18-01-2017 అవ్యక్త మురళి

 18-01-2017         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“ఈ బేహద్ పరివారము ఎంతటి మంచి అద్భుతమైన పరివారము, ఈ మిలనము సాధారణ మిలనము కాదు. ఇప్పుడు అందరం కలుసుకుంటున్నాము, ఇలా కలుసుకుంటూ కలుసుకుంటూ కలిసిపోతాము. సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచండి" 

ఓంశాంతి. సోదరసోదరీలు అందరూ ఈ బేహద్ హాలులో ఎంత ఆనందంగా కూర్చున్నారో, వింటున్నారో చూడండి. మేము బేహద్ హాలులో, బేహద్ స్థితిలో స్థితి అయి ఉన్నాము అని అందరి మనసులలో ఉంది. హాలులో ఉన్నప్పటికీ, అందరూ హాలులో కూర్చుని ఉన్నప్పటికీ, బేహద్ హాలులో, బేహద్ స్థితిలో, హద్దులో ఉన్నప్పటికీ బేహద్దు అనుభవంలో ఎంతో చిరునవ్వుతో ఉన్నారు. అందరి మస్తకాలలో బాబా ఉన్నారు, బాబా మస్తకంలో పిల్లలందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో మధురమైన చిరునవ్వుతో ఉన్నారు. బాబా మనసులో నా మధురమైన పిల్లలు అని ఉంది. పిల్లల మనసులో మా మధురమైన బాబా అని ఉంది. తండ్రి మరియు పిల్లల మిలనము ఎంత మధురమైనది! ప్రతి ఒక్కరూ పరస్పరం చూసుకుని వాహ్ నా బేహద్ పరివారము అంటున్నారు. అందరూ హద్దు నుండి బేహద్దులోకి వచ్చారు. ఎక్కడ చూసినా మన బేహద్ పరివారమే కనిపిస్తుంది, ఎంత మధురంగా అనిపిస్తుంది. బేహద్ పరివారము, బేహద్ పరివారంలో ఒకరినొకరు చూసుకుని హర్షితులవుతున్నారు. ఈ బేహద్దులో ఇలా కూర్చోవడం కూడా డ్రామాలో ఉంది. బేహద్ హాలులో ఒకరినొకరు చూసుకుని ఎంతో హర్షితులవుతున్నారు. వాహ్ పిల్లలు వాహ్! అని బాబా అంటున్నారు. వాహ్ బాబా వాహ్ అని బాబా అంటున్నారు. ఈ దృశ్యం కూడా నిశ్చితమై ఉంది. పరివారాన్ని చూసి ప్రతి ఒక్కరూ హర్షితులవుతున్నారు. వాహ్ బేహద్ పరివారము వాహ్! బేహద్ పరివారం కదా. అవును అనుకుంటే చేయి ఇలా ఊపండి. బేహద్ పరివారం, బేహద్ మైదానంలో కలిసారు. బేహద్దులో ఎంతో మజా వస్తుంది కదా. బేహద్ పరివారాన్ని చూసి అందరూ బేహద్దులోకి వచ్చారు. అందరూ బేహద్ పరివారంలో ఎలా కూర్చున్నారో చూడండి, ఒక చిన్న కుటుంబం కలిసినట్లుగా అందరూ కలిసారు. ఎక్కడ చూసినా బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలు ఉన్నారు. ఇంత పెద్ద పరివారాన్ని చూసి ఎంతో సంతోషంగా ఉంది. వాహ్! ఎంత మంచి పరివారము. కొద్ది సమయంలోనే ఈ పరివారము, ఈ ప్రియమైన పరివారము ఎలా కలిసింది! మనం కలిసే ఉన్నాము అన్నట్లుగా అనిపిస్తుంది. ఇలాగే కలుస్తూ ఉంటాము. ఈ మిలనము కూడా అద్భుతమైనది. ఒకరినొకరు చూసుకుని ఎంతగానో సంతోషిస్తున్నారు. వీరు ఫలానా, ఫలానా వారు కూడా వాహ్. ఎక్కడ చూస్తే అక్కడ ఎంతో మధురత ఉంది. అందరి ముఖాలపై ఎవరు కనిపిస్తున్నారు? నా బాబా, నా బాబాను చూసి అందరూ ఎంతగానో చిరునవ్వుతో ఉన్నారు. చాలా రోజుల తర్వాత చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడైతే కలిసి కూర్చున్నారు, చాలా మధురంగా అనిపిస్తుంది. అందరూ పరస్పరం ఎంతో సమయం తర్వాత కలుసుకుంటున్నారు, ఇంత పెద్ద పరివారం కలుసుకోవడము, ఇదే సంతోషము. పరివారాన్ని చూసి సంతోషంగా అనిపిస్తుంది కదా. ఇంత పెద్ద పరివారం. ఇప్పుడైతే బాబా, మీరు ఈ హాల్ చూపించారు. ఇక మీదట ఏదైనా జరిగితే ఈ హాలుకు వస్తాము అంటారు. మజా ఉంది. ఈ మిలనము సాధారణ మిలనము కాదు. ఎన్నో సంవత్సరాల తర్వాత మీరు, మేము పరస్పరం సాకార రూపంలో చూసుకుంటున్నాము. ఇలా చూస్తూ ఉంటే చాలా హర్షితంగా ఉంది. ప్రతి ఒక్కరి హృదయాల నుండి వాహ్, వాహ్ అనే పాట వెలువడుతుంది. ఇప్పుడైతే మీరు, మేము వేరువేరుగా ఉంటున్నాము, కానీ వేరుగా ఉన్నప్పటికీ ఎక్కడెక్కడి వారంతా ఇక్కడికి వచ్చి మిలనము చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఇది కూడా చిన్నని మిలనము కానీ ఇక మీదట ఇలా కలుస్తూ ఉంటాము అని ఆశిస్తున్నాము. లేకపోతే దూరం ఎంతో ఉంది. మిలనము ఏమిటో చూసారు కదా. కలవడం చూసారు కనుక విడిపోవడం తక్కువ గుర్తుకు ఉంటుంది. అందరికీ ఈ మిలనము అతి ప్రియమైనది కదా! ప్రియంగా అనిపిస్తుందా? ఇలాగే కూర్చుని ఉండండి, ఇలాగే తింటూ ఉండండి కానీ శరీరం ఉంది కదా. సూక్ష్మ శరీరమైతే కాదు, స్థూలమైనది.

