09-03-2013 అవ్యక్త మురళి

                         09-03-2013         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తా స్థితిలో ఉండి, తమ సంతోషమయ ముఖముతో అందరికీ సంతోషాన్ని అనుభవం చేయించండి. మిగిలి ఉన్న వ్యర్థ సంకల్పాలను ఈ బర్త్ డే రోజున బాబాకు బహుమతిగా ఇచ్చేయండి"

ఈరోజు బాప్ దాదా పిల్లలకు తమ జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతున్నారు. తండ్రి మరియు పిల్లల జన్మదినం యొక్క సంతోషం పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలలో కనిపిస్తుంది. ఈనాటి ఈ జయంతి చాలా అతీతమైనది మరియు ప్రియమైనది. ఈ అద్భుతమైన జయంతి తండ్రి మరియు పిల్లలది, ఎందుకంటే బాబా వచ్చింది యజ్ఞము రచించడానికి, ఆ యజ్ఞములో బ్రాహ్మణులే కావాలి అందుకే బాబా మరియు పిల్లలు ఇద్దరి జయంతి ఇది. ఈ జయంతి విశ్వ పరివర్తన జయంతి. కావున తండ్రి పిల్లలకు ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ జయంతి విశ్వ పరివర్తన జయంతి. విశ్వంలో ఏదైతే అంధకారము ఉందో ఆ అంధకారాన్ని వెలుగులోకి మార్చవలసిందే అని మొదట పిల్లలు తండ్రితో కలిసి ప్రతిజ్ఞ చేసారు. 

బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న ప్రకాశాన్ని చూస్తున్నారు. ఈ ప్రకాశము సర్వాత్మలకు కూడా ప్రకాశమునిచ్చి ఈ విశ్వాన్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకువస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ ముఖముతో ఆత్మలను ప్రకాశవంతంగా చేసి ఈ జీవితంలో సదా సంతోషంగా ఉండే సందేశాన్ని ఇవ్వాలని బాప్ దాదా ఈ రోజు పిల్లలందరి నుండి ఆశిస్తున్నారు. ఈ రోజు బాప్ దాదా అందరినుండి ఇదే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క ఆత్మకు సుఖశాంతులు అనుభవం అవ్వాలి, పిల్లలు ప్రతి ఒక్కరూ ఫరిస్తాగా అయ్యి విశ్వంలో కూడా ఫరిస్తా స్థితిని అనుభవం చేయించండి.

మరి ఈ రోజు మీరందరూ తండ్రి జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారా లేక తమ జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారా? ఎందుకంటే కలిసి ఉంటాము, కలిసి వెళ్తాము మరియు కలిసి రాజ్యంలోకి వస్తాము అని బాబా ప్రతిజ్ఞ చేసారు. ఈరోజు అమృతవేళ పిల్లలందరికీ ఒక డైమండ్ మాటను వినిపించాము. ఆ వజ్రంలాంటి మాట - “నా బాబా'. ఈ వజ్రంలాంటి మాటను అందరూ నోట్ చేసుకోండి. ఏమి జరిగినా కానీ నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా గుర్తుకు వస్తే అన్ని దుఃఖాలు సుఖాలలోకి మారిపోతాయి. ఈ రోజు పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా ఫరిస్తా రూపంలో ఉండే శ్రేష్ఠ సంకల్పం చెయ్యవలసిందే. మరి ఈరోజు విశేషంగా బాబాకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారా లేక తీసుకోవడానికి వచ్చారా? బర్త్ డే రోజున బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి బాబా ఈరోజు పిల్లలైన మీ అందరినుండి ఏ బహుమతిని తీసుకోవాలనుకుంటున్నారు? ఈరోజు, మిగిలి ఉన్న వ్యర్థ సంకల్పాలను బాబాకు బహుమతిగా ఇచ్చేయండి, ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు చాలా సమయాన్ని వృధా చేస్తాయి. ఈ బహుమతిని ఇవ్వగలరా? ఇవ్వగలరా! ఇవ్వడం వీలవుతుంది అని అనుకుంటే చేతులెత్తండి. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు చాలా సమయాన్ని వృధా చేస్తాయి. సంతోషాన్ని అనుభవం చెయ్యనివ్వవు. పిల్లలందరి ముఖము ఎంత సంతోషమయంగా ఉండాలంటే ఎవరు మీ ముఖాన్ని చూసినా మీలా అవ్వాలన్న ప్రేరణ వారికి కలగాలి, ఇదే బాప్ దాదా కోరుకుంటున్నారు.

