15-12-2011 అవ్యక్త మురళి

          15-12-2011         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

”సదా నషాలో ఉంటూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి, తీవ్ర పురుషార్థం ద్వారా సంపన్నంగా మరియు సమానంగా అయ్యి కలిసి వెళ్ళేందుకు తయారీలు చేసుకోండి” 

ఈరోజు బాప్ దాదా నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తున్నారు. ఈ విధంగా ఈ సభ ఈ సమయంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలందరూ తమ ఫికర్ (చింత)ను బాబాకు ఇచ్చేసి ఫఖుర్ (నషా)ను తీసుకున్నారు కనుక. ఇప్పుడే ఈ సభ ఇలా అనిపిస్తుంది. మీరు కూడా ఉదయం లేచినప్పటినుండి కర్మలు చేస్తూ కూడా నిశ్చింతులుగా మరియు చక్రవర్తులుగా నడుచుకుంటున్నారు కదా! ఈ నిశ్చింత జీవితము ఎంత ప్రియంగా ఉంటుంది! నిశ్చింతకు గుర్తులు ఏమి కనిపిస్తాయి? నిశ్చింతులుగా ఉండే ప్రతి ఒక్కరి మస్తకంపై లైట్, ఆత్మ మెరుస్తూ కనిపిస్తుంది. ఇటువంటి నిశ్చింత జీవితము ఎలా తయారైంది? బాబా పిల్లలందరి జీవితాల నుండి ఫికర్ తీసేసుకుని ఫఖుర్ ఇచ్చేసారు. ఎవరి జీవితాలలో అయితే ఫఖుర్ కాక ఫికర్ కనిపిస్తుందో వారి మస్తకంపై లైట్ మెరుస్తూ కనిపించదు. వారి మస్తకంపై భారపు రేఖలు కనిపిస్తాయి. మరి చెప్పండి, మీకు ఏది ఇష్టము? లైట్ ఇష్టమా, భారము ఇష్టమా? ఒకవేళ ఏదైనా భారము వచ్చినా కానీ భారము అంటే చింత, ఆ చింతను బాబాకు ఇచ్చేసి నిశ్చింతను తీసుకోవచ్చు. మీ అందరికీ నిశ్చింత జీవితము ఇష్టమే కదా! చూసేవారు కూడా నిశ్చింత జీవితాన్ని ఇష్టపడతారు. బాప్ దాదా ఈ రోజు నలువైపుల ఉన్న పిల్లల, సమ్ముఖంలో ఉన్నా లేక మరింకెక్కడైనా కూర్చున్నా కానీ, పిల్లల మస్తకం మధ్యలో మెరుస్తున్న లైట్ నే చూస్తున్నారు. మరి సదా నిశ్చింతగా ఉంటున్నారా లేక ఎప్పుడైనా ఏదైనా చింత కూడా వస్తుందా? ఏదైనా చింత ఉందా? బాబా ప్రకృతిజీతులుగా, వికారీజీతులుగా తయారు చేసినప్పుడు చింత ఎలా రాగలదు? నిశ్చింతులుగా అయ్యారా, అయితే చేతులెత్తండి. సదా అయ్యారా? సదా అయ్యారా లేక అప్పుడప్పుడా? అప్పుడప్పుడు వారు కూడా ఉన్నారా? అప్పుడప్పుడు వారు ఎవరైనా ఉన్నారా, అటువంటి వారెవరూ చేతులెత్తడం లేదు. బాప్ దాదా కూడా చూడాలనుకోవడం లేదు. బాప్ దాదా పిల్లలందరినీ నిశ్చింత చక్రవర్తులుగా చూడాలని ఆశిస్తున్నారు. ఒకవేళ అప్పుడప్పుడు వారు ఉన్నట్లయితే అందుకు సహజమైన విధి - ఏదైనా చింత వచ్చినట్లయితే 'నాది' అనేదాన్ని 'నీది'లోకి పరివర్తన చెయ్యండి. ఈ హద్దు యొక్క 'నాది' అన్నది సమాప్తమయ్యింది కదా! నా బాబా అని అన్నారు కదా. నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా అని అందరూ మనస్ఫూర్తిగా అంటారు కదా! మరి 'నాది' అన్నదాన్ని 'నీది' లోకి ఇమడ్చడం కష్టమా? తేడా ఏమిటి? 'నా' మరియు 'నీ', ఇంత చిన్న తేడా మాత్రమే ఉంది. అన్నీ నీవే అని సంకల్పం చేసినప్పుడు నావంటూ ఏమి మిగిలాయి? నా బాబా.

