05-03-2012 అవ్యక్త మురళి

            05-03-2012         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“ఇప్పుడు నలువైపుల దుఃఖము, అశాంతి పెరుగుతున్నాయి కావున మీ విశ్వకళ్యాణి స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి. మనసా సేవను పెంచండి. బాబా యొక్క సాంగత్యపు రంగుతో డబుల్ హోలీగా అవ్వండి"

ఈరోజు బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యపు రేఖలను చూస్తున్నారు. మస్తకంలో మెరుస్తున్న సితారల రేఖను చూసారు, నయనాలలో స్నేహము మరియు శక్తుల రేఖ, పెదవులపై చిరునవ్వు రేఖ, పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నారు. మీరందరూ మీ భాగ్య రేఖలను చూసి సంతోషిస్తున్నారు కదా! వాహ్ నా భాగ్యము అన్న పాటయే మనసులో పాడుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి మస్తకం ఆ దివ్య సితారలతో మెరుస్తూ ఉండటాన్ని చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు వాహ్ పిల్లలు వాహ్! అన్న పాటను మనసులో పాడుకుంటూ ఉన్నారు. పిల్లల హృదయాల నుండి ఏ పాటను వింటున్నారు? వాహ్ బాబా వాహ్! బాబా కూడా వాహ్! మరి ఇప్పుడు ఈ సభ అంతా ఎలా అయింది? వాహ్! వాహ్! వాహ్! మరి మీ భాగ్యాన్ని చూసుకుని సదా, ఇప్పుడు ఎంత హర్షితంగా ఉన్నారో అంత హర్షితంగా ఉంటున్నారా! ఈ భాగ్యము ఇప్పుడు సంగమయుగంలోనే లభిస్తుంది. సంగమయుగంలోని ప్రతి క్షణం చాలా విలువైనది. సంగమయుగంలోని ఒక్క క్షణం కూడా అవినాశిగా అయిపోతుంది ఎందుకంటే ప్రతి క్షణానికి 21 జన్మలతోటి సంబంధం ఉంటుంది కనుక. ఇప్పటి ఒక్క క్షణం యొక్క సంబంధం 21 జన్మలతోటి ఉంటుంది. మరి పరిశీలించుకోండి - ఒక్క క్షణం ఒకవేళ వ్యర్థంగా పోయినా కానీ అది ఒక్క జన్మకు కాక 21 జన్మలకు సంబంధించినది అవుతుంది. కావున, సంగమయుగంలోని ఒక్క క్షణం కూడా, ఒక్క సంకల్పాన్ని కూడా వ్యర్థంగా పోనివ్వద్దు ఎందుకంటే ఒక్క జన్మ కాదు 21 జన్మలు వ్యర్థంగా పోయినట్లు అని బాప్ దాదా పిల్లలకు ప్రతి సమయము అటెన్షన్ ఇప్పిస్తూనే ఉన్నారు. సంగమయుగ మహత్వాన్ని ప్రతి సమయము గుర్తుంచుకోండి.

బాప్ దాదా అయితే వ్యర్ధ సమయము మరియు వ్యర సంకల్పము గురించి హోమ్ వర్కును అందరికీ ఇచ్చారు. మరి అందరూ హోమ్ వర్కు చేసారా? మా అటెన్షన్ ఉంది అంతేకాక చాలావరకు సఫలతను కూడా పొందాము, లక్ష్యము లక్షణము వరకు పరిణమించింది అని భావించేవారు చేతులెత్తండి. అచ్చా. పాండవులు చేతులెత్తుతున్నారా? చేతులు పెద్దగా ఎత్తండి. ఇప్పుడింకా అందరూ చెప్పిన పనిని చెయ్యలేదు.సంగమయుగ మహత్వాన్ని ఒకవేళ సదా బుద్దిలో ఉంచుకున్నట్లయితే అవినాశి బాబా ద్వారా ఈ కార్యం లభించింది అన్నది కూడా గుర్తుంటుంది. ప్రతి క్షణము అవినాశిగా అయ్యేది ఎందుకంటే అవినాశి తండ్రి ఇచ్చిన వరదానము ఇది. కనుక సహజంగానే అయిపోతుంది.

బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి అడుగులో పదమాలు ఉన్నాయని బాబా వినిపించి ఉన్నారు. అడుగులో పదమాల రేఖ ఉందంటే ఎన్ని పదమాలకు సంగమయుగంలో గోల్డెన్ ఛాన్స్ ఉందో ఆలోచించండి. ప్రతి ఒక్కరూ తమ ఈ భాగ్యాన్ని గుర్తుంచుకోవాలి. బాప్ దాదా ఏమి ఆశిస్తున్నారని కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ డబుల్ రాజులుగా అవ్వాలని బాప్ దాదా కోరుకుంటున్నారు. ఇప్పుడు స్వరాజ్య అధికారులు మరియు భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారులు. పిల్లలెవ్వరూ డబుల్ రాజులుగా అవ్వడంలో తక్కువైనవారేమీ కాదు. మరి పిల్లలందరూ డబుల్ రాజ్యాధికారులే కదా! తల ఊపండి. అంటే పిల్లలందరూ డబుల్ రాజ్యాధికారులే , తల ఊపండి. మరి తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది. బాప్ దాదా పిల్లలందరి రికార్డును రోజూ చూస్తారు. అందులో ఏమి చూసారు? ప్రతి ఒక్కరూ తమ మనసులో అయితే మీ మీ రికార్డును తెలుసుకున్నారు కదా. రాజ్యాధికారిగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అవ్వడంలో, స్వరాజ్య అధికారి అనగా మనసు, బుద్ధి, సంస్కారాలను మీ కంట్రోల్ లో నడిపించేవారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, అధికారంతో నడిపించడము. ఎలా అయితే ఈ స్థూల కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు మీ కంట్రోల్ లో ఉంటాయో అలాగే మనసు, బుద్ది, సంస్కారాలపై కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఇప్పుడు చూస్తే ఇందులో నంబరు వారీగా చాలామంది కనిపిస్తున్నారు. ఇవి కూడా నావే. మనసు నేను కాదు, నాది. సంస్కారాలు నావి. బుద్ది నాది. కానీ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ నంబరువారీగా ఉన్నాయి. బాప్ దాదా సమయపు సూచనను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఆ సమయానుసారంగా మీ అందరి స్వమానము - విశ్వ కళ్యాణకారి. ఇప్పుడు సమయానుసారంగా పిల్లలు ప్రతి ఒక్కరూ తమ విశ్వ కళ్యాణి స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యాల్సిన సమయము. నలువైపుల దుఃఖము, అశాంతి పెరుగుతున్నాయి. మీ సోదరులు, మీ సోదరీలు, పరివారాలు దుఃఖంలో ఉన్నాయి మరి మీకు మీ పరివారంపై దయ కలగడం లేదా!