మరి ఈ రోజు ఈ సంకల్పం చెయ్యండి, సదా మా ముఖము ఫరిస్తా సమానంగా కనిపించాలి, బ్రహ్మబాబా ముఖంలా కనిపించాలి. ఎన్ని బాధ్యలున్నప్పటికీ సదా ముఖము ఫరిస్తా రూపంగానే కనిపించేది. పిల్లలు ప్రతి ఒక్కరూ ఫరిస్తా రూపంగా అవ్వడానికి ఫాలో బ్రహ్మబాబా చెయ్యాలని బాబా కోరుకుంటున్నారు. ఏ కర్మ చేసినా కానీ బ్రహ్మబాబా ఈ కర్మ చేసారా అని పరిశీలించుకోండి. మరి ఈరోజు విశేషంగా బ్రహ్మబాబా అందరికీ డైమండ్ బహుమతిని ఇస్తున్నారు - "నా బాబా', మధురమైన బాబా, ప్రియమైన బాబా. ఈ రోజునుండి ప్రతి అడుగు ఫాలో బ్రహ్మబాబా, సదా ప్రకాశిస్తున్న ముఖము. ఇప్పుడు ఒక్క సెకండులో స్వయాన్ని బ్రహ్మబాబా సమానంగా నిశ్చింత చక్రవర్తిగా చేసుకోలగరా? చేసుకోగలరా! ఇప్పుడు అందరూ స్వయాన్ని నిశ్చింత చక్రవర్తి స్థితిలో స్థితి చేసుకుని అనుభవం చేసి చూడండి. నిశ్చింతగా ఉన్నారా లేక ఇప్పుడు కూడా ఏదైనా చింత ఉందా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తి స్థితిని అనుభవం చేసారో వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) చాలా మంచిది. ఏ అడుగు వేసినా అది బ్రహ్మబాబాను ఫాలో చెయ్యాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎంతటి కార్య వ్యవహారాలున్నా కానీ బ్రహ్మబాబా సదా ఫరిస్తా రూపంలోనే ఉన్నారు. బ్రహ్మబాబాకు ఉన్నంత బాధ్యత, ఎలా అయితే బ్రహ్మబాబా అతీతంగా మరియు ప్రియంగా అయ్యి చూపించారో అలా అవ్వండి. మరి ఈరోజు ఏ సూచన ఇస్తుంది? సదా అతీతము మరియు సర్వులకు ప్రియము.

బాప్ దాదా పిల్లలందరికీ ఈరోజు కోసం చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు. ఏ కర్మ చేసినా ఆ అడుగులో బ్రహ్మబాబాను మేము ఫాలో చేస్తాము, సంతోషంగా ఉంటాము, సంతోషాన్ని పంచుతాము అని ఈరోజు అందరూ శ్రేష్ఠ సంకల్పం చెయ్యండి. ఈ రోజు బాప్ దాదా ఈ అతీతమైన మరియు ప్రియమైన జయంతి రోజున అందరికీ బహుమతిని ఇస్తున్నారు - సదా బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తా భవ. అచ్చా. 

ఈరోజు ఏ జోన్ వచ్చింది? (సేవ టర్న్ ఇండోర్ మరియు భోపాల్ జోన్ వారిది) 

