05-11-2014 అవ్యక్త మురళి

 05-11-2014         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“వెలిగి ఉన్న మీ దివ్య స్వరూపంలో ఎలా ఉండాలంటే మీ ఎదురుగా వచ్చిన వారి దీపము వెలగాలి, మీ సాధారణ స్వరూపం వారికి కనిపించకూడదు" 

నలువైపులలోని చైతన్యమైన, వెలిగి ఉన్న దీపాలకు దీపరాజు యొక్క ఓం శాంతి. ఈ చైతన్య దీపాలు ఎంత ప్రియంగా ఉన్నాయి. మీ అందరి స్మృతిచిహ్నమునే విశ్వంలో జరుపుకుంటున్నారు. చైతన్య దీపాలైన మీరందరూ దీపరాజుతో మిలనం జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క దీపము దీపరాజుని స్మృతిలో ప్రకాశిస్తూ ఉంది. బాప్ దాదా కూడా ప్రతి దీపానికి చాలా చాలా చాలా ప్రియస్మృతులు తెలుపుతున్నారు. ప్రతి దీపము చాలా స్నేహి మరియు హృదయంలో ఇమిడేవారు. నలువైపుల ఉన్న ప్రకాశం హృదయానికి ఎంతో మనోహరంగా ఉంది. అందరి హృదయాల నుండి ఏమని వెలువడుతుంది? వాహ్! వాహ్! వాహ్! ఈ చైతన్య దీపాలకు గుర్తుగానే విశ్వంలో జరుపుకుంటున్నారు. ఈ చైతన్య దీపాలు దీపరాజుతో మిలనం జరుపుకోవడానికి చేరుకున్నాయి. వచ్చిన దీపాలన్నిటినీ చూసి దీపరాజు మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నారు. వాహ్ నా దీపాలు వాహ్! ప్రతి ఒక్క దీపపు జ్యోతి నంబరువారీగా ప్రకాశిస్తుంది. బాప్ దాదా అయితే ఆ దీపాలను చూసి, అన్ని దీపాలకు అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు. మీ స్మృతిచిహ్నంగానే విశ్వంలో జరుపుకుంటున్నారు. చైతన్య దీపాలైన మీరు దీపరాజుతో మిలనం జరుపుకుంటున్నారు. ఈ మిలనం కూడా చాలా ప్రియమైనది మరియు అతీతమైనది. ప్రతి దీపము యొక్క హృదయంలో ఎవరు నిండి ఉన్నారు? దీపరాజు, నా బాబా. ప్రతి ఒక్కరి ముఖంలో దీపరాజుని స్మృతి ఇమిడి ఉండటాన్ని చూస్తున్నాము.

ఈరోజు మీరు కూడా విశ్వంలో మీ స్మృతిచిహ్నాన్ని చూస్తున్నారు కదా. ఎంతమంది భక్తులు నలువైపుల దీపాలైన మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా మీ స్మృతిచిహ్నాన్ని చూసి మనసులో సంతోషంతో వాహ్ దీపరాజు వాహ్ అనుకుంటున్నారు కదూ. ప్రతి సంవత్సరం జరుపుకునే స్మృతిచిహ్నంగా చేసేసారు. ఈ దీపజ్వాల ఏమిటో, ప్రకాశం ఏమిటో మీరు అర్థం చేసుకోగలరు! భక్తులైతే ఏదో ఒక విధంగా ప్రకాశాన్ని వెలిగిస్తారు. కానీ, దీపరాజు మరియు దీపాల మిలనము జరుగుతుందని చైతన్య దీపాలైన మీకు తెలుసు. బాప్ దాదా కూడా ఒక్కొక్క దీపాన్ని చూసి, ముందు నుండి వెనుక ఉన్నవారి వరకు దూరం నుండి చూసి సంతోషిస్తున్నారు, వాహ్ దీపరాజుని దీపాలు వాహ్! మీ స్మృతిచిహ్నాన్నే చూస్తున్నారు మరియు చైతన్య రూపంలో మీరు దీపరాజుతో మిలనం చేసుకుంటున్నారు. ఒక్కొక్క దీపానికి ఉన్న ఒక్కొక్క వెలుగు ఎంత ప్రియంగా ఉంది. ఒకవేళ స్థూలంగా 10-12 దీపాలను ఒకచోట ఉంచితే వాటి జ్యోతి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇంతమంది చైతన్య దీపాలను సమ్ముఖంలో చూస్తున్నందుకు బాప్ దాదాకు చాలా సంతోషంగా ఉంది. బాప్ దాదా ప్రతి దీపానికి వాహ్ దీపమా వాహ్ అని చెప్తున్నారు. బాప్ దాదా మాత్రమే చైతన్యంలో దీపాలను చూడగలరు మరియు బాబా పిల్లలే ఒకరినొకరు దీపాలుగా చూసుకోగలరు. మీరందరూ ఏ రూపంలో కూర్చున్నారు! చైతన్యమైన దీపాలుగా కూర్చున్నారు కదా! ప్రతి ఒక్కరి వెలిగి ఉన్న జ్యోతి - ఒకవేళ ఈ దృశ్యాన్ని చూసినట్లయితే చాలా వాస్తవంగా మరియు సుందరంగా కనిపిస్తుంది. ముఖాలన్నీ దీపాల వలె ప్రకాశిస్తున్నాయి. మీరు కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటున్నారు కదా. మిమ్మల్ని మీరు సాక్షిగా అయి చూసుకుని ఎంతగానో చిరునవ్వును చిందిస్తున్నారు. బాప్ దాదా కూడా చిరునవ్వుతో ఉన్న ప్రతి దీపాన్ని చూసి, చైతన్య దీపాల దీపావళిని జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క దీపము తమ దివ్య జ్యోతిని వ్యాపింప చేస్తుంది. ఒకవేళ ఇన్ని దీపాలు స్థూలంగా వెలిగితే ఎంత సుందరమైన దృశ్యం అవుతుంది కానీ బాప్ దాదా చైతన్యమైన సత్యమైన దీపాలమాలను చూస్తున్నారు. ప్రతి దీపము తమ తమ ప్రాక్టికల్ ధారణ స్వరూపంలో ఉన్నట్లుగా బాప్ దాదా చూస్తున్నారు మరియు సంతోషిస్తున్నారు వాహ్ నా ప్రకాశిస్తున్న దీపాలు వాహ్!

