18-01-2013 అవ్యక్త మురళి

                        18-01-2013         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“బాప్ దాదా ఆశ - ఇప్పుడు బ్రహ్మబాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యే అడుగును ఉల్లాస ఉత్సాహాలతో తీవ్రం చెయ్యండి, ఇందుకు విశేషమైన ప్లాన్‌ను                                                        తయారు చెయ్యండి"


ఈరోజు బాప్ దాదా తమ మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. అందరి హృదయాల నుండి వాహ్ బాబా వాహ్ అని వెలువడుతుంది, అలాగే బాబా నోటి నుండి కూడా వాహ్ పిల్లలు వాహ్ అన్న మాటలే వెలువడుతున్నాయి. ఈరోజు నలువైపుల ఉన్న పిల్లలను కూడా బాప్ దాదా చూస్తున్నారు, అందరి మనసులలో బ్రహ్మబాబా పట్ల స్నేహము కనిపిస్తుంది. అందరి హృదయాలలో ప్రేమ అలలు కనిపిస్తున్నాయి. బాబా హృదయంలో కూడా పిల్లలందరి పట్ల ప్రేమ అలలు వస్తున్నాయి. ఈ ప్రేమ అలౌకికమైన ప్రేమ. మెజారిటీ పిల్లలు ప్రేమ శక్తితోనే నడుస్తూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. బాబాకు పిల్లలందరి పట్ల ప్రేమ కలుగుతుంది మరియు హృదయపూర్వకంగా పిల్లలందరి కోసం ఇదే వెలువడుతుంది - మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు. పిల్లలందరినీ బాబా మూడు సింహాసనాలకు అధికారులుగా చేసారు. తెలుసు కదా! పూర్తి కల్పంలో ఏ ఆత్మ కూడా మూడు సింహాసనాలకు యజమానిగా అవ్వలేదు కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు మూడు సింహాసనాలకు యజమానులుగా అయ్యి ఎంతటి ఆత్మిక ప్రేమలో, నషాలో ఉంటారు! ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి, ఇంతటి సంతోషము, ఇంతటి ఆత్మిక నషా సదా స్మృతిలో ఉంటుందా? 'సదా' అన్న పదము సదా గుర్తుంటుందా? బాప్ దాదాకు 'అప్పుడప్పుడు' అన్న పదము ఇష్టముండదు.

మరి ఈరోజు అందరూ సమ్ముఖంలో ఉన్నవారైనా కావచ్చు, తమ తమ స్థానాలలో కూర్చున్న వారైనా కావచ్చు కానీ అందరినీ బాబా అయితే చూస్తున్నారు, దూరంగా ఉన్నా కానీ బాబా ఎదురుగా ఉన్నట్లే. పిల్లలందరూ ఈ రోజు విశేషంగా బ్రహ్మబాబా స్నేహంలో ఇమిడి ఉండటాన్ని బాబా చూసారు. కష్టాన్ని కూడా సహజంగా చేసేది స్నేహము. బాప్ దాదా పిల్లలందరితో ఎంతో స్నేహము చేస్తారు. పురుషార్థీలే కావచ్చు కానీ బాబా పిల్లలే కదా. మరి పిల్లల నోటి నుండి 'సదా' అన్న పదము వెలువడాలని ఈరోజు బాప్ దాదా ఆశిస్తున్నారు. వీలవుతుందా? ఇప్పటి నుండి 'సదా' అన్న పదము సహజము అని భావించేవారు, లక్ష్యము పెట్టుకుంటే లక్షణాలు వచ్చేస్తాయి. ఎందుకంటే బాప్ దాదా సహయోగిగా ఉన్నారు, అలా భావించేవారు చేతులెత్తండి. వాహ్ వాహ్! వాహ్ పిల్లలూ వాహ్! చప్పట్లు కొట్టండి.