ఇండోర్ జోన్:- ప్రతి జోన్ మంచి వృద్ధిని పొందడాన్ని మరియు అందరూ పురుషార్థంలో మున్ముందుకు సాగడాన్ని బాప్ దాదా చూసారు. కావున పురుషార్థంలో పొందుతున్న సఫలతకు బాప్ దాదా అన్ని జోన్లకు అభినందనలు తెలుపుతున్నారు. ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటారు, ఇందుకు కూడా బాప్ దాదా ఇన్ అడ్వాన్స్ వరదానము ఇస్తున్నారు. బాగుంది, బాప్ దాదా పిల్లల ధైర్యము చూసి సంతోషిస్తున్నారు. ఇప్పుడు కూడా బాప్ దాదా స్నేహంలో ముందుకు సాగుతూ ఉంటారు. ఇది కూడా బాప్ దాదా స్నేహము మరియు దానితోపాటు వరదానము కూడా. ముందుకు వెళ్తూ ఉంటారు, ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ముందుకు వెళ్ళాలన్న సంకల్పం ఉండటాన్ని బాప్ దాదా చూసారు, ముందుకు వెళ్తున్నారు కూడా, అందుకు అభినందనలు. అంతే కదా! టీచర్లు. టీచర్లు చేతులెత్తండి. వాహ్! బాగుంది. సదా మీ ధైర్యముకు బాప్ దాదా సహాయం ఉంటుంది. మంచి ధైర్యాన్ని చేసారు కదా, మంచి మంచి బాబా పిల్లలను తయారుచేసారు. సదా ముందుకు వెళ్తూ ఉంటారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. చూడండి, సగం క్లాసు ఒక్క జోన్ వారే కనిపిస్తున్నారు.

భోపాల్ జోన్:- అచ్చా, ధైర్యాన్ని బాగా ఉంచారు. బాప్ దాదా అన్ని జోన్ల నుండి వచ్చిన పిల్లలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. రెండు జోన్లు మంచి ధైర్యాన్ని ఉంచాయి. అది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్చా. ఇక్కడి హెడ్ చేతులెత్తండి. చాలా బాగా వృద్ధి చేస్తున్నారు. ఇంకా వృద్ధి అవుతూ ఉంటారు. ధైర్యానికి బాప్ దాదా సంతోషిస్తున్నారు. సేవ కూడా పెరుగుతూ ఉంది. ఉల్లాస ఉత్సాహాలు కూడా పెరుగుతున్నాయి. బాప్ దాదా రెండు జోన్లతో సంతోషంగా ఉన్నారు. అద్భుతం చేసే చూపిస్తారు. చూపిస్తున్నారు, చూపిస్తారు కూడా. బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్చా - టీచర్లు చేతులెత్తండి. అచ్చా, జెండాలు ఊపుతున్నారు, ఊపండి. మంచిగా అనిపిస్తుంది. ఏదో ఒక విభిన్నత తెస్తే మంచిగా అనిపిస్తుంది. అందరి జెండాలు బాగా ఎగురుతున్నాయి, ఎగురుతూ ఉంటాయి. అచ్చా. పాండవులు కూడా తక్కువేమీ కాదు. పాండవులు చేతులెత్తండి. చాలా మంచిది. పిల్లల ధైర్యమునకు తండ్రి సహాయము ఉండనే ఉంది.

70 దేశాల నుండి డబుల్ విదేశీ సోదర సోదరీలు వచ్చారు:- బాప్ దాదా డబుల్ విదేశీయులకు బదులుగా ఏ టైటిల్ ఇచ్చారు! డబుల్ పురుషార్థీ. రిజల్టులో కూడా ఇప్పుడు పురుషార్థం వైపు, సేవ వైపు అటెన్షన్ బాగా పెరుగుతూ ఉండటాన్ని చూసాము. బాప్ దాదా డబుల్ విదేశీ పిల్లలను చూసి డబుల్ సంతోషిస్తున్నారు, ఎందుకంటే మొదట్లో విదేశీయులు వచ్చినప్పుడు కల్చర్ వైపు అటెన్షన్ వెళ్ళేది, వీరు ఇండియా వారు, వీరు విదేశీయులు అని ఉండేది కానీ ఇప్పుడు అందరూ ఒకే బ్రాహ్మణ కల్చర్ లో నడవడాన్ని బాప్ దాదా చూసారు. ఇంత ఈజీగా అయ్యి నడుచుకుంటున్నారంటే అందుకు బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు, వాహ్ పిల్లలూ వాహ్! పరివర్తనలో అద్భుతాన్ని చూపిస్తున్నారు, ఇక ముందు కూడా చూపిస్తూ ఉంటారు, ఈ భవిష్యత్తును కూడా బాప్ దాదా చూస్తున్నారు. ఇప్పుడైతే అద్భుతం, బాప్ దాదా చూసిన సేవా ప్లాన్, ఏదైతే కలిసి చేసారో, అది చాలా బాగా చేస్తున్నారు. పురుషార్థము, ప్లాన్ మరియు రిజల్టును చూసి బాప్ దాదా చాలా చాలా చాలా సంతోషిస్తున్నారు. స్వ మరియు సేవ రెండింటిపై అటెన్షన్ ఇచ్చే ప్రోగ్రాములు మంచిగా చేస్తూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. బాప్ దాదాకు అంతా తెలుస్తుంది. అందుకే విదేశీయులకు పురుషార్థపు ప్లాన్ మరియు దానిని ప్రాక్టికల్ లోకి తీసుకువస్తున్నందుకు బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు ఎందుకంటే డబుల్ విదేశీయులతో మధుబన్ కూడా చాలా కళకళలాడుతుంది. కావున విశేషంగా పురుషార్థము మరియు సేవ రెండింటికీ బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. ముందుకు వెళ్ళడాన్ని కూడా చూస్తున్నారు. ముందుకు వెళ్తూ ఉంటారు, ముందుకు తీసుకు వెళ్తూ ఉంటారు.

