05-02-2009 అవ్యక్త మురళి

  05-02-2009         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

సేవ చేస్తూ డబల్ లైట్ (Double Light /ప్రకాశము మరియు తేలికతనముల) స్థితి ద్వారా ఫరిస్తా(సూక్ష్మదేవత) స్థితిలో
ఉండండి, అశరీరిగా అయ్యే అభ్యాసమును చేయండి"

ఈరోజు బాప్ దాదా నలువైపులా గల పిల్లల మూడు రూపాలను చూస్తున్నారు - ఏ విధంగా తండ్రికి గల మూడు రూపాలు పిల్లలకు తెలుసో అదే విధముగా పిల్లల మూడు రూపాలను బాప్ దాదా చూస్తున్నారు. అవి ఈ సంగమయుగములోని లక్ష్యము మరియు లక్షణాలు - మొదటి స్వరూపము బ్రాహ్మణ, రెండవది ఫరిస్తా, మూడవది దేవతా స్వరూపము. బ్రాహ్మణ సో (నుండి) ఫరిస్తా, ఫరిస్తా సో దేవతా. వర్తమాన సమయములో ఇప్పుడు విశేషముగా ఏ లక్ష్యము ఎదురుగా ఉంది? ఎందుకంటే ఫరిస్తాలుగా కాకుండా దేవతలుగా కాలేరు. వర్తమాన సమయానుసారము మరియు స్వపురుషార్థ అనుసారముగా లక్ష్యము ఏమిటంటే - ఫరిస్తాగా అగుట అనగా సంగమయుగ సంపన్న స్వరూపము - "ఫరిస్తా సో దేవతలుగా కావటము". ఫరిస్తా నిర్వచనమును (పరిభాష) కూడా తెలుసుకున్నారు. ఫరిస్తా అనగా పురాతన ప్రపంచపు సంబంధము, సంస్కారము, సంకల్పముల నుండి తేలిక(హల్కా)గా ఉండుట. పురాతన సంస్కారములన్నింటిని త్యజించి తేలికగా ఉండాలి. కేవలము మీ సంస్కార - స్వభావాలు, మీ సంసారములో మాత్రమే తేలికత్వము కాదు ఫరిస్తా అనగా సర్వుల సంబంధములోనికి వస్తూ, సర్వుల స్వభావ-సంస్కారములలో కూడా తేలికత్వమును కలిగి వుండుట. ఈ తేలికత్వమునకు గుర్తేమిటి? ఫరిస్తా ఆత్మలు సర్వులకు ప్రియముగా ఉంటారు. ఏ కొందరికో ప్రియమైనవారుగా కాకుండా సర్వులకు ప్రియముగా ఉంటారు. ఏవిధముగా తండ్రిని, బ్రహ్మా తండ్రిని ప్రతి ఒక్కరూ నా వారని భావిస్తారో, “నా బాబా" అని అంటారో, అలాగే ఫరిస్తా అనగా సర్యులకు ప్రియమైనవారు. కొంతమంది పిల్లలు ఇలా ఆలోచిస్తారు - బ్రహ్మాబాబా అయితే బ్రహ్మాగానే ఉండేవారు కాని మీరందరూ మీ సమానముగా ఉండిన బ్రాహ్మణ ఆత్మలలో మీ అందరి ప్రియమైన దాదీని చూశారు. వారిని అందరూ ప్రేమతో “నా దాదీ" అని అనుభవము చేసేవారు, అన్ని వైపులా స్వభావము, సంస్కారము మరియు ఈ పురాతన ప్రపంచములో ఉంటూ కూడా న్వారీ మరియు ప్యారీ (భిన్నముగా మరియు ప్రియము)గా ఉండినారు. అందరూ "మా దాదీ (నా దాదీ)" అని అధికారముతో చెప్తారు. మరి కారణమేమిటి? స్వయం స్వభావ సంస్కారములలో తేలికగా ఉండేవారు. సర్వులకు నా వారు అని అనుభవము చేయించారు. అంటే ఉదాహరణగా ఉండినారు. జగదంబను కూడా చూశారు కాని చాలా మంది - ఆమె జగత్ అంబ (జగదాంబ) అయి వుండినది కదా! అని ఆలోచిస్తారు కాని దాదీ మీ బ్రాహ్మణ పరివారములో సాథీ (తోడు)గా ఉండినది. ఒకవేళ పురుషార్థమును గురించి వింటే లేదా అడిగితే వారి (దాదీ) నోటిలో సదా ఒకే మాట వుండేది - "ఇప్పుడు కర్మాతీతముగా కావాలి", కర్మాతీతముగా కావాలనే లగ్నము(తపన)లో ఇతరులకు కూడా ఇదే మాటను పలుమార్లు గుర్తు చేయిస్తూ ఉండేది. కనుక ప్రతి బ్రాహ్మణాత్మకు ఇప్పటి లక్ష్యము మరియు లక్షణాలు విశేషముగా ఇవే ఉండాలి, ఉన్నాయి కూడా. అయితే నంబరు వారుగా ఉన్నాయి. ఇదే తపన ఉండాలి - "ఇప్పుడు ఫరిస్తాగా కానే కావాలి, ఫరిస్తా అనగా ఈ కర్మేంద్రియాలకు రాజు కావాలి." ఫరిస్తా అనగా ఈ దేహము, సాకార దేహము నుండి న్వారా (భిన్నముగా) సదా ప్రకాశ దేహధారి. ఫరిస్తా అనగా ఈ కర్మేంద్రియాలకు రాజు. 

