో, మెడికల్ వర్గంలో హృద్రోగాలను నయం చెయ్యడానికి అఫిషియల్ గా వేసారో, ఇలా అఫిషియల్ బుక్ లో వెయ్యడం వలన ఇది అడ్వర్టైజ్ చెయ్యడానికి మంచిగా ఉపయోగపడటాన్ని బాప్ దాదా చూసారు. ఇలాగే మిగతా జోన్ల వారు మంచివారు, నిమిత్తమై సందేశాన్ని వ్యాప్తి చెయ్యగలిగినవారితో కనెక్షన్ పెట్టుకున్నారు. దాని రిజల్టు కూడా మంచిగా ఉంది. బాప్ దాదా ప్రతి వర్గం వారికి ఇదే చెప్తున్నారు, ఇప్పుడెలా అయితే ముందుకు సాగుతున్నారో ఇలాగే ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే అందరి దృష్టి మీపై పడుతుంది. నెమ్మది నెమ్మదిగా విశ్వంలో ప్రసిద్ది అవుతూ ఉంటారు కావున బాప్ దాదా ఈ వర్గం వారికి కూడా అభినందనలు తెలుపుతున్నారు. అందరూ పురుషార్థం మంచిగా చేస్తున్నారు. పురుషార్థంతో పాటు బాప్ దాదా మీ అందరికీ తోడుగా ఉన్నారు. అచ్చా.

డబుల్ విదేశీ సోదరసోదరీలు:- డబుల్ విదేశీయులు డబుల్ నుండి డబుల్ అయిపోతున్నారు. బాప్ దాదా ఏమి చూసారంటే వీరు స్వయంపై, స్వమానంపై మరియు తమ వృత్తి పై మంచి అటెన్షను పెడ్తున్నారు మరియు అందరికీ అటెన్షన్ ఇప్పిస్తున్నారు కూడా. యజ్ఞ స్నేహి యొక్క పాత్ర కూడా, యజ్ఞ సహయోగి యొక్క పాత్ర కూడా మంచిగా చేస్తున్నారు కావున డబుల్ విదేశీయులకు అనేకసార్లు అభినందనలను తెలుపుతున్నాము. బాప్ దాదా మీ కథలన్నీ వింటూ ఉంటారు. కేవలం స్నేహి కాదు, స్నేహితో పాటు సహయోగిగా ప్రతి కార్యంలోనూ అవుతూ ఉంటారు. తమ భవిష్యత్తును జమ చేసుకోవడంలో తెలివైనవారు అందుకే చూడండి ఎన్ని దేశాల నుండి వచ్చారో. బాప్ దాదా ఈ సంగఠనను చూసి, స్నేహి సహయోగిగా అయ్యి ప్రతి కార్యంలోనూ సహాయాన్ని అందించే గ్రూపును చూసి సంతోషిస్తున్నారు. సంతోషంగా ఉన్నారు, మీరు కూడా సంతోషంగా ఉన్నారు, బాబా కూడా సంతోషంగా ఉన్నారు మరియు పరివారం కూడా సంతోషంగా ఉంది. డబుల్ విదేశీయులు మధువనానికి అలంకారము అని మధువనంవారు అంటూ ఉంటారు అంతేకాక తండ్రికున్న 'విశ్వ కళ్యాణకారి' అన్న పేరును విదేశీయులు సిద్ది చేసారు అందుకే అందరూ తీవ్ర పురుషార్థీగా అయి ఉండండి. పురుషార్థీగా కాదు తీవ్ర పురుషార్థీగా ఉండండి. ఎందుకంటే ఇప్పటికీ అందరూ తీవ్ర పురుషార్థీగా అయ్యేందుకు సమయము ఉంది. పురుషార్థము చేసే సమయము ఇప్పుడు పోయింది, ఇప్పుడిది తీవ్ర పురుషార్థం చేసే సమయము. ఎప్పుడు కూడా సాధారణ పురుషార్థీగా అవ్వద్దు. తీవ్రత ఉందా అని సదా పరిశీలించుకోండి. సాధారణంగా అయిపోలేదు కదా? సమయము కూడా ఇప్పుడు సూచన ఇస్తుంది - తీవ్ర పురుషార్థీగా అవ్వమని. బాప్ దాదా సంతోషంగా ఉన్నారు, పరివారం సంతోషంగా ఉంది. అందరికీ అభినందనలు తెలుపుతున్నాము. బాబాకు సంతోషంగా ఉంది. ఎన్ని దేశాల నుండి వచ్చారో చూడండి. అచ్చా.