బాప్ దాదా కేవలం ఎదురుగా ఉన్నవారినే కాదు, నలువైపుల ఉన్న పిల్లలను చూసి ప్రేమతో వాహ్ పిల్లలు వాహ్! అని అంటున్నారు. ఎలా అయితే మెజారిటీ పిల్లలు బాప్ దాదాపై హృదయపూర్వక ప్రేమలో నంబర్ వన్ గా ఉన్నారో అలాగే సదా విజయి, ఇందులో కూడా అప్పుడప్పుడు అన్న పదము తొలగిపోవాలి. ఇది వీలవుతుందా? వీలవుతుందా? ఇందులో చేతులెత్తండి. చేతులు పొడవుగా ఎత్తండి, ఊపండి. చేతులైతే చాలా బాగా ఊపుతున్నారు. బాప్ దాదా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరిపై బాబాకు, ఇద్దరు బాబాలకు, బాప్ దాదా ఇరువురికీ హృదయపూర్వక ప్రేమ సదా ఉంది మరియు సదా ఉంటుంది. ఒకవేళ నడుస్తూ నడుస్తూ కొంచెం మాయ దాడి చేసినా కానీ బాబా ప్రేమ మాత్రం సమాప్తం కాదు. పైగా, వీరికి ఎక్స్ ట్రా సహయోగమును, ప్రేమను ఇచ్చి ఎగిరేట్లు చెయ్యండని తోటి పిల్లలకు బాప్ దాదా చెప్తారు. ఇప్పుడు బాప్ దాదా ఏమి ఆశిస్తున్నారంటే, సమయము గురించి అయితే అందరికీ తెలిసిందే. సమయము ఎక్కడకు వెళుతుంది అన్నది అందరికీ తెలుసు. కావున సమయాన్ని చూస్తూ బాప్ దాదా 'అకస్మాత్తు' గురించి చెప్పిన విషయాలను గుర్తు చేసుకోండి. పిల్లలు ఒక్కరు కూడా వెనుక ఉండిపోకూడదు అన్నది బాప్ దాదా మనసులోని ఆశ. కలిసి ఉండాలి, కలిసి వెళ్ళాలి. స్థూలంగా కలిసి ఉండటము కాదు, మనసు ద్వారా సదా శ్రీమతంపై నడవడమే సదా తోడుగా ఉండటము. ఇప్పుడు సమయ ప్రమాణముగా, ప్రేమ ఉన్నప్పుడు కలిసి ఉండాలి అని అనుకుంటారు కదా, కలిసి ఉండటము స్థూలంగా అయితే వీలు కాదు కానీ బాబా ఏదైతే కోరుకుంటున్నారో, పరివారం ఏదైతే కోరుకుంటుందో అందులో సమానంగా మరియు తోడుగా నడుచుకోండి, ఇదే కలిసి ఉండటము.

ఎలా అయితే బాప్ దాదా వద్దకు నలువైపుల నుండి పిల్లలందరి ప్రేమ అలలు చేరుకున్నాయో అలాగే బాప్ దాదా శుభ ఆశ ఏమిటంటే ప్రతి రోజూ అమృతవేళ నుండి రాత్రి వరకు మనసు, వాచ, కర్మణల ద్వారా ఏ కార్యాలైతే చేస్తారో వాటిలో 'బాబా చెప్పింది నేను చేసింది సమానంగా ఉందా' అన్నది పరిశీలించుకోండి. ఇది వీలవుతుందా? ఈజీయేనా? రోజూ మురళి బాబా చెప్పింది. మరి ప్రతి ఒక్కరూ 'బాబా చెప్పింది నేను చేసింది ఒకటిగా ఉందా' అని పరిశీలించుకోండి. ఇది కష్టమైతే కాదు కదా! ఎందుకంటే ప్రతి ఒక్కరూ రాత్రి పడుకునే ముందు తమ రోజువారీ రిజల్టును పరిశీలించుకుంటూనే ఉండి ఉండవచ్చు కదా. పిల్లలైన మీరు సంపన్నంగా అయ్యి సమయాన్ని సమీపంగా తీసుకురావాలని ఇప్పుడు బాబా కోరుకుంటున్నారు. 'రండి పిల్లలూ, కలిసి రాజ్యంలోకి వెళ్లాము' అని బ్రహ్మబాబా కూడా ఆహ్వానిస్తున్నారు. ముక్తి ద్వారాలను తెరిపించి ఆత్మలను కూడా ముక్తి పాత్రను వహించనివ్వండి. కొందరికి రాజ్యము, కొందరికి ముక్తి.