బాప్ దాదా ఏమి చూసారంటే హద్దు యొక్క 'నాది' అన్నదాన్ని 'నీది' లోకి పరివర్తన చేసారు, అందుకే ఎలా అయ్యారు? నిశ్చింత చక్రవర్తులు. ఈరోజు బాప్ దాదా పిల్లలను నిశ్చింత చక్రవర్తుల స్వరూపంలో చూడాలనుకుంటున్నారు. చూడండి, భక్తి మార్గంలో కూడా మీ చిత్రాలు తయారు చేసినప్పుడు డబుల్ కిరీటాన్ని చూపిస్తారు. ప్రకాశ కిరీటమైతే ఉండనే ఉంటుంది ఎందుకంటే నిశ్చింత ఆత్మకు గుర్తు - మస్తకంపై లైట్ మెరుస్తూ ఉంటుంది మరియు రెండవ కిరీటము, వికారాలపై విజయులుగా అయ్యారు అందుకే కిరీటాన్ని చూపించారు. కావున ఈ అటెన్షన్‌ను ఉంచండి. బాప్ దాదా ఫికర్ తీసుకుని ఫఖుర్ ఇచ్చినప్పుడు ఎలా అయిపోతారు? నిశ్చింత చక్రవర్తులు. చక్రవర్తులుగా అయితే సింహాసనం కూడా కావాలి కదా! అందుకే బాప్ దాదా మిమ్మల్ని మూడు సింహాసనాలకు యజమానులుగా చేసారు. ఆ మూడు సింహాసనాలు ఏమేమిటో తెలుసా? ఒకటి, భృకుటి సింహాసనము. ఇదైతే అందరికీ ఉండనే ఉంది. రెండవ సింహాసనము, బాప్ దాదా హృదయ సింహాసనము మరియు మూడవది, విశ్వ రాజ్య సింహాసనము. మరి మీ అందరికీ ఈ మూడు సింహాసనాలు ప్రాప్తించాయి కదా! అన్నిటికన్నా శ్రేష్ఠమైనది, బాప్ దాదా హృదయ సింహాసనము. సింహాసనం పైనే ఉంటున్నానా? అని పరిశీలించుకోండి. ఎందుకంటే బాప్ దాదా హృదయ సింహాసనంపై ఎవరు కూర్చుంటారు? ఎవరైతే స్వయం కూడా బాప్ దాదాను తమ హృదయ సింహాసనంపై కూర్చోపెట్టుకున్నారో, ఎవరైతే సదా శ్రేష్ఠ స్థితిలో మాస్టర్ సర్వశక్తిమంతులై ఉంటారో వారే బాప్ దాదా హృదయ సింహాసనంపై కూర్చుంటారు. మరి సదా సింహాసనాధికారులుగా ఉంటున్నారా అన్నది పరిశీలించుకోండి. లేక అప్పుడప్పుడూ మట్టిలోకి కూడా వచ్చేస్తుంటారా? ఈ దేహభానము మట్టితో సమానము. ఎంతోకాలం మట్టిలోనే ఉన్నారు, మరి అప్పుడప్పుడూ మట్టిలోకి వెళ్ళిపోవడం లేదు కదా?

బాప్ దాదా పిల్లలందరికీ సమయపు సూచనను ఇస్తున్నారు. ఆకస్మిక పాత్రను పక్కా చేస్తున్నారు. ఇందుకోసం ఈ సంగమ సమయానికి చాలా చాలా మహత్వాన్ని ఉంచవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక్క జన్మలో అనేక జన్మలకోసం ప్రాలబాన్ని తయారు చేసుకోవాలి. అందుకే బాప్ దాదా సూచన అయితే ఇచ్చారు. కావున సంగమ సమయంలో రెండు విషయాలపై అటెన్షన్‌ను ఇవ్వాలి. ఆ రెండు విషయాలైతే గుర్తు ఉండి ఉండవచ్చు – సమయము మరియు సంకల్పము. అందరూ ధైర్యంగా బాప్ దాదాకు వ్యర్థ సంకల్పాలను ఇచ్చేయాలని సంకల్పం చేసారు. మరి ఆ ధైర్యం సదా స్థిరంగా ఉంటుందా అని పరిశీలించుకోండి. ఎందుకంటే పిల్లల ధైర్యము ఒకసారి అయితే బాబా వేయి సార్లు సహయోగాన్ని అందిస్తారు. మరిప్పుడు ఏమి అనుకుంటున్నారు? ధైర్యం చేసి వ్యర్థ సంకల్పాల గురించి బాబా ఎదురుగా ఏ సంకల్పమైతే చేసారో అది స్థిరంగా ఉందా? ఎందుకంటే ఈ వ్యర్థ సంకల్పాలలో చాలా సమయం పోతుంది. ప్రస్తుత సమయ ప్రమాణంగా విశ్వాత్మలకు సందేశమును అందించడము మీ కార్యము. కావున వ్యర్థ సంకల్పాలను సమాప్తం చెయ్యాలి. అప్పుడే దుఃఖ, అశాంత ఆత్మలకు సుఖశాంతుల అనుభవాన్ని చేయించగలరు. దుఃఖంతో ఉన్న ఆత్మలను చూసి బాప్ దాదాకు దయ కలుగుతుంది. మీకు కూడా సోదరసోదరీల దుఃఖానికి దయ కలుగుతుంది కదా!

