14-02-2014 అవ్యక్త మురళి

  14-02-2014         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

"పరమాత్మ ప్రేమకు పాత్రులైన పిల్లలు ప్రేమను తీసుకుంటూ, ఇస్తూ ఫాలో ఫాదర్ చేసి స్వయాన్ని కూడా నిర్విఘ్నులుగా చేసుకోండి మరియు మీ సమీప సహచరులను కూడా నిర్విఘ్నంగా చెయ్యండి"

ఈరోజు ప్రేమ సాగరుడు నలువైపుల ఉన్న పిల్లలందరికీ చాలా చాలా చాలా ప్రేమను ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ పూర్తి కల్పంలో ఇప్పుడు సంగమ సమయంలోనే ప్రాప్తిస్తుంది. ప్రపంచంవారు ఈ రోజును ప్రేమ రోజుగా చెప్తారు కానీ పిల్లలైన మీకు మాత్రం సంగమయుగంలోని ప్రతి రోజూ బాబా ప్రేమను పొందే రోజు. ఈనాటి స్మృతిచిహ్నం అనుసారంగా బాప్ దాదా ఎదురుగా పిల్లలైన మీరు ఉన్నారు కానీ బాప్ దాదా హృదయంలో నలువైపుల ఉన్న పిల్లలు, విదేశాలవారు కావచ్చు, గ్రామంలోని వారు కావచ్చు, కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా హృదయానికి ప్రియమైనవారు. నిజానికి, ఈ సంగమ యుగమంతా పరమాత్మ ప్రేమకు మీరు పాత్రులు కానీ ఈరోజు విశేషంగా ప్రపంచం వారి అనుసారంగా ప్రేమ రోజు కావున బాప్ దాదా కూడా నలువైపుల ఉన్న పిల్లలందరికీ అనంతమైన ప్రేమను, హృదయపూర్వక ప్రేమను, సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగిరేందుకు ప్రేమను, ప్రేమకు పాత్రులైన పిల్లలకు, పిల్లలందరినీ ఎదురుగా ఇమర్జ్ చేసుకుని ఇస్తున్నారు. మీరైతే ఎదురుగా ఉన్నారు సాకారంలో, కానీ బాప్ దాదా ఎదురుగా నలువైపుల ఉన్న పిల్లలు, ప్రేమకు పాత్రులైన పిల్లలు ప్రేమను ఇస్తున్నారు మరియు ప్రేమను తీసుకుంటున్నారు. ఈ రోజును జరుపుకునేందుకు కారణాన్ని చెప్తారు కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ సంగమంలోని ప్రతి సమయము పరమాత్మ ప్రేమకు పాత్రులు. ఈ ప్రేమకు పాత్రులైన ఆత్మలు బాబాకు అతి ప్రియమైనవారు, బాబాకు అతి గారాల పిల్లలు. ఈ పరమాత్మ ప్రేమ సంగమయుగంలోని ఒక్క జన్మలో మాత్రమే లభిస్తుంది. ఈ ప్రేమ అనేక జన్మల దుఃఖమును, బాధను సమాప్తం చేసి సదా సంతోషమనే ఔషధమును ఇచ్చేది. పిల్లలు ప్రతి ఒక్కరూ పరమాత్మ ప్రేమకు అధికారి ఆత్మలు. ఈరోజు బాప్ దాదా పిల్లలందరి నుండి హృదయపూర్వక ప్రేమను పొందుతున్నారు మరియు ఇస్తున్నారు కూడా. మీరందరూ కూడా ప్రేమ స్వరూప ఆత్మలై మీ స్వరూపాన్ని చూపిస్తున్నారు. పిల్లలందరి నయనాలలో, మస్తకంలో పరమాత్మ ప్రేమ ఇమిడి ఉంది. ఇప్పుడు మీరందరూ ఇతర సోదరసోదరీలను పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయ్యేందుకు ఉత్సాహపరచండి.

