20-02-2013 అవ్యక్త మురళి

                         20-02-2013         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“కర్మయోగి జీవితంలో తీవ్ర పురుషార్థం ద్వారా ప్రతి సబ్జెక్టులో సదా సంతుష్టంగా మరియు సంతోషంగా ఉండండి. తమ సంతోషమయ, దివ్యగుణ సంపన్న ముఖముతో సంతోషాన్ని అనుభవం చేయించండి"

ఈరోజు బాప్ దాదా ఖజానాలతో సంపన్నమైన తమ పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఆది నుండి ఎన్ని ఖజానాలు లభించాయి! మొదట జ్ఞాన ఖజానా లభించింది, దీనితో పిల్లలందరూ తాము నిండుగా అయ్యి ఇతరులను కూడా ఈ ఖజానాతో నింపుతున్నారు. జ్ఞాన ఖజానా - అందరినీ బంధించే బంధనాల నుండి ముక్తి చేసి బంధనముక్తిగా, దుఃఖము, అశాంతి నుండి ముక్తి చేసేది. రెండవ ఖజానా యోగము, దీనితో అనేక శక్తులు ప్రాప్తించాయి. మూడవది ధారణ ఖజానా, దీనితో చాలా-చాలా గుణాల ప్రాప్తి కలిగింది. కానీ అన్నిటికన్నా అతి పెద్ద ఖజానా ఈ సంగమ సమయ ఖజానా. దీని మహత్వము చాలా గొప్పది. ఎందుకంటే సంగమ సమయంలోనే తండ్రి శివబాబా, తండ్రి రూపంలోనూ లభిస్తారు, శిక్షకుని రూపంలోనూ లభిస్తారు మరియు సద్గురువు రూపంలోనూ లభిస్తారు. ఈ సంగమయుగంలో ఒక్క జన్మలో 21 జన్మల వారసత్వము లభిస్తుంది, ఆ వారసత్వంలో జన్మ జన్మలకూ ఎటువంటి దుఃఖము, అశాంతి ఉండదు. అంతే కాక సంబంధాల విషయంలో, ఏ పరివారమైతే లభిస్తుందో ఆ పరివారము అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. పరస్పరంలో లభించే ఈశ్వరీయ స్నేహము పూర్తి కల్పంలో లభించదు. మరి సర్వ ఖజానాలతో నిండుగా అయినట్లే కదా! అయ్యారు కదా? చేతులెత్తండి.

కావున బాప్ దాదా ఈ రోజు ఖజానాలకు యజమానులు, ఖజానాలతో సంపన్నంగా ఉన్న పిల్లలను చూస్తున్నారు. హృదయం నుండి ఏమని వెలువడుతుంది? వాహ్ పిల్లలూ వాహ్! పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రికి ప్రియంగా అయ్యారు. పిల్లలైతే చాలామంది ఉన్నారు, వేర్వేరు స్థానాలలో కూర్చుని కూడా మిలనం చేస్తున్నారు. చూస్తున్నారు. కానీ బాప్ దాదా ఈరోజు నలువైపుల దూరదూరాల వరకు, ఖజానాలతో సంపన్నంగా ఉన్న తమ పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు కూడా ఖజానాలను చూసి సంతోషంగా ఉంటారు. సదా ప్రాప్తుల నషాలో సంతోషంగా ఉంటారు. బాబా కూడా పిల్లలను చూసి, పిల్లల సౌభాగ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. 