బాప్ దాదా చైతన్య దీపాలైన మిమ్మల్ని చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు. వాహ్ దీపమా వాహ్! మీ అందరికీ కూడా మీ స్వరూపం, దీప ప్రకాశ స్వరూపం కనిపిస్తుంది కదా. బాప్ దాదాకైతే చాలా మంచిగా కనిపిస్తుంది, దీపాలు నంబరువారీగా ఉన్నాయి కానీ వెలిగి ఉన్న దీపాల సభను చూసి సంతోషిస్తున్నారు. వాహ్ వెలిగి ఉన్న దీపాలు వాహ్! సదా వెలిగే జ్యోతి, భక్తులు ఎంత ప్రేమగా గుర్తు చేస్తారు మరియు బాప్ దాదా తమ ఎదురుగా ఉన్న దీపాలను చూసి సంతోషిస్తున్నారు వాహ్ దీపమా వాహ్! మీరందరూ కలిసి విశ్వంలో దీపాలు వెలిగించారు మరియు వెలిగిస్తూ ఉంటారు. మరి బాప్ దాదా ఏమి చూస్తున్నారు! చైతన్య దీపాలను చూసి సంతోషిస్తున్నారు వాహ్ పిల్లలూ వాహ్! వాహ్ దీపాలూ వాహ్! 

ఇక ముందు కూడా మీ జ్యోతితో, దీపపు జ్యోతితో ఇతరులనూ దీపంగా చేసి వెలిగిస్తూ ఉండండి. విశ్వంలోని వారికి చైతన్య దీపాల గురించి తెలియదు కనుక స్థూల దీపాలను వెలిగిస్తారు. కానీ మీరందరూ ఈరోజు ఎవరిని చూస్తున్నారు? చైతన్య ముఖాలలో వెలిగి ఉన్న దీపాలను చూస్తున్నారు. బాప్ దాదా కూడా చైతన్య రూపంలో పిల్లలు ఒక్కొక్కరినీ వెలిగి ఉన్న దీపంగా చూసి సంతోషిస్తున్నారు. ప్రకాశంలో తేడా అయితే ఉంది, నంబరువారీగా ఉన్నారు కానీ ఆరిపోయి ఉన్న మీరు వెలిగారు కదా. కావున, బాప్ దాదా, వెలిగి ఉన్న దీపాల సభను చూస్తున్నారు. వారైతే కేవలం దీపమాలను వెలిగిస్తారు కానీ బాప్ దాదా వెలిగి ఉన్న దీపాల సభను చూస్తున్నారు, సంగఠనను చూస్తున్నారు. చెప్పండి, ఎంత ప్రియంగా ఉంది! ఒక్కొక్క చైతన్య దీపము తమ జ్యోతిని తెలుసుకోవచ్చు. బాప్ దాదా స్వరూపం ద్వారా చూస్తున్నారు, పిల్లలు బుద్ధి ద్వారా తెలుసుకోవచ్చు. మరి మీరందరూ ఈ సభలో దీపావళి, సత్యమైన దీపాల దీపావళి, వెలిగి ఉన్న దీపాల దీపావళిని చూస్తున్నారు కదా! చూస్తున్నారా, చేతులెత్తండి. మిమ్మల్ని కూడా చూసుకుంటున్నారు కదా!

