15-12-2012 అవ్యక్త మురళి

 15-12-2012         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“నాది అన్నదానిని నీదిలోకి వరివర్తన చేసి ద్వికిరీటధారులుగా, నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి”


ఈరోజు సభ అంతా నిశ్చింత చక్రవర్తులదిగా కనిపిస్తుంది ఎందుకంటే చింత బాబాకు ఇచ్చేసి నషాను తీసేసుకున్నారు. మీరందరు కూడా ఉదయం నుండి రాత్రి వరకు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటున్నారు ఎందుకంటే స్వరాజ్యము లభించింది. మరి పరిశీలించుకుంటున్నారా ఎందుకంటే నిశ్చింత చక్రవర్తుల గుర్తు - వారి మస్తకము ప్రకాశముతో మెరుస్తూ ఉంటుంది మరియు నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నట్లయితే ద్వికిరీటధారులుగా ఉన్నట్లు అర్థము. ద్వికిరీటధారులే నిశ్చింత చక్రవర్తులు. మరి మీరందరూ స్వయాన్ని నిశ్చింతులుగా మరియు చక్రవర్తులుగా అనుభవం చేసుకుంటున్నారా? ఒకవేళ ద్వికిరీటధారులుగా లేకపోతే అంటే నిశ్చింతగా లేకపోతే శిరస్సు పైకి ఏమి వస్తుంది? చెత్త బుట్ట. మరి ఏది మంచిగా లభిస్తుంది? బాప్ దాదా ఈ రోజు పిల్లలందరినీ ద్వికిరీటధారులుగా, నిశ్చింత చక్రవర్తులుగా చూసి ఆనందిస్తున్నారు. మీరందరూ, భగవంతుని సహచరులు, స్వయాన్ని అలాగే అనుభవం చేసుకుంటున్నారా లేక ఒకసారి చేసుకుంటూ మరోసారి చేసుకోవడం లేదా? ఈ ద్వికిరీటము పూర్తి కల్పములో కేవలం పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. రాజులుగా అయితే చాలామందే అవుతారు, ద్వాపరం నుండి రాజులుగా అయితే అవుతారు కానీ ద్వికిరీటము మాత్రం కేవలం మీకే లభిస్తుంది.

బాప్ దాదా ఇటువంటి నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను కలవడానికి వచ్చారు. చింత ఇచ్చేసారు కదా లేక ఇంకా కొంచెం ఉందా? చింతను ఇచ్చేయండి, బాబాకు చింత ఇవ్వడం వచ్చు కదా! నిశ్చింతగా అయ్యే విధి చాలా సహజమైనది, నాది అన్నదానిని నీదిలోకి పరివర్తన చెయ్యండి. ఎంత సహజము - నాది మరియు నీది. నా-నీ, ఇది తేడా. మరి అందరూ ఇచ్చేసారా, నాది అన్నదానిని నీటిలోకి పరివర్తన చేసేసారా? ఎవరైతే స్వయాన్ని నిశ్చింత చక్రవర్తులుగా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి. ఎత్తండి, చేతులెత్తండి, బాప్ దాదా చూస్తారు. ఇంకెప్పుడూ మళ్ళీ నీది అన్నదాన్ని నాదిలోకి మార్చరు కదా? ఒకవేళ ఇప్పటికీ ఇంకా ఏదైనా మీ వద్ద మిగిలి ఉంటే ఆ చింతలన్నీ ఇచ్చేసి నషాను తీసేసుకోండి ఎందుకంటే రోజు రోజుకూ విశ్వంలో భయము పెరగనుంది కానీ బాబా పిల్లలైన మీరందరూ నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి ఇతరులను కూడా చింతల నుండి దూరం చేస్తారు. ఇందుకు సహజ సాధనము - అమృతవేళ నుండి రాత్రి వరకు ఫాలో బ్రహ్మ బాబా ఎందుకంటే బ్రహ్మ బాబా కూడా సాకార తనువులో ప్రతి బాధ్యతను నిర్వర్తిస్తూ కూడా నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. కొంతమంది పిల్లలు బ్రహ్మ బాబాను సాకరంలో చూడకపోయినా కానీ వారి చరిత్ర, వారి ప్రాక్టికల్ జీవితము మీరు సాకారంలో ఉన్నట్లుగానే ఉండేది కానీ ఇంత పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. అంతిమము వరకు కూడా వారి ముఖములో నిశ్చింతత చిహ్నాలే కనిపించాయి. ఎటువంటి ఆధారము లేకుండానే చివరి క్లాస్ చేయించారు. ఇటువంటి హెల్దీ (ఆరోగ్యవంతులు) మరియు నషాలో వెల్దీ (సంపన్నులు). మరి మీరందరూ కూడా నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు కదా! శారీరక లెక్కాచారాలు ఉన్నప్పటికీ స్థితి సదా నిశ్చింత చక్రవర్తి.