బాప్ దాదా ఇంతకమునుపు కూడా వినిపించారు - "ఈ సృష్టిచక్రమంతటిలో ఒక్క బాప్ దాదా మాత్రమే, నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ! అని, స్వరాజ్యా ధికారులని  నషాతో చెప్తారు. ఫరిస్తా అనగా స్వరాజ్యాధికారి. అలాంటి స్వరాజ్యాధికారి ఆత్మ ప్రకాశ స్వరూపధారి. ఎవరైనా ఇటువంటి ప్రకాశపు, డబల్ తెలికత్వపు స్థితిలో స్థితమై, ఎవరితోనైనా కలిస్తే వారి మస్తకములో ఆత్మ జ్యోతి అనే భావము (భాన్), నడుస్తూ - తిరుగుతూ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తీవ్ర పురుషార్థము యొక్క లక్ష్యము మరియు లక్షణాలను సదా ప్రత్యక్ష (ఇమర్జ్/ Emerge) రూపములో ఉంచుకోండి. ఏవిధంగా బ్రహ్మాబాబాలో గమనించారో - ఎవరైనా (బ్రహ్మాబాబాను) కలినినప్పుడు, దృష్టినిస్తూ, మాట్లాడుతూ ఏమి కనిపించేది? అంతిమ సమయములో బ్రహ్మాబాబా మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా ఎక్కువగా మధురమైన అశరీరి స్థితిలో స్థితమగుటను అనుభవము చేశారు, ఇతరులకు కూడా. ఎంతటి సర్వీసు (సేవా) సమాచారము ఉండినప్పటికీ కూడా ఇతరులకు సెకండులో అశరీరి స్థితిని అనుభవము చేయిస్తూ ఉండినారు. అంతేకాకుండా మురళీలో పరిశీలించినా - పలుమార్లు నేను అశరీరి ఆత్మను, ఆత్మ పాఠమును ఒకే మురళిలో ఎన్ని సార్లు గుర్తు చేయించేవారు? ఇప్పుడు సమయానుసారము చిన్న, చిన్న విస్తారములోని విషయాలు, స్వభావ-సంస్కారాల విషయాలు అశరీరి స్థితి నుండి దూరము చేసేస్తాయి. ఇప్పుడు పరివర్తన కావాలి.

బాప్ దాదా గమనించారు - సేవలో ఫలితము బాగుంటున్నది, సేవ కొరకు మెజారిటీ (అధిక శాతము) పిల్లలలో ఉమంగము - ఉతాహములున్నాయి. ప్లాను (ప్రణాళిక/ Plan) కూడా తయారు చేస్తున్నారు. కాని సేవ జతలో సందేశమునివ్వటము - ఇది కూడా ఆవశ్యకమే. బాప్ దాదా ఈ రోజు కూడా భిన్న భిన్న వర్గాల, భిన్న భిన్న స్థానాల సేవలలో మంచి ఫలితమును