బాప్ దాదాకు కూడా పిల్లలను చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి హృదయాలలో ఏమేమి అనిపిస్తుంది! నా బాబా మాకు లభించారు అని మాత్రమే అనిపిస్తుంది. ఇప్పుడు బాబాను చూస్తే ఎంత ప్రియంగా అనిపిస్తారు. ప్రేమతో ఒడిని నింపేసారు. మరి ఇప్పుడు అందరూ ఏమి చేస్తారు? అందరూ పరస్పరం కలుసుకోండి, మిలనము చేసుకోండి. కానీ తర్వాత విడిపోవాల్సి ఉంటుంది కదా. ఇన్ని రోజులు విడిపోయి ఉండటం, దీని గురించి అందరికీ ఏమని అనిపిస్తుంది? ఎక్కడున్నారు, ఏమిటి? కానీ మిలనము మరియు విడిపోవడము కూడా అద్భుతమైన పాత్రయే. ఇప్పుడు కలుసుకుంటున్నాము కనుక ఎంత ప్రియంగా ఉందో చూడండి, కొంత సమయం తర్వాత విడిపోతాము. ఇలా విడిపోవడము మంచిగా అనిపించడం లేదు. మళ్ళీ ఎప్పుడూ ఇలా కలుస్తాము! ఎలా కలిసి మిలనము జరిగింది, ఎలా విడిపోయాము, ఇప్పుడు మళ్ళీ మిలనపు రోజు వచ్చేసింది. మిలనం చేసుకునే రోజును చూసి సంతోషంగా ఉన్నారా? సంతోషమేనా?

