15-03-2014 అవ్యక్త మురళి

 15-03-2014         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“జీవితంలోని ప్రతి రోజు హోలీగా (పవిత్రంగా) అయ్యి వవిత్రత వైబ్రేషన్లను నలువైపులకు వ్యాప్తి చెయ్యాలి, గడిచినదానిని గడిచిపోయినదిగా భావించి సఫలత వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి"  

సర్వ హోలీ పిల్లలకు హోలీ శుభాకాంక్షలు. హోలీ పిల్లలైన మీరొక్కొక్కరు ఈరోజు బాప్ దాదాతో కలిసి హోలీని జరుపుకోవడానికి వచ్చారు, కావున బాప్ దాదా కూడా సర్వ హోలీ పిల్లలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పిల్లలు ఒక్కొక్కరు ఎంత ప్రియమైనవారన్నది బాబాకు తెలుసు మరియు పిల్లలకు తెలుసు. హోలియెస్ట్ (అతి పవిత్రమైన) బాబా పిల్లలందరికీ అతి స్నేహంతో హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పిల్లలందరూ హోలియెస్ట్ బాబాకు హోలీ పిల్లలు. ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరికీ హోలీగా అయ్యే మరియు తయారు చేసే స్థితి గురించి తెలుసు. బాబా కూడా పిల్లలు ఒక్కొక్కరూ ఎంత వరకు మనసా-వాచ-కర్మణ, సంబంధ-సంపర్కంలో హోలీగా అయ్యారు, పవిత్రంగా అయ్యారు అన్నది బాబాకు తెలుసు మరియు మీకు కూడా తెలుసు, ఎందుకంటే బాప్ దాదాకు హోలియెస్ట్ పిల్లలు ప్రియము. మరి ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరూ హోలియెస్ట్ అయ్యేందుకు అభినందనలను స్వీకరించండి. ప్రతి హోలీ పిల్లలు నంబరువారీగా ఉన్నారు, కానీ బాప్ దాదా ప్రేమకు అధికారులు. మరి బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలను, దేశం వారు కావచ్చు లేక విదేశం వారు కావచ్చు, ఒక్కొక్కరికీ చాలా హృదయంతో, ప్రేమతో హోలీగా అయ్యేందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.

ఈరోజును తయారు చేసింది కూడా భక్తులే కానీ ప్రతి రోజుకూ మహత్వాన్ని ఇచ్చారు. మీరు కూడా జరుపుకుంటారు, భక్తులు కూడా, సాధారణ పిల్లలు కూడా కానీ ప్రతి ఒక్కరూ తమ తమ విధానంతో జరుపుకుంటారు. పిల్లలైతే అమృతవేళ నుండే బాబాకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు అన్న వరుసలను పరిచారు. నలువైపుల నుండి దేశం నుండి కావచ్చు, విదేశం నుండి కావచ్చు, గ్రామం నుండి కావచ్చు, పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాకు మరియు మీ అందరికీ చాలా-చాలా శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు బాప్ దాదా పిల్లల శుభాకాంక్షలకు రెస్పాన్స్ గా చాలా చాలా స్నేహమును ఇస్తున్నారు. 

ఈరోజు అమృతవేళ నలువైపుల నుండి హోలీ శుభాకాంక్షలు, హోలీ శుభాకాంక్షలు అన్న పిల్లల మనసు పాటను బాబా వింటున్నారు. బాబా కూడా ఇప్పుడు సమ్ముఖంలో పిల్లలైన మీకు, ప్రతి ఒక్కరికీ, ఎంతమంది ఉన్నా, పూర్తిగా చివరి బిడ్డకు కూడా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరి ముఖాలు ఈ సమయంలో బాబా స్నేహములో, తపనలో మగ్నమై కనిపిస్తున్నాయి. బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలకు నయనాల దృష్టిని ఇస్తూ, పిల్లలు సదా ప్రతి రోజూ ఈ మిలనపు సంతోషం మరియు ఆనందంతో ముందుకు వెళ్తూ ఉండాలని మిలనం జరుపుతున్నారు. ఎలా అయితే ఈ రోజుకు హోలీ అన్న పేరు ఉన్నదో, అలాగే జీవితంలోని ప్రతి రోజు హోలీ అంటే పవిత్రంగా అయ్యి పవిత్రత వైబ్రేషన్లను నలువైపులకు వ్యాప్తి చెయ్యండి.

