18-01-2015 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
”స్మృతి దివసమునాడు ఏదో ఒక విశేషతను స్వయంలోధారణ చేసుకుని లోపాలను సమాప్తం చెయ్యాలి, భారతదేశంలో భారతదేశపు తండ్రి గుప్తవేషంలో వచ్చి ఉన్నారు అన్న సందేశాన్ని నలువైపుల స్పష్టంగా వ్యాపింపచెయ్యాలి"
చైతన్య దీపాలైన అందరికీ అభినందనలు, అభినందనలు, అభినందనలు. ప్రతి ఒక్క చైతన్య దీపము తమ తమ ప్రకాశంతో విశ్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఒక్కొక్క చైతన్య దీపము ఎంతో బాగా మెరుస్తూ ఉంది. ఇది చూసి, ఒక్కొక్క దీపాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. వాహ్ దీపాలూ వాహ్! నిజమైన దీపావళిని చూడాలంటే ఈ చైతన్య దీపాల మధ్యకు వచ్చి చూడండి. బాప్ దాదా కూడా ఒక్కొక్క దీపాన్ని చూసి సంతోషిస్తున్నారు. వాహ్! ఒక్కొక్క దీపమా వాహ్! ఎందుకంటే దీపాలైన మీరు బాబాకు అతి గారాల పిల్లలు. ఇంత పెద్ద విశ్వంలో నుండి కేవలం గారాల దీపాలైన మిమ్మల్ని చూసి బాబా సంతోషిస్తున్నారు మరియు హృదయంలో పాటను పాడుకుంటున్నారు. ప్రతి ఒక్క దీపము పరమాత్మకు ప్రియమైనవారు మరియు హృదయంలో ఇమిడేవారు. సత్యమైన దీపావళిని బాబా తమ సమ్ముఖంలో చూస్తున్నారు మరియు ఒక్కొక్క దీపం కోసం వాహ్ వాహ్ పాటను పాడుకుంటున్నారు. ప్రతి దీపానికి ఉన్న విశేషతను కూడా బాబా చూస్తున్నారు మరియు మీరైతే ఇలా చూస్తూనే ఉంటారు. దీపాలైన మీ ద్వారా విశ్వం ప్రకాశిస్తుంది మరియు ప్రతి ఒక్క దీపము తన ప్రకాశంతో విశ్వానికి వెలుగుగా అవుతుంది. ప్రతి దీపము తన ప్రకాశంతో నలువైపులను ప్రకాశింపజేస్తుంది, ఈ కార్యాన్ని చాలా చక్కగా మనస్ఫూర్తిగా చేస్తున్నారు, బాప్ దాదా ఈ రిజల్టును చూసి సంతోషిస్తున్నారు.
ఇప్పుడు ఈ దివ్యమైన ప్రకాశాన్ని చూసి ప్రపంచం వారు కూడా ఈ అలౌకిక ప్రకాశము ఎక్కడి నుండి వస్తుంది అని ఆలోచిస్తున్నారు. అందరి దృష్టి మీ అందరి వైపు ఉంది.
ఈ రోజు స్మృతి దివసము నాడు స్మృతి దీపాలైన మిమ్మల్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఎంతగా ఒక్కొక్క దీపమూ తన దృశ్యాన్ని చూపిస్తుంది! దీనితో విశ్వ పరివర్తన జరుగుతుంది. అంధకారం మారి ప్రకాశంలోకి వస్తుంది. ఈ ప్రకాశము ఎక్కడి నుండి వస్తుంది అన్న ఆలోచన ఇప్పుడు అందరి మనసులలో ఉంది. నెమ్మది నెమ్మదిగా ఈ ప్రకాశాన్ని చూసి, దీపాలైన మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు కూడా. ఈ ప్రకాశము నాలుగు వైపులా వ్యాపించాల్సిందే. అచ్ఛా.
