15-03-2015 అవ్యక్త మురళి

  15-03-2015         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“పనులు చేసుకుంటూ నా బాబా, మధురమైన బాబా అనే రెండు మాటలే గుర్తుండాలి, ఈ అలౌకిక ప్రేమ సంబంధమే సంగమయుగపు బహుమతి" 

ఓంశాంతి. అందరి ముఖాలు చిరునవ్వుతో ఉన్నాయి. బప్హ దాదాను మరియు పరస్పరం ఒకరినొకరు నవ్వుతూ మిలనం చేసుకుంటున్నారు. ఈనాటి ముఖాలలో ప్రతి ఒక్కరూ చాలా సమయం తర్వాత సాకార రూపంలో, ముందు వెనుక కూర్చున్న వారు నయనాల మిలనము జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మనసు నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అన్న పాటనే పాడుతుంది. తండ్రి-పిల్లలు మిలనము జరుపుకోవడాన్ని చూసి ఎంతమంది ఆత్మలు సంతోషిస్తున్నాయి. అందరి ముఖాలలో మిలనపు సంతోష ముఖము కనిపిస్తుంది. సమీపంగా ఉన్నవారు కావచ్చు, దూరంగా ఉన్నవారు కావచ్చు కానీ చివరలో ఉన్నవారిలో కూడా మిలనపు ఉల్లాస ఉత్సాహాలు బాప్ దాదాను తమ వైపుకు ఆకర్షిస్తున్నాయి. బాబా నోటి నుండి వాప్, మనస్ఫూర్తిగా గుర్తు చేసే నా పిల్లలూ వాహ్! అని వెలువడుతుంది. బాబా హృదయంలో పిల్లలు, పిల్లల హృదయంలో బాబా. అందరి మనసులలో మిలనము యొక్క సంతోషపు అల కనిపిస్తుంది. బాబా కూడా హృదయపూర్వకంగా వాహ్ పిల్లలూ వాహ్! అన్న పాటను పాడుతున్నారు. పిల్లలు కూడా వాహ్ బాబా వాహ్! అన్న పాటనే పాడుతున్నారు. వాహ్ అనగానే అందరి ముఖాలలో సంతోషపు దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు
ఎంత దూరంగా కూర్చున్నా కానీ అందరి హృదయాలలో వాహ్ బాబా వాహ్ మరియు బాబా హృదయంలో వాహ్ పిల్లలూ వాహ్, ముఖంలో హృదయపూర్వక మిలనపు అల స్పష్టంగా కనిపిస్తుంది. నోటితో పాటను పాడటం లేదు కానీ ప్రతి ఒక్కరి హృదయం నుండి వచ్చే పాట ముఖంలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి ముఖము హర్షిత ముఖంతో, ఎంత మధురమైన చిరునవ్వుతో ఉంది! బాబా కూడా హృదయంలో వాహ్ పిల్లలూ వాహ్! అన్న పాటనే పాడుతున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో బాబా ఇదే చూస్తున్నారు మరియు హృదయపూర్వకంగా అంటున్నారు, హృదయం నుండి వచ్చే ధ్వని బాబా వద్ద స్పష్టంగా కనిపిస్తుంది. బాబా పాట వాహ్ పిల్లలూ వాహ్ అని, పిల్లల పాట ఇదే - వాహ్ బాబా వాహ్. ప్రతి ఒక్కరి ముఖంలో వాహ్ వాహ్ చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరు పాట రూపంలో, మరి కొందరు హృదయపు ధ్వని రూపంలో దీనిని నయనాల ద్వారా తమ మనసులోని పాటను పాడుతూ కనిపిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ హృదయాభిరాముని హృదయ సితారలు అని బాబా కూడా పిల్లలు ఒక్కొక్కరికీ రెస్పాంస్ ఇస్తున్నారు. వాహ్ పిల్లలూ వాహ్ సితారలు వాహ్!