బాప్ దాదా ఒక విషయంలో సంతోషంగా ఉన్నారు, ఏమి చూసారంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ బాప్ దాదాకు శుభాకాంక్షలను తెలుపుతున్నారు మరియు భిన్న భిన్న స్థానాల నుండి శుభాకాంక్షలు, శుభాకాంక్షలతో ఒడి నిండిపోయింది. ఈ శుభాకాంక్షలు సదా గుర్తుండాలి, హోలీ శుభాకాంక్షలు. ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలకు అమృతవేళ నుండి హృదయపూర్వక శుభాకాంక్షలను తెలుపుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతి సబ్జెక్టులో ముందుకు వెళ్తూ ఉండాలి, బాప్ దాదా పిల్లలందరికీ తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు బాప్ దాదా కూడా సమ్ముఖంగా వచ్చిన పిల్లలందరికీ హృదయపూర్వక ఆశీర్వాదాలతో పాటు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. హోలీ, గడిచిన సెకండు కోసం ఏమని చెప్తాము? హో లీ, జరిగిపోయింది. పిల్లలు ప్రతి ఒక్కరూ అమృతవేళ నుండి తమ తమ సమయానుసారంగా శుభాకాంక్షల పాటను, మనసు పాటను, నోటితో పాడరు కానీ మనసులో పాడే శుభాకాంక్షల పాటలు బాప్ దాదా చెవులకు వినిపిస్తున్నాయి. బాప్ దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరికీ సమ్ముఖంగా శుభాకాంక్షలకు రెస్పాండ్ అవుతున్నారు, పిల్లలందరికీ హృదయపూర్వక ఆశీర్వాదాలతో పాటు, హృదయపూర్వక ప్రేమతో శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈరోజు నుండి రోజూ అమృతవేళ మీ పురుషార్థం అనుసారంగా బాబా ఆశీర్వాదాలను స్వీకరించండి. బాబా ఆశీర్వాదాలు ఏమిటి? బాప్ దాదా పిల్లలందరినీ తీవ్ర పురుషార్థీ స్వరూపంలో చూడాలనుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ, పరిస్థితుల పని రావడము కానీ పిల్లలైన మీ పని బాబా నుండి హృదయపూర్వక ఆశీర్వాదాలను పొందడము. రోజూ అమృతవేళ స్వయానికి బాబా ఆశీర్వాదాలను స్వీకరించండి. బాప్ దాదా మా రక్షకుడై మాకు తోడుగా ఉన్నారు అని రోజంతా అనుభవం చెయ్యండి. బాబా తోడు అంటే అర్థము ఏమిటి? బాబా ఏమి చెప్తారో, అమృతవేళ వినే మురళిలో ప్రియస్మృతులతో పాటు ఆశీర్వాదాలు కూడా ఉండనే ఉంటాయి. కావున రోజూ ఆశీర్వాదాలను తీసుకుంటూ ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. మరి హోలీ జరుపుకోవడము అంటే గడిచినదానిని మరియు వర్తమానాన్ని సఫలత స్వరూపంగా చెయ్యడము. సఫలత స్వరూపము, సఫలత మన జన్మసిద్ధ వరదానము. ఈ స్మృతితో రోజును పదే పదే గుర్తు చేసుకోండి, బాప్ దాదా వరదానము - సఫలత పిల్లలందరికీ ఉంది ఎందుకంటే బాప్ దాదా తోడుగా ఉన్నారు కావున సఫలత సదా పిల్లలందరితో ఉంటుంది, కేవలం దానిని ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి. మీరు అయ్యే ఉన్నారే సఫలతా స్వరూపులు. స్వరూపమే సఫలత. మరి ఈరోజు సఫలత మా జన్మసిద్ధ అధికారము అన్న వరదానాన్ని గుర్తుంచుకోండి. ఈ స్మృతి అసఫలతను కూడా సఫలతలోకి మార్చేస్తుంది. మరి ఈరోజు 'సదా సఫలత స్వరూపమును, సఫలత నా జన్మసిద్ధ అధికారము' అన్న బాబా వరదానమును సదా గుర్తుంచుకోండి.