ఈరోజు బాప్ దాదాకు మధువన్ నివాసులు, క్రింద ఉండే వారు కావచ్చు, పైన ఉండే వారు కావచ్చు అందరూ చాలా గుర్తుకు వస్తున్నారు. అందరూ మెజారిటీ మనస్పూర్తిగా కృషి చెయ్యడాన్ని బాప్ దాదా చూసారు. హృదయంతో చేసేవారికి హృదయాభిరాముడి చాలా చాలా అభినందనలు. అచ్చా, మధుబన్ వారు లేవండి. క్రింద ఉండే వారు కానీ, పైన ఉండేవారు కానీ, అందరూ లేవండి. ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరికీ పేరుతో అభినందనలు ఇస్తున్నారని ప్రతి మధుబన్‌ వాసి అనుభవం చెయ్యండి. ఇకముందు కూడా అభినందనలు తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా బాప్ దాదాకు చాలా నమ్మకం ఉంది. అభినందనలు, అభినందనలు, అభినందనలు. 

(దాదీ జానకితో) మధుబన్ వారే కదా. వీరైతే వెళ్ళి వస్తూ ఉంటారు, కానీ మధుబన్ వాసియే కదా. బాగుంది. ముగ్గురు దాదీలు ఎంతో మంచి అటెన్షన్‌ సేవలో నడవటాన్ని బాప్ దాదా చూసారు, నడవడమేమిటి, పరిగెత్తుతున్నారు. ఒక్కొక్క పాండవ్, ఒక్కొక్క సోదరి తమ కోసం ప్రత్యేక అభినందనలను స్వీకరించండి. వీరితో పాటు ఎవరైతే సేవకు నిమిత్తంగా ఉన్నారో వారికి కూడా బాప్ దాదా విశేష అభినందనలతో పాటు ప్రేమను కూడా ఇస్తున్నారు. మధుబన్, మధుబనే. చూడండి, ఎంత మంచి మంచి సేవాధారులన్నారో! బాప్ దాదా సంతోషిస్తున్నారు. కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి కానీ టోటల్ రిజల్టు బాగుంది, చాలా బాగా ఉంటుంది కూడా. సరేనా! బాప్ దాదా మమ్మల్ని చూడరు అని మధుబన్ వారు అంటూ ఉంటారు, ఈరోజు చూసారు కదా. మనసుతో చూస్తూ ఉంటారు. అచ్ఛా, ఈనాటి పుట్టినరోజుకు అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఫారెన్ వారికి కూడా శుభాకాంక్షలు. బాప్ దాదా రోజూ చూస్తూ ఉంటారు కానీ చాలామంది ఉన్నారు కదా కావున దృష్టితో చూస్తారు. మంచి సేవను చేస్తున్నారు. భండారా చాలా బాగా ఉండటాన్ని బాగా చూసారు. బాగా తయారు చేసారు, అభినందనలు. నిర్వైర్ కు అభినందనలు. తోటివారికి కూడా అభినందనలు. ఎవరైతే నిమిత్తమయ్యారో వారందరికీ అభినందనలు. చాలా బాగా కృషి చెయ్యడాన్ని బాప్ దాదా చూసారు. సమయం అనుసారంగా మంచి సాల్వేషన్ చేసారు. ఈ రోజు బాప్ దాదా, ఎవరైతే సభలో కూర్చుని ఉన్నారో, ఎక్కడి వారైనా, అందరికీ, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రెండు జోన్లు చిన్నవైనా కానీ శక్తిశాలివి, మంచి అద్భుతాన్ని చేస్తున్నారు. బాప్ దాదా రెండు జోన్లతో సంతోషంగా ఉన్నారు మరియు సదా సంతోషంగా ఉంటారు.