బాప్ దాదా ఈరోజు పిల్లలందరినీ ఇలా బ్రహ్మ సమానంగా చూడాలని ఆశిస్తున్నారు. కావున పరిశీలించుకోండి, శరీరం ఎలా ఉన్నాకానీ మనసు సదా నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి. నోట్ చేసుకోండి, ఉదయం లేవగానే పరిశీలించుకోండి, సబ్ కాన్షస్ లో కూడా ఎటువంటి చింత ఉండకూడదు. మధ్య మధ్యలో పరిశీలించుకుంటూ ఉండండి. మరి నాది అన్నదానిని నీదిలోకి పరివర్తన చేస్తారు కదా! ఎందుకంటే పూర్తి కల్పంలో పిల్లలైన మీరు తప్ప ద్వికిరీటధారులుగా, నిశ్చింత చక్రవర్తులుగా మరెవ్వరూ అవ్వలేదు. మీ చిత్రాలలో సదా ద్వికిరీటాలు ఉంటాయి. ద్వాపరంలో అనేకమంది రాజులుగా అయ్యారు కానీ ద్వికిరీటధారులుగా మరియు స్వరాజ్యము పొందిన రాజులుగా మరెవ్వరూ అవ్వలేదు. ఈనాటి మీ టైటిల్ 'నిశ్చింత చక్రవర్తి', సదా గుర్తుంచుకోండి. 

ఈరోజు కూడా చాలామంది వచ్చారు, పిల్లలందరినీ విశేషంగా బాప్ దాదా కలవడానికి వచ్చారు. ఇక ఇప్పుడు ఫిర్యాదు అయితే చెయ్యరు కదా! ఎందుకంటే పిల్లలంటే తండ్రికి ఎంత ప్రేమంటే పిల్లలు లేకుండా బాబా ఉండలేరు. మరి మీ టైటిల్‌ను అమృతవేళ నుండి రాత్రి వరకు గుర్తుంచుకోండి నేను ఎవరిని అని? నిశ్చింత చక్రవర్తి. అచ్చా.

వచ్చిన పిల్లలందరితో మిలనము జరుపుకున్నాము, బాబా కూడా సంతోషిస్తున్నారు మరియు పిల్లలు కూడా సంతోషిస్తున్నారు. కానీ మీ ఈ వరదానాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. ఎలా ఉన్నా కానీ, శరీర లెక్కాచారాలు శరీరానికి తెలుసు, కానీ మనసు సదా నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి. ఎటువంటి పేపర్(పరీక్ష) అయినా కానీ పేపర్ మరింత అనుభవిగా చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్ళేది, భయపడద్దు. ఎప్పుడూ పేపర్ ను చూసి భయపడద్దు. అచ్ఛా.

ఈ రోజు గుజరాత్ టర్న్ జరుగుతుంది. గుజరాత్ వారు కూడా బాప్ దాదాకు ఇష్టమైనవారు. అన్ని జోన్లవారూ ఇష్టమే, కానీ టర్న్ గుజరాత్ ది, చేయి ఇలా అనండి. చాలా మంచిది. ఏమేమి పురుషార్థము చేస్తున్నారన్నది బాబా సమాచారమంతా విన్నారు, పిల్లలు కూడా మంచిగా లెక్క చూపించారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సదా బ్రహ్మ బాబా సమానంగా మాస్టర్ బ్రహ్మగా అవ్వాలన్నదే బాప్ దాదా ఆశిస్తున్నారు. ప్రతి జోన్ వారు నిండు మనసుతో వస్తారు. బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు, ఇటువంటి పిల్లలు పూర్తి కల్పంలో ఇప్పుడు సంగమంలోనే లభిస్తారు. సత్యయుగంలో కలిసి ఉన్నాకానీ ఇప్పుడు ఏ గుర్తింపుతో ఉన్నారో అక్కడ అది మారిపోతుంది.

నలువైపుల ఉన్న పిల్లలకు, నిమిత్తంగా గుజరాత్ ఉంది కానీ బాప్ దాదా ఎదురుగా ఫారెన్ వారు కూడా ఉన్నారు, చిన్న చిన్న గ్రామాల నుండి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు ఒక్కొక్కరికీ బాప్ దాదా, ఇద్దరు తండ్రులు సదా ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు తీసుకువెళ్తూ ఉండండి, తమ రాజ్యాన్ని సమీపంగా తీసుకురండి, నలువైపుల ఉన్న పిల్లలు బాప్ దాదా ఎదురుగా ఉన్నారు. సాకారంలో మీరు ఉన్నారు కానీ హృదయంలో నలువైపుల దేశవిదేశాలు, గ్రామాలలో ఉన్నవారు అందరూ బాబా హృదయంలో ఇమిడి ఉన్నారు. అచ్ఛా.