ఈరోజు హోలీ అంటే గడిచినదేదో గడిచిపోయింది. హో లీ అంటే గతం. ఏది చేసినా దానిని ఈరోజు గడిచినదానిని గడిచిపోయినదిగా భావించి ఇక ముందు కోసం సఫలత నా జన్మసిద్ధ అధికారము అని గుర్తుంచుకుని, అమృతవేళ రోజూ ఈ వరదానాన్ని గుర్తు తెచ్చుకుని రోజంతా పరిశీలించుకుంటూ ఉండండి మరియు సఫలత స్వరూపులుగా అవ్వండి. ఇప్పుడైతే చాలా నాలెడ్జ్ ఫుల్ గా అయ్యారు, ప్రపంచానికి సందేశాన్ని ఇస్తున్నారు మరియు బాప్ దాదా కూడా పిల్లలందరికీ 'సఫలత మీ జన్మసిద్ధ అధికారము' అన్న వరదానాన్ని ఇస్తున్నారు. సఫలత నా జన్మసిద్ధ అధికారము అని అమృతవేళ గుర్తు చేసుకోవడముతో పాటు రోజూ దీనిని గుర్తుంచుకుని ప్రాక్టికల్ లోకి తీసుకురండి. ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే సఫలతా వరదానాన్ని గుర్తు తెచ్చుకోండి మరియు ప్రాక్టికల్ లోకి తీసుకురండి.

ఈరోజు హోలీ రోజున విశేష వరదానము - బాబా సమానంగా, బ్రహ్మ బాబా సమానంగా సంపన్నంగా అవ్వవలసిందే. ఫాలో ఫాదర్. ఎందుకంటే బ్రహ్మ బాబా సాకార రూపంలో ఉండేవారు, ఇప్పుడు కూడా సహకరిస్తున్నారు అందుకే ఫాలో బ్రహ్మ బాబా. సఫలత నా జన్మసిద్ధ అధికారము. అధికారులే కదా! అధికారులేనా? చేతులెత్తండి. మరి ఎక్కడ సఫలతా అధికారము ఉంటుందో అక్కడ మాయ ఏమంత పెద్ద విషయము! మాయా ఆటలను చూస్తూ ఉండండి, మాయ పని రావడము, మరి మీ పని ఏమిటి? విజయము పొందడము. ఇది సదా గుర్తుంచుకోండి, సఫలత పొందిన విజయి రత్నమును. వీలవుతుంది కదా! సఫలతకు అధికారులే కదా! అచ్చా.

ఈరోజు కోసం చాలా చాలా చాలా శుభాకాంక్షలు. అంతా బాగున్నారా! చేతులెత్తండి. ఇలా ఇలా ఎత్తండి. చాలా బాగా అనిపిస్తుంది. బాప్ దాదా కూడా చాలా చాలా శుభాకాంక్షలను బుట్టనిండా నింపి ఇస్తున్నారు. ఏమి జరిగినా కానీ, గుర్తుంచుకోండి, బాబా ఇచ్చిన బహుమతిని విడిచిపెట్టకండి. అచ్ఛా.

నలువైపుల ఉన్న దేశవిదేశాల పిల్లలకు ఈరోజు కోసం శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. 