బాప్ దాదా చైతన్య దీపాలను చూసి చాలా సంతోషిస్తున్నారు వాహ్ దీపాలూ వాహ్! ఒక్కొక్క దీపము తమ తమ ప్రకాశంతో ఎంతటి కాంతిని చూపిస్తున్నాయి! ప్రతి ఒక్కరి ముఖము తమ తమ వెలిగి ఉన్న దీపముతో తమ పరిచయాన్ని ఇస్తుంది. ఈ రోజు దీపరాజు సత్యమైన దీప పిల్లలను చూసి ఎంతో సంతోషిస్తున్నారు. వాహ్ దీప పిల్లలూ వాహ్! మీరు కూడా ఇప్పుడు మీ వెలిగి ఉన్న రూపంతో మీ అనేక భక్తులకు సాక్షాత్కారాన్ని చేయిస్తున్నారు. ద్వాపరయుగం నుండి చూస్తే మీ భక్తులు ఎంతమంది ఉంటారు! మీ రూపాన్ని వారు గుర్తించినా గుర్తించకపోయినా కానీ మా దీపరాజు వచ్చేసారు అని డ్రామా చూపిస్తుంది. మీరిక్కడ సాధారణ రూపంలో కూర్చున్నారు కానీ మీ భక్తులు మిమ్మల్ని దీపం రూపంలో చూస్తున్నారు మరియు బాప్ దాదా వాహ్ పిల్లలూ వాహ్ స్వరూపంలో చూస్తున్నారు. దీపరాజు మరియు దీపాల మిలనము ఎంత సుందరంగా ఉంది. బాబా హృదయంలో వాహ్ పిల్లలూ వాహ్ అని వస్తుంది. పిల్లల హృదయంలో వాహ్ బాబా వాహ్ అని వస్తుంది. మరి అందరూ సంతోషంగా, సమృద్ధిగా ఉన్నారా? ఉన్నారా? చేతులెత్తండి. వాహ్! వాహ్ పిల్లలూ వాహ్! ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ, వెలిగి ఉన్న దీపాలైన మీ ముందుకు వస్తే వారి దీపమూ వెలగాలి. మీరు అటువంటి దీపరాజులు, మీ ఎదురుగా రాగానే వారు తమ స్వరూపాన్ని తెలుసుకోవాలి. మీ ఎదురుగా రాగానే మీ దివ్య స్వరూపం వారికి కనిపించాలి, అటువంటి సమయం కూడా వస్తుంది, మీ సాధారణ స్వరూపం మాయమైపోతుంది. మీరు బాప్ దాదా ఎదురుగా వచ్చినప్పుడు, సమయానుసారంగా బాప్ దాదాను ఏ రూపంలో చూస్తారో అలాగే మీరూ మిమ్మల్ని చూసుకుంటారు కదా. భక్తులకు మీరు సాధారణంగా కనిపించరు, సాధారణ రూపంలో ఉన్న దేవతా రూపం లేక దేవీ స్వరూపంగా కనిపిస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లల నుండి ఇటువంటి ప్రాక్టికల్ భావన కలుగుతుంది కానీ అందరూ ఇటువంటి స్థితికి చేరుకుంటారు.

బాప్ దాదా ఈరోజు మీ అందరినీ చైతన్య దీపాల రూపంలోనే చూస్తున్నారు మరియు ప్రతి ఒక్కరినీ చూసి వాహ్ వాహ్ అని అంటున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? చేతులెత్తండి. వాహ్! సంతోషమైతే మీ సొంత వస్తువు, సంతోషం పరాయి వస్తువు కాదు, మీ వస్తువు. దానిని మీలోకి తెచ్చుకోండి, అంతే, ఇంకేముంది చెయ్యడానికి! అచ్ఛా. 

సేవ టర్న్ కర్ణాటక మరియు ఇండోర్ జోనా వారిది: - (కర్ణాటక నుండి 10,000మంది వచ్చారు) చాలా మంచిది. ముందుకు సాగుతూ ఉండండి, అందరినీ ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. యజ్ఞ సేవ యొక్క అవకాశాన్ని తీసుకున్నారు, మంచిది. అందరికీ సేవతో మీ పరిచయాన్ని ఇచ్చారు. బాప్ దాదా కూడా కర్ణాటక నివాసులకు ప్రత్యేకమైన ప్రియస్మృతులను తెలుపుతున్నారు. 

ఇండోర్ జోన్(3000మంది వచ్చారు):- చాలా మంచిది. అందరికీ అవకాశం లభిస్తుండటం మంచిది, అవకాశాన్ని అందరూ ఎంతో సంతోషంగా ప్రాక్టికల్ లోకి తెస్తున్నారు. చూడండి, ఎంతమంది వచ్చారో! సేవా భాగ్యము చాలా మంచిగా లభించింది. బ్రాహ్మణులు బ్రాహ్మణుల సేవ చేస్తున్నారు. ఈ భాగ్యము ఎంత ప్రియమైనది మరియు ఎంత సంతోషిస్తారు! మీకు అవకాశం లభించినందుకు మీకు సంతోషంగా ఉంది కదా. మంచిది. 

