07-03-2016 అవ్యక్త మురళి

 07-03-2016         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“సంగమయుగ భాగ్యమును ఎవరైతే ప్రాప్తి చేసుకున్నారో వారు మహాన్ యోగులు, ఈ యుగము పరమాత్మ జన్మ పరమాత్మ మిలనముతో ఉన్న డైమండ్ యుగము. ఇందులో అలౌకిక సుఖము, శాంతి, శ్రేష్ఠ జన్మ మరియు భాగ్యశాలి పరివారముల ప్రాప్తి జరుగుతుంది” 

ఓంశాంతి. అందరి ముఖాలు ఎంతో చక్కగా చిరునవ్వుతో ఉన్నాయి. అందరూ ఎంతో సంతోషంగా తండ్రి జన్మ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. అందరి ముఖాలు చాలా స్నేహయుక్తంగా, మధురాతి మధురమైన చిరునవ్వుతో, తండ్రి పుట్టినరోజును చాలా స్నేహముతో జరుపుకుంటున్నారు. పిల్లలు, తండ్రి మరియు తమ దివ్య జన్మ దినాన్ని జరుపుకోవడాన్ని చూసి తండ్రి సంతోషిస్తున్నారు. మీరు మరియు మీ చుట్టు ప్రక్కల వారందరూ తండ్రి యొక్క జన్మ దినాన్ని, విచిత్ర దినాన్ని సంతోషంతో జరుపుకుంటున్నారు మరియు అందరి హృదయాలలో ఈ దివ్య జన్మ, జన్మ దినము యొక్క సంతోషం అందరి ముఖాలలో కనిపిస్తుంది. బాబా కూడా పిల్లల ఈ అలౌకిక జన్మ యొక్క ముఖాన్ని చూసి, హృదయంలో ఎంతగానో జన్మ దినాన్ని గుర్తు తెచ్చుకుని సంతోషిస్తున్నారు - వాహ్ నా పిల్లలందరూ, నా పిల్లలు తమ జన్మ సిద్ధ అధికారాన్ని చూసుకుని హర్షితులవుతున్నారు. అందరికీ ఈ అలౌకిక జన్మ ఎంత ప్రియమైనది, ఈ సంతోషం చాలా ఉంది ఎందుకంటే ఈ అలౌకిక జన్మ ఎంతగానో అందరికీ అతీతమైనది మరియు ప్రియమైనది. అందరూ ఈ ఒక్క జన్మలో తమ అలౌకిక జన్మను తెలుసుకుని, తమ ఈ దివ్య జన్మలను చూసుకుని చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే ఈ జన్మ స్వయంగా బ్రహ్మా బాబా ద్వారా బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారీలుగా ప్రసిద్ధమైనది. వాహ్ నా ఈ అలౌకిక సుఖమయ జన్మ అంటూ ప్రతి ఒక్కరికీ ఈ జన్మ యొక్క సంతోషం ఉంది. ప్రతి ఒక్కరి ముఖంపై ఈ శ్రేష్ఠ జన్మ గురించిన చాలా సంతోషం ముఖంలో కనిపిస్తుంది అందుకే ఈ విధంగా గాయనం ఉంది - బ్రహ్మ బాబా ఇచ్చిన ఈ సంగమయుగ జన్మ, తండ్రి మరియు మీరు, ఇద్దరి జన్మ చిన్ననిది కానీ ప్రాప్తి అన్ని జన్మలకు అతీతమైనది మరియు ప్రియమైనది. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ దివ్య జన్మ, అలౌకిక జన్మ యొక్క మహిమను మరువలేరు ఎందుకంటే ఇది చిన్నని జన్మ కానీ విశేషత ఏమిటంటే ఈ చిన్నని జన్మలోనే అన్ని జన్మల విషయాలను తెలుసుకుంటారు మరియు ఈ ఒక్క జన్మలోనే మీరు మీ భవిష్యత్తును కూడా తెలుసుకుంటారు అందుకే సంగమ యుగాన్ని డైమండ్(వజ్రం) యుగము అని అంటారు. పరమాత్మ మిలనం, పరమాత్మ జ్ఞానం ఈ చిన్నని యుగంలోనే అనుభవం అవుతాయి. అన్నిటికన్నా చిన్నని యుగం కానీ ప్రాప్తి పూర్తి కల్పంలోకల్లా ఈ సంగమ జన్మలోనే జరుగుతుంది. అలౌకిక సుఖము, అలౌకిక శాంతి మరియు జన్మ కూడా శ్రేష్ఠమైనది, పరివారం కూడా చాలా భాగ్యశాలి, ఇటువంటి జన్మ ఈ సంగమ యుగములోని ఒక్క జన్మలోనే ఉంటుంది. బాప్ దాదా కూడా సంగమంలోనే పిల్లలతో కలుస్తారు, పరిచయంతో. అలౌకిక తండ్రి అనగా బ్రహ్మాబాబా తండ్రిగా అనుభవం అవుతారు. ఇది చిన్నని యుగమే కానీ అన్ని జన్మలలో కల్లా ఈ సంగమ యుగము చాలా చాలా భాగ్యశాలి అయినది. చిన్నని యుగమే కానీ ప్రాప్తి చాలా అధికము. ఇంతటి ప్రాప్తి మరే ఇతర యుగాలలో, జన్మలలో జరగదు. అంతే కాకుండా ఈ సంగమయుగము ఎంతటి గొప్పదంటే అన్ని యుగాలలో కల్లా ముఖ్య యుగంగా సంగమ యుగానికే గాయనం ఉంది. సంగమ యుగంలో పూర్తి చక్రాన్ని తెలుసుకునే భాగ్యం ప్రాప్తిస్తుంది. చక్రం యొక్క పూర్తి రహస్యం కూడా ఈ సంగమ యుగంలోనే ప్రాప్తిస్తుంది.

