06-01-1990 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘హోలీహంస యొక్క నిర్వచనము’’
ఈ రోజు జ్ఞానసాగరుడైన తండ్రి హోలీహంసల సంగఠనను చూస్తున్నారు. హోలీహంసలు అనగా స్వచ్ఛత మరియు విశేషత కల ఆత్మలు. స్వచ్ఛత అనగా మనసా-వాచా-కర్మణా, సంబంధాలు అన్నింటిలోనూ పవిత్రత. పవిత్రతకు గుర్తుగా సదా తెలుపు రంగునే చూపిస్తారు. హోలీహంసలైన మీరు కూడా శ్వేత వస్త్రధారులు, స్వచ్ఛమైన మనసు కలవారు అనగా స్వచ్ఛతా స్వరూపులు. తనువు, మనసు మరియు హృదయంలో సదా మచ్చలేనివారు అనగా స్వచ్ఛమైనవారు. ఒకవేళ ఎవరైనా తనువుతో అనగా బయటకు ఎంత స్వచ్ఛంగా, శుద్ధంగా ఉన్నా కానీ మనసులో శుద్ధంగా లేకపోతే, స్వచ్ఛంగా లేకపోతే, ముందు మనసును శుద్ధంగా ఉంచుకోండి అని అంటారు. శుద్ధమైన మనసు లేక శుద్ధమైన హృదయంపై సాహెబు రాజీ అవుతారు, అంతేకాక శుద్ధమైన హృదయం కలవారి అన్ని కోరికలు అనగా కామనలు పూర్తి అవుతాయి. హంస యొక్క విశేషత స్వచ్ఛత అనగా శుద్ధంగా ఉంటుంది, అందుకే బ్రాహ్మణాత్మలైన మిమ్మల్ని హోలీహంసలు అని అంటారు. చెక్ చేసుకోండి, హోలీహంస ఆత్మనైన నాకు నాలుగు విషయాలలోనూ అనగా తనువు-మనసు-హృదయము మరియు సంబంధాలలో స్వచ్ఛత ఉందా? సంపూర్ణ స్వచ్ఛత మరియు పవిత్రత, ఇదే సంగమయుగంలో అందరి లక్ష్యము, అందుకే బ్రాహ్మణ సో దేవతలైన మిమ్మల్ని సంపూర్ణ పవిత్రులు అని అంటూ ఉంటారు. కేవలం నిర్వికారులు అని అనరు, కానీ సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. 16 కళల సంపన్నులు అని అంటారు, కేవలం 16 కళలు కలవారు అని అనరు, వాటిలో సంపన్నులు. మీ యొక్క దేవతా రూపానికి గాయనం ఉంది కానీ అలా ఎప్పుడు తయారయ్యారు? బ్రాహ్మణ జీవితంలోనా లేక దేవతా జీవితంలోనా? అలా తయారయ్యే సమయం ఇప్పుడు ఈ సంగమయుగము, అందుకే చెక్ చేసుకోండి, ఎంతవరకు అనగా ఎంత శాతం స్వచ్ఛతను అనగా పవిత్రతను ధారణ చేసారు?
