15-11-2011 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“ఇప్పుడు పరిస్థితులను చూడకుండా తీవ్ర పురుషార్థము చేసి బ్రహ్మా బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. నిర్విఘ్నంగా మరియు ఎవరెడీగా అయ్యి 108 మాలను తయారు చెయ్యండి."
ఈ రోజు సర్వ శక్తిమంతుడైన బాబా, మాస్టర్ సర్వశక్తిమంతులైన తమ పిల్లలకు సర్వ శక్తుల ఖజానాను ఇవ్వడానికి వచ్చారు. సర్వ శక్తుల ఖజానా ఎంతో సహజంగా ప్రాప్తిస్తుంది. ఒక్క క్షణంలో నా బాబాను తెలుసుకున్నారు, బాబా వెంటనే నా పిల్లలు అని అన్నారు, ఇంతలోనే ఖజానాలకు యజమానులుగా అయిపోయారు. మరి పిల్లలందరి వద్ద సర్వ ఖజానాలు సదా తోడుగా ఉన్నాయి కదా! బాబా ఖజానాయే నా ఖజానా కూడా అన్న నషా ఉందా! ఇప్పుడు పరిశీలించుకోండి. బాబా అయితే పిల్లలందరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు. బాప్ దాదా అయితే ఇచ్చారు కానీ ప్రతి ఒక్కరి వద్ద సర్వ ఖజానాలు సదా తోడుగా ఉన్నాయా? సర్వ ఖజానాలను సమయానికి ఉపయోగిస్తూ ఉన్నారా? యజమానిగా అయ్యి ఆర్డర్ చేసినప్పుడు ఆ సమయానికి ఆ ఖజానా అనుభవమవుతుందా? బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల సేవా ఉత్సాహాన్ని చూసారు కూడా, విన్నారు కూడా. నలువైపుల మంచి ఉత్సాహంతో 75 సంవత్సరాల జయంతిని జరుపుకుంటున్నారు. ఇప్పుడిక పరివర్తన జరిగిపోయినట్లే అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. బాప్ దాదా పిల్లల ఉల్లాస ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు మరియు ఏమని పాట పాడుతారు? వాహ్ పిల్లలు వాహ్! అంతేకాక బాప్ దాదా ఇంకా ఏమి చూసారంటే ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో ఛాలెంజ్ చెయ్యడంతో పాటు పిల్లల యొక్క స్వయంలోని సర్వ ధారణల సఫలత స్వరూపాన్ని కూడా చూసారు. మీ అందరికీ కూడా మీ మీ సంపన్న మరియు సఫలత స్వరూపాలు తెలుసు. ఎందుకంటే నిమిత్తమైన పిల్లలందరూ సదా సంపన్నంగా మరియు సఫలతామూర్తులుగా అయిపోయారా లేక ఇంకా తయారవ్వాలా? ఎందుకంటే సుఖమయ ప్రపంచానికి ఆధార స్వరూపము పిల్లలైన మీరే. బాప్ దాదా పిల్లల రిజల్టును చూసారు. ఆధారమూర్తులైన మీరు, కేవలం కొద్దిమంది పిల్లలు కాదు, పిల్లలందరూ సుఖమయ ప్రపంచానికి మేము నిమిత్తులము అని ఛాలెంజ్ చేసారు.
మరి బాప్ దాదా పిల్లలందరినీ ప్రశ్నిస్తున్నారు - సుఖమయ ప్రపంచాన్ని తీసుకువచ్చేందుకు నిమిత్తులైన పిల్లలు సంపూర్ణ సంపన్నంగా, ఆధారమూర్తులుగా అయ్యారా? పిల్లలు ప్రతి ఒక్కరూ సఫలతమూర్తులుగా అవ్వాలని బాప్ దాదాకు ఆశ ఉంది ఎందుకంటే మీరు బాబాను తోడుగా పెట్టుకుని సంకల్పం చేసారు, ఎంతో సంతోషంగా ఛాలెంజ్ కూడా చేసారు - ఇక పరివర్తన జరిగిపోయినట్లే అని. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి, విశ్వ పరివర్తనకు నిమిత్తమైన పిల్లలు స్వ సంపన్నంగా మరియు సంపూర్ణంగా ఎంత అయ్యారు? ఎందుకంటే రాజ్యం స్థాపన కావాలంటే ముందుగా రాజ్యానికి నిమిత్తంగా అయిన ఆత్మలు నిమిత్తమైతే ఆ తర్వాతే ఇతరులు నిమిత్తులవుతారు. కానీ సంపూర్ణం అవ్వడంలో ఇంకా కొద్ది మార్జిన్ ఉండటాన్ని బాప్ దాదా గమనించారు. సేవ అయితే చేస్తున్నారు కానీ సేవ రిజల్టులో మీ తోటివారిగా ఎంతమంది తయారయ్యారు? విన్నవారిలో ఎంతమంది సమీపంగా వస్తున్నారు అని లెక్క వేయండి. బాప్ దాదా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు సేవ రిజల్టులో మరింత తీవ్రత తీసుకురావలసి ఉంది. ప్రతి సమయము ఆత్మలను సమీప సంబంధంలోకి తీసుకురావాలి. చాలా సంతోషిస్తారు. ఇప్పుడు బ్రహ్మాకుమారీల కర్తవ్యాన్ని గుర్తించడంలో చాలా సమీపంగా వచ్చారు కానీ బాప్ దాదా ముందు కూడా ఒక విషయాన్ని చెప్పి ఉన్నారు - ఆత్మలకు వారసత్వము బాబా ద్వారానే లభించనుంది. కావున బాబాను తెలుసుకోవాలి, సమయాన్ని తెలుసుకోవాలి, స్వమానాన్ని తెలుసుకోవాలి అప్పుడు వారసత్వానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు, బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు అని బుద్ధిలో వచ్చినప్పుడు వారసత్వాన్ని తీసుకుని రాజ్యాధికారులుగా అవుతారు.