ఢిల్లీ-ఆగ్రా జోన్ల సేవ టర్న్:- ఇలా చేయి ఎత్తండి. వస్తూ ఉండండి. ఢిల్లీ వారికి బాప్ దాదా ఒక్కొక్కరికీ విశేషమైన ప్రియస్మృతులను అందిస్తున్నారు. ఢిల్లీవారు ఢిల్లీని పరిస్తాన్ గా చెయ్యాలి, మీ రాజ్యాన్ని ఢిల్లీలో స్థాపన చెయ్యాలి. సేవ చేస్తున్నారు, ఢిల్లీ పరిస్తాన్ గా అవ్వనున్నది అని ఇప్పుడు మరింత ఎక్కువగా ధ్వని చెయ్యండి. అందరికీ తెలియాలి. సేవ బాగా చేస్తున్నారు కానీ ఇప్పుడింకా అందరి వద్దకు ధ్వని చేరుకోలేదు. మన సత్యయుగపు రాజ్యాధికారులు గుప్త వేషంలో వచ్చి ఉన్నారని మూలమూలల వరకు తెలియజేయాలి. బ్రహ్మకుమారీలు మంచిగా చెప్తారు అన్న పరివర్తన అయితే ఇప్పుడు సేవలో వచ్చింది, కానీ బ్రహ్మకుమారీలు సత్యం చెప్తారు అన్న ధ్వని ఇప్పుడు రావాలి. ఆ రోజు కూడా వస్తుంది ఎందుకంటే ధ్వని చేరుకుంది కానీ ఇప్పుడు ఆ ధ్వనిలో ఫోర్సు కావాలి. అందరి దృష్టి పరివర్తన అవుతుంది, ఇది అర్థమవుతుంది కానీ చేసేది ఎవరు అన్నది ఇప్పుడింకా ప్రత్యక్షం కాలేదు. ఏదో జరగబోతుంది అని ధార్మిక ప్రజలు అర్థం చేసుకున్నారు కానీ పరమాత్మ ద్వారా వీరు క్రొత్త ఢిల్లీని తయారు చెయ్యడానికి వచ్చారు అన్న ధ్వని ప్రసిద్ధి చెందాలి. ఇది ఇంకా ఇప్పుడు స్పష్ట రీతిలో రావాలి. మీరు సేవ చేస్తున్నారు, సేవ బాగా చేస్తున్నారు. మొదట్లో వినడం ఇష్టపడని వారు ఇప్పుడు వింటున్నారు. వినేవారేంటి, వారు అయ్యేవారు కూడా అవుతారు, అవుతున్నారు. పిల్లలు చేసే సేవను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. చేస్తున్నారు కానీ ధ్వని ఇంకా ప్రతిధ్వనించడం లేదు, నలువైపులకూ వ్యాపించడం లేదు. వ్యాపిస్తుంది కానీ ఎంత వేగంతో వ్యాపించాలంటే ప్రతి ఒక్కరి నోటి నుండి విశ్వపిత వచ్చారు, విశ్వపిత పిల్లలు గుప్త వేషంలో తమ కార్యాన్ని చేస్తున్నారు అని రావాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా ధ్వని వ్యాపిస్తుంది కానీ ఇప్పుడు మరింత జోరుగా వ్యాపించాలి. మొదలయింది కానీ మూల మూలలో ఇప్పుడు నలు వైపుల ధ్వని చేసేవారు 'పరివర్తన అవ్వవలసిందే' అని స్పష్టంగా చెప్పాలి. అలా జరుగుతుంది.
కలకత్తా గ్రూపు వచ్చింది, మొత్తం పూల అలంకారాన్ని చేసారు:- కలకత్తా సోదరీ సోదరులందరికీ, ఇక్కడికి వచ్చినవారు కావచ్చు, అక్కడున్నవారు కావచ్చు, కలకత్తా నుండి వ్యాప్తి అయిన ధ్వని ఏమిటంటే ఏదో జరుగుతుంది, కానీ ఆలోచిస్తున్నారు, లోలోపల అర్థం చేసుకుంటున్నారు, కొంత పరివర్తన అయితే కనిపిస్తుంది కానీ, 'పరివర్తన చేసే మన తోటివారు ఇప్పుడు తమ కర్తవ్యాన్ని చేస్తున్నారు' అని ఇప్పుడు జోరుగా ఎంతో ఆడంబరంగా చెప్పాలి. మున్ముందు ఈ కర్తవ్యం స్పష్టమవుతుంది. కానీ ఏదో పరివర్తన జరుగుతుందని అర్థం చేసుకున్నారు. ఒకప్పటిలా ఇప్పుడు పరిస్థితి లేదు. జరగడం కష్టం, ఎలా అవుతుంది, ఏమవుతుంది అన్న ప్రశ్నలు లేవు. జరుగుతుంది అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు కానీ ఎప్పుడు, ఎలా అన్నది అప్పుడప్పుడు అర్థమవుతుంది కానీ ఆబూ వైపుకు సూచించాలి, ఆబూలో ఈ కార్యం జరుగుతుంది అని ఇంకా స్పష్టంగా బుద్ధిలోకి రాలేదు. ఈ కర్తవ్యం గురించి బ్రహ్మకుమారీలు చెప్పేవారు కానీ గుప్తంగా జరుగుతుంది అని మొదట్లో అనుకునేవారు. ఇప్పుడు, బ్రహ్మకుమారీలు ఏదో పరివర్తనా కార్యాన్ని చేస్తున్నారు అని అంటున్నారు కానీ స్పష్టంగా లేదు. బ్రహ్మకుమారీలే నిమిత్తమై ఉన్నారు అని అనుకోవాలి, కొంతమంది అర్థం చేసుకున్నారు కానీ ప్రత్యక్ష రూపంలో కాదు, ఆ సమయం కూడా వస్తుంది. ఇప్పుడు మీలో వస్తున్న పరివర్తన ప్రభావాన్ని చూపుతుంది, ఇలా జరుగుతూ జరుగుతూ చివరకు స్పష్టమవుతుంది.