(పీస్ ఆఫ్ మైండ్ ఛానెల్ లో అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అని నిర్వైర్ అన్నయ్య వినిపించారు) చాలా మంచిది. ఆరోగ్యం బాగుందా! బాగా ముందుకు వెళ్తున్నారు, వెళ్తూ ఉంటారు.

చూడండి, బాప్ దాదా ప్రతి ఒక్కరికీ గుడ్ మార్నింగ్ కూడా చెప్తారు, గుడ్ నైట్ కూడా చెప్తారు. కేవలం బయటనుండి కాదు, మనసుతో చెప్తారు. బాబాపై ప్రేమ లేని పిల్లలు ఎవ్వరూ లేరు, అలాగే బాబాకు కూడా పిల్లలందరిపై ప్రేమ ఉంది. కొంచెం ఢీలా అయినా కానీ అటూ ఇటూ వెళ్ళి మళ్ళీ మంచిగా అయిపోతారు, ప్రేమ బాగుంది. అందరికీ బాప్ దాదాపై హృదయపూర్వక ప్రేమ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. అందుకే నడుస్తున్నారు, నడిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కరినీ బాప్ దాదా గుర్తు చేస్తారు, పేరు తీసుకోవట్లేదు అని అనుకోకండి. ఒక్కొక్కరు, మధుబన్ వారు కావచ్చు, తమ తమ జోన్లలో ఉండచ్చు, అందరికీ ప్రేమను అందించడంలో బాబాకు ఏమైనా ఆలస్యం అవుతుందా? బాప్ దాదాకు ఎంత సమయం పడుతుంది! చాలా త్వరగా చేస్తారు. ఫరిస్తా రూపంలో ఉన్నారు కదా. కావున బాప్ దాదా గుడ్ నైట్ కూడా చెప్తారు, గుడ్ మార్నింగ్ కూడా చెప్తారు అని ప్రతి ఒక్కరూ భావించండి. మీరు చెప్పినా చెప్పకపోయినా, బాప్ దాదా తప్పకుండా చెప్తారు. అచ్ఛా.

మధుబన్ వారు చేతులెత్తండి. మధుబన్ వారికిక ఫిర్యాదు లేదు కదా. బాప్ దాదా తప్పకుండా గుర్తు చేస్తారు. ఇంతమందిని, ఎంతమంది వచ్చినా కానీ సంభాళించారు కదా. ప్రతి ఒక్కరికీ, ఫారెన్ వారు కావచ్చు, ఇండియా వారు కావచ్చు, ఎవరైనాకానీ, బాప్ దాదా పిల్లలను గుర్తు చేసుకోకుండా ఉండలేరు. ఈనాటి బర్త్ డే శివ జయంతి కోసం చాలా చాలా చాలా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.

ఇప్పుడు 5 నిమిషాలు పిల్లలందరూ పవర్ ఫుల్ స్మృతిలో కూర్చోండి, ఏ సంకల్పమూ వద్దు. అచ్చా. రోజూ ఇలా మధ్య మధ్యలో 5 నిమిషాలు పూర్తిగా అశరీరి స్థితిని అనుభవం చేస్తూ ఉండండి ఎందుకంటే రాబోయే సమయం చాలా సున్నితమైనది, అటువంటి సమయంలో ఒకవేళ అభ్యాసం లేకపోతే, కంట్రోలింగ్ పవర్(నియంత్రణ శక్తి) లేకపోతే సక్సెస్(విజయులు) అవ్వలేరు. కావున మధ్య మధ్యలో 2 నిమిషాలు, ఒక్క నిమిషము, 5 నిమిషాలు అశరీరిగా అయ్యే అభ్యాసము మీ దినచర్య అనుసారంగా తప్పకుండా చెయ్యండి, కంట్రోలింగ్ పవర్. అందరూ దగ్గర ఉన్నవారు, దేశంలోని వారు, విదేశాలవారు కూడా బాప్ దాదాను చూస్తున్నారు, ఈ సమయంలో మెజారిటీ పిల్లల అటెన్షన్ మధుబన్ పై ఉంది. మరి రోజూ ఈ ప్రాక్టీసు చేస్తూ ఉండండి. ఈ ప్రాక్టీసు చాలా చాలా అవసరమయ్యే సమయం వస్తుంది కావున సమయానుసారంగా అశరీరిగా అయ్యే అభ్యాసం తప్పక చెయ్యండి.