ఇప్పుడు బాప్ దాదా ఇదే సూచనను ఇస్తున్నారు - స్వ పురుషార్థంతో పాటు విశ్వ సేవను కూడా చెయ్యండి. వాచ సేవ వర్తమాన సమయంలో ఎంతో బాగా జరుగుతుంది కదా, ఇందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఈ 75 సంవత్సరాల జూబ్లీ మెజారిటీ అందరిలో సేవ ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. ఇది చూసి బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు మనసా సేవ అవసరము కూడా ఉంది. ఎందుకంటే నలువైపల ఇప్పుడు అందరూ విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలి. అందులో మనసా, వాచ మరియు కర్మణ అనగా నడవడిక మరియు ముఖముతో, మూడింటింతో సేవ జరగాల్సిన అవసరము ఉంది. ఈ మూడు సేవలలో ఎంత శాతం సేవను చేసాను అని రోజూ పరిశీలించుకోండి. వాచలో అయితే బాప్ దాదా కూడా సర్టిఫికేట్ ఇచ్చారు కానీ మనసా సూక్ష్మ వైబ్రేషన్ల ద్వారా దుఃఖంతో, అశాంతితో ఉన్న ఆత్మలకు సహారాగా అవ్వవలసి ఉంది. మీకు దయ కలగడం లేదా? పిల్లలు ఎలా అయినా ఉండనీ, పిల్లలే కదా, బాప్ దాదాకు వారిని చూసి దయ కలుగుతుంది. కావున ఇప్పుడు పిల్లలందరూ కేవలం సెంటరు కళ్యాణి కాదు, జోన్ కళ్యాణి కాదు విశ్వ కళ్యాణిగా అవ్వాలి. కావున, ఇప్పుడు మీ భక్తుల కళ్యాణకారులుగా అవ్వండి అని బాప్ దాదా అటెన్షన్ ఇప్పిస్తున్నారు ఎందుకంటే ఈ సంగమయుగానికి చాలా పెద్ద మహత్వము ఉంది. ఇప్పుడు సంగమయుగంలో ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత సహకారము బాబా నుండి లభించగలదు. మరి ఇప్పుడేమి చెయ్యాలో విన్నారా? మనసా సేవను పెంచండి. మీ కార్యానుసారంగా, ట్రాఫిక్ కంట్రోల్ సమయాన్ని ఫిక్స్ చేసుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ మనసా సేవ కోసం కూడా సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. దుఃఖము ఎక్కువైనప్పుడు ఆ సమయంలో అందరి అటెన్షన్ ఆ అలజడి వైపే ఉంటుంది కానీ ఇప్పుడు మనసా సేవ చెయ్యాల్సిన సమయమిది. కావున ఇప్పుడు పిల్లలందరూ తమ విశ్వ కళ్యాణి స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవాలి. విశ్వ కళ్యాణంలో స్వ కళ్యాణం స్వతహాగా మరియు సహజంగా జరిగిపోతుంది ఎందుకంటే ఒకవేళ మనసు ఫ్రీగా ఉంటే వ్యర్థము వస్తుంది కానీ మనసు బిజీగా ఉంటే వ్యర్ధము సహజంగానే సమాప్తమైపోతుంది. బాప్ దాదా ఎప్పుడైతే నలువైపుల చుట్టివచ్చారో, దేశవిదేశాలలోని అజ్ఞానీ పిల్లలను చూసినప్పుడు దయ కలుగుతుంది కావున మీరందరూ కూడా ఇప్పుడు దుఃఖహర్త సుఖకర్తలుగా అవ్వండి.