బాబా సమానంగా అవ్వాలన్న ఉల్లాస-ఉత్సాహాలు పిల్లలందరిలో ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఫాలో ఫాదర్ చేసేవారు కదా! ఎలా అయితే బాబాకు పిల్లలందరి పట్ల, పురుషార్థంలో నంబరువారీగా ఉన్నాకానీ బాబా ప్రేమ సదా పిల్లలందరి పట్ల ఉంటుంది. నలువైపుల ఉన్న పిల్లలందరికీ అమృతవేళ బాప్ దాదా విశేషంగా ప్రియస్మృతులను మరియు వరదానాలను ఇస్తారు. ప్రభు పాత్రులైన ఇటువంటి పిల్లల అదృష్టం ఇది, ఇప్పుడు బాప్ దాదాకు మరొక సంకల్పం ఉంది, వినిపించమంటారా? వినిపించమంటారా, చెయ్యాల్సి ఉంటుంది. చేసేవారు చేతులెత్తండి. ధైర్యమైతే చాలా బాగా ఉంది, బాప్ దాదా సంతోషిస్తున్నారు, పిల్లల ధైర్యము తండ్రి సహకారము కూడా ఉంది. ఇప్పుడు ఈ అద్భుతం చేసి చూపించండి - పిల్లలందరూ నిర్విఘ్నంగా అయ్యి బాబా సమానంగా అవ్వాలి. లక్ష్యమైతే అందరికీ ఉంది కానీ మధ్య మధ్యలో ఏదో ఒక విఘ్నము కొంచెం ఢీలాగా కూడా చేసేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకుని నిర్విఘ్నంగా, మనసా, వాచ, సంబంధ సంపర్కంలో నిర్విఘ్నంగా ఉంటూ సదా బాబా సమానంగా అయ్యి ఇతరులను కూడా ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువచ్చి వారికి సహయోగులుగా అయ్యి వారిని నిర్విఘ్నంగా చెయ్యాలని బాబా ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ సేవా స్థానాన్ని నిర్విఘ్నంగా చేసి అందరి ఆశీర్వాదాలను తీసుకోండి. ప్రతి సేవాకేంద్రము లేక ప్రతి ఒక్కరూ ఎక్కడైతే ఉంటున్నారో, ఇంట్లో కావచ్చు, సెంటరులో కావచ్చు, “నేను నిర్విఘ్నంగా అవుతాను మరియు తోటివారిని నిర్విఘ్నంగా చేసే సేవను చేస్తాను” అన్న దృఢ సంకల్పం చెయ్యండి. కనీసం ప్రతి సెంటరులో తమ తోటివారికి సహయోగిగా అయ్యి నిర్విఘ్నులుగా అయ్యే సేవను చేసి సఫలురుగా అవ్వండి. బాప్ దాదా ఇప్పుడు, సేవాకేంద్రము కావచ్చు, లేక స్వయం ఎక్కడైనా ఉండవచ్చు, స్వయాన్ని నిర్విఘ్నంగా, సంకల్పమాత్రంలో కూడా వ్యర్థం సమాప్తం, ఇలా అవ్వండి మరియు తయారు చెయ్యండి, ఇది వీలవుతుందా?