రెండు వింగ్స్ వచ్చాయి, మెడికల్ వింగ్ మరియు సెక్యూరిటీ వింగ్:- మెడికల్ వారు ఇప్పుడు ఎటువంటి తయారీలు చేయించండి మరియు చేయండి అంటే అందరూ, బాప్ దాదా చెప్పినట్లుగా నిశ్చింత చక్రవర్తులుగా కావాలి, చింత లేకపోతే అనారోగ్యం లేదు. కావున ఇటువంటి ప్లాన్‌ను ఆలోచించండి. ఇక్కడ కూర్చుని కూడా అందరూ సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఎటువంటి మందును కనుగొనండి అంటే కొంచెం తనువుతో గానీ మనసుతో గానీ అసంతోషంగా ఉంటే ఆ మందును తల్చుకోగానే సంతోషం కలగాలి. ఆ మందు ఏమిటి? 'నా బాబా'. కావున అందరి మనసులలో 'నా బాబా' అన్నది కూర్చోపెట్టండి అప్పుడు ఇది మందుగా అవుతుంది. అచ్చా. చాలా మంచిది. సేవ చేస్తున్నారు, చేస్తూ ఉండండి, విజయము మీకు తోడుగా ఉండనే ఉంది.

సెక్యూరిటీ వింగ్:- సెక్యూరిటీ వారు పురుషార్థం చేసి, కృషి అయితే చేస్తున్నారు, కానీ పురుషార్ధం చేసి సహజంగా సఫలతను ఇచ్చే మందును అనగా మంత్రాన్ని కనుక్కోండి. రోజు రోజుకూ దుఃఖమైతే పెరగనుంది, అలజడి అయితే జరగనుంది కానీ అలజడిలో కూడా స్వయాన్ని నిశ్చలంగా చేసుకోగలగాలి, అటువంటి సహజమైన విషయాన్ని కనుగొనండి. ఆ విషయము ఎదురుగా రాగానే మనసుకు సంతోషం కలగాలి అప్పుడు తనువు యొక్క అనారోగ్యం కూడా ఫీల్ అవ్వదు. ఇటువంటి సెక్యూరిటీతో కూడిన వైద్యాన్ని షార్ట్ లో కనుగొనండి, బ్రాహ్మణులు వరదానాలు చదివి సంతోషించినట్టుగా ఇది ఆలోచించండి. ఎటువంటి వారైనా అధ్యయనం చెయ్యగానే పరివర్తన అయ్యేలా సాల్వేషన్ ఆలోచించండి. సెక్యూరిటీ కోసం చిన్న చిన్న సాధనాలు తయారు చెయ్యండి ఎందుకంటే సమయము ఇప్పుడు సున్నితంగా మారుతూ ఉంది. అటువంటి సమయంలో ఇటువంటివి ఉపయోగపడాలి.

మీరైతే ఎవరెడీగా ఉన్నారు కదా? ఎటువంటి సమయం వచ్చినా, ఎలాంటి సమయము వచ్చినా కానీ ఎవరెడీగా ఉండండి. బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారీలు ప్రతి ఒక్కరూ ప్రతి సమయంలోనూ సదా సంతోషంగా ఉండాలి. బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారీల సంతోషం మాయం కాకూడదు, ఇలా వీలవుతుందా? వీలవుతుంది అని అంటే చేతులెత్తండి. అచ్చా. బాప్ దాదా అందరి చేతులు చూసారు, మీరు చేతులెత్తండి. సమయమైతే వస్తూ ఉంటుంది, బాప్ దాదా రిజల్టును చూస్తారు, అందరూ చేతులెత్తారు కావున సమయం వచ్చినప్పుడు కూడా ఎవరెడీగా ఉండి నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. నిశ్చింతగా కూడా మరియు చక్రవర్తిగా కూడా ఉండాలి. చిన్న విషయాలు, పెద్ద విషయాలు వచ్చేదే ఉంది, కానీ బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మ కుమారీలకు ఏదీ పెద్ద విషయము కాదు, కల్పకల్పము చూసి ఉన్నారు. కల్పకల్పము పాస్ అయ్యారు. ఇటువంటి అనుభవిగా అయ్యి ఇప్పుడు కూడా ఒక ఆటలా పాస్ అయిపోతారు. ఇంతటి ధైర్యము ఉంది కదా! ధైర్యము ఉంది కదా! రెండు రెండు చేతులెత్తండి. వెనుకవారు ఎత్తుతున్నారు.