ఈ మిలనము అయితే అప్పుడప్పుడూ జరుగుతుంది. ఇప్పుడు సదా మిలనమును గుర్తు చేసుకుంటూ ఉంటే మిలనమే మిలనము జరుగుతుంది. ఈ మిలనము ప్రియంగా అనిపిస్తుందా? చేతులెత్తండి, ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. ఫోటో తీసేవారైతే ఈ దృశ్యాన్ని తమ కెమరాలలో పెట్టుకుంటారు. ఈ ఫలానా రోజు కలుసుకుంటాము అని పరస్పరంలో గుర్తుచేసుకున్నారు, ఆ రోజు కూడా వచ్చేసింది. (బాబా, 25 వేల మంది వచ్చారు) అందరికీ ఎంత సంతోషం ఉంది? ఇంతమంది కలుస్తారని అనుకోలేదు కానీ ఈరోజు కలుస్తున్నారు. ఈ మిలనపు రోజు. 

సేవ టర్న్ ఇండోర్ వారిది:- ఇండోర్ వారి డ్యూటీ. మంచిది, డ్యూటీని సంభాళిస్తున్నందుకు ఇండోర్ వారు సంతోషిస్తున్నారు. ఎంత అద్భుతం, డ్రామాలో ఇది కూడా ఫిక్స్ అయి ఉంది. ఇది మిలనపు రోజు కూడా. ఇప్పుడు కూడా కావాలనుకుంటే మిలనము చేసుకోవచ్చు. మరి ఇప్పుడు హృదయంలో ఏమి ఉంది? సంతోష ఖజానా. 

డబుల్ విదేశీ సోదరసోదరీలు 50 దేశాల నుండి 500 మంది వచ్చారు:- చేతులు ఊపండి. బాగుంది. ఇంతమందైనా కలిసారు, బాగుంది. చాలా సమయం తర్వాత కలిసారు, కలుస్తూ కలుస్తూ ఇప్పుడు కలిసిపోతారు. కలిసినందుకు సంతోషం ఉంది కదా. ఎంత సంతోషం ఉంది? చేతులెత్తండి. ఎంత సంతోషం ఉంది, ఎంత సంతోషం ఉంది? చూడండి, ఇందులో (టి.విలో) చాలా బాగా అనిపిస్తుంది. 

కలకత్తా నుండి 600 మంది సోదరసోదరీలు స్మృతి దివసము సందర్భంగా పూల అలంకరణ చేసారు:- 600 మంది వచ్చారు. ఇక్కడైతే సహజము, వచ్చేసారు, కూర్చునేందుకు స్థలం కూడా లభించింది. ఒకరినొకరు కలుసుకుని అందరూ చాలా సంతోషించారా, ఎంత సంతోషం కలిగింది! కలవడం అయితే జరిగింది కదా. అందరూ కలుసుకుని హృదయంలో సంతోషించారు. ఇప్పుడిక ఇలా కలుస్తూ ఉంటాము. ఇప్పటికన్నా ఎక్కువ మంది ఉండవచ్చు. 

దాదీ జానకిగారు కలుస్తున్నారు:- (దాదీగారు బాబాకు బంగారు పుష్పాన్ని ఇచ్చారు) అరె, ఇది చూడండి, మీ కోసం ఈ పుష్పము. (బాబా, ఇది మీ కోసం) మా కోసం అంటే ఇది అందరి కోసం. మీకోసం కూడా పంపారు కదా. పిల్లలను చూసి ఎంతో సంతోషం కలుగుతుంది. చాలా బాగుంది. అందరినీ చూస్తున్నారు, (దాదీ కూడా చేయి కలిపారు) ఒక్క చెయ్యి కాదు, అందరి చేతులు బాబా చేతిలో ఉన్నాయి. చూడండి, కొద్ది సమయం కలిసినా కానీ కలిసాము కదా. చూడండి. ఇక కలుస్తూ ఉంటాము. నా బాబా వచ్చేసారు అని చెప్పండి. ఇప్పుడిక కలవకుండా ఉండలేరు. కలుస్తూ కలుస్తూ కలిసిపోతాము. అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉండండి, ఇదే బాబా కోరుకునేది. ఇంకే కష్టమూ లేదు. సరేనా. 