నలువైపుల దూరంగా కూర్చుని ఉన్నాకానీ హృదయంలో ఇమిడి ఉన్న పిల్లలను బాప్ దాదా కూడా చూస్తున్నారు. అందరి ప్రేమ నిండిన సుగంధము మధువనంలోకి చేరుకుంటుంది. ఇప్పుడు అందరూ తీవ్రగతితో నడవండి, తీవ్ర పురుషార్థం చెయ్యండి తీవ్రత ప్రపంచంలోని వారిలో సుఖాన్ని తీసుకురావాలి. దుఃఖంతో ఉన్నవారిని సంతోషంగా చెయ్యాలి. సంతోషంగా ఉండే సందేశాన్ని అందరికీ ఇచ్చి అందరినీ సంతోషంగా చెయ్యండి, ఈ సేవలో తీవ్రత ఉంది. ఇంకా తీసుకురావాల్సి ఉంది కూడా. అచ్ఛా. అందరూ హృదయపూర్వక చాలా చాలా ప్రియస్మృతులు స్వీకరించండి.

మోహిని అక్కయ్యతో: - ఇలాగే ఇమర్జెన్సీలో తీవ్ర పురుషార్థం చెయ్యండి. ఎంతగా తీవ్ర పురుషార్థం చెయ్యండంటే అందరూ చూసి ఆశ్చర్యపోవాలి. వీరు అద్భుతం చేసారు అని అనుకోవాలి. ముందు నుండే చెక్ చేయించుకుంటూ ఉండండి. వదిలి పెట్టేస్తూ ఉంటారు కదా, మధ్యమధ్యలో చెకింగ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఏదైనా జరగక ముందే వైద్యం మొదలవుతుంది. ప్రతి 15 రోజులు లేక నెలకొకసారి చెకింగ్ చేయించుకోండి. అప్పుడు మంచిగా ఉంటారు. చాలా మంచిది.

నీలూ అక్కయ్యతో:- సహజంగా ఉంది కదా యాత్ర. కష్టంగా లేదు కదా. (పాస్ అయ్యారు) పాస్(దగ్గరగానే) ఉండండి. (నీలూ అక్కయ్య మరియు మోహిని అక్కయ్య ఇద్దరికీ గుల్జార్ దాదీ చాలా మంచి సకాశ్ ను ఇచ్చారు) అందరూ ఇచ్చారు. మధువనాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. మధువనం అయితే అందరి నరనరాలలో ఇమిడి ఉంది. అచ్చా.

దాదీ జానకితో: - లండన్ వెళ్తున్నారు కదా. వెళ్ళే విధంగా ఆరోగ్యం ఉంటే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. (అమెరికా వారు చాలా తయారీలు చేస్తున్నారు) ఎన్ని తయారీలు చేసినా కానీ మీరు నడిపించగలిగితేనే వెళ్ళండి. మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకుని నడిపించగలిగితే నడిపించండి.

