16-02-2015 అవ్యక్త మురళి

 16-02-2015         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“తండ్రి మరియు పిల్లల ప్రేమ అమరమైనది మరియు అలౌకికమైనది, మీకు బాబా పరిచయం పాటు ప్రాప్తులు కూడా లభించాయి, అలాగే సేవలో కూడా ముందుకు వెళ్తూ అందరికీ ఉల్లాస-ఉత్సాహాలను ఇవ్వండి, ఇప్పుడిక ఎవ్వరి ఫిర్యాదు రాకూడదు" 

 ఓం శాంతి. పిల్లలందరికీ, సమ్ముఖంలో ఉన్నవారు కావచ్చు, వివిధ స్థానాలలో ఉన్నవారు కావచ్చు, నలు వైపుల ఉన్న పిల్లలకు ఈనాటి రోజుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఈ అభినందనల రోజు చాలా ప్రియమైనది మరియు డ్రామాలో పిల్లలైన మీ ప్రేమకు ప్రత్యేకమైన గుర్తు. తండ్రి-పిల్లల మిలనము సమ్ముఖంలో సాకారంలో జరుగుతుంది కావున ముందుగా ఎవరైతే ముందు కూర్చుని ఉన్నారో వారితో మిలనము మరియు అభినందనలు, అభినందనలు. ఈ రోజు విశేషంగా స్థాపన కార్యానికి విశేషమైన రోజు. ఈరోజు పిల్లలు తండ్రిని తెలుసుకున్నారు, తండ్రి పిల్లలను తెలుసుకున్నారు. 'నా పిల్లలు' అని బాబా అంటారు, 'నా బాబా' అని పిల్లలు అంటారు. ఒక్కొక్కరికీ, ముందు లేక వెనక కూర్చున్న పిల్లలకు బాప్ దాదా ఈనాటి రోజుకు సమ్ముఖ మిలనం జరుపుకుంటున్నందుకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో ఈరోజు మిలనపు భాగ్యము, ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషము రూపంలో కనిపిస్తుంది. పిల్లలు ఒక్కొక్కరినీ సమ్ముఖంగా కలిసే భాగ్యాన్ని చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా అన్న అల, మిలనపు ముఖంలో కనిపిస్తూ ఉంది. బాబా కూడా పిల్లలు ఒక్కొక్కరికి ముందు వెనుక ఉన్న అందరినీ చూసి ఎంతగానో హర్షిస్తున్నారు. ఆ సంగతి బాబాకు తెలుసు, మీకు తెలుసు. బాబా హృదయం నుండి పిల్లలు ఒక్కొక్కరి కోసం వాహ్ పిల్లలు వాహ్! అని వెలువడుతుంది. సమ్ముఖంలో మిలనము జరుగుతుంది.  

బాప్ దాదా ముందు, వెనుక మూలన కూర్చున్న పిల్లలందరినీ చూసి వాహ్ పిల్లలూ వాహ్ అన్న పాటను పాడుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతటి మధురమైన స్మృతిలో కూర్చుని ఉన్నారో బాప్ దాదా చూస్తున్నారు. మూల-మూలన, వెనుక ముందు కూర్చుని ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాను చూసి ఎంతగానో హర్షిస్తున్నారు. బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి వాహ్ వాహ్ పిల్లలూ అన్న పాటను పాడుతున్నారు ఎందుకంటే ఇటువంటి మిలనము సదా జరగదని బాబాకు తెలుసు. కానీ ఈనాటి ఈ తోడు యొక్క అనుభవం, పిల్లలు ప్రతి ఒక్కరి స్నేహాన్ని చూసి అందరి హృదయాలు పులకరిస్తున్నాయి. అప్పుడప్పుడూ జరిగే ఈ సాకార మిలనము బాబా హృదయాన్ని ఆకర్శిస్తుంది. బాబా కూడా వాహ్ పిల్లలూ వాహ్ అన్న పాటను పాడుతున్నారు, పిల్లలు కూడా వాహ్ బాబా వాహ్! అనే పాటను పాడుతున్నారు. డ్రామాలో ఈ సంగమయుగ పాత్ర ఎంతో ఉంది, ఇందులో పిల్లలు బాబాను చూస్తున్నారు, తెలుసుకున్నారు మరియు బాబా పిల్లలను చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి నోటి నుండి నా బాబా, ప్రియమైన బాబా అని వెలువడుతుంది. బాబా నోటి నుండి కూడా వాహ్ పిల్లలూ వాహ్! అని వెలువడుతుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎలా తమ జన్మ సిద్ధ అధికారమును సమ్ముఖంలో కలిసే అనుభవాన్ని చేసుకుంటున్నారు! పిల్లలు ప్రతి ఒక్కరి ముఖాన్ని చూసి బాబాకు చాలా చాలా-చాలా సంతోషంగా ఉంది. 