నారాయణ్ దాదా, మనోజ్ లతో (బాబా లౌకిక పరివారము):- చాలా మంచిది. కలిసే ఉన్నాము అని అనిపిస్తుంది. ఇప్పుడిక కలుస్తూనే ఉంటాము. సమయానుసారంగా రండి, వస్తూ ఉండండి, అంతే. ఇప్పుడు ఇంతైతే ఉన్నారు కదా. ఇప్పుడు ఏదో ఒక విధానముతో ఒక స్థానము లభిస్తుంది, అక్కడ అందరం కలిసి ఉంటాము. ఇప్పుడు అది వెతకండి. సరేనా. ఇంతమంది పాండవులు, ఇంతమంది శక్తులు, కుమారులు తలుచుకుంటే ఏమి చెయ్యలే అంతా జరిగే ఉంది కేవలం కాస్త మీ చేతిని వేయాలి, అంతే. 

సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచండి. మీ వద్ద ఇంకేమీ లేకపోయినా కానీ సంతోషమైతే ఉంది కదా. సంతోషాన్ని పరస్పరంలో పంచుకుంటే వాయుమండలం కూడా మారిపోతుంది. ఎవరు వచ్చినా కానీ ఇది సంతోష మహలు అని అనిపించాలి. అందరూ సంతోషంగా ఉన్నారా! సంతోషం ఉందా లేదా అని ఎవరినైనా అడగండి. సంతోషం ఉంటే చేతులెత్తండి. చూడండి, అందరూ సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండండి, చాలు. సరేనా.

బాబా లభించారు, కనుక సంతోషంగా ఉండండి. ఇప్పుడిక ఏడవడము మొదలైనవి ఆపేయండి. ఇప్పుడు చిరునవ్వుతో ఉండండి. ఎవరు కలిసినా చిరునవ్వుతో ఉండండి. ఇప్పుడు అందరూ చిరునవ్వుతో ఉన్నారు. ఇప్పుడిక అందరూ పనికి వెళ్ళండి మరియు మేము చాలా పని చేసాము అని రిపోర్టును తీసుకురండి. చిరునవ్వుతో ఉండండి, నవ్వుతూ ఉండండి, పని చేస్తూ ఉండండి కానీ బాబాను మర్చిపోవద్దు. బాబాను మర్చిపోతే దుఃఖాన్ని పొందుతారు. అందుకే నా బాబా, నా బాబా, నా బాబా... అంతే. కేవలం బాబా మరియు నేను. ఇప్పుడు ఏమి చేస్తారు? పని చెయ్యాలి, పని చెయ్యండి కానీ సంతోషంగా చెయ్యండి. ఏమి చెయ్యాలో అర్థమయిందా? సంతోషాన్ని విడిచి పెట్టకండి. సంతోషాన్ని మీతోటే పెట్టుకోండి. 

రమేష్ అన్నయ్య ట్రామా హాస్పిటల్ నుండి స్మృతిని పంపారు:- రమేష్ అన్నయ్య మొదటినుండి మంచి సేవాధారి, ఇప్పుడు కూడా తమ స్మృతిని పంపారు, మీ అందరికీ వారి స్మృతి అంది ఉండవచ్చు. బాబా పిల్లలు ఎవ్వరూ విసుగు చెందకూడదు అని వారు కోరుకుంటారు. ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని కాదు. ఉన్న రోజులను సంతోషంగా గడపండి. సంతోషంగా గడిపితే సంతోషం ఇంకా దగ్గరకు వస్తుంది. ఇలా సంతోషం పెరుగుతూ పెరుగుతూ సదా సంతోషపు వాయుమండలం తయారవుతుంది.

18.01.17 ఓం శాంతి “దినచర్య" మధువనం 

ప్రాణప్రదమైన అవ్యక్త బాప్ దాదాకు అతి స్నేహి, సదా అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనము యొక్క అనుభవి, సర్వ తపస్వీమూర్తులైన నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు బ్రాహ్మణ కులభూషణులైన సోదరసోదరీలు, ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధుర ప్రియస్మృతులను స్వీకరించండి. 