మరి మీరంతా ఇప్పుడు ఏ యుగంలో ఉన్నారు? ఏమంటారు? సంగమ యుగంలో ఉన్నారు కదా! ఎవరైతే తమను తాము సంగమ యుగంలో ఉన్నట్లుగా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. వెనక వైపు కనిపించడం లేదు కానీ మీరు వింటున్నారు, దానినిబట్టే తెలుసుకుంటారు. సంగమ యుగం అన్ని యుగాలలో కల్లా శ్రేష్ఠ యుగము, చిన్ననిది కానీ భాగ్యము చాలా పెద్దది. సంగమ యుగ భాగ్యాన్ని ఎవరైతే పొందారో వారు మహాన్ యోగులు అని పిలువబడతారు. ఈ మహాన్ యోగి జీవితము ఎంత గొప్పది! ఈ సంగమ యుగ ప్రాప్తితో, అతి శ్రేష్ఠమైన సత్యయుగ జన్మల గురించి భగవంతుడి ద్వారా మీరు తెలుసుకున్నారు. స్వయంగా భగవంతుడే సంగమ యుగంలో మిమ్మల్ని కలుస్తారు. కల్పమంతటిలోకల్లా అన్నిటికన్నా భాగ్యశాలి యుగం సంగమ యుగమే. ఇటువంటి యుగంలో మీరు భగవంతుని దివ్య జన్మను పొందారు. ఈరోజు కూడా ఏమి జరుపుకోవడానికి వచ్చారు? సంగమ యుగ భాగ్యశాలి సమయాన్ని పొందారు, పొందుతూ ఉన్నారు, పొందుతూ ఉంటారు. సత్యయుగ దేవతలు శ్రేష్ఠమైనవారే కావచ్చు కానీ ఈ సంగమ యుగానిది అంతకన్నా ఎక్కువ బలిహారము. సంగమంలోనే భగవంతుడు తమ ఒరిజినల్ (నిజమైన) పిల్లలను కలుస్తారు. బాబా ప్రేమ ప్రత్యక్షంగా సంగమ జన్మలోనే లభిస్తుంది. అందరి నోటి నుండి, వాహ్ సంగమ యుగ దివ్య జన్మ! అనే వెలువడుతుంది. ఇతర పుట్టిన రోజులను కూడా మీరు జరుపుకుంటూ ఉంటారు, మనసు యొక్క సంతోషాన్ని కూడా అనుభవం చేస్తారు. సంతోషాలు అనేకం ఉంటాయి కానీ సంగమ యుగ సంతోషాలు మరియు దాని గాయనము సంగమ యుగంలోనే ఉంటుంది. వీటితోపాటు సంగమ యుగ దివ్య ప్రాప్తులు చాలా గొప్పవి. సంగమ యుగంలో జనాభా తక్కువ కానీ సంగమ యుగానికున్న మహానత, ఆ ప్రాప్తి యొక్క భాగ్యము కొద్దిమంది పిల్లలైన మీకే లభించింది. సంగమ యుగంలోని మొదటి ప్రాప్తి, అతి పెద్ద ప్రాప్తి మీకే లభించింది. స్వయంగా పరమాత్ముని అవతరణ సంగమ యుగంలోనే జరుగుతుంది. సంగమ యుగంలోని బ్రాహ్మణుల మహిమ చాలా శ్రేష్ఠమైనది, ఇందులో ఈరోజు మీరు కూర్చుని ఉన్నారు, ఇది సంగమ యుగ ప్రాప్తి. అందరూ ఎంతో సంతోషిస్తున్నారు. సంగమ యుగము మరియు మీరు, ప్రాప్తిని చూడండి ఎంత ఉన్నతమైన ప్రాప్తి, సంగమ యుగంలోనే భగవంతుడు స్వయంగా వచ్చి పూర్తి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నట్లుగా జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఈ ఇచ్చుటను తక్కువగా భావించకండి. డైరెక్టుగా భగవంతుడు సంగమ యుగంలో సాధారణ రూపంలో ప్రవేశించి ఇస్తున్నారు. ఈ భాగ్యము తక్కువేమీ కాదు. సంగమ యుగపు ఈ జన్మ గొప్పది. అన్ని యుగాల జ్ఞానము, అన్ని యుగాలకన్నా శ్రేష్ఠ సంపాదన, పూర్తి కల్ప జ్ఞానము అన్నీ సంగమంలోనే ప్రాప్తిస్తాయి. ఇతర యుగాలలో లభించనివి, సంగమ యుగంలోనే లభించే ప్రాప్తుల లిస్టు మీ వద్ద ఉండాలి. కనుక, సంగమ యుగము లభించింది అంటే పూర్తి కల్పపు భాగ్యము ఈ చిన్నని యుగం ప్రాప్తి చేయిస్తుంది. బాబా ప్రతి కల్పములో ఈ సంగమ యుగ ప్రాప్తిని కలిగిస్తారు, విశేషమైన ప్రాప్తి ఏమిటి? బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారి, ఈ జన్మ చాలా శ్రేష్ఠమైనది, ఇందులో మీరు పూర్తి కల్పపు జ్ఞానాన్ని పొందుతారు. ఈ భాగ్యము సంగమ యుగంలోనే పరమాత్మ ద్వారా లభిస్తుంది. మరి చెప్పండి, మీరంతా సంగమ యుగ భాగ్యాన్ని తెలుసుకుని ముందుకు వెళ్తున్నారు కదా! ఎందుకంటే సంగమ యుగ మహిమ ఏమిటంటే, సంగమ యుగంలో లభించేది ఇంకెక్కడా లభించదు. బాప్ దాదాను కలవడానికి వచ్చారు, ఈ భాగ్యము కూడా సంగమంలో లభిస్తుంది. ఈ మిలనము తక్కువైనదేమీ కాదు. చాలా పెద్ద మిలనము. అచ్ఛా.