చూడండి, ఈ రోజు కూడా పిల్లలు ఎంతో సంతోషంగా ఇక్కడకు పరుగు పరుగున చేరుకున్నారని బాప్ దాదా విన్నారు. (26 వేలమంది కన్నా ఎక్కువమంది సోదర సోదరీలు చేరుకున్నారు). ఎక్కువమంది వచ్చిన కారణంగా కొంతమంది పిల్లలు టెంట్లో పడుకోవలసి వచ్చిందని కూడా బాప్ దాదా విన్నారు. బాప్ దాదా అన్ని వైపుల ఉన్న టెంట్లను కూడా చూసారు. ఈ గ్రూప్ యొక్క ఒక విశేషత ఏమిటంటే చిన్నవారైనా, పెద్దవారైనా, విశేషమైనవారైనా, సాధారణమైన వారైనాకానీ ఎవ్వరూ టెంట్ లో పడుకోలేదు, అందరూ సంతోషమనే పరుపుపై పడుకుంటున్నారు. అందరి మనసులలో వాహ్ బాబా వాహ్! అన్న పాట వినిపిస్తుంది. కొంతమందికి కష్టంగా ఉంది కానీ ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ నేలపై పడుకున్నా కానీ సంతోషాల ఆకాశంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కావున బాప్ దాదా ఈ గ్రూపుకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నారు. అందరి ముఖాలు సంతోషంగా కనిపిస్తున్నాయి. అందరూ ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో క్లాసులు వినడాన్ని కూడా బాప్ దాదా చూసారు. బాప్ దాదా అన్నీ వింటారు. ఇక్కడకు జోన్ హెడ్స్ ఎవరైతే వచ్చారో వారందరూ లేవండి. జోన్ హెడ్స్. మీరు తీసుకువచ్చిన సోదర సోదరీలు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నట్లయితే చేతులెత్తండి. మంచిది. బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు మీ అందరికీ విశేషమైన అభినందనలు కూడా తెలుపుతున్నారు. బాప్ దాదా ఎవరికైనా భవిష్యత్తు కోసం అటెన్షన్ ఇప్పిస్తారు కానీ, వచ్చిన మీ పిల్లలందరి సహనశక్తిని చూసి బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరికీ పదమారెట్ల ప్రేమను ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వచ్చారో వారందరూ తమ సహనశక్తిని, సంతోషంగా ఉండే రికార్డును పిల్లలకు తమ సహనశక్తికి బహుమతిగా హృదయపూర్వక అతి ప్రేమను అందిస్తున్నారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి?

(సేవ టర్న్ లో బెంగాల్, బీహర్, అస్సాం, ఒరిస్సా, నేపాల్, తమిళనాడు నుండి 18వేల మంది వచ్చారు)

ఇప్పుడు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ తీవ్ర పురుషార్థీగా చూడాలనుకుంటున్నారు. తీవ్ర పురుషార్ధి అంటే అన్ని సబ్జెక్టులలో తమ పురుషార్థంతో సంతుష్టంగా ఉండటము. ఇప్పుడు పిల్లలందరి ముఖములో శక్తులు మరియు సంతోషము కనిపించాలని బాప్ దాదా పిల్లలందరి నుండి ఆశిస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకూ ప్రపంచంలో దుఃఖమైతే పెరగనుంది. కానీ ఇటువంటి దుఃఖ సమయంలో మీ సంతోషమయ, దివ్యగుణ సంపన్న ముఖమును చూసి వారికి కొద్ది సమయమైనా సంతోషము అనుభవమవ్వాలి. పిల్లలు ప్రతి ఒక్కరి ముఖములో ఆ ఈశ్వరీయ స్నేహము, ఈశ్వరీయ ప్రేమ, ధైర్యాన్ని పెంచే ప్రేమ, సంతోషము అనుభవం అవ్వాలి. కొంతమంది అంటారు, మామూలుగా అయితే మేము సంతోషంగానే ఉంటాము కానీ కర్మయోగి జీవితంలో కొంచెం కర్మలో తేడా వస్తుంది అని. కర్మలో తేడా రాకూడదు. కర్మ చేస్తూ కూడా 'నేను కర్మయోగి ఆత్మను. శరీరాన్ని నడిపించే, శరీరానికి యజమానిని' అన్న అటెన్షన్ సదా ఉండాలి. కావున ప్రతి క్షణం, కర్మ చేసినా చేయకపోయినా కానీ కర్మ చేస్తున్న సమయంలో కూడా నేను కర్మను చేయించే ఆత్మను అని ఆలోచించండి. కానీ ఎటువంటి ఆత్మను బాబాకు అతి ప్రియమైన సంతానమును. పరమాత్మకు ప్రియ సంతానమును. యజమానిగా అయ్యి ఈ శరీరాన్ని నడిపించే, సదా బాబా స్మృతి హృదయంలో ఇమిడి ఉండే సంతానమును. కావున, కర్మయోగిగా అయ్యి కర్మను చేస్తున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి. కర్మయోగి అయితే యోగం బాబాతో ఉంటుంది. అప్పుడు బాబా 'సదా ఫాలో ఫాదర్' అని చెప్తారు. తండ్రి సదా తోడుగా ఉన్నప్పుడు మరి ఈ గ్రూపు ఏమి చేస్తుంది? ఇప్పుడు మీ మీ స్థానాలకు వెళ్ళి మీ ముఖముతో ఎంతో సంతోషమయ ముఖాన్ని అనుభవం చేయించండి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో సంతోషం తగ్గుతూ ఉంది, వారికి మీ ముఖము సంతోషాన్ని అనుభవం చేయించాలి. మున్ముందు దుఃఖము, అశాంతి పెరగనున్నాయి. ఇంత వినడానికి, కోర్సు తీసుకోవడానికి సమయం లభించదు కానీ మీ ముఖము వారికి సంతోషాన్ని అనుభవం చేయించాలి. వీలవుతుంది కదా! వీలవుతుందా? చేతులెత్తండి. ఇన్ని స్థానాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషాన్ని పంచాలన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. సదా సంతోషము, అప్పుడప్పుడూ కాదు ఎందుకంటే సంతోషము యొక్క విశేషత ఏమిటంటే, ఇతర ఏ వస్తువైనా ఇతరులకు ఇస్తే మీ వద్ద అది తగ్గిపోతుంది. మీ వద్ద రెండు వస్తువులున్నాయి, ఒకటి ఇచ్చేస్తే ఒకటి తగ్గినట్లే కదా. కానీ పూర్తి ప్రపంచంలో ఒకవేళ సంతోషాన్ని మీరిస్తే అది తగ్గుతుందా లేక పెరుగుతుందా? ఇటువంటి సంతోషము మీ దగ్గర ఉంది. కావున ఇప్పుడు అన్ని ఆత్మలకూ సంతోషాన్ని పంచండి. డబుల్ లాభము ఉంది, మీకూ పెరుగుతుంది, వారికీ పెరుగుతుంది.