మా బాబా వచ్చేసారు అన్న పాట ఏదైతే మీరు పాడుతున్నారో అది ఇప్పుడు నలువైపుల వ్యాపించాలి. ఇప్పుడు బాప్ దాదా ఈ రిజల్టును చూడాలనుకుంటున్నారు. పరివర్తన జరిగింది, సేవ వలన లాభం జరిగింది, కృషికి ఫలితం లభించింది కానీ ఇప్పుడింకా బాబా వద్దకు చేరుకోలేదు. దీనికోసం ఏదైనా ప్లాన్ వెయ్యండి. బాబా ప్రత్యక్షత ఎలా చెయ్యాలి? రాజధానిలో రాజ్యం చేసేవారు కూడా నిర్విఘ్నంగా అయ్యారా? ఇప్పుడు పరివర్తన అన్న బటన్ ను డ్రామా ప్రెస్ చెయ్యవచ్చా (నొక్కవచ్చా), ఎవరెడీ? ఎవరెడీగా ఉన్నారా? బటన్ నొక్కచ్చా? ఏమంటారు, బటన్ నొక్కచ్చా? ఎవరెడీగా ఉన్నారా? ఎందుకంటే అందరూ తయారుగా ఉండాలి. రాజ్యాధికారులు కూడా, రాయల్ ఫ్యామిలీ కూడా, రాయల్ ప్రజలు కూడా. సాధారణ ప్రజలైతే పెద్ద విషయమేమీ కాదు. మరి బాప్ దాదా పిల్లలను ఈ రోజు రిజల్టును అడుగుతున్నారు. ఏమని భావిస్తున్నారు? బటన్ నొక్కడానికి బాప్ దాదాకు ఎక్కువ సమయమేమీ పట్టదు. మరి మొదటి లైన్ వారు ఏమంటారు? శక్తులు ఏమంటారు? పాండవులు ఏమంటారు? జవాబు చెప్పండి. పాండవులు, జవాబు చెప్పండి. బటన్ నొక్కమంటారా? ఎవరెడీ? (బాబా మీరు యజమానులు, నొక్కాలి అని మీకు సంకల్పం వస్తే నొక్కండి). బాప్ దాదా పిల్లల్ని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే బాబాకైతే రాజ్యంలోకి వచ్చేది లేదు కదా. బ్రహ్మా బాబా వస్తారు. (ఇక్కడ బాప్ దాదాను కలుస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది) ఇది మంచిదే కానీ బాబా సమానంగా అయ్యి బాబా తోడులో జీవితాన్ని అనుభవం చెయ్యడం కూడా కావాలి కదా. అది ఉందా? తయారుగా ఉన్నారా? కేవలం మీరు కాదు, రాజధాని. మీరు ఎవరిపై రాజ్యం చేస్తారు? రాజధాని అయితే కావాలి కదా! (తోటివారు ఉన్నారు). అందరూ తయారుగా ఉన్నారా? (పూర్తిగా తయారుగా ఉన్నారు) సంపన్నంగా అవ్వడంలో తయారుగా ఉన్నారా? అచ్ఛా, అందరూ ఆలోచిస్తున్నారు. ఏమీ ఫర్వాలేదు.
బాప్ దాదాకు తెలుసు ఇప్పుడు రెడీగా ఉన్నారు, ఎవరెడీగా అవ్వవలసి ఉంది. బాప్ దాదా రెండు విషయాలను చెప్పి ఉన్నారు కదా - సెకండులో ఫుల్ స్టాప్ పెట్టగలిగే పిల్లలు కావాలి మరియు వ్యర్థ సంకల్పాల నామరూపాలు ఉండకూడదు. ఎవరికి సందేశమిచ్చినా వారు సందేశాన్ని విని పరివర్తన అవ్వాలన్న ఉల్లాస ఉత్సాహాంలోకి రావాలి. ఇప్పుడు బాప్ దాదా ఈ రిజల్టును ఆశిస్తున్నారు. అందుకే బాప్ దాదా పిల్లలకు సలహా ఇస్తున్నారు, ఆజ్ఞ కూడా చేస్తున్నారు - సేవ అయితే చేస్తున్నారు కానీ ఎవరి సేవ అయితే చేస్తున్నారో, ఒకే సమయంలో మూడు రూపాలలో మరియు మూడు రీతులతో సేవను చెయ్యండి. మూడు రూపాలు - నాలెడ్జ్ ఫుల్, పవర్ ఫుల్ మరియు లవ్ ఫుల్. ఈ మూడు రూపాలతో సేవను చెయ్యండి మరియు మూడు రీతులతో కూడా సేవను చెయ్యండి. ఆ మూడు రీతులు - మనసా-వాచ-కర్మణ ఒకే సమయంలో జరగాలి. కేవలం వాణి ద్వారా మాత్రమే కాదు, వాణితో పాటు మనసా సేవ కూడా జరగాలి. పవర్ ఫుల్ మనసు కావాలి. ఇప్పుడు ఈ ఆవశ్యకత ఉంది. ఒకే సమయంలో మనసా పవర్‌ఫుల్ గా ఉండాలి, దాని ద్వారా ఆత్మల మనసు కూడా పరివర్తన అవ్వాలి. వాణి ద్వారా పూర్తి జ్ఞానమంతా స్పష్టమవ్వాలి మరియు కర్మణ ద్వారా, కర్మ ద్వారా చేసిన సేవ వలన నేను నిజంగా నా పరివారానికి చేరుకున్నాను అని ఆ ఆత్మకు అనుభవం అవ్వాలి. పరివారము అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు సమీపంగా ఉన్నవారికి తోడుగా అవుతారు. మరి బాప్ దాదా ఇప్పుడు ఒకే సమయంలో మూడు రూపాల సేవలు జరగాలని ఆశిస్తున్నారు. వీలవుతుందా? వీలవుతుందా? చేతులెత్తండి, వీలవుతుందా? ఇప్పుడు బాప్ దాదా రిజల్టులో ఏమి చూసారంటే వాణి ద్వారా నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నారు కానీ పరివారంతో కలిసి ఉండటంలో ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడు సమయం యొక్క ఛాలెంజ్ తో పాటుగా సేవలో ఒకే సమయంలో మూడు సేవల ద్వారా ప్రాప్తిని అనుభవం చేసుకునే ఛాలెంజ్ ను చెయ్యండి.
