18-01-2014 అవ్యక్త మురళి

18-01-2014         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“బ్రహ్మాబాబా ఇచ్చిన విశేషమైన శిక్షణ - బాప్ దాదా ఇద్దరి స్మృతి స్వరూపులుగా అవ్వండి, ఫాలో ఫాదర్ చెయ్యండి" 

ఈనాటి రోజు అందరి మనసులలో విశేషంగా బ్రహ్మాబాబా స్మృతి ఇమిడి ఉంది. ఈరోజు బ్రహ్మాబాబా సాకారం నుండి అవ్యక్త రూపంలోకి పాత్ర వహించడానికి వెళ్ళిన రోజు, కావున అమృతవేళ నుండి పిల్లలు ప్రతి ఒక్కరి మనసులలో విశేషంగా బ్రహ్మాబాబా నయనాలలో ఇమిడి ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఈరోజే బ్రహ్మాబాబా అవ్యక్త రూపంలో పాత్రను వహించడానికి నిమిత్తమైన రోజు. సాకార రూపంలో బాబాను కలుసుకున్నవారు చాలా కొద్దిమంది మాత్రమే, వారి మస్తకంలో బ్రహ్మాబాబా యొక్క చరిత్ర మరియు మాట, వరదానము స్మృతిలో మెదులుతున్నాయి. వారు కొద్దిమందే అయినా కానీ ఇప్పుడు వృద్ధి ఎక్కువగా జరిగింది కానీ ఇప్పుడు కూడా అవ్యక్త రూపంలో పాలనను ఇస్తూ ఉన్నారు. బ్రహ్మాబాబాను గుర్తు చేసుకుంటూ సాకార రూపంలో పాత్రను వహించాలన్న ప్రేరణను తీసుకునేవారు, కలిసి ఉన్నవారు కొద్దిమంది కానీ ఇప్పుడు మీరందరూ తోడుగా ఉన్నారు. సాకార రూపంలో చూడకపోయినా కానీ ఇప్పుడు అవ్యక్త రూపంలో పాలన తీసుకుంటున్నారు. మరి బ్రహ్మాబాబా నుండి అవ్యక్త పాలనను తీసుకున్నవారు చేతులెత్తండి. కాదు, సాకారంలో లేనివారు, అవ్యక్త సమయంలో వచ్చిన వారు చేతులెత్తండి. అవ్యక్త బ్రహ్మా ఇప్పటికి కూడా అవ్యక్త రూపంలో ఎంతో పాలనను ఇస్తున్నారు. శివబాబా అయితే ఎలాగూ తోడుగా ఉండనే ఉన్నారు కానీ బ్రహ్మాబాబా కూడా ఇప్పుడు ఆకార రూపంలో పాలనను ఇస్తున్నారు ఎందుకంటే బ్రహ్మాబాబా సాకార తనువులో ఉన్న కారణంగా స్థాపన సమయంలో ఎంతో మంచి పాత్రను వహించారు, బ్రహ్మాబాబాతో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారు, ఎవరైతే బ్రహ్మాబాబా సమయంలో సాకారంలో ఉన్నారో వారు చేతులెత్తండి. కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చిన వారిలో కొద్దిమంది ఉన్నారు, ఇంకా కూడా ఉన్నారు, వారు టర్న్ బై టర్న్ వస్తుంటారు.