మరి ఈ రోజు విశేషంగా ఈ పనిని గుర్తుంచుకోండి - సంతోషాన్ని పంచాలి. ఒకవేళ మీ దగ్గర సంతోషం లేదు, ఏదో ఒక విషయం కారణంగా సంతోషం వెళ్ళిపోయింది అని అనుకోండి, అప్పుడు మీరు బాబా నుండి సంతోషాన్ని తీసుకుని మీరు కూడా సంతోషంగా ఉండండి మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వండి. మరి ఇప్పుడు అందరూ ఏమి చేస్తారు? ముందు కూడా వినిపించాము, తీవ్ర పురుషార్థిగా అవ్వండి. నడుస్తున్నాము అనకండి, ఎగరండి. మరొక విషయము, బాప్ దాదా అటెన్షన్ ఇప్పించి ఉన్నారు, 'అప్పుడప్పుడూ' అన్న పదాన్ని సమాప్తం చెయ్యండి. సంతోషం ఉంది అంటారు కానీ అప్పుడప్పుడూ సమాప్తమైపోతుంది అని అంటారు. ఇప్పుడు 'అప్పుడప్పుడూ' అన్న పదాన్ని సదా కోసం ఇక్కడ వదిలేసి వెళ్ళండి. వదిలి పెట్టగలరా? వదులుతారా? చేతులెత్తండి, వదులుతారా? బాప్ దాదా పిల్లలందరికీ ఇప్పటినుండే సదా సంతోషంగా ఉండేందుకు అభినందనలు తెలుపుతున్నారు. మళ్ళీ అప్పుడప్పుడూ అన్న మాట అనకండి. సదా ఉండండి. మరి అందరూ సంతోషంగా ఉన్నారు కదా! సంతోషంగా ఉన్నారా? సదా సంతోషంగా ఉంటాము, ఈ ధైర్యము ఉన్నదా? అప్పుడప్పుడూ వచ్చే కొంచెం దుఃఖము, అశాంతిని ఈసారి మేము ఇక్కడే వదిలేసి వెళ్తాము, మాతో తీసుకువెళ్ళము అని ఎవరైనా అంటే, అంత ధైర్యము ఉంటే రెండ్రెండు చేతులెత్తండి. బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు. పిల్లల ధైర్యము తండ్రి సహాయము తప్పకుండా ఉంటుంది. మరి చాలా పెద్ద జోన్ వచ్చింది కదా. బాప్ దాదా కూడా చూసి సంతోషిస్తున్నారు. కొంచెం కష్టమయింది కానీ వచ్చారు కదా. బాప్ దాదాకు కూడా పిల్లలను కలిసి చాలా సంతోషంగా ఉంది. బాప్ దాదా సదా వాహ్ పిల్లలూ వాహ్! పాటను పాడుతూ ఉంటారు. అచ్చా. ఇప్పుడు ఒక్కొక్క జోన్ వారు లేవండి. 

