15-11-2016 అవ్యక్త మురళి

  15-11-2016         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

(ఈ రోజు బాప్ దాదా శాంతివన్లో వచ్చారు కానీ పిల్లలను భవిష్య రాజధాని ఢిల్లీలో షికారు చేయించారు, కనుక ఢిల్లీ స్థానాలను పదే పదే గుర్తు చేసారు) 

ఓంశాంతి. చూడండి, చాలా సమయం తర్వాత ఇంతమంది సోదరీసోదరులు ఇక్కడివరకు కలుసుకోవడానికి వస్తున్నారు. బాబాను కలుసుకోవడానికి, ఎక్కడ ఎటువంటి విషయాలు ఉన్నాకానీ ఇక్కడకు రావలసిందే. ఎన్నో సాధనాలను తమ వెంట పెట్టుకుని చాలా ప్రేమతో మిలనము చేసుకుంటారు. బాప్ దాదా కూడా ఒక్కొక్క రత్నాన్ని చూసి సంతోషిస్తున్నారు, ఎంతో దూరం నుండి కలుసుకోవడానికి వస్తారు. బాబా కూడా కలవడానికి వస్తారు, పిల్లలు కూడా కలుసుకోవడానికి వస్తారు. ఇక్కడ ఎటువంటి సాకులు లేక అభ్యంతరాలు ఉండవు. బాబా కూడా వస్తారు, పిల్లలు కూడా వస్తారు. ఇద్దరి మనసులలో ఎంత స్నేహము, ఎంత ఉత్సాహము ఉన్నాయంటే సదా ఎగురుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ మనసును కూడా ప్రశ్నించుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులలో ఈ ఉల్లాసమైతే ఉంది - సాకారంలో బాబా ఎంతో దూరం నుండి వస్తారు, బాబా కూడా దూరం నుండి వస్తారు, పిల్లలు కూడా దూరం నుండి వస్తారు. ఈ మిలనము కూడా మరో శోభను తీసుకువస్తుంది. ప్రతి ఒక్కరి మనసులలో ఉల్లాసము ఎంతో ఉంది. ఎక్కడికి వెళ్తున్నాము! బాబాను కలవడానికి. బాబాను కలవడమైతే మంచిదే కానీ ఎక్కడినుండి ఎక్కడికి వచ్చి చేరుకున్నారు, ఇదే అందరూ చూస్తూ ఉంటారు. (ఈరోజు బాబా అందరినీ భవిష్య రాజధాని ఢిల్లీలో షికారు చేయించారు) ఈ రోజు బాబాను కలిసారు కానీ ఢిల్లీలో కలిసారు. భగవంతుడు మా కోసం వచ్చారు అని ఢిల్లీ వారు తమ భాగ్యాన్ని ఎంతో గొప్పగా భావిస్తారు. ఆరంభంలో ఇన్ని మేళాలు జరగలేదు. ఇప్పుడు బాబా మరియు పిల్లలు ఎక్కడ కలుసుకుంటున్నారు? తెలుసు కదా? ఎక్కడ కలుసుకుంటున్నారు? బాప్ దాదా కూడా ఎంతో సంతోషంగా కలవడానికి ఎక్కడకు వచ్చారు! ఢిల్లీలోనా లేక మధువనంలోనా? అందరూ ఎంత నిండుగా అయ్యారు. ఈ సమయాన్ని ఎంత సమయం గుర్తు చేసారు, ఎప్పుడు ఆ తారీఖు వస్తుంది, ఎప్పుడు తండ్రి మరియు పిల్లల మిలనము జరుగుతుంది అని ఎంత కాలం నుండి గుర్తు చేసారు! ఎప్పుడు వస్తుందా ఆ రోజు అని అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు వచ్చేసింది. ఈ మిలనము కూడా విశేషమైన రోజు. మేము ఎక్కడకు వచ్చాము అని అందరికీ ఎంతో సంతోషము కలుగుతుంది. ఎక్కడకు వచ్చారు? ఢిల్లీకి వచ్చారా లేక మధువననాకి వచ్చారా! మధువనంలో అయితే వేరే విషయము కానీ ఈ రోజు ఢిల్లీలో వచ్చారు. అందరూ ఎంతో సంతోషిస్తున్నారు, దూరం వరకు చేరుకోలేని వారు, వారి కోసం అయితే స్వర్గంలోకి వెళ్తున్నట్లే, ఎంతో సంతోషకర విషయము ఇది. ప్రతి ఒక్కరి మనసును ప్రశ్నించండి, ఇప్పుడు మీరు చేరుకున్నారు. ఈ రోజు ఎంతో సుందరమైనది మరియు మన బాబా అయితే అతి సుందరమైనవారు. ఢిల్లీలో వచ్చారు! ఢిల్లీలో రాజ్యం అయితే చెయ్యాలి కానీ ముందు ఢిల్లీలో సేవ అయితే చెయ్యాలి. మరియు బాబాతో కలవాలి కూడా. చూడండి, కొంతమందికి బాబాను కలుసుకోవడం చాలా కష్టమైన విషయము. బాబా కూడా ఉండలేరు. అచ్చా, ఈ మజా కూడా తీసుకోండి. పిల్లలు కూడా చాలా తెలివైనవారు. అన్ని వైపుల ఉన్న పిల్లల ప్రేమను బాబా చూసినప్పుడు, పిల్లలు అన్నీ చూడాలి అని బాబా కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఆబూలో ఉన్నారు, ఆబూలో ఏమేమి చూస్తారు? ఉన్న కొన్నిటిని చూసేసారు. ఇప్పుడు ఏమి చూస్తారు. అందుకే ఈ ప్రోగ్రామును తయారు చెయ్యడం జరిగింది. దగ్గరలో ఉన్న జైపూర్ వంటి ముఖ్య స్థానాలను చూడండి. మీకు కూడా ఇష్టమే కదా. ముఖ్య స్థానాలను చూడండి. బాబా అయితే పిల్లలను తిప్పాలి కదా.

ఢిల్లీ అయితే మన రాజ్యంలో నంబర్ వన్. ఢిల్లీలో రాజ్యం చేస్తారు కదా. మీ రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో రాజ్యం చేస్తారు కదా! మీ కోసం రాజ్యం తయారవుతుంది. అందరూ ఎంతో సంతోషంగా చేరుకున్నారు, చూడండి. పిల్లలైతే రాజ్యం అక్కడే చెయ్యాల్సి ఉంటుంది అని బాబాకు కూడా సంతోషంగా ఉంటుంది. మీరు ఢిల్లీలో రాజ్యం చేస్తారు కదా. (రాజ్యం ఢిల్లీలో చేస్తాము తపస్సు శాంతివన్ లో చేస్తాము) అందరికీ చాలా సమయం నుండి మేము మా రాజధానిని చూడాలి, ఎక్కడ రాజ్యం చేసామో చూడాలి అని మనసులో ఉంది. రాజ్యం అయితే మీరే చేస్తారు కదా. కనుక ఇప్పుడే చూసుకోండి, ఏదైనా ఎడిషన్ చేయాలంటే ఇప్పుడే బాబాకు చెప్పండి, బాబా, ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది అని చెప్పండి. పిల్లలు ఎందులో సంతోషంగా ఉంటారో బాబా కూడా అందులో సంతోషంగా ఉంటారు. మంచిది. ఎప్పుడైతే బాబాకు మనస్పూర్తిగా, బాబా, ఈ స్థానాన్ని మేము చూస్తాము అని చెప్తారో అక్కడకు బాబా కూడా తప్పకుండా తీసుకువెళ్తారు. కొంతమంది అలసిపోవచ్చు లేదా ఇంకేదైనా జరగవచ్చు, కానీ వారిని 5 నిమిషాలు ఎవరైనా యోగి పిల్లలు కలిస్తే, వారికి లక్ష్యం ఇస్తే వారిలో శక్తి నిండుతుంది, అప్పుడు మధ్యలోనే వెళ్ళిపోరు. ఎంతమంది బయలుదేరారో అంత మందైతే చేరుకోవాలి కదా.