మరి ఈరోజు నుండి చూడండి, అందరూ చేతులెత్తుతున్నారు. వెనుక ఉన్నవారు చేయి ఊపండి. అచ్చా, మరి ఈరోజు నుండి స్వయాన్ని నిర్విఘ్నంగా మరియు ఎక్కడున్నా, ఆ స్థానాన్ని, సహచరులను నిర్విఘ్నంగా చెయ్యండి - ఇప్పటి నుండి ఈ దృఢ సంకల్పం చేస్తున్నారా? మీ తోటివారిని కూడా చెయ్యగలరా? ఇందులో చేతులెత్తండి. ఆలోచిస్తూ లేపుతున్నారు. మీరు స్వయాన్ని విశ్వ కళ్యాణకారులుగా చెప్పుకుంటున్నప్పుడు విశ్వ పరివర్తనకు ముందుగా మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ స్థానాన్ని మీరు నిర్విఘ్నంగా చెయ్యాలి కదా! లక్ష్యం పెట్టుకోండి, ఎలా అయితే మీరు స్వయాన్ని నిర్విఘ్నంగా చేసుకున్నారో, సంకల్పంలో సఫలత ఉన్నదో, అలాగే మీ తోటివారిని, వాతావరణాన్ని కూడా తయారు చెయ్యండి, అప్పుడే మీ రాజ్యము వస్తుంది కదా! మరి ఇప్పుడు, ఈ రోజు బాప్ దాదా ఇదే పనిని ఇస్తున్నారు, స్వయమైతే తయారయ్యారు, ఇందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు కానీ మీ తోటివారిని కూడా నిర్విఘ్నంగా చెయ్యండి.  ఎందుకంటే మీ రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలి కదా, రాజ్యంలో అందరూ ఉంటారు కదా! కావున సంకల్పం చెయ్యండి, మీ తోటివారి నుండి ఎంత అవసరమైతే అంత సహాయాన్ని తీసుకోండి. సహాయాన్ని తీసుకుని కూడా తయారుచెయ్యాలి. ఈ సంకల్పం చెయ్యగలరా? చెయ్యగలమని అనుకుంటే చేతులెత్తండి. చేతులైతే అందరూ ఎత్తుతున్నారా? చాలా మంచిది. ధైర్యముంది, ఎవరెలా ఉన్నా కానీ మీ వాతావరణం ఎంత పవర్ ఫుల్ గా ఉండాలంటే మీ వాతావరణం, అందులోని ప్రతి ఒక్కరూ నిర్విఘ్నంగా ఉండాలి. ఇది వీలవుతుందా? వీలవుతుందా? వీలవుతుందని అనుకునేవారు చేతులెత్తండి. వెనకున్నవారు చేతులెత్తుతున్నారా, ఇలా ఇలా అనండి. చేతులెత్తి సంతోషపెట్టారు, అభినందనలు. మంచిది, సంకల్పమైతే చేసారు, చెయ్యాలి. ఎందుకని? మీతో ఉండేవారిని, మీ సంబంధంలో ఉన్నవారిని మీ తోటివారిగా చేసుకోవాలి కదా! నంబరువారీగా అవుతారు, ఇది బాప్ దాదాకు కూడా తెలుసు, కానీ తేడా అయితే కనిపిస్తుంది కదా! మరి ఈరోజు నుండి విశేష సంకల్పాన్ని ఉత్పన్నం చెయ్యండి - మా కనెక్షన్లోని వారిని, సమీపంగా ఉన్నవారిని కూడా నిర్విఘ్నంగా చెయ్యాలి. చెయ్యగలరా? చెయ్యగలరా? చేస్తారా? మొదటి లైనువారు చేతులెత్తడం లేదు. మీ రాజ్యాన్ని తీసుకురావాలి కదా. మరి రాజ్యంలో తోటివారిని కూడా తీసుకురావాలి కదా, వారిని వదిలి పెట్టేస్తారా? ఒకరికొకరు సహకరించుకుంటూ లక్ష్యాన్ని పెట్టుకున్నా కూడా మీ ధైర్యము తండ్రి సహాయము ఉంటాయి. ఇది వీలవుతుందా? వీలవుతుంది అని అనుకుంటే చేతులెత్తండి. చేతులైతే అందరూ బాగా ఎత్తుతారు. చేతులెత్తి బాప్ దాదాను సంతోషపెట్టేస్తారు.

మరి బాప్ దాదా సమయం ఇస్తున్నారు, మీ కనెక్షన్లోకి వచ్చేవారిని మీ సమానమైన తోటివారిగా చెయ్యండి. నలువైపుల ఉన్న బ్రాహ్మణులు సదా నిర్విఘ్నము, ఇది వీలవుతుందా లేక కష్టమా? వీలవుతుంది అని అనుకునేవారు చేతులెత్తండి. అచ్చా. ఈ మొదటి లైనువారు, వీలవుతుందా? మరి వచ్చే సీజన్ వరకు సమయం ఇవ్వమంటారా లేక ఇప్పుడేనా? ఇప్పుడు వీలవుతుందా? మీ తోటివారిని మీ సమానంగా చెయ్యాలి. నంబరువారీగా ఉంటారు కానీ విఘ్న రూపంగా అవ్వకుండా ఉండే విధంగా తయారు చెయ్యండి. మొదటి లైను వారు చెప్పండి, వీలవుతుందా? ముందున్నవారు? అచ్చా, ధైర్యము బాగుంది. మరి తరువాతి సీజన్లో వచ్చినప్పుడు ఈ శుభవార్త వింటాము. మేము పురుషార్ధం చేసి, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కానీ తోటివారిని, సమీపంగా ఉన్నవారిని నిర్విఘ్నంగా చేస్తాము అని అనుకునేవారు చేతులెత్తండి. చేతులైతే చాలా బాగా ఎత్తుతారు, శభాష్, శభాష్. ఇప్పుడు బాప్ దాదా ప్రతి నెల రిజల్టును చూస్తారు. కనీసం మీకు సమీపంగా ఉన్న మీ తోటివారినైతే మీ సమానంగా తయారు చెయ్యాలి కదా! తయారు చెయ్యగలరా? తయారు చెయ్యగలరా? అచ్చా, ఇందులో చేతులెత్తండి. చేతులైతే అందరూ ఎత్తుతున్నారు. ఇలా సహయోగిగా అయ్యేవారికి బాప్ దాదా అభినందనలు ఇస్తున్నారు, మళ్ళీ వచ్చినప్పుడు అయ్యిందా లేదా అని రిజల్టు చూస్తారు. వీలవుతుందా? వీలవుతుందా? మొదటి లైనువారు చేతులెత్తడం లేదు! ఎందుకంటే అందరూ నిమిత్తమైన వారు కదా, నిమిత్తమైన వారు శ్రద్ధ వహించాలి. అచ్ఛా, ధైర్యము మీది, సహాయము తండ్రిది. 

