16-10-2016 అవ్యక్త మురళి

 16-10-2016         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“ఓంశాంతి పదం యొక్క అర్థ స్వరూపంలో స్థితులై మనసుతో నాట్యం చెయ్యడాన్ని పెంచండి. మనసుతో మౌనంగా ఉండే అలవాటు చేసుకోండి అప్పుడు మాటల శబ్దం నుండి దూరం అవుతూ ఉంటారు మరియు శాంతి కిరణాలతో సేవ స్వతహాగా పెరుగుతూ ఉంటుంది" 

ఓంశాంతి. ఈ మహావాక్యము అందరికీ ఎంతో ప్రియమైనది. ఏది జరిగినా, ఏడ్చే వాతావరణం ఉన్నా కానీ ఓంశాంతి అన్న పదము మనకు శాంతిని గుర్తుకు తెప్పిస్తుంది. ఎటువంటి దృశ్యము మన ఎదురుగా వచ్చినప్పటికీ, ఓంశాంతి అర్థము తన రూపాన్ని చూపిస్తుంది. ఓంశాంతి అని అంటే స్వతహాగానే లోలోపల శాంతి అలలు వ్యాపిస్తాయి. అందరి హృదయాలలో ఓంశాంతి తన అర్థాన్ని వ్యాప్తి చేస్తుంది. ఎలా అయితే బాబా అన్న పదము తన అర్థాన్ని వ్యాప్తి చేస్తుందో, అలాగే ఓంశాంతి పదం తన అర్థాన్ని వ్యాప్తి చేస్తుంది. హృదయంలో వ్యాప్తి చేస్తుంది, వ్యాప్తి చేస్తూ ఆ పదం యొక్క అర్థ స్వరూపంలో స్థితులైపోతారు, కేవలం అనడం కాదు , నలువైపుల చూస్తే మెజారిటీ పిల్లలు ఓంశాంతి అర్థ స్వరూపంలో స్థితులై ఉన్నారు. మెజారిటీ రూపాలు మెరుస్తున్నాయి. ఒకరినొకరు చూసుకుని, ఇతరుల సాంగత్యపు రంగు ముఖంలో మెరుస్తుంది అందుకే బాప్ దాదా కూడా ఓంశాంతిని గుర్తు తెప్పిస్తున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో, లోపల ఓంశాంతి అర్థం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి హృదయంలో ఓంశాంతి అర్థ స్వరూపం కనిపిస్తుంది. మీ అందరి హృదయాలలో అర్థం వచ్చేసిందా! ప్రతి ఒక్కరూ ఓంశాంతి అర్థ స్వరూపంలో కనిపిస్తున్నారు, కొందరు ఓంశాంతి అని మాట్లాడుతున్నారు, మరి కొందరు చూస్తున్నారు.