అందరూ కలవడానికి ఉల్లాస-ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్ దాదా పిల్లల ఉత్సాహాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఇప్పుడు సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వడంపై అటెన్షన్ ఉంచండి. ఎందుకంటే కనీసం 108 మాల అయితే తయారవ్వగలగాలి కదా, వీలవుతుందా? 108 మాల తయారుగా ఉందా? తయారుగా ఉందా? ఎందుకంటే రాజధానిలో రాజ్యాధికారులుగా అయ్యేది వారే కదా. 108 రత్నాల లిస్టును ఇప్పుడు తయారు చెయ్యగలరా? తయారు చెయ్యగలరా? వీలవుతుందా? వీలవుతుంది అని అనడం లేదే? 108 మంది రాజ్యాధికారులు, తర్వాత 16108 మంది రాజ్యా ధికారులకు తోడుగా ఉండేవారు. ఆ తర్వాత నంబర్ వారీగా ఉంటారు. బాప్ దాదా ఇప్పుడు సమయానుసారంగా, సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే పిల్లల నుండి ఇదే ఆశిస్తున్నారు. 108 మాల ఎవరెడీగా ఉండాలి, బాబా సమానంగా ఉండాలి. అంతమంది తయారుగా ఉన్నారు కదా? మొదటి లైన్ వారు 108 మంది లిస్టును తయారు చెయ్యగలరు కదా? వీలవుతుందో లేదో చెప్పండి! సాకారంలో బ్రహ్మా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ ఫైనల్ అవ్వలేదు, కానీ ఇప్పుడైతే 75 సంవత్సరాలు పూర్తయ్యాయి, మరి ఈ 75 సంవత్సరాల జూబ్లీలో ఏదో ఒక నవీనత చేస్తారు కదా! నవీనత ఏమి చెయ్యండంటే ప్రతి ఒక్కరూ స్వయాన్ని 108 మాలలో పూసగా తయారు చేసుకోవాలి, 108 మాల తయారైంది అని లెక్కకు రావాలి. ఎందుకంటే ముందు రాజ్యాధికారులు తయారైతే తర్వాత రాజ్య సంపర్కంలోకి వచ్చేవారు అవుతారు. వారికి కూడా స్థానం కావాలి కదా! బాప్ దాదా చెప్పదల్చుకున్న సారమేమిటంటే ప్రతి ఒక్కరూ స్వ కోసం తీవ్ర పురుషార్ధం చేసి నేను బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న దృఢ సంకల్పాన్ని చెయ్యాలి. ఎందుకంటే పరివర్తన అకస్మాత్తుగా జరుగనుంది అని బాప్ దాదా ముందుగానే వినిపించి ఉన్నారు. అంతకు ముందే కనీసం నిమిత్తమైన వారు, జోన్ హెడ్స్, సెంటర్ ఇన్ ఛార్జులు, వారితో పాటు ఉన్న సమీప పాండవులు, సెంటర్ హెడ్ అవ్వకపోయినా కానీ ఏదో ఒక విశేష కార్యానికి నిమిత్తమై విశేష ఆత్మలుగా చూడబడుతున్నారో, అటువంటి పాండవులు కూడా ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసి స్వ పరివర్తన దృశ్యాన్ని బాహ్య స్టేజి మీదకు తీసుకురావాలి. ఇందుకు ఎవరెడీగా ఉన్నారా? ఈ కార్యమైతే చెయ్యవలసిందే, స్వయాన్ని బాబా సమానంగా, బ్రహ్మా బాబా సమానంగా ఫాలో ఫాదర్ చెయ్యవలసిందే, చెయ్యవలసిందే కదా? అలా భావించేవారు చేతులెత్తండి. చేతులైతే ఎంతగా ఎత్తుతారంటే సంతోషపరిచేస్తారు. మంచిగా చేస్తారు. కానీ చేతితో పాటు దృఢ సంకల్పాన్ని కూడా చెయ్యండి. దృఢత్వము అనే శక్తి ఎంతో సహయోగాన్ని ఇస్తుంది.
బాప్ దాదా సంతోషిస్తున్నారు, చేతులెత్తడంలో అందరూ తెలివైనవారే కానీ ఇప్పుడు దృఢత్వాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకురండి. పిల్లలు తెలివైనవారు కదా, దృఢత్వంతో ఉంటారు కూడా కానీ ఆ దృఢత్వము భిన్న భిన్న రూపాలలోకి మారిపోతూ ఉంటుంది. ఇలా అయింది, ఇలా జరిగింది, ఇలా అయ్యుండకపోతే అలా జరిగేది కాదు. ఇటువంటి సాకులలో చాలా తెలివైనవారు. మరి ఇప్పుడు బాప్ దాదా ఏమి ఆశిస్తున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా అవ్వాలి. మనసా వాచ కర్మణ, సంబంధ సంపర్కంలో మిమ్మల్ని ఎవ్వరు చూసినా కానీ, ఎవరు కలిసినా కానీ వాహ్ పరివర్తన వాహ్! అని అనాలి. నిమిత్తమైన పిల్లలను చూసి బాప్ దాదాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది మరియు మిలనంలో కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది.
మరి ఈరోజు ఏ సంకల్పం చేసారు? అవ్వాల్సిందే. బ్రహ్మా బాబా సమానంగా అవ్వాల్సిందే. అవ్వాలి కాదు, అవ్వాల్సిందే. ఎటువంటి విషయాలు వచ్చినా కానీ, విషయాలను కాక బాబాను ముందు పెట్టుకోండి. దూరంగా కూర్చున్న పిల్లలు, దగ్గరగా కూర్చున్న పిల్లలు అందరినీ చూసి బాప్ దాదా ఎంతో సంతోషిస్తున్నారు. పిల్లలందరూ ప్లాన్లు చాలా బాగా తయారు చేస్తారు, అమృతవేళ చాలా మధురమైన మాటలు మాట్లాడుతారు అందరూ. మెజారిటీ అందరూ ఎంత తియ్యగా మాట్లాడుతారంటే బాబా కూడా ఆ మాటలకు బలిహారమైపోతారు. కానీ తర్వాత ఏమి జరుగుతుందో తెలుసా? కర్మ క్షేత్రంలోకి వచ్చినప్పుడు, సంబంధాలలోకి వచ్చినప్పుడు, సేవలో వచ్చినప్పుడు వచ్చే విషయాలను చూసి కొద్దికొద్దిగా మారిపోతారు. అమృతవేళలో ఉన్న ఉల్లాస ఉత్సాహాలు కర్మ చేస్తున్నప్పుడు, సంబంధంలోకి వస్తున్నప్పుడు కొద్దికొద్దిగా మారిపోతాయి.