బాప్ దాదా ఏమి చూసారంటే వర్తమాన సమయంలో అందరికీ ఎంతో అభిరుచి ఉంది, 75 సంవత్సరాల జూబ్లీను చెయ్యడానికి ప్లాను కూడా తయారుచేసారు, ప్రాక్టికల్ గా కూడా చేసారు. బాప్ దాదా కూడా ఇదే కోరుకుంటారు, ప్రోగ్రాములైతే అందరూ చాలా బాగా చేసారు, ఇందుకు అభినందనలు కూడా తెలుపుతున్నారు. కానీ ఇప్పుడు సమయ ప్రమాణంగా త్వరత్వరగా వారిని వారసులుగా తయారు చెయ్యండి, ఎంతో కొంత వారసత్వానికి అధికారులుగా అవ్వాలి. బాగుంది, బాగుంది అని చాలా అంటారు, పిల్లల సేవకు ఈ రిజల్టును బాప్ దాదా చాలా చూసారు, సంతోషిస్తున్నారు కూడా. మనస్ఫూర్తిగా చేస్తున్నారు. సమయ ప్రమాణంగా ఎంతో అభిరుచితో వింటున్నారు కూడా. ఈ తేడా అయితే వచ్చింది. మంచిగా ఉంది అని అంటున్నారు కానీ మంచిగా వారిని తయారుచేసి ఎంతో కొంత వారసత్వానికి అధికారులుగా చెయ్యండి. ఇందుకోసం బాప్ దాదా ముందు కూడా సూచన ఇచ్చి ఉన్నారు - ఇప్పుడు సమయానుసారంగా తీవ్ర పురుషార్థీలుగా అయ్యే ఆవశ్యకత ఉంది. తీవ్ర పురుషార్థీలుగా అయ్యేందుకు ముఖ్య పురుషార్ధము - సెకండులో బిందువును పెట్టడము. ఇప్పుడు ఈ రూపాన్నే సదా అనుభవం చెయ్యండి. ఎప్పుడు ఏమి వచ్చినా కానీ 'నాది' అన్నదాన్ని 'నీది' లోకి మార్చేయండి.

ఈరోజు బాప్ దాదా చూసారు, గురువారము కనుక చాలామంది పిల్లలు బాప్ దాదా వద్దకు చేరుకున్నారు. బాప్ దాదా ఏమంటున్నారంటే వారంలో రెండు రోజులు ముఖ్యమైనవి. ఒకటి, గురువారము. రెండు, ఆదివారము, సండే. గురువారము రోజు గురువు యొక్క వారము. గురువు నుండి ఏమి లభిస్తాయి? వరదానములు. కావున గురువారము విశేషంగా వరదానాల రోజు. ఈ విధంగా గురువారాన్ని జరుపుకోండి. ఏదో ఒక వరదానాన్ని విశేషంగా అమృతవేళ నుండి మీ బుద్దిలో ఇమర్జ్ చేసుకోండి. వరదానాలైతే అనేకమున్నాయి. కానీ విశేషంగా ఒక్క వరదానాన్ని మీకోసం బుద్ధిలో పెట్టుకుని ఈ వరదానీ రోజున వరదానీ స్వరూపునిగా అయ్యానా అని పరిశీలించుకోండి. వరదానాన్ని రిపీట్ చెయ్యడం కాదు, వరదాన స్వరూపులుగా అవ్వాలి. ఈరోజు ఎంత సమయము వరదాన స్వరూపులుగా ఉన్నారన్నది పరిశీలించుకుంటూ ఉండండి. ఆదివారము విశేషంగా ప్రపంచంలో సెలవు రోజుగా పాటిస్తారు. మరి ఆదివారము రోజున మీ జీవితంలో సంకల్పమాత్రంలో కూడా ఉన్న బలహీనతలను, స్వప్నమాత్రంలోనైనా ఏదైనా బలహీనత ఉన్నట్లయితే వాటికి సెలవివ్వండి. ఎలాగైతే లోకులు ఈ రెండు రోజులను మంచిగా గడుపుతారో అలాగే మీరు కూడా ఈ రెండు రోజులలో ఈ లక్ష్యము మరియు లక్షణము, కేవలం లక్ష్యం కాదు, లక్ష్యంతో పాటు లక్షణాలపై కూడా అటెన్షన్ పెట్టండి. బాప్ దాదా పిల్లలందరినీ తమతో తీసుకువెళ్తారని మాట ఇచ్చారు. మరి కలిసి వెళ్ళేందుకు ఏ తయారీలు చేసుకోవాలి? బాబా అయితే సెకండులో అశరీరిగా అయిపోతారు కానీ, కలిసి వెళ్తాము అని మీరు మాట ఇచ్చారు, బాబా కూడా మాటిచ్చారు. మరి అందుకు కావలసిన తయారీలున్నాయా అని పరిశీలించుకోండి. సెకండులో బిందువు పెట్టేసి, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయి వెళ్ళిపోవాలి. ఇటువంటి తయారీ ఉందా? కలిసి అయితే వెళ్ళాలి కదా? వెళ్ళాలా? తల ఊపండి. వెళ్ళాలా, మంచిది. పక్కా? చేతిలో చేయి వేయడము అంటే దాని అర్థము సమానంగా అవ్వడము అని. కావున పరిశీలించుకోండి. సమయమైతే అకస్మాత్తుగా రానుంది, మరి కలిసి వెళ్ళేంత తయారీ ఉందా?

బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా! ఒక్కరిని కూడా వెనుక విడిచి వెళ్ళడం బాబాకు ఇష్టం లేదు. కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము, కలిసి వెళ్తాము మరియు రాజధానిలోకి, రాజ్య వంశంలోకి వస్తాము. సమ్మతమే కదా! సమ్మతమే కదా? తయారీ ఉందా? సమ్మతమేనా అన్న దానిలో అయితే చేతులెత్తుతారు. ఈ చేతులు ఎత్తకండి. తయారీ ఉన్నదా అన్నదాంట్లో చేతులెత్తండి. చేతులు పెద్దగా లేపండి. అచ్ఛా, రేపు వినాశనం జరిగినా కానీ తయారుగా ఉన్నారా? కానీ మీరు చెయ్యాల్సిన సేవను సమాప్తం చేసారా? సేవ ఇంకా మిగిలి ఉంది కదా లేక సేవ సమాప్తమైపోయిందా? అందరికీ సందేశం అందిందా? కేవలం మీ వీధిని చూసుకోండి. బాబా వచ్చేసారు, వారసత్వం తీసుకోవాలంటే తీసుకోండి అన్న సందేశాన్ని ఇచ్చారా? ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఇంటికీ సందేశాన్ని ఇవ్వాలన్న ప్లానును తయారు చేస్తున్నారు. మంచిది, సందేశమైతే ఇవ్వవలసిందే. లేకపోతే ఫిర్యాదు వస్తుంది. ప్రోగ్రాము తయారు చేసారు కదా! లేవండి, బాబాకు ప్లాను వినిపించారు కదా! లేవండి. (మీడియా వారిని లేపారు) మంచిది, ఫిర్యాదును పూర్తి చెయ్యండి. ఎందుకంటే అకస్మాత్తుగానే జరుగనుంది. పరస్పరంలో కలుసుకుని ఈ ప్లానును ప్రాక్టికల్ లోకి తీసుకురండి. త్వరగా సలహాలను తీసుకోండి. సమయం ఎక్కువ పడితే ఉత్సాహం కూడా తగ్గుతుంది. ప్రతి ఇంట్లోనూ ఈ ఫిర్యాదు సమాప్తమవ్వడం బాప్ దాదాకు ఇష్టము. మాకైతే తెలీలేదు, బాబా వచ్చారు మరియు వెళ్ళిపోయారు కూడా, వంచితమైపొయ్యాము అన్న ఫిర్యాదు ఉండిపోకూడదు. అందరికీ ఉత్సాహము ఉంది కదా! అందరికీ ఉత్సాహం ఉంది కదా? సేవ చేసి ఫిర్యాదును సమాప్తం చేసుకోండి. ఉత్సాహం ఉంటే బాప్ దాదా సహయోగము కూడా ఉంటుంది. అచ్ఛా!

బాప్ దాదా మనసులో ఉన్న ఆశ అయితే అందరికీ తెలుసు. సమానము మరియు సంపూర్ణము. ఈ రెండు మాటలను సదా పరిశీలించుకుంటూ ఉండండి. మరి బాబా ఆశను పూర్తి చేసారా? ఎందుకంటే బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ తమ ఆశా దీపాలుగా చూస్తారు. పిల్లలందరికీ బాబాపై ప్రేమ ఉంది, ఇది బాప్ దాదాకు తెలుసు. మీ అందరినీ మధుబన్ కు తీసుకువచ్చేదేమిటి? ప్రేమ రైలులో వస్తారు. ప్రేమ విమానంలో వస్తారు. ప్రేమ సబ్జెక్టులో బాబా కూడా పిల్లల పట్ల సంతోషంగా ఉన్నారు. కానీ బాబా కోరుకుంటున్న రెండు పదాలు - సమానము మరియు సంపూర్ణము, దీనిని కూడా సంపన్నం చెయ్యాల్సిందే.

ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలకు, పిల్లల హృదయపూర్వక ప్రేమకు మనస్ఫూర్తిగా, స్నేహపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నారు. అచ్చా.

