12-10-2014 అవ్యక్త మురళి

  12-10-2014         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“దీపావళి అంటే దిలారాముడు మరియు దీపములకు స్మృతిచిహ్నము, పిల్లలందరి హృదయాలలో దిలారాముడు నిండి ఉన్నాడు" 

మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన దీపాలందరికీ తండ్రి అయిన దిలారాముడు (హృదయాభిరాముడు), దీపరాజు చాలా చాలా అభినందనలు, హృదయపూర్వక స్నేహమును ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయములో బాప్ దాదా ఉన్నారు. దీపరాజు మీ హృదయంలో ఉన్నారు కదా! చేతులెత్తండి! అందరి హృదయాలు చెప్పకనే చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? దీపరాజుకు మేము దీపపు పిల్లలము, సదా దీపము వెలుగుతూ ఉంటుంది. ఇలాగే చెప్తున్నారు కదా! ఇలాగే అయితే చేతులెత్తండి. వాహ్ దీపరాజు యొక్క దీపాలూ వాహ్! బాప్ దాదాకు తన దీపపు పిల్లలను, ప్రతి ఒక్కరినీ చూసి చూసి చాలా సంతోషంగా ఉంది మరియు హృదయము పదే పదే వాహ్ దీపపు పిల్లలూ వాహ్! అంటుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ లేదా ప్రతి దీపము బాప్ దాదాకు అతి ప్రియము. అతి ప్రియమైనవారు, ఎందుకని? హృదయంలో ఇంకేమైనా ఉందా! కేవలం దిలారాముడు మాత్రమే ఉన్నారు, ప్రతి ఒక్కరి హృదయంలో దిలారాముడు మాత్రమే కనిపిస్తూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. దిలారాముడు అందరి హృదయాలలో వాసముండటము దీపావళిని గుర్తుకు తెప్పిస్తుంది. పేరే ఉంది - దిలారాముడు మరియు దీపములు. ప్రతి ఒక్కరి హృదయంలో 'నా బాబా' నిండి ఉన్నారు. ఎక్కడ 'నాది' అంటారో, అక్కడ 'నాది' అన్నదాన్ని మర్చిపోవడం తక్కువగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి హృదయంలో ఎవరున్నారు! నా బాబా. బాబా హృదయంలో ఎవరున్నారు? పిల్లలందరూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి బాబా ఏమని ఆలోచిస్తారు? వాహ్ పిల్లలూ వాహ్! నంబరువారీగా ఉన్నాకానీ బాబాకైతే తన పిల్లలందరూ వాహ్ వాహ్ పిల్లలే! పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో బాబా ఉన్నారు. మీ హృదయంలో ఎవరున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏమని చెప్తారు? “నా బాబా” ఎందుకంటే నాది అన్నదానిని మర్చిపోవడం కష్టము, గుర్తు చెయ్యడము సహజము. మర్చిపోవడము కష్టము. మెజారిటీ పిల్లల హృదయంలో బాప్ దాదా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. బాబా కూడా పిల్లలందరినీ చూసి వాహ్ పిల్లలూ వాహ్! అని అంటారు. ఈ సంబంధము సంగమయుగంలోనే ప్రత్యక్షంగా అనుభవమవుతుంది. అందరి హృదయాలలోకి చూస్తే ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? నా బాబా. బాప్ దాదా హృదయంలో ఎవరున్నారు? పిల్లలందరూ ఉన్నారు. బాబాకు ఎంతమంది పిల్లలున్నా కానీ అందరూ బాబా హృదయంలో ఉన్నారు. ఈ ఆత్మిక సంబంధాన్ని ఈ సంగమయుగంలోనే అనుభవం చేసుకోగలరు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఏమంటారు? నా బాబా. బాబా ఏమంటారు? పిల్లలు ప్రతి ఒక్కరూ నావారు. ఈ బంధాన్ని ప్రత్యక్ష రూపంలో ఇప్పుడు సంగమయుగంలోనే అనుభవం చేసుకుంటారు.