ఈ రోజు అమృతవేళ నుండి స్నేహ మాలలు అన్ని వైపుల నుండి చాలా చేరుకున్నాయి. బాప్ దాదా అందరికీ, పంపిన వారికి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలన్న బాప్ దాదా మరియు పిల్లల కోరిక అనే అడుగును ఇప్పుడు తీవ్రం చెయ్యండి. మీకు కూడా ఇష్టమే కదా! తమ సోదరసోదరీల దుఃఖము, అశాంతులను వింటే మంచిగా అనిపించదు కదా. ఇప్పుడు పరస్పరం కలుసుకుని ఇతర విషయాలకు సమయము ఇవ్వకుండా ఈ ప్లాన్‌ను ఆలోచించండి. నలువైపుల సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలన్న ఉల్లాస ఉత్సాహాలు ఉండాలి. నా పిల్లలు ప్రతి ఒక్కరూ నా సమానంగా సంపన్నంగా అవ్వాలి అని బ్రహ్మబాబా కోరుకుంటున్నారు. బ్రహ్మబాబా యొక్క ఈ ఆశను పూర్తి చేస్తారు కదా! ఈ రోజు బ్రహ్మబాబా నలువైపుల ఉన్న పిల్లలపై స్నేహము మరియు శక్తుల అలలను మరియు శుభ సంకల్పాల అలను వ్యాపింపజేసారు. బాబా కూడా పిల్లలకు బ్రహ్మ బాబాపై ఉన్న ప్రేమను చూసి, ఈ రోజు పూలు వెదజల్లే రోజు కదా, మరి బాబా కూడా శుభ ఆశల పూలను, “చెప్పడము మరియు చెయ్యడము” అనే ఆశల పుష్పాలు కాక తీవ్ర పురుషార్థము అనే పుష్పాలను నలువైపుల ఉన్న పిల్లలపై చల్లుతున్నారు. అచ్ఛా. 

బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ, క్రొత్తగా వచ్చిన వారైనా కావచ్చు, మొదటి సారి వచ్చినవారు లేవండి. మెజారిటీ సగంమంది క్రొత్తవారే ఉన్నారు. వచ్చినవారు బాప్ దాదా ప్రియస్మృతులను చాలా చాలా స్వీకరించండి బాప్ దాదా సంతోషిస్తున్నారు కానీ అద్భుతము చేసి చూపించండి. అచ్ఛా. చూస్తున్నాము, పిల్లలందరినీ ఎదురుగా చూస్తున్నాము, అక్కడున్నా, చివరిలో ఉన్నాకానీ ఇందులో (బాప్ దాదా ఎదురుగా టి.వి పెట్టి ఉంది) ఎదురుగా ఉన్నట్లుగానే కనిపిస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరూ బాప్ దాదా యొక్క ప్రియస్మృతులను స్వీకరించండి. ఇప్పుడు పరివర్తన త్వరత్వరగా చెయ్యాల్సి ఉంటుంది. వచ్చేసారు, ఇందుకు అభినందనలు, ఇప్పుడు పురుషార్థము చేసి ముందు నంబరు తీసుకుని అభినందనలు పొందండి అచ్చా, కూర్చోండి. మంచిది, వస్తూ ఉండండి. 