సేవ టర్న్ ఢిలీ మరియు ఆగ్రా జోన్ వారిది:- (ఈ టర్న్ లో మొత్తం 25వేల మంది వచ్చారు, 14వేల మంది ఢిల్లీ, ఆగ్రావారు) చాలా మంచిది. ఢిల్లీకున్న వరదానము ఏమిటంటే, డ్రామా అనుసారంగా, మా రాజ్యంలో కూడా ఢిల్లీ విశేష స్థానంగా ఉంటుంది. అక్కడ లక్ష్మినారాయణుల రాజ్యము ఉంటుంది. ఫారెన్ వారు ఏమి ఆలోచిస్తున్నారు? ఫారెన్ వారు కూడా, మేమూ ఢిల్లీవాసులుగా ఉంటాము అని అనుకుంటున్నారు. ఎక్కడున్నా కానీ ఢిల్లీ ముఖ్య స్థానంగా ఉంటుంది, రాకపోకలైతే జరుగుతాయి కదా. ఫంక్షన్ కి అయితే వస్తారు కదా. కలుసుకుంటూ ఉంటారు. డాన్స్ చేస్తారు. ఎంతో ఆనందంతో రాజ్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సంగమయుగపు తోడు అక్కడ కూడా ఉంటుంది. ఎంతటి సమీప అవస్థ ఇప్పుడు ఉంటుందో దాని అనుసారంగా అక్కడ కూడా పరివారానికి సమీపంగా ఉంటారు. ఫారెన్ వారు ఎక్కడ ఉంటారు? ఢిల్లీలోకి వస్తారు. అందరూ కలిసి చాలా చక్కగా రాజ్యాన్ని చేస్తారు. అచ్చా

డబుల్ విదేశీయులు:- డబుల్ విదేశీయులైతే సగం క్లాసు నింపేసారు. బాగుంది. ఇప్పుడు భారతవాసులవలె విదేశీయులు కూడా ప్రతి దేశం నుండి వచ్చి తమ లాభాన్ని పొందుతున్నారు. మంచిది. తప్పక రండి, తిరిగి వెళ్ళి ఇతరులను కూడా మీతో తీసుకురండి. అచ్చా. 

అచ్చా - పిల్లలు ఒక్కొక్కరికీ బాప్ దాదా హృదయపూర్వక ప్రేమను ఇస్తూ గుడ్ నైట్ చెప్తున్నారు. బాగుంది, డబుల్ విదేశీయులు మంచి ఉన్నతిని చేస్తున్నారు. పురుషార్థంలో కూడా కొన్ని చోట్ల చాలా మంచి అటెన్షన్ లో ఉన్నారు, బాప్ దాదా ఆ పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కొక్కరికీ స్మృతిని మరియు ప్రేమను ఇస్తున్నారు. 

దాదీలు:- అందరూ చాలా మంచిగా సంభాళిస్తున్నారు. నిమిత్తంగా అయ్యి కార్యాన్ని చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, చేస్తూ ఉంటారు.

మోహిని అక్కయ్య: - ఒక్కొక్కరికీ వరదానము ఉంది. వరదానము నడిపిస్తుంది మరియు కలిసి చేరుకుంటారు. కలిసి రాజ్యం చేస్తారు కదా. ఈరోజు అన్ని వైపుల నుండి దాదీలు వచ్చారు. 

రుక్మిణి దాదీ:- ఇప్పుడు వీరు చూడకపోయినా కానీ బుద్ది చక్కగా ఉంది కావున ఇప్పుడు కూడా ఏది జరుగుతుందో అది తెలుసు, నడుస్తున్నారు, నడిపిస్తున్నారు. బాగున్నారు. శుభాకాంక్షలు. 

ముగ్గురు పెద్దన్నయ్యలతో:- త్రిమూర్తులు పూర్తి యజ్ఞాన్ని చూసుకుంటున్నారు. ఈ త్రిమూర్తులు యజ్ఞాన్ని సంభాళించేందుకు నిమిత్తంగా అయి ఉన్నారు మరియు తోటివారు కూడా ఉన్నారు, వీరు కూడా ఉన్నారు. మీ తోటివారు కూడా చాలా మంచిగా ఉన్నారు. ఎలా అయితే నడిపిస్తున్నారో అది కూడా బాగుంది, ఇంకా ఒకరికొకరు సమీపంగా రండి. సంస్కారాలలో సమీపంగా రండి. అలా చూస్తే సమీపంగా ఉన్నారు, కానీ సంస్కారాలు కలుపుకోవడంలో శ్రద్ద వహించండి. వీరు ముగ్గురు కాదు ఒకరు అని అనిపించాలి. మీ తోటివారైతే ఇంకా చాలా మంచిగా ఉన్నారు. బాప్ దాదా వద్దకు ఎటువంటి రిపోర్టు రాలేదు, మంచివారు కానీ ఇంకా మంచిగా అవ్వాలి. యజ్ఞ వ్యవహారాలు చాలా మంచిగా అవుతున్నాయి, ఏ విషయమూ లేదు, అటెన్షన్ ఇస్తున్నారు మరియు ఇక ముందు కూడా ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏ డ్యూటీ అయితే తీసుకున్నారో దానిని మంచిగా సంభాళిస్తున్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. 