ఇప్పుడు బాప్ దాదా ఒక కార్యాన్ని ఇస్తారు, చెయ్యడానికి తయారుగా ఉన్నారా! తల ఊపండి. చేతులెత్తండి. బాప్ దాదా సంకల్పమేమిటంటే, ఒక్క నెల స్వయాన్ని దృఢ సంకల్పం ఆధారంతో బాబా సమాన స్థితిలో స్థితి చేసుకోగలరా? ఒక్క నెల, వీలవుతుందా? లేక ఎక్కువ సమయమా? ఒక్క నెల దృఢత్వంతో, దృఢత్వాన్ని తోడుగా పెట్టుకుని బాబాను సదా ముందు పెట్టుకోవాలి, బ్రహ్మా బాబాను నయనాలలో ఇముడ్చుకోవాలి మరియు బ్రహ్మా బాబా ఏమి చేసారో మనసా వాచ కర్మణ అదే చెయ్యాలి. ప్రాక్టికల్ గా బ్రహ్మాను చూడకపోయినా కానీ నాలెడ్జ్ అయితే ఉంది కదా. ఏ కర్మ అయినా చేసేముందు ఇలా పరిశీలించుకోండి, బ్రహ్మా బాబాకు ఇటువంటి సంకల్పం ఉన్నదా, ఇటువంటి మాటలు ఉన్నాయా, ఇటువంటి కర్మలు ఉన్నాయా, ఇటువంటి సంబంధాలు ఉన్నాయా, ఇటువంటి సంపర్కం ఉన్నదా? ముందు ఆలోచించండి తర్వాత చెయ్యండి. వీలవుతుందా? ఇందులో చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి. మాతలు చేతులను పెద్దగా ఎత్తండి. ఇక్కడ వ్యాయామం చేస్తారు కదా, చేతులు పెద్దగా ఎత్తండి. ముందున్న వారు కూడా ఎత్తుతారు కదా? మధువనం వారందరూ ఇందులో నంబర్ వన్ రావాలి. ముందు మధువనంవారు కూర్చుని ఉన్నారు కదా. మధువనం అంటే కేవలం శాంతివన్ కాదు. ఒక నెల నిర్విఘ్నము, ప్రతి సెంటరు కూడా నిర్విఘ్నము. గుజరాత్ టీచర్లు చేతులెత్తండి. గుజరాత్ టీచర్లు ఇది వీలవుతుందని భావిస్తున్నారా, చేతులు పెద్దగా ఎత్తండి. ఇలా ఇలా అనకండి, చేతులు పెద్దగా ఎత్తండి. వీలవుతుందా? అచ్చా. శాంతివన్ నివాసులు చేతులెత్తండి. కొద్దిమంది ఉన్నారు. ఎవరైతే కూర్చుని ఉన్నారో, వెనుక కూడా ఉన్నారు, మధువనంలోని 4-5 స్థానాలవారందరూ చేస్తారా? చేస్తారా, చేతులెత్తండి? మధువనంవారు రెండు చేతులెత్తండి. గుజరాత్ వారు జిజ్ఞాసువులు, నిమిత్త టీచర్లు మరియు నిమిత్త సోదరులు అందరూ చేతులెత్తండి, చేస్తారా? చేతులు పెద్దగా ఎత్తండి. వెనుక ఉన్నవారి చేతులు కనిపించడం లేదు. అచ్చా, గుజరాత్ వారు లేవండి. గుజరాత్ వారు చాలామంది వచ్చారు. సగం హాలు గుజరాత్ వారే. (గుజరాత్ వారు 15 వేలమంది, ఇతరులు 3 వేల మంది ఉన్నారు). గుజరాత్ వారికి బాప్ దాదా మరియు పరివారము తరఫు నుండి చాలా చాలా అభినందనలు, అభినందనలు. ఇప్పుడు ఎలా అయితే చప్పట్లు కొట్టారో, అలాగే ఒక నెల తర్వాత రిజల్టులో గుజరాత్ నంబర్ వన్ వస్తుందా! మంచిది. సంఖ్య చాలా మంచిగా ఉంది. పిల్లలకు బాబాపై, మధువనంపై మనస్ఫూర్తిగా ప్రేమ ఉన్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. చాలా మంచిది, ఇప్పుడు గుజరాత్ అద్భుతాన్ని చేసి చూపించండి. ఈ ఒక్క నెల రిజల్టులో నంబర్ వన్ వచ్చి చూపించండి. అసలైతే అందరూ నంబర్ వన్ రావాలి. మధువనంవారు నంబర్ వన్ వస్తారు కదా, చేతులెత్తండి. ఏమి జరిగినాకానీ, ఎటువంటి పరిస్థితులు వచ్చినాకానీ, పరిస్థితులు వస్తాయి, మాయ వింటుంది కదా, కనుక మాయ తన రూపాన్ని చూపిస్తుంది కానీ మాయ పని రావడము మరియు మీ పని విజయాన్ని పొందడము. ఇలా జరిగిపోయింది, అలా జరిగింది, ఇలా చెయ్యకూడదు అని అనకండి. వస్తాయి, జరుగుతాయి, ఇదైతే బాప్ దాదా ముందుగానే చెప్పేస్తున్నారు ఎందుకంటే మాయ వింటుంది కదా, అది చాలా తెలివైనది, కానీ మీరు? మాయ ఎంత తెలివైనదైనా కానీ మీరైతే సర్వశక్తిమంతుని సహవాసులు, మాయ ఏమి చెయ్యగలుగుతుంది?
టి.విలో కూడా చూస్తుండటం బాప్ దాదా చూస్తున్నారు. మరి అందరూ నంబర్ వన్ తీసుకోవాలి. ఎవ్వరూ టూ నంబర్ (రెండవ నంబర్) కాదు, వన్ నంబర్. అచ్ఛా..
సేవ టర్న్ గుజరాత్ ది:- గుజరాత్ వారు చాలా సమీపంగా ఉన్నారు కదా, అందరికన్నా సమీపంగా ఎవరున్నారు? గుజరాత్ యే సమీపంగా ఉంది. పురుషార్థ లక్ష్యాన్ని ఇదే పెట్టుకోండి - మేము రాజ్యానికి అధికారులుగా, పరివారానికి సమీపంగా రావలసిందే. పురుషార్థము ఏమిటి? బాబాను ఫాలో చెయ్యడము. దృఢత్వాన్ని మర్చిపోవద్దు. ఎక్కడ దృఢత్వము ఉంటుందో అక్కడ సఫలత ఉంటుంది. గుజరాత్ అంటే బాప్ దాదాకు కూడా ప్రియమే. ఒక విశేషత కారణంగా బాప్ దాదాకు ఇష్టము, ఎప్పుడు ఏ సమయంలో పిలిచినా కానీ, ఆవశ్యకత ఉన్నప్పుడు గుజరాత్ హాజరు అవుతుంది. సమీపంగా ఉన్నందుకు లాభాన్ని పొందుతున్నారు. అలాగే సదా బాబాను ఫాలో చేసేవారిగా సమీపంగా ఉండండి. బాబా చేసింది మీరూ చేస్తూ ఉండండి. ఫాలో ఫాదర్. అచ్చా.