తమిళనాడు జోన్:- తమిళనాడుకు బాప్ దాదా విశేష వరదానాన్ని ఇస్తున్నారు - సదా ఏ కార్యం చేస్తున్నా కానీ కార్యం చేసేకన్నా ముందు బాబా నుండి కార్య సఫలత కోసం స్పెషల్ వరదానాన్ని తీసుకుని బాప్ దాదా యొక్క వరదానీగా అయ్యి ఆ కార్యాన్ని చెయ్యండి, అప్పుడు సఫలత మీ జన్మ సిద్ధ అధికారము అయిపోతుంది. కార్యము చేసిన తర్వాత చెయ్యద్దు, ముందు వరదానము తీసుకుని ఆ తర్వాత కార్యము చేసినట్లయితే సఫలత మీతోటే ఉంటుంది. బాగుంది, మెజారిటీ జోన్లు సేవలో మంచి ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్ళడాన్ని బాప్ దాదా చూసారు. సేవలో ఎంత బిజీగా ఉంటారో అంత సమయమూ శక్తి లభించడం వలన నిర్విఘ్నంగా ఉంటారు. ఒకవేళ ఏవైనా విఘ్నాలు వచ్చినాకానీ విజయులుగా అయ్యి ప్రక్కకు నెట్టేస్తారు. అన్ని జోన్లు పురుషార్థం మంచిగా చేస్తున్నాయి. ప్రతి జోన్ యొక్క లక్ష్యం చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు మరియు సదా సంతోషపరుస్తూ ఉంటారు. సరేనా.

నేపాల్:- బాప్ దాదా ఈ జోన్ రిజల్టును చూసి కూడా సంతోషిస్తున్నారు. సేవ ఉల్లాసము బాగుంది అందుకే సదా కోసం సహయోగమును ఇస్తున్నందుకు, ముందుకు సాగుతున్నందుకు, వరదానీగా అయినందుకు అభినందనలు. వృద్ధి చెందుతూ ఉండండి, వృద్ది చెయ్యండి, బాప్ దాదా సదా తోడుగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? మంచిది, వృద్ధి ఉంది, ఇంకా వృద్ధి జరుగుతుంది.

బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం:- ఈ జోన్ కూడా మంచి సేవను చెయ్యడంలో మరియు విద్యార్థులను పెంచడంలో ముందుకు వెళ్తుంది. వీరికి విశేషంగా ధైర్యము యొక్క వరదానము ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ధైర్యమున్న కారణంగా తండ్రి సహాయము కూడా ఉంది మరియు ఇక ముందు కూడా ఉంటుంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. అంతే కాక సదా అమృతవేళ అంతా చుట్టి వస్తారు. సేవాకేంద్రాల స్థానాలు మంచి వృద్ధిని పొందే పద్ధతిని బాప్ దాదా చూసారు. బాప్ దాదా విశేషంగా ధైర్యానికి సదా తోడుగా నిలుస్తానని వరదానాన్ని ఇస్తున్నారు.

