05-04-2013 అవ్యక్త మురళి

                         05-04-2013         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

“శుభ భావనతో ఒకరికొకరు సహయోగులుగా అయ్యి నిర్విఘ్నంగా ఉండండి మరియు అందరినీ నిర్విఘ్నంగా చెయ్యండి. సదా సంతోషంగా ఉండండి, అందరినీ సంతోషపరచండి" 

ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని తమ ఖజానాలతో సంపన్నమైన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. హృదయం నుండి వాహ్ పిల్లలూ వాహ్! అని వెలువడుతుంది. పిల్లలు ప్రతి ఒక్కరి ముఖంలో ఖజానాల ప్రాప్తి యొక్క ప్రకాశము మెరుస్తుంది. మెజారిటీ పిల్లలలో ఖజానాలతో సంపన్నంగా ఉన్న ప్రకాశము కనిపిస్తుంది. బాప్ దాదా వాహ్ పిల్లలూ వాహ్! అంటూ పిల్లలు ఒక్కొక్కరి గుణగానం చేస్తున్నారు. చెప్పండి, వాహ్ వాహ్ పిల్లలు కదూ! బాబా చెప్పారు, పిల్లలు చేసారు. పిల్లలు ప్రతి ఒక్కరి ముఖంలో, మస్తకంలో ఖజానాలకు యజమానిని అన్న ప్రకాశం కనిపించాలి అని బాబా అంటారు. దానిని ప్రతి ఖజానాకు అధికారి అయిన పిల్లలలో చూసి ఈ రోజు బాప్ దాదా సంతోషిస్తున్నారు మరియు ఏ పాటను పాడుతున్నారు? వాహ్ పిల్లలూ వాహ్! ఎలా అయితే ఈ రోజు ప్రతి ఒక్కరి ముఖములో ఖజానాల సంపన్నత ప్రకాశిస్తుందో అలాగే సదా ఉండండి. ఎవరు చూసినా మీ ముఖము మాట్లాడాలి, మీరు మాట్లాడాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఎలా అయితే మీ ముఖము ప్రకాశిస్తుందో అలా సదా ఉంటుందా అని పరిశీలించుకోండి. ఎవరు చూసినా మీ ముఖము మాట్లాడాలి, నోటితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ముఖము మాట్లాడాలి. ఇలాగే సదా ఖజానాలతో సంపన్నంగా, కర్మలు చేస్తూ కావచ్చు, యోగం చేస్తూ కావచ్చు, బాబా స్మృతిలో ఉంటూ కావచ్చు, సదా ఇలాగే కనిపించాలి. ప్రతి ఒక్కరూ తమ ప్రకాశిస్తున్న ముఖము సమానంగా ఉండగలరు కదా! ఎందుకంటే ప్రస్తుతం సమయం గడుస్తున్న కొద్దీ పరిస్థితుల అనుసారంగా టెన్షన్ పెరుగుతుంది. అప్పుడు మీ ముఖము వారిని సంతోషపరుస్తుంది. ఇటువంటి సేవను చెయ్యడానికి పిల్లలు ప్రతి ఒక్కరూ తయారీలు చేసుకోవాలి. ఖజానాలు ఏమేంటివి తెలుసు కదా! విశేష ఖజానాలు - జ్ఞానము, యోగము, ధారణ, వీటిని స్వయంలో పరిశీలించుకోండి. 

బాప్ దాదా ఈనాటి సభలో విశేష ఖజానాలతో సంపన్నమైన పిల్లలను చూస్తున్నారు. అన్నిటికన్నా శ్రేష్ఠ ఖజానా - ప్రస్తుత సంగమ సమయము, ఎందుకంటే ప్రస్తుత సమయంలో స్వయంగా తండ్రి, తండ్రి గురువు సంబంధంలో వచ్చి ఉన్నారు. ప్రస్తుత సమయంలో స్వయంగా తండ్రి పిల్లలను ఖజానాలతో సంపన్నంగా చేస్తున్నారు. మరి చెప్పండి, సమయముపై ప్రేమ ఉంది కదా! మాలో సర్వ ఖజానాలు జమ అయి ఉన్నాయా అని అందరూ పరిశీలించుకోండి. బాబా సమానంగా సర్వ ఖజానాలను పంచుతున్నారా? బాబా సమానంగా మేము కూడా ఖజానాలకు అధికారులము అని భావించేవారు చేతులెత్తండి. బాప్ దాదా సంతోషిస్తున్నారు, చేతులైతే మెజారిటీ ఎత్తుతున్నారు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ఖజానాలతో సంపన్నతకు అభినందనలు తెలుపుతున్నారు. బాగుంది, బాప్ దాదా ఖజానాలతో నిండుగా ఉన్న తమ పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. 