మరి ఈరోజు బ్రహ్మాబాబా రోజు, అమృతవేళ నుండి అందరి హృదయాలలో శివబాబాతో పాటు బ్రహ్మాబాబా స్మృతి కూడా ఉంది. సాకారంలో బ్రహ్మాబాబా పాలన తీసుకున్నవారు చేతులెత్తండి. చేతులు పొడవుగా ఎత్తండి. కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు అవ్యక్త బ్రహ్మా నుండి పాలనను తీసుకుంటున్నారు, అందుకే స్వయాన్ని బ్రాహ్మణులు అని చెప్పుకుంటారు. సాకార బ్రహ్మాతో పాత్రను వహించడము కూడా భాగ్యానికి గుర్తు కానీ ఇప్పటికీ పిల్లలందరికీ బాప్ దాదా ఇద్దరూ కలిసి సేవ చేస్తున్నారు. ఎంతటి అదృష్టవంతులు! బాప్ దాదా పిల్లల అదృష్టాన్ని చూసి వాహ్ పిల్లలూ వాహ్! అన్న పాటను పాడుతున్నారు. ఇప్పటికీ ఇద్దరూ కలిసి, బాప్ దాదా ఇద్దరూ పిల్లల సేవను చేస్తున్నారు. కావున బ్రహ్మాబాబా యొక్క పాలనకు విశేషమైన పాత్ర ఉంది, ఫాలో బాప్ దాదా ఇద్దరినీ చెయ్యండి, ఎందుకంటే అందరూ బ్రహ్మాబాబాను మనస్పూర్తిగా గుర్తు చేస్తారు మరియు ఈనాటి ఈ విశేషమైన రోజున అందరి మనసులలో అమృతవేళ నుండి బాప్ దాదా ఇద్దరి శిక్షణలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. బ్రహ్మాబాబా యొక్క విశేషమైన శిక్షణ - బాప్ దాదా యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఒక్క బాబా కూడా కాదు, ఒక్క బ్రహ్మాబాబా కూడా కాదు. ఇద్దరినీ గుర్తు చెయ్యండి. ఇద్దరి పాలన మున్ముందుకు తీసుకువెళ్తుంది. కావున, ఈరోజు విశేషమైన రోజు కావున విశేషంగా బ్రహ్మాబాబా స్మృతి అందరి మనసులలో ఉంది మరియు ఫాలో ఫాదర్ చేస్తున్నారు, ఎందుకంటే సాకారంలో మీ సమానంగానే బ్రహ్మాబాబా ఉన్నారు. బాప్ దాదా ఇద్దరినీ ఫాలో చెయ్యమని బ్రహ్మాబాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎలా అయితే బ్రహ్మాబాబా సాకారంలో ఉంటూ, పిల్లలతో మరియు బయట సేవలలో కూడా సాకారంలో పాత్రను వహించారో అలాగే మీరు కూడా బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యండి. ఇద్దరినీ ఫాలో చేస్తూ పిల్లలు నడుచుకోవడాన్ని బాప్ దాదా చూసారు. అలా ఫాలో చేసే గారాల పిల్లలకు బాప్ దాదా రోజూ అమృతేళ విశేషమైన ప్రియస్మృతులను తెలుపుతారు. వాహ్ పిల్లలూ వాహ్! అన్న వరదానాన్ని ఇస్తారు.

మరి ఈరోజు బ్రహ్మాబాబాలోని విశేషతలను చూసారు లేక విన్నారు కదా, అలాగే ఫాలో ఫాదర్ చేస్తున్నారు కదా! బ్రహ్మాబాబా సాకారంలో ఉంటూ సర్వ సంబంధాలను సంభాళించారు, అటువంటి వారి ప్రాక్టికల్ లైఫ్ ను విన్నారు లేక చూసారు కదా, మరి బ్రహ్మాబాబా ఈరోజు విశేషంగా బాప్ దాదా ఇద్దరినీ ఫాలో చేసే పిల్లలను తమ ముందుకు తీసుకువచ్చి విశేషమైన ప్రియస్మృతులను ఇచ్చారు. మరి బ్రహ్మాబాబా స్మృతిని స్వీకరించారా! చాలా చాలా ప్రేమతో ప్రేమను అందించారు. ప్రేమ లభించడము అంటే ఫాలో ఫాదర్ చెయ్యడానికి వరదానము లభించడము. మరి అందరూ బాప్ దాదాను ఫాలో బాప్ దాదా చేస్తున్నారు కదా. చేస్తున్నట్లయితే చేతులెత్తండి. బ్రహ్మాబాబాను సాకారంలో చూడకపోయినా కానీ చరిత్ర విని బ్రహ్మాబాబాతో హృదయంతో మిలనం జరుపుకుంటూ ఫాలో చేస్తున్నారు. బ్రహ్మాబాబా కూడా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. కనుక ఫాలో చెయ్యడము ఎప్పుడూ విడిచిపెట్టకండి, బాబా మరియు దాదా ఇద్దరినీ ఫాలో చెయ్యండి, ఎందుకంటే బ్రహ్మాబాబా మీలాగే సాకారంలో పాత్రను వహించారు మరియు పాస్ అయ్యారు. ఈరోజు బ్రహ్మాబాబా పాస్ అయిన దానికి గుర్తు. ఫాలో ఫాదర్ కదా. అవునా? బ్రహ్మా మరియు శివబాబాను ఫాలో చేస్తున్నారా? ఫాలో చేస్తున్నాము అనేవారు చేతులెత్తండి. అచ్ఛా, అందరూ చేతులెత్తుతున్నారు. చాలా చాలా అభినందనలు, అభినందనలు.