బాబాకు కూడా పిల్లలందరినీ చూసి ఏమనిపిస్తుంది! పిల్లలందరికీ హృదయపూర్వక ప్రేమ ఎంతగానో ఉంది. ఒకవేళ బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరి ప్రేమను వర్ణిస్తే ఎన్నో పుస్తకాలు తయారవుతాయి. కానీ ఇది హృదయానికి తెలుసు, బాబా మరియు పిల్లలకు తెలుసు. ఇప్పుడు పిల్లలకు ఉన్న ఈ మిలనపు ముఖాన్ని, అందులోనూ పిల్లలు యథాశక్తి ఉన్నప్పటికీ తండ్రి-పిల్లల మధ్య ప్రేమ అమరమైనది, అలౌకికమైనది. బాబా సంతోషిస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరినీ హ్ పిల్లలూ వాహ్! అని అంటున్నారు. బాబాకు కూడా సంతోషంగా ఉంది. కొద్ది సమయం జరిగే ఈ సమ్ముఖ మిలనము ఎంత ప్రియంగా ఉంది! ప్రపంచంలోని పిల్లలందరూ తమ తండ్రిని తెలుసుకుని స్వయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఉల్లాస ఉత్సాహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి హృదయపూర్వక ప్రేమను చూస్తున్నారు మరియు వారిపట్ల చాలా-చాలా హృదయపూర్వక దీవెనలను, హృదయపూర్వక అభినందనలను ఇస్తున్నారు. వాహ్ డ్రామా వాహ్! ఈ మిలనము కూడా తక్కువైనదేమీ కాదు. బాప్ దాదా అయితే తమ హృదయంలోనే పిల్లలతో మిలనాన్ని జరుపుకుంటూ ఉంటారు. పిల్లలు లేనిదే ఉండలేరు. ఈ మిలనపు కథలైతే చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడైతే పిల్లలను సమ్ముఖంలో చూసి చాలా సంతోషంగా ఉంది. బాప్ దాదా కూడా పిల్లల ప్రేమలో వాహ్ పిల్లలూ వాహ్ అన్న పాటను పాడుతున్నారు.