బాబా కూడా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి 'నా గారాల పిల్లలూ' అని అంటారు. పిల్లలు కూడా ఏమంటారు? మా ప్రియమైన బాబా. అందరూ సంతోషంగా ఉన్నారు కదా! సంతోషమనే ఔషధము సదా లభిస్తూ ఉంటుంది మరియు పిల్లలు కూడా తమ హృదయాలలో బాబా ఇచ్చిన వరదానాలను తోడుగా పెట్టుకుంటారు. ఈ సంగఠనలో బాబా తమ పిల్లలను ప్రత్యక్ష రూపంలో చూస్తున్నారు మరియు పిల్లలు బాబాను చూస్తున్నారు. బాబా అంటారు - వాహ్ పిల్లలూ! అని, పిల్లలు అంటారు - వాహ్ బాబా! అని, ప్రతి ఒక్కరి ముఖంలో ఏమి కనిపిస్తుంది? పరమాత్మ ప్రేమ. కనుక, పిల్లలందరూ బాబా ఇచ్చే అభినందనలతో సదా సహజంగా ఎగురుతూ ఉంటారు. ఎగిరే వారే కదా! చేతులెత్తండి. నడిచేవారు కాదు కదా, ఎగిరేవారే కదా! అందరూ ఎగిరేవారా లేక నడిచేవారా? ఎగురుతూ ఉంటారు ఎందుకంటే ఈ సమయమే ఎగిరే సమయము. అందరి హృదయాలలో వాహ్ బాబా వాహ్! అన్న పాట మ్రోగుతూ ఉంటుంది. అందరి హృదయాలలో ఎవరున్నారు? చెప్పండి. నా బాబా. మరి సదా నా బాబా అన్నది స్వరూపంలో అనుభవం అవుతుందా లేక పనిలో పడి మర్చిపోతున్నారా? నిజానికి చూస్తే, నాది అన్నది చిన్న వస్తువైనా కానీ దాన్ని మర్చిపోవడము కష్టము. నాదిగా చేసుకుంటే స్మృతి అమరమవుతుంది. మరి, ప్రతి ఒక్కరి హృదయం ఏమని అంటుంది? నా బాబా అంటుందా లేక బ్రహ్మకుమారీల బాబా అంటుందా? నా బాబా. బాప్ దాదా కూడా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు, నా పిల్లలు.

మరి ఈరోజు దీపమాల రోజు. బాప్ దాదా మరియు మీరందరూ కూడా దీపరాజు మరియు దీపములను చూస్తున్నారు. దీపరాజు ఒక్కొక్క దీపమును చూసి సంతోషిస్తున్నారు మరియు ఏ పాటను పాడుతున్నారు? వాహ్ పిల్లలూ వాహ్! వాహ్ పిల్లలే కదా! ఎవరైతే వాహ్ పిల్లలున్నారో వారు చప్పట్లు కొట్టండి. మరి ఈరోజు ప్రతి ఒక్కరి హృదయంలో, ఈ సమయంలో, ఎవరున్నారు? నా బాబా. అందరి ముఖాలు చిరునవ్వుతో ఉన్నాయి ఎందుకంటే వాహ్ బాబా వాహ్!

ఈరోజైతే సమ్ముఖంలో, పిల్లలూ బాబాను చూస్తున్నారు, బాబా కూడా పిల్లల్ని చూస్తున్నారు కానీ దూరంగా ఉన్నప్పటికీ బాబాను మీ హృదయంలో పెట్టుకున్నారు. బాబా మీ హృదయంలో ఉన్నారా? చేతులెత్తండి. అందరి హృదయాలలో బాబా ఉన్నారా? ఇంకెవరూ లేరు. బాబా హృదయంలో కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ ఉన్నారు. పిల్లలు లేకుండా బాబా ఉండలేరు, అలాగే పిల్లలు కూడా బాబా లేనిదే ఉండలేరు. సంగమయుగంలో లభించే ఈ తండ్రి మరియు పిల్లల మిలనము పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సంగమయుగంలో పదే పదే జరుగుతుంది కానీ ఒక్క సంగమ యుగంలోనే జరుగుతుంది మరియు జీవితం ఎంత సరళంగా ఉంది. ఎటువంటి హఠయోగ క్రియలు చెయ్యనవసరం లేదు, నా బాబా, అంతే. నాది అన్నదానిని మర్చిపోవడం కష్టము. బాబాను నా వారిగా చేసుకుంటే మర్చిపోయే శ్రమ సమాప్తమైపోతుంది. నాది అన్నది చిన్న వస్తువైనా ఎంతో గుర్తుంటుంది. బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైనవారు. అంతేకానీ, ఇంతమంది పిల్లలున్నారు కదా, బాబా నన్ను గుర్తు చేస్తారో లేదో అని అనుకోకండి. బాబా విశ్వానికే తండ్రి. అందులో కూడా ముఖ్య సంబంధంలో ఎవరు? పిల్లలైన మీరు. ఒక్కొక్కరూ ఎంత ప్రియమైనవారు. ప్రియమైన బాబా అని మీరంటారు, ప్రియాతి ప్రియమైన, మధురాతి మధురమైన పిల్లలూ అని బాబా అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ బాప్ దాదాకు హృదయపూర్వకంగా ప్రియమైనవారు.