సేవ టర్న్ పంజాబ్ జోన్ వారిది:- మంచిది, వచ్చారు. పంజాబ్ పై బ్రహ్మబాబాకు చాలా ప్రేమ ఉండేది. ప్రత్యేకంగా పంజాబ్ లో తిరుగుతూ ఉండేవారు. బ్రహ్మబాబా అన్ని స్థానాలకు వెళ్ళలేదు కానీ కొన్ని స్థానాలకు వెళ్ళారు, అందులో కూడా పంజాబ్ కు వెళ్ళినప్పుడు బాబా డైరెక్టుగా తమ వరదానాన్ని ఇచ్చారు. పంజాబ్ విశేషత ఏమిటంటే కుమారీలు, టీచర్లు చాలామంది తయారయ్యారు. ధైర్యమున్నవారు, భయపడేవారు కాదు. అంతే కదా టీచర్లూ! ధైర్యవంతులే కదా, భయపడేవారు కాదు కదా. లేదు కదా. చివరకు అందరూ, ఎంత పెద్దవారైనా చివరకు 'జై శివ శక్తులు' అని అనవలసిందే. సేవలో అయితే బాప్ దాదా ప్రతి ఒక్కరినీ చూస్తున్నారు, అందరూ చేస్తున్నారు, చేస్తూ ఉంటారు కానీ ఒక్క విషయము అన్ని జోన్ల కోసం ఏదైతే బాప్ దాదా చెప్పారో, సర్టిఫికేట్ తీసుకోవడం గురించి, అది ఇప్పటి వరకు ఏ జోన్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు పంజాబ్ నంబర్ వన్లోకి వెళ్ళాలి. ఒకరు చెప్పడము, అందరూ ప్రేమతో చెయ్యడము. ఎలా అయితే స్థూలంగా ఒకరికొకరు సహకరించుకుంటారో అలాగే సంస్కారాల మిలనములో కూడా ప్రత్యక్ష ఫలాన్ని చూపించండి. సరేనా! ఇప్పుడు ఆ నంబర్ ఇంకా రాలేదు, ఇప్పటి వరకు ఏ జోన్ నుండీ ఈ రిజల్టు రాలేదు. పంజాబ్ చేస్తుంది. చేస్తుంది కదా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు చాలామంది ఉన్నారు. చాలా మంచిది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. 

డబుల్ విదేశీయులు:- విదేశీయులు, కానీ బాప్ దాదా విదేశీ పిల్లల ఉల్లాస ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు అంతే కాక మధువనానికి వచ్చి ప్రతి ఒక్కరూ తమ పురుషార్థంలో ఎడిషన్ చేసుకోవడాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. మీరందరూ వచ్చినవారు విశేషంగా ఏదో ఒక విషయంపై అటెన్షన్ పెట్టారు కదా! ఇక ముందు ఇది చెయ్యాలి - ఇది చెయ్యకూడదు, రెండింటి స్పష్టీకరణ తీసుకుని వెళ్తారు. అటెన్షన్ ఇస్తారు కూడా మరియు నిమిత్తంగా ఉన్నవారు అటెన్షన్ను ఇప్పిస్తారు కూడా, ఇందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. అటెన్షన్ ఉంచి కొందరు పరివర్తన కూడా చెందుతున్నారు, ఈ రిజల్టును బాప్ దాదా చూసారు. మధువనానికి రావడము అంటే ఏదో ఒక విషయంలో ప్రోగ్రెస్ జరగడము అని భవిష్యత్తు కోసం అటెన్షన్ ఉంచండి. చేతులెత్తండి. ఏదో ఒక పరివర్తన చేసుకుని వెళ్ళండి. సరేనా, సమ్మతమేనా? బాప్ దాదా ప్రేమ కూడా ఉంది ఎందుకంటే డబుల్ సేవను చేస్తూ కూడా కొంతమంది పిల్లలు మంచి తీవ్ర పురుషార్థాన్ని చేస్తూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు, సదా మొదటి నంబరే తీసుకుంటూ ఉండండి. నడుస్తున్నాము, కాదు. నంబర్ ఏమిటి? వస్తున్నాము, క్లాసు వింటున్నాము అని కాదు. ప్రతిరోజూ ప్రోగ్రెస్ ఏమి చేసాము? మురళి వినడము, ధారణ చెయ్యడము, ఇందుకు ప్రూఫ్ పరివర్తన. మంచిది, బాప్ దాదా సంతోషిస్తున్నారు. చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తూ ఉంటారు. మంచిది. చేతులు ఊపండి.