అన్ని వైపులనుండి వచ్చిన పిల్లలను చూసి బాప్ దాదా పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నారు. ఎలా అయితే ఇప్పుడు అందరూ సంతోషంతో నిండుగా కనిపిస్తున్నారో అలాగే సదా ఉంటారా? ఏ పరిస్థితి వచ్చినా కానీ పరిస్థితులు మన ఖజానాల సంతోషాన్ని తీసుకుపోకూడదు. ఇప్పుడు ఎలా అయితే సంతోషపు ముఖము ఉందో, స్నేహము ప్రేమల ముఖము ఉందో అలాగే సదా ఉండండి. చెప్పండి, ఉండగలరా? సదా ఉంటాము, గడిచిందేదో గడిచిపోయింది, ఇప్పుడు సదా ఉంటాము అనేవారు చేతులెత్తండి. చూడండి, చేతులైతే అందరూ ఎత్తుతున్నారు, మెజారిటీ ఎత్తుతున్నారు. మరి ఎప్పుడూ ఏ పరిస్థితి వచ్చినాకానీ ఇటువంటి ముఖమే ఉండాలి, తల అయితే ఊపండి. ఉంటుందా? ఉంటుందా? ఎవరు వచ్చారు అని అప్పుడు అందరూ చూస్తారు, మిమ్మల్ని చూసి వారు సగం సంతోషంలోకి వచ్చేస్తారు. అచ్ఛా. ఈరోజు ఏ జోన్ వచ్చింది?

సేవ టర్న్ ఇండోర్ జోన్ వారిది:- అచ్చా, సగం హాలు ఇండోర్ జోన్ వారు నిల్చున్నారు. వాహ్ పిల్లలూ వాహ్! బాగుంది, బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషపు చప్పట్లు కొడ్తున్నారు. కానీ అక్కడకు వెళ్ళినాకానీ ఇక్కడ ఎలా అయితే సంతోషమయ ముఖంతో ఉన్నారో, అలాగే సదా ఉండాలి. ఈ ప్రతిజ్ఞను స్వయంతో చెయ్యండి. చూడండి, ఇది మంచిగా అనిపిస్తుంది కదా! వాడిపోయిన ముఖాన్ని కూడా పెట్టండి మరియు నవ్వుతున్న ముఖాన్ని కూడా పెట్టండి, ఏది మంచిగా అనిపిస్తుంది? నవ్వుతున్న ముఖము మంచిగా అనిపిస్తుంది కదా! మరి ఈ రోజు నుండి పిల్లలందరూ, కేవలం జోన్ కాదు, పిల్లలందరూ తమ హృదయంలో ప్రతిజ్ఞ చెయ్యండి - సదా సంతోషంగా ఉంటాము మరియు అందరినీ సంతోషపరుస్తాము. ఎందుకంటే సంతోషంవంటి ఔషధం లేదు. బాప్ దాదా అనేకసార్లు సంతోషంలోని అద్భుతాన్ని వినిపించారు. అది కేవలం ఒక్క సంతోషంలోనే ఉంది. చూడండి, ఏదైనా వస్తువు పంచితే అది మన దగ్గర తగ్గిపోతుంది కానీ సంతోషాన్ని ఒకవేళ పంచితే, అది తగ్గుతుందా? పెరుగుతుంది కదా! కావున బాప్ దాదా యొక్క ఈ స్లోగన్ ను గుర్తుంచుకోండి. ఇక్కడ (మస్తకం పై) వ్రాసుకోండి - సంతోషంగా ఉండాలి మరియు సంతోషపరచాలి. ఇష్టమేనా? ఎవరికి ఇష్టమో వారు చేతులెత్తండి. మరి ఇంతమంది సంతోషమయ పిల్లలను చూసి బాబా ఇంకెంత సంతోషిస్తారు! మరి పక్కా ప్రతిజ్ఞ చేయండి, ఏమి చెయ్యాలి? సంతోషంగా ఉంటాము మరియు సంతోషాన్ని పంచుతాము. పక్కానా? లేక ఇక్కడే ఏదైనా జరిగితే సంతోషం మాయమవుతుందా? వద్దు. సంతోషం మాయమయ్యే విషయమే లేదు. ఈ రోజు నుండి అందరూ పరిశీలించుకోండి. సంతోషాన్ని పోనివ్వకండి. శక్తి ఉందా? ఉంటే చేతులెత్తండి. అచ్చా. చూడండి, మీ జోన్ వారు, మీ సెంటరువారు మీ చేతిని చూస్తున్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. ధైర్యమునైతే ఉంచారు. మీ ధైర్యము, తండ్రి సహాయము కలిసి ఉంటాయి. అందరి ఫోటో అయితే తీస్తున్నారు కదా! ఈ ఫోటోను ఈ జోన్ వారికి కూడా ఇవ్వండి. ఒకవేళ వచ్చేవారికి కావాలంటే ఈ ఫోటోను ఇవ్వండి. ఈ రోజు ఉన్న ముఖము సదా ఉండాలి. మరి అందరికీ సమ్మతమేనా, సదా సంతోషంగా ఉంటారా మరియు సంతోషాన్ని పంచుతారా? సమ్మతమేనా? రెండ్రెండు చేతులెత్తండి. అచ్చా, మీ ఈ ఫోటోను గుర్తుంచుకోండి.

ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే మిమ్మల్ని ఒక్కొక్కరిని దూరం నుండి ఎవరు చూసినా, మీరు నవ్వుతూ కనిపించాలి, మీ సంతోషమయ ముఖమును చూసి వారూ సంతోషించాలి, ఈ సేవను చేస్తారా? చేస్తారా? అచ్చా, చేతులెత్తండి. వాహ్ పిల్లలూ వాహ్! అని బాబా అంటున్నారు. ఈ రోజు నుండి అన్ని స్థానాలలో అకస్మాత్తుగా ఎవరు వచ్చినా, బాప్ దాదా కూడా పంపిస్తారు. ఎందుకంటే పిల్లలు అలాంటి ఇలాంటి ముఖాన్ని బాప్ దాదా చూడాలనుకోవడం లేదు. మరి బాప్ వాదాను సంతోషపెట్టాలి కదా? చేస్తారా? అందరూ మనస్పూర్తిగా హాఁ జీ అంటున్నారు. ఇప్పుడు ప్రతి సెంటరువారు తమ తోటివారిని పరిశీలించండి, ఏమీ అనద్దు, ఎందుకు ఏమిటి అని అనద్దు, కానీ మీ ముఖము ఎంత ప్రేమగా పెట్టాలంటే వారు మౌనంగా ఉండిపోవాలి. ఈ సేవను చేస్తారు కదా! స్వయం ఉండండి మరియు ఇతరులను కూడా తమ సమానంగా చెయ్యండి. ఎవరైనా అకస్మాత్తుగా ఎప్పుడైనా ఏ సెంటరుకైనా వెళ్తే మేము సంతోష స్థానానికి వెళ్ళాము అని వారికి అనుభవం అవ్వాలి. ఎక్కడ సంతోషము ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా వీడ్కోలు తీసుకునేటప్పుడు ఏమని అంటారు సంతోషంగా ఉండండి, వర్ధిల్లండి అని అంటారు కదా. మరి ఇప్పుడు బాప్ దాదా అకస్మాత్తుగా ఎవరినైనా పంపిస్తారు, గుప్తంగా, చూస్తారు, ఎందుకంటే పిల్లలైన మీరందరూ పెద్ద పెద్ద తండ్రి పిల్లలు కదా. బాప్ దాదా కూడా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు మరియు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు. సదా సంతోషంగా వర్ధిల్లండి. ఈ రోజు క్రొత్తవారు చాలామంది రావడం కూడా బాప్ దాదా చూసారు.