ఈరోజు అందరూ హోలీ జరుపుకోవడానికి వచ్చారు. ప్రపంచపు వారి హోలీలో మరియు మీ హోలీలో ఎంతో తేడా ఉంది కదా! బాప్ దాదా ముందుగా వినిపించినట్లుగా మీ భక్తులు మీ కార్యాలను కాపీ చెయ్యడంలో చాలా తెలివిని చూపించారు ఎందుకంటే ఈ విధులన్నిటినీ ద్వాపరయుగంలో వచ్చిన ఆత్మలు తయారు చేసాయి. అది వారి మొదటి జన్మ కనుక, వారి బుద్ధి కూడా, నియమానుసారంగా, ముందు సతో ప్రధానంగా తర్వాత రజో తమోలోకి వస్తుంది. అంటే ఆ సమయంలో వారి బుద్ది వారి అనుసారంగా సతో బుద్దిగా ఉండింది కావున మీ ఒక్కొక్క విశేషతను వారు కాపీ చేసారు. మీరు సదా ఉత్సాహంలో ఉంటారు కనుక దీనిని వీరు ఉత్సవ రూపంలో జరుపుకోవడం ప్రారంభించారు. శివరాత్రి రోజున భక్తులు ఎలా కాపీ చేస్తారని వినిపించాము కదా. సంగమయుగంలో మీరందరూ సదా ఉత్సాహంగా ఉంటారు కనుక వారు ఉత్సవాలను స్మృతిచిహ్నాలుగా చేసారు. మరి హోలీలో ఏమి చేస్తారు? మీరు కూడా మీ జీవితాన్ని రంగులమయం చేసుకున్నారు కదా. కానీ మీ రంగు ఏమిటి? బాబా సాంగత్యపు రంగు మీ అందరి రంగు. మరి పూర్తి సమయమంతా బాబా సాంగత్యపు రంగులో రంగింపబడి ఉన్నారు కదా! వారు రంగును తయారు చేసారు కానీ దేహాభిమానంలో ఉన్నారు కనుక స్థూల రంగును తయారు చేసారు. కానీ మీరందరూ సదా ఈ కళ్యాణకారి సంగమయుగంలో ఈ రంగులో, సాంగత్యపు రంగులో ఉంటున్నారు కదా! రంగు వేసుకున్నారు కదా! సాంగత్యపు రంగు అంటుకుంది. హోలీ అంటే ఆంగ్లంలో పవిత్రత అని అర్థము. అంటే సాంగత్యపు రంగులో మీరు హోలీగా అనగా పవిత్రులుగా అవుతున్నారు. పవిత్రులుగా అయ్యారు కదా! అందరూ పవిత్రత వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారు కదా! నంబరువారీగా ఉండి ఉండవచ్చు కానీ బ్రాహ్మణులుగా అవ్వడము అంటే పవిత్రత వ్రతాన్ని తీసుకోవడము అని అర్థము ఎందుకంటే తండ్రి సదా పవిత్రుడు. పవిత్ర స్వరూపుడు. అవ్వవలసిన అవసరం పవిత్రతయే వారి స్వరూపము. మరి హోలీ విశేషత ఏమిటో తెలుసా? పవిత్రంగా అయితే మీరు అవుతున్నారు కానీ సాంగత్యపు రంగుతో మీరు డబుల్ పవిత్రులుగా అవుతున్నారు. ధర్మపితలు, మహాత్మలు కూడా పవిత్రులుగా అవుతారు కానీ వారు కేవలం ఆత్మను మాత్రమే పవిత్రంగా చేసుకుంటారు కానీ మీరు సాంగత్యపు రంగుతో డబుల్ పవిత్రులుగా అవుతున్నారు. శరీరము మరియు ఆత్మ రెండూ పవిత్రంగా మీరు భవిష్యత్తులో అవుతారు. ద్వాపరం నుండి వచ్చిన వారందరినీ మీరు చూడండి, వారు పవిత్రులుగా అయ్యారు కానీ డబుల్ పవిత్రులుగా ఎవ్వరూ అవ్వలేదు. శరీరం కూడా పవిత్రము, ఆత్మ కూడా పవిత్రము. మీరు భవిష్యత్తులో రాజ్యాధికారులుగా అయినప్పుడు మీ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. పూర్తి చక్రం తిరగండి. ద్వాపరం నుండి వచ్చారు, ద్వాపరం నుండి ఇప్పటి వరకు చూడండి, ఎవరైనా డబుల్ పవిత్రులుగా అయ్యారా! మరి డబుల్ పవిత్రులుగా అయిన మీరు ఇంత మహనీయులుగా ఎందుకు అయ్యారు? మీకు అంటిన రంగు ఎటువంటిది? పరమాత్ముని సాంగత్యపు రంగు. ఎలా అయితే పరమ ఆత్మ పవిత్రుడో మీరు కూడా 21 జన్మలు డబుల్ పవిత్రులుగా అవుతారు. ధర్మపితలు వచ్చి ఉన్నాకానీ వారు డబుల్ పవిత్రులుగా అవ్వలేదు. ఇది మీ భాగ్యము ఎందుకంటే మీరు పరమాత్ముని సాంగత్యంలో ఉన్నారు. సాంగత్యపు రంగు ఎంత దృఢంగా ఉంటుందంటే మీరు డబుల్ పవిత్రులుగా అయిపోతారు. హోలీకి మరో అర్థము హో-లీ. గడిచిపోయింది, జరిగిపోయింది. మరి హోలీ చెయ్యడము వస్తుందా? జరిగిందేదో జరిగిపోయింది. హోలీ అన్న పదానికి ఉన్న అర్థము ఏమిటి? గతం గతః అని. దీని ద్వారా మీరు డబుల్ హోలీగా 21 జన్మలు ఉంటారు. ఒక్క జన్మ కాదు ఎందుకంటే సంగమంలో ఒక్కొక్క క్షణం యొక్క కనెక్షన్ 21 జన్మలతోటి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్క సెకండు లేదా నిమిషము సఫలం చేస్తే 21 జన్మలు మీవి సఫలంగా ఉంటాయి. ఇది గ్యారంటీ. మరి ఇటువంటి హోలీని జరుపుకున్నారా? హోలీ చెయ్యడం వచ్చా? యోగ అగ్నితో మీ బలహీనతలను, సంస్కారాలను, అనేక జన్మల నుండి ఉన్న చెడు సంస్కారాలను యోగ అగ్నిలో కాల్చి వేసారు కదా! కాల్చి వేసారా లేక ఇప్పటికీ ఇంకా కాలుస్తూ ఉన్నారా? కాల్చి వేసారా? మేము యోగ అగ్నితో మా పాత సంస్కారాలను కాల్చి వేసాము, కాలిపోయాయి అని భావించేవారు చేతులెత్తండి. కాలిపోయాయా లేక ఇప్పటికీ వస్తున్నాయా? కొద్దికొద్దిగా వస్తున్నాయా? బాప్ దాదా వద్దకు మీ చార్టును పంపించినప్పుడు ఏమంటారంటే చాలావరకు వెళ్ళిపోయాయి, చెప్పడంలో చతురులు కదా. ఏమంటారంటే, చాలావరకు సమాప్తమైపోయాయి, అప్పుడప్పుడూ కొద్దిగా ఇమర్జ్ అవుతూ ఉంటాయి అని అంటారు. కానీ కాలిపోవడము అంటే కాలిపోవడము. కాలిపోయిన తర్వాత దాని నామరూపాలు కూడా ఉండవు. మరణించిన తర్వాత శరీరమైతే కనిపిస్తుంది కానీ కాలిపోయిన తర్వాత సమాప్తమైపోతుంది. ఎలా అయితే రావణుడుని కూడా చూడండి, అతడిని కేవలం చంపడం కాదు కాలుస్తారు కదా. నామరూపాలు పూర్తిగా సమాప్తము. మరి మీరు కూడా అందరూ నోట్ చేసుకోండి - సంస్కారాలను చంపానా లేక కాల్చానా? భస్మం చేసానా? పాత సంస్కారాలను ఒకవేళ కాల్చకపోతే మధ్య మధ్యలో ఇమర్జ్ అవుతాయి. కానీ భక్తులు మీ అన్నింటినీ కాపీ చేసారు. మీరు కాలుస్తారు, వారూ కాలుస్తారు తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా జరుపుకోరు. మీరైతే సంస్కారాలను కాల్చి వేస్తూ హోలీగా అయ్యారు. కొంతమంది అవుతున్నారు. కొంతమంది అయిపోయారు. మరి మీరు హోలీ జరుపుకున్నారా? బాబా సాంగత్యపు రంగు యొక్క హోలీని జరుపుకున్నారా? ఇప్పుడు సాంగత్యంలో ఉన్నారు కనుక సాంగత్యపు రంగు యొక్క హోలీని జరుపుకున్నారు కదా! జరుపుకున్నారా? చేతులెత్తండి. జరుపుకున్నారు. హోలీ జరుపుకోవడము అంటే హోలీగా అవ్వడము, పవిత్రంగా అవ్వడము. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఒకవేళ మీలోని ఏ సంస్కారమైనా కాలిపోలేదు అనుకోండి, ఇమర్జ్ అవుతూ ఉంటే మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు తీవ్ర పురుషార్ధం చేసి దీనిని కాల్చి వేయాలి అని మీకు సంకల్పం వస్తూ ఉంటుంది కదా. చంపడం కాదు, ఏమవుతుందంటే కొంతమంది సంస్కారాలను చంపారు, కానీ మరణించిన వారిలో కూడా ఒక్కోసారి ప్రాణం తిరిగి వస్తుంది. అదే కాల్చివేస్తే మళ్ళీ ఎప్పుడూ రాదు.