తండ్రి జన్మకు స్మృతిచిహ్నము మంచిగా పెట్టారు. సమక్షంలోకి వచ్చేవారు వస్తూనే ఉంటారు, కానీ ఈ ప్రాప్తి యొక్క విలువ చాలా పెద్దది. బాప్ దాదా కూడా రోజూ ఇటువంటి పిల్లలను చూసి సంతోషిస్తారు వాహ్ కల్పపు భాగ్యశాలి పిల్లలూ వాహ్! స్వయంగా భగవంతుడు కూడా సంగమయుగ బ్రాహ్మణుల మహిమ చేస్తున్నారు. ఎంతటి శ్రేష్ఠ భాగ్యము! ఇది కల్పంలో ఒక్కసారి మాత్రమే పరమాత్మ ద్వారా లభిస్తుంది. లభించింది కదా! ఈ భాగ్యము లభించిన వారు చేతులెత్తండి. లభించిందా? మరి ఈ భాగ్యము తక్కువ భాగ్యము కాదు. వినడానికి నంబరువారీగా తప్పకుండా ఉన్నాకానీ సంగమ యుగపు ఈ భాగ్యము పూర్తి కల్పంలో కల్లా మొదటి నంబరు. అచ్ఛా, ఇప్పుడు చాలా సమయం అయిపోయింది. 