మరి ఈరోజు కూడా హృదయపూర్వకంగా ప్రియమైన బాబాను కలుసుకోవడానికి ఎక్కడెక్కడి నుండి వచ్చారో చూడండి! దీపావళి జరుపుకుంటున్నారు. బాప్ దాదా అయితే చైతన్య దీపాలను చూసి సంతోషిస్తున్నారు వాహ్ పిల్లలూ వాహ్! వాహ్ వాహ్ పిల్లలే కదా? అవును అనుకుంటే చేతులెత్తండి. అందరూ ఉన్నారా? బాప్ దాదా హృదయంలో కూడా పిల్లలున్నారు. బాప్ దాదా హృదయంలో ఎవరు ఉండగలరు? అదైతే మీ అందరికీ తెలుసు. కానీ బాబా హృదయంలో పిల్లలు, పిల్లల హృదయంలో బాబా ఉన్నారు. ఈ సంగమ సంబంధం పూర్తి కల్పములో ఉండదు. ఇప్పుడుంది, ఇది కూడా ఈ జన్మ యొక్క భాగ్యము. మరి దీపావళి జరుపుకుంటున్నారు కదా! ప్రతి ఒక్క దీపము, దీపరాజుకు ప్రియమైనవారు. పిల్లలు తమ గురించి తాము ఏమనుకున్నా కానీ బాబాకు మాత్రం పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైనవారు. ప్రతి ఒక్కరి హృదయంలో ఎవరున్నారు? పిల్లల హృదయంలో బాబా, బాబా హృదయంలో పిల్లలు ఉన్నారు. 

డబుల్ విదేశీయులు 105 దేశాలనుండి 2000మంది వచ్చారు:- భారతదేశమైతే ఉండనే ఉంది, బాప్ దాదా వచ్చేదే భారతదేశములో. (బాబా ప్రేమ ఇంత లభిస్తుంది, మేము రిటర్న్ గా ఏమి చెయ్యాలి?) ఏమి చెయ్యాలన్నది పిల్లలకు తెలుసు. విదేశాల నుండి వచ్చిన వారందరూ లేవండి. అభినందనలు. (సింధీ సోదరసోదరీలు) తప్పక రండి. స్థాపన యొక్క స్థానము పేరు కదా. పిల్లలు సింధీ అయినా హిందీ అయినా కానీ పిల్లలందరూ మెజారిటీ సంతోషంగా ఉండటాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇది చూసి బాప్ దాదా చాలా సంతోషిస్తారు. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. విషయాలు జరుగుతూ ఉంటాయి కానీ ఆ విషయము మన సంతోషాన్ని ఎందుకు తీసుకెళ్ళాలి? సంతోషము అన్నది ప్రతి ఒక్కరి సొంత వస్తువు, అది ఎప్పుడూ వెళ్ళకూడదు. పరిస్థితులైతే వస్తాయి, అవి కూడా పేపర్లు కదా. ఏ పిల్లలైతే మంచి పురుషార్థీలో వారు పేపరులో పాస్ అవుతారు, వారికి పేపరు కష్టంగా అనిపించదు. రెడీగా ఉంటారు. ఇలా రెడీగా (సిద్ధంగా) ఉండేవారి లక్షణము - వారి ముఖములో సంతోషపు అల ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని విషయాలు జరిగినా కానీ, ఎందుకంటే డబుల్ సంబంధంలో ఉంటారు కదా, లౌకికం కూడా మరియు అలౌకికంలో కూడా, కానీ ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారు మున్ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు మరియు బాబా ఆ పిల్లలను చూసి, సూక్ష్మంగా, వారిపై హృదయపూర్వక ప్రేమను తప్పక కురిపిస్తారు. బాబా ప్రేమ నాతో ఉంది అని ఆ పిల్లలకు కూడా అనిపిస్తుంది. ఇటువంటి దిల్ ఖుష్ పిల్లలు చాలామంది ఉన్నారు మరియు సదా సంతోషంగా ఉంటారు. ఎవరైతే లేరో వారు కూడా సదా సంతోషంగా ఉండండి. 

యు.పి, పశ్చిమ నేపాల్ మరియు బనారస్ నుండి 10వేలమంది సోదరసోదరీలు వచ్చారు:- మంచిది. మంచిగా చేసారు, మంచిగా చేస్తున్నారు. మీరు ఈ సేవతో తృప్తిగా ఉన్నారు కదా. అభినందనలు. 