ఈనాటి మిలనము ఉన్నదే కలుసుకునేందుకు. ఇటువంటి మిలనాన్ని చూసి పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతగానో సంతోషిస్తున్న విషయాన్ని బాప్ దాదా చూస్తున్నారు, ముందు బాప్ దాదా తర్వాత పిల్లలు. పిల్లల్లో ఒక్కరిని కూడా చూడకుండా బాప్ దాదా ఉండలేరు. వెనుక కూర్చున్నాకానీ సాకారంలో పిల్లలను చూసి బాప్ దాదాకు కూడా సంతోషం, పిల్లలకు కూడా సంతోషం. మరి ఇకముందు ఎటువంటి అద్భుతాన్ని చేసి చూపిస్తారు? మిలనపు మేళానైతే జరుపుకున్నారు, ఇప్పుడిక ఎటువంటి అద్భుతాన్ని చేసి చూపిస్తారు? మెజారిటీ ప్రతి ఒక్కరి మనసులలో, మా బాబా పిల్లలను కలవకుండా ఉండలేరు అని తెలియాలి. డ్రామా పాత్రను చూసి, ఆ రోజు ఏమిటి, ఈ రోజు ఏమిటి అని పిల్లలు తప్పకుండా ఆలోచిస్తుండటాన్ని బాప్ దాదా చూసారు. కానీ తెలివైనవారిగా అయ్యి సేవా పాత్రను మంచిగా నిర్వహిస్తున్నారు. సేవా పాత్రను నిర్వహించే పిల్లలను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు, ఎందుకంటే విశ్వంలో చివరకు, “మా బాబా వచ్చేసారు” అన్న విషయం తెలుస్తుంది. కానీ ఎలా అయితే సాకారంలో కూడా విశ్వంలోని కొంతమంది పిల్లలకే తండ్రిని తెలుసుకునే అధికారము మరియు ప్రాప్తి లభించాయో అలాగే పిల్లల ఈ భాగ్యం కారణంగా తండ్రి మరియు పిల్లల మిలనము జరుగుతుంది. డ్రామాలోని ఈ పాత్ర కూడా మనసుకు సంతోషాన్నిస్తుంది. బాబాకు కూడా సంతోషం, పిల్లలకు కూడా సంతోషం. కనుక బాప్ దాదా డ్రామానుసారంగా సాకారంలో పిల్లలను కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మిలనము కూడా డ్రామాలో ఎంతో మంచి పాత్రగా నిర్ధారింపబడి ఉంది. మీరు కూడా సంతోషిస్తున్నారు కదా! మిలనపు ఈ పాత్రను చూసి బాబాకు కూడా సంతోషం, పిల్లలకు కూడా సంతోషం. కానీ ఈ మిలనానికి మరియు ఆ మిలనానికి ఎంత తేడా ఉంది! డ్రామాలోని పాత్రగా భావించి ప్రతి ఒక్కరూ ఈ పాత్ర నుండి శక్తిని, ప్రేమను మరియు ఉల్లాసాన్ని తీసుకుంటున్నారు. బాప్ దాదా కూడా పిల్లలను కలుసుకుని ఎంతగా సంతోషిస్తుండవచ్చు, అదైతే పిల్లలకు కూడా తెలుసు మరియు బాబాకు కూడా తెలుసు. మరి ఈ అవకాశాన్ని కూడా డ్రామా మంచిగా చేసింది, బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి ఎంతో సంతోషిస్తున్నారు మరియు ఎన్నో అభినందనలను మనస్ఫూర్తిగా ఇస్తున్నారు.

కావున వాహ్ పిల్లలూ వాహ్ అనే పాటనే పాడుతారు. అందరూ సంతోషంగా మరియు అడుగులు ముందుకు వేసే నిమిత్తులుగా అయ్యారు కదా! తేడా ఉన్నాకానీ మిలనమైతే జరుగుతుంది. బాప్ దాదా కూడా పిల్లలను చూసి ఎంత సంతోషిస్తారంటే, చాలా సంతోషిస్తారు. పిల్లలు ఒక్కొక్కరినీ చూసి ఏమి చెయ్యాలనిపిస్తుందంటే, అది బాప్ దాదా హృదయానికే తెలుసు. పిల్లలు నంబరువారీగా ఉన్నా కానీ పిల్లలు మరియు తండ్రి మిలనమైతే జరుగుతున్నందుకు బాప్ దాదాకు సంతోషంగా ఉంది. పిల్లలు స్మృతిలో అయితే ఉంటారు, స్మృతి చేస్తారు కానీ మాయతో కూడా పోరాడుతూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. బాప్ దాదా సూక్ష్మంలో పిల్లలు ప్రతి ఒక్కరికీ అభినందనలు ఇస్తున్నారు - వాహ్ పిల్లలూ వాహ్! తండ్రి మరియు పిల్లల ఈ మిలనము అమరమైనది మరియు అమరంగా ఉంటుంది. 

