05-04-2018 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“అవ్యక్త దివసము యొక్క దినచర్య"
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్ దాదాకు అతి గారాల పిల్లలు, సదా తమ శ్రేష్ఠ మనసుతో శుభ భావనల సకాష్ ను ఇచ్చేవారు, నిమిత్తము మరియు నిర్మానము యొక్క విధి ద్వారా సర్వ ఖాతాలు జమ చేసుకునేవారు, సర్వ ఖజానాలతో సంపన్నులుగా అయ్యే నిమిత్త టీచరు అక్కయ్యలు మరియు దేశవిదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరీసోదరులు, ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
ప్రియమైన బాప్ దాదా సీజన్లో ఇది చివరి టర్ను. మీ అందరి సూక్ష్మ సకాశ్ తో మన మధురమైన దాదీ గుల్జార్ గారి ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది కానీ డాక్టర్లు మధువనానికి తీసుకురావడానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ బాప్ దాదా మరియు మధువన బేహద్ ఇంటి ఆకర్షణ పూర్తి బ్రాహ్మణ పరివారాన్ని తన వైపుకు స్వతహాగానే ఆకర్షించింది. ఈనాటి ఈ చివరి టర్నులో షుమారు 30 వేలమంది సోదరసోదరీలు అవ్యక్త మిలనం కోసం శాంతివనానికి చేరుకున్నారు. భగవంతుడు కణ కణంలో ఉన్నాడు అని భక్తులు భావనతో చెప్పినట్లుగా ఇక్కడ మధువనంలో కూడా ప్రతి కణంలో బాప్ దాదా మరియు మహారథుల ఆత్మిక స్నేహము కణ కణములో నిండి వాటి శక్తిశాలి ప్రకంపనాలు నలువైపుల వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరూ స్వతహాగానే రిఫ్రెష్ అవుతున్నారు. ప్రతి గ్రూపులో 60-70 శాతం మంది సోదరసోదరీలు మొదటిసారి మధువనానికి వస్తున్నారు. వారికి మహారథుల క్లాసులు, యోగ కార్యక్రమాలు మరియు అవ్యక్త మురళి యొక్క పరివర్తన విధి ద్వారా కూడా చాలా మంచి రిఫ్రెష్ మెంటు లభిస్తుంది. అందరూ సంతుష్టంగా అయ్యి వరదానాలతో నిండుగా వెళ్తున్నారు. అద్భుతమంతా మధురమైన బాబాదే, అవ్యక్త వతనవాసిగా ఉన్నప్పటికీ సాకార వతనంలో గుప్త రీతిలో తమ పిల్లలకు సకాశ్ ను మరియు సర్వ శక్తుల పాలనను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసులలో సాకారం ద్వారా అవ్యక్త మిలనం చేసుకోవాలన్న ఆశ సదా ఉంటుంది కానీ డ్రామాలో విధి. ఇప్పటివరకు ఈ 2018 సంవత్సరంలో ప్రియమైన అవ్యక్త బాప్ దాదా యొక్క సాకార మిలనము జరగలేదు. మనందరి మధురమైన దాదీ గుల్జార్ గారు త్వరత్వరగా ఆరోగ్యాన్ని పుంజుకుని మధువనానికి రావాలి మరియు వారి ఆత్మిక దృష్టి ద్వారా మనమంతా బాప్ దాదా దృశ్యాన్ని చూడాలి అన్నదే మనందరి శుభ ఆశ.
ఇకపోతే ఈ గ్రూపులో సేవ టర్ను ఢిల్లీ మరియు ఆగ్రా జోన్ వారిది. దేశవిదేశాలలోని ఇతర స్థానాల నుండి కూడా అనేకానేక సోదరసోదరీలు చేరుకున్నారు. అందరూ అమృతవేళ నుండే అవ్యక్త స్థితిలో ఉండి అవ్యక్త వతనపు షికారుకు వెళ్తున్నారు. ఇంతమంది సోదరసోదరీలు ఉన్నప్పటికీ నలువైపుల ఎంతో మంచి సైలెన్సు యొక్క వాతావరణం ఉంది. అందరూ బాబా ప్రేమలో లీనమై ఉన్నారు. అందరి హృదయాలలో బాబా స్మృతి ఇమిడి ఉంది. ప్రతి సారి వలె అవ్యక్త మిలనపు అలౌకిక విధుల క్లాసును విన్న తర్వాత ముఖ్యమైన పెద్దక్కయ్యలు సంగఠిత యోగ అభ్యాసమును చేయించారు. ఆ తర్వాత ప్రియమైన బాప్ దాదాకు భోగ్ ను స్వీకరింపజేసారు. భోగ్ తర్వాత 7 నుండి 8 వరకు, 18 మార్చి 2008 అవ్యక్త మహావాక్యాలను అందరూ వీడియో ద్వారా విన్నారు. ఆ తర్వాత దాదీలు మరియు పెద్ద అన్నయ్యలు మరియు అక్కయ్యలు తమ శుభ భావనలను తెలిపారు. ఈ రోజు ఇక్కడ వినిపించబడ్డ మహావాక్యాలను మీ వద్దకు పంపుతున్నాము. మీ మీ క్లాసులలో అందరినీ రిఫ్రెష్ చెయ్యగలరు. అచ్ఛా! అందరికీ స్మృతి... ఓం శాంతి.
Comments
Post a Comment