నాలుగు వింగ్స్ వచ్చాయి: - (సమాజ సేవ, మహిళ, అడ్మినిస్ట్రేటర్, యూథ్) ఏ వర్గం వారైతే వచ్చారో వారి రిజల్టు బాప్ దాదా వద్దకు వస్తుంది. బాప్ దాదా ఏమి చూసారంటే వర్గీకరణ రూపంలో సేవ ఆరంభమైనప్పటి నుండి నలువైపుల సేవ వృద్ధిని పొందింది. ఎందుకంటే ప్రతి వర్గంవారు మా వర్గంలో ఏదైనా నవీనతను తీసుకురావాలి, దాని ద్వారా సమాచారం అందరికీ అందాలి అని భావిస్తారు. బాధ్యత ఉన్న కారణంగా, ప్రతి ఒక్కరికీ వేర్వేరు వర్గాలు ఉన్న కారణంగా సేవ ఛాన్స్ మంచిగా లభిస్తుంది. బాప్ దాదా ప్రతి ఒక్కరి పేరైతే తీసుకోవడం లేదు కానీ నాలుగు వర్గాలకు చెప్తున్నారు. సేవ జరుగుతుంది, బాగా చేస్తున్నారు, నా బాధ్యత అని కూడా అనుకుంటున్నారు కానీ బాప్ దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు, ప్రతి వర్గంవారు ఏ విశేష ఆత్మలనైతే తయారు చేసారో, ప్రతి వర్గం నుండి తయారయ్యారు, ఇది బాప్ దాదాకు తెలుసు కానీ వారందరి మీటింగు ఒకసారి ఏర్పాటు చెయ్యండి. ఎలా అయితే ప్రతి జోన్లో కొందరు విశేష ఆత్మలు తయారయ్యారో, వారి నుండి విశేషంగా కొంతమందిని ఎంచుకుని, ప్రతి వర్గం నుండి 10-15-20 మందిని ఎంచుకుని వారి ప్రోగ్రామును ఇక్కడ ఆబూలో ఏర్పాటు చెయ్యండి. అప్పుడు సేవ రిజల్టు ఏమిటో దృష్టికి వస్తుంది, అలాగే వారు కూడా సంగఠనను చూసి ఉల్లాస ఉత్సాహాలలోకి వస్తారు. ఈ వర్గం నుండి వీరు వస్తున్నారు, వీరు వస్తున్నారు, అని ఒకరినొకరు చూసుకుని ఉత్సాహంలోకి వస్తారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామును చెయ్యండి. అందరినుండి 15-20మంది ఉండాలి. వారికోసం వారికి తగ్గ కార్యక్రమం ఉండాలి, వారందరినీ ఒక చోటకు పిలవండి. ఇది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే బాప్ దాదా వారిని ఇప్పుడు అనుభవం ఆధారంగా స్పీకర్ గా చేయాలనుకుంటున్నారు. మీరు భాషణ చేసాక, ఇటువంటి అనుభవి ఆత్మలు తమ అనుభవాలను వినిపిస్తే ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ సేవను చెయ్యండి. ఏ వర్గంవారైతే మంచిమంచి నిమిత్తమైన ఆత్మలు పొందిన లాభాలను తెలియజేసే పుస్తకాన్ని అచ్చు వేసారో వారు చేతులెత్తండి. తమ తమ వర్గంలోని మంచి మంచి అనుభవజ్ఞుల అనుభవాల పుస్తకాన్ని అచ్చు వేసి ఉంటే చేతులెత్తండి. ఎవ్వరూ అచ్చు వేయలేదా? (యూథ్ మరియు ఎడ్యుకేషన్ వారిది అచ్చు అయ్యాయి) అందరిదీ అచ్చు అవ్వాలి. ఎందుకంటే ఎవరైనా వస్తే లైబ్రరీలో ఇటువంటి పుస్తకాలు ఉంటే ఎవరైనా ఫ్రీ అయ్యి చదవగలుగుతారు. ప్రతి వర్గం గురించి చదివినప్పుడు ప్రభావం పడుతుంది. కర్మ చేస్తూ, డ్యూటీ చేస్తూ ఏమీ చెయ్యలేము అని కొందరు అనుకుంటారు, అటువంటి వారికి ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చే విధంగా వీరి అనుభవాలు ఉంటాయి. వీరే తయారైనప్పుడు నేను కూడా తయారవుతాను అని అనుకుంటారు. కావున ఇటువంటి పుస్తకాన్ని తయారు చెయ్యండి మరియు తమ తమ సెంటర్లలో, లైబ్రరీలలో ఉంచండి. ఇప్పుడు ఈ పని చెయ్యండి. ఇకపోతే సమాజ సేవ వారి మీటింగ్ ఏదైతే జరిగిందో అది విన్నాము, సందేశి చదివారు, బాప్ దాదా విన్నారు. యువ వర్గ సమాచారాన్ని కూడా విన్నాము. ఏదైతే ఆలోచించారో అది బాప్ దాదా విన్నారు మరియు మంచిగా ఉన్నాయి. ఏదో ఒక కార్యక్రమాన్ని ఒక దాని తర్వాత మరొకటి చేస్తూ ఉండండి. ప్రతి వర్గం వారు చెయ్యాలి. యువ చేస్తుంది, ఎడ్యుకేషన్ కూడా చేస్తుంది. మిగతా వారు కూడా చేస్తూ ఉండవచ్చు కానీ వీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు. సమాజ సేవ వారి సమాచారాన్ని సందేశి చదివి వినిపించారు, ఆలోచించిన ప్లాను చాలా బాగుంది. బాప్ దాదాకు వర్గ సేవ చాలా బాగా నచ్చుతుంది కావున చేస్తూ వెళ్ళండి. మా వరకు సందేశం రాలేదు అనే విధంగా ఏ వర్గంవారు కూడా ఉండిపోకూడదు. ఏ వర్గమైనా అలా మిగిలి ఉంటే ఆ వర్గ సేవను కూడా చెయ్యాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ తమ పనులలో, సమస్యలలో బిజీ అయిపోతున్నారు. మరి వారిని మేల్కొల్పాలి కదా. బాబా వచ్చారు కానీ పిల్లలకు తెలియలేదు అని ఫిర్యాదు వస్తుంది కదా! కావున సందేశాన్ని ఇవ్వడం మీ పని, ఫిర్యాదు రాకూడదు. మీ వీధిలో కూడా. వినడంలేదు అని అనకండి, అందరికీ సందేశాన్ని తప్పక ఇవ్వాలి. ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యకూడదు. మీకు తెలుసు కదా, ఆరంభంలో పిల్లలు సేవకు వెళ్ళినప్పుడు, బ్రహ్మాకుమారీలను తెల్లని చీరలలో చూసి వారు తలుపులు మూసివేసేవారు, దూరంనుండే చూసి మూసివేసేవారు. తెల్ల చీర గృహస్థులకు మంచిగా అనిపించదు, అందుకని పిల్లలు సేవను ఎలా ఆరంభించారు? వారి పోస్టు బాక్సులలో వేసి వచ్చేవారు. ఎందుకంటే పోస్ట్ తీసి చూసినప్పుడు సందేశము లభిస్తుంది కదా. మొదట్లో సేవ ఆరంభమైనప్పుడు చాలా శ్రమపడవలసి వచ్చింది. ఇప్పుడైతే చాలా మంచిగా ఉంది, సహజంగా ఉంది. ఇప్పుడైతే బ్రహ్మాకుమారీలు చేసినంత బాగా కార్యక్రమాన్ని మరెవ్వరూ చెయ్యలేరు అని అంటున్నారు. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మీరే చేసారు కదా. వర్గాలు వీధి వీధిలో, స్థానస్థానాలలో చేసాయి, కావున బాప్ దాదా అన్ని వర్గాలవారికి పదమా పదమ రెట్లు అభినందనలు తెలుపుతున్నారు. మరింత వేగవంతం చెయ్యండి. అన్ని వర్గాల వారికి చాలా చాలా అభినందనలు.