డబుల్ విదేశీ సోదరసోదరీలతో:- వచ్చారు, మంచిది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం అన్నది డబుల్ విదేశీయులలో లేదు. కొద్దిమంది వచ్చినా, ఎక్కువమంది వచ్చినా కానీ హాజరు తప్పకుండా ఉంటుంది. బాగుంది, డబుల్ విదేశీయులకు డబుల్ సార్లు ఏమిటి, డబుల్ వేయిసార్లు అభినందనలు. ఇక్కడ ఏ జోన్ వారైతే సేవకు నిమిత్తమయ్యారో వారికి వేయిసార్లు అభినందనలు, అభినందనలు. ప్రతి ఒక్కరి హృదయాల నుండి సేవకు అభినందనలు వెలువడుతున్నాయి, బాప్ దాదా హృదయాన్ని చూస్తున్నారు. డబుల్ విదేశీయులను చూసి చాలా సంతోషంగా ఉంది. డబుల్ విదేశీయులు ఏ పాత్రలోనైనా తప్పకుండా పాత్రను తీసుకుంటారు. ఎక్కడెక్కడి నుండో చేరుకుంటారు, ఇది అద్భుతం. కావున డబుల్ విదేశీయులకు డబుల్ అభినందనలు మరియు ఇక్కడి సేవాధారులకు వేయిసార్లు అభినందనలు, అభినందనలు.

మొదటిసారి వచ్చినవారు:- మంచిది, బాప్ దాదా చూస్తున్నారు, మంచిది. బాప్ దాదా ఈ సాధువును కూడా చూస్తున్నారు(కర్ణాటక నుండి ఒక మహాత్మ వచ్చారు, వారిని బాప్ దాదా చూస్తున్నారు) మంచిది, మీ తోటివారిని కూడా మేల్కొల్పండి. ఇటువంటి వారి గ్రూపును తీసుకువస్తే వీరి సేవ కూడా జరుగుతుంది. అయినా మంచి పనే చేస్తున్నారు. ఆత్మలకు ఏదో ఒకటి వినిపిస్తూ ఏదో ఒక రకంగా మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా విషయాలలో మంచిగా చేస్తున్నారు. బాప్ దాదా వీరికి కూడా ప్రియస్మృతులు తెలుపుతున్నారు. అచ్ఛా.

ఈరోజైతే జరుపుకున్నారు, మీరైతే ప్రాక్టికల్ జీవితంలో ఉన్నారు. ప్రతి ఒక్కరి హృదయాలలో బాబా ఉన్నారు మరియు మీరు కూడా సదా బాబా హృదయంలో ఉన్నారు. అచ్చా. 

జానకి దాదీతో: - శరీరాన్ని నడిపించడమైతే వచ్చు కదా. బాగున్నారు కదా. ఇదే శక్తి. బాప్ దాదా సమయానికి శక్తినిచ్చేస్తారు. మంచిది. పిల్లలందరూ తమ తమ కార్యాలను మంచిగా చేస్తున్నారు అందుకే అందరికీ అంభినందనలు. మీ అందరికీ కూడా అభినందనలు, అభినందనలు.

మోహిని అక్కయ్యతో: - బాగున్నారు. చాలా తేడా వచ్చింది. (మీరు వరదానాలను ఇస్తూ వచ్చారు) అయిపోతుంది, సేవ చేస్తారు. లోపలే చెయ్యండి. ఇక్కడికే అందరూ వస్తారు, మిగతా స్థానాలలో అయితే బయటకు వెళ్ళవలసి వస్తుంది, ఇక్కడైతే వారే వచ్చేస్తారు. (వీరు బయట సేవలకు వెళ్ళాలనుకుంటున్నారు) అయితే తీసుకువెళ్ళండి అప్పుడు ఉత్సాహం వస్తుంది.  

రమేష్ అన్నయ్యతో:- బాగుంది, అందరూ కలిసి పరస్పరంలో సేవ ప్లాను వగైరాలు తయారు చెయ్యండి, బాప్ దాదాకు నచ్చుతుంది. చేస్తున్నారు, ఇంకా చెయ్యండి. పరస్పరం సేవ మీటింగ్ లు చేసుకుంటున్నారు, ఇంకొంచెం పెంచింది. మంచిది. ఇప్పుడు మంచిగా నడుస్తుంది. 

బృజ్ మోహన్ అన్నయ్యతో: - సదా మంచిగా ఉంటారు. అచ్చా.  

Comments