నలువైపుల ఉన్న పిల్లలకు, ఎవరు ఎక్కడ ఉన్నా అక్కడ బాప్ దాదా సమ్ముఖంగా అందరికీ ప్రియస్మృతులను ఇస్తున్నారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా. 

మోహినీ అక్కయ్యతో:- అభినందనలు. తమను నడిపించుకునే అభ్యాసం వచ్చింది, ఇది మంచిది. అచ్ఛా, వీరిని చూసుకునేవారు మంచివారు. సేవ బాగా చేస్తారు. బాగుంది, చాలా బాగుంది. సేవ చేస్తున్నారు, మేవ తింటున్నారు. అచ్ఛా. 

(బృజ్ మోహన్ అన్నయ్య ఢిల్లీ నుండి చాలా స్మృతులను పంపారు, అక్కడ పెట్టిన మేళా ఫోటోలను బాప్ దాదాకు చూపించారు) నిర్వైర్ అన్నయ్యతో :- ముగ్గురు అన్నయ్యలు మంచివారు, మీతోటి వారు కూడా మంచివారు. 

రమేష్ అన్నయ్యతో :- ఆరోగ్యం బాగుందా! బాంబే ప్రోగ్రాము మంచిగా ఉంది. ఆరోగ్యాన్ని చూసుకుంటూ మంచిగా నడిపిస్తున్నారు.బాగుంది. 

భూపాల్ అన్నయ్యతో:- అడుగు అడుగులో బాబా తోడు ఉన్నారు. చాలా మంచిది. 

విదేశీ పెద్దక్కయ్యలతో:- మీవల్ల కళ ఉంది కానీ ఇంతమంది వచ్చారంటే మీ ఆకర్షణ వారిని తీసుకువచ్చింది, అయినా నిమిత్తమైన వారిది ఉంటుంది. సేవ బాగా జరుగుతుంది. అభినందనలు. 

శాంతి అక్కయ్య అమెరికాకు క్షేమంగా చేరుకున్నారు:- మంచిగా అయిపోతారు. 

(మురళి దాదా హాస్పిటల్ లో ఉన్నారు) వారికి పండును పంపండి. 

పర్ దాదీ కూడా హాస్పిటల్ లో ఉన్నారు, ఎప్పటి వరకు నడుస్తుందో మంచిది. బాప్ దాదా చూస్తూ ఉంటారు. (ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో వారికి పండును పంపించండి) 

(గ్లోబల్ హాస్పిటల్ లోని డా.వినయలక్ష్మి ఈరోజు శరీరం విడిచారు) ఆ ఆత్మ స్మృతి కూడా చేరింది. 

బాప్ దాదా తమ జెండాను తమ స్వహస్తాలతో ఎగురవేసి పిల్లలందరికీ అభినందనలు తెలియజేసారు:- మీ అందరి హృదయాలలో బాప్  దాదా కూర్చుని ఉన్నారు. సదా తోడుగా ఉంటారు, బాబా జెండాను చూసి ప్రతి ఒక్కరూ వీరు మా తండ్రి అని అనుభవం చేసే రోజు కూడా వస్తుంది. అందరి నోటి నుండి 'నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా వచ్చేసారు' అని వెలువడుతాయి. చాలా బాగా అందరూ తమ హృదయాలలోనే జెండాను ఎగురవేసేసారు. పిల్లలు ఒక్కొక్కరినీ బాప్ దాదా చూస్తున్నారు. మేము వెనుక కూర్చున్నాము, మేము మూలన ఉన్నాము అని అనుకోకండి. బాప్ దాదా చూస్తున్నారు, అందరికీ హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు. లాన్ లో ఉన్నవారు కావచ్చు, ఇక్కడ ఉన్నవారు కావచ్చు. బాబాకు గారాల పిల్లలు కదా. సరేనా! మధుబన్ వారు సమీపంగా ఉన్నారు. ఈ రోజు మధుబన్ వారు చాలా ఎగురుతున్నారు. చూడండి, వీరంతా. అచ్ఛా.

Comments