సేవ టర్న్ గుజరాత్ జోన్ వారిది, 14 వేలమంది గుజరాత్ నుండి వచ్చారు, మొత్తం 22 వేలమంది వచ్చారు: గుజరాత్ వారు బాగా వస్తారు. సంగమయుగ భాగ్యాన్ని గుజరాత్ తీసుకుంది, మంచిది. ఇంకా ఉన్నారు. భిన్న భిన్న భాగ్యాలను భిన్న భిన్న దేశాలు తీసుకున్నాయి. కొద్దిగా వినిపించాము, గుజరాత్ వారు సగంమంది ఉన్నారు. మంచిది. చెప్పండి, గుజరాత్ కన్నా ఎక్కువ నంబరు ఎవరిది ఉంది? గుజరాత్ ఇప్పుడు సాంగత్యపు రంగును అంటించుకోవాలి. మంచిది. గుజరాత్ ఎలా అయితే నంబరు తీసుకుందో అలా ఇతరులు కూడా తీసుకోవచ్చు. రెండవ నంబరు అయినా కానీ ఫర్వాలేదు, రెండవ నంబరును తీసుకున్నారు కదా. మంచి కృషి చేస్తారు, ఇకమీదట కూడా చేస్తూ ఉంటారు అని బాప్ దాదా గుజరాత్ కు చెప్తున్నారు. 

డబుల్ విదేశీయులు 100 దేశాల నుండి 1200 మంది సోదరీ సోదరులు వచ్చారు:- మంచిది. షుమారుగా 1200మంది వచ్చారు, మంచిది. సాకార బాబా ఉన్నప్పుడు, ఎవరెవరు ఏ జోన్ నుండి వచ్చారో వారు అలా చేతులెత్తుతూ వెళ్ళండి అని అనేవారు. చాలామంది వస్తారు, కానీ నడుస్తున్నారు. సేవాధారులు కూడా ఉన్నారు మరియు పేరును బాగా ప్రసిద్ది చేసారు. ఈ రిజల్టు మీరు బాగా కృషి చేసి వృద్ధి చేసారని చెప్తుంది. పెంచుతారు కూడా. ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, ముందుకు వెళ్ళగలరు కూడా. అవకాశం ఉంది.