ఇప్పుడు కూడా అందరూ ఈ క్షణంలో ఓంశాంతి అర్థ స్వరూపంలో చాలా అర్థవంతంగా నిమగ్నమై ఉన్నారు. కనుక బాబా కూడా అంటున్నారు, ఈ ఓంశాంతి అర్థములో స్థితులవ్వడం వలన, అందరి ముఖాలు మెజారిటీ ఓంశాంతి అర్థంలో మునిగి ఉన్నాయి. ముందు, వెనక ఉన్నవారు చేతులెత్తండి అని ఏమని అడగను! మెజారిటీ అందరూ ఈ అర్థ స్వరూపంలో మునిగి ఉన్నారు. అందరి నోటి నుండి ఓంశాంతి అనే వెలువడుతుంది. అందరి హృదయాలలో ఓంశాంతి పదమే ఉంది. అందరి మనసులలో ఈ అర్థము ఇమర్జ్ అయి ఉంది. అందరూ ఓంశాంతి అర్థంలో మనసుతో నాట్యం చేస్తున్నారు. పాదాలతో నాట్యం చెయ్యడం లేదు కానీ మనసుతో నాట్యం అందరూ చేస్తున్నారు. మనసుతో చేసే డాన్స్ ఎంతో ప్రియంగా ఉంటుంది. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టదు. ప్రతి ఒక్కరి మనసు శాంతిగా ఉన్న కారణంగా బయట కూడా శాంతిగా మరియు మనసులో ఎంతో శాంతిగా ఉన్నారు. ఇటువంటి డబుల్ ఓంశాంతి, బాహ్యంగా నోటితో కూడా ఓంశాంతి మరియు మనసుతో కూడా ఓంశాంతి. ఇది కూడా ఒక డ్యాన్సు. ఇది మనసుతో చేసే డ్యాన్సు. శాంతిగా కూర్చునే ఎంతో మధురమైన డ్యాన్సును చేస్తున్నారు. కానీ మనసుతో నాట్యం చేస్తున్న కారణంగా బయట ఎటువంటి శబ్దం లేదు. ప్రతి ఒక్కరూ మనసుతో నాట్యం చెయ్యడంలో బిజీగా ఉన్నారు అందుకే మనసు ధ్వని ఉంది కానీ నోటి శబ్దం లేదు. ఇంతమంది ఉన్నప్పటికీ దగ్గరకు వస్తేగానీ ఏదీ వినిపించదు ఎందుకంటే మనసుతో చేసే నాట్యం గురించి మనసుకే తెలుస్తుంది. మనసుతో డ్యాన్సు చెయ్యడంలో ఎంత బిజీగా ఉన్నారంటే, బయట ఎంతమంది కూర్చున్నా కానీ ఈ మనసు చేసే నాట్యంతో మనసు ప్రశాంతంగా ఉంది. మనసు యొక్క మస్తీలో అందరూ మునిగి ఉన్నారు కనుక మనసుతో చేసే ఈ నాట్యంతో బాహ్య శబ్దాలు ఏవీ లేవు. మనసుతో చేసే డ్యాన్సు మనసులో ఎన్ని రంగులను చూపిస్తుందంటే అవి చాలా ప్రియంగా ఉంటాయి. మనసుతో నాట్యం జరిగినప్పుడల్లా బాహ్య శబ్దాలు ఏవీ ఉండవు. ఇంతమంది కూర్చున్నారు కానీ ఏ శబ్దమూ లేదు ఎందుకంటే మనసుతో డ్యాన్సు చెయ్యడంలో అందరూ బిజీగా ఉన్నారు. ఈ డ్యాన్సు మంచిగా అనిపిస్తుంది కదా! బయట నాట్యాలు అయితే చాలా చూసారు కానీ మనసుతో చేసే ఈ డ్యాన్సు చాలా రమణీకమైనది. ఈ డ్యాన్సును బాగా పెంచండి. మనసుతో డ్యాన్సు చెయ్యడం తెలుసు కదా! తెలుసా? తెలిసినవారు చేతులెత్తండి. అచ్చా, అందరికీ తెలుసు. చాలా బాగా చేతులు కూడా ఎత్తుతున్నారు. మరి ఇప్పుడు ఈ డ్యాన్సులో మంచి నంబరు తీసుకోండి. మనసుతో చేసే డ్యాన్సు మంచిగా అనిపిస్తుందా లేక నోటితో చేసే డ్యాన్సు మంచిగా అనిపిస్తుందా? మనసుతో డ్యాన్సు చేసే అలవాటును చేసుకోండి. ఇందులోనే బిజీగా ఉండటం వలన, మనసుతో డ్యాన్సు చేసే సమయంలో ఇక్కడ హాలులో ఎంత శాంతి ఉంటుంది. ఈ డ్యాన్సు ఇప్పుడు చాలా అవసరము ఎందుకంటే రోజు రోజుకూ బయటి హంగామా పెరుగుతూ ఉంటుంది, పెరిగేదే ఉంది. ఇటువంటి సమయంలో, బాహ్య డ్యాన్సు, బయట మాటలు కూడా అవసరమే, కానీ ఇటువంటి సమయంలో మనసుతో డ్యాన్సు చేసే అభ్యాసం చాలా కావాలి. దీని అభ్యాసం లోలోపలే జరగాలి. రోజంతటిలో ఇందుకోసం ముందుగా సమయాన్ని కేటాయించండి. ప్రతి ఒక్కరూ రోజంతటిలో రెండు డ్యాన్సుల కోసం సమయాన్ని కేటాయించండి మరియు అభ్యాసం చెయ్యండి. ఎంతగా ఈ డ్యాన్సును చేస్తూ ఉంటారో అంతగా ఈ డ్యాన్సుతో, మనసుతో చేసే డ్యాన్సు ప్రభావము బాహ్య డ్యాన్సుపై కూడా ప్రభావం చూపుతుంది. కనుక ఇప్పుడు మనసుతో డ్యాన్సు చెయ్యడాన్ని పెంచండి. అప్పుడు దానిపై అభిరుచి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాబా చూసింది ఏమిటంటే చాలా మందికి మనసుతో డ్యాన్సు చెయ్యడంపై ఇంట్రెస్టు పెరుగుతూ ఉంది అని, నలువైపుల సత్యమైన శాంతి అనుభూతి జరుగుతూ ఉంది. కొందరి అనుభవం ఇందులో చాలా బాగా పెరుగుతూ ఉంది. ఈ అభ్యాసం పెరగడం చాలా లాభదాయకమైనది. బాహ్య మౌనం గురించి చేసే ప్రోగ్రాముల వలన కూడా మనసు శాంతి పెరుగుతుంది, మనసులో శాంతి పెరగడం వలన స్వతహాగా నోటి మాటలు తక్కువ అవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేనిపై అటెన్షన్ ఉంచాలి? మనసు యొక్క మౌనంపై. మనసు యొక్క మౌనం గురించి మీకు తెలుసు కదా! లేక దాని గురించి ఎక్కువగా తెలియదా? దీనిపై ఆసక్తి పెట్టుకోండి. మనసు యొక్క మౌనం పెరుగుతూ ఉండాలి. మనసు యొక్క మౌనం పెరిగినప్పుడు తనువు యొక్క మౌనం స్వతహాగా పెరుగుతుంది. మీరందరూ మీలో మనసు యొక్క మౌనాన్ని పెంచే పురుషార్థాన్ని ప్రేమతో పెంచుతూ ఉండండి. ఎంతగా ఈ వైపు ప్రయత్నం చేస్తారో, అంతగా ఆసక్తి పెరుగుతుంది అప్పుడు స్వతహాగా మనసు మౌనంగా ఉన్న కారణంగా శబ్దం నుండి దూరంగా వెళ్తూ ఉంటారు మరియు లోపల శాంతి కిరణాలు పెరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఒక వారం విశేషంగా మనసు యొక్క శాంతి వారాన్ని జరుపుకోండి. నోటి శాంతిని తగ్గించండి, మనసు యొక్క శాంతిని పెంచండి. ఇది ప్రయత్నం చేసి చూడండి, మనసు యొక్క శాంతితో అన్ని రకాల శాంతులు పెరుగుతాయి. ఇప్పుడు ఒక నెల మనసు యొక్క శక్తిని పెంచాలి. మనసు యొక్క శాంతి పెరగడం వలన స్వతహాగా నోటి శక్తి పెరుగుతుంది. ఈ అభ్యాసం అందరికీ బాగా నచ్చుతుంది కదా! చేతులెత్తండి. అఛ్ఛా, చేతులైతే అందరూ మెజారిటీ ఎత్తారు.