హరిద్వార్‌లో సాధు సమ్మేళనం జరగబోతుంది, మీ ప్రేరణలు ఇస్తారా:- ఎప్పుడైనా అటువంటి ధార్మిక స్థలానికి వెళితే వారిపట్ల శుభభావనను పెట్టి వారి మహిమను కూడా చెయ్యాలి, వీరు మనల్ని గౌరవిస్తున్నారని వారికి అనిపించాలి. బాగుంది. 

రమేష్ అన్నయ్య చాలామంది స్మృతిని అందించారు:- అందరికీ బాప్ దాదా స్మృతిని అందించారని చెప్పండి. 

గుజరాత్ లో సరళ అక్కయ్య అమృత మహోత్సవం చాలా గొప్పగా జరిగింది:- మంచిది. జన్మించినప్పటి నుండి వరదానిగా ఉన్నారు. ఇప్పుడు వరదానమైతే మీ మెడలో హారమయింది కావున ఎలా అయితే నిమిత్తమై నడుచుకుంటున్నారో అలాగే ఇతరులను కూడా ముందుకు నడిపిస్తూ ఉండండి, నడిపిస్తూ ఉండండి, నడిపిస్తూ ఉండండి. 

అమర్ అక్కయ్యతో:- వీరు కూడా చాలా మంచిగా తోడుగా ఉన్నారు. బాగుంది, ఇద్దరూ మంచిగా ఉన్నారు.

అచ్చా ఒక్కొక్కరికీ బాప్ దాదా విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. స్టేజి పైకి వస్తే గందరగోళం అయిపోతుంది కానీ బాప్ దాదా దూరంనుండే ఒక్కొక్కరికీ దృష్టిని మరియు ప్రేమను ఇస్తున్నారు.

(బాబా, మీరు వచ్చే సీజన్ లో వస్తారు కదా)

సంగమయుగము కలిసి ఉండే యుగము, కలిసి నడిచే మరియు కలిసి రాజ్యం చేసే యుగము. బాబా సాకారంలో తోడుగా లేకపోయినా కానీ (శివబాబా సత్యయుగ రాజ్యంలో కలిసి ఉండరు) కానీ మీ రాజ్యం కొరకు ప్రేరణలు ఇస్తూ ఉంటారు. (రథాన్ని మంచిగా పెట్టండి) రథాన్ని మంచిగా ఉంచుతాము. అచ్ఛా. 

రుక్మిణి అక్కయ్య దాదీ నిర్మలశాంతగారి స్మృతిని అందించారు, ఈరోజు దాదీగారి పుణ్య స్మృతిదివసము:- ఎక్కడ ఉన్నా, వారు సంతోషంగా ఉన్నారు, మీరు కూడా సంతోషంగా ఉండండి. (బాబా, పాట్నా సేవకు వెళ్తున్నాము) మంచిది, ముందుకు వెళ్తూ ఉండండి.

“ద ఫ్యూచర్ ఆఫ్ పావర్ కార్యక్రమం భారతదేశంలోని 35 పట్టణాలలో జరిగింది, ఈ సందర్భంగా చాలా సుందరమైన కేక్ తయారు చేయడం జరిగింది, దానిని బాప్ దాదా, దాదీలు మరియు పెద్దన్నయ్యలు కట్ చేసారు.”

Comments