మరి ఈ రోజు కాల్చివెయ్యాలా లేక మరణించి ఉన్నా ఫర్వాలేదా? కాల్చివేసే శక్తి ఉందా? ఉందా శక్తి? సంకల్పం చెయ్యగలరా? పిల్లలు బాప్ దాదాతో ఆత్మిక సంభాషణ చేస్తారు కదా. చాలా మధురంగా, తియ్యగా ఆత్మిక సంభాషణను చేస్తారు. ఏమంటారంటే, బాబా, మేమైతే చాలా ప్రయత్నించాము. కానీ మళ్ళీ, మళ్ళీ వచ్చేస్తుంది. అనుకోవడం లేదు కానీ వచ్చేస్తుంది. కారణం తెలుసా? కాలుస్తున్నారు, బాప్ దాదా చూస్తున్నారు, చాలా పురుషార్ధం చేస్తున్నారు. కానీ పురుషార్థంతో పాటు దృఢ సంకల్పం అవసరము. దృఢత్వము సఫలతకు తాళం చెవి. దృఢ సంకల్పం చేసినట్లయితే, దృఢము అంటేనే మళ్ళీ తిరిగి రాకుండా ఉండటము. ఇంకా ఎంత మధురాతి మధురంగా మాట్లాడుతారో తెలుసా? సంస్కారాలు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏమంటారో తెలుసా? ఆత్మిక సంభాషణ అయితే అందరూ చేస్తారు కదా! చాలా మధురమైన సంభాషణ జరుగుతుంది. ఏమంటారంటే, అలా అనుకోవడం లేదు కానీ వచ్చేస్తుంది. అంటే శక్తి తక్కువగా ఉంది కదా! దృఢత తక్కువగా ఉంది కదా! దృఢ సంకల్పధారులుగా అవ్వండి. చెయ్యాల్సిందే. ఆ దృఢ సంకల్పాన్ని ప్రతి రోజూ పరిశీలించుకుంటూ ఉండండి - ఏ కారణం చేత మళ్ళీ దృఢత్వంలో బలహీనత వచ్చింది? మళ్ళీ అలా జరగకుండా ఉండే విధంగా ఆ పరిస్థితులపై ప్రత్యేకమైన అటెన్షన్ పెట్టండి. మాస్టర్ సర్వశక్తిమంతుని సీట్ పై కూర్చుని ఆ సంకల్పాన్ని చెయ్యండి, సంస్కారాన్ని సమాప్తం చెయ్యండి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే, ఒక్కోసారి, ఏ శక్తినైతే కోరుకుంటామో ఆ శక్తి సమయానికి రాదు. అంటే ఆ శక్తి ఉంటుంది కానీ సమయానికి ఆ శక్తిని ఇమర్జ్ చేసుకున్నా కానీ రావడం లేదు అని అంటారు. మరి మీరు ఉన్నారు మాస్టర్ సర్వశక్తిమంతులు. మీ టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తిమంతులు కానీ ఏమని అంటారు? శక్తి సమయానికి రావడం లేదు అని అంటున్నారు. కారణము? మీ మాస్టర్ సర్వశక్తిమంతుని సీట్ పై సెట్ అవ్వడం లేదు. మీరు ఆఫీసుకు వెళ్ళినప్పుడు కూడా అధికారము ఉన్నవారు ఆజ్ఞాపిస్తేనే చేసేవారు వారు ఆజ్ఞలను ఒప్పుకుంటారు కదా. ఇంకెవరైనా చెప్తే ఒప్పుకుంటారా? మరి మీ సీట్ - మాస్టర్ సర్వశక్తిమాన్. ఆ సీట్ పై సెట్ అవ్వకుండా శక్తిని ఆహ్వానించినా కానీ అది సమయానికి రాదు. అందుకే బాప్ దాదా పదే పదే చెప్పారు, మీ మనసును బిజీగా పెట్టుకోండి అని. రోజంతటిలో ఒకసారి ఒక శక్తిని పిలిచి చూడండి, మరోసారి మరో శక్తిని పిలిచి దాని శక్తి ఎంత ఉందో చూసుకోండి. ఇలా అనుభవం చేస్తూ ఉంటే, మీ సీట్ పై సెట్ అయ్యి ఉంటే శక్తులు సదా మీ ఎదుట జీ హాజిర్ అని అంటాయి. మీ శక్తులు కదా! మరి హోలీ జరుపుకున్నారా? సదా బాబా యొక్క సాంగత్యపు రంగును వేసుకుంటూనే ఉండండి. రంగులో రంగింపబడి ఉన్నారు కదా? అచ్చా.

బాప్ దాదా ఇచ్చిన కార్యాన్ని ఇప్పటివరకు ఎవరైనా చేసి ఉండకపోతే బాప్ దాదా విశేషంగా ఒక వారం రోజులను ఎక్స్ ట్రాగా ఇస్తున్నారు. ఇచ్చిన డేట్ అయితే ఉంది కానీ ఒక వారము ఎక్స్ ట్రా ఇస్తున్నారు ఈ హోమ్ వర్కును పూర్తి చెయ్యడానికి. వీలవుతుందా? వీలవుతుందా? చేతులెత్తండి. చేతులెత్తితే చెయ్యవలసి ఉంటుంది. చేతులు ఎంత బాగా ఎత్తుతారంటే అది చూసి బాప్ దాదా సంతోషపడిపోతారు. కానీ చెయ్యవలసిందే ఎందుకంటే ఇప్పుడు సమయపు గతిని చూస్తున్నారు కదా. బాప్ దాదా అయితే చాలాకాలం నుండి అకస్మాత్తు యొక్క వార్నింగ్ ను ఇస్తూనే ఉన్నారు. కనుక ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరికీ ఒక స్వమానమును ఇస్తారు -

పిల్లలు ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పధారి విశేష ఆత్మలుగా అవ్వండి. సంకల్పం చెయ్యగానే జరిగిపోవాలి, దీనినే దృఢ సంకల్పము అని అనడం జరుగుతుంది. దృఢ సంకల్పమే చేసాము అని అంటారు కానీ దృఢత అంటేనే సఫలత. ఒకవేళ సఫలత లేదు అంటే దృఢత ఉంది అని అనలేము. కనుక ఇప్పుడు దృఢత భవ! మీ ఈ విశేష స్వమానమును రోజూ అమృతవేళలో స్మృతిలోకి తీసుకురండి, విధిపూర్వకంగా ముందుకు సాగండి. ఇప్పుడింకా రెండు టర్న్స్ ఉన్నాయి. ఈ రెండు టర్న్స్ లో ఏమి చేస్తారు? ఏమి చేస్తారు? చెప్పండి. మొదటి లైను వారు చెప్పండి ఏమి చేస్తారు? చెయ్యవలసిందే. చేద్దాములే కాదు, చెయ్యవలసిందే. బహుకాలం నుండి బాబా సమానంగా అవ్వడము అంటే బహు కాలపు ప్రాప్తి. సంగమయుగ సమయము చాలా ప్రియమైనది. అందులోని ఒక్క సెకండు, సెకండు కాదు, అది ఒక్క సంవత్సర ప్రాప్తితో సమానము అందుకే ఒక్క సెకండు కూడా వ్యర్థంగా పోనివ్వద్దు అని బాప్ దాదా చెప్తూనే ఉంటారు. ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు. సమర్థులుగా అవ్వండి మరియు సమర్థులుగా చెయ్యండి. సరేనా! టీచర్లు సరేనా? టీచర్లు తల ఊపుతున్నారు. 

బాప్ దాదాకు టీచర్లపై చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలందరిపై ప్రేమ ఉంటుంది కానీ టీచర్లు బాధ్యులు కదా! బాప్ దాదా ఆశను పూర్తి చేసేవారు ఎవరు? ఎవరు? మేము టీచర్లము అని చెప్పండి. చేతులెత్తండి. చూడండి, ఎంతమంది టీచర్లు ఉన్నారో? అరే వాహ్! అచ్ఛా. హోలీ కూడా జరుపుకున్నాము, ఇప్పుడు ఏమి చెయ్యాలి?