ఈ మనసు యొక్క శక్తి ఏమిటి! దీనిని ఎలా పెంచుకోవాలి, ఇది కూడా లోలోపల అభ్యాసం చేస్తూ ఉండండి. మనసు యొక్క శాంతి పాఠాన్ని పెంచుతూ ఉండండి. ఎంతగా మనసు యొక్క శాంతి పెరుగుతుందో అంతగా మనసు యొక్క శాంతి ప్రభావం నోటి శాంతిపై పడుతుంది. ఎంతగా మనసు యొక్క శాంతి పెరుగుతుందో అంతగా నోటి బాహ్య శక్తి తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఒక మంచి రేస్ జరిగింది, మనసు యొక్క శాంతి అందరిదీ పెరిగింది, మనసుతో ఆలోచించే శక్తి కావచ్చు, నోటి ద్వారా కావచ్చు, సూక్ష్మ శక్తులను పెంచుకునే అభ్యాసం ద్వారా ఎంత పెంచుకుంటామో అంతగా శక్తి పెరిగి నోటి శక్తి తగ్గుతుంది, అప్పుడు మాటలలో జరిగే పొరపాట్లు చాలావరకు తగ్గుతాయి, లేదా మాటల కోసం చేసే పురుషార్థం కూడా తక్కువ అవుతుంది. కనుక ఇలా చేస్తూ ఉండండి, ఇదే బాప్ దాదా చెప్పేది. 