దాదీ జానకితో:- (నా బాబా) నా బిడ్డా! చాలా చక్కగా నడిపిస్తున్నారు, నడుస్తూ ఉంటారు. నిమిత్తంగా అయినందుకు మీకు చాలా చాలా అభినందనలు.
డబుల్ విదేశీయులు 400 మంది వచ్చారు:- మంచిది, అభినందనలు. తండ్రి కర్తవ్యాన్ని ప్రసిద్ది చెయ్యడానికి మీరందరూ నిమిత్తంగా అయి ఉన్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. చేస్తున్నారు, పెరుగుతున్నారు కూడా కానీ వేగాన్ని కొంచెం పెంచండి. ఆరంభమయితే అయింది, ఏదో జరగబోతుంది అని అర్థమవుతుంది, లక్షణాలు అందరికీ తెలుస్తున్నాయి కానీ ఇది చెప్పడానికి ఎవరన్నా నిమిత్తంగా అవ్వాలి, అది ఇప్పుడు జరుగుతుంది. గుప్తంగా ఉన్నారు. జరుగుతుంది. బాబాను ప్రత్యక్షం చెయ్యాల్సిందే అని మీరు కూడా దృఢ సంకల్పం పెట్టుకోండి. సంకల్పం ఉంది కానీ ఇప్పుడు సంకల్పంలో దృఢత్వాన్ని తీసుకురండి. అవ్వాల్సిందే, అవుతుంది కానీ ఈ వైపు కొంచెం పెట్టండి. మీ మీ వైపు నుండి మీ వంతు చేస్తున్నారు, చెయ్యడం లేదని కాదు కానీ అందరూ కలిసి ఈ ధ్వనిని ప్రతిధ్వనించేట్లు చెయ్యాలి. జరగాల్సింది జరుగుతుంది. జరిగిపోతుంది.
అందరూ సంతోషంగా ఉన్నారా! సంతోషంగా ఉన్నారా, చేతులెత్తండి. తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారు కదా! ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి అని అందరిలోనూ ఉత్సాహం ఉంది కానీ వేగాన్ని పెంచండి.
బాప్ దాదా సభను చూసి సంతోషిస్తున్నారు ఎందుకంటే పిల్లలందరిలో ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పం ఉంది. మీ ఈ సంకల్పం ఏదో ఒక అద్భుతాన్ని చూపిస్తుంది. సంకల్పం బాగుంది. ఇప్పుడు ఏదైనా కొత్తగా జరగాలి, కొత్తగా జరగాలి అని అందరి మనసులలో ఉంది కదా. మరి అందరూ ఎంతో సంతోషంగా సంగఠనలో ఈ సంకల్పం చేసి ఉండవచ్చు - ఇప్పుడు భారతదేశంలో కనీసం మిగిలిపోయిన ఏరియాలలో బాధ్యతను పూర్తి చెయ్యాలి. ప్రతి ఒక్కరి ఏరియాలోని ముఖ్య పట్టణంలో బ్రహ్మకుమారీలు ఏమి కోరుకుంటున్నారు అన్నది ప్రసిద్ది కావాలి. ఇప్పుడు బ్రహ్మకుమారీలు కోరుకుంటున్న దానిలో సహయోగులుగా అయితే అవుతున్నారు, అవుతారు కూడా. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ప్రసిద్ధి అవుతుంది, అయిపోతుంది కూడా అందుకే ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు సాగండి. మీరు ఒక్కొక్కరు నిమిత్తులు, కేవలం పెద్దవారు మాత్రమే నిమిత్తులు అని అనుకోకండి, అందరూ చేస్తారు. చేస్తున్నారు అందుకు పాస్, అందుకు అభినందనలు. కానీ ఇప్పుడు ధ్వని ఇంకొంచెం ప్రతిధ్వనించాలి. భారతదేశంలో భారతదేశపు తండ్రి గుప్తవేషంలో వచ్చి ఉన్నారు అన్న ధ్వని ఇంకాస్త స్పష్టంగా వ్యాపించాలి. దుఃఖమైతే పెరుగుతుంది. అందరూ విసుగు చెంది ఉన్నారు కానీ అప్పుడప్పుడు వారికి లభించే అల్పకాలిక సుఖం వారిని నిద్ర పుచ్చుతుంది. సేవలో కూడా ఏ ఏ ఏరియా చెయ్యాలని పరిశీలించుకోండి. ప్రతి సెంటరువారు తమ తమ ఏరియాను పరిశీలించుకుని అక్కడ సేవా ధ్వనిని వ్యాప్తి చెయ్యండి. కొన్ని ప్రదేశాలలో మంచిగా ఉంది కానీ పూర్తి భారతదేశాన్ని మేల్కొల్పాలి, కనుక ఇప్పుడు చెక్ చేసుకోండి, ఛాన్స్ తీసుకోండి. నలువైపుల ఇప్పుడు ధ్వని వ్యాపించాలి - ఇప్పుడు మేము స్వయం పరివర్తన అవ్వాలి, విశ్వ పరివర్తనా కార్యంలో ఉండాలి. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? రెండ్రెండు చేతులెత్తండి.