సేవ టర్న్ ఇండోర్ మరియు భోపాల్ జోన్ వారిది:- అభినందనలు. ఇటువంటి అవకాశం మంచిగా అనిపిస్తుంది కదా! సేవ ఖజానా లభిస్తుంది. రెండు జోన్లవారు ఉల్లాస-ఉత్సాహాలతో పురుషార్థంలో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇకముందు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ పురుషార్థాన్ని తీవ్రం చేసి ముందుకు వెళ్తారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు, ఈ అవకాశం కూడా, ఒకటి, సేవ ఫలితం లభిస్తుంది మరియు బలం కూడా లభిస్తుంది. అందరి దృష్టి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఏ జోన్ వారి టర్న్ అని అందరి దృష్టి ఉంటుంది. సేవ, మధుబన్ సేవ అంటేనే సేవ ఫలము మరియు బలము లభించడము. కావున చాలా మంచిగా చేసారు. నిర్విఘ్న సేవ చేసారు, అందరికీ సంతుష్టత అనే ఫలాన్ని తినిపించారు. బాప్ దాదాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే విశేషంగా అవకాశం లభిస్తుంది కదా. పిల్లలు మధుబన్ కు చేరుకుంటారు. మధుబన్ కు రావడము, ఇంత పెద్ద పరివారాన్ని కలవడము మరియు ఇంత పెద్ద పరివారము యొక్క సేవకు నిమిత్తంగా అవ్వడము, ఇది కూడా చాలా పెద్ద భాగ్యపు విషయము. మరి నిర్విఘ్నంగా సంతుష్టత ఫలాన్ని తిన్నారు అందుకే బాప్ దాదా విశేషంగా రెండు జోన్ల వారికి అభినందనలు తెలుపుతున్నారు. బాగుంది, ప్రతి ఒక్కరిపై బాబా దృష్టి కూడా ఉంటుంది, పరివారము యొక్క దృష్టి కూడా ఉంటుంది. ఆత్మలకు ప్రత్యక్షంగా సంతోషం కూడా లభిస్తుంది. సంతోష పరుస్తున్నారు మరియు సంతోషం లభిస్తుంది, రెండూ. కావున రెండింటికీ అభినందనలు.

గ్రామ వికాసము, సెక్యూరిటీ మరియు బిజినెస్ వింగ్ వారి మీటింగ్:- అచ్చా అందరూ తమ తమ గుర్తులను తీసుకువచ్చారు. అందరికీ సంతోషంగా ఉంటుంది. బాప్ దాదాకు కూడా ఒక్కొక్క వర్గాన్ని చూసి సంతోషంగా ఉంటుంది. బాప్ దాదా ఏమి చూసారంటే ప్రతి వర్గం వారు ఏదో ఒక ఇన్వెన్షన్ (నూతన ఆవిష్కారము) చేసి తమ వర్గ సేవను వృద్ధిలోకి తీసుకువస్తున్నారు. బాప్ దాదా ముగ్గురి వేర్వేరు రిజల్టును చూసి సంతోషిస్తున్నారు. ఎలా అయితే వారు యోగబలంతో పంటను పండించే సేవను చేస్తున్నారో, ప్రభుత్వం వరకు కూడా ఈ సందేశం చేరుకుంటుంది. దీనివలన ఆత్మలకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం కూడా సంతోషిస్తుంది. ప్రతి వర్గంవారు సేవలో నంబర్ వన్ గా ఉండటాన్ని చూడటం జరిగింది. ఈ యోగిక పంటవారి రిపోర్టు కూడా చూసాము. ఎవరెవరు సమీప సంబంధంలోకి వచ్చారన్న లిస్టు తయారు చెయ్యండని బాబా చెప్పారు. అలా లిస్టు తయారు చెయ్యడంలో వీరే మొదటి వర్గం. భిన్న భిన్న ప్రకారాలవారు కనెక్షనెలోకి రావడాన్ని బాప్ దాదా చూసారు. బ్రహ్మాకుమారీలు ఇప్పుడు ప్రభుత్వానికి సహాయపడుతున్నారని భావిస్తున్నారు. ఎందుకంటే ఎంత ప్రేమగా కష్టపడుతున్నారన్నది చూస్తారు కదా. మూడు వర్గాలవారు మంచిగా అభినందన యోగ్యంగా సేవను చేస్తున్నారు. అందుకే అభినందనలు, అభినందనలు,అభినందనలు. అచ్ఛా, ఈ చిన్న చిన్న బొమ్మలను తయారుచేసారు. ఇవి ఏమి చెప్తున్నాయి! వీటిని అందరికీ చూపించండి. (గ్రామ వికాసమువారు తోలుబొమ్మలాటను చూపించారు) అందరూ చాలా సంతోషించడాన్ని బాప్ దాదా చూసారు. తమ సంతోషాన్ని పిల్లల రూపంలో చూపిస్తున్నారు. అచ్చా. గ్రామ వికాసము వారి వివరాలు మంచిగా వచ్చాయి. వారు లిఖితంగా వ్రాసుకు వచ్చారు. మిగతా రెండు వర్గాలు కూడా తక్కువేమీ కాదు. ఇలాగే ఎదుగుతూ ఉండండి, అందరినీ ముందుకు తీసుకు వెళ్ళండి మరియు మేము సేవాధారులుగా అయ్యి విశ్వానికి, అందులోనూ భారతదేశాన్ని స్వర్గమయంగా, సుఖంగా చేస్తాము అని అందరికీ వినిపించండి. బ్రహ్మాకుమారీలు చేసిన ప్రతిజ్ఞను వారు పూర్తి చేస్తున్నారు, చేసే తీరుతారు అని కూడా వారికి అర్థమవుతుంది. కావున ముగ్గురికీ బాప్ దాదా వేర్వేరుగా అభినందనలు తెలుపుతున్నారు.