సేవ టర్న్ రాజస్థాన్ వారిది: ఇది చిన్న జోన్ కాదు, పెద్దదే. రాజస్థాన్ అయితే ఆబూలోని గది. ఆబూ పెద్దది కదా, మరి దాని గది కూడా పెద్దగానే ఉంటుంది కదా. బాప్ దాదా రాజస్థాన్ పై చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రాజస్థాన్ లో ఆరంభం నుండి ఎవరైతే వచ్చారో వారు అమరులుగా ఉన్నారు. సేవలో అమరులుగా ఉన్నారు. శరీరంలో కాదు, సేవలో అమరంగా ఉన్నారు. రాజస్థాన్ ఆరంభంలో వారసులను తయారు చేసింది. వారస క్వాలిటీ గురించి ఉదాహరణ చెప్పడానికి బాప్ దాదాకు సహజంగా ఉండేది. ఎలా అయితే గుజరాత్ సమీపంగా ఉన్నదో అలాగే రాజస్థాన్ అయితే ఆబూలోని ఒక గది అని చెప్పవచ్చు. ఎప్పుడు పిలిచినా ఏమంటారు? హాజరు. జీ హా, హాజరు. బాప్ దాదా ప్రతి జోన్లోని విశేషతను చూస్తున్నారు. ఈ సిస్టమ్ చాలా బాగుంది. ఎవరు తయారు చేసారు? మున్నీ చేసారా? (దాదీజీ తయారు చేసారు) దాదీ అయితే దాదీయే. కానీ ఎవరైతే మహారథులు వెళ్ళిపోయారో వారి విశేషత ఏమిటంటే వారు అమృతవేళలో హాజరవుతారు. అమృతవేళ మిలనాన్ని వారు విడిచిపెట్టలేదు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా నియమంలో నడిచి చూపించారు కదా. చెప్పడం ద్వారా కాదు, ఆచరించి చూపించారు, అలాగే అందరినీ ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువచ్చారు. ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంది. మీ అందరికీ నచ్చింది కదా. అవకాశం లభిస్తుంది. రాజస్థాన్ నుండి మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి. మధువనానికి రాజసాన్నుండి మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి. మంచి ఛాన్స్ లభించింది. మామూలుగా అయితే మీరు లిస్టు అనుసారంగా లభించిన సంఖ్య ప్రకారంగా రావాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది, సేవాధారులకు ఛాన్స్ లభిస్తుంది, అందుకే బాప్ దాదా దాదీకి అభినందనలు తెలపాలా లేక మీకు అభినందనలు తెలపాలా! దాదీ తయారుచేస్తే మీరు ప్రాక్టికల్ లోకి తీసుకువస్తూ ఉన్నారు ఇందుకు మీకు కూడా అభినందనలు. అచ్చా.

ఇప్పుడు రాజస్థాన్ ఒక అద్భుతాన్ని చేసి చూపించండి. వారస క్వాలిటీని బాబా ఎదుటకు ముందుగా మీరే తీసుకురండి. అన్ని వర్గాలవారు మెజారిటీ తమ తమ సంపర్కంవారి లిస్టును బాప్ దాదాకు ఇచ్చారు. సహయోగులుగా అయితే ఉన్నారు కానీ ఇప్పుడిక ఏమి చెయ్యాలి? సహయోగులను యజ్ఞ స్నేహీలుగా చెయ్యండి. యజ్ఞ స్నేహీలుగా అయినప్పుడు ప్రతి కార్యంలో అందరూ సహయోగులుగా అవుతారు. లిస్టు చాలా బాగా వ్రాసారు. మెజారిటీ సమయానుసారంగా లిస్టును ఇస్తూనే ఉంటారు. మెజారిటీ అందరూ లిస్టును మంచిగా ఇచ్చారు. ఈ రోజు రెండు-నాలుగు వర్గాల నుండి లిస్టు వచ్చింది. కానీ ఇప్పుడు స్నేహీలుగా తయారు చెయ్యండి అంటే మేము యజ్ఞానికి చెందినవారే అన్నంతగా పక్కాగా నిశ్చయబుద్దిగా తయారు చెయ్యండి. సహయోగులుగా అయితే ఉన్నారు, మేము సహయోగులుగా ఉన్నాము కదా అని కూడా అంటారు కానీ స్నేహి అనేవారు యజ్ఞం యొక్క నియమాలలో, కార్యాలలో స్నేహిగా అవుతారు. వర్గాలవారు మంచి కార్యాలను చేస్తున్నారు. బాప్ దాదా వర్గాలవారికి కూడా అభినందనలు తెలుపుతున్నారు. రాజస్థాన్ అంటే రాజుగా అయ్యి రాజుగా తయారు చేసేవారు. ప్రజలుగా కాదు, రాజులుగా చేసేవారు. రాజస్థాన్ కదా. మరి రాజస్థాన్ అద్భుతం చేస్తుంది కదా.

రెండు వర్గాలు వచ్చాయి - మెడికల్ వింగ్ మరియు ట్రాన్స్ పోర్టు వింగ్:- అభినందనలు. ఏ వర్గాలైతే తయారయ్యాయో వారు తమ తమ క్షేత్రాలలో మంచి కార్యాన్ని చేస్తున్నారు, ఇది బాప్ దాదా గమనించారు. ఈ రెండు వర్గాలవారూ తమ లిస్టును పంపించారు. బాప్ దాదా ఆ లిస్టును చూసారు. మంచి మంచివారు సంబంధ-సంపర్కంలోకి వచ్చినందుకు అభినందనలు కూడా తెలుపుతున్నారు. కానీ బాప్ దాదా ఇప్పుడు సమయానుసారంగా ఇది చెప్పారు - సహయోగులను ఇప్పుడు యజ్ఞ స్నేహీలుగా చెయ్యండి. వారస క్వాలిటీని తయారు చెయ్యండి. మీ జోన్లో ఎవరైతే సహయోగులు ఉన్నారో , బాప్ దాదా ముందుగానే చెప్పినట్లుగా లిస్టు అయితే వచ్చింది, మంచిది. ప్రతి వర్గంవారు తమ భిన్న భిన్న స్థానాలలోని సహయోగి మరియు స్నేహి ఆత్మలను పిలవండి. మూడు రోజులు వారిని సంపర్కంలోకి తీసుకురండి, ఉండాలి, మీటింగ్ చెయ్యాలి మరియు భవిష్యత్తు కోసం ప్రోగ్రామ్ తయారు చెయ్యాలి. ప్రతి జోనా వారు ఎక్కడైతే ఆ వర్గంవారి సంఖ్య ఎక్కువగా ఉన్నదో, ఏదైనా పెద్ద స్థానంలో సహయోగులను పిలిచి మీటింగ్ చెయ్యండి. వారిలో విశేషంగా ముందుకు సాగడానికి అవసరమైన 'ఒక్క బలము'ను నింపండి. ఇప్పటివరకు చేసినందుకు అభినందనలు. భవిష్యత్తు కోసం కూడా ప్లాన్‌ను తయారు చేసి ఇవ్వండి ఎందుకంటే వారికి కూడా ముందుకు వెళ్ళేందుకు విధిని వినిపించవలసిన అవసరము ఉంటుంది కదా. మరి అన్ని జోన్లు కలిసి ఒక్కొక్క వర్గం వారికి ఎక్కడ విశేష స్థానము ఉన్నదో అక్కడ కలవండి. అప్పుడు ఆ సంగఠనలో ఎంతమంది వస్తారో చూద్దాము, ఇక మీదట ఏమి కోరుకుంటున్నారు అన్నది చూద్దాము. ఇలా సంపర్కంలోకి తీసుకువస్తే వారసులుగా అవుతారు. ఇకపోతే ఇప్పుడు నిల్చుని ఉన్న ఈ రెండు వర్గాల రిజల్టును కూడా బాప్ దాదా చూసారు, బాగుంది అందుకే రెండు వర్గాలకూ అభినందనలు తెలుపుతున్నారు.