మరిప్పుడు చేసి చూపిస్తారు కదా బాబాకు! బాప్ దాదా చూస్తారు. ఇలా ప్రాక్టికల్ గా ఎవరైతే తమ తోటివారిని నిర్విఘ్నంగా చేస్తారో వారికి బాప్ దాదా బహుమతిని ఇస్తారు. కానీ మీరు చెప్పాక కొంచెం ఎన్ క్వయిరీ అయితే చేస్తాము కదా. ఇందుకు తయారా? మొదటి లైనువారు చెప్పండి. మంచిది. ధైర్యమున్న వారికి తండ్రి సహాయం మరింత లభిస్తూ ఉంటుంది. అచ్ఛా.

ఈరోజు ప్రేమ రోజు. మరి ప్రేమలో అన్నీ సహజంగానే అయిపోతూ ఉంటాయి. ఎలా అయితే మీరందరూ ధైర్యమును ఉంచారో అలాగే బాబా కూడా సహాయం చేస్తారు, తోటివారు కూడా సహాయం చేస్తారు అప్పుడు ప్రాక్టికల్ గా కనిపిస్తుంది. పరివర్తన అయితే జరగాల్సిందే కదా. చిన్న చిన్న విషయాలను మీరే పరివర్తన చేసేసుకోండి. చెప్పాల్సిన అవసరం లేదు. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని తెలుసుకోగలిగేంత తెలివైనవారే కదా! మరి ఏది చెయ్యకూడదో అది చెయ్యకండి, అంతే.

పిల్లలు విశ్వ పరివర్తకులుగా అవ్వడానికి ప్రతి ఒక్కరినీ నిర్విఘ్నంగా చెయ్యాలి, తోటివారిని చెయ్యాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. ఎందుకంటే మీరు విశ్వ పరివర్తకులు, మరి ఒకరిద్దరు సహచరులను మార్చడం ఏమంత కష్టము! కావున ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించండి, మేము మా వాతావరణాన్ని మరియు తోటివారిని నిర్విఘ్నంగా చెయ్యాల్సిందే. విశ్వాన్ని తయారు చేసేవారు మీరు, బాప్ దాదా చిన్న పనినే ఇస్తున్నారు. సంకల్పం చేస్తే చేతులెత్తండి. సంకల్పం చేసేవారు (అందరూ చేతులెత్తారు) చేతులెత్తి సంతోషపెట్టారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఇప్పుడిక మరోసారి వచ్చేసరికి శుభవార్త వింటాము కదా. వింటామా, వింటామా? ఇందులో చేతులెత్తండి. మీకు సమీపంగా ఉన్నవారిని, తోటివారిని నిర్విఘ్నంగా చెయ్యండి. చిన్న పనినే ఇస్తున్నాము, అందరినీ అని చెప్పడం లేదు. అచ్ఛా! 

బాప్ దాదాకు మజా వస్తుంది, పిల్లలు ధైర్యమును ఉంచినప్పుడు బాప్ దాదాకు చాలా సంతోషం కలుగుతుంది. పిల్లల ధైర్యము తండ్రి సహాయము. తోడుగా ఉండనే ఉన్నారు. మరి వచ్చేసారికి ఏ రిజల్టును చూస్తాము? తోటివారు, సమీపంగా ఉన్నవారిలో పరివర్తన. అంతే కదా! ఇది చేస్తారు కదా? మీ తోటివారినైతే మీ సమానంగా చేస్తారు కదా! ఇందులో చేతులెత్తండి. చేతులెత్తడంలో అయితే చాలా బాగున్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు, చేయి ఎత్తడంలోనైనా ధైర్యమును ఉంచారు. చెయ్యడంలో ఒకరికొకరు తోడుగా ఉండండి. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవారు చేతులెత్తండి. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోనివారు, సదా సంతోషము? సదా సంతోషము? వెనుక ఉన్నవారు సదా సంతోషంగా ఉన్నారా? చేతులు పొడవుగా ఎత్తండి. అచ్ఛా. సదా సంతోషంగా ఉండండి మరియు సదా సంతోషపరచండి. సమ్మతమేనా! తయారు చెయ్యాల్సిందే ఎందుకంటే మీ రాజ్యం స్థాపన కానుంది, అవ్వాలంటే మీ తోటివారిని తోడుగా తీసుకు వెళ్ళాలి కదా! అచ్చా.

ఈస్టర్న్ జోన్, తమిళనాడు, నేపాల్, అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సా నుండి 17 వేల మంది వచ్చారు:- (అందరినీ నంబరువారీగా లేపారు) ప్రతి స్థానంలోని జోన్, సబ్ జోన్ ఇన్ ఛార్జ్ అక్కయ్యలు లేచారు, మీకు సేవ కోసం ఏ ఏరియా అయితే లభించిందో దానిని నిర్విఘ్నంగా చెయ్యాల్సిందే అని లక్ష్యం పెట్టుకోండి. మీరు సంకల్పం చెయ్యండి ఎందుకంటే రాజధాని స్థాపన చెయ్యాలి. అర్థకల్పం రాజధాని ఉంటుంది. మరి ఇందుకోసం కొంచెం తిరిగి కష్టపడండి. హెడ్ ఎవరైతే ఉన్నారో వారు అన్ని స్థానాలకు వెళ్లి సమస్యలను పరిష్కరించండి. సమస్యలైతే ఒకే రకంగా ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ తమ ఏరియాలో సమస్యను సమాప్తం చేసి సఫలతామూర్తులుగా అవ్వండి. సరేనా. చేతులెత్తండి. అచ్చా. ఈసారి వచ్చినప్పుడు మీ ఏరియాలోని విఘ్నాలు సమాప్తమయ్యాయా అని అడుగుతాము. అడగమంటారా? ఎందుకంటే అవ్వాల్సింది మీరే కదా, ఎవరైతే కూర్చుని ఉన్నారో వారే కదా, అవ్వాలి మరియు తయారు చెయ్యాలి. రాజధాని స్థాపన అయితే ఇక్కడి నుండే సంస్కారాలను నింపుకుంటారు కదా. ఏమీ ఫర్వాలేదు, బాప్ దాదా కూడా సహయోగిగా అవుతారు. ఏదైనా సమస్య ఉంటే యజ్ఞానికి వ్రాసి పంపండి, మంచిగా అయిపోతుంది, ఎటువంటి సహాయం ఇవ్వగలరో అది అందుతుంది. నిర్విఘ్నంగా అయితే అవ్వవలసిందే. అప్పుడే కదా మీ రాజ్యము స్థాపన అవుతుంది. చాలా మంచిది. 

డబుల్ విదేశీ సోదరసోదరీలు 400 మంది వచ్చారు:- వీరు డబుల్ విదేశీయులు, చాలా మంచిది. డబుల్ విదేశీయులను చూసి బాప్ దాదా సంతోషిస్తారు, వావ్ డబుల్ విదేశీయులు వాహ్! ఎందుకంటే మీరు బాబాను విశ్వ పితగా ప్రసిద్ది చేసారు. భారత కళ్యాణి కాదు, విశ్వ కళ్యాణి. ఒకప్పుడు భారత కళ్యాణిగా ఉన్నారు కానీ ఇప్పుడు నలువైపుల సేవ పెరిగిన కారణంగా ప్రాక్టికల్ గా విశ్వ కళ్యాణిగా అయ్యారు. మరి మీకు చాలా-చాలా చాలా ప్రియస్మృతులు మరియు చాలా చాలా అద్భుతం చేసి ముందుకు వెళ్ళేవారిని బాప్ దాదా చూస్తున్నారు. మంచి పురుషార్థం చేస్తున్నారు. ప్రతి స్థానం వేర్వేరుగా ఉన్నప్పటికీ భారతదేశం కాక విశ్వపిత అని అనిపించుకునేందుకు నిమితులయ్యారు. మంచిది. డబుల్ విదేశీయులకు బాప్ దాదా ఈ రోజు డబుల్ ప్రేమను ఇస్తున్నారు. దూరంగా ఉన్నప్పటికీ, దూరదేశంవారు కానీ మనసు దగ్గరగా ఉంది. ఇలానే కదా. చేతులెత్తండి. చాలా మంచిది. బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు ముందుకు వెళ్తున్నారు. విదేశీయులు అక్కడ అభివృద్ధి చెందుతున్నారు. ఇందుకు అభినందనలు. అచ్ఛా. ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. నిమిత్తమైన జయంతి ఎక్కడ? వీరు చాలా తిరుగుతారు. సేవ బాగా చేస్తారు. మీ తోటివారు కూడా మంచిగా ఉన్నారు. బాప్ దాదా డబుల్ విదేశీయులకు డబుల్ ప్రియస్మృతులను ఇస్తున్నారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా. 