ఈరోజు అందరి ముఖాలలో మూర్తి కనిపిస్తుంది. బాబా కూడా వాహ్ పిల్లలూ వాహ్! అన్న పాటను మనసులో పాడుకుంటున్నారు. ముఖం చూడాలని ఎంతో కాలం నుండి ఉన్న ఆశ ఈరోజు ప్రాక్టికల్ గా కనిపిస్తుంది. కావున పిల్లల మనసులలో వాహ్ బాబా వాహ్, బాబా హృదయంలో వాహ్ పిల్లలూ వాప్, ఈ హృదయపు పాట అందరికీ తమదీ వినిపిస్తుంది మరియు సర్వులదీ వినిపిస్తుంది. పిల్లలు ఎదురుగా వచ్చి పాడుతున్నంత స్పష్టంగా బాప్ దాదా పిల్లల హృదయ పాటను వింటున్నారు. బాప్ దాదా ఆ హృదయ పాటను వింటూ వింటూ చాలా ప్రేమను పొందుతున్నారు. పాటను వింటూ వాహ్ పిల్లలూ వాహ్ అని బాబా రెస్పాంస్ ఇస్తున్నారు. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో, ప్రతి ఒక్కరి హృదయం నుండి నా బాబా, నా బాబా... అన్న ధ్వని వస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరికీ రెస్పాంస్ ఇస్తున్నారు. ఎంత దూరంలో ఉన్నాకానీ, ఇక్కడైతే ఉన్నారు, అలాగే ఇతర దేశాలలో ఉన్నవారందరి నోటి నుండి వాహ్ బాబా వాహ్ అన్న పాటను బాప్ దాదా వింటున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ వాహ్ బాబా వాహ్, నా బాబా వాహ్ అనడంలో మునిగి ఉన్నారు. హృదయం నుండి వచ్చే పాట కనుక ధ్వని వినిపించదు కానీ బాబాకు అందరి హృదయము వినిపిస్తుంది. బాప్ దాదా కూడా రెస్పాంస్ ఇస్తూ వాహ్ పిల్లలూ వాహ్ అంటున్నారు. అందరి హృదయాలలో ఎవరున్నారు? అందరూ ఏమని అంటున్నారు? నా బాబా. పిల్లలు పాడే పాటను బాబా విన్నారు కదా. నా పిల్లలు అని బాబా అంటారు, నా బాబా అని పిల్లలు అంటారు. ఎంతటి మధురమైన ధ్వని. నావారు అని అంటున్నారు కదా, అద్భుతం దానిదే. నా బాబా అని ప్రతి ఒక్కరి హృదయం అంటుంది. బాబా హృదయం ప్రతి ఒక్కరి కోసం నా పిల్లలూ అని అంటుంది ఎందుకంటే సాకార రూపంలో అయితే గుప్తమైన హృదయం యొక్క విషయం ఉంటుంది కానీ ప్రతి ఒక్కరి హృదయపు ధ్వని బాబా స్పష్టంగా వింటున్నారు. నా బాబా అని పిల్లలు అంటారు, నా పిల్లలు అని బాబా అంటారు. బాబా మరియు పిల్లల మిలనము ఎటువంటిది అన్నది అందరూ అనుభవీలే. అందరి నోటి నుండి వాహ్ నా బాబా వాహ్ అని వెలువడుతుంది. రెస్పాంస్ లో ప్రతి ఒక్కరికీ వాహ్ పిల్లలూ వాహ్ అని లభిస్తుంది. కానీ ఈ మిలనము విచిత్రమైనది. అందరూ వాహ్ బాబా వాహ్ అని రెస్పాంస్ ఇస్తున్నారు, కానీ అందరూ తమ తమ హృదయాలలో తమ ధ్వనితో చెప్తున్నారు. బాప్ దాదా ఇంతమంది పిల్లల రెస్పాంస్ ని విని, హృదయపూర్వక ప్రేమను చూసి ఎంతగానో హర్షిస్తున్నారు. ఈ విషయమైతే ఈ సంగఠనలో బాబా గురించి పిల్లలకు తెలుసు, పిల్లల గురించి బాబాకు తెలుసు. ఇరువురూ వాహ్ వాహ్ వాహ్ అని అంటున్నారు. బాబా ఇది విని పిల్లలకు రెస్పాంస్ ఇస్తున్నారు. ప్రతి క్షణం పిల్లలు తమ నోటి నుండి వాహ్ బాబా, వాహ్ నా బాబా, వాహ్ ప్రియమైన బాబా, వాహ్ హృదయంలో ఇముడ్చుకునే బాబా అని నోటి నుండి పాడుతున్నారు. మీ ప్రేమ మీకే తెలుసు మరియు నాకు తెలుసు. ప్రతి ఒక్కరి ముఖాన్ని ఒకవేళ మీరు వచ్చి చూస్తే అందరి ముఖాలు మెజారిటీ చాలా సమయం నుండి ప్రేమలో మునిగి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. పిల్లలు మనసులో వాహ్ వాహ్ వాహ్ అని అంటున్నారు. వాహ్ వాహ్ అన్న మాట పిల్లలందరి హృదయం నుండి వినిపిస్తుంది. అందరి హృదయాలలో ఎవరున్నారు? ఏమంటారు? నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా. బాబా హృదయంలో ఎవరున్నారు? కేవలం ఇప్పుడైతే నావి అనుకున్న మధురమైన రెండు మాటలను గుర్తుంచుకోండి. మధురమైన బాబా, నా బాబా. పిల్లలందరి హృదయాలలో చూస్తే ఆ హృదయంలో ఎవరున్నారు? నా బాబా. ప్రతి ఒక్కరి హృదయంలో నా బాబా, నా బాబా ఉన్నారు ఎందుకంటే బాబా మరియు పిల్లల ఈ ప్రేమ అలౌకికమైన ప్రేమ, ఇది పూర్తి కల్పంలో ఈ జన్మలోనే అనుభవం చేసుకునేది. మరి చెప్పండి, అందరి హృదయాలలో ఎవరున్నారు? నా బాబా. అందరి ముఖాలు ఎంతటి చిరునవ్వుతో ఉన్నాయి! బాప్ దాదా అయితే ముందు నుండి చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ మనసుతో నా బాబా అంటూ ఎంతగా మునిగిపోతున్నారంటే బాబా మరియు పిల్లల మిలనపు చిత్రము సదా కోసం అందరి మనసులలో ముద్ర పడిపోతుంది.