సేవ టర్న్ పంజాబ్ మరియు రాజస్థాన్ వారిది, మొత్తం 22000 మంది వచ్చారు:- మొత్తంగా చూసుకుంటే, ఇప్పుడు ఏ సబ్జెక్టులైతే జరిగాయో, సేవ మరియు స్మృతి, ఇవి రెండు సబ్జెక్టులు. ఇప్పుడు సేవను కూడా పెంచవలసిందే. మీరు ఏమనుకుంటున్నారు, సేవను పెంచాలా? చేతులెత్తండి. సేవ కూడా తప్పనిసరి. ఒకవేళ సేవ చెయ్యకపోతే సమయాన్ని అలాగే గడిపేస్తూ ఉంటారు ఎందుకంటే టైమ్ అయితే పాస్ చెయ్యవలసిందే. సమయాన్ని మంచిగా పాస్ చెయ్యాలి, ఏది అనిపిస్తే అది చేసాము అన్నట్లుగా ఉండకూడదు. నియమ ప్రమాణంగా, లభించిన ప్రోగ్రాము ప్రకారంగా రిజల్టు రావాలి. 

రమేష్ అన్నయ్యగారి ఆరోగ్యం కొంచెం సున్నితంగా ఉంది, వారిని హాస్పిటల్‌కు తీసుకువెళ్తున్నారు. వారు బాప్ దాదాను కలుస్తున్నారు, రమేష్ అన్నయ్యగారు బాప్ దాదాకు క్రొత్త పుస్తకాలను బహుకరించారు: - ఓం శాంతి. సేవ అయితే జరుగుతూనే ఉంది, సేవ కూడా తప్పనిసరి. సేవ లేకపోతే మీరు కూడా ఫ్రీ అయిపోతారు కదా, అప్పుడు మీకు కూడా ఏదో చెయ్యాలి అని ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ, ఏ సేవ ప్లాన్ అయితే ఆలోచించారో, ముందుగా మిగిలి ఉన్న సేవను పూర్తి చెయ్యాలి అన్నది బాప్ దాదా ఆలోచన. మొదలుపెడతారు, కానీ కొంత సమయం తర్వాత సేవ ఉత్సాహం తగ్గిపోతుంది.

బాగుంది, రమేష్ మీ ఆలోచన చాలా బాగుంది కానీ ఇది చేసేటప్పుడు కొంత ప్రత్యేక శ్రద్ధను కూడా పెట్టాలి, కొంచెం పరస్పరంలో కూర్చుని దీని గురించి చర్చించండి. ఆ సేవను ఎలా జరపాలి, ఎలా పెంచాలి అని చర్చించండి. ఎక్కువగా టూ మచ్ గా కూడా వెళ్ళకండి, అలా అని పూర్తిగా తగ్గించేయద్దు. రెండింటింకీ మధ్యలో ఉండండి అందుకే ముందుగా ఒక చిన్న మీటింగ్ పెట్టుకోండి, అందులో ఏమేమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అన్న ఐడియాలు తయారు చెయ్యండి. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను వినిపించండి, దాని గురించి ముందుగా ప్లాన్ చెయ్యండి ఎందుకంటే సేవ పెంచాలా, వద్దా అన్నది తెలుస్తుంది. 

డబుల్ విదేశీయులు 75 దేశాల నుండి 900 మంది వచ్చారు: - (బాప్ దాదాకు సేవ ప్లాన్ ను పంపారు, బాప్ దాదా దాని గురించి తమ మహావాక్యాలను ఉచ్చరిస్తున్నారు) వీరి సేవ ప్లాన్ చాలా బాగుంది. ఎంతగా సేవలో ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా ఇతర సబ్జెక్టులలో వెనక పడిపోకూడదు. దాని గురించి కూడా ఆలోచించి ప్లాన్ తయారు చేస్తే అప్పుడే ఫైనల్ చేస్తాము. ఎవరైతే సేవ ప్లాన్‌ను తయారు చేసారో ముందు వారిది వినండి, తర్వాత దానిని ఫైనల్ చెయ్యగలిగితే చెయ్యండి, లేకపోతే ఏదైనా ఎడిషన్ చేయాల్సి ఉంటే దాని రూపురేఖలు కూడా చెప్పండి. తర్వాత దాని అనుసారంగా ఆలోచించి సేవ మరియు యోగం గురించి కూడా ప్లాన్ తయారు చెయ్యండి. ఈ రెండు టాపిక్స్ చాలా అవసరము దానిని తయారు చేసి తర్వాత ఈ ప్లాన్లో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని ఫైనల్ చెయ్యండి. ఈ సేవ తప్పనిసరి అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఇటువంటి ప్లాన్ ను తయారు చేసి ముందుగా పాస్ చేయించండి, అప్పుడు ఔట్ చెయ్యండి (అందరికీ చెప్పండి). 

