14-10-2015 అవ్యక్త మురళి

 14-10-2015         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“ఏ పిల్లలైతే బాబా స్మృతిలో ఉంటారో వారు బాప్ దాదా హృదయంలో ఇమిడి ఉంటారు, మన సత్యయుగ రాజ్యం ఇప్పుడిక వచ్చేస్తుంది అన్న సంతోషం అందరి హృదయాలలో ఉంది. అందరూ ఇటువంటి యుగాన్ని తీసుకురావడంలో బిజీగా ఉన్నారు"  

* స్నేహి పిల్లలందరి ప్రియస్మృతులు బాప్ దాదా వరకు చేరుకుంటున్నాయి. అందరి హృదయాలు నా బాబా అని పలుకుతున్నాయి, మరి బాప్ దాదా ఏమని అంటున్నారు? నా పిల్లలు. 

* ఈ మిలనము ఎంత విలువైనది! ప్రతి ఒక్కరి హృదయంలో మరియు బాప్ దాదా హృదయంలో ఇదే వస్తుంది - వాహ్ నా పిల్లలూ వాహ్!

* పిల్లల హృదయాలలో ఏమని వస్తుంది? వాహ్ బాబా వాహ్! ఈ మిలనము కూడా ఎంత ప్రియమైనది. అందరి హృదయాలలో నా బాబా అన్న మాటే ఇమిడి ఉంది. మరి బాబా హృదయంలో ఏముంది? నా పిల్లలు. 

* పిల్లలు ఒక్కొక్కరూ బాబాకు కనుపాపల వంటివారు కనుక మీరంతా పరస్పరంలో కనుపాపలు అని టైటిల్ ఇచ్చుకుంటారు. ఎక్కడ ఉన్నా కానీ స్మృతి చేసే పిల్లల నయనాలలో బాబా నిండి ఉంటారు. బాబా హృదయంలో పిల్లలందరూ నిండి ఉన్నారు, స్మృతిలో ఎవరైతే ఉన్నారో వారు ఇమిడి ఉన్నారు. 

* బాబా కూడా పిల్లలు లేనిదే ఉండలేరు. పిల్లలు కూడా బాబాను సమ్ముఖంలో కలుసుకుని చాలా     చాలా అనుభవం చేసుకుంటారు. 

* ఇప్పుడు ఎలాగైతే పిల్లలైన మీ అందరి హృదయాలలో బాబా నిండి ఉన్నారో అలాగే అందరి హృదయాలలోకి బాబా రావాలి, ఈ పురుషార్థం పిల్లలు చేస్తున్నారు కూడా. పిల్లల పురుషార్థాన్ని చూసి బాబా కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ బాబా ఉంటారో అక్కడ మరే ఇతర విషయాలు రాలేవు. 

* ఇప్పుడు సత్యయుగాన్ని తీసుకువచ్చే ఆధారము పిల్లలైన మీ మీదే ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ సేవలోనే ఉన్నారు. 

* పిల్లల పురుషార్థాన్ని కూడా బాప్ దాదా చెక్ చేస్తారు. మన యుగం చాలా త్వరగా రావాలి అన్న ధునిలోనే మెజారిటీవారు ఉన్నారు. 

* అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంతోషంగా ఉంటారు! ఒక అవగాహనతో తండ్రి పిల్లల మిలనము జరిగేది ఈ సమయంలోనే. ఈ సమయం ఎంతో విలువైనది, మాకు రాజ్య భాగ్యం లభిస్తుంది అని గుర్తిస్తున్నారు. మేము ఒకప్పుడు ఎలా         ఉన్నాము, మళ్ళీ ఎలా అవ్వనున్నాము! నషా ఉంది, సంతోషం ఉంది. మనమే ఒకప్పుడు అలా ఉండేవారిమి మరియు మనమే అవ్వబోతున్నాము. 

* ఇప్పుడిక దుఃఖంలో ఉండటం, ఏడవటం చెయ్యాల్సిన అవసరం లేదు. సంతోషపు రోజులు వచ్చేస్తున్నాయి, మన రాజ్యం వచ్చేసింది, మన రాజ్యం... నషా ఎంత ఉంది! 

Comments