తనువు యొక్క స్వచ్ఛత అనగా సదా ఈ తనువును ఆత్మ యొక్క మందిరంగా భావిస్తూ, ఆ స్మృతితో స్వచ్ఛంగా ఉంచుకోవడము. ఎంతగా మూర్తి శ్రేష్ఠంగా ఉంటుందో, అంతగానే మందిరం కూడా శ్రేష్ఠంగా ఉంటుంది. మరి మీరు శ్రేష్ఠమైన మూర్తులా లేక సాధారణమైన మూర్తులా? బ్రాహ్మణాత్మలు మొత్తం కల్పంలో నంబరువన్ శ్రేష్ఠాత్మలు! బ్రాహ్మణుల ముందు దేవతలు కూడా బంగారం సమానమైనవారు మరియు బ్రాహ్మణులు వజ్ర సమానమైనవారు! కనుక మీరందరూ వజ్రాల మూర్తులు. ఎంత ఉన్నతమైనవారిగా అయ్యారు! ఇంతగా మీ స్వమానాన్ని తెలుసుకొని ఈ శరీరం రూపీ మందిరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోండి. సాదాగా ఉన్నా కానీ స్వచ్ఛంగా ఉండాలి. ఈ విధితో తనువు యొక్క పవిత్రత సదా ఆత్మిక సుగంధాన్ని అనుభవం చేయిస్తుంది. ఇటువంటి స్వచ్ఛత, పవిత్రత ఎంతవరకు ధారణ అయ్యింది? దేహ భానంలో స్వచ్ఛత ఉండదు కానీ ఆత్మ యొక్క మందిరము అని భావించడంతో స్వచ్ఛంగా ఉంచుకుంటారు మరియు ఈ మందిరాన్ని కూడా తండ్రి మీకు సంభాళించేందుకు మరియు నడిపించేందుకు ఇచ్చారు. ఈ మందిరానికి ట్రస్టీలుగా చేసారు. మీరైతే తనువు-మనసు-ధనము, అన్నీ ఇచ్చేసారు కదా! ఇప్పుడు మీవైతే కాదు. నావి అని అంటారా లేక మీవి అని అంటారా? కనుక ట్రస్టీతనము స్వతహాగానే నష్టోమోహులుగా చేస్తుంది అనగా స్వచ్ఛతను మరియు పవిత్రతను స్వయంలోకి తీసుకొస్తుంది. మోహం వలన స్వచ్ఛత ఉండదు, కానీ తండ్రి సేవనిచ్చారు అని భావిస్తూ తనువును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకుంటారు కదా లేక ఎలా తోస్తే అలా నడిపిస్తూ ఉంటారా? స్వచ్ఛత కూడా ఆత్మికతకు గుర్తు.
అలాగే మనసు యొక్క స్వచ్ఛత అనగా పవిత్రత, దీనిలో కూడా శాతాన్ని చూడండి. రోజంతటిలో ఏ రకమైన అశుద్ధ సంకల్పం మనసులో నడిచినా, దానిని సంపూర్ణ స్వచ్ఛత అని అనరు. మనసు కోసం బాప్ దాదా యొక్క డైరెక్షన్ ఏమిటంటే - మనసును నాపై పెట్టండి లేక విశ్వ సేవలో పెట్టండి. మన్మనాభవ - ఈ మంత్రం సదా స్మృతిలో ఉండాలి. దీనిని మనసు యొక్క స్వచ్ఛత లేక పవిత్రత అని అంటారు. ఇంకెటువైపు అయినా మనసు భ్రమిస్తే, భ్రమించడం అనేది అస్వచ్ఛత. ఈ విధితో చెక్ చేసుకోండి, ఎంత శాతంలో స్వచ్ఛత ధారణ అయ్యింది? విస్తారమైతే తెలుసు కదా?
మూడవ విషయము - హృదయం యొక్క స్వచ్ఛత. సత్యతే స్వచ్ఛత అని కూడా మీకు తెలుసు. తమ స్వ-ఉన్నతి కోసం పురుషార్థం ఏదైనా, పురుషార్థం ఎలా ఉన్నా, అది సత్యతతో తండ్రి ముందు పెట్టండి. కావున ఒకటి - స్వయం యొక్క పురుషార్థంలో స్వచ్ఛత. రెండవది - సేవ చేస్తూ, సత్యమైన హృదయంతో ఎంతవరకు సేవ చేస్తున్నారు, దీని స్వచ్ఛత. ఒకవేళ ఏదైనా స్వార్థంతో సేవ చేస్తే, దానిని సత్యమైన సేవ అని అనరు. కనుక సేవలో కూడా సత్యత-స్వచ్ఛత ఎంత ఉంది? సేవ అయితే చేయాల్సే వస్తుంది అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు. ఎలాగైతే లౌకికంలో గవర్నమెంట్ డ్యూటీ ఉంటుంది, దానిని సత్యమైన హృదయంతో చేసినా, విధి లేక చేసినా, నిర్లక్ష్యంగా చేసినా, చేయాల్సే వస్తుంది కదా. ఎలాగైనా 8 గంటలు గడపాల్సిందే. అలాగే, ఈ ఆల్మైటీ గవర్నమెంట్ ద్వారా డ్యూటీ లభించిందని భావిస్తూ సేవ చేస్తే, దానిని సత్యమైన సేవ అని అనరు. కేవలం డ్యూటీ కాదు, కానీ బ్రాహ్మణాత్మల నిజమైన సంస్కారమే సేవ. కనుక సంస్కారాలు స్వతహాగానే సత్యమైన సేవ చేయకుండా ఉండనివ్వవు. కావున చెక్ చేసుకోండి, సత్యమైన హృదయంతో అనగా బ్రాహ్మణ జీవితం యొక్క సహజ సంస్కారాలతో ఎంత శాతం సేవ చేసాను? ఇన్ని మేళాలు చేసారు, ఇన్ని కోర్సులు చేయించారు, కానీ స్వచ్ఛత మరియు పవిత్రత యొక్క శాతము ఎంత ఉన్నది? ఇది కేవలం డ్యూటీ కాదు, కానీ నిజమైన సంస్కారము, స్వధర్మము, స్వకర్మ.