అందరూ శారీరక రూపంలో మరియు ఆత్మ రూపంలో సంతోషంగా ఉన్నారు కదా! చేతులూపండి. అందరి చేతులను బాప్ దాదా చూస్తున్నారు. చాలా మంచిది. అభినందనలు. హృదయపూర్వక ప్రేమ, సత్యమైన ప్రేమ ఎప్పటికీ తొలగదు అని బాప్ దాదా చూసారు. కనుక బాప్ దాదా కూడా వాహ్ పిల్లలూ వాహ్ అన్న పాటను పాడుతూ ఉంటారు. స్మృతిలో ఉండే ప్రయత్నాన్ని చేసే పిల్లలందరినీ చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాబా కూడా పిల్లలను గుర్తు చేసుకుంటూ ఉంటారు, మర్చిపోయారనుకోకండి. పిల్లలు ప్రతి ఒక్కరూ బాప్ దాదా హృదయంలో ఉన్నారు. నంబరువారీగా ఉన్నాకానీ స్మృతిలో అయితే ఉంటారు. మరి బాప్ దాదా ఈరోజును మహాగా భావిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు తండ్రి మరియు పిల్లల మిలనము సమ్ముఖంలో జరుగుతుంది. బాబాకు కూడా సంతోషం, పిల్లలకు కూడా సంతోషం. ఇప్పుడిక ముందు కోసం ధ్వనిని వ్యాపింపజేసేందుకు కొత్త కొత్త కార్యక్రమాలను తయారు చెయ్యండి, దీని ద్వారా ప్రపంచంలోని వారు మేల్కొని ఉండాలి, నిద్రించకూడదు. మేల్కొల్పుతూ ఉండండి, ముందుకు వెళ్తూ ఉండండి. మీ భాగ్యం ముందు వారిని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ ఈ రోజులను గుర్తు చేసుకునే సమయం కూడా వస్తుంది కనుక మీరు మీ కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళండి. పాపం వారు. మీరైతే భాగ్యశాలురు, మీకు మీ భాగ్యం ప్రాప్తించింది, దానిని అనుభవం చేసుకుంటున్నారు. అవ్యక్తమైనప్పటికీ పిల్లలు గుర్తించినందుకు బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు సేవా భాగ్యాన్ని కూడా తీసుకుంటున్నారు. 

అందరితో ఇప్పుడు ఈ విధితోటే కలవడం జరుగుతుంది. వారు కలుస్తున్నారు. ఇందులో కూడా బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇంకే పాటను పాడుతారు? వాహ్ భాగ్యశాలి పిల్లలూ వాహ్! 

సేవ టర్న్ ఇండోర్ మరియు భోపాల్ జోన్ వారిది: - (25వేలమంది సోదరసోదరీల గ్రూపు వచ్చింది, 200మంది ఇండోర్ హాస్టల్ కుమారీలు వచ్చారు) ఈ పాత్ర కూడా నిర్ధారింపబడి ఉంది, అది జరుగుతుంది. బాప్ దాదా కూడా పిల్లలను కలుసుకుని సంతోషిస్తారు. ఎంతటి భాగ్యశాలి పిల్లలు! ఈ భాగ్యాన్ని చూసి పదేపదే మనసులో, నోటితో వాహ్ పిల్లలు, వాహ్ భాగ్యశాలి పిల్లలూ వాహ్ అని వెలువడుతుంది. అచ్చా. ఏ పాత్ర అయితే జరుగుతుందో అది డ్రామానుసారంగా జరగాల్సి ఉంది, జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాబా స్మృతిలో ఉండాలి, సేవలో ముందుకు వెళ్ళాలి. ఎవరైతే పాపం తెలుసుకోలేదో వారి సేవను నలువైపుల ఎంతో సంతోషంగా చెయ్యండి. మీకు తెలుసు కానీ మాకు తెలీలేదు న్న ఫిర్యాదు రాకూడదు. సేవ కూడా చెయ్యండి, వారికి ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చి ముందుకు నడిపించండి. సందేశమునిచ్చే మీ కార్యాన్ని బాగా యుక్తియుక్తంగా చెయ్యండి. మూలన ఉన్న ఇచ్చుకులు మిగిలిపోకూడదు. సందేశాన్ని ఇప్పుడు కూడా నలువైపుల భిన్న భిన్న విధాలుగా ఇస్తూ ఉండండి. సేవ, స్మృతి రెండిటి బ్యాలెన్సును పెట్టి ఇతరులను కూడా ముందుకు నడిపించండి. వెనుక వచ్చిన వారు కూడా తక్కువేమీ కాదు, లభించిన ఛాన్సును తీసుకుంటున్నందుకు బాప్ దాదాకు సంతోషంగా ఉంది. కానీ మీ అవస్థపై శ్రద్ధ పెట్టండి. కొద్దిమందే ఉన్నప్పటికీ కొద్దిమంది శక్తిశాలిగా ఉన్నారు. అన్నిటినీ చూసేసారు కదా, కనుక తెలుసుకోవడంలో తెలివైనవారే. బాప్ దాదా ఇటువంటి పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. 

