19-02-2012 అవ్యక్త మురళి

            19-02-2012         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“ఇంటి గేటును తెరిచేందుకు అనంతమైన వైరాగ్యవృత్తి ద్వారా దేహ-అభిమానపు 'నేను' అన్నదానిని త్యాగము చెయ్యండి, బర్త్ డే రోజు దృఢత ద్వారా చెప్పటము మరియు చెయ్యటమును ఒక్కటిగా చేసి సఫలతామూర్తులుగా అవ్వండి" 

ఈరోజు బాప్ దాదా నలువైపుల గల పిల్లలను చూసి హర్షితులవుతున్నారు. నలువైపుల నుండి వాహ్ బాబా, వాహ్ అన్న హృదయ ధ్వనియే వస్తూ ఉంది. బాబా హృదయము నుండి కూడా వాహ్ పిల్లలూ, వాహ్ అన్న ధ్వనియే వస్తుంది. ఈరోజు అందరూ చాలా ఉల్లాస-ఉత్సాహాలతో దివ్యజన్మపు సంతోషాన్ని జరుపుకుంటున్నారు, తోడుగా బాబా కూడా పిల్లల సంతోషాన్ని జరుపుతున్నారు. ఈరోజు తండ్రి మరియు పిల్లల ఇరువురి జన్మదినము, ఇది విచిత్ర జయంతి కలిగిన రోజు.కనుక మీరందరు కూడా అభినందనలను ఇస్తున్నారు కూడా మరియు తీసుకుంటున్నారు కూడా ఎందుకంటే బాబా జన్మను తీసుకున్నదే యజ్ఞమును రచించేందు కొరకు. కావున యజ్ఞములో బ్రాహ్మణ పిల్లలు కూడా కావాలి. కావున తండ్రి మరియు పిల్లల జయంతి కలసిన జయంతి ఇది ఒక్క జయంతియే. కావున ఈ శివ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత స్నేహముతో అభినందనలను ఇచ్చేందుకు వచ్చారు అన్నదానిని బాబా చూస్తున్నారు మరియు బాబా కూడా అభినందనలను ఇచ్చేందుకు వచ్చారు. ఈ జయంతి అతి స్నేహము గల జయంతి. స్నేహీ పిల్లలు, స్నేహీ తండ్రి మరియు స్నేహ జయంతి.

బాప్ దాదా వద్దకు నలువైపుల గల దేశ, విదేశములలోని పిల్లలందరి స్నేహము చేరుకుంటూ ఉంది. బాబా ప్రతి ఒక్క స్నేహీ పిల్లలకు పదమాగుణ స్నేహముతో నిండిన అభినందనలను ఇస్తున్నారు. ఈ స్నేహము ప్రతి పిల్లవాడిని సహజ కర్మయోగిగా చేయించేటటువంటిది. ఈ స్నేహము సదా సహజముగా చేయించేటటువంటిది. శక్తిశాలిగా చేసేటటువంటిది. బాప్ దాదాది ఒంటరి జన్మదినము కాదు ఎందుకంటే బాబా ఎల్లప్పుడూ పిల్లలతోటి ఉండేవారు. తోడుగా ఉంటారు, తోడుగా నడుస్తారు, తోడుగా రాజ్యము చేస్తారు. మీ అందరిదీ ఇదే ప్రతిజ్ఞ కదా! తోడుగా ఉండాలి, తోడుగా ఎగరాలి మరియు తోడుగా రాజ్యము చెయ్యాలి! 

బాప్ దాదాకు ఈ రోజు మీ భక్తులు కూడా విశేషంగా గుర్తుకు వస్తున్నారు ఎందుకంటే మీరు దేనిని చేసారో దానిని మీ భక్తులు చాలా మంచిగా కాపీ చేసారు ఎందుకంటే ద్వాపరయుగములో పరంధామము నుండి మొదట-మొదటగా వచ్చారు కనుక జన్మ సదా సతో ప్రధానముగా ఉంటుంది కావున వారు కాపీ కూడా చాలా మంచిగా చేసారు. కావున ఈరోజు పిల్లలతో పాటు మీ భక్తులు కూడా గుర్తు వస్తున్నారు. వతనములో అయితే ఈ రోజు అమృతవేళ నుండి చాలామంది పిల్లల ప్రకాశము ఉండింది. నేను బాప్ దాదాకు నా అభినందనలను ఇస్తాను మరియు బాప్ దాదా కూడా పిల్లల ప్రతి ఒక్కరి అభినందనలను చాలా స్నేహముతో స్వీకరించారు అని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకున్నారు. కావున ఈరోజు వతనములో ఈ మేళా ఉండింది. ఒకవైపు పిల్లలైన మీరు ఉన్నారు, మరొకవైపు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళి ఉన్న మీ సహచరులు వచ్చి ఉన్నారు. దాదీలు మరియు అనన్య సోదరుల లిస్ట్ చాలా పెద్దగా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ప్రతి ఒక్క దాదీ కూడా బాప్ దాదాకు అభినందనలను తెలిపారు, దానికి తోడుగా భాగ్యవంత పిల్లలైన మీకు కూడా అభినందనలను తెలిపారు. కావున వతనములో ఈరోజు అభినందనల మేళా ఉండింది. విశేషంగా అడ్వాన్స్ పార్టీకి చెందిన దాదీలందరు మరియు సోదరులు విశేషంగా నిమిత్తమై తోడుగా ఉండే ఆత్మలందరినీ గుర్తు చేస్తూ చాలా హృదయపూర్వక అభినందనలను ఇస్తూ ఉండినారు. కావున అందరి తరఫు నుండి కూడా బాప్ దాదా మీకందరికీ అభినందనలను ఇస్తున్నారు. స్వీకరించారా? ఇప్పుడు విశేషంగా అందరు సోదరీ సోదరులకు ఒకటే శబ్దము ఉంది అది - ఇప్పుడు ఇంటి గేటును ఎప్పుడు తెరుస్తారు? విశేషంగా దీదీ, దాదీలు ఇలా చెప్పారు - ఇంటికి వెళ్ళేందుకు ఏ తారీఖును ఫిక్స్ చేసారు అని మా సఖులను, సోదరులను మావైపు నుండి అడగండి. అందరూ కలిసే వెళ్తారు కదా! విడి విడిగా అయితే వెళ్ళరు కదా? తలుపును తెరిచేందుకు అందరూ కలిసి హాజరవుతారు. వారు డేట్ అడిగారు. బాప్ దాదా నవ్వారు ఎందుకంటే ఇప్పుడు గేటును తెరిచేందుకు పిల్లలందరికీ అనంతమైన వైరాగ్యవృత్తి అవసరము అని తండ్రి కూడా కోరుకుంటున్నారు. గేటును తెరిచేందుకు ఇదే తాళపుచెవి.