నాల్గవ విషయము - సంబంధాలలో స్వచ్ఛత. దీనిని సార రూపంలో విశేషంగా ఇలా చెక్ చేసుకోండి, సంతుష్టత రూపీ స్వచ్ఛత ఎంత శాతంలో ఉంది? రోజంతటిలో రకరకాల వెరైటీ ఆత్మలతో సంబంధాలు ఉంటాయి. మూడు రకాల సంబంధాలలోకి వస్తారు. ఒకటి - బ్రాహ్మణ పరివారం వారు, రెండు - వచ్చే జిజ్ఞాసువు ఆత్మలు, మూడు - లౌకిక పరివారం వారు. మూడు సంబంధాలలోనూ మొత్తం రోజంతటిలో, స్వయం యొక్క సంతుష్టత మరియు సంబంధంలోకి వచ్చే ఇతర ఆత్మల యొక్క సంతుష్టతా శాతము ఎంత ఉంది? సంతుష్టతకు గుర్తు, స్వయం కూడా మనసుతో తేలికగా మరియు సంతోషంగా ఉంటారు మరియు ఇతరులు కూడా సంతోషిస్తారు. అసంతుష్టతకు గుర్తు - స్వయం కూడా మనసుతో భారంగా ఉంటారు. ఒకవేళ సత్యమైన పురుషార్థులు అయినట్లయితే, వద్దనుకున్నా సరే, పదే-పదే ఈ సంకల్పం వస్తూ ఉంటుంది - ఇలా మాట్లాడి ఉండకపోతే బాగుండేది, ఇలా చేసి ఉండకపోతే బాగుండేది, ఇలా మాట్లాడి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది - ఇలా అనిపిస్తూ ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉన్న పురుషార్థులకు ఇలా కూడా అనిపించదు. కావున ఆ భారము సంతోషంగా ఉండనివ్వదు, తేలికగా ఉండనివ్వదు. సంబంధాలలో స్వచ్ఛత అనగా సంతుష్టత. ఇదే సంబంధాలలో సత్యత మరియు శుద్ధత, అందుకే, మీరు అంటారు, సత్యమున్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది అనగా సత్యంగా ఉండేవారు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. మరి హోలీహంసల నిర్వచనము విన్నారా? ఒకవేళ సత్యత యొక్క స్వచ్ఛత లేనట్లయితే హంసలే కానీ హోలీహంసలు కాదు. కనుక చెక్ చేసుకోండి - సంపన్నత మరియు సంపూర్ణత యొక్క గాయనమేదైతే ఉందో, అలా ఎంతవరకు తయారయ్యారు? ఒకవేళ డ్రామానుసారంగా ఈ రోజే ఈ శరీరంతో లెక్క సమాప్తమైపోతే, ఎంత శాతముతో పాస్ అవుతారు? లేక డ్రామాతో - కొంత సమయం ఆగు అని చెప్తారా! చిన్న-చిన్నవారైతే పోయేదే లేదు అని అనుకునైతే కూర్చోలేదు కదా? ఎవర్రెడీ యొక్క అర్థమేమిటి? ఇప్పుడింకా 10-11 సంవత్సరాలుంది అని సమయం కోసం వేచి ఉండడం లేదు కదా? చాలా వరకు 2000 సంవత్సరం యొక్క లెక్కతో ఆలోచిస్తారు! కానీ సృష్టి వినాశనం యొక్క విషయం వేరు, స్వయాన్ని ఎవర్రెడీగా ఉంచుకోవడం వేరు, అందుకే దీనిని, దానితో కలపకండి. భిన్న-భిన్న ఆత్మలకు భిన్న-భిన్న పాత్రలు ఉన్నాయి, అందుకే, నాకు అడ్వాన్స్ పార్టీలో పాత్ర లేదని లేదా నాకైతే వినాశనం తర్వాత కూడా పాత్ర ఉందని భావించకండి! కొందరు ఆత్మలకు ఆ పాత్ర ఉంది కానీ నేను ఎవర్రెడీగా ఉండాలి. లేదంటే నిర్లక్ష్యం యొక్క అంశము ప్రత్యక్షమవుతుంది. ఎవర్రెడీగా ఉండండి, ఇక తర్వాత 20 సంవత్సరాలు జీవించి ఉన్నా పర్వాలేదు. అంతేకానీ, ఇటువంటివాటిపై ఆధారపడకూడదు. అలాంటివారినే హోలీహంసలని అంటారు. జ్ఞానసాగరుని యొక్క తీరంలోకి వచ్చారు కదా. మరి ఈ రోజు హోలీహంసల స్వచ్ఛతను వినిపించాము, తర్వాత విశేషతలను వినిపిస్తాము.
టీచర్లకు చెక్ చేసుకోవడం వచ్చు కదా! టీచర్లకు విశేషంగా సమర్పణ అయ్యే భాగ్యము లభించింది. ప్రవృత్తిలోని వారు కూడా మనసుతో సమర్పితమై ఉండి ఉండవచ్చు కానీ ఎంతైనా టీచర్లది విశేషమైన భాగ్యము. వారి పనే స్మృతి మరియు సేవకు సంబంధించినది. భోజనం తయారుచేసినా, బట్టలు ఉతికినా - అది కూడా యజ్ఞ సేవనే. అది కూడా అలౌకిక జీవితం పట్ల సేవ చేస్తారు. ప్రవృత్తిలోని వారికి రెండు వైపులా నిర్వర్తించాల్సి ఉంటుంది. మీకైతే ఒకటే పని కదా, డబల్ అయితే లేదు కదా? ఎవరైతే సత్యతతో మరియు స్వచ్ఛతతో, తండ్రి మరియు సేవలో సదా నిమగ్నమై ఉంటారో, వారికి ఇంకే శ్రమ చేయాల్సిన అవసరం పడదు. యోగ్య టీచర్ల భండారా (వంటిల్లు) మరియు భండారీ (హుండీ) సదా నిండుగా ఉంటాయని వినిపించాము కదా. వచ్చే నెల ఎలా గడుస్తుందో, మేళా ఎలా జరుగుతుందో అని చింతించాల్సిన అవసరముండదు. సేవతో పాటు సాధనాలు స్వతహాగా ప్రాప్తిస్తాయి. ఆత్మిక ఆకర్షణ సేవ మరియు సేవాకేంద్రాలను స్వతహాగా వృద్ధి చేస్తూ ఉంటుంది. జిజ్ఞాసువులు ఎందుకు పెరగరు, ఎందుకు నిలవరు, ఎందుకు వెళ్ళిపోతారు... అని ఎక్కువగా ఆలోచిస్తే, జిజ్ఞాసువులు నిలవరు. యోగయుక్తంగా ఉంటూ, ఆత్మికతతో ఆహ్వానిస్తే, జిజ్ఞాసువులు స్వతహాగానే వృద్ధి చెందుతారు. ఇలా జరుగుతుంది కదా? కనుక మనసును సదా తేలికగా ఉంచుకోండి. ఏ విధమైన భారము ఉండకూడదు. ఏ విధమైన భారము ఉన్నా, స్వయానిది కావచ్చు, సేవది కావచ్చు, సేవా సహచరులది కావచ్చు, అది ఎగరనివ్వదు - సేవ కూడా వృద్ధి చెందదు, అందుకే, హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకుంటూ సర్వ మనోకామనలను స్వతహాగా నెరవేర్చుకోండి. ప్రాప్తులు మీ ముందుకు స్వతహాగానే వస్తాయి. ఏమి విన్నారు? సర్వ ఆత్మిక ప్రాప్తులు ఉన్నదే బ్రాహ్మణుల కోసం కనుక ఎక్కడికి వెళ్తాయి! అధికారము కేవలం పిల్లలైన మీది మాత్రమే. అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు. అచ్ఛా -