తర్వాత సమాచారము - ఈ రోజు మనందరి అతి ప్రియమైన పితాశ్రీ బ్రహ్మబాబా గారి 48వ స్మృతి దివసము. మధువనంలోని నాలుగు ధామాల అలంకరణను సుందరమైన వెరైటీ పుష్పాలతో, మాలలతో కలకత్తా సోదరసోదరీలు రాత్రింబవళ్ళు మేలుకుని చేసారు. శాంతివనంలో ప్రియమైన బాప్ దాదాతో సమ్ముఖంలో అవ్యక్త మిలనాన్ని జరుపుకోవడానికి సుమారు 25 వేల మంది సోదరసోదరీలు చేరుకున్నారు. అందులో చాలామంది రాత్రియే పాండవ భవనానికి తపస్సు చేసుకోవడానికి చేరుకున్నారు. అమృతవేళ నుండే అందరూ నాలుగు ధామాల యాత్రను చేస్తూ బాబాతో మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తూ వచ్చారు. సాకార మరియు అవ్యక్త మురళిని విన్న తర్వాత శశి అక్కయ్య బాప్ దాదాకు భోగ్ పెట్టారు. బాప్ దాదా ఈ స్మృతి సో సమర్థి దివసము నాడు పిల్లలందరికీ సఫలతమూర్త భవ అన్న వరదానాన్ని ఇచ్చారు మరియు సదా స్మృతి అనే బాబా ఛత్రఛాయలో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత దాదీలందరూ, పెద్దన్నయ్యలు, మధువన నివాసులు మరియు ఇతరులు అందరూ నాలుగు ధామాల పరిక్రమణ చేసారు. శాంతివనంలో కూడా బాబా గది, తపస్యాధామము, ప్రకాశ స్తంభము వద్ద చాలామంది సోదరసోదరీలు ఉన్నారు. నలువైపుల అవ్యక్త వాతావరణంలో, తెల్లని వస్త్రధారణలో ఉన్న ఫరిస్తాలు నడుస్తూ తిరుగుతూ కనిపించారు. మధ్యాహ్నం భోగ్ తర్వాత అందరూ దాదీలు మరియు పెద్దక్కయ్యలు, పెద్దన్నయ్యలతో కలిసి భోజనాన్ని స్వీకరించారు. సాయంత్రం సమయంలో అందరూ బాప్ దాదాను ఆహ్వానించడానికి డైమండ్ హాలుకు చేరుకున్నారు. అక్కడ యోగ తపస్య జరిగింది. తర్వాత కొద్ది సమయం కోసం ప్రియమైన అవ్యక్త బాప్ దాదా తమ వరదాని దృష్టి, దృష్టితో ప్రసన్నం చేసేందుకు పిల్లల సభలోకి విచ్చేసారు. అందరికీ ఎంతో ప్రేమతో దృష్టినిచ్చి బేహద్ పరివారాన్ని చూసి హర్షితులై వరదానాలను ఇచ్చారు. సదా సంతోషంగా ఉండండి, అందరికీ సంతోషాన్ని పంచండి అన్నారు. ఈ విధంగా మధురమైన మహావాక్యాలను ఉచ్ఛరిస్తూ తమ వరదాని హస్తాలతో అందరికీ స్నేహపు ఛత్రఛాయను అనుభవం చేయిస్తూ వతనానికి తిరిగి వెళ్ళిపోయారు.

స్మృతి దివసము నాడు దాదీ జానకి గారి సందేశము ఈ రోజు నా ప్రియమైన బాబాగారి స్మృతి దివసము. సాకార బాబా పిల్లలైన మాకు ప్రేమ, చదువు మరియు పాలనను ఇచ్చారు. ఎంతగా ప్రేమను పంచారో, ఎటువంటి పాలనను ఇచ్చారో, అలాగే చదువును కూడా సింపుల్ విధానముతో ఎలా చదివించారంటే బాబా చెప్పిన ఒక్కొక్క మహావాక్యము మనసుకు హత్తుకుని ఉంది. బాబా చెప్పిన ఆ మహావాక్యాలను జీవితంలోకి తీసుకువచ్చినప్పుడు బాబా సమానంగా అయ్యి బాబాతో కలిసి పరంధామము, నిర్వాణధామము, శాంతిధామానికి వెళ్తాము.