గుజరాత్ వృద్ధిలో ఇప్పటివరకు ముందు నంబరు తీసుకున్నదని తెలుస్తుంది. మంచిది. వృద్ధి అవ్వడము అంటే తమ బ్రాహ్మణుల సంఖ్యను పెంచడము. ఎంత వృద్ధి జరుగుతుందో అంత త్వరగా సత్యయుగం వస్తుందని బాబాకు మంచిగా అనిపిస్తుంది. ఏదైనా నూతన కల్పన చేసి నంబర్ వన్ గా ఉన్న గుజరాత్ కన్నా ముందుకు వెళ్ళండి. నంబర్ అయితే రాగలదు కదా. ఇందులో అయితే ఎవ్వరూ ఆపలేరు. కానీ వృద్ధి తప్పకుండా కావాలి. ఎందుకంటే పూర్తి ప్రపంచం ప్రకారంగా ఇప్పుడు మన లెక్క ప్రకారం ఎక్కువ లేదు. గుజరాత్ ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళిందో అంతకంటే కూడా ఎక్కువ ముందుకు వెళ్ళవచ్చు. ఎలా అయితే గుజరాత్ తనను తాను ముందుకు తీసుకువెళ్ళిందో, అలాగే ప్రతి ఒక్కరూ, భిన్న భిన్న జోన్ల నుండి వచ్చినవారు, గుజరాత్ లా వృద్ధి కోసం కృషి చెయ్యవచ్చు. నంబరు మున్ముందుది తీసుకోండి. వీలవుతుంది కదా! లేదు, గుజరాత్ కన్నా ముందు వెళ్ళలేము అని భావించేవారు చేతులెత్తండి. అయితే మరిప్పుడు వృద్ధిని మరింత ఎక్కువ చెయ్యండి. 

దాదీ జానకితో: - చాలా కృషి చేస్తారు, గుజరాత్ ను ముందుకు తెచ్చి చూపించడమే వీరి లక్ష్యము. ఇది ఎవరైనా చెయ్యవచ్చు, ఉల్లాసం అందరిలో ఉంది. ఇప్పుడు మేము ముందు నంబరు తీసుకుంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. 

ఈషూ దాదీగారి స్మృతిని అందించారు, వారు ఇప్పుడు అహ్మదాబాదు చెకింగ్ కోసం వెళ్ళి ఉన్నారు: - మధ్యమధ్యలో వీరికి కొంచెం అటూఇటూ అవుతూ ఉంటుంది, ఎక్కువ సమయం ఉండదు. మంచిగా అయిపోతారు. 

(ముగ్గురు అన్నయ్యలు బాప్ దాదాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛాన్ని అందించారు)

మంచిది, అందరూ మంచిగా నడుస్తున్నారు! ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. అంత పెద్ద మహారథి అయితే, ఎవరైనా బాధ్యత తీసుకుని మధ్యమధ్యలో రిజల్టును అడుగుతూ ఉండండి. రిజల్టు అడగడం వలన అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఇప్పుడు పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు, ఇందులో కొంతమందిలో మంచి ఉల్లాసం ఉంది కానీ వారికి కొంచెం బలం కావాలి, దాని వలన వారు కొంచెం ముందుకు వెళ్తారు. అందరూ మంచిగా ఉన్నారు కదా! మందుల అవసరం రావడం లేదు కదా! ప్రతి ఒక్కరూ పురుషార్ధం చేస్తున్నారు. బాప్ దాదా ఏమి చూసారంటే, పురుషార్ధం తర్వాత కొంత సమయం బాగా ఉంటారు కానీ కొంత ఎక్కువ సమయం గడిస్తే మరో వైపుకు వెళ్ళిపోతుంది, ఇందుకోసం, ఎలా అయితే క్లాసులు చేయిస్తారో, అందుకు అందరూ కలిసి ఎవరినైనా నియమించండి, నెలకు ఒకసారి లేక రెండు నెలలకు ఒకసారి పరస్పరంలో కలుసుకుని రిజల్టును వ్రాయండి. బాప్ దాదా 80వ శివజయంతి సందర్భంగా శివ ధ్వజాన్ని ఎగురవేసారు మరియు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

శివ జయంతి నాడు ముందుగా బాబా గుర్తుకు వస్తారు. శివబాబా కూడా, బ్రహ్మాబాబా కూడా మరియు పెద్ద దాదీలందరూ, అందరూ గుర్తుకు వస్తారు. పూర్తి సభకు, అందరికీ జన్మదిన శుభాకాంక్షలు.

Comments