అందరి మనసులలో బాబా స్మృతి ఉంది, ఇప్పుడు ఇందులో అయితే పాస్ అయ్యారు. ఎప్పుడైనా ఏదైనా లెక్కాచారం కారణంగా మర్చిపోయినా, కొంచెం మర్చిపోయినా కానీ మెజారిటీ పిల్లలలో నా బాబా అన్నది ఎంతగా పక్కా అయిపోయిందంటే నడుస్తూ తిరుగుతూ నా బాబా, నా బాబా అన్నది మర్చిపోవడం లేదు. బాబాకు కూడా ఏమి గుర్తుంటుంది? నా పిల్లలు. గుర్తుంటుంది కదా. అందరి హృదయాలలో ఎవరున్నారు? పక్కా, పక్కా? ఇక్కడ అద్భుతమేమిటంటే పిల్లల హృదయంలో బాబా ఉన్నారు, మామూలుగా అయితే జీవిత భాగస్వామి గుర్తుంటారు కానీ ఇక్కడ అందరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకుంటే, హృదయంలో ఎవరున్నారు? నా బాబా అని అంటారు. ప్రతి పనీ చేస్తూ కూడా బాబా మాటలే గుర్తుంటాయి. రోజంతటిలో చూసుకోండి, పనులు చేసుకుంటూ ఎవరి స్మృతి ఉంటుంది? ఎవరిని కాపీ చేస్తారు? సాకారంలో ఏమి కనిపిస్తుంది? బాబా హృదయంలో నేను, నా హృదయంలో బాబా. అలాగే కదా! చేతులెత్తండి. అలాగేనా? పక్కా? పనులు చేసుకుంటూ మర్చిపోతుంటాము అని అంటారు కానీ ఇక్కడ మర్చిపోయామన్న మాటే ఉండదు. బాబా హృదయంలో ఎవరున్నారు? నా పిల్లలు. ఈ సంబంధం సంగమయుగపు బహుమతి. అచ్ఛా.