(దాదీలు బాప్ దాదాను కలుస్తున్నారు) బాబా మీవారు, కనుక మొదటి సర్వీసు కూడా మీకే ఇస్తారు, ఎందుకంటే బాబాకు సేవ అంటే ఎంతో ఇష్టము. సేవ వైపే అటెన్షన్ వెళ్తుంది కనుక సేవ కూడా చెయ్యాలి మరియు దానితో పాటు ఈ సేవను కూడా పెంచాలి. ఒక వైపు పెంచండి అని బాబా అంటున్నారు, మరోవైపు సంభాళించలేనంత సేవను పెట్టుకోకండి అని కూడా అంటున్నారు. ఈ సిస్టమ్ ను కూడా ముందు సరిగ్గా పెట్టుకోండి. సిస్టమ్ మంచిగా అయితే ఆ తర్వాత అన్ని డిపార్టుమెంటులు సరి అయిపోతాయి. కానీ శ్రద్ధ పెట్టండి. ఒక్కొక్క డిపార్టుమెంటు, మీరు ఆలోచించినట్లుగానే చెయ్యాలా లేక అందులో ఏదైనా ఎడిషన్ లేక కట్ చెయ్యాలా అని ఆలోచించండి. అది కూడా ముందుగా ఫైనల్ చేసుకోండి. 

విదేశీ పెద్దక్కయ్యలతో:- అందరూ వచ్చారు. మరి పరస్పరంలో కూర్చున్నారా! మీరు మీ ప్లాన్ ను తయారు చేసారా? (ఇప్పుడు చేస్తాము) ముందు చెయ్యండి తర్వాత బాప్ దాదా చూస్తారు. ఈ సేవలో ఇంకా ఏమేమి చెయ్యవచ్చు అని బాప్ దాదా చూస్తారు. ఎలా అయితే మీరు ఇంత సమయాన్ని ఈ సేవకు కేటాయించారు కదా, అలాగే ప్రతి ఒక్కరూ కేటాయించాలి ఎందుకంటే అది రిపీట్ చేస్తారు కదా. ముఖ్యమైన సేవల గురించి చెప్పాలి అన్న లక్ష్యం పెట్టుకోండి అప్పుడు రెండు సార్లు కూర్చోనవసరం ఉండదు. సర్వీసబుల్ పిల్లలు, ఎవరైతే సేవ కోసం ఆలోచిస్తారో, వారు రావాలి, వచ్చిందే సేవ ప్లాన్ కోసము. కనుక ఎంతగా సేవపై అటెన్షన్ ఉంచుతారో అంతగా సేవ నుండి లాభాన్ని పొందగలరు. పరస్పరంలో కూర్చుని ఏదైనా నవీనతను తీసుకురండి. ఇదంతా ఏదైతే జరుగుతుందో దానిని కొంచెం సరి చెయ్యండి, నవీనతను తీసుకురండి. 

జర్మనీలో రిట్రీట్ సెంటర్ లభించింది, సుదేశ్ అక్కయ్యగారు దాని మ్యాపును చూపిస్తున్నారు: - అందరూ ముందుగా చూడండి, తర్వాత ఫైనల్ చెయ్యండి. 

(న్యూయార్క్ మోహిని అక్కయ్యగారు బాప్ దాదాకు అందరి స్మృతిని అందించారు. వారిది ప్లాటినమ్ జూబిలీ, బాప్ దాదా వారికి మాలను వేసారు) 

బెంగుళూరు సరళ అక్కయ్యగారు బాప్ దాదాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు: - అరోగ్యం బాగుందా! మంచిది.

Comments