బాప్ దాదా అయితే ఎల్లప్పుడూ ఇలా అంటూ ఉంటారు - అనంతమైన వైరాగిగా అయ్యి వ్యర్థ సంకల్పము మరియు వ్యర్ధ సమయము, రెండిటినీ కలిపి అతి త్వరగా త్యాగము చెయ్యాలి అనగా అనంతమైన వైరాగిగా అవ్వాలి ఎందుకంటే అన్నింటికన్నా పెద్ద విఘ్నము దేహ-అభిమానము అన్నది బాప్ దాదా చూసారు. ఈ దేహ-అభిమానమును త్యాగము చెయ్యటము, మరియు నడుస్తూ-తిరుగుతూ దేహీ అభిమానిగా అవ్వటము, ఇదే అనంతమైన వైరాగ్యము.

నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అని అయితే అందరూ అంటారు. ఎప్పుడైతే హృదయము నుండి నా అని అంటారో, ఈ దేహ-అభిమానపు “నేను” అన్న రూపములోకి వచ్చే ఈ దేహ-అభిమానము, బాబా ఎల్లప్పుడూ ఇలా అంటుంటారు - ఈ “నేను” అన్న భానము ఏదైతే వచ్చేస్తుందో, నేను ఏదైతే చేస్తానో, నేను ఏదైతే అంటానో అదే కరెక్ట్ అనుకుంటారు. ఒక నేను అన్నది సాధారణమైనది, నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. మరొక సూక్ష్మమైన నేను, ఏది వినిపించారో దానిని నేను చేసాను, నేను దీనిని చెయ్యగలను, నేనే కరెక్ట్, ఇటువంటి సూక్ష్మమైన నేను అన్నదానిని సమాప్తము చెయ్యాలి. దేహ-అభిమానము ఈ రూపములో వస్తుంది. కావున ఈ రోజు బాప్ దాదా ఎవరైతే తండ్రి విశేషతలను కూడా నావిగా భావించి 'నేను' అన్న భానమును ఉంచుతారో, అటువంటి సూక్ష్మమైన నేను అన్నదానిని సమాప్తము చెయ్యాలి అని అంటున్నారు. చూడండి, స్మృతిచిహ్నాలను ఏదైతే తయారుచేస్తారో అందులో కూడా బలిని ఇచ్చేటప్పుడు స్వయాన్ని బలి ఇచ్చుకోరు కానీ దేనిని బలి ఇస్తారు? మేకను. మేకను ఎందుకు అన్వేషించారు? ఎందుకంటే మేక మే మే అనే అంటుంది. భక్తులు చాలా మంచిగా కాపీ చేసారు. మరి ఈరోజు ఈ దేహ-అభిమానపు నేను అన్నదానిని పురుషార్థము చేసి సమాప్తము చెయ్యగలరా? తండ్రి పుట్టినరోజుకు వచ్చారు, కనుక ఏదైనా కానుకనైతే ఇస్తారు కదా! మరి బాబాకు వేరే ఇతర ఏ కానుక అవసరము లేదు, ఈ సూక్ష్మమైన మైపన్(నాది అన్న భావము)ను, ఈ కానుకనే ఈ జన్మదినము నాడు తండ్రికి కానుకగా ఇవ్వండి అని తండ్రి అంటారు. ఇవ్వగలరా? ఇస్తారా? ధైర్యము ఉందా? ధైర్యము ఉందా? చేతులెత్తండి. చేతులెత్తి అయితే సంతోషపరిచారు. చేతులెత్తారు అంటే కానుకను ఇచ్చేసారు కదా! ఇచ్చేసిన కానుకను ఎవరైనా తిరిగి తీసుకుంటారా? బాబా, మేము కోరుకోలేదు కానీ వచ్చేస్తుంది అని చాలామంది పిల్లలు అంటారు. కారణము ఏమిటి? ఒకవేళ కారణమును అడిగినట్లయితే చాలా మంచి సమాధానాన్ని ఇస్తారు. ఇలా అంటారు - తెలుసు కూడా, ఒప్పుకుంటాము కూడా కానీ ఏం చెయ్యాలి? తిరిగి వాపస్ వచ్చేస్తుంది. ఆలోచించండి! ఒకవేళ ఇచ్చేసిన వస్తువు మరల మీ వద్దకు వచ్చినట్లయితే దానిని మీ వద్ద ఉంచుకుంటారా? ఒకవేళ మీరు హృదయపూర్వకంగా ఇచ్చారు. ఒకవేళ తిరిగి వచ్చిందనుకోండి, దానిని మీవద్ద ఉంచుకుంటారా? కారణము ఏమిటి? తండ్రిపై ప్రేమ ఉంది కదా, ప్రేమ ఉన్న కారణంగా బాబా ఏదైతే చెప్తారో దానిని చెయ్యాలని అనుకుంటారు, ఈ రిజల్టు బాబా వద్దకు కూడా వస్తుంది కానీ ఏమిటంటే, దృఢత తక్కువగా ఉంది, దృఢతను ఉపయోగించండి. సంకల్పము చేస్తారు కానీ ఒకటేమో సంకల్పము చెయ్యటము, మరొకటి దృఢ సంకల్పము చెయ్యటము. కావున పదే పదే చేసిన సంకల్పములో దృఢతను తీసుకురావటము, ఈ అటెన్షన్ తక్కువగా ఉంది. దృఢత సఫలతకు తాళపు చెవి. మరి ఈ రోజు ఏం చేస్తారు? సంకల్పము చేస్తారా లేక దృఢ సంకల్పము చేస్తారా? ఒకవేళ మీది దృఢ సంకల్పము అయినట్లయితే దానికి గుర్తు దృఢత సఫలతకు తాళపు చెవి. తాళపు చెవిని ఉపయోగించడంలో లోపము ఉంటుంది కావున సంపూర్ణ సఫలత లభించదు.