(బిజినెస్ వింగ్ వారి సిల్వర్ జూబ్లీ) ఇప్పుడు బిజినెస్ వారు లేవండి. ధైర్యం ఉంచి ఏదైతే కృషి చేసారో అందులో సఫలత కూడా లభించింది మరియు ఇక ముందు కూడా సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. బాప్ దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్క వర్గంలో చూసాము. ఒక్క టర్న్ లో మూడు లేక నాలుగు వర్గాల వారు వచ్చినా కానీ వర్గాలు తయారైనప్పటి నుండి సేవలో వృద్ధి ప్రారంభమయింది, ఇక ముందు కూడా జరుగుతుంది. ఇది బాప్ దాదా చూస్తున్నారు మరియు అడ్వాన్స్ గా అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా.

1500మంది టీచర్లు వచ్చారు. - టీచర్లనైతే బాప్ దాదా సదా గుర్తు చేసుకుంటూనే ఉంటారు, ప్రేమ చేస్తారు ఎందుకంటే ప్రతి సోదరసోదరిని ముందుకు తీసుకువెళ్ళేందుకు టీచర్లు నిమిత్తంగా అవుతారు. టీచర్లను బాప్ దాదా గురుభాయి అని అంటారు. గురుభాయి అంటే అర్థము సమానము అని. ఎందుకంటే ఎలా అయితే సదా సేవలో బిజీగా ఉండటం బాబా కర్తవ్యమో అలాగే యోగ్యులైన టీచర్లు బాబా సమానంగా సదా సేవాధారి మరియు సదా సఫలత స్వరూపులుగా అయ్యి సఫల స్వరూపులుగా చేసేవారు. బాప్ దాదాకు సదా టీచర్ల పట్ల మనసులో ప్రేమ ఉంటుంది. ఎందుకని? టీచర్ అనగా సదా సేవాధారి, సదా బాబా సమానంగా తయారుచేసేవారు మరియు క్రొత్త క్రొత్త వారికి బాబా పరిచయాన్ని ఇచ్చి అనుభవీలుగా చేసి బాబా వారసత్వానికి అధికారులుగా చేసేవారు. కావున బాప్ దాదా టీచర్లను చూసి సంతోషిస్తున్నారు. ఈ మనఃపూర్వక ప్రేమ, బాబా ప్రేమను విద్యార్థిలో కూడా నింపి వారిని కూడా బాబా వారసత్వానికి పూర్తి అధికారులుగా చేసేవారు. ప్రతి ఒక్క టీచరు బాబా ఆశా దీపాలు. బాబాకు ప్రతి ఒక్క టీచరుపై ఆశ ఉంది. బాబా కోరుకున్న వాటిని ప్రత్యక్షంగా చేసేవారు మరియు చేయించేవారు. అందుకే ఒక్కొక్క టీచరుకు బాప్ దాదా పదమారెట్లు అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు. అచ్చా.

డబుల్ విదేశీ సోదరసోదరీలతో - డబుల్ విదేశీయులు కూడా సేవలో భారతదేశంవారి కన్నా ఏమీ తక్కువ కాదు. ఇది బాప్ దాదా చూసారు. ప్రతి ఒక్కరూ తమ తమ స్థానంలో సేవ వృద్ధిని చేస్తున్నారు కూడా మరియు స్వయాన్ని కూడా మంచి ఉల్లాస ఉత్సాహాలతో నడిపిస్తున్నారు. ఇందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. డబుల్ విదేశీయులలోని సంస్కారం ఏమిటంటే ఏది చేసిన ఉల్లాస ఉత్సాహాలతో పూర్తి చేస్తారు మరియు పురుషార్ధం వైపు కూడా అటెన్షన్ పెడ్తారు. మరి అందరూ తీవ్ర పురుషార్థీలేనా అన్నదానిలో చేతులెత్తండి. తీవ్ర పురుషార్థీలేనా? అచ్చా. అన్ని వైపుల నుండి కూడా అభినందనలు, ఎందుకని? తీవ్ర పురుషార్థ అంటే బాప్ దాదా ఆశలను పూర్తిగా ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేవారు. కావున బాప్ దాదా తీవ్ర పురుషార్థం కోసం అభినందనలు తెలుపుతున్నారు. తీవ్ర పురుషార్థీలుగా ఉన్నారు మరియు సదా తీవ్ర పురుషార్థీగా అయ్యి ఇతరులను కూడా తీవ్ర పురుషార్థీలుగా చేస్తారు. ఇలా పూర్తి విదేశము తీవ్ర పురుషార్థీ లిస్టులో వచ్చేస్తుంది. ఇటువంటి రికార్డు కొంత ఉంది, మరికొంత చూపించండి. బాప్ దాదా పురుషార్థం కోసం అభినందనలు తెలుపుతున్నారు. మురళిపై కూడా అటెన్షన్ పెడ్తారు, మురళిపై ఉన్న స్నేహము బాప్ దాదాకు నచ్చుతుంది. మధుబన్ పై కూడా ప్రేమ ఉంది, మురళిపై కూడా ప్రేమ ఉంది, పరివారంపై కూడా ప్రేమ ఉంది మరియు నా బాబాపై కూడా ప్రేమ ఉంది. ఇప్పుడు సూక్ష్మ పురుషార్థం వైపు కూడా అటెన్షన్ మంచిగా ఉంది. బాప్ దాదా ఏమి చూసారంటే జనక్ బిడ్డ (జానకి దాదీ) యొక్క శ్రద్ధ ఎంతగానో ఉంది. ఇక్కడ ఉన్నప్పటికీ ప్రతి క్లాసు ముందుగా విదేశాలకు చేరుకుంటుంది. కావున పాలన కూడా మంచిగా లభిస్తుంది. ఇది కూడా మీ అదృష్టము. లక్కియెస్ట్ (అదృష్టవంతులు) మరియు స్వీటెస్ట్ (మధురమైనవారు) రెండూ ఉన్నారు. అచ్ఛా!

