12-02-2016 అవ్యక్త మురళి

  12-02-2016         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“సైన్సు సాధనాలు మిలనానికి దారిని సహజం చేసేసాయి కానీ, హృదయంతో చేసేదే అన్నిటికన్నా మంచి స్మృతి, హృదయంలో బాబా బాబా గుర్తుండాలి, బాబాయే హృదయంలో ఇమిడి ఉండాలి” 

* బాప్ దాదాకు గారాల పిల్లలైన వారందరినీ చూసి బాప్ దాదా కూడా చాలా హర్షిస్తున్నారు ఎందుకంటే పిల్లలందరూ బాబాకు ఎంతో ప్రియమైనవారు. ప్రతి ఒక్కరి ముఖం చూసి బాప్ దాదా తమ మనసులో, పిల్లలు ఒక్కొక్కరి ముఖంలో బాబా మూర్తిని చూసి బాబాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ హృదయపు మిలనము చిత్రం రూపంలో చూస్తే ప్రేమలో లీనమైన చిత్రం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి హృదయం ఏమని చెప్తుంది? నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా. బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి ప్రేమను హృదయంలో ఇముడ్చుకుని ఉన్నారు. ఇటువంటి ప్రభు మిలనము మా భాగ్యంలో ఉంటుందని భక్తిలో అనుకోలేదు కదా, కానీ డ్రామా అనండి లేక అదృష్టం అనండి, పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి బాబాకు ఎంతగానో సంతోషం కలుగుతుంది. 

* ఇప్పుడు బాబాకు పిల్లల పట్ల ఒకే ఒక్క కోరిక ఉంది, ప్రతి ఒక్కరి హృదయం కూడా ఇదే అంటుంది, పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా హృదయంలోనే ఉండాలి, అలా ఉంటూ ఉంటూ ఎంత సంతోషాన్ని అనుభవం చేస్తారంటే, ఎంత చేస్తున్నా కానీ మనసు తృప్తిగా అనిపించదు. ఇటువంటి బాబా, కలియుగంలో ఇటువంటివారు లభించడం ఎంతటి భాగ్యపు విషయం అని హృదయంలో ప్రతి సమయము అనిపిస్తూ ఉంటుంది. సైన్సు వారికి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే మిలనం కోసం ఎటువంటి దారులు తయారుచేసారంటే సమ్ముఖంలో లేకపోయినా కానీ సమ్ముఖపు అనుభవాన్ని కలిగిస్తున్నారు. కొంతమంది పిల్లల అనుభవాలను విని, చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. 

* ప్రతి ఒక్కరి హృదయాలలో బాబా స్మృతి సదా ఉంటుందా లేక కష్టమా? బాబా స్మృతిని మర్చిపోవడం కష్టమా? మరి మీరేమి చేస్తారు? మనసులోనే ఇముడ్చేసుకుంటారు! కొంతమంది పిల్లలైతే, వారి హృదయంలో ఎంతగా స్మృతి నిండి ఉంటుందంటే ఒంటరిగా, మౌనంగా కూర్చుని ఉంటారు కానీ ఎదురుగా మాట్లాడుతున్నారు అనే అనిపిస్తుంది ఎందుకంటే ఈ మిలనపు రోజు చాలా విలువైనదని అందరికీ తెలుసు. 

* బాబా అన్న మాట, మాట్లాడుతున్నా, వింటున్నా, చూస్తున్నా బాబా బాబా బాబా. బాబా పిల్లలలో, పిల్లలు బాబాలో ఇమిడిపోతారు. పిల్లలు ప్రయత్నం చేసి ఎక్కడెక్కడి నుండి, ఎలా ఎలా చేరుకుంటారో చూడండి. తండ్రి మరియు పిల్లల ఈ మిలనము లేక ఆత్మ పరమాత్మల మిలనము ఎంతటి అమూల్యమైనది! ఈ అమూల్యమైన మిలనపు సమయాన్ని సంగమయుగము అని అంటారు. ఈ యుగం గురించి మహిమ చేస్తుంటే కళ్ళు ఎంత చెమ్మగిల్లుతాయి. 

* మరి బాబా పరీక్ష పెడ్తారు. రోజంతా ఎంత సమయం బాబాను గుర్తు చేసారు అని అకస్మాత్తుగా పరీక్ష పెడ్తాము. ఎందుకంటే బాబా చాలా ప్రియమైనవారు అని అందరూ అంటారు. ఇది చేస్తాము, ఇది చేద్దాము అంటున్నారు, ఇది బాగానే ఉంది. హృదయంలో ప్రేమ అయితే అందరికీ ఉంది కానీ ఎంత సమయాన్ని కేటాయించి స్మృతిలో కూర్చుంటున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఈ చరిత్ర అయితే ప్రతి ఒక్కరికీ తమది తమకు తెలుసు మరియు బాబాకు తెలుసు.  

* సైన్సు కూడా అద్భుతం చేసిందని బాబా అంటున్నారు - వినడంలోనూ మరియు చూడటంలోనూ. కానీ బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇవన్నీ అల్పకాలికమైన సాధనాలు, మీతో సదా ఉండేది మీ హృదయము. హృదయంతో బాబాను గుర్తు చెయ్యండి మరియు ఇమర్జ్ రూపంలో ఉండాలి, ఈ అభ్యాసం తప్పనిసరి. 

* పిల్లలకు మురళిపై ఎంత మనసు ఉంది అని చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తారు. మురళి ఖజానా కదా. కనుక ఎటువంటి పరిస్థితి ఉన్నాకానీ మురళిని వినడానికైతే చేరుకుంటారు. ఇక్కడ కూడా ఎవరైతే మనస్పూర్తిగా చేరుకున్నారో వారందరికీ సమ్ముఖ మిలనమైతే జరిగింది కానీ ఇప్పుడు ఈ మిలనాన్ని పెంచుతూ ఉండండి. ఎంత వీలైతే అంత పెంచండి. ఈ పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి.

Comments