ఈరోజు బాప్ దాదా పిల్లల పుట్టినరోజు, తండ్రి పుట్టినరోజు కూడా. మరి ఇది విశేషమైన రోజు కదా! మొత్తము కల్పమంతటిలో తండ్రి, పిల్లలు ఒకే సమయములో జన్మించటము, ఈ పుట్టినరోజు విశేషత ఇదే. ఈరోజు తండ్రి దీనినే కోరుకుంటున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరూ ఈరోజు తమ హృదయాలలో దృఢతను తీసుకువచ్చి మేము వ్యర్థ సంకల్పము మరియు వ్యర్ధ సమయము నుండి రక్షించుకుంటాము అని ఈ దృఢ సంకల్పమును చెయ్యాలి, ఎందుకంటే మొత్తము దినమును అటెన్షన్ పరిశీలించుకున్నట్లయితే మధ్య మధ్యలో సమయము మరియు సంకల్పము వ్యర్థముగా పోతాయి. బాప్ దాదా అయితే అందరి రిజిస్టర్‌ను చూస్తారు కదా! వాటిని రక్షించటము అనగా సమాప్తి సమయమును సమీపముగా తీసుకురావటము. తయారుగా ఉన్నారా? ఇప్పుడు చెప్పినా కూడా వచ్చేస్తుంది, ఏం చెయ్యాలి? వ్యర్థము యొక్క పని రావటము, మరి మీ పని ఏమిటి? కూర్చోపెట్టడమా? కూర్చోపెట్టారు కనుకనే అది కూడా ఇంటిని తయారుచేసుకుంది. దృఢత లేదు అని అది కూడా అర్థం చేసుకుంది కావున ఈ స్నేహపురోజున అందరి హృదయాలలో ఇప్పుడు ఏముంది? అమృతవేళ నుండి ఈ రోజు అందరి హృదయాలలో పదే పదే ఏం వస్తుంది? నా బాబా, నా బాబా, నా బాబా. తండ్రి హృదయములో కూడా నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు..... మెజారిటీ తండ్రి స్మృతిలో ఉన్నారు, రోజు ప్రభావము ఉంది, బాప్ దాదా నోట్ చేసారు. స్నేహపురోజు అయిన కారణంగా పదే పదే అందరికీ నా బాబా, నా బాబా అన్నది చాలా సమయము గుర్తు ఉండింది. అంతేనా! ఇందులో చేతులెత్తండి. నేటి విషయము. నా బాబా గుర్తు ఉందా? మరేదైనా గుర్తు ఉందా? లేదు కదా? అలా అలా చేతులెత్తుతున్నారు, చాలా మంచిది. ప్రతిరోజూ పదే పదే పరిశీలించుకోండి, సంగమయుగములోని ప్రతిరోజు స్నేహ దివసము. ఈరోజు విశేషదినమైన కారణంగా ఎక్కువగా గుర్తు ఉంది కదా! అలాగే అమృతవేళ దీనిని స్మృతిలో ఉంచుకోండి - సంగమయుగములోని ఒక్కొక్క దినము ఎంత గొప్పది! ఒక్క చిన్నని జన్మలో 21 జన్మల ప్రాప్తి గ్యారంటీ. మరి ఒక్కొక్క రోజుకు ఎంతటి మహత్వము ఉంది! ఎక్కడి 21 జన్మలు మరియు ఎక్కడి ఈ చిన్నని ఒక్క జన్మ.