స్పార్క్ బిజినెస్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, మీడియా వింగ్స్ మీటింగ్: సగం హాలు వీరే కనిపిస్తున్నారు. అందరూ చేతులూపండి. చూడండి ఎంతమంది ఉన్నారో! సగం హాలు మీరే ఉన్నారు. మంచిది, ప్రతి వింగ్ లో ఉల్లాస ఉత్సాహాలు ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఉల్లాస ఉత్సాహాల కారణంగా మంచి మంచి సేవా అవకాశాలను కూడా తీసుకుంటున్నారు. కానీ బాప్ దాదా చెప్పిన ఒక్క విషయము ఇంకా చెయ్యాల్సి ఉంది. ప్రతి వింగ్ వారు ఇప్పటివరకూ తయారు చేసిన ముఖ్యులను, నిమిత్తులను, మంచి మంచి సహయోగులను, వారి లిస్టును ముందు పంపండి. వింగ్ స్థాపన అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది మరియు ఎవరెవరు నిమిత్తమయ్యారు అన్న లిస్టును ఇప్పుడు ముందుగా పంపండి, తర్వాత వారందరి సంగఠన చేస్తాము. ఎవరెవరు తయారయ్యారు, ఏ గ్రూపు పెద్దగా ఉంది, భిన్న భిన్న వృత్తులవారి లిస్టు తయారు చెయ్యండి. తర్వాత వేరు చేస్తాము కానీ లిస్టును తయారు చెయ్యండి. ప్రతి ఒక్కరూ ఎంతమంది రెగ్యులర్ స్టూడెంట్లను తయారు చేసారు, ఎంతమంది సంపర్కంలోకి వచ్చారు, ఎంతమంది సహయోగులుగా అయ్యారు, ఈ లిస్టు ప్రతి వింగ్ నుండి రావాలి. సహయోగులే తయారై ఉండి ఉండవచ్చు, కానీ ఆ సహయోగుల లిస్టు రావాలి. అప్పుడు జోన్ రిజల్టు అందరికీ తెలుస్తుంది. బాగుంది కదా. చేస్తారా? లిస్టు వ్రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీకు ప్రోగ్రాము లభిస్తుంది ఎందుకంటే శ్రమ చేస్తున్నారు కదా. వింగ్ వారు తమ తమ సబ్జెక్టుల సేవ బాగా చేస్తూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. రిజల్టు కూడా బాగుంది, బాప్ దాదా సంతోషిస్తున్నారు. చాలా బాగుంది, మంచిగా ఉంటుంది మరియు మీ రిజల్టును చూసి ఇతరులు కూడా ముందుకు వస్తారు. అందరూ చాలా చాలా ప్రియస్మృతులను స్వీకరించగలరు.

డబుల్ విదేశీయులు:- ఇప్పుడు డబుల్ విదేశీయుల చాలా మంచి సంగఠన కనిపిస్తుంది. బాప్ దాదా టైటిల్ ను స్పష్టం చేసినందుకు విదేశీయులను చూసి బాప్ దాదా విశేషంగా సంతోషిస్తారు. ఎందుకంటే భారతదేశ సేవ చేసినంత వరకు విశ్వ సేవాధారి అన్న టైటిల్ పెట్టుకోలేము కదా కానీ విదేశీ సేవ కారణంగా 'విశ్వ సేవకుడు' అన్న బాబా పేరు నిరూపించబడింది. మెజారిటీ విదేశీయులలోని ఒక విశేషత బాప్ దాదాకు నచ్చింది. అదేమిటంటే ఒకప్పుడు వారు తమ కల్చర్‌ను మార్చుకోవడము చాలా కష్టంగా భావించేవారు కానీ ఇప్పటి రిజల్టు ప్రకారంగా అందరూ బ్రాహ్మణ కల్చర్ కు అలవాటు పడ్డారు. పరివర్తన శక్తిని బాగా చూపించారు. అందుకే బాప్ దాదా డబుల్ విదేశీ స్థానాలలోని పిల్లలందరికీ అభినందనలు తెలుపుతున్నారు.

నలువైపుల ఉన్న విదేశీయులు తమ తమ ఏరియా సేవను కూడా పెంచుతున్నారు. చిన్న చిన్న స్థానాల వైపు కూడా అటెన్షన్ ఇస్తున్నారు. స్వ ఉన్నతిపై కూడా అటెన్షన్ ఉంది. పరస్పరం కలుసుకునే మధుబన్ మీటింగ్ కూడా బాప్ దాదాకు నచ్చుతుంది. ఇప్పుడు కూడా ఇంతమంది వచ్చారు. ఒక్కొక్కరినీ చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. బాబాతో కలిసి ఇతర బ్రాహ్మణులందరూ కూడా 'వాహ్ డబుల్ పురుషార్థీలూ వాహ్! అన్న పాటను పాడుతున్నారు. బాప్ దాదా సంతుష్టంగా ఉన్నారు. సంతుష్టమణులైన మీరు కూడా ముందుకు సాగుతున్నారు, సాగుతూ ఉంటారు. ఓం శాంతి.