మొదటి సారిగా వచ్చినవారితో:- వీరు చాలామంది ఉన్నారు. చేయి ఊపండి. అందరూ మధుబన్, తమ ఇంటికి చేరుకున్నారు. ఇందుకు బాప్ దాదా ఒక్కొక్కరికీ అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే లాస్ట్ సమయం కన్నా ముందే చేరుకున్నారు. లాస్ట్ సో ఫాస్ట్ గా వెళ్ళే అవకాశము ఉంది. బాప్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. వచ్చారు, రండి. ఇక ముందు తీవ్ర పురుషార్థం చేసి మున్ముందుకు వెళ్ళే దృఢ సంకల్పమును చెయ్యండి. దృఢత్వము సఫలతకు తాళం చెవి. ఈరోజు వచ్చిన పిల్లలందరికీ విశేషంగా దృఢత్వము అనే తాళం చెవిని బాప్ దాదా బహుమతిగా ఇస్తున్నారు. దృఢత్వాన్ని ఎప్పుడూ తగ్గించుకోకండి. దృఢత్వము మిమ్మల్ని సదా సహజంగా ముందుకు తీసుకువెళ్తుంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు, రండి. మీ వారసత్వాన్ని పొందడానికి వచ్చారు. ఇందుకు చాలా చాలా అభినందనలు. అచ్ఛా.

నలువైపుల ఉన్న సర్వ బ్రాహ్మణులకు బాప్ దాదా హృదయపూర్వక ప్రేమను మరియు ముందుకు వెళ్ళేందుకు శ్రేష్ఠ సంకల్పాన్ని ఇస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరిని బాబా చూస్తున్నారు కూడా మరియు చూస్తూ చూస్తూ హృదయంలో ఇముడ్చుకుంటున్నారు. దగ్గరగా ఉన్నవారైతే బాప్ దాదాను ఎదురుగా చూస్తున్నారు మరియు ఇతరులు సాధనాల ద్వారా ఎదురుగానే చూస్తున్నారు. బాప్ దాదా కూడా మీ అందరినీ ఎక్కడ కూర్చున్నాకానీ సమ్ముఖంలో కూర్చున్నట్లుగా చూస్తున్నారు మరియు ఒక్కొక్కరికీ హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు. ముందుకు వెళ్తూ ఉండండి, తీవ్ర పురుషార్ధం చేసి మున్ముందుకు వెళ్తూ ఉండండి. అచ్చా.

సమ్ముఖంగా కూర్చుని ఉన్నవారికి కూడా బాప్ దాదా ప్రియస్మృతులు మరియు సదా ముందుకు వెళ్తూ ఉండేందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా.

దాదీ జానకితో:- (అందరూ క్రిస్మస్ ను ప్రేమగా జరుపుకుంటున్నారు, అందరూ ప్రియస్మృతులను తెలుపుతున్నారు) అందరికీ బాప్ దాదా తరఫున పదమారెట్లు అభినందనలు. బాగుంది. సేవలో కూడా ముందుకు వెళ్తున్నారని కూడా బాప్ దాదా చెప్పారు. మంచిగా సేవను చేస్తున్నారు, బాప్ దాదాకు సంతోషంగా ఉంది. ఎక్కడ ప్రోగ్రాము జరిగినా అక్కడ సఫలతే సఫలత ఉంది. బాగుంది. ఇక్కడ కూర్చుని మీరు కూడా వారి సేవను చేస్తున్నారు కదా, ఇది కూడా మంచిది.