ఈరోజు అమృతవేళ అవ్యక్త బ్రహ్మాబాబా విశేషంగా హృదయపూర్వకంగా ఎంతో స్నేహరూపంలో పిల్లలు ఒక్కొక్కరినీ ఎంతో స్నేహముతో ఇమర్జ్ చేసుకుని, సాకారంలో ఇమర్జ్ చేసుకుని చాలా ప్రియస్మృతులను ఇచ్చారు. సాకార రూపంలో కూడా బాబా ఎంత ప్రేమను ఇచ్చేవారంటే అది చూసిన వెంటనే సంపూర్ణంగా అవ్వాలన్న ఉల్లాస-ఉత్సాహాలు కలగడం మీరు చూసారు. మరి మీ అందరి మనసులలో బ్రహ్మాబాబా సమానంగా సాకారంలో పాత్రను వహించాలన్న స్మృతి ఉంది కదా! బ్రహ్మాబాబా సాకారంలో ఏమేమి చేసారో చూడకపోయినా విన్నారు కదా! ఎలా ప్రీతి యొక్క రీతిని నిలిపారు, సేవ పట్ల కూడా ప్రీతి యొక్క రీతిని పాటించారు. మీరు ఫాలో ఫాదర్ చేసేవారు కదా! చేసేవారైతే చేతులెత్తండి. చేస్తూ ఉన్నారు, చేస్తున్నారు ఎందుకంటే బ్రహ్మాబాబాపై అందరికీ ప్రేమ ఉంది. సాకారంలో చూడకపోయినా కానీ బ్రహ్మాబాబా పాలనను విన్న వెంటనే ఫాలో చెయ్యాలన్న సంకల్పం మనసులో కలుగుతుంది. 

మరి ఈరోజు విశేషంగా బ్రహ్మాబాబా స్మృతి దివసము. బ్రహ్మాబాబా పిల్లలందరినీ, ప్రతి జోన్ వారినీ ఇమర్జ్ చేసుకున్నారు. జోన్ లో అయితే మీరందరూ ఉంటారు కదా. స్మృతి లభించిందా? చేతులెత్తండి. ఎంతో ప్రేమతో వాహ్ పిల్లలూ వాహ్! గారాల పిల్లలూ వాహ్! అంటూ గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ కూడా బ్రహ్మాబాబా అవ్యక్త రూపంలో కలుస్తూనే ఉన్నారు. మరి అందరూ బాప్ దాదా పాలనలో ఉన్నారు కదా! లేక అప్పుడప్పుడూ మిస్ అవుతున్నారా? బాప్ దాదా పాలనలో నడుస్తున్నాము, అటెన్షన్ ఉంది, బ్రహ్మాబాబా మరియు శివబాబా ఇద్దరినీ ఫాలో చేసే ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయని అనేవారు చేతులెత్తండి. అచ్చా. బ్రహ్మాబాబాను కొంతమంది చూసి ఉండకపోవచ్చు కానీ మీ తండ్రి గురించి తెలుసు కదా. బ్రహ్మాబాబాను స్మృతి చేస్తూ ఉంటే సహజంగానే సాకారంలో పాలనలో శక్తి వస్తుంది. కొంతమందికి కష్టంగా అనిపిస్తుంది కదా! ఈ రోజుల్లో ఫాలో చెయ్యడము కష్టంగా అనిపిస్తుంది కానీ బ్రహ్మాబాబా ఎంత ఎక్యురేట్ గా పాత్రను వహించారు! అలాగే ఫాలో ఫాదర్.

