10-04-2015 అవ్యక్త మురళి

 10-04-2015         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

ప్రాణప్రదమైన అవ్యక్త బాప్ దాదాకు అతి గారాల పిల్లలు, సదా అవ్యక్త స్థితిలో ఉండి అవ్యక్త మిలనాన్ని అనుభవం చేసుకునేవారు, సాకార సో అవ్యక్త పాలనను అనుభవం చేసుకునే నిమిత్త టీచర్లు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరసోదరీలు,

ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి. 

తర్వాత సమాచారము - డ్రామాలో ముందుగానే తయారై ఉన్న నిర్ధారణ ప్రమాణంగా బాప్ దాదా రథం దాదీ గుల్జార్ గారి ఆరోగ్యం వార్షిక మీటింగ్ సమయంలో సరిగా లేని కారణంగా చికిత్స కోసం ముంబయికి తీసుకెళ్ళడం జరిగింది. కొంత సమయం ఆసుపత్రిలో ఉన్న తర్వాత ఇప్పుడు దాదీగారు పార్లీ సేవా కేంద్రంలో ఆరోగ్యాన్ని పుంజుకుంటున్నారు. శరీరం కొంచెం బలహీనంగా ఉన్న కారణంగా సాకార రూపంలో దాదీగారు మధువనానికి చేరుకోలేకపోయారు, ఇది ఈ సీజన్లో బాప్ దాదా యొక్క చివరి టర్న్, అందుకని 25 వేలమంది సోదరసోదరీలు బాప్ దాదా మిలనము కోసం చేరుకుని ఉన్నారు. మహారాష్ట్ర మరియు ఆంధ్రవారి సేవ టర్న్. కావున అవ్యక్త మిలనపు అనుభవాల కోసం 9వ తారీఖు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అందరూ అఖండ భట్టీ చేసారు. తర్వాత ఉదయం నుండే అందరూ విశేషంగా అంతర్ముఖులుగా అయ్యి అవ్యక్త వతనము యొక్క షికారు చేసి మధ్యాహ్నం 2 గంటల నుండే డైమండ్ హాలుకు చేరుకోవడం ప్రారంభించారు.

సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు శక్తిశాలి యోగ తపస్య మధ్యన అవ్యక్త మిలనపు విధి అనుసారంగా సూర్య అన్నయ్యగారు క్లాస్ చేయించారు. 6.30 నుండి 7.30 గంటల వరకు అందరూ వీడియో ద్వారా అవ్యక్త మిలనము, శక్తిశాలి దృష్టి మరియు వరదానాల దివ్య అనుభూతులను చేసుకున్నారు. ఆ తర్వాత దాదీ జానకిగారు, దాదీ రతన్‌మోహినిగారు మరియు ముఖ్య సోదరులు, పెద్దక్కయ్యలు స్టేజిమీదకు వచ్చారు, ముందుగా బాప్ దాదాకు భోగ్ ను స్వీకరింపజెయ్యడం జరిగింది. తర్వాత గుల్జార్ దాదీగారు బాప్ దాదాకు పార్లాలో భోగ్ ను స్వీకరింపజేసారు, అవ్యక్త బాప్ దాదా దాదీగారి శరీరంలోకి విచ్చేసారు మరియు మధుర మహావాక్యాలను ఉచ్చరించారు. నిర్వెర్ అన్నయ్యగారు కూడా అందరినీ కలిసారు. ఆ మహావాక్యాలను మీ వద్దకు పంపుతున్నాము, అలాగే 10వ తారీఖు మురళి మీ వద్దకు పంపించడం జరగలేదు కనుక బాప్ దాదా అవతరణ సమయంలో వీడియో ద్వారా చూపించబడ్డ అవ్యక్త మురళిని పంపుతున్నాము, అందరినీ రిఫ్రెష్ చెయ్యగలరు.

అవ్యక్త బాప్ దాదా మిలనము మరియు మధుర మహావాక్యాలు

తమ స్వ స్వరూపంలో, భవిష్య స్వరూపంలో మరియు సంగమ మహా స్వరూపంలో, మూడింటి రూపాల గురించి తెలుసు కదా? మరియు సదా మూడు స్వరూపాలు ఒక్క సెకండులో మీ ముందుకు వస్తున్నాయా? ఈ సమయంలో బాప్ దాదా పిల్లల వర్తమాన బ్రాహ్మణ స్వరూప మహిమను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మహిమ గొప్పది ఎందుకంటే పూర్తి కల్పంలో అందరికన్నా భాగ్యశాలి స్వరూపం ఇప్పుడు ఈ సంగమయుగ సమయానిది. సంగమయుగ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకుంటున్నారు. వాహ్ సంగమయుగ వరదానీ సమయము వాహ్! సరేనా. బాప్ దాదా అయితే చూస్తున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ తమ భవిష్య స్వరూపాన్ని తెలుసుకుని సంతోషిస్తున్నారు. మంచిది. 