మోహిని అక్కయ్యతో: - మంచిగా ఉంటారు. ఎక్కువ తిరగవద్దు. అంతా మంచిగానే ఉంటుంది. ఇక ముందు సేవ కూడా చేస్తారు. వంచితమై ఉండరు. (మున్ని అక్కయ్యతో) వీరు కూడా మీకు తోడుగా ఉన్నారు. మీకు మంచి తోడును ఇస్తున్నారు. (ఈషూ దాదీతో) వీరైతే గుప్తంగా ఉన్న యజ్ఞ రక్షకులు. కానీ చాలా మంచిగా రహస్య యుక్తంగా ఉంటూ ఏ కార్యమైతే చేస్తున్నారో అందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. మంచిది.

పర్ దాదీతో:- చాలా మంచిగా ప్రకృతిజీత్ గా అయ్యి ప్రకృతిని నడిపిస్తున్నారు. సంతోషంగా ఉంటారు. కావుననే వీరి సంతోషం కూడా సేవను చేస్తుంది. (రుక్మిణి అక్కయ్యతో) మీరు కూడా సేవలో అలసిపోరు, ఎందుకంటే వీరి సంతోషము అలసటను సమాప్తం చేసేస్తుంది. అచ్ఛా, 

(జానకి దాదీ ఇలా అడిగారు, బాబా, జనవరి నెలలో లండన్ మరియు జర్మనీకి పిలుస్తున్నారు, వెళ్ళమంటారా వద్దా?) బాప్ దాదా ఏమంటారంటే వెళ్ళద్దు అని హద్దు పెట్టుకోకండి. ఎక్కడ అవసరముంటుందో అక్కడకు తప్పకుండా వెళ్ళండి. (బాంబేవారు పిలుస్తున్నారు, వెళ్ళమంటారా?) తప్పకుండా వెళ్ళండి. చూడండి, ఎక్కడ అవసరము ఉంటుందో అక్కడకు వెళ్ళడం వలన ఏమీ కాదు. అన్ని చోట్లకు వెళ్ళకండి. ఎక్కడ అవసరము ఉండో అక్కడకు వెళ్ళండి. (భువనేశ్వర్ వెళ్ళలేదు, వారు చాలా గుర్తు చేస్తున్నారు) అది గడిచిపోయింది. ఇప్పుడు ఎక్కడ అవసరము అని భావిస్తారో అక్కడకు వెళ్ళేందుకు ఏమీ అభ్యంతరం లేదు. మిమ్మల్ని బంధనంలో పెట్టుకోకండి. స్వతంత్రంగా ఉండండి. ఎక్కడకూ వెళ్ళకూడదు అని బంధనం ఏదైతే పెట్టుకున్నారో అది సరైనది కాదు. ఎవర్ రెడీ. అవసరమున్న చోటుకు వెళ్తే ఏమీ కాదు. (ఒకసారి సరే, అంటుంది, ఒకసారి కాదు అంటుందని అందరూ అనుకుంటున్నారు) లేదు, ఇది బాప్ దాదా చెప్తున్నారు. వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అని పూర్తిగా స్వయాన్ని బంధనంలో పెట్టుకోకండి. (సంకల్పం ఉంది, బంధనం కాదు) సంకల్పం పూర్తవుతుంది కదా.

(నిర్వైర్ అన్నయ్య కూడా ఎక్కడకూ వెళ్ళడం లేదు) వీరైతే ఆరోగ్యం కారణంగా వెళ్ళడం లేదు. (దాదీ ఆరోగ్యం అనుసారంగా వీరిప్పుడు వెళ్ళకుండా ఉండాలి) లేదు, వెళ్ళవచ్చు, కానీ వెళ్ళకూడదు అన్న బంధనంలో స్వయాన్ని పెట్టుకున్నారు.

రమేష్ అన్నయ్యతో:- ఆరోగ్యం మంచిగా ఉందా? (ఇప్పుడు స్టూడియో తయారైపోతుంది) చాలా మంచిది, ఇది కూడా చాలా మంచి సేవను చేస్తుంది. తయారు చేస్తే ప్రోగ్రాములు అవుతూ ఉంటాయి. మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉపాయాన్ని ఆలోచించండి.  ఎందుకంటే బాధ్యత చాలా ఉంది. (మేము కూడా ఆరోగ్యం కారణంగానే ఎక్కడకు వెళ్ళడం లేదు) బంధనంలోకి వచ్చి వెళ్ళాలా వద్దా అని ఆలోచించకండి. వెళ్ళాలి, అవసరముంది అంటే శరీరం కూడా సహయోగము ఇస్తుంది. అవసరమున్న చోట సహాయము లభిస్తుంది. వెళ్ళవచ్చు అని మీకు అనిపించినప్పుడు కుదరదు అని అనకండి. శరీరం సహకరిస్తుంటే వెళ్ళాలి. ఒక్కోసారి ఆరోగ్యం చాలా పాడవుతుంది, అది వేరే విషయము. నడిపించగలిగితే సేవ ద్వారా సంతోషం లభిస్తుంది, ఇది కూడా మందు. ఎంతమంది సంతోషిస్తారు. అందరి సంతోషము అనే మందు లభిస్తుంది.

Comments