05-12-2017 అవ్యక్త మురళి

  05-12-2017         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

ఓం శాంతి. మహారథి పిల్లలందరూ బాబా లగనములో మగ్నమై ఉన్నారు. పిల్లలందరూ ప్రేమలో ఎంతో లీనమై ఉన్నారు. తండ్రి మరియు పిల్లల ఈ మిలనము చాలా చాలా అమూల్యమైనది. ముత్యం మాలలో ఎలా ఇమిడిపోతుందో అలా పిల్లలు బాబాను గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా పిల్లలంతా స్నేహ సూత్రంలోకి వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ తమ మనసులలో ఏమేమి మాట్లాడుకుంటున్నారో వారికే తెలుసు. కానీ మాకు తెలిసినదేమిటంటే ముత్యం హారంలో ఇమడిపోయినట్లుగా ఈ సమయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా స్నేహంలో ఇమిడిపోయారు. ప్రతి ఒక్కరి మనసు మరియు మాటల నుండి వాహ్ నా హృదయంలో ఇమిడిపోయే విశేషమైన ముత్యమా వాహ్! అని వెలువడుతుంది. బాబా హృదయంలో ఇమిడిపోయే ముత్యంగా ఈ సమయంలో ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఎలా మెరుస్తున్నారు, వారి మెరుపే అందరినీ మెరిసేట్లు చేస్తుంది. పిల్లలు తండ్రితో కలిసే ఈ మిలనపు దృశ్యాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. వాహ్ పిల్లలు వాహ్! పిల్లల హృదయంలో బాబా, బాబా హృదయంలో పిల్లలు. ఈ దృశ్యం చాలా మధురమైనది. ప్రతి ఒక్కరూ తమ హృదయంలో ఎన్నో అనుభవం చేసుకుంటున్నారు. మీరంతా అనుభవంలో లీనమై ఉన్నారు మరియు ఒకరినొకరు చూసి హర్షితులవుతున్నారు. 

నిర్వైర్ అన్నయ్య బాబాను ఇలా అడిగారు - బాబా, ఇప్పుడు 2017 సంవత్సరం పూర్తి కావస్తుంది, నూతన సంవత్సరం రాబోతుంది. మరి ఈ నూతన సంవత్సరంలో అందరి మనసులలో ఎటువంటి ఉల్లాసం ఉండాలి?

అందరూ ఎంతో హర్షితులవుతున్నారు. ఈ సంవత్సరము "స్నేహ సంవత్సరము”. అందరూ స్నేహంలో ఇమిడిపోయే అనుభవం చేసుకుంటారు. అందరి హృదయాలలో స్నేహపు వజ్రం మెరుస్తుంది. ఒక్కొక్క వజ్రం తమ తమ అనుభవం చేయిస్తుంది. ఎవరైనా వచ్చి చూస్తే, ఈ ఆత్మలు ఎక్కడి నుండి వచ్చాయి, వీరి ముఖంపై ఈ మెరుపు ఎక్కడిది, ఇంతగా ఆకర్షిస్తుంది అని అనుకుంటారు. బాబాను భగవంతుడని నమ్ముతారు, కానీ భగవంతుడు మరియు పిల్లలు ఎలా పరస్పరం కలుసుకుంటారు అన్నది వారు చూడలేదు. మీరైతే భగవంతుడు మరియు పిల్లల మిలనాన్ని అనుభవం చేసుకుంటున్నారు. ఈ మిలనము విశేషమైనది. హమ్ నె దేఖా, హమ్ నె పాయా, శివ్ భోలా భగవాన్ (మేము చూసాము, మేము పొందాము భోలానాథుడైన శివ భగవానుడిని...) అన్న పాటను ప్రతి ఒక్కరి మనసు పాడుతుంది. వారు ఎంత మధురమైనవారు, వర్ణించలేము, అందులో మునిగిపోవలసిందే. బాబా మరియు పిల్లల మిలనము, ఈ మిలనమే అతి మధురమైనది, ప్రతి ఒక్కరూ ఒకరినొకరు చూసుకుని హర్షితులవుతున్నారు.

బాబా, 22 వేలమంది వచ్చారు, సేవ టర్న్ పంజాబ్ మరియు రాజస్థాన్లది:- ఇప్పుడు జరుగుతున్న మిలనము రాజస్థాన్ మరియు పంజాబ్ లది. ఇందులోని ఒక్కొక్క రత్నము ఎంతో విలువైనది. ఒకరినొకరు చూసుకుంటేనే ఎంతో సంతోషము, ఉల్లాసము ఉత్పన్నమవుతున్నాయి. అందరి హృదయాలు వాహ్, వాహ్ అంటున్నాయి. ఈ వాహ్ ఎందుకు వస్తుంది! ఎందుకంటే స్వయంగా బాబా, భగవంతుడు పిల్లలను వెతికారు మరియు వారిని ఎంతగా యోగ్యులుగా చేసారంటే వారిని చూడగానే స్వతహాగా వాహ్ బాబా వాహ్! వాహ్ మిలనము వాహ్! అని వెలువడుతుంది. అచ్చా.

Comments