(మధువనంలో జరిగిన ప్లాటినమ్ జూబ్లీకి 325 మంది మహామండలేశ్వరులు వచ్చారు, వారి సమ్మేళన చాలా బాగా జరిగింది. నేపాల్, కాన్పూర్, లక్నోలో కూడా చాలా మంచి కార్యక్రమాలు జరిగాయి) నేపాల్ లో కూడా ఎంతటి భావన కలిగిన వారిని బాప్ దాదా చూసారంటే సోదరీలను విడిచి పెట్టనే పెట్టరు. ఇప్పుడు ఇంత ప్రభావము ఉంది. ఇప్పుడు బాప్ దాదా ఏమి చూసారంటే, పిల్లలు, నేపాల్ వారు కావచ్చు, విదేశాలవారు కావచ్చు, దేశము వారు కావచ్చు, అన్ని స్థానాలలో ఉన్న నిమిత్త సేవాధారులు సేవను బాగా వ్యాప్తి చేసారు, ఏ స్థానంలో కూడా సేవ తక్కువగా లేదు, సేవ విస్తారంలోకి వచ్చేసింది. సేవ యొక్క విస్తారం బాగా జరిగింది. ఇందుకు బాప్ దాదా దేశవిదేశాలలోని అందరికీ చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు. కానీ విశేషంగా, బాప్ దాదా తీవ్ర పురుషార్థీ పిల్లల సంఖ్యను చూడాలనుకుంటున్నారు. దీనిపై కొద్దిగా టీచర్లు మరియు నిమిత్తమై ఉన్న తోటి సోదరీలు, కొద్దిగా అటెన్షన్ ఇవ్వండి అప్పుడు వృద్ధి జరుగుతుంది. ఉన్నారు, ప్రతి సెంటరులోనూ తయారయ్యారు కానీ ఎంతమంది తయారవ్వాలో అంతమంది ఇప్పుడింకా తయారవ్వలేదు. ఒకటి, సేవలో విశేష పురుషార్థీలు తయారవ్వాలి. రెండు, సెంటర్లు ఇప్పుడు నిర్విఘ్నంగా అవ్వాలి. ముందు బాప్ దాదా తమ సంకల్పాన్ని వినిపించారు. మధువన్ క్రిందవారు కావచ్చు, పైనవారు కావచ్చు, నిర్విఘ్నంగా అవ్వాలి. జనక్, మధువన్ వారికి క్లాస్ చేయించండి. జనక కు బాప్ దాదా చెప్తున్నారు, నాలుగు స్థానాల వారిని ఒకచోట చేర్చి ఒక్క నెల గురించి ఏదైతే బాప్ దాదా చేతులెత్తించారో అందులో మరింత పక్కా చేయించండి. అందరూ తమ మనసులో ఉన్నదంతా బయట పెట్టండి. బయట పెట్టడం తక్కువ ఉంటుంది, మనసులో ఎక్కువ ఉంచుకుంటారు. మధువనం ఎలా ఉండాలంటే ఒక అద్దంలో ఫరిస్తాలంతా ఉన్నట్లుగా ఉండాలి. మీరు తయారు చెయ్యండి తర్వాత బాప్ దాదా మధువనంవారి రిజల్టును చూడటానికి వస్తారు. ఎందుకంటే మధువన వైబ్రేషన్లు ఎంతగా పవర్ ఫుల్ గా ఉండాలంటే వచ్చిన వి.ఐ.పీ కానీ సాధారణమైన వారుకానీ, వారికెలా అనిపించాలంటే మేము ఎక్కడము చేరుకున్నాము! ఇలా ఎక్కడా చూడలేదు అని అనిపించాలి. పూర్తిగా వాతావరణంలో అలౌకికత, అతీత భావన కనిపించాలి. అలాగే అన్ని సెంటర్లు, జోన్లవారు కూడా ఇప్పటి వరకు ఒక్కరు కూడా మా జోన్ నిర్విఘ్నంగా అయ్యింది అన్న రిజల్టును ఇవ్వలేదు. బాప్ దాదా ముందే చెప్పి ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క జోన్ కూడా సమాచారము ఇవ్వలేదు. ఎందుకంటే సమయపు గతి వేగంగా ఉండటాన్ని బాప్ దాదా చూస్తున్నారు. కావున పిల్లల పురుషార్థపు గతి కూడా ఫాస్ట్ గా ఉండాలి. అచ్ఛా.
(మధువనంలో జరిగిన సాధు సమ్మేళన గురించిన సమాచారాన్ని బాప్ దాదాకు వినిపించారు) ఇప్పుడు ఏయే సెంటర్ల నుండైతే వచ్చారో వారిని పలకరిస్తున్నారా? కనెక్షన్ ఉంది కదా? ప్రతి సెంటరుకి వారు కనెక్షన్లోకి వచ్చారు కదా? ఎందుకంటే సెంటరువారు కూడా వారిని కనెక్షన్లోకి తీసుకురావాలి. మంచిగా చేసారు.
క్యాడ్ గ్రూప్ :- బాగుంది, వీరందరూ వైద్యం చేయించుకుని నయం చేసుకున్నారు. ఎవరైతే ఈ వైద్యం ద్వారా గుండెను మంచిగా చేసుకున్నారో వారు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారు, లెక్కపెట్టండి. (150) మంచిది. ప్రాక్టికల్ కదా. ప్రాక్టికల్ ను చూస్తే మంచిగా అనిపిస్తుంది. మరి మీరు ఇతరులకు కూడా సందేశాన్ని ఇచ్చి తమ సమానంగా తయారు చేస్తూ వెళ్ళండి ఎందుకంటే ఈరోజుల్లో గుండె సమస్యలు చాలా ఉన్నాయి. మీ ఇంటి చుట్టుప్రక్కల వారికి మీ అనుభవాన్ని వినిపించండి. మంచిది. అభినందనలు. మందుల నుండి దూరమయ్యారు. ముక్తి పొందారు, జీవన్ముక్తి కూడా లభించింది. డబుల్ ప్రాప్తి జరిగింది. ఇందుకు అభినందనలు, అభినందనలు. అచ్ఛా. మంచి సేవ చేసారు. ప్రాక్టికల్ ఉదాహరణ ఉండటమే సేవకు రిజల్టు.