ఈరోజు అందరి మిలనము జరిగింది. ఇప్పుడు ఈ మిలనము సదా గుర్తుంటుంది, ఆత్మ-పరమాత్మల మిలనము సాధారణమైనది కాదు. మీ హృదయంలో ఎవరున్నారు అని ఎవరిని అడిగినా ఏమని చెప్తారు? అందరూ నా బాబా అనే అంటారు. ఎంతటి గాఢమైన ప్రేమ. 

సేవ టర్న్ - ఈస్టర్న్ జోన్ (బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం, నేపాల్ మరియు తమిళనాడు నుండి 21వేలమంది వచ్చారు):- బాబా కూడా ఈ మిలనాన్ని మర్చిపోలేరు. బాబాకు సమయం లభించినప్పుడల్లా హృదయంలో ఎవరుంటారు? నా పిల్లలు, గారాల పిల్లలు. పిల్లలకు సమయం లభిస్తే నా బాబా. అంతే కదా! అలాగే అయితే చేతులెత్తండి. మర్చిపోయే విషయమే లేదు. ఎంతగా మర్చిపోవాలని ప్రయత్నం చేసినా కానీ మర్చిపోయి కూడా మర్చిపోలేరు. (అందరూ లేచి నిల్చున్నారు) చాలామంది ఉన్నారు. తమ టర్న్ లో సేవకు మంచిగా వచ్చారు. బాబాపై మరియు యజ్ఞ సేవపై అందరికీ ప్రేమ ఉంది. ఎందుకంటే సేవ మరియు మిలనము రెండూ ఒకేసారి జరిగిపోతాయి. 

నేపాల్ నుండి 2500 మంది వచ్చారు:- అక్కయ్యలు కూడా చేతులెత్తండి. మంచిది. బాప్ దాదాను పిల్లలెవరైనా దగ్గరగా కలవకపోతే గుర్తుంటుంది కదా! కావున ఈ మిలనపు పద్ధతి మంచిగా ఉంది. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నట్లయితే రెండ్రెండు చేతులెత్తండి. ఒకవేళ సంతోషంగా ఉంటే? 

తమిళనాడు నుండి 4500 మంది వచ్చారు:- చాలామంది వచ్చారు, అభినందనలు, అభినందనలు. మంచిది. రెస్పాంస్ బాగుంది. 

డబుల్ విదేశీయులు 1200 మంది వచ్చారు: - ఇంతమంది బ్రాహ్మణులకు ఛాన్స్ లభించడం కూడా చాలా అదృష్టం. ఎక్కడెక్కడి నుండో వస్తారు, ఎంతో ఉత్సాహంతో వస్తారు. బాప్ దాదాకు పిల్లలు ఒక్కొక్కరినీ చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది మరియు ఒక్కొక్కరికీ సేవలో వచ్చినందుకు అభినందనలు కూడా తెలుపుతున్నారు. చాలా మంచిది.

పిల్లలందరూ టర్న్ బై టర్న్ సేవలో రావడం బాప్ దాదాకు చాలా బాగా నచ్చింది. ప్రతి గ్రూపు వారు యజ్ఞ సేవను ఎంతో ప్రేమగా చేస్తున్నారు, చేసారు మరియు ఇప్పుడు కూడా చేస్తున్నారు. ప్రతి గ్రూపుకు బాప్ దాదా మనస్ఫూర్తిగా రిటర్న్ ఇస్తున్నారు. ఆలోచిస్తే ఈ యజ్ఞం ఎవరిది? ఈ యజ్ఞము ప్రతి ఒక్క యజ్ఞ నివాసిది. మీ అందరి అసలైన ఇల్లు ఎక్కడుంది? ఇదే కదా! మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే ఏమని చెప్తారు? ఆబూకు చెందినవారిమి అనే చెప్తారు కదా. ఎక్కడి వారైనా కానీ వారు ఎక్కడివారు? మరి అందరూ సీజన్ లో తమ తమ పాత్రలో మంచి సహయోగాన్ని ఇచ్చారు, సేవను పూర్తి చేసారు, ఇందుకు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా అభినందనలు ఇస్తున్నారు. 