డబుల్ విదేశీయులు, 65 దేశాల నుండి 1100మంది సోదరసోదరీలు వచ్చారు: - మంచిది. వస్తూ ఉంటారు మరియు సేవను పెంచుతూ ఉంటారు, ఇందుకు అభినందనలు, అభినందనలు. ఏదో ఒక విధితో పూర్తి ప్రపంచంలో దీనిని వ్యాపింపజేస్తూ ఉండండి. ఇప్పటికీ మీ పరివారంవారు నలువైపులలో దాగి ఉన్నారు, కనుక సేవా పాత్రను నలువైపుల జరుపుతూ ఉండండి. మీరు కూడా మాకు తెలపలేదు అన్న ఫిర్యాదు రాకూడదు. వ్యాపింపజేస్తూ ఉండండి, మీ పరివారపు ఆత్మలను మీవారిగా చేస్తూ ఉండండి. పిల్లలు నిశ్చింతగా ఉండటాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు, నిశ్చింతగా ఉంటారు. 

మొదటిసారి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు:- చూడండి, చాలామంది మొదటిసారి వచ్చినవారు ఉన్నారు. ఇప్పుడు సేవను చేస్తున్నట్లుగా సేవలో ముందుకు కూడా వెళ్తూ ఉండండి. ఇప్పుడింకా చాలామంది మిగిలి ఉన్నారు, వారు కోరుకుంటున్నారు కానీ చేరుకోలేకపోతున్నారు. మీ సేవను పెంచుతూ ఉండండి. సందేశాన్ని ఇస్తూ ఉండండి. ప్రోగ్రాములు చేస్తూ ఉండండి. మీరు ఎంతగా సేవను పెంచుతూ ఉంటారో అంతగా మీపై వచ్చే ఫిర్యాదులు సమాప్తమైపోతాయి అందుకని సేవను ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఇప్పటికీ సందేశం లభించని ఆత్మలు చాలా ఉన్నాయి. అటువంటి ఆత్మలను సేవతో మేల్కొల్పండి. ఎలా అయితే మీరు ఉల్లాస ఉత్సాహాలతో ప్రోగ్రామును తయారు చేసి సందేశాన్ని ఇస్తున్నారో, దానిని మరింత ధైర్యంతో మున్ముందుకు తీసుకువెళ్ళండి. మీరు మాకు అవకాశం ఇవ్వలేదన్న ఫిర్యాదు రాకూడదు. సేవా అవకాశాన్ని పెంచుతూ ఉండండి. ఇంత పెద్ద ప్రపంచం ఉంది, ఎవ్వరి నుండి ఫిర్యాదు రాకూడదు. నలువైపుల సేవలను పెంచుతూ ముందుకు సాగండి. అచ్చా.

నలువైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా తీవ్ర పురుషార్ధి భవ అని చెప్తూ ప్రియస్మృతులను ఇస్తున్నారు. సదా అమృతవేళ లేచి తీవ్ర పురుషార్ధి భవ యొక్క ప్రియస్మృతిని గుర్తు తెచ్చుకుని ముందుకు సాగుతూ ఉండండి ఎందుకంటే బాబాకు పిల్లలందరిపై ప్రేమ ఉంది. స్టేజి మీదకు కొద్దిమందే వచ్చినా కానీ బాప్ దాదా పిల్లలందరికీ దూరం నుండే హృదయపూర్వక ప్రియస్మృతులను తెలుపుతున్నారు. 

