15-11-2013 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“ఏ విషయం వచ్చినా కానీ దానిని బాబాకిచ్చేసి మీరు చిరునవ్వు చిందిస్తూ ఉండండి"
సంతోషమయ పిల్లలందరినీ చూసి బాప్ దాదా చాలా చాలా సంతోషిస్తున్నారు. వాహ్ నా సంతోషమయ పిల్లలూ, అదృష్టవంతులైన పిల్లలూ వాహ్. అందరి హృదయాలలో బాప్ దాదా ఇమిడి ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి నుండి స్నేహపు సుగంధం వస్తుంది. సదా పిల్లలందరూ సంతోషంతో, సమృద్ధితో ఉండే ఆత్మలు. పిల్లల చిరునవ్వుతో కూడిన ముఖాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. సదా ఇలాగే చిరునవ్వుతో, సంతోషంతో నాట్యం చేస్తూ ముందుకు సాగండి, ముందుకు తీసుకువెళ్ళండి. పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంలో బాప్ దాదా మెరుస్తున్న సితారను చూస్తున్నారు. అచ్ఛా.
ఈ రోజు పిల్లలందరి ఆకర్షణ బాప్ దాదాకు చేరుకుంటుంది. సదా సంతోషంగా ఉన్నారు మరియు సదా సంతోషంగా ఉంటారు. ఏ విషయము వచ్చినా కానీ విషయాన్ని బాబాకిచ్చేసి మీరు చిరునవ్వు చిందిస్తూ ఉండండి. అచ్ఛా
ఈరోజు శరీరం కారణంగా పిల్లలందరి ఆహ్వానంపై బాప్ దాదా అందరినీ కలుసుకోవడానికి వచ్చారు. అచ్ఛా, ఈ రోజు శరీరం కారణంగా చిన్నని కలయిక చేసుకోవడం జరిగింది.
నలువైపుల ఉన్న పిల్లలు వింటున్నారు మరియు నయనాలతో మిలనం కూడా జరుపుకుంటున్నారు. బాప్ దాదా పిల్లల మిలనం చూసి ఎంత సంతోషిస్తారన్నది పిల్లలందరికీ తెలుసు. అచ్చా.
ఈరోజు విశేషంగా ఏ గ్రూపు ఏయితే వచ్చిందో, వారు చేతులెత్తండి (కర్ణాటక జోన్ సేవాధారులతో కలిపి 15 వేలమంది సోదరసోదరీలు వచ్చారు) ఇప్పుడు వచ్చినవారందరికీ అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా
బాప్ దాదా నలువైపుల ఛాత్రకులై వింటున్న, చూస్తున్న పిల్లలందరినీ చూస్తున్నారు, వారందరికీ చాలా చాలా ప్రియస్మృతులు ఇస్తున్నారు. మీ అందరికీ అయితే సమ్ముఖంలో ప్రియస్మృతులు లభిస్తున్నాయి. కానీ నలువైపుల ఉన్న పిల్లలు చాలా ప్రేమపూర్వకంగా ఆశతో కూర్చుంటారు. అలా ఆశతో కూర్చున్న పిల్లలకు, ఎలా అయితే పిల్లలు చూస్తున్నారో అలాగే బాప్ దాదా కూడా చూస్తున్నారు. అందరితో బాప్ దాదా నయనాలతో మిలనం చేసుకుంటున్నారు.
నిమిత్తంగా ఉన్న పాండవులు కావచ్చు లేక శక్తులు కావచ్చు, సహయోగి మరియు స్నేహిగా ఉన్న అందరూ తమ తమ కార్యాన్ని చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు.
(మోహినీ అక్కయ్య, మున్ని అక్కయ్య 7 రోజుల కోసం దుబాయ్ వెళ్తున్నారు) తయారు చేసారంటే వెళ్ళాల్సిందే (మీ సహాయం కావాలి కదా) సహాయం చెయ్యడానికి బాబా బంధింపబడి ఉన్నారు. (దాదీ జానకి విదేశీ సోదరీల స్మృతిని అందించారు) ఎవరెవరైతే ప్రియస్మృతులు పంపారో వారందరికీ బాప్ దాదా దృష్టినిస్తూ ప్రియస్మృతులను ఇస్తున్నారు.
Comments
Post a Comment