బాప్ దాదా అందరినీ చూస్తున్నారు ఎందుకంటే ఇందులో (టి.విలో) ప్రత్యేకంగా వస్తుంది కదా. చూడండి, డ్రామా అనుసారంగా పిల్లలు రావడానికి 100 సంవత్సరాల ముందే సైన్సు వృద్ది చెందింది, ఇప్పుడు కూడా చూడండి, ఈ సైన్సు మీకు ఉపయోగపడ్తుంది. మంచిది కదా. అచ్చా. పిల్లలందరూ, వెనుక ఉన్నవారు కూడా మేము బాప్ దాదా ఎదురుగా ఉన్నాము మరియు బాప్ దాదా మాకు ప్రియస్మృతులను తెలుపుతున్నారు అని భావించండి.

కలకత్తావారు అన్ని స్థానాలలో పూలతో అలంకరణ చేసారు:- బాగా చేస్తారు, మనస్పూర్తిగా చేస్తారు, కష్టపడతారు కూడా, కావున ప్రత్యేకముగా బాప్ దాదా తరఫున వీరికి రెండ్రెండు టోలీలు మరియు 6 పండ్లు ఇవ్వండి. ఎవరైతే శ్రమ చేసారో వారికి ఫలితము లభించవలసిందే కదా. ఇకపోతే అంతా బాగుంది, మనసుతో చేస్తారు, అది మనసుకు మంచిగా అనిపిస్తుంది. అభినందనలు. సేవ చేసారు, ఒకటి-వచ్చారు, రెండు-సేవ చేసారు, కావున అభినందనలు. అచ్ఛా. 

ఇప్పుడు నలువైపుల ఉన్న పిల్లలను బాప్ దాదా చూస్తున్నారు, వారు కూడా బాప్ దాదాను చూస్తున్నారు, మరి అందరికీ చాలా-చాలా తీవ్ర పురుషార్థీ, ఆలోచించారు మరియు చేసారు, దీనినే తీవ్ర పురుషార్థము అని అంటారు. కావున ఎవరైతే తీవ్ర పురుషార్థీ పిల్లలు ఉన్నారో వారందరికీ బాప్ దాదా తీవ్ర పురుషార్థమునకు అభినందనలు తెలుపున్నారు. దానితో పాటు ముందుకు సాగేందుకు కూడా అభినందనలు తెలుపుతున్నారు. అచ్చా.

ఈ రోజు అందరినీ కలిసాము కదా. చూడండి, ఒక్కొక్కరితో ఎదురుగా కలవడం కుదరదు కదా, ఒక్కొక్కరినీ దూరంగా కూర్చున్నవారిని కూడా ప్రక్కన అనుభవం చేస్తూ ప్రియస్మృతులను ఇస్తున్నారు. అచ్ఛా. ఇప్పుడు ఏమి చెయ్యాలి?

బాప్ దాదా దాదీ జానకి గారికి పూలమాలను వేసారు:- ఏమి చెయ్యను, మీరు చెయ్యడం లేదు. అందరూ మంచిగా చేస్తున్నారు. ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారు మంచిగా చేస్తున్నారు. విన్నారా! (దాదీ జానకిగారు కొంతమంది సోదరసోదరీల స్మృతిని బాబాకు అందించారు), బాప్ దాదా అమృతవేళ పర్యటనకు బయలుదేరినప్పుడు వారి వద్దకు వస్తారని వారికి చెప్పండి. (నారాయణ్ దాదా హాస్పిటల్ లో ఉన్నారు) సేవ జాగ్రత్తగా చెయ్యండి మరియు ప్రియస్మృతులను కూడా ఇవ్వండి. 