దాదీ జానకిగారు బాప్ దాదాను కలుసుకుంటున్నారు, లండన్ సమాచారాన్ని వినిపిస్తున్నారు:- మంచిది. న్యూయార్క్ మోహిని అక్కయ్య మీకు చాలా స్మృతులను పంపారు:- చాలా మంచిది. మొదటినుండి ఉల్లాస ఉత్సాహాలలో ఉండేవారు. సేవా అవకాశాన్ని తీసుకునేవారు మరియు సేవను చేసి ఎంతోమందిని ముందుకు తీసుకువెళ్ళేవారు. బాప్ దాదా ఈ బిడ్డకు విశేషమైన ప్రియస్మృతిని ఇస్తున్నారు. ఆరోగ్యం కారణంగా రాలేకపోతున్నారు కానీ బాబా స్మృతిలో బిడ్డ కూడా ఉంటుంది మరియు బాబా కూడా స్మృతిని పంపుతూ ఉంటారు. ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూ ఉంటారు. 

మోహిని అక్కయ్యతో: - (ఆరోగ్యం కొంచెం బాగోలేదు) లేదు, ఆరోగ్యాన్ని బాబాకు ఇచ్చేయండి. బాబా తరఫు నుండి ఇప్పుడు స్టేజిపైకి రండి. చెయ్యగలరు, వీరిలో శక్తి ఉంది. అందరితో చేతులు కలుపుతున్నారు. (పుణెలో జగదంబ భవనం కోసం భూమిని తీసుకోవడం జరిగింది) పుణె వారిలో ముందు ఉత్సాహాన్ని మేల్కొల్పండి. వారు చాలా హాయిగా నిద్రిస్తున్నారు. తెలుసు కూడా, సేవపై ఆసక్తి కూడా ఉంది కానీ కొంచెం మేల్కొల్పండి. పుణెలో వీలవుతుంది. 

(బృజ్ మోహన్ అన్నయ్య స్మృతిని పంపారు, శివ జయంతిసేవల కారణంగా చేరుకోలేకపోయారు) వారికి కూడా స్మృతిని పంపండి. 

ముగ్గురు అన్నయ్యలతో: - కార్య వ్యవహారాలు బాగా జరుగుతున్నాయా! (ఇప్పటి వరకు బాగా జరుగుతూ ఉన్నాయి, దాదీ లండన్ వెళ్ళి వచ్చారు) ధైర్యముంది కదా, చెయ్యాల్సిందే అని సంకల్పం ఉంటే జరిగిపోతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు కదా. పరస్పరంలో సలహాలు తీసుకుంటూ ఏది చెయ్యాలన్నా మీటింగ్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉండండి. బాబా సంతోషిస్తున్నారు. (కొత్త డైమండ్ లోటస్ హౌస్ తయారయింది, దాని ఉద్ఘాటన ఉంది) మంచిది. (బాప్ దాదాకు ఆహ్వానము) బాప్ దాదా అయితే వెళ్ళి వచ్చారు. 


భూపాల్ అన్నయ్యతో:- సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. (ఆరోగ్యం సరిగా ఉండటం లేదు) బాగా పరిచయం ఉన్న వారికి చూపించారా! తెలిసిన వారితో సంప్రదించి ముందుకు వెళ్ళండి. 


బాప్ దాదా తమ హస్తాలతో శివధ్వజాన్ని ఎగురవేసారు: - ఈ రోజు శివరాత్రి జెండా ఎగుర వేస్తున్నాము. అందరూ శివరాత్రి సందర్భంగా మనస్ఫూర్తిగా సంకల్పం చెయ్యండి - మున్ముందుకు వెళ్తూ విశ్వంలో విజయ జెండాను ఎగురవేస్తాము. పూర్తి విశ్వంలో బాబా వచ్చేసారు, నా బాబా వచ్చేసారు అన్న జయజయనాదాలు వినిపించాలి.

Comments