బాబా అవ్యక్తమైనప్పటికీ సూక్ష్మవతనం నుండి మంచి పాలనను ఇస్తున్నారు. అందరికీ ఆ పాలన లభిస్తుంది తద్వారా నలువైపుల ఉన్న అనేక పిల్లలు సమర్థులుగా అయ్యి, విజయులుగా అవుతున్నారు. ఇంతమంది బాబా పిల్లలు ఏ విధంగా బాబా స్మృతులలో ఇమిడి ఉన్నారో నేను సాక్షి అయి చూస్తున్నాను. నేను ఎవరిని, నాకు ఎవరు అన్న విషయము ప్రతి ఒక్కరి మనసులలో ఉంది. బాబా పిల్లలందరికీ ఎంతటి ప్రేమను ఇస్తారంటే అందరి నయనాలల్లో బాబా కోసం ప్రేమ నిండి ఉంది. ఆ ప్రేమ పాలనయే ప్రతి ఒక్కరినీ నష్టోమోహ స్మృతిస్వరూపులుగా చేస్తూ ఉంది. మనం దేహభానము, అటాచ్ మెంట్ నుండి ఫ్రీ అయ్యాము. 

అటువంటి మధురమైన బాబా స్మృతి గురించి నేను ఏమని వివరించను! మనసు ఎక్కడ, బుద్ది ఎక్కడ. మన బుద్ధిలో చదువు ఉంది, మనసులో బాబా ఉన్నారు. బాబా చెప్పిన నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి స్థితిని మనం తయారు చేసుకోవాలి. బాబా మన తల్లి, తండ్రి, శిక్షకుడు మరియు రక్షకుడు. రక్షణ కూడా ఇస్తారు, సద్గురువు ఇచ్చిన శ్రీమతము శిరోధార్యము. బాబా చెప్పే ఒక్కొక్క మహావాక్యము పిల్లలైన మనకు శ్రీమతము. అవ్యక్త రూపంలో కూడా మేము అవ్యక్త పాలనను మంచిగా చేసుకుంటాము. పూర్తి విశ్వంలోకి మధువనం నుండి ఎలా వైబ్రేషన్లు వెళ్తాయి! బాబా తోడు యొక్క అనుభూతిని దూరంగా కూర్చుని కూడా అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు మేము పరిగెత్తలేకపోవచ్చు, కానీ వైబ్రేషన్లు, వాయుమండలం మరియు బాబా మహావాక్యాలను నలువైపులకు చేర్చుతున్నాము.

ఈ స్మృతి దివసము గురించి ఏమని మాట్లాడను, బాబాయే నయనాలలో ఉన్నారు, బాబాయే బుద్ధిలో ఉన్నారు. 8లో వచ్చినా, 108లో వచ్చినా, 16108లో వచ్చినా కానీ ఇంతే. కానీ మనమైతే 8లో రావాలి కదా. ఎంత స్మృతి ఉంటుందో అంతగా పురుషార్థంలో బాబా బలం లభిస్తుంది. మీరు ఒక్క బాబాను గుర్తు చెయ్యండి అని బాబా అంటారు. మధువనానికి వచ్చేవారు తమ మంచి వృత్తితో మంచి స్మృతి మరియు స్థితిని ఎంతగా తయారు చేసుకోవాలంటే, బాబా మన నుండి కోరుకుంటున్నదాని అనుసారంగానే మనం నడుచుకోవాలి, ఇతరమైనదేమీ చెయ్యకూడదు. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ, పిల్లల ధైర్యము తండ్రి సహాయము - ఇది పూర్తి జీవితంలో ఉండాలి. భావన మంచిగా ఉండాలి అప్పుడు అనుకున్నది లభిస్తుంది. ఏ సంకల్పం చేస్తామో దానిని బాబా సాకారం చేస్తారు. ధాంక్యూ, ఓం శాంతి.

Comments