బాప్ దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు, ఇప్పుడు సమయం నాజూకుగా ఉంది కనుక ఇప్పుడు కనీసం సంపర్కంలోని వారిని యజ్ఞ స్నేహీలుగా చెయ్యండి. డాక్టర్ల సమాచారాన్ని కూడా వినడం జరిగింది. మంచిగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు డాక్టర్లు తమ డాక్టర్ల సంఖ్యను మరింతగా స్నేహి సహయోగిగా చేస్తూ ఉండండి. ప్లాన్ మంచిగా చేసారు, బాప్ దాదా విన్నారు. దాని వలన వృద్ధి జరుగగలదు. పేరు వ్యాపించగలదు. మరో వింగ్ వారు కూడా మంచిగా నలువైపుల ఎవరైతే వి.ఐ.పీలు తయారయ్యారో వారివలన కనెక్షన్ మంచిగా ఉంది అని రుజువవుతుంది. ఇప్పుడు కనెక్షన్ వారిని సంబంధంలోకి తీసుకురండి. సమీప సంబంధంలోకి తీసుకురండి. బావాదా ఏమి చూసారంటే వర్గాలు తయారైనప్పటి నుండి సేవ నలువైపుల మంచిగా వ్యాపించింది. సాధనాలు మంచిగా తయారు చేస్తున్నారు కానీ బాహ దాదా అన్ని జోన్ల వారికి చెప్పేదేమిటంటే ఇప్పుడు వారసులను తయారు చేసే విధిని మరింత తీవ్రం చెయ్యండి. లేకపోతే ఫిర్యాదు లభిస్తుంది. మేము సహయోగులుగానే ఉండిపొయ్యాము అని అంటారు. మీరు ప్లాన్ తప్పకుండా చెయ్యండి, తర్వాత ఎవరి భాగ్యంలో ఎంత ఉంటే అంత జరుగుతుంది. ఇంకా కూడా తయారు చెయ్యవచ్చు. బాప్ దాదా లిస్టును చూసారు అందరూ తమ తమ సమయాలలో లిస్టును ఇస్తున్నారు, లిస్టు అనుసారంగా సమీపంగా ఉన్నారు, వీరి నుండి తయారు చెయ్యవచ్చు. ఇప్పుడు ఈ ప్రయత్నం చెయ్యండి. అచ్చా.

(మెడికల్ వింగ్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుంది, అందులో 8 సేవా గ్రూపులను తయారు చెయ్యడం జరిగింది) మంచిది, తయారు చేసారు. ముందుకు వెళ్తూ ఉండండి. అచ్చా.

డబుల్ విదేశీయులు 1000మంది వచ్చారు, 65 దేశాల నుండి: - అందరూ చూడండి, మిమ్మల్ని చూసి అందరూ ఎంత సంతోషిస్తున్నారో చూడండి! బాబా ఎక్కడెక్కడి నుండి, 65 దేశాల నుండి వెతికి పట్టుకున్నారు. మమ్మల్ని బాబా వెతికి పట్టుకున్నారు అని మీ అందరికీ కూడా సంతోషము, నషా ఉన్నాయి కదా. మరియు బాప్ దాదా ఏమి చూసారంటే ఈసారి అందరూ కలిసి ఎవరైతే నిమిత్తంగా అయ్యారో, వారందరూ చాలా చాలా చాలా నిమిత్తంగా అయ్యే సేవను మంచిగా చేసారు. బాప్ దాదా ఒక్కొక్కరి పేరును తీసుకోవడం లేదు కానీ ఎవరెవరైతే నిమిత్తంగా అయ్యారో వారి సేవల సఫలత అందరి మనసులను ఎంతగా ఉత్సాహపరిచిందంటే వారు తమ స్థానాలకు వెళ్ళి తమ స్థానాన్ని కూడా అలాగే రిఫ్రెష్ చేస్తారు. కావున ఎవరైతే సేవకు నిమిత్తమయ్యారో వారికి బాప్ దాదా చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు. సిస్టమ్ కూడా మంచిగా తయారు చేసారు. జానకి బిడ్డ అయితే అందరి మనసులలో ఎక్స్ ట్రా ఉల్లాసాన్ని, ఉత్సాహాలను నింపారు. ప్రతి ఒక్కరి ముఖములో కనిపిస్తుంది. ఏ శక్తి అయితే జమ చేసుకున్నారో అది ముఖములో కనిపిస్తుంది. అందరి ముఖాలు సంతోషంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశము మరియు విదేశము కలిసి ఏదైతే సేవ చేసిందో దాని రిజల్టు కూడా మంచిగా ఉంది. భారతదేశం వారు విదేశాలవారికి ప్రేరణను ఇస్తే విదేశాలవారు భారతదేశానికి ప్రేరణను ఇస్తున్నారు. కలిసి చెయ్యడం ద్వారా మనవారిలో కూడా ఉత్సాహం వస్తుంది మరియు వినేవారిలో కూడా ఉత్సాహం వస్తుంది. విదేశాలవారు ఇంత చేస్తున్నారు, మనం భారతదేశంలో ఉండి కూడా చెయ్యడం లేదు, ఇక చెయ్యాలి అని ఉత్సాహం వస్తుంది. ఫీల్ అవుతారు. భారతదేశంవారు విదేశాలకు వెళ్లే వారు కూడా ఇలాగే ఫీల్ అవుతారు. ఉత్సాహంలోకి ముందుకు ఇలా సాగుతూ ఉంటారు. ఈ ప్లాన్ ఏదైతే తయారు చేసారో, మూడు నాలుగు ప్రోగ్రాములు ఏదైతే తయారు చేసారో, పెద్ద పెద్ద ప్రోగ్రాములు, అందులో, వాయుమండలంలో తేడా రావడాన్ని బాప్ దాదా చూసారు ఎందుకంటే అన్ని ప్రకారాలవారు వస్తారు కదా. క్రిస్టియన్లు, ముస్లింలు, భిన్న భిన్న ధర్మాలకు చెందినవారు కలిసి ఉండటాన్ని చూసి నిజంగానే విశ్వమంతా ఏకమవ్వగలదు అని అనిపిస్తుంది అందుకే మీ ట్రైనింగ్ బాప్ దాదాకు నచ్చింది. కృషి చేసేవారికి బాప్ దాదా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు విదేశాలవారు కూడా వారస క్వాలిటీ వారిని తీసుకురండి, సమయము అకస్మాత్తుగా ఉంది. కావున ఎంతమంది ఆత్మల కళ్యాణం చెయ్యగలరో అంతగా చేసేయ్యండి తర్వాత సమయం లభించదు. ఇప్పుడు సమయము ఉంది, కనీసం బాబా ఇంటిని అయితే చూడాలి కదా. బాబా పరిచయాన్ని అయితే పొందాలి కదా. దయ కలుగుతుంది కదా! చాలా బాగా చేస్తున్నారు కూడా కానీ బాప్ దాదాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఆరంభం సమయంలో భారతదేశంలో ఎవరైనా వి.ఐ.పి వస్తే వారి పేరు వార్తాపత్రికల్లో వచ్చేది, వార్తాపత్రికల వారు కూడా ఇంట్రస్ట్ చూపించేవారు. ప్రభుత్వం వి.ఐ.పీలను గమనించుకోవలసి ఉంటుంది. ఇలా ప్రభుత్వం కూడా ప్రభావితం అవుతుంది. ఇప్పుడు అదిచ్చారు, ఇందుకు అభినందనలు. ప్రోగ్రాములో తోడుగా అయితే ఉంటున్నారు, ఇది బాప్ దాదా మంచిగా భావిస్తున్నారు. ఇప్పుడు వారిని కూడా తీసుకువస్తే ప్రభుత్వం యొక్క చెవులు కొంచెం తెరుచుకుంటాయి. ఎలా అయితే ఇప్పుడు మనం చూసినట్లుగా ఈ 75 సంవత్సరాల జూబ్లీ భారతదేశం వారిని మంచిగా మేల్కొల్పింది. ఈ బ్రహ్మకుమారీలు ఏమి చేస్తున్నారో తెలియదు అని ఒకప్పుడు అనుకునేవారు, ఇప్పుడు వారే 'బ్రహ్మకు అద్భుతమైనది' అని అంటున్నారు. రెండవ అద్భుతమేమిటంటే ఇక్కడ సోదరీలు నిమిత్తంగా ఉండటము. సోదరీలు ఇంతటి కార్యాన్ని చేసారా అని వారికి అశ్చర్యం కలుగుతుంది. ఇదంతా చూసి వారికి కూడా సమీపంగా రావాలని అనిపిస్తుంది. కలవాలి, వినాలి అని అనుకుంటున్నారు. మీ ముఖ్యమైన సబ్జెక్టు ఏదైతే ఉందో, మీరు ఆత్మ, అది ఈ జూబ్లీ కారణంగా, 'ఆత్మగా భావించినప్పుడే ఏకమతము సాధ్యమవుతుంది' అని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. ఎలా అయితే ఈ జూబ్లీ అద్భుతం చేసిందో అలాగే మరిన్ని చేస్తూ ఉండండి. అందరికీ సందేశాన్ని అందించడానికి టి.వి, రేడియో చేసిన సహయోగానికి కూడా బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని అన్నీ చూస్తున్నారు. మామూలుగా అయితే ఎన్నో సాకులు చెప్పేవారు, రావాలనుకున్నా కానీ సమయం లేదు అని అనేవారు ఇప్పుడు ఇంట్లో కూర్చునే చూడటం ద్వారా నెమ్మది నెమ్మదిగా మేల్కుంటున్నారు. కావున, ఏదైతే చేస్తున్నారో అది మంచిగా జరుగుతుంది, మరింత మంచిగా జరుగుతుంది. ఇందుకు అభినందనలు. 