నలువైపుల ఉన్న పిల్లలకు, దేశంవారు కావచ్చు, విదేశం వారు కావచ్చు. పిల్లలందరికీ బాప్ దాదా హృదయపూర్వక ప్రియస్మృతులను ఇస్తున్నారు, మరియు శుభవార్త వినిపిస్తున్నారు - నలువైపుల దేశంలోకానీ విదేశాలలో కానీ సేవపై మంచి అటెన్షన్ ఉంది, వృద్ధి ఉంది మరియు ఇక ముందు కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. అభినందనలు, అభినందనలు, అభినందనలు. 

మున్నీ అక్కయ్యతో:- అందరూ సంతోషంగా ఉన్నారు, సంతుష్టంగా ఉన్నారు, సేవ చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. 

దాదీ జానకితో: - (బాప్ దాదాకు గులాబీ పూలమాలను వేసారు) ఈ హారము మీ అందరి ప్రేమకు గుర్తు. వీరు నిమిత్తంగా వేస్తున్నారు కానీ మీ అందరి ప్రేమ బాప్ దాదాకు చేరుకుంటుంది. అందరి ప్రేమ బాప్ దాదాకు చేరుకుంటుంది. అందర్నీ ముందుకు తీసుకురాలేము కనుక దూరం నుండే బాప్ దాదా వాహ్ పిల్లలూ వాహ్ అంటున్నారు.

మోహిని అక్కయ్యతో:- బాగున్నారు. మంచిగా అయిపొయ్యారు. ఇప్పుడిక మంచిగా ఉంటారు. (

(రతన్ మోహినీ దాదీకు గుల్బర్గా యూనివర్శిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ లభించనుంది) మంచిది. 

డా. నిర్మల దీదీతో:- మంచిగా సంభాళిస్తున్నారు, స్థానం కూడా మంచిగా జరుగుతుంది. అభినందనలు. 

హంసా అక్కయ్యతో :- ఎవరైతే చేస్తారో వారికి లోపల లోపలే పుణ్య ఖాతా అనుభవం అవుతుంది. అవుతుందా? మీరు దాదీను సంభాళిస్తున్నారు, అందులోనే అన్నీ వచ్చేస్తాయి, ఒక్క దాదీ సేవనే చెయ్యడం లేదు, అనేకుల సేవను చేస్తున్నారు. 

ముగ్గురు అన్నయ్యలు బాప్ దాదాకు పుష్పగుచ్చాలను ఇచ్చారు:- బాగుంది, మంచిది. అందరూ నిర్విఘ్నంగా ఉన్నారు. అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయి. ఎవరి విషయం ఉందో అది కూడా మంచిగా అవుతుంది. అవుతుంది కదా! అభినందనలు. 

బృజ్ మోహన్ అన్నయ్యతో:- మీరు టాపిక్ ను మార్చలేదా? (మార్చాము, బాప్ దాదాకు చూపించారు) దీనితో అర్థమవుతుందా? ముఖ్యంగా గీత గురించి కదా, అది కొంచెం ఇందులో దాగిపోయింది. ఇంకా ఆలోచించండి. ఆలోచిస్తే మంచిగా అయిపోతుంది. 

హరిద్వార్ లో సాధువుల సమ్మేళనం చేస్తున్నారు:- మంచిది, వారిని మేల్కొల్పండి. 

రమేష్ అన్నయ్యతో:- కార్య వ్యవహారాలు చక్కగా నడుస్తున్నాయి కదా! 

డా. బనారసి అన్నయ్యతో - సేవ బాగా చేస్తున్నారు, అభినందనలు, అలసిపోరు. మంచిది. మీకు వరదానం ఉంది.

Comments