డబుల్ విదేశీయులు:- డబుల్ విదేశీయులకు తమ టైటిల్ గుర్తుంది కదా? మీరు ఎవరు? డబుల్ పురుషార్థి. మంచి ధైర్యాన్ని ఉంచడాన్ని బాప్ దాదా చూసారు. మెజారిటీ మంది సమయానికి పాస్ కూడా అవుతున్నారు. బాప్ దాదా వద్దకు సమాచారము కూడా వస్తుంది మరియు మీకు నిమిత్తమైన దాదీ కూడా వినిపిస్తూ ఉంటారు. అందరిలో శక్తిని నింపుతూ ఉంటారు. అచ్చా. మీరు సదా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - మేము విజయులుగా అవ్వవలసిందే. ఎటువంటి పరిస్థితులైనా కానీ మా పేరు విజయులు. విజయము మా జీవితానికి ఆధారము. విజయము జరిగి ఉంది. అచ్చా. బాప్ దాదా వద్దకు సమాచారము వస్తూ ఉంటుంది, విదేశీయుల రిజల్టు కూడా మంచిగా ఉంది, బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్చా..

ఈరోజు నలువైపుల ఉన్న పిల్లలతో మిలనము జరుపుకుంటున్నాము. అందరి మనసులలో బాబా, బాబా మరియు బాబా, ఈ అనుభవము బాబాకు కూడా కలుగుతుంది. కానీ శరీరము లెక్క శరీరానికి తెలుసు. ఇకపోతే మీ అందరూ మరియు బాప్ దాదా ఏమి చూసారంటే బాప్ దాదా స్మృతి మరింతగా వస్తూ ఉంది, ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు... ఇందులో మరుపు తక్కువగా ఉంది. కానీ సంగమ సమయము కలుసుకునే సమయము కాబట్టి కలుసుకుంటూ ఉంటాము.

నలువైపుల ఉన్న పిల్లల ప్రియ స్మృతులు చేరుకుంటూ ఉంటాయి, ఎంతగా పిల్లలు గుర్తు చేసుకుంటూ ఉంటారో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా బాబా కూడా పిల్లలను గుర్తు చేస్తారు. ఎలా అయితే పిల్లలు సదా వాహ్ బాబా, వాహ్ బాబా అంటూ ఉంటారో అలాగే బాబా కూడా అన్ని వైపుల ఉన్న పిల్లలను వాహ్ పిల్లలు! వాహ్ పిల్లలు! అని అంటూ ఉంటారు మరియు సంకల్పంలో ప్రియస్మృతులను ఇస్తూ ఉంటారు. అచ్ఛా. ఇక మీదట డ్రామాలో ఏది ఉంటే అదే జరుగుతుంది.

మోహిని అక్కయ్య చాలా చాలా స్మృతులను పంపారు:- మంచి స్మృతి మరియు లెక్కాచారాల సమాప్తము రెండూ చేసుకుంటున్నారు. బాప్ దాదా కూడా శక్తి ఇస్తూ ఉంటారు. బాబా వద్దకు స్మృతి చేరుకుంటుంది.

దాదీ జానకితో:- (కౌగిలించుకున్నారు) ఒక్కరిని తీసుకుంటే అందరినీ దగ్గరకు తీసుకున్నట్లే. బాప్ దాదా అయితే కలుస్తూ ఉంటారు. సంగమయుగము ఉన్నదే తండ్రి మరియు పిల్లలు కలుసుకోవడానికి, యుగమే ఇదైనప్పుడు కలుసుకుంటూ ఉంటాము.

(నిర్వైర్ అన్నయ్య కొంతమంది సోదరుల స్మృతులను అందించారు) ఎవరైతే స్మృతిని పంపారో వారికి పదమారెట్ల ప్రియస్మృతులు. రుక్మిణి దాదీ కూడా స్మృతిని పంపారు, వారికి కూడా పదమారెట్ల ప్రియస్మృతులను తెలపండి. (3-4 రోజులలో కొంతమంది సోదరసోదరీలకు ఆక్సిడెంట్లు జరిగాయి) అందరికీ, ఎవరెవరికైతే కొంచెం అలజడి జరిగిందో వారికి స్మృతి అందించండి కానీ ఇక ముందు కోసం డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారికి విడిగా అర్థం చేయించండి. కొంచెం తొందరపడ్డారు, తొందరపడకూడదు. ముందుగా చేరుకోవాలి అని అనుకుంటారు, ముందే చేరుకుంటారు కానీ రిజల్టు ఏమిటి? కావున ముఖ్యంగా ఇప్పుడు డ్రైవర్లకు ప్రత్యేకంగా సూచనను ఇవ్వండి. మంచిది.

గీతా భగవంతుడి గురించి:- అహింస గురించి చేసింది బాగుంది, ఇందులో కొంతమంది కలుస్తారు, కొంతమంది హింసను ఒప్పుకోరు కూడా, అటువంటి వారిని దగ్గరకు తీసుకురండి అప్పుడు గీతా భగవంతుడు సహజంగానే నిరూపింపబడతాడు.

Comments