ముగ్గురు పెద్దన్నయ్యలతో: - బాప్ దాదా మీ మీటింగ్ సమాచారాన్ని విన్నారు. ఏదైతే ఆలోచించారో అది మంచిగా ఉంది, దాని అనుసారంగానే నడవండి. సహాయం లభిస్తుంది. కొద్దిగా వ్యాప్తి చేస్తే సహాయం చేసేవారు కూడా వచ్చేస్తారు. ఇకపోతే ఎలా అయితే ఆలోచించారో అది మంచిగా ఉంది. (యునివర్శిటీ గురించి రమేష్ అన్నయ్య అడిగారు) - బాప్ దాదా ఏమనుకుంటున్నారంటే ముందు భిన్న భిన్న యునివర్శిటీలలో సేవను చెయ్యండి. ఎలా అయితే ఇప్పుడు ఒక యునివర్శిటీ కనక్షన్లో చేసారు కదా! అలా ఇతర యునివర్శిటీలలో సేవను చెయ్యండి. వారి సేవను చేసి వారినీ కలుపుకోండి. ఇప్పుడింకా ఎన్ని యునివర్శిటీలు మిగిలి ఉన్నాయి, ముందు వాటి సేవను చెయ్యండి, తర్వాత ఆఫర్లు అవే మీ వద్దకు వస్తాయి. మీరింత ఖర్చు చేయనవసరం లేదని వారే అంటారు. ఒక యునివర్శిటీలో చెయ్యడం వలన ప్రసిద్ది అయింది కదా! అలా 10-12 పెద్ద పెద్ద యునివర్శిటీలలో సేవను చేసి చూడండి. అప్పుడు వారే మీకు యునివర్శిటీను తయారు చేసి ఇస్తారు, మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. బాప్ దాదా సంతోషిస్తున్నారు, ఇలా కలుస్తూ ఉండండి, ఫైనల్ చేస్తూ ఉండండి.

(చండీగఢ్ లో ప్లాటినమ్ జూబ్లీ కార్యక్రమం చాలా బాగా జరిగింది, పూరీలో జరుగనుంది) అన్ని స్థానాలలో తమ తమ విధి ప్రమాణంగా సంతోషంగా మరియు పెద్ద మనసుతో చేసారు. అన్ని వైపుల రిజల్టు మంచిగా ఉంది.

సోదరుడు రామనారాయణ్ మీణా, ఉపాధ్యక్షులు రాజస్థాన్ విధానసభ: - ఇప్పుడు బ్రాహ్మణ కులంలో విశేషమైన పాత్రను నిర్వహించండి. (మీ పిల్లలము) అన్నిటికన్నా మంచిది పిల్లలు బాలక్ సో మాలికులు. బాలకుడు సదా యజమానిగా ఉంటాడు. అమృతవేళ లేచి, ఎన్ని గంటలకు లేవగలిగితే అన్ని గంటలకు లేచి అమృతవేళ బాబాను గుర్తు చేసి రోజూ బాబా నుండి ఆశీర్వాదాలను తీసుకోండి. బాబా నుండి ఆశీర్వాదాలు లభిస్తే సంతోషంగానూ ఉంటారు, నిర్విఘ్నంగానూ ఉంటారు. అంతా మంచిగా అయిపోతుంది. మీలో శక్తి నింపుకుంటే వారిలో కూడా శక్తిని నింపగలరు. అయిపోతుంది కేవలం కొద్దిగా ఉదయాన్నే లేచి బాబాను గుర్తు చేసి శక్తిని తీసుకుంటూ ఉండండి. నా బాబా అంటూ ఉండండి, శక్తిని తీసుకుంటూ ఉండండి. మధువనం చూసారు, పరివారాన్ని చూసారు, మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ పరివారానికి ఎంతగా సమీపంగా వస్తారో అంతగా లాభం కలుగుతూ ఉంటుంది.

సురేష్ ఓబరాయ్:- ఎలా అయితే సేవను ప్రారంభించారో అలాగే చేస్తూ ఉండండి. 

శివాని అక్కయ్యతో:- వరదాని ఉన్నారు. బాబా నుండి మంచి వరదానము లభించింది.

Comments