ఇప్పుడు వచ్చిన సంగఠన ప్లానింగ్ బాగా చేస్తున్నారు. మీ స్థితి మరియు సేవా వృద్ధి యొక్క రెండు ప్లాన్లు బాబా వద్ద ఉన్నాయి. అటెన్షన్ ఉంది మరియు ముందుకు సాగే ఉత్సాహము కూడా ఉంది. కావున బాప్ దాదా సంతోషిస్తున్నారు, సంతోషిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అచ్ఛా.

నలువైపుల ఉన్న పిల్లలు, ఇండియావారు కావచ్చు, విదేశాలవారు కావచ్చు, నలువైపుల ఉన్న పిల్లలు ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో సమయ మార్పు ఉన్నప్పటికీ ప్రేమతో కలవడాన్ని బాప్ దాదా చూస్తున్నారు. సమయ తేడా ఉన్నప్పటికీ ఉత్సాహంగా ఉంటారు అందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఉన్నతి కూడా ఉంది మరియు ఉన్నతి జరుగుతూ ఉంటుంది - ఈ వరదానాన్ని బాప్ దాదా ఇస్తున్నారు. మంచి సేవను చేస్తున్నారు, జనక్ బిడ్డ నిమిత్తంగా ఉన్నారు. మంచి అటెన్షన్ ఇస్తున్నారు. తోడుగా ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారు కూడా ఏమీ తక్కువగా లేరు. ఇది బాప్ దాదా చూసారు. మరి ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారందరికీ విశేషమైన ప్రియస్మృతులను బాప్ దాదా ఇస్తున్నారు, ఇంకా లభిస్తూ ఉంటాయి.

రతన్ మోహిని దాదీతో:- మీరు బాధ్యతతో చేస్తున్నారు. అందుకు ప్రతిఫలం త్వరగా లభిస్తుంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. 

దాదీ జానకితో:- అంతా చేస్తున్నారు. (గుల్జార్ దాదీ చాలా మంచివారు) మీరు పరస్పరం మంచి ఫ్రెండ్స్.

మోహిని అక్కయ్య:- అభినందనలు. (ఈసారి పరిగెత్తుకుంటూ వస్తాను) జరుగుతుంది, ఏమంత పెద్ద విషయము కాదు. (బాప్ దాదాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు) మేము మీకిస్తాము. 

నిర్మల్ శాంత దాదీతో:- చాలా బాగా నవ్వుతారు. సేవా బలాన్ని మరియు మీ పురుషార్థ ఫలితాన్ని తింటున్నారు. బాగా చేస్తున్నారు. జోన్ చూసారా, జోన్‌ను కలిసారా! జోన్ తో కలవండి. 

డా॥ గుప్తా గారితో:- మంచిది, సేవ అంటే మేవా. సేవ కాదు మేవా. 

నిర్వైర్ అన్నయ్యతో: - అద్భుతం చేసారు. మీ ధైర్యము, తండ్రి సహాయము. అచ్ఛా, 

బృజ్ మోహన్ అన్నయ్య:- (ఢిల్లీలో చాలా పెద్ద ప్రోగ్రాము చేస్తున్నాము, ఇద్దరు దాదీలూ రావాలని మేము కోరుకుంటున్నాము. ఆ సమయంలో తుఫాను వస్తుందని సమాచారము ఉంది. మేము టెంట్లు వేస్తున్నాము) సాక్షిగా అయ్యి డ్రామాను చూడండి, అందరూ నిశ్చింతగా ఉండండి. ఏది జరగేదుందో అది జరుగుతుంది, కానీ మీరు క్షేమంగా ఉండండి. ముందు నుండే తెలుసు కదా మరి దాని అనుసారంగా ఏర్పాట్లు చేసుకోండి. (శాంతి అక్కయ్య అనారోగ్యంతో ఉన్నారు, వారు తమ స్మృతిని పంపారు) వారికి విశేషంగా బాప్ దాదా తరఫున ప్రియస్మృతులను ఇవ్వండి. (రుక్మిణి దాదీ కూడా స్మృతిని ఇచ్చారు) ఢిల్లీలో బాగా సేవ చేసారు, వారికి కూడా స్మృతిని ఇవ్వండి. (ఆశా సోదరి మరియు ఇతర తోటి సోదరీలు చాలా బాగా సేవ చేస్తున్నారు) సేవలో ఉత్సాహమైతే అందరిలో చాలా బాగా ఉంది. అందరూ కలిసి ఉన్నారు, ఇందుకు అభినందనలు. (పెద్ద ప్రోగ్రాము కోసం ప్రేరణ) ఎవరు వచ్చినా కానీ వారు ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి - ఇదే ప్రేరణ. ఏమి తీసుకువెళ్ళాలి? వాతావరణం నుండి శాంతి వైబ్రేషన్లు, ముందుకు సాగాలన్న వైబ్రేషన్లను తీసుకువెళ్ళాలి. వింటూనే ఉంటారు, మంచిగా అనిపిస్తుంది కానీ మంచిగా అవ్వాలన్న ప్రేరణను తీసుకువెళ్ళాలి. ఈ ప్రయత్నం చెయ్యండి. 