మోహిని అక్కయ్యతో: - ఇప్పుడు ఆరోగ్యం మంచిగా అవుతూ ఉంది, అయిపోతుంది కనుక నెమ్మది నెమ్మదిగా సేవలో పాల్గొంటూ ఉండండి (మీ వరదానంతో శక్తి లభిస్తుంది). సేవా ఆసక్తి కూడా ఉంది, అది మిమ్మల్ని ముందుకు తీసుకు వెళ్తుంది (సేవా ఉత్సాహం ఉంది) అయిపోతుంది. మీరు స్వయాన్ని కూడా నడిపిస్తున్నారు, సేవ కూడా జరుగుతుంది, ఏమీ ఫర్వాలేదు.
ముగ్గురు అన్నయ్యలతో:- సమయపు వేగాన్ని అయితే మీరందరూ చూస్తూనే ఉన్నారు. సమయం ఇప్పుడు స్పష్టమవుతూ ఉంది. గుప్త వేషంలో బ్రహ్మకుమారీలు కార్యాన్ని చేస్తున్నారు. ఈ సంగతిని మొదట్లో అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు విశ్వ పరివర్తనా కార్యాన్ని వీరు ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు నడిపిస్తున్నారు అని అర్థం చేసుకున్నారు కావున ఇప్పుడు వాయుమండలంలో కూడా మార్పు వచ్చింది, నెమ్మది నెమ్మదిగా భావన పెరుగుతుంది. ఇప్పుడు సేవా ధరిత్రి తయారయింది. ఇప్పుడు ఎంత చేస్తే అంత లాభాన్ని పొందగలరు.
ఈనాటి స్మృతి దివసము నాడు పిల్లలందరిలో స్మృతితో పాటు సమర్థత కూడా కావాలి. పిల్లలందరూ ఈ స్మృతి దివసము నాడు ఏదో ఒక విశేషతను దృష్టిలో పెట్టుకుని స్వయంలో ధారణ చేసుకోండి. విశేషమైన రోజున విశేషతను ధారణ చేసుకోండి. మీలో మీకు కనిపించిన లోపాన్ని ఈ రోజు సమాప్తం చేసి ఏదైనా ఉల్లాస ఉత్సాహాల సంకల్పాన్ని ధారణ చేసుకోండి. నిద్రించే ముందు ఈ సంకల్పం చెయ్యండి మరియు అమృతవేళ దానిని రిపీట్ చేసి సదాకాలం కోసం అటెన్షన్ ఇస్తూ బాబా సమానంగా అవ్వవలసిందే. అందరూ ప్రియస్మృతులను స్వీకరించండి ఎందుకంటే అందరూ ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో వచ్చారు. అందరూ కలిసి 18 జనవరి జరుపుకుంటున్నారు. 18 జనవరి విశేషత ఏమిటి, ఆ విశేషతను స్వయంలో ధారణ చేసుకుని ముందుకు సాగుతూ ఉండండి, ముందుకు సాగాల్సిందే. స్వయంలో ఉన్న లోపాన్ని ఈరోజు రాత్రికల్లా ఆలోచించుకుని సంకల్పం చేసి పడుకోండి - ఇది పక్కాగా నిశ్చయించుకోండి.
డబుల్ విదేశీయులు లేవండి, లేచి నిల్చోండి. చాలా మంచిది. అందరికీ చాలా చాలా చాలా ప్రియస్మృతులు. ఇక ముందు కోసం పూర్తిగా సంపన్నత అన్న వరదానము ఉంది.
దాదీ జానకితో వీడ్కోలు సమయంలో:- చాలా మంచి పాత్రను నిర్వహిస్తున్నారు.
Comments
Post a Comment