ఇప్పుడు సేవ ఉత్సాహం అందరిలో కలగడాన్ని కూడా బాప్ దాదా చూసారు. మేము కూడా చెయ్యాలి, మేము కూడా చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఈ ఉల్లాసమైతే వచ్చింది. ఉల్లాసము వచ్చినప్పుడు, ఎక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయో అక్కడ సఫలత ఉండనే ఉంది. కావున ఎవరైతే ఇక్కడ సమ్ముఖంలో ఉన్నారో, ఎవరైతే దూరంగా కూర్చుని వింటున్నారో, చూస్తున్నారో వారందరికీ, నలువైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా చాలా చాలా హృదయపూర్వక ప్రేమను మరియు దానితోపాటు హృదయంలో సదా ఉండిపోతున్నందుకు అభినందనలు తెలుపుతున్నారు.

ఇప్పుడు మనసు కలుగుతుందా, ఆబూలో ఉండాలని మనసు కలుగుతుందా! మంచిది. విదేశీయులను చూసి పరివారం కూడా సంతోషిస్తుంది. 65 దేశాల నుండి ఇక్కడకు ఎలా చేరుకున్నారు? ప్రేమ అనే విమానంలో వచ్చారు కదా.

మొదటిసారిగా వచ్చినవారు చాలామంది ఉన్నారు:- మొదటిసారి వచ్చినవారికి డబుల్ అభినందనలు ఇస్తున్నాము, ఎందుకని? ఎందుకని డబుల్ అభినందనలు ఇస్తున్నాము? ఎందుకంటే సమయపు హాహాకారాలకంటే ముందుగానే వచ్చి తమ భాగ్యాన్ని చేసుకున్నారు. “అహో ప్రభు, అహో ప్రభు' అని అనడానికి బదులుగా 'నా బాబా' అనైతే అన్నారు. అందుకే వచ్చినవారిని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. పిల్లలు వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేసారు. చూడండి, సగం క్లాసు వారు మొదటిసారి వచ్చినవారే. ఇప్పుడు తీవ్ర పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. పురుషార్థీ కాదు తీవ్ర పురుషార్థీ. ఇప్పుడైనా ఒకవేళ తీవ్ర పురుషార్థం చేస్తే ఆ తీవ్ర పురుషార్థంతో ముందుకు వెళ్ళవచ్చు. తీవ్ర పురుషార్థానికి మార్జిన్ ఉంది. సాధారణ పురుషార్థం చేసే సమయం పోయింది. వస్తున్న పిల్లలందరి వద్దకు వెళ్ళి బాప్ దాదా వీరు ఢీలాగా ఉన్నారా లేక ముందుకు వెళ్తున్నారా అని చూస్తారు. బాప్ దాదా నలువైపుల తిరుగుతారు. మీరైతే నలువైపులకు వెళ్ళలేరు కదా కానీ బాప్ దాదా అయితే రోజూ నలువైపుల తిరుగుతారు. బాబాతో పాటు విశేషంగా అడ్వాన్స్ పార్టీలో వెళ్ళినవారు కూడా తిరుగుతారు. మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. మా సోదరీలు, మా సోదరులు వచ్చేసారు, వచ్చేసారు అని సంతోషిస్తారు. కావున, ముందుకు వెళ్తూ ఉండండి. పూర్తి పరివారం తరఫున మీకు అభినందనలు. అచ్ఛా.

ఈరోజు మధువనం వారికి బాప్ దాదా విశేషంగా ఒక విషయానికి అభినందనలు తెలుపుతున్నారు. ఏ విషయము? అందరూ ఇప్పటి వరకు చాలా ప్రేమగా సేవను చేసారు. ఎంత పెద్ద పరివారము వచ్చినా కానీ సేవకు నిమిత్తంగా అయితే మధువనం వారే అవుతారు కదా. ప్రతి జోన్ వారు సహయోగులుగా అయినప్పటికీ ఎవరైతే పర్మనెంట్‌గా ఉంటున్నారో వారి సహయోగం లేకుండా చెయ్యలేరు కదా. కావున ఒక్కొక్క మధువనవాసి, కేవలం క్రిందివారు కాదు, పైనవారు కూడా, హాస్పిటల్ కూడా, ఎవరైతే సహయోగమును ఇచ్చారో, నిర్విరామంగా అయితే ఎవరైతే సహయోగమును ఇస్తున్నారో అందరూ, పేరు సహితంగా ఒక్కొక్కరికీ బాప్ దాదా ఇచ్చే ప్రియస్మృతులను స్వీకరించండి. అచ్ఛా. ఇక్కడ కూర్చున్న మధువనం వారు లేవండి. మీకు ప్రత్యేకంగా అభినందనలు. అచ్చా..