ఈరోజు మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి, ఎంతమంది ఉన్నారో చూడండి! వచ్చినవారికి బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. టూ లేట్ సమయం కన్నా ముందే వచ్చారు. కానీ అద్భుతం చేసి చూపించండి. ధైర్యముందా? మొదటిసారి వచ్చినవారు లేవండి, చూడండి. ఎంతమంచి వచ్చారో అందరూ చూసారా. అచ్చా. 

ఇండోర్ హాస్టల్ కుమారీలు 150 మంది వచ్చారు:- బాగుంది, బాప్ దాదా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్క కుమారి సర్వీసబుల్ రత్నమై వెలువడుతుంది. అందరిలో ధైర్యముందా? దైర్యముంటే చేతులెత్తండి. అయితే పిల్లల ధైర్యము తండ్రి సహాయము ఉండనే ఉన్నాయి. బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు, ధైర్యవంతులపై ఎక్స్ ట్రా సహాయ సంకల్పం బాప్ దాదాకు ఉంటుంది. మరి ఈ రోజు ఎవరైతే వచ్చారో, వారికి ఒక్కొక్కరికీ బాప్ దాదా విశేషమైన ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎప్పుడూ గాబరా పడవద్దు. నా బాబా అనండి, బాబా హాజరైపోతారు. కేవలం మనసుతో అనండి, ఊరికే నా బాబా అని అనడం కాదు. బాబాకు కూడా పిల్లలపై ప్రేమ ఉంది. ధైర్యం మీది సహాయం బాబాది ఉండనే ఉంది.

ఈ సంవత్సరానికి ఇది చివరి మీటింగ్, కానీ వచ్చే సీజన్ కోసం ప్రతి ఒక్కరూ రెండు కార్యాలు చెయ్యాలి - ఒకటి, తమ సేవాస్థానాన్ని సదా శుభ భావన, శుభ కామనలతో సదా నిర్విఘ్నంగా తయారు చెయ్యడం. స్వయం నిర్విఘ్నంగా ఉండండి, సర్వులను నిర్విఘ్నంగా చెయ్యండి. సమ్మతమేనా, చేతులెత్తండి. చేతులైతే మంచిగా ఎత్తుతారు. బాప్ దాదా చేతులను చూసి సంతోషిస్తారు కానీ బాబాను సదా సంతోషపెట్టండి. ఆలోచించద్దు, ఆలోచనకు అవకాశం ఇవ్వద్దు. అయినప్పటికీ బాబా అయితే సదా సంతోషంగా ఉంటారు మరియు సదా పిల్లలు ప్రతి ఒక్కరికీ 'అమర భవ' అని ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. కానీ వచ్చే సీజను ఏమి చేస్తారు? బాప్ దాదా సంకల్పం ఏమిటంటే, పిల్లలు ప్రతి ఒక్కరికీ తమ బలహీనతలు ఏమిటో తెలుసు, విశేష బలహీనతను, మీ బలహీనత మీకు తెలుసు కదా. ఆ బలహీనతను సమాప్తం చేసుకుని రండి. వ్యర్థ సంకల్పాలు కావచ్చు, క్రోధం కావచ్చు, చిన్న చిన్న క్రోధం కూడా స్వయాన్ని మరియు స్థానాన్ని విసిగిస్తాయి. కనుక, ఏ బలహీనత అయితే ఉందో దానిని సమాప్తం చేసుకుని రండి. ఇష్టమేనా? ఇష్టమైతే రెండ్రెండు చేతులెత్తండి. వాహ్ భాయి వాహ్! చేతులెత్తడంలో ఎలా అయితే ఎవరెడీగా ఉన్నారో అలాగే త్యాగం చెయ్యడంలో కూడా ఎవరెడీగా ఉండండి. మరి వచ్చే సీజన్ ఎటువంటి సభ అవుతుంది? నిర్విఘ్నమైన, తండ్రి మనసుకు నచ్చిన వారి సభ అవుతుంది. దాదీలు, ఇష్టమేనా? చేతులెత్తండి. ఇప్పుడు చూస్తాము. సెంటరువారు రోజూ రాత్రికి గుర్తు తెప్పించుకోండి, ప్రతిజ్ఞ ఏమి చేసారు? ప్రతిజ్ఞ అనుసారంగా నడుచుకుంటున్నారా? శుభ భావనతో అడగండి, పొడిచినట్లుగా అడగవద్దు. శుభ భావనతో ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ఒకరినొకరు ముందుకు తీసుకువెళ్ళే శుభ భావనతో సూచన ఇవ్వండి.