సర్వ హోలీహంసలకు, నలువైపులా ఉన్న సత్యమైన సాహెబును రాజీ చేసుకునే సత్యమైన హృదయం గల శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వయాన్ని ఎవర్రెడీగా ఉంచుకునే నంబరువన్ పిల్లలకు, సదా స్వయాన్ని గాయనయోగ్యంగా, సంపూర్ణంగా మరియు సంపన్నంగా తయారుచేసుకునేవారికి, తండ్రికి సమీపమైన పిల్లలకు, సదా స్వయాన్ని అమూల్యమైన వజ్రం సమానంగా అనుభవం చేసే అనుభవీ ఆత్మలకు, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
మహారాష్ట్ర గ్రూప్ తో అవ్యక్త బాప్ దాదా కలయిక - సదా సంతోషంగా ఉంటున్నారా? సంతోషం అనగా నిండుగా, సంపన్నంగా ఉండడము. సంతోషము స్వయానికి కూడా ప్రియమనిపిస్తుంది, ఇతరులకు కూడా ప్రియమనిపిస్తుంది. ఎక్కడైతే సంతోషం ఉండదో, దానిని ముళ్ళ అడవి అని అంటారు. కావున మీ అందరి జీవితం సంతోషంగా తయారయింది. మరియు నడవడిక ఎలా తయారయింది? ఎగిరే కళలోని ఫరిశ్తాల నడవడిక వలె అయింది. కనుక స్థితి కూడా బాగుంది, నడవడిక కూడా బాగుంది. ప్రపంచంలోని వారు కలుసుకున్నప్పుడు స్థితి గతుల గురించి అడుగుతారు కదా. మరి మీ స్థితి గతులు ఎలా ఉన్నాయి? స్థితి సంతోషమయంగా ఉంది మరియు నడవడిక ఫరిశ్తాల నడవడికలా ఉంది. రెండూ బాగున్నాయి కదా? సంతోషంలో ఎలాంటి ముళ్ళు ఉండవు. ఇంతకుముందు జీవితం ముళ్ళ అడవిలో ఉండేది, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు పుష్పాల సంతోషంలోకి వచ్చేసింది. సదా జీవితంలో దివ్యగుణాలనే పుష్పాల యొక్క పూదోట ఉంది. దివ్యగుణాల పుష్పగుచ్చపు చిత్రాన్ని తయారుచేస్తారు కదా, ఆ దివ్యగుణాల పుష్పగుచ్చం ఏమిటి? మీరే కదా లేక వేరేవారు ఎవరైనా ఉన్నారా? ముళ్ళతో ఎప్పుడూ పుష్పగుచ్చం తయారవ్వదు, పుష్పాల పుష్పగుచ్చం తయారవుతుంది. కేవలం ఆకులు మాత్రమే ఉన్నా పుష్పగుచ్చాన్ని బాగాలేదు అని అంటారు. కనుక మీరు స్వయం దివ్యగుణాల పుష్పగుచ్చంగా అనగా సంతోషమయంగా అయ్యారు. మీ సంపర్కంలోకి ఎవరు వచ్చినా సరే, వారికి దివ్యగుణాలనే పుష్పాల యొక్క సుగంధం వస్తూ ఉంటుంది మరియు ఆ సంతోషాన్ని చూసి సంతోషిస్తారు, శక్తిని కూడా అనుభవం చేస్తారు. అందుకే ఈ రోజుల్లో డాక్టర్లు కూడా, తోటలోకి వెళ్ళి వాకింగ్ చేయమని చెప్తారు. కనుక సంతోషము ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తుంది మరియు సంతోషంలోకి కూడా తీసుకొస్తుంది. అందుకే, మీరు అంటారు, మేము ఎవర్ హ్యాపీగా (సదా సంతోషంగా) ఉన్నాము అని. ఎవరైనా ఎవర్ హ్యాపీగా అవ్వాలనుకుంటే, మా వద్దకు రండి అని ఛాలెంజ్ కూడా చేస్తారు. మీరు అందరికీ తండ్రి స్మృతిని ఇప్పిస్తారు. కనుక ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్దీ మరియు ఎవర్ హ్యాపీగా (సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా మరియు సదా సంతోషంగా) ఉండడము - ఇది మీ జన్మ సిద్ధ అధికారము. ఈ అధికారము మీకైతే లభించింది కదా? ఇది జన్మ సిద్ధ అధికారమని అందరికీ చెప్తారు. శరీరం అనారోగ్యంగా ఉన్నా కానీ మనసు ఆరోగ్యంగా ఉంది కదా. మనసు సంతోషంగా ఉంటే ప్రపంచమంతా సంతోషమే, మనసు అనారోగ్యంగా ఉంటే, శరీరము పాలిపోతుంది. మనసు బాగుంటే శారీరక రోగం కూడా అనుభవమవ్వదు. ఇలా జరుగుతుంది కదా! ఎందుకంటే మీ వద్ద చాలా చక్కటి సంతోషమనే ఔషధం ఉంది. ఔషధం బాగుంటే వ్యాధి పారిపోతుంది. మీ వద్ద ఏదైతే సంతోషమనే ఔషధం ఉందో, అది వ్యాధిని పారద్రోలుతుంది, మరపింపజేస్తుంది. కనుక మనసు సంతోషంగా ఉంటే, ప్రపంచం సంతోషంగా ఉంటుంది, జీవితం సంతోషంగా ఉంటుంది. అందుకే, సదా ఆరోగ్యవంతులుగా కూడా ఉన్నారు, ఐశ్వర్యవంతులుగా కూడా ఉన్నారు మరియు సంతోషంగా కూడా ఉన్నారు. స్వయం అలా ఉంటేనే, ఇతరులను ఛాలెంజ్ చేయగలరు. లేదంటే ఛాలెంజ్ చేయలేరు. స్వయాన్ని చూసుకొని ఇతరులపై దయ కలుగుతుంది. ఎందుకంటే మన పరివారమే కదా! ఎలాంటి ఆత్మలైనా సరే, ఒకే పరివారానికి చెందినవారు. ఎవరిని చూసినా సరే, వీరు మా సోదరులే, మా పరివారం వారే అని అనుభవం చేస్తారు. పరివారంలో కూడా కొంతమంది దగ్గరివారు ఉంటారు, కొంతమంది దూరంవారు ఉంటారు, కానీ పరివారానికి చెందినవారనే అంటారు కదా?
ఎలాగైతే తండ్రి దయాహృదయులు, తండ్రిని కృప చూపించండి, దయ చూపించండి అని వేడుకుంటారు! మరి మీరు కూడా కృప చూపిస్తారు, దయ చూపిస్తారు కదా ఎందుకంటే తండ్రి సమానంగా నిమిత్తులుగా అయ్యారు. బ్రాహ్మణ ఆత్మకు ఎప్పుడూ ఏ ఆత్మ పట్ల అసహ్యం కలగజాలదు. దయ కలుగుతుంది, అసహ్యం రాజాలదు. ఎందుకంటే కంసుడు అయినా, జరాసంధుడు అయినా, రావణుడు అయినా, ఎవరైనా కానీ, దయాహృదయుడైన తండ్రి పిల్లలు ఎప్పుడూ అసహ్యించుకోరు. పరివర్తన యొక్క భావన ఉంచుతారు, కళ్యాణ భావన ఉంచుతారు. ఎంతైనా, వారు మన పరివారం వారు, పరవశులై ఉన్నారు. పరవశులైనవారి పట్ల ఎప్పుడూ అసహ్యం కలగదు. అందరూ మాయకు వశమై ఉన్నారు. కనుక పరవశమై ఉన్నవారి పట్ల జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది. ఎక్కడైతే అసహ్యం కలగదో, అక్కడ క్రోధం కూడా రాదు. ఎప్పుడైతే అసహ్యం కలుగుతుందో, అప్పుడు ఆవేశం వస్తుంది, క్రోధం వస్తుంది. ఎక్కడైతే దయ ఉంటుందో, అక్కడ శాంతి దానం ఇస్తారు. దాత పిల్లలు కదా! కనుక శాంతిని ఇస్తారు కదా! అచ్ఛా!
Comments
Post a Comment