18-01-2016 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“అభిరుచితో చదువును చదువుకునే విద్యార్థులు ఎప్పుడూ ఏ సబ్జెక్టులోనూ ఫెయిల్ అవ్వలేరు, ఫెయిల్ అవ్వడము అంటే ఫీల్ అవ్వడము"
* అందరూ బాప్ దాదా నుండి ముందుగా దృష్టిని పొందారు. మీరు చూసింది ఈ స్థూల నేత్రాలతోనే కావచ్చు కానీ ఈ నేత్రాలలో కూడా బాబా దృష్టి పడగానే ఈ దృష్టి కూడా పరివర్తన అవుతుంది.
* నయనాలలో కూడా బాబా కనిపిస్తున్నారు, బుద్ధిలో కూడా బాబా కనిపిస్తున్నారు అందుకే మీ అందరి నయనాలలో ప్రియమైన బాబా, మధురమైన బాబా, నా బాబా ఇమిడి ఉన్నారు. బాబా కూడా పిల్లలను నా పిల్లలు అన్న రూపంలోనే చూస్తున్నారు. పిల్లలు కూడా నా బాబా అన్న రూపంలో చూస్తున్నారు. నా బాబా, నా అని అనడంలో ఎంత సంతోషం ఉంటుంది.. అందరి మనసులలో ఇప్పుడు తమను తాము ఏ రూపంలో, ఏ విధంగా చూసుకుంటున్నారు? విద్యార్థి. ఈ చదువులో మెజారిటీ అందరూ పాస్ అయిపోతారు, ఎందుకని? ఇక్కడి టీచరు, ఎటువంటి విధితో చదివిస్తారంటే వినగానే అది ముద్ర పడిపోతూ ఉంటుంది. మర్చిపోరు. అందరూ ఎంతో సంతోషంగా చదువుకుంటున్నారు. చదువుపై అభిరుచి ఉంటే చదువును వదిలి పెట్టడం మంచిగా అనిపించదు. విద్యార్థులై ఉండి చదువుపై అభిరుచి లేకపోతే ఇది శోభించదు, అందుకే విద్యార్థులందరూ చదువుపై అభిరుచి ఉన్నవారే అని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఏది చేసినా కానీ దానికి సమయాన్ని కేటాయిస్తారు కదా, గంట కావచ్చు, అరగంట కావచ్చు, సమయాన్ని కేటాయిస్తారు కదా. అంటే సమయానికి విలువ ఉన్నట్లే కదా. అందుకే తమ నేచరు ఇలా చేసుకోండి - ఏ పని చేసినా కానీ దానిని పూర్తిగా చేసేవరకు విడిచిపెట్టకూడదు.
* మేము కూడా పాస్ లోకి వచ్చేసాము అని ఎక్కువమంది రిజల్టును చూసి సంతోషిస్తారు. దీనితో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అటెన్షన్ ఇవ్వడం మా కర్తవ్యం ఎందుకంటే చూడండి, టీచరు కూడా శ్రమ పడ్డారు కదా, ఇప్పుడిక ఏ పరీక్ష వచ్చినా కానీ అందులో ఫెయిల్ అవ్వకండి. ఇప్పుడు మీకు నేర్పించిన పాఠము ఏమిటంటే, ఈ రోజు మీరంతా పాస్ అయ్యారు అంటే మీ ముఖాలు ఎలా ఉన్నాయి, అదే ఫెయిల్ అయ్యారు అని అంటే తల దించుకున్న పరిస్థితి ఉండేది. ఎంత వద్దనుకున్నా తల దించుకుంటారు. కనుక, పరీక్ష వ్రాసే ప్రతిసారీ ఈరోజును గుర్తు పెట్టుకోండి - పాస్ అవ్వవలసిందే. ఎప్పుడైనా పరీక్ష వ్రాసే ముందు, నేను ఫెయిల్ అవ్వకూడదు అని జాగ్రత్త వహించండి. ఫెయిల్ అవ్వడము అంటే ఫీల్ అయ్యేవారు.
* ఫెయిల్ అయినా ఏమీ తేడా లేదు అంటారా? ఒకట్రెండు మార్కులతో పాస్ అవ్వడం రైటు, ఇలా ఉన్నా ఫర్వాలేదు... అని మీలో కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఒక్క క్లాసు కూడా మిస్ కాకూడదు అని లక్ష్యం పెట్టుకోండి ఎందుకంటే నేను పాస్ కావాలి అన్న లక్ష్యమే విద్యార్థి లక్ష్యంగా ఉంటుంది. ప్రయత్నిస్తాను కాదు, అవ్వాలి.
Comments
Post a Comment