325 మంది డబుల్ విదేశీ సోదరసోదరీలు వచ్చారు. - (వజీహా సోదరితో) వీరు కూడా వచ్చారు. అద్భుతం. పుట్టగానే చాలా స్నేహి, సహయోగి, సర్వీసబుల్ గా అయ్యారు. గత జన్మ కారణంగా కష్టం వచ్చింది కానీ బాప్ దాదా మీకు సేవ, సహయోగము మరియు నిర్మాణత యొక్క సర్టిఫికేట్ ను ఇస్తున్నారు.
మంచిది, విదేశీయుల ఒక్క విషయము బాప్ దాదాకు చాలా బాగా నచ్చుతుంది. వీరు డబుల్ భాగ్యాన్ని ఒక్కసారే తయారుచేసుకుంటారు. తమ మీటింగ్స్ కూడా చేసుకుంటారు, బాప్ దాదాను కూడా కలుస్తారు. అంతేకాక దేశ సేవలో కూడా తోడుగా నిలుస్తారు. ఈ విధానము ఏదైతే తయారు చేసారో ఇది బాప్ దాదాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మధువనంలో కలుకున్నంతగా మరెక్కడా వీలవ్వదు. ప్రతి టర్న్ లో కూడా వస్తారు కానీ ఇచ్చిపుచ్చుకోవలసినదంతా మధువన వాతావరణంలో చేస్తారు, ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ విధి బాప్ దాదాకు నచ్చింది మరియు పరివారాన్ని కూడా కలుస్తారు. చాలా మంచిది. బాప్ దాదా ఏమి చూసారంటే ఇప్పుడు విదేశాలలో, మీ చుట్టుప్రక్కల ఉన్న ఏ చిన్న స్థానము కూడా మిగలకూడదు అని బాప్ దాదా ఏదైతే చెప్పారో, ఇందుకు రిజల్టుగా ఇప్పుడు చిన్న చిన్న స్థానాలలో కూడా చుట్టు ప్రక్కల వృద్ధి జరుగుతుంది. అందుకే బాప్ దాదా సేవకు అభినందనలు తెలుపుతున్నారు. నిర్విఘ్నంగా అయ్యేందుకు పరస్పరంలో ఏదైతే ఆత్మిక సంభాషణ చేసుకున్నారో అది కూడా బాగుంది. ఇప్పుడు జయంతి బిడ్డ పని ఏమిటంటే ప్రతి నెల ప్రతి సెంటరు రిజల్టును అడుగుతూ ఉండాలి, మధువనంలో ఏ రిఫ్రెష్మెంట్ పొందారో అది స్థిరంగా ఉన్నదా లేక ఏదైనా పరీక్ష వచ్చిందా? ఇందుకు మీరు ఎవరి తోడునైనా తీసుకోండి. చేస్తూ ఉండండి. ఒక్కొక్క సెంటరును అడగండి. ఎక్కడైతే కొంత జరుగుతూ ఉందో అక్కడ అడగకుండా ఉండటం కాదు, ఎక్కడ జరగకుండా ఉందో వారినుండి కూడా తీసుకోండి. ఎందుకంటే దూరంగా ఉంటారు కదా. అటెన్షన్ ఉంది. అటెన్షన్ ఉండటాన్ని బాప్ దాదా చూసారు కానీ ఇంకొంచెం పెంచండి. అచ్చా, విదేశీయులందరూ ఎగిరే పక్షుల్లా ఎగురుతూ ఉంటారా! ఫరిస్తాగా అయ్యి ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ఫరిస్తా లోకంలో ఎగురుతూ ఉంటారా! పురుషార్థంలో నంబర్ వన్ గా ఉన్నారు. అటెన్షన్ పెట్టినప్పుడు పరివర్తన జరుగుతుంది. వృద్ది కూడా మంచిగా అవుతుంది, పురుషార్థంలో కూడా అటెన్షన్ పెడ్తారు, కొద్ది కొద్దిగా జరుగుతుంది కూడా. జనక్ అటెన్షన్ విదేశాలవైపు మంచిగా ఉండటాన్ని బాబా చూసారు. విదేశీ సేవలో లోటు రానివ్వడం లేదు. ఇందుకు అభినందనలు. వీరు ఇక్కడ ఉండే విదేశాలలో చేయగలిగినట్లుగా, ప్రతి జోన్ ఇన్‌ఛార్జ్ కూడా తమ జోను సంభాళిస్తూ ఉంటారు. ప్రతి సెంటరు యొక్క రికార్డును అడిగి తెలుసుకోవడం ద్వారా ఎలా ఉన్నారు అని తెలుస్తుంది. జోన్ వారు కనీసం నెలకు రెండు సార్లు తమ సేవాకేంద్రాల గురించి అడిగి తెలుసుకోవాలి. ఇందుకు ఎవరినైనా తమకు తోడుగా పెట్టుకోండి. ఒకరిద్దరు చెయ్యలేరు కానీ తమకు తోడుగా కొందరిని పెట్టుకున్నప్పుడు వారు మీకు రిపోర్టును ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సున్నితమైన సమయం రానుంది కావున అటెన్షన్ కొంచెం ఎక్కువ అవసరము. అచ్చా. విదేశీయులకు బాప్ దాదా హృదయపూర్వక అభినందనలు మరియు పురుషార్థంలో ఎక్కే కళలో ఉన్నందుకు అభినందనలు. అచ్ఛా.
ఇప్పుడు బాప్ దాదా దూరంగా ఉన్నవారిని కూడా ఎదురుగా చూస్తున్నారు. బాప్ దాదా పిల్లలందరికీ 75 సంవత్సరాల జూబ్లీ కోసం, పురుషార్ధం చేసి జూబ్లీ వరకు తీసుకువచ్చారు. ఇందుకు చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో ప్రతి ఒక్కరి సహయోగము ఉంది, వెనుక వచ్చినా, ముందు వచ్చినా కానీ అందరి సహయోగముతో ఇక్కడివరకు చేరుకున్నారు. అనేక స్థానాలలో జరుగుతున్న కార్యక్రమాల సఫలతను చూసి, సేవ సఫలతకు కూడా బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. బాప్ దాదా పిల్లలందరికీ ఒకే ఒక్క శ్రేష్ఠ సంకల్పాన్ని వినిపించాలనుకుంటున్నారు, ఇప్పుడు స్వయం కూడా నిర్విఘ్నంగా అయ్యి తమ తోటివారిని, మీ సంబంధంలోకి వచ్చేవారిని కూడా నిర్విఘ్నులుగా చెయ్యండి. సమయాన్ని సమీపంగా తీసుకురండి. పిల్లల దుఃఖము, అశాంతిని బాప్ దాదా చూడలేరు. ఇప్పుడు మీ రాజ్యాన్ని త్వరత్వరగా ఈ ధరణి పైకి తీసుకురండి. బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైనవారే, లాస్ట్ నంబరులో ఉండే పిల్లవాడు కూడా ప్రియమే. ఎందుకంటే బలహీనంగా ఉన్నాడు కదా. బలహీనంగా ఉన్నవారిపై ఎక్కువ దయ కలుగుతుంది. మీరందరూ ఎటువంటి స్థితి వారైనా, ఎటువంటి స్వభావం ఉన్నవారైనా కానీ నా వారే. బాబా నా వారు, పరివారము నాది అని అన్నప్పుడు వారిలోని స్వభావ సంస్కారాలను చూడకుండా వారికి ఇంకా సహకారాన్ని అందించండి, సద్భావన ఉంచండి, శుభ భావన ఇవ్వండి. అచ్ఛా, ఎదురుగా ఉన్న పిల్లలకు, దూరంగా కూర్చుని చూస్తున్న పిల్లలకు బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరినీ తమ ఎదురుగా చూస్తూ దృష్టి కూడా ఇస్తున్నారు మరియు అభినందనలు కూడా తెలుపుతున్నారు. అచ్ఛా.