దాదీ జానకిగారితో:- యజ్ఞంలో వీరు ఒక ఉదాహరణ. అనారోగ్యంగా ఉన్నాకానీ హాజరయ్యారు. ఒకవేళ దాదీ క్లాసులోకి రాకపోతే ఖాళీ
ఖాళీగా అనిపిస్తుంది. 

(దాదీకి గుల్జార్ దాదీ డాక్టరు, సమయానికి మంచిగా చేసేస్తారు) ఎవరు చేసినా కానీ ధైర్యమైతే దాదీదే కదా. మంచిది. చూడండి, మా దాదీ, మా దాదీ అని అందరి దృష్టి ఉంది. నా బాబా అన్నట్లుగా నా దాదీ అంటారు.

మోహిని అక్కయ్య: - (హాస్పిటల్ యాత్ర చేసి వచ్చారు) ఇప్పుడైతే వచ్చేసారు. అభినందనలు. రోజూ ఏదో కొంచెం అవుతూ ఉంటుంది, అవుతున్నా కానీ సమయానికి తయారవుతున్నారు, మంచిది. చేరుకుంటున్నారు. అభినందనలు, అభినందనలు. మంచిది. ధైర్యం ఉంది. 

న్యూయార్క్ మోహినీ అక్కయ్య స్మృతిని పంపారు:- మంచి ధైర్యాన్ని పెట్టారు. సమయం పట్టింది కానీ ధైర్యాన్ని ఉంచి తమను సురక్షితం చేసుకున్నారు. (ఇప్పుడు బాగైపోతారా) ఇప్పుడు అయిపోతారు. బాబా స్మృతి ఏమిటి, అందరి స్మృతి ఉంది. 

నిర్వైర్ అన్నయ్య:- ఇప్పుడిక హాస్పిటల్ ను విడిచిపెట్టారు కదా. ఇప్పుడిక మళ్ళీ హాస్పిటల్ వెళ్ళరు కదా (4 రోజుల కోసం వెళ్తాము) నాలుగు రోజుల తర్వాత సమాప్తము. నాలుగు రోజుల తర్వాత బాగైపోతారు. మంచిది. ఇప్పుడు అందరూ ఒ.కెగా ఉన్న రోజును జరుపుకుందాము. ఏదో ఒక కారణంతో జరుగుతుంది. 

బృజ్ మోహన్ అన్నయ్య:- వీరు కూడా మంచిగా అయిపోయారు. 

(రమేష్ అన్నయ్యతో) ముగ్గురు అన్నయ్యలు మంచిగా ఉన్నారు కదా! 

వీడ్కోలు సమయంలో:- (బాప్ దాదా మైక్ పెట్టేందుకు అనుమతిని ఇవ్వలేదు కానీ ఈ మహావాక్యాలను ఉచ్చరించారు):- పాత విషయాలను మర్చిపోండి, పాస్ట్ ఈజ్ పాస్ట్. పాత విషయాలు ముందుకు వస్తే బాబా గుర్తుకు రారు. ఇప్పుడు ఒక్క శివబాబానే గుర్తు చెయ్యండి. ఇప్పుడు చాలా శక్తిశాలి యోగం యొక్క అవసరం ఉంది, అన్ని వైపుల ఈ విషయాన్ని చెప్పండి. అన్ని పాత విషయాలను తొలగించి ఒక్క బాబా యోగంతో శక్తిశాలి వాతావరణాన్ని తయారు చెయ్యండి మరియు కొత్త సేవ కోసం ప్లాన్ చెయ్యండి. ఏదైనా సేవ ప్రోగ్రామ్ తయారు అయినప్పుడు అందులో వేర్వేరుగా అయితే ఆ సేవలో సఫలత లభించదు. సంగఠన శక్తితోటే సేవ ప్లానులో సఫలత లభిస్తుంది, ఇప్పుడు 10 నిమిషాలు మంచిగా సైలెన్సును అనుభవం చెయ్యండి, యోగం చెయ్యండి. అచ్చా.

Comments