నలువైపుల ఉన్న హోలియెస్ట్ పిల్లలకు, ప్రతి అడుగులో 'నా బాబా, నా బాబా' అంటూ ఎగురుతూ ఉన్న పిల్లలకు, సదా తమ తీవ్ర పురుషార్థం ద్వారా ముందుకు వెళ్తూ మరియు తీసుకు వెళ్తున్న పిల్లలకు, బాప్ దాదా హృదయ రత్నాలకు బాప్ దాదా చాలా చాలా చాలా చాలా హృదయపూర్వక ప్రేమను అందిస్తున్నారు. దానితో పాటు హోలీ అభినందనలు తెలుపుతున్నారు ఎందుకంటే వాస్తవానికి మీరే హోలీ, మరెవ్వరూ డబుల్ హోలీగా అవ్వలేరు. మీరే డబుల్ హోలీగా అవుతున్నారు అందుకే పదమారెట్ల అభినందనలు, అభినందనలు.

జానకి దాదీతో: - పరివారంపై హృదయపూర్వక ప్రేమ చాలా మంచిగా ఉంది. అందరూ సంతోషిస్తారు. మనస్పూర్తిగా చేసినప్పుడు సంతోషం కలుగుతుంది. అలసట లేకుండా చేస్తూ ఉన్నారు, ఇలాగే ఉండండి. బాప్ దాదా అయితే పిల్లలందరికీ సకాశ్ ను ఇస్తూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరినీ నడిపిస్తున్నారు. ఎవరినైతే బాప్ దాదా నడిపిస్తున్నారో ఆ పిల్లలు రెస్పాన్స్ కూడా ఇస్తుంటారు. మంచిగా ఇస్తారు.

మోహిని అక్కయ్యతో: - బాగున్నారా, నడిపించడం అయితే వచ్చింది కదా. ఆరోగ్యంలో ఇప్పుడింకా పూర్తి శక్తి రాలేదు. ఇప్పుడు మీరు ఎలా అయితే నడిపిస్తున్నారో అది మంచిగా ఉంది, అలాగే నడిపిస్తూ ఉండండి. నడవడం లేదు అని అనుకోవద్దు, నడుస్తుంది. కానీ మీకు పద్దతి తెలిసింది, ఇందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. (సేవ ప్రోగ్రాము తయారయింది కానీ మేము వెళ్ళలేకపోయాము) ఎందుకంటే ముందు కూడా రావడము వెళ్ళడము జరిగింది కదా. ఏ ప్రోగ్రామ్ అయినా తయారు చెయ్యండి కానీ కొంత సమయం విశ్రాంతి తీసుకుని తర్వాత వెళ్ళండి. ఇప్పుడు అర్థమైపోయింది కదా. సేవ చేస్తారు, ఏమీ జరుగదు. వెళ్ళాల్సిన 15 రోజులు ముందు రెస్ట్ తీసుకోండి. వెళ్ళాలి, కానీ స్వయాన్ని తయారు చేసుకోండి, ఎక్స్ ట్రా ఏమీ చెయ్యకండి. లభించిన డైరెక్షన్ అనుసారంగానే నడుచుకోండి. మంచిగా అయిపోతారు, బయటకు వెళ్తారు.

నీలూ అక్కయ్య కూడా హాస్పిటల్ యాత్ర చేసారు: - ధైర్యము ఉంచారు మరియు శక్తి కూడా ఉంది. శక్తి ఉంది కదా. బాప్ దాదా ఇచ్చారు మరియు మీరు జమ చేసుకున్నారు. ఆ శక్తితో ఏదీ పెద్ద విషయంగా అనిపించదు. ఏమీ జరగనట్లుగానే అనిపిస్తుంది, ఏ కష్టమూ ఉండదు. సేవ యొక్క మేవ కూడా లభిస్తుంది కదా. మంచిది.

పర్ దాదీతో:- వీరైతే వాహ్! వాహ్! కదా. చూడండి, ఇప్పుడు వీరి ఫోటో తియ్యండి, అనారోగ్యంగా కనిపిస్తున్నారా? పుట్టినరోజు అభినందనలు. వీరి ముఖము ఎప్పుడూ ఏమీ జరుగనట్లుగా ఉంటుంది, ఇందుకు అభినందనలు. ముఖము సుందరంగా ఉంది. డబుల్ తండ్రి అని అంటూ ఉంటారు కదా, అందుకే డబుల్ వరదానము.

నిర్వైర్ అన్నయ్య మరియు ముగ్గురు అన్నయ్యలతో:- (కటక్ వారి స్మృతిని అందించారు) అందరికీ ప్రియస్మృతులను తెలపండి. అందరికీ ఉల్లాసము ఉంది, మంచిది. సందేశమైతే వ్యాపిస్తుంది కదా. (పూరీ మహారాజు కూడా మధువనానికి రావాలని కోరుకుంటున్నారు) ఇప్పుడిక వస్తారు, చాలామంది వస్తారు. మీరు ముగ్గురూ కలిసి సంప్రదించుకుంటున్నారా? సంప్రదించి తర్వాత దాదీలకు వినిపించండి. ముందు పరస్పరంలో సంప్రదించుకోండి. ఈ రోజు చేసింది మంచిగా ఉంది. ఇలాగే సంప్రదించుకుంటూ వీరికి కూడా వినిపించండి.

రమేష్ అన్నయ్యతో: - ఆరోగ్యం మంచిగా ఉంది కదా. ఆరోగ్యాన్ని సంభాళించుకోండి. తేలికగా విడిచిపెట్టకండి. సదా బాబాతో పాటుగా ఉన్నాను, బాబాతో కలిసి పని చేస్తున్నాను అని భావిస్తూ ఉండండి. ఒంటరిగా కాదు. (అనీలా సోదరి స్మృతిని అందించారు, వారు హాస్పిటల్ లో ఉన్నారు) వారి ఆరోగ్యం కొద్దిగా ఉంది.

(సోనీపట్ భూమిపై పని సాగించాలి) మంచిది, ఆ వైపు సేవ అయితే ప్రారంభమవ్వాలి కదా. ప్రోగ్రాము తయారు చెయ్యండి. మంచిది. సేవ విస్తారం జరుగుతుంది. .

భూపాల్ అన్నయ్యతో : - సాక్షిగా అయ్యి అన్ని యజ్ఞ కార్యాలు నిమిత్తంగా అయ్యి చేస్తూ వెళ్ళండి. బాబా తోడు అయితే ఉండనే ఉంది. ఒంటరిగా అయితే ఎవ్వరూ చెయ్యలేరు. బాబా తోడుగా ఉండనే ఉన్నారు. మంచిది.

మోహిని అక్కయ్య సేవలో ఉన్న సోదరీల గురించి బాప్ దాదా ఇలా అన్నారు. బాబాకు తెలుసు, చూడండి, ఏ సేవ చేసినా కానీ అది బాబా ఇచ్చిన సేవ. బాబా ఇచ్చారు. కనుక ముందు బాబా, తర్వాత సేవ. మంచిది. 

Comments