మరి ఇప్పుడు ఈనాటి స్లోగన్ ఏమిటి? సంతోషంగా ఉంటాము, సంతోషపరుస్తాము. ఇష్టమే కదా! ఇష్టమైతే చేతులెత్తండి ఫోటోగ్రాఫర్లు ఈ ఫోటోను తియ్యండి. ఏ బలహీనత ఉన్నా ఈరోజు దాన్ని ఈ హాలులోనే వదిలేసి వెళ్ళండి, మీతో తీసుకువెళ్ళద్దు. చెయ్యగలరా? ఇందులో చేతులెత్తండి. అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్చా, 

డబుల్ విదేశీయులు:- బాప్ దాదా డబుల్ విదేశీయులు అని అనరు, డబుల్ పురుషార్థీలు అని అంటారు. ఇష్టమే కదా. డబుల్ విదేశీయులు కూడా లోపల లోపలే పరివర్తనా విధి బాగా చెయ్యడాన్ని బాప్ దాదా చూసారు. డబుల్ విదేశీయులు ముందుకు పోవడాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. పురుషార్థంలో ఉల్లాస ఉత్సాహాలను పెంచుకుంటూ ఉంటారు, ఈ ప్రతిజ్ఞ చేసి వెళ్తున్నారు. అంతే కదా! ప్రతిజ్ఞ చేస్తారు కదా! ఈసారి డబుల్ పురుషార్థీలు మంచి రిజల్టుతో పరస్పరం కలుసుకోవడాన్ని మరియు శ్రేష్ఠ సంకల్పాన్ని చెయ్యడాన్ని చూసాము. కానీ ఈ సంకల్పాన్ని అక్కడకు వెళ్ళిన తర్వాత కూడా రోజూ గుర్తు తెచ్చుకోండి. రాత్రి సమయంలో పడుకునే ముందు, చేసిన సంకల్పం జరుగుతుందా అని పరిశీలించుకోండి. ఒకవేళ జరగకపోతే రాత్రి పడుకునే ముందు మరుసటి రోజు యొక్క ఉల్లాస ఉత్సాహాన్ని ఇమర్జ్ చేసుకుని పడుకోండి. చేసిన సంకల్పం ఇమర్జ్ అయి ఉందా లేక కొంచెమైనా మర్జ్ అవుతుందా అని ఉదయాన్నే లేచి చూసుకోండి. ఒకవేళ మర్జ్ అయితే మళ్ళీ ఉత్సాహంలోకి రండి. విదేశీయులలో చాలా తేడా రావడాన్ని బాప్ దాదా చూసారు మరియు బాప్ దాదా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు, వాహ్ పిల్లలూ వాహ్! (వాహ్ బాబా వాహ్) పిల్లలు ఒక్కరు కూడా తక్కువ కాదు అని బాప్ దాదా భావన. ఒకరికన్నా మరొకరు ముందున్నారు, విదేశాలవారు కావచ్చు, దేశంవారు కావచ్చు. విదేశాలవారు మధువనంలో ఉన్నతికి సాధనాలేవైతే పెట్టారో అది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. మధువనం నుండి లాభాన్ని కూడా పొందుతారు, అది చూసి బాప్ దాదా సంతోషిస్తారు, ఎందుకంటే విదేశాలలో అయితే ఇంతమంది ప్రోగు అవ్వరు, కానీ మధువనానికి వచ్చి విదేశీయులందరూ మధువన లాభాన్ని పొందడంలో మంచిగా ఉన్నారు, ఇది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. దేశంవారైన మీరు కూడా విదేశీయుల పురుషార్థం చూసి సంతోషిస్తున్నారు కదా! చూడండి, మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తున్నారు. బాగుంది, బాప్ దాదా యొక్క విశేష అభినందనలు, అభినందనలు, అభినందనలు. 