బ్రహ్మాబాబా కూడా ఎదుర్కున్నారు కానీ పాస్ అయ్యారు. అంతిమం వరకు పాత్రను వహిస్తూ పాత్రలో పాస్ అవ్వాల్సిందే, జరిగే ఉంది అని మీ అందరికీ దృఢ సంకల్పం ఉంది కదా. జరిగే ఉందా లేక జరగాలా! జరిగే ఉంది అన్న నిశ్చయము ఉంది కదా! ఇది మనకు విజయాన్ని తీసుకువచ్చే కాలము, సంగమయుగ విశేషత ఇది. కనుక సమయము యొక్క విశేషతను ఉపయోగించుకోండి. బాప్ దాదాను ఫాలో చేసే వరదానము సంగమయుగానికి ఉంది. మరి అన్ని వరదానాలను ఉపయోగిస్తున్నారా, చేతులెత్తండి. బ్రహ్మాబాబా మరియు శివబాబా, బాప్ దాదా వరదానములు నడిపిస్తున్నాయి.

ఈరోజు బ్రహ్మాబాబా స్మృతి దివసము. ఉదయము నుండి బ్రహ్మాబాబాకు అనేక సంవత్సరాలు సాకారంలో పాలన ఇచ్చిన విషయము గుర్తుకు వస్తుంది. బ్రహ్మాబాబా ఎలా చేసారు! ఎంతటి ప్రేమను నిరాకార తండ్రి నుండి తీసుకున్నారు మరియు ఇచ్చారు. మరి ఈరోజు బ్రహ్మాబాబాను చూసినవారు కొద్దిమంది ఉన్నాకానీ, బ్రహ్మాబాబాను సాకారంలో చూసినవారు చేతులు పొడవుగా ఎత్తండి. అచ్చా. వీరంతా, మెజారిటీ ఈవైపు వారు (అక్కయ్యల వైపు) తర్వాత వచ్చారు. బ్రహ్మాబాబా సమయంలో వచ్చినవారు చేతులెత్తండి. వెనక వచ్చినవారు చేతులెత్తడం లేదు. ఈరోజు బ్రహ్మాబాబా విశేషంగా, క్రొత్తవారు కావచ్చు పాతవారు కావచ్చు, ఇద్దరికీ చాలా చాలా హృదయపూర్వక స్మృతిని అందించారు. బ్రహ్మాబాబా ఎదురుగా వచ్చారా! ఎదురుగా వచ్చారా, చేతులెత్తండి. అందరి మనసులలోకి వచ్చేసారు ఎందుకంటే వారి చిత్రమైతే అందరూ చూసారు కదా.

ఈరోజు బాబా మరియు దాదా ఇద్దరూ గుర్తుకు వస్తారు, కానీ ఈరోజు విశేషమైన రోజు అయిన కారణంగా ఎవరైతే పాలన తీసుకున్నారో బ్రహ్మాబాబా ద్వారా, వారికి ఎక్కువ గుర్తుకు వస్తుంది. ఎవరైతే బ్రహ్మాబాబాతో కలిసి ఉన్నారో, ప్రాక్టికల్ పాలన తీసుకున్నారో వారి శిరస్సుపై చేతితో తిప్పుతూ విశేషమైన స్మృతిని ఇస్తున్నారు, అందరికీ ఇచ్చారు కానీ ముందుగా వారికి ఇచ్చాము తర్వాత అందరికీ ఇచ్చాము. మరి ఈరోజు బ్రహ్మాబాబా దివసము కనుక విశేషంగా బ్రహ్మాబాబా తమ స్మృతిని మీ అందరికీ ఇచ్చారు. అచ్చా. ఇప్పుడిక సమయము అవుతుంది, ఈ రోజు ఎవరు కలుస్తున్నారు?