రమేష్ అన్నయ్యతో :- మీ సేవ గురించి కూడా బాప్ దాదా వింటారు, బాగా చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. ఏ ప్లాన్ అయితే చేస్తున్నారో అది ప్రాక్టికల్ లో చేస్తూ చేస్తూ వృద్ధి జరుగుతుంది. బాప్ దాదా అందరికీ ప్రియస్మృతులను ఇస్తున్నారు, అందరికీ చేర్చండి. మంచిది. సేవా ఉల్లాసము నలువైపుల బాగా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఏ ప్రోగ్రాము జరిగినా దానితో వారసులు తయారు కావాలి, సహయోగులు తయారవ్వాలి, మరియు వారిని కనెక్షన్లో పెట్టుకుని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి, ఇప్పుడు ఇటువంటి అడిషన్ చెయ్యండి. వారు ముందుకు వచ్చినప్పుడు మీరు వారి వెనకే ఉండి వారిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి, ముందుకు వెళ్తారు. 

భూపాల్ అన్నయ్యతో: - అంతా మంచిగా జరుగుతుంది. 

మృత్యుంజయ అన్నయ్య బాప్ దాదాకు భూపాల్ వైస్ ఛాన్సలర్ అక్కడ యూనివర్సిటీలో వాల్యూ ఎడ్యుకేషన్ ప్రారంభించడంలో మెమోరాండంపై సంతకం చేసారని వివరించారు:- మంచి ఉల్లాస ఉత్సాహాలను చూపించారు. బాప్ దాదా కూడా విన్నారు, అందుకు ముందుగానే అభినందనలు తెలుపుతున్నారు. అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది. 

బాప్ దాదా అకోలా సెంటర్‌ను బటన్ నొక్కి ప్రారంభించారు:- అందరి ఉల్లాసము చాలా బాగుంది. ఎక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయో అక్కడ వృద్ధి తప్పకుండా ఉంటుంది. 

ఎకామడేషన్ సేవాధారీ సోదరులతో:- చాలా బాగా సంభాళించారు. అందరూ సంతుష్టంగా ఉన్నారు, ఎవ్వరినుండీ ఫిర్యాదు లేదు, ఈ శ్రద్ధ బాగా ఉంచారు. ఇందుకు అభినందనలు. 

కుంజ్ దాదీ అనారోగ్యంతో ఉన్నారు, అహ్మదాబాద్ లో ఉన్నారు:- వారికి విశేషంగా బాప్ దాదా తరఫున టోలీ పంపండి. ధైర్యము కలవారు, తండ్రి సహాయము కూడా ఉంది. ముందు కొంచెం దూరదూరంగా ఉన్న కారణంగా పెరిగింది. సంభాళించే వారు అంత తెలివైనవారు కాదు. ఇప్పుడు ఇక్కడకు (అహ్మదాబాద్) వచ్చారు కదా, బాగైపోతారు.

నీహా అక్కయ్యతో: - (అందరికీ చాలా ప్రేమతో సేవ చేస్తారు) మీ సేవతో బాప్ దాదా కూడా సంతుష్టంగా ఉన్నారు. స్వయాన్ని సంతుష్టమణిగా భావించండి. మీ టైటిలే సంతుష్టవణి.

Comments