2000 మంది టీచర్లు వచ్చారు - టీచర్లు చేతులెత్తండి. టీచర్లు చాలామంది ఉన్నారు. టీచర్ అంటే తమ ఫీచర్లతో ఫ్యూచర్‌ను (భవిష్యత్తు) చూపించేవారు. బాప్ దాదా టీచర్లకు చాలా చాలా చాలా హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు, ఎందుకంటే టీచర్లు బాబా సమానమైన డ్యూటీలో ఉన్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు కానీ... కానీ అనేది ఉంది, కానీ ఇప్పుడు అది వినిపించము. కానీ ప్రతి ఒక్క టీచరు అంటే ఫీచర్లు ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేవారు. బాగుంది, కృషి చేస్తున్నారు, అది కూడా బాప్ దాదా చూస్తున్నారు కానీ సెంటరును నిర్విఘ్నంగా చెయ్యడము, ఇప్పుడింకా బాప్ దాదా యొక్క ఈ కోరిక పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ సంవత్సరమే ఇది పూర్తి చెయ్యండి. ప్రతి ఒక్కరి నుండి “మా జోన్ నిర్విఘ్నంగా అయ్యింది” అన్న ఉత్తరం రావాలి. వీలవుతుందా? వీలవుతుందా? ధైర్యము తక్కువగా ఉంచుతారు! ఇప్పుడు ఈ సంవత్సరము అద్భుతం చేసి చూపించండి. ధైర్యముంది కదా! ధైర్యముంటే అయిపోతుంది. బాప్ దాదా మీ తోడుగా ఉన్నారు. అయినప్పటికీ బాప్ దాదా మీ భాగ్యాన్ని చూసి సంతోషిస్తారు. ఇప్పుడింకా సంతోషపరచండి. అర్థమయింది కదా. అచ్చా. వచ్చే సీజన్ కల్లా ఏమి చేస్తారు? దృఢ సంకల్ప మాలను ధరించండి. బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారో అది వినిపించాల్సిన అవసరం లేదు. బాప్ దాదా కోరుకునేది, మీరూ కోరుకునేది, దానిని ప్రాక్టికల్ లో చెయ్యండి. సరేనా. సరేనా టీచర్లు! చేతులెత్తండి. చాలామంది టీచర్లు ఉన్నారు. వాహ్ టీచర్లు వాహ్! అచ్ఛా, వచ్చే సీజన్ కల్లా ఏమి చెయ్యాలో వినిపించాము. చెయ్యాల్సిందే. అందరూ గట్టిగా చెప్పండి, చెయ్యాల్సిందే. బాప్ దాదా ఎంత సంతోషిస్తారు, వాహ్ పిల్లలూ వాహ్! 

ఏ బలహీనతలైతే ఉన్నాయో వాటిని వదలాల్సిందే. వదలాల్సిందే, ఇది పక్కానా? చెయ్యాల్సిందే అని పక్కా సంకల్పం ఉన్నవారు చేతులెత్తండి. అచ్ఛా, చేతులైతే చాలా బాగా ఎత్తారు. బాప్ దాదా చేతుల్ని చూసి సంతోషిస్తారు. ఇప్పుడు చెయ్యడంలో నంబర్ ను తీసుకోవాలి. మరి ఈ సీజన్ లో ఏ సంకల్పమైతే చేస్తున్నారో అది సంకల్పం కాదు, చెయ్యాల్సిందే. ఏమి జరిగినా కానీ మారాల్సిందే. ఈ దృఢ సంకల్పం చెయ్యండి. చివరకు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. మన రాజ్యంలోకి వెళ్ళాలి కదా. వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే చేతులెత్తండి. వెళ్ళాలా? మరి చూస్తాము, వెళ్ళేందుకు తయారీలు చెయ్యవలసిందే.

అందరికీ చాలా చాలా చాలా బాప్ దాదా ప్రియస్మృతులు. ఈరోజుల్లో అందరూ సైన్సు సాధనాలతో సమీపంగానే చూస్తున్నారు. మరి, చూసేవారందరికీ మరియు సమ్ముఖంలోని వారికి అందరికీ బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు హృదయ హారమును బాప్ దాదా వేస్తున్నారు. అచ్ఛా. ఓం శాంతి. 

దాదీలతో:- బాప్ దాదా అయితే తోడుగా ఉన్నారు. (తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు, తోడుగా వస్తారు) పక్కా ప్రతిజ్ఞ. ఎప్పటి వరకు ఉంటారో అప్పటి వరకు మంచిగా ఉంటారు. 