సేవ టర్న్ ఇండోర్ జోన్ వారిది, హాస్టల్ కుమారీలు కూడా వచ్చారు, మొత్తం 7 వేలమంది వచ్చారు:- చాలా మంచిది. ఇండోర్ వారు చాలామంది వచ్చారు. ఇండోర్ వారు చేతులెత్తండి. అభినందనలు. బాగుంది. సందేశి వతనానికి వచ్చినప్పుడల్లా బ్రహ్మాబాబా పిల్లలను విశేషంగా వాహ్ పిల్లలూ వాహ్ అంటూ గుర్తు చేస్తారు. అచ్చా! ఇండోర్ వారందరూ పురుషార్థంలో ముందు ఉన్నారు కదా! ఎవ్వరూ వెనుక ఉండద్దు. వెనుక ఉండేవారికి ప్రాప్తి కూడా వెనుక దొరుకుతుంది. అందుకే సదా నంబర్ వన్. సదా ప్రతి కార్యంలోనూ నంబర్ వన్ గా వెళ్ళవలసిందే. ఇప్పుడు ఇండోర్ జోన్ అయినా కానీ అన్ని జోన్ల వారు వచ్చారు కదా, కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఇండోర్ వారికి మరియు అందరికీ బ్రహ్మాబాబా తరఫున విశేషమైన ప్రియస్మృతులు. ఇండోర్ వారు చేతులెత్తండి. చాలా మంచి పాత్రను వహించారు. సేవా ఫలితాన్ని స్వయమూ తీసుకున్నారు మరియు ఇతరులకు కూడా ఇచ్చారు, మంచిగా చేసారు. 

డబుల్ విదేశీయులు 400 మంది వచ్చారు:- డబుల్ విదేశీయులు ప్రత్యేకంగా డబుల్ ప్రియస్మృతులను స్వీకరించండి. బాప్ దాదాను విశ్వ కళ్యాణకారిగా ప్రసిద్ది చెయ్యడంలో విదేశీయులు నిమిత్తమయ్యారు. ముందు భారత కళ్యాణిగా ఉన్నారు తర్వాత విశ్వ కళ్యాణిగా పేరు ప్రసిద్ది చెందింది. మరి విదేశీయులు అద్భుతం చేసారు కదా! బాప్ దాదా కూడా విశేషంగా విదేశీ పిల్లలకు మనస్ఫూర్తిగా సహాయాన్ని ఇస్తున్నారు. గుర్తించారు కానీ సేవ కూడా చేస్తున్నారు. విదేశీయుల సేవను ఎప్పుడూ వింటూ ఉంటాము. మంచి ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు. (చప్పట్లు కొట్టండి) 

కలకత్తా గ్రూపు వారు మూడు స్థానాలలో పూలతో చక్కని అలంకారం చేసారు:- పూలతో అలంకరించిన వారు ఇప్పుడున్నారు. అచ్చా వచ్చారు, వస్తూ ఉండండి. బాప్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. మీ ఇంటికి వచ్చారు కదా. సేవ కారణంగా వేర్వేరుగా వెళ్ళారు. నిజానికి అందరూ మధువన నివాసులే. అచ్చా.

బాప్ దాదాకైతే పిల్లలు ప్రతి ఒక్కరూ హృదయంలో ఇమిడి ఉన్నారు. దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా కానీ హృదయాభిరాముడి హృదయంలో ఉన్నారు. అచ్ఛా. 

దాదీ జానకితో:- (లండన్ వెళ్తున్నారు అందుకే సంతోషంగా ఉన్నారు) వీరు సదా సంతోషంగా ఉంటారు. బాబా సహాయాన్ని ఇస్తారు. 

నిర్వైర్ అన్నయ్యతో:- ఆరోగ్యం మంచిగా ఉందా? లెక్కాచారం పూర్తయింది. ఇప్పుడు ఆ లెక్కాచారమైతే పూర్తయింది. సేవ జరిగింది. అచ్చా.

మోహిని అక్కయ్యతో :- సంతోషంగా ఉంటారు, సంతోషం మిమ్మల్ని నడిపిస్తుంది. బాబా స్మృతితో పాటు సంతోషం కూడా నడిపిస్తుంది. 

బృజ్ మోహన్ అన్నయ్య:- (ఓ.ఆర్.సి వారు మరియు మోహిత్ అన్నయ్య స్మృతిని పంపారు) వారికి స్మృతిని అందించండి, టోలీ ఇవ్వండి. 

రమేష్ అన్నయ్య:- ఆరోగ్యం మంచిగా ఉందా! 

గోలక్ అన్నయ్య:- బాగున్నారా! సదా మంచిగా ఉండవలసిందే, ఇక వేరే ప్రశ్నే లేదు (అందరితో) అందరూ మంచిగా ఉండేవారే.

Comments