డబుల్ విదేశీ సెంటరువాసులు: - మంచిది. విదేశాలు కూడా మంచి ఉన్నతిని సాధించాయి. బాప్ దాదా సంతోషిస్తున్నారు. 

భారతదేశ టీచర్లు: - భారతవాసులు తక్కువేమీ కాదు. మంచిది, ఎవరు ఏ కార్యము చేస్తున్నారో అది మంచిది.

పిల్లలందరికీ హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా బాప్ దాదా ప్రియస్మృతులు తెలుపుతున్నారు. ఈ ప్రియస్మృతులైనా సదా ఉన్నట్లయితే ఎటువంటి విఘ్నాలూ రావు. విఘ్నముక్తులుగా అవుతారు. కేవలం నా బాబా. నాది అన్నదానిని ఎవ్వరూ మర్చిపోరు. నా బాబా మరియు బాబా వారసత్వాన్ని గుర్తుంచుకుంటే సదా సంతోషంగా ఉంటారు.

ఒక్కొక్కరితో బాప్ దాదా హృదయపూర్వకంగా కలుసుకుంటున్నారు. వెనుక ఉన్నవారిని కలవలేదని అనుకోకండి. కలుస్తున్నారు. బాప్ దాదా వద్ద పిల్లలు ప్రతి ఒక్కరూ సమీపంగా ఉంటారు.

ఇక్కడకు వచ్చినా రాకపోయినా కానీ బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలకు స్మృతిని ఇస్తున్నారు.

అందరి హృదయాలలో మధురమైన బాబా, మధురమైన ప్రియమైన వారు ఉన్నారు. కొందరు నోటితో చెప్తారు, కొందరు నోటితో చెప్పరు. కానీ అందరి హృదయాలలో ఉన్నారు. బాప్ దాదా కూడా వాహ్ పిల్లలూ వాహ్ అని అంటారు.

(మోహిని అక్కయ్య బృజ్ మోహన్ అన్నయ్య స్మృతిని తెలిపారు. వారి ఆరోగ్యం బాగలేని కారణంగా వారు ఈరోజు రాలేదు) వారికి ప్రత్యేకమైన స్మృతిని అందించండి. 

విదేశాల పెద్దక్కయ్యలతో:- నిర్విఘ్నంగా జరుగుతుంది కదా. మీరందరూ కూడా ప్రేమతో, మనస్పూర్తిగా సేవకు నిమిత్తంగా ఉన్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి అనుసారంగా ఏమి చెయ్యాలో అది చేస్తూ వచ్చారు. అభినందనలు. సఫలత అయితే మీ జన్మసిద్ధ అధికారము. బాగా జరుగుతుంది, బాగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరినీ బాబా చూస్తున్నారు, కృషి బాగా చేస్తున్నారు. విదేశాలనుండి వెలువడిన వారంతా మంచి రత్నాలు. కొద్దిమంది వెలువడ్డాకానీ మంచివారు వెలువడ్డారు. సిడ్నీవారికి ప్రియస్మృతులు ఇవ్వండి. అన్ని స్థానాలు మంచిగా ఉన్నాయి. బాప్ దాదాకు అందరి స్మృతి అందుతుంది. అందరి హృదయాలలో ఇప్పుడేముంది? బాగుంది, బాగా జరుగుతుంది మరియు బాగా జరిపిస్తున్నారు. ప్రోగ్రెస్(ఉన్నతి) ఉంది. 

దీపావళి అభినందనలు:- బాప్ దాదా తరఫున పిల్లలు ప్రతి ఒక్కరికీ, ఎదురుగా ఉన్నవారు కావచ్చు, సెంటరులో ఉండచ్చు, దేశంవారు లేక విదేశాలవారు కావచ్చు, అందరికీ, ప్రతి ఒక్కరికీ బాప్ దాదా దీపావళి అభినందనలు తెలుపుతున్నారు. సదా ఇలాగే బాప్ దాదా ద్వారా సఫలత సితారల సర్టిఫికేట్ ను తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ సమయం సఫలతాముర్తులుగా ఉన్నారు కదా! కనుక, సదా సఫలతామూర్తులుగా ఉండి సదా ఇతరులకు సంతోషాల అభినందనలను ఇస్తూ ఉండండి మరియు తీసుకుంటూ ఉండండి. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ దీపమాల జరుపుకున్నారు అంటే సదా దీపము సమానంగా మెరుస్తూ ఉంటారు. ఏ విషయమూ దీపాల దీపమాలను విసిగించదు. సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాలను పంచండి, దీపావళి యొక్క ఈ స్లోగన్ ను సదా గుర్తుంచుకోండి.

Comments