మీరు కూడా ఎక్కడ రాజ్యం చేస్తారు? ఢిల్లీ ముఖ్యమైనది కదా. ఇక్కడ మేము రాజ్యం చేస్తాము అని అనిపిస్తుంది కదా. మన రాజ్యం తయారవుతుంది. ఇదంతా ఎందుకోసం జరుగుతుంది? ప్రకృతి కూడా మన కోసం తయారవుతుంది. ప్రకృతి కూడా వీరి కోసం సహయోగిగా అవ్వడాన్ని బాప్ దాదా చూసారు. ఈ పిల్లలు మంచి శ్రమ చేస్తున్నారు. సహాయం చెయ్యడంలో, అర్థం చేయించడంలో అందరూ బాగా కష్టపడుతున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారా, ఈ షికారుతో అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవారు చేతులెత్తండి. చేతులైతే ఎత్తుతున్నారు. ఏది ఏమైనా కానీ బాప్ దాదా తోడుగా ఉన్నారు అన్నది అద్భుతమైన విషయము. బాబాకు కూడా పిల్లలతో మజా వస్తుంది. పిల్లలు కూడా సంతోషిస్తున్నారు, అసలైతే ఇంతమంది ఉండలేరు కానీ బాప్ దాదా ప్రోగ్రాము తయారు చేసారు కనుక ప్రతి ఒక్కరూ ప్రతి స్థానాన్ని చూడండి. రాజధానిని చూసిన సంతోషం ఉంటుంది కదా. ఇక్కడ రాజ్యం చేస్తాము. ముఖ్యమైన రాజధానిని చూస్తే అంతా చూసినట్లే. అందరికీ తిరగాలని ఉంటుందని బాబాకు తెలుసు కానీ మధ్యలో అందరికీ విశ్రాంతిని కూడా ఇస్తారు. అలసటతో ఎక్కువ తిరగలేరు. కానీ చూడవలసిందే, తమ ఆసక్తితో, ఇష్టంగా కనుక చూస్తే షికారు చెయ్యడంలో అలసట తక్కువ ఉంటుంది. మీరందరూ ఢిల్లీలో రాజ్యం చేసేవారు, వారైతే భాషణ మొదలైనవి చెయ్యడానికి వస్తారు, అందులో ఎంత క్వాలిటీ ఉందో మీరు చూసారు. అందరికీ బాగా నచ్చింది! ఎక్కడ మీరు రాజ్యం చెయ్యబోతున్నారో దానిని ముందుగానే చూసేసారు. చూసారా? నచ్చిందా? అచ్ఛా. 

సేవ టర్న్ కర్ణాటక మరియు ఇండోర్ జోన్ వారిది:- బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. అందరూ ఎంతో ప్రేమతో తమ రాజధానిని తయారు చేసుకుంటున్నారు. కొందరు తయారు చేసుకున్నారు, కొందరు తయారు చేసుకుంటున్నారు. మీ రాజ్యంలో ఏమేమి ఉంటాయో మీరు బాగా చూసుకోండి. ఏదైనా ప్రత్యేకంగా మిస్ అయి ఉంటే చెప్పండి. ఢిల్లీ నచ్చిందా? ఎందుకంటే తర్వాత రాజ్యం చెయ్యాలి కదా, అది కూడా ఢిల్లీలో చెయ్యాలి. ఎంతో సమయం నుండి కూర్చుని ఉన్నారు కనుక అలసిపోయి ఉంటారు. అందరూ మూడు నిమిషాలు కూర్చోండి మరియు వీడ్కోలు తీసుకోండి. 

గ్లోబల్ హాస్పిటల్ యొక్క సిల్వర్ జూబిలీ సంవత్సరం జరుగుతుంది:- చాలా మంచిది. ఇప్పుడు ఏమి చెయ్యాలి? 

40 దేశాల నుండి 400 మంది డబుల్ విదేశీయులు వచ్చారు: - అందరూ మౌంట్ ఆబూ అయితే చూసారు కదా. కానీ, ఈ రోజు ఈ హాలులో ప్రోగ్రాము జరుగుతుంది అని ఇప్పటివరకు మీరు ఏదైతే వింటూ వచ్చారో, ఇప్పుడు మీరు దానిని చూసారు, మీరు చూసింది ఇక మీ ముందుకు వస్తుంది. చూసినది ముందుకు వస్తుంది. అలా చూస్తే మజా కూడా వస్తుంది. ఇప్పుడు ప్రోగ్రాము తయారవ్వలేదు, అవ్వాలి. కానీ ఈ హాలులోనే అన్ని అఫిషియల్ ప్రోగ్రాములు జరుగుతాయి. 

(మోహిని అక్కయ్య చాలా గుర్తుకు వస్తున్నారు, వారు ఎక్కడ ఉన్నారు అని మున్ని అక్కయ్య బాప్ దాదాను అడిగారు) ఇప్పుడు వారు సేవ చేస్తున్నారు. అచ్ఛా.

Comments