మోహిని అక్కయ్య అహ్మదాబాద్ హాస్పిటల్ నుండి స్మృతిని పంపారు:- ఎంతటి అనారోగ్యం ఉన్నా కానీ బాప్ దాదా గుర్తుంటే అనారోగ్యం తగ్గిపోతుంది. ఎంతగా ప్రయత్నించి స్మృతిలో ఉంటారో, అంతగా రోగము సగం తగ్గిపోతుంది. ఆ మందుల్లాగా మొదటి మందు ఈ స్మృతి. చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. మంచిది. అయినా కూడా ఇంత సహనం చేసే ధైర్యం ఉంది. బాగుంది, బాగైపోతారు. 

నిర్మల్ శాంత దాదీ గదిలో ఉన్నారు:- ఇప్పుడు కూడా గదిలో వింటారు. వారు గుర్తు చేస్తారు మరియు బాబా కూడా ప్రియస్మృతులను అందిస్తారు. నారాయణకు బాబా తరఫు నుండి టోలీ పంపండి. 

అందరికీ బాబా స్మృతిని ఇస్తూ ఉండండి. మంచిది. ఢిల్లీవారు కూడా మంచి పురుషార్థాన్ని చేస్తున్నారు. (బృజ్ మోహన్ అన్నయ్య శివ జయంతి కార్యక్రమం గురించి తెలియజేసారు) బాగా కలిసి చెయ్యడం వలన సందేశం వ్యాపిస్తుంది. మూలమూలల చేయవలసి ఉంటుంది కానీ కలిసి చేస్తే నలువైపులకు వ్యాపిస్తుంది. మంచిది, అందరికీ, ఢిల్లీ వారందరూ 'నాకు ప్రియస్మృతులు లభించాయి' అని భావించండి. (రమేష్ అన్నయ్యతో) ఆరోగ్యం బాగుందా? చాలా మంచిది. (స్టూడియో సేవను ఎలా వృద్ది చెయ్యాలి) అందుకోసం ఒక గ్రూపును తయారు చెయ్యండి. కొంతమందితో కూడిన సేవా కమిటీని తయారు చెయ్యండి. వారికి పైన ఎవరిని కావాలంటే వారిని ఉంచండి, తర్వాత రిజల్టును అడుగుతూ ఉండండి, అనుకున్నది జరిగిందా లేదా అని రిజల్టును చూడండి. ఏదైనా సమస్య ఉంటే వారు కూడా దాని పరిష్కారం చెయ్యవచ్చు. రాత్రి 5 నిమిషాలైనా కూర్చుని అభినందనలు తెలపండి, ఉల్లాసపడతారు. కృషి చెయ్యవలసి ఉంటుంది కదా. అచ్చా. అందరికీ స్మృతిని ఇవ్వండి.

యజ్ఞ నివాసి బాప్ దాదా పిల్లలంటే అందరికీ ప్రేమ ఉంటుంది. బాప్ దాదాకు నిమిత్తంగా అయిన పిల్లలు ఎవరైనా కావచ్చు, దాదీలు నిమిత్తమయ్యారు, వారికి కూడా బాబా విశేషంగా ఆశీర్వాదాలు ఇస్తారు. ఆశీర్వాదాలతోటే వారు నడుస్తున్నారు మరియు నడిపిస్తున్నారు. విశేషంగా ఆశీర్వాదాలు స్పెషల్ గా నిమిత్తంగా ఉన్నవారికి, సోదరి కావచ్చు, సోదరుడు కావచ్చు, కానీ ఏ కార్యం కోసం నిమిత్తంగా అయినా కానీ వారికి స్పెషల్ ఆశీర్వాదాలు లభిస్తాయి, లభిస్తూ ఉంటాయి.

Comments