మీ అందరికైతే ఎన్నో అభినందనలు లభించాయి కదా. అందరి అభినందనలు మీకూ లభించాయి కదా. అచ్ఛా.
నీలు అక్కయ్య బాప్ దాదాకు నేపాల్ సమాచారాన్ని వినిపించారు:- ఒక్కొక్కరికి అభినందనలు తెలపండి. సేవ మంచిగా చేస్తున్నారు. తపనతో చేస్తున్నారు, అందుకు ఫలితం వస్తుంది కదా.
మోహిని అక్కయ్యతో:- స్వయాన్ని నడిపించుకోవడం వచ్చిందా? (మెట్లు ఎక్కలేకపోతున్నాను) ఎక్కువ నడవండి. నడవగలిగితే, నడవడం ద్వారా కాళ్ళలో శక్తి వస్తుంది. కొద్ది కొద్దిగా మెట్లు ఎక్కి చూడండి. నడిచి తర్వాత మూడు నాలుగు మెట్లు ఎక్కండి అప్పుడు మార్పు వస్తుంది.
రుక్మిణి దాదీతో: - ఆది రత్నాలలో ఉన్నారు మీరు, తీవ్ర పురుషార్థం ఉంది, చాలా మంచిది. ఢిల్లీ అయితే అందరి దిల్ (హృదయము)లో ఉంది. ఎందుకంటే అందరూ రాజ్యం చెయ్యడానికి అక్కడికే రావాలి కదా. కావున ఢిల్లీను నిర్విఘ్నంగా చెయ్యండి, ఏ విఘ్నము ఉండకూడదు, అలా చెయ్యండి. అందరూ కలిసి ఎటువంటి కార్యక్రమం చెయ్యండంటే ఏదైనా విషయము వచ్చినా కానీ ఆ సమయంలోనే సమాప్తం అయిపోవాలి. అచ్చా.
దాదీ జానకితో: - (బాబా, మీరు చాలా మంచి మంచి విషయాలను వినిపిస్తారు) వినిపించకపోతే సంపన్నంగా ఎలా అవుతారు! ఇప్పుడు త్వరత్వరగా సంపన్నంగా అవ్వాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. (దాదీ జానకి ఇప్పుడు మధువనంలో ఉంటూ సేవ చేస్తారు) వీరు ఉండలేరు కూడా. కొంత సమయం ఒక స్థానంలో ఉండండి, తిరగండి కూడా, ఉండండి కూడా. కొంత సమయం ఉండండి.
పర్ దాదీతో: - చూడండి, వీరి అద్భుతం ఏమిటంటే వయస్సు పెరుగుతుంది, అనారోగ్యం కూడా ఉంది కానీ ముఖము మాత్రం మారదు. ముఖములో చలాకీతనం ఉంది. మంచిది.
డా. నిర్మల అక్కయ్యతో:- రెండు వైపుల మంచిగా సంభాళిస్తున్నారు. వీరు సంభాళిస్తున్నట్లుగానే మీరూ సంభాళిస్తున్నారు.
ముగ్గురు అన్నయ్యలతో: - ఇప్పుడెలా అయితే దాదీలపై అటెన్షన్ ఉందో అలాగే మీ ముగ్గురు పాండవులపై కూడా అందరి అటెన్షన్ ఉంది. ఏదో ఒక విధంగా కలిసే ప్రోగ్రామ్ చెయ్యండి. ఎక్కడున్నా ఫోన్ ద్వారా మీటింగ్ చేసుకోవచ్చు. విదేశాలవారు చేస్తారు కదా. మేము బాధ్యులము అని మీరు కూడా భావించండి. ఏ విషయమైనా, ఫోన్ ద్వారా మీటింగ్ చేసుకుని నిర్ణయాన్ని ఇవ్వండి. ఎక్కువ సమయం పట్టదు. త్వరత్వరగా చేసినట్లయితే నిర్విఘ్నంగా అవుతూ ఉంటుంది. సరేనా. (రమేష్ అన్నయ్యతో) ఆరోగ్యం మంచిగా ఉందా? మంచిది, బాధ్యత కిరీటమును బాప్ దాదా మరియు పరివారము ఇచ్చారు. చేస్తున్నారు కూడా కానీ కొంచెం త్వరత్వరగా పరస్పరంలో కలుసుకుని అభిప్రాయాలను పంచుకోండి. ఇక్కడకు వచ్చినప్పుడు కూర్చుంటారు కదా. అక్కడ ఉన్నప్పుడు కూడా ఫోన్ ద్వారా చెయ్యవచ్చు. విదేశాలవారు చేస్తారు కదా. అంటే, ఏ సమస్య వచ్చినా దానిని త్వరగా పరిష్కరించండి. పొడిగంచవద్దు. ఇది వస్తే చేస్తాము అని అనుకోవద్దు, చేసి పూర్తి చేసేయండి.
(దాదీ జానకి ఇప్పుడు మధువనంలో ఉంటారు, అవసరమైతే విదేశాలకు వెళ్తారు) ఇక్కడ కూడా అక్కడక్కడ ఆవశ్యకత ఉంటుంది, ఇక్కడ కూడా ఆవశ్యకత ఉంటుంది.
ఆశా అక్కయ్యతో: - ఢిల్లీ మంచిగా ఉంది కదా! ఎందుకంటే ఢిల్లీకు అందరూ రాజ్యం చెయ్యడానికి రావాలి. కావున ఢిల్లీ అయితే పవర్ ఫుల్ గా చెయ్యాలి. (ఓ.ఆర్.సి కు ప్రెసిడెంట్ వచ్చారు, ఆ ఆల్బమ్ ను బాప్ దాదాకు చూపించారు).
Comments
Post a Comment