దాదీ జానకిగారు గుల్జార్ దాదీగారికి మరియు పార్లా నివాసులకు చాలా చాలా ప్రియసృతులను మరియు అభినందనలను అందించారు

డ్రామాలో ఏది జరుగుతందో అది మంచిది. అందరూ సంతోషంగా బాబాను కలిసారు. ఏమీ మిస్ అవ్వలేదు కదా! ఎందుకంటే బాబా మరియు పిల్లలైన మనమందరమూ కలిసి కూర్చున్నాము. అందరూ బాబా నుండి దృష్టి తీసుకున్నారు. దాదీ ఎల్లప్పుడూ మమ్మల్ని తమతోపాటు సభలోకి తీసుకువచ్చేవారు. ఈరోజు మిస్ అవుతున్నాము. ఈరోజు దాదీ పార్లాలో ఉన్నారు, మనందరినీ బాప్ దాదాతో కలిపించారు, అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. డ్రామా అన్నది ఎటువంటి జ్ఞానమంటే అది మనల్ని శాంతపరుస్తుంది. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కదా. అందరికీ బాబా భాసన వచ్చింది కదా. భాసన మరియు భావన, మనకు బాబా మిలనము యొక్క భాసన కావాలి, ఆ మిలనపు భాసన మిస్ అవ్వలేదు. మనం బాబా పిల్లలం, బాబా మనందరినీ ఎక్కడ కూర్చోబెట్టారు! బాబా సూక్ష్మంగా మనకు ఎంతో సకాశ్ ను ఇచ్చారు. బాబా సకాశ్ మనందరికీ లభిస్తుంది. బాబాకు మనపై ఎంత ప్రేమ ఉంది!

పార్లాలో నిర్పైర్ అన్నయ్య బాప్ దాదాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు:- (బాప్ దాదా నిర్వెర్ అన్నయ్య మస్తకంపై చేయి పెట్టారు)

బాప్ దాదా ఎంతో స్నేహంతో అందరికీ పండును చూపిస్తూ, ఈ పండు మీ నోటిలోకి వస్తుందని అనుభవం చెయ్యమని చెప్పారు.

బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైనవారు. ముందు నంబరులో సోదరీలు లేక సోదరులు అని ఏమీ లేదు. ఎవరి హృదయంలో అయితే బాబా ఉన్నారో వారి హృదయంలో బాబా ఉన్నారు, బాబా హృదయంలో వారు ఉన్నారు.

నిర్వెర్ అన్నయ్య అందరికీ స్మృతిని అందిస్తూ ఇలా అన్నారు - ఈరోజు విశేషంగా బాప్ దాదా మిలన దివసము. దేశవిదేశాల సోదరసోదరీలైన మనమంతా ప్రత్యేకంగా సమ్ముఖానికి వచ్చి ఉన్నాము. బాప్ దాదా మనందరి ఆశను పూర్తి చేస్తారు, మనందరినీ కలుసుకోవడానికి సమ్ముఖానికి చేరుకున్నారు. ఇందుకు మీ అందరికీ అభినందనలు, అభినందనలు. బాప్ దాదా రాక ద్వారా బ్రాహ్మణ పిల్లల నిశ్చయం మరింత పరిపక్వమవుతుంది. బాప్ దాదా ఈ సంగమయుగంలో తమ రథం ద్వారా మనకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. మనం జ్ఞాన రత్నాలతో మరియు ధారణలతో మన ఒడిని నింపుకుని, విశ్వ మహారాజు మహారాణి యొక్క భవిష్య కిరీటాన్ని ధరిద్దాం, బాప్ దాదాయే స్వయంగా మనందరికీ ఈ కిరీటాన్ని తొడుగుతారు.

యోగిని అక్కయ్య:-డ్రామానుసారంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. పార్లాలో కూర్చున్నప్పటికీ డైమండ్ హాలులో ఉన్నట్లుగానే మాకు అనిపిస్తుంది. మనతోపాటు దేశవిదేశాల నుండి విచ్చేసిన సోదరసోదరీలు, టీచర్ అక్కయ్యలు ఉన్నారు. ఈ రోజు బాప్ దాదా అందరికీ ప్రేమతో నిండిన దృష్టిని ఇచ్చి వరదానాలతో అందరి ఒడిని నింపారు.

మన నీలూ అక్కయ్య కూడా బాప్ దాదా రథానికి ఎంతో ప్రేమగా సేవ చేస్తున్నారు మరియు మన నిర్వైర్ అన్నయ్యగారు కూడా మనతో ఉన్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది, నిర్వైర్ అన్నయ్యగారి ఆరోగ్యం మెరుగవుతూ ఉంది.

Comments