మోహినీ అక్కయ్య:- చూడండి. వీరు మరుజీవా అయ్యారు. మంచిది. (ఆశీర్వాదం ఉంది) ఆశీర్వాదాలు అందరికీ ఉన్నాయి. 

(గుల్జార్ దాదీకు కూడా) అందుకే నడుస్తున్నారు కదా. 

(నిర్వైర్ అన్నయ్య బాబాకు ధన్యవాదాలు తెలిపారు) పిల్లలకు ధన్యవాదాలు. 

(ఢిల్లీ మేళా సమాచారాన్ని చూపించారు) మంచి రిజల్టు ఇది. 

గోలక్ అన్నయ్యతో :- స్వయాన్ని సంతోషంగా పెట్టుకోండి. ఏ పరిస్థితి వచ్చినా కానీ, పరిస్థితిని బాబాకు ఇచ్చేయండి. 

రుక్మిణి దీదీతో:- మంచిగా అయిపోతారు. అందరి ప్రేమ ఉంది కదా. అందరి ప్రేమ ఉంది, బాబాప్రేమ కూడా ఉంది, ప్రేమ అంతా మంచిగా చేసేస్తుంది. (ఋణం తీర్చుకోవడానికి వచ్చాను అని నిన్న అంటున్నారు) ఋణం ఏమీ లేదు, విషయాన్ని చిన్నగా చెయ్యండి, పెద్దదిగా చెయ్యకండి, అంతా మంచిగా అయిపోతుంది. అచ్ఛా, అందరికీ ప్రియస్మృతులు. 

వి.ఐ.పీలతో : - ఇప్పుడిక అతిథులు కారు, ఇంటివారు. చెప్పండి, ఇంటివారు కదా. చేతులెత్తండి. బాబా హృదయంలో ఉన్నారు. బాబాను తమ హృదయంలో కూర్చోబెట్టుకున్నారు. హృదయాభిరాముడు కదా! హృదయంలో కూర్చోబెట్టుకోండి. ఏమి జరిగినా కానీ హృదయాభిరాముడు సహాయం చేస్తారు. అందరూ వచ్చారు, అందరూ హృదయాభిరాముని స్థానానికి వచ్చారు. మనసులోని ఆశలన్నీ ఇక్కడకు రాగానే సమాప్తం చేసెయ్యండి. పిల్లలను కలిసి, ఇచ్చిపుచ్చుకోవడాలు చేసి మనసులో ఉన్నదంతా సమాప్తం చేసెయ్యండి. మనసులో సంతోషాలను నింపుకుని వెళ్ళండి. ఆనందమే ఆనందము. బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు, రానైతే వచ్చారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. మీ ఇంటికి చేరుకున్నారు, దారి అయితే చూసారు. ఇప్పుడు కూడా వస్తూ ఉండండి, సంబంధ-సంపర్కాన్ని పెట్టుకుంటూ ఉండండి. అచ్ఛా, వచ్చారు, మంచిది. బాప్ దాదా ప్రియస్మృతులను ఇస్తున్నారు. 

దుబాయ్ లో క్రొత్త భవనం తయారైంది, దాని ఉద్ఘాటన రిమోట్ కంట్రోల్ లో బాప్ దాదా చేసారు:- (జ్యోతి అక్కయ్య, దుబాయ్) సేవా సహచరులు మంచిగా ఉన్నారా? పెంచండి. సమీపంగా ఉన్నారు కదా. సమీపంగా ఉండటంలో ఉండే శక్తి మీకు లభిస్తుంది. ఆనందంగా ఉండండి. ఏ కార్యమైనా, బాబా మీ కార్యము మీరే చెయ్యండి. బాప్ దాదా సహాయకులుగా ఉన్నారు. 

(జైపూర్ లో కూడా క్రొత్త ఆడిటోరియం తయారైంది, దాని ఉద్ఘాటన కూడా బాప్ దాదా రిమోట్ తో చేసారు) అభినందనలు. అచ్ఛా - అందరూ లగనములో మగనమై ఉన్నారు. తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు మరియు తోడుగా రాజ్యంలోకి వస్తారు. అచ్ఛా

Comments