కనుక బాప్ దాదా ఈరోజు పిల్లలైన మీవద్ద నుండి పుట్టినరోజుకు ఈ కానుకను కోరుకుంటున్నారు. కానుకను ఇస్తారా? ఇస్తారా? చూస్తాము, చేస్తాములే అని కాదు. చెయ్యాల్సిందే. ఏమైనా కానీ త్యాగమంటే త్యాగమే. ఇది త్యాగము కాదు కానీ భాగ్యము. మరి ఒకవేళ సరిగ్గా చేతులెత్తినట్లయితే ఈ రోజు మహత్వపూర్ణక దినమైంది కదా! ఇప్పటినుండి మీ ముఖముపై వ్యర్థము యొక్క సమాప్తి మరియు సదా స్మృతి స్వరూపపు ప్రకాశము ముఖము మరియు నడవడికలో రావాలి. మాయ మాటలైన ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా.... ఇవి సమాప్తమైపోవాలి, అప్పుడే ముఖము మరియు నడవడిక సేవ చేస్తాయి. ఇప్పుడు ఎక్కువ ప్రభావము భాషణలది ఉంది. భాషణలు చాలా మంచిగా చేస్తున్నందుకు బాప్ దాదాకు సంతోషము ఉంది కానీ దినప్రతిదినము ఏవిధంగా ఇప్పుడు ఈ భాషణల ద్వారా, వాణి ద్వారా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలను చాలా మంచిగా ఉంచారు మరియు సఫలతను కూడా పొందారో, అలాగే ఇప్పుడు సమయప్రమాణంగా ఎక్కువ సేవ మీ ముఖము మరియు నడవడిక ద్వారా ఉంటుంది. దాని అభ్యాసము, ఏవిధంగా భాషణల అభ్యాసమును చేస్తూ చేస్తూ చాలా తెలివైనవారుగా అయిపోయారు కదా! అలా ఇప్పుడు ముఖము మరియు నడవడిక ద్వారా ఎవరికైనా కూడా సంతోషపు వరదానమును ఇవ్వండి, ఈ అభ్యాసమును చెయ్యండి ఎందుకంటే సమయము తక్కువగా లభిస్తుంది కావున సమయము మరియు సంకల్పమునకు మహత్వమును ఉంచుతూ ముందుకు వెళ్తూ ఉండండి. అంతా అకస్మాత్తుగా అయ్యేది ఉంది కావున పుట్టినరోజు అయితే గుర్తు ఉంటుంది కదా! పుట్టినరోజు రావాలి, రావాలి అని ఎంత సమయము గుర్తు వచ్చింది? బాప్ దాదా రావాలి, రావాలి, కలవాలి, దీనిని ఎంత సమయము నుండి గుర్తు ఉంచుకున్నారు? ఇప్పుడు ఈ సంకల్పమును చెయ్యండి, దృఢత ద్వారా వ్యర్థ సమయము మరియు వ్యర్థ సంకల్పములను సమాప్తము చెయ్యాలి. నా బాబా, నా బాబా అనేదానిని మనసులో ఉంచుకుంటూ, చెప్పటము వేరే సంగతి కానీ హృదయములో ఇముడ్చుకోవటము, హృదయానికి చెందిన విషయము ఎప్పుడూ మర్చిపోరు. నోటి నుండి వచ్చే విషయము మర్చిపోవచ్చు కానీ హృదయానికి చెందిన విషయము, అది మంచిదైనా, చెడుదైనా రెండింటినీ మర్చిపోరు. మరి ఈరోజు బాప్ దాదాకు కానుకనైతే ఇచ్చారు కదా! రెండు చేతులెత్తండి. అరే, వాహ్! ఈ ఫోటోను తియ్యండి. బాప్ దాదా కేవలము చేతులను చూడరు, బాప్ దాదా మీ హృదయాలను చూస్తున్నారు.

మరి నేటి కానుకను మీకు కూడా ఇచ్చారు మరియు తండ్రికి కూడా ఇచ్చారు. ఒకవేళ మీ వ్యర్ధ సమయము మరియు సంకల్పముల నుండి రక్షింపబడినట్లయితే మీ రోజు ఎలా గడుస్తుంది? సదా అదృష్టవంతులు మరియు ఆనందము కలవారిగా అయిపోతారు. కావున ఇప్పుడు అమృతవేళ బాప్ దాదాతో మిలనమును జరుపుకున్న తరువాత ఈ సంకల్పమును రోజూ స్మృతిలోకి తీసుకురావాలి మరియు మొత్తము రోజంతటిలో మధ్యమధ్యలో పరిశీలించుకోవాలి. బాప్ దాదా టైమ్ ను ఫిక్స్ చెయ్యరు కానీ మీరు మీ టైమ్ ను ఫిక్స్ చేసుకోండి. మధ్యమధ్యలో పరిశీలించుకోవాలంటే, పుట్టినరోజునాడు బాప్ దాదా ముందు ఏ ప్రతిజ్ఞనైతే చేసానో ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటున్నానా? దీనిని మీకు మీరే పరిశీలించుకోండి. కోరుకోవటమైతే అందరూ కోరుకుంటారు. బాప్ దాదా ఈరోజు అందరి ముఖాలలో ఆ, చేస్తాము, చేస్తాము, చేస్తాము అన్నదానిని చూస్తున్నారు కానీ ఈ వ్యర్థము వచ్చేస్తుంది కదా, కనుక తండ్రితో చేసిన ప్రతిజ్ఞను కూడా మరిపింపజేస్తుంది. కనుక వ్యర్థము సమాప్తము. ఒక్కక్షణము, ఇప్పుడైనా ఒక్క క్షణము శక్తిశాలీ ఆత్మగా అయ్యి వ్యర్థమును సమాప్తము చెయ్యవలసిందే అన్న సంకల్పమును చెయ్యండి. అచ్ఛా!

బాప్ దాదా ఒక్క పిల్లవాడిని కూడా తన సమానంగా తయారుచేయించకుండా ఉండలేరు. ప్రేమ ఉంది కదా! చూడండి, ప్రేమకు గుర్తు ఈరోజు. తండ్రి మరియు పిల్లల జన్మ ఒకేరోజు ఉండటము, మొత్తము కల్పములో తండ్రి మరియు పిల్లల ఇటువంటి రోజు మరొకటి ఉండదు. తండ్రికి తన ప్రతి పిల్లవాని పట్ల హృదయపూర్వక ప్రేమ ఉంది - నా పిల్లలు, పరమాత్మ పిల్లలు, ఏ సంకల్పమును చేస్తారో ఆ సంకల్పము సఫలమైపోవాలి. ఒక్కొక్క సంకల్పములో శక్తి ఉండాలి, చెప్పటము మరియు చెయ్యటము ఒక్కటిగా ఉండాలి. అన్నారు అంటే జరగటమే. శుద్ద సంకల్పము ఉండాలి. అప్పుడు వ్యర్థము స్వతహాగనే సమాప్తమైపోతుంది ఎందుకంటే అడ్వాన్స్ పార్టీవారు డేట్ ను కోరుకుంటున్నారు. మీ పెద్ద పెద్ద దాదీలు, పెద్ద పెద్ద సోదరులు, వారందరిపట్ల ప్రేమ అయితే ఉంది కదా! దాదీని, దీదీని, చంద్రమణిని ఎంత గుర్తు చేస్తారు? అందరి పేర్లనూ తీసుకుంటూ వెళ్ళండి. అందరినీ గుర్తు చేస్తారు. మరి వారు దేనిని కోరుకుంటున్నారో దానిని చేసి చూపించండి కదా! మరి ఈరోజు ఏ సంకల్పము ఉంది? చెప్పటము మరియు చెయ్యటము ఒక్కటిగా ఉండాలి. సరేనా! మరి ఈ రోజు నలువైపుల గల పిల్లలకు బాప్ దాదా పుట్టినరోజు కానుకగా దీనినే ఇస్తున్నారు “చెప్పటము మరియు చెయ్యటము”ను ఒక్కటి చెయ్యండి. దృఢత అనే కానుకను ఈరోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ఇస్తున్నారు. శుభకార్యమును దృఢత ద్వారా సఫలము చెయ్యండి.

ఇకపోతే, ఈ రోజు మొదటిసారిగా ఎవరైతే వచ్చారో వారు లెయ్యండి. చేతిని ఊపండి. వచ్చే పిల్లలు వచ్చేసారు, నా బాబా అన్నది తెలుసుకున్నారు, ఇందుకు బాప్ దాదా చాలా చాలా అభినందనలను ఇస్తున్నారు. బాప్ దాదాకు సంతోషంగా ఉంది, అలజడి ఏదైతే జరిగేది ఉందో దానికి ముందే చేరుకున్నారు, అందుకు అభినందనలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సంకల్పమును చెయ్యండి, దృఢమైన సంకల్పము, సాధారణ సంకల్పము కాదు, తీవ్ర పురుషార్థిగా అవ్వవలసిందే అన్న దృఢ సంకల్పమును చెయ్యండి, తీవ్ర పురుషార్థి, సాధారణ పురుషార్థి కాదు. రాబోయే మీ రాజ్యములో వస్తారు కావున సాధారణ సంకల్పమును చేసే సమయము పూర్తయిపోయింది. ఇప్పుడు తీవ్ర పురుషార్థము చేసే సమయము, ఛాన్స్ (అవకాశము) ఉంది, ఛాన్స్ తీసుకునే ఛాన్సర్లుగా అయిపోయారు. కావున బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి సంతోషించారు మరియు ప్రతి ఒక్కరికీ ఇలా చెప్తున్నారు - తీవ్ర పురుషార్థము చేసినట్లయితే తోడుగా వెళ్తారు, తోడుగా ఉంటారు. మరి అభినందనలు, అభినందనలు, అభినందనలు.

సేవ టర్న్ యు.పి, బనారస్ మరియు పశ్చిమ నేపాల్ వారిది - ఆది స్థాపన నుండీ యు.పి. వారు భాగ్యవంతులు ఎందుకంటే బ్రహ్మబాబా మరియు జగదంబలు ఈ పిల్లలను కలవటానికి ఎంత సమయము వెళ్ళారో, అంత సమయము మరెవ్వరివద్దకు బాంబే మరియు ఢిల్లీని తప్పించి మరెక్కడికీ వెళ్ళలేదు. కావున అదృష్టవంతులు, బ్రహ్మబాబా మరియు జగదంబలు అడుగు పెట్టగానే పిల్లలకు స్నేహము లభించింది. డైరెక్ట్ బ్రహ్మబాబా మరియు జగదంబల పాలన లభించింది కావున యు.పి. వారు భాగ్యవంతులు. వీరిలో సేవ యొక్క ఒక విశేషత సేవాకేంద్రాలను కూడా బాగా తెరవటము, దీనిని బాప్ దాదా చూసారు. చాలామంది కుమారీలకు టీచర్ గా అయ్యే భాగ్యము లభించింది కావున చాలామంది టీచర్లు సేవలో నిమగ్నమైయున్నారు మరియు తోడుగా ధ్వనిని కూడా వ్యాపింపచేసారు. ఇకపోతే బాప్ దాదా ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నారో అదైతే మీకు తెలుసు, ఇప్పుడు బాప్ దాదా ప్రతి ఒక్క జోన్ వారికి ఇదే చెప్తున్నారు - ఇప్పుడు వారసత్వపు క్వాలిటీ కలిగినవారిని తండ్రి ఎదురుగా తీసుకురండి. ఇప్పుడు బాప్ దాదా అన్ని జోన్లకు ఇదే చెప్తున్నారు - ప్రతి ఒక్క జోన్ లో లేక ప్రతి సెంటర్ లో వారసత్వపు క్వాలిటీ కలిగినవారు ఎంతమంది ఉన్నారు అన్నదానిని బాప్ దాదాకు తెలపాలి, ప్రతి ఒక్క జోన్  వారు, డబుల్ విదేశీ వారుకూడా ప్రతి స్థానములో ఉన్న వారసత్వ పిల్లల లిస్టు బాప్ దాదా వద్దకు పంపాలి ఎందుకంటే సమయము సమీపముగా వస్తూ ఉంది కావున ఇప్పుడు సేవ గతిని తీవ్రము చెయ్యండి. ప్రతి జోన్లో రెగ్యులర్ స్టూడెంట్ లయితే చాలామంది ఉన్నారు కానీ వారసత్వపు క్వాలిటీ కలవారు అనగా తనువు-మనసు-ధనము ద్వారా, సంబంధ-సంపర్కముల ద్వారా ప్రతి కార్యములో సహయోగిగా ఉండాలి. కేవలము మీ సెంటరు సహయోగీలే కాదు, కానీ యజ్ఞ స్నేహీ వారసులుగా ఉండాలి. వారసులుగా ఉండటము అంటే సెంటరు సేవలో చాలా మంచిగా ఉండటమే కాదు, వారసులు అంటే అర్థమే స్నేహ సహయోగము మరియు సేవాధారి. ఇలా ప్రతి ఒక్క జోన్ వారు లిస్టు పంపాలి. మధువనములోని వారు లిస్టు చూడాలి, తెప్పించుకోవాలి. వారసులు అని ఎవరిని అనబడుతుంది మరియు వారసులు ఏమేమి చెయ్యవలసి ఉంటుంది అన్నదానిని మరల బాప్ దాదా రిజల్టును వినిపిస్తారు. యు.పి. వారు తమ పాత్రను పోషించటానికి ఎవరైతే వచ్చారో, వారు ఈ టర్న్ లాభాన్ని చాలా పొందారు. ప్రతి ఒక్క జోన్ వారు లాభాన్ని పొందుతారు, యూ.పి.వారు కూడా మంచి ఛాన్స్ ను తీసుకున్నారు. అనేక ఆత్మలకు ఛాన్స్ ఇప్పించారు, అందుకు అభినందనలు, అభినందనలు.

బాప్ దాదా పిల్లలైన ప్రతి ఒక్కరికీ, ఎవరైతే నిలబడ్డారో ఆ ప్రతిఒక్కరికీ పుట్టినరోజు అభినందనలను ఇస్తున్నారు మరియు దానికి తోడుగా భవిష్యత్తులో తీవ్ర పురుషార్థీభవ అన్న వరదానమును ఇస్తున్నారు. అచ్ఛా!

95 దేశాలనుండి 1300 మంది డబుల్ విదేశీయులు వచ్చారు - చాలా మంచిది, మధువనానికి అలంకారమైనవారు మధువనానికి చేరుకున్నారు. డబుల్ విదేశీయులకు మధువనముపై చాలా ప్రేమ ఉంది మరియు మధువనమువారికి కూడా డబుల్ ఫారినర్స్ పై ప్రేమ ఉంది. డబుల్ ఫారినర్స్ మధువనమునకు అలంకారము. కాన్ఫ్ రెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిని అందరూ చాలా మంచిరీతిలో చేసారు. స్థలము కొంచెము తక్కువగా లభించింది, ముందు ముందు ఇది కూడా అయిపోతుంది. డబుల్ ఫారినెర్స్ కి బాబా ఈ వరదానమును ఇస్తున్నారు - జగదంబ యొక్క రెండు మాటలు, తండ్రి చెప్పటము మరియు పిల్లలు చెయ్యటము, జగదంబ యొక్క ఈ కానుకను సదా గుర్తు ఉంచుకోవాలి. మురళిపై అందరికీ ప్రేమ ఉందన్నది బాప్ దాదాకు తెలుసు, పరివారము తోటి కూడా ప్రేమ ఉంది. తండ్రి తోటి అయితే ఉండనే ఉంది, ఇప్పుడు మీలో ప్రతి ధారణ ఉండాలి, ప్రతి సేవలో సఫలతామూర్తులు, ప్రతి ఒక్కరిలో ఈ రెండు విశేషతలూ ఉండాలి, బాప్ దాదా సేవలో మీ దృష్టాంతాన్ని ఇచ్చి ఇతరులను కూడా ఉల్లాసములోకి తీసుకురావాలి. అలా పురుషార్థము చేసి ఉదాహరణగా అవ్వండి. చెయ్యటంలో దృఢ సంకల్పము ద్వారా సఫలతకు అధికారులుగా అవ్వండి కావున ఎగ్జాంపుల్ గా అవ్వండి. తీవ్ర పురుషార్ధిగా అయ్యే ఎగ్జాంపుల్ గా అవ్వండి, సాధారణంగా అయితే అందరూ ఉన్నారు కానీ మీరు తీవ్ర పురుషార్థమునకు శాంపుల్ గా అవ్వండి, ఆశావాదులు. డబుల్ విదేశీయులలో వారు ఏదైతే అనుకుంటారో దానిని చెయ్యవలసిందే అన్న నిజ సంస్కారము ఉండటాన్ని బాప్ దాదా చూసారు. బాప్ దాదా మీ దృష్టాంతాన్ని ఇచ్చి ఇతరులను కూడా ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకువచ్చేంతగా ఇప్పుడు తీవ్ర పురుషార్థమునకు అటువంటి శ్యాంపుల్ గా అవ్వండి. ఆశావాదులు. ఏ సంకల్పమునైతే చేస్తారో దానిని చెయ్యగలరు కావున బాప్ దాదా ఈరోజు పదమ, పదమ,పదమాల అభినందనలను ఇస్తున్నారు. 

ఏమేమి చేస్తారు అన్నదానిని బాప్ దాదా వింటారు. బాప్ దాదా సంతోషిస్తారు మరియు మధువనపు వాయుమండలములోకి చేరుకున్నందుకుకూడా అభినందనలు, అభినందనలు, అభినందనలు.

(స్థానమును సంభాళించేవారి, సెంటరును సంభాళించేవారి మీటింగు ఉండింది, 25 సంవత్సరముల నుండి సమర్పితమైయున్న 150 టీచర్ల సెరిమనీ ఉండింది) అన్ని డిపార్ట్మెంట్స్ వారు కలిసి మరియు దాదీల సహయోగము ద్వారా ఏదైతే ఫైనల్ చేసారో అందుకొరకు సంతోషము, తీర్పును యథార్థముగా చేసారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు. ఓంశాంతి. మీ దాదీ ఓంశాంతిని చాలాసార్లు చేయిస్తుంది కదా! అచ్ఛా! 

వెనుక కూర్చున్న వారినైనా, ఒకపక్కగా కూర్చుని ఉన్నవారినైనా బాప్ దాదా అందరినీ చూస్తున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థులుగా అయ్యి తమ సాంగత్యము ద్వారా ఇతరులను కూడా తీవ్ర పురుషార్థీలుగా తయారుచెయ్యగలరు. ఏ ఆత్మకయినా ఏదైనా సహయోగము అవసరమైనట్లయితే వారికి హృదయపూర్వకముగా సహయోగమును ఇచ్చి తీవ్ర పురుషార్ధిగా చేస్తూ నడవండి. పిల్లలు ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థీలు. నంబర్ వార్ కాదు, తీవ్ర పురుషార్థులు. తక్కువలో తక్కువ మీ సంపర్కములో ఉండేవారు, రాబోయే ప్రతి స్థానము తీవ్ర పురుషార్థీ స్థానముగా అవ్వాలి. ఈ సంకల్పమునే ప్రతి ఒక్కరూ ఉంచాలి, మరల బాప్ దాదా దీని రిజల్టును చూస్తారు. ఏ సెంటరువారైతే అందరూ తీవ్ర పురుషార్థీ స్వరూపములో ఉంటారో వారికి బాప్ దాదా కొందరు-కొందరికి కాదు, అందరు సహచరులకు ఒక కానుకను ఇస్తారు. వీలవుతుంది కదా? లేక కష్టమా? కష్టము కాదు. తక్కువలో తక్కువ మీ స్థానమువరకైతే తయారుచెయ్యగలరు. మీ సేవా కేంద్రములనైతే తయారుచెయ్యగలరు. ఇటువంటి ఉదాహరణను బాప్ దాదా చూడాలని కోరుకుంటున్నారు. మోహజీత్ కథ ఉంది కదా, దీనిద్వారానే మోహజీత్ లభించింది. మరి వినటానికి మంచిగా అనిపిస్తుంది కదా! అలా ఎవరిని చూసినా తీవ్ర పురుషార్థీ గ్రూప్. లక్ష్యాన్ని ఉంచండి, లక్ష్యము ద్వారా లక్షణాలు రానే వస్తాయి. ప్రతి ఒక్క సెంటరు సంతుష్టమణుల సెంటరు. అచ్ఛా!

ఒక్కరుకూడా వెనుక ఉండిపోకూడదని బాప్ దాదా మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. తోడుగా నడవాలి. వెనుక-వెనుక వచ్చేవారు మంచిగా అనిపించరు. తోడు ఉండాలి, చెయ్యి ఉండాలి, ఇంటికి వెళ్ళాలి కదా! రిటర్న్ జర్నీ. అందుకొరకు బ్రహ్మబాబా ఏవిధంగా ఫరిస్తా అయ్యారో, అలా ఫాలో ఫాదర్. సాకారములో ఉంటూ ఫరిస్తా, ఎవరిని చూసినా కూడా ఫరిస్తాయే ఫరిస్తా, అప్పుడు గేట్ తెరుచుకుంటుంది. అచ్చా! 

పిల్లలందరికీ, సదా అదృష్టవంతులు, ఆనందస్వరూపులకు ప్రియస్మృతులు.

దాదీలతో - (నేను బాబాతోటి ఉంటాను, సత్యయుగములోకి వెళ్ళను అని జానకిదాది అన్నారు) బ్రహ్మబాబా తోడుగా అయితే ఉన్నారు కదా. మీ పురుషార్థమునకు గల ప్రాలబ్దము ఏదైతే ఉందో దాని అనుభవమును చెయ్యాలి. కావున శివబాబానే ఈ సమయాన్ని ఉంచారు.

ఈ రోజు కువైట్‌కు చెందిన వజీహా వతనములోకి వెళ్ళింది - పరమాత్మపై ప్రేమ ఉండింది కదా! కనుక అందరిపట్ల కూడా ప్రేమగా ఉండింది.సంబంధీకుల అదృష్టముకూడా ఉంది, వారిని కూడా కనెక్షన్లో జోడింపచేసింది. సఫలము చెయ్యటము మరియు చేయించటములో నంబర్ వన్ గా ఉంది. అచ్చా!

ఈరోజు నీలు బిడ్డనుకూడా ప్రేమ చేస్తున్నారు, ఎందుకని? చాలా బాగా సంభాళిస్తూ ఉంది. రథము యొక్క అద్భుతము కూడా ఉంది కానీ తోడుగా వీరి అద్భుతము కూడా ఉంది కనుక మీకు అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి.

మున్ని బెహన్ తో - బాప్ దాదా ఎవరినైతే నిమిత్తంగా చేసారో వారు సదా నిమిత్తంగా అయ్యి కార్యమును చేస్తున్నారు, ఆత్మలందరికీ సుఖశాంతులు మరియు శక్తుల అనుభవమును చేయిస్తున్నారు.

ఈ ఆత్మకు కూడా (గుల్జార్ దాది) డ్రామాలో పాత్ర ఉంది, విచిత్రమైన పాత్ర మరియు ఈ రథాన్ని గురించి దాదీ ఎప్పుడూ ఇలా అనేవారు, దారిలో నడుస్తూ నడుస్తూ ఇరుక్కుపోయారు. ప్రతి ఒక్కరి పాత్ర వారి వారిది, అమూల్యమైనది. అభినందనలు, అభినందనలు.

(బృజ్ మోహన్ భాయి ఈ రోజు ఈ టర్న్ లో రాలేదు, స్మృతిని పంపారు) తండ్రి ప్రియస్మృతులను ఇవ్వండి. వారికి పదమాగుణ అభినందనలను ఇవ్వండి. (రమేష్ భాయి ఇలా అన్నారు - స్టుడియో సామాను వచ్చింది, రేపు రికార్డింగ్ చేస్తాము) మంచిది, నెమ్మది-నెమ్మదిగా అన్నీ బాగయిపోతాయి, మీరు నిశ్చింతులుగా అయ్యి చేస్తూ వెళ్ళండి.

ఈరోజు నూతన భండారాకు ముహూర్తమును నిర్ణయించారు - అయిపోతుంది, సుఖమైతే లభిస్తుంది కదా! (కూలీలు, మేస్త్రీలు అందరూ చాలా శ్రమపడ్డారు) వారికి ప్రియస్మృతులను ఇవ్వండి. బాప్ దాదా చూస్తారు, పరిక్రమణ చేస్తారు, వారికి టోలీని ఇప్పించండి. (బ్రహ్మ భోజనమును తయారుచేసేవారు చాలా శ్రమ పడ్డారు) బ్రహ్మ భోజనానికి అటువంటి మహిమ ఉంది, కావున బ్రహ్మ భోజనాన్ని తయారుచేసేందుకు నిమిత్తులెవరైతే ఉన్నారో వారైతే విశేష ఆత్మలు. ఎంతగా, ఏ పని ఉన్నాగానీ హాజరైపోతారు, ఇందుకు చాలా చాలా అభినందనలు, అభినందనలు, అభినందనలు.

(ముగ్గురు అన్నయ్యలకు జన్మదిన కానుక) అభినందనలు ఎందుకంటే సదా సమయానికి ఒకరికొకరు సహయోగమును ఇచ్చుకుంటూ కార్యవ్యవహారమును ఎంత సులభతరంగా చేస్తారంటే అందులో ఇక ఎటువంటి శ్రమ పడవలసిన అవసరము ఉండదు మరియు ఏ విషయములోనూ తర్కించుకునే అవసరము ఉండదు, సహజమైపోతూ ఉంటుంది. అవుతూ ఉంది మరియు కొంచెము అటెన్షన్. అందరూ కలిసి చేస్తూ వెళ్ళండి. ఇతరుల ఆలోచనలకు గౌరవమును ఇస్తూ, ఫైనల్ చేస్తూ వెళ్ళండి ఎందుకంటే ఆలోచనలలో తేడా అయితే ఉంటుంది కానీ ఆలోచనలను కలుపుకోవాలి, కలుపుకొని సంతుష్టపడాలి మరియు సంతుష్టతను వ్యాపింపచెయ్యాలి.

హంస అక్కయ్యతో - సేవకే జీవితాన్ని ఇచ్చారు, మరి సేవకు ప్రతిఫలము లభించలేదా! మీకు అభినందనలైతే ఉన్నాయి. బాప్ దాదా కలవటము అనగా అభినందనలను ఇవ్వటము. చెప్పే ఆవశ్యకతయే లేదు. మీకు సూక్ష్మముగా చాలా అభినందనలు లభిస్తూ ఉన్నాయి ఎందుకంటే రథాన్ని సంభాళిస్తూ ఉన్నావు. ఈమె (నీలు అక్కయ్య) కూడా సంభాళిస్తూ ఉంది, మీరు కూడా సంభాళిస్తూ ఉన్నారు. మరి విలువ ఉంది కదా. రోజూ అభినందనలను లభిస్తాయి అమృతవేళ ప్రతిరోజు బాబా అభినందనలను ఇస్తారు. చాలా బాగా చేస్తున్నావు.

బాప్ దాదా 76వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా జెండా ఎగురవేసారు మరియు అందరికీ అభినందలను తెలిపారు. 
విశ్వ సేవ కొరకు అందరూ హృదయపూర్వకముగా జెండా ఎగురవేసే పిల్లలకు బాబా యొక్క చాలా చాలా చాలా చాలా పదమ, పదమగుణ అభినందనలు. మీకైతే హృదయములో శివబాబా కూర్చుని ఉన్నారు. హృదయాభిరాముడు, ప్రతి ఒక్కరి హృదయాల హృదయాభిరాముడు మరియు ఈ హృదయాభిరాముడి నుండి ఎల్లప్పుడూ అమృతవేళ అభినందనలను తీసుకుంటూ ఉండాలి మరియు నలువైపుల అభినందనలు ఇస్తూ ఉండాలి. ఇదైతే లోకులకు సేవార్థంగా అక్కడా ఇక్కడా జెండా ఎగురువేస్తారు కావున వారి మనస్సులలో నా తండ్రి ఎవరు అన్న స్మృతి రావాలి. తెలుసుకోలేదు కదా! కావున వారు గుర్తించుట కొరకు జెండా ఎగురవేస్తారు, మిగిలిన మీకైతే హృదయాలలో స్వయం బాబా కూర్చుని ఉన్నారు. దీనికి స్మృతిచిహ్నము ఇక్కడ ఆబులోనే దిల్ వాలా మందిరము ఉంది. అందరికీ పదమ పదమగుణ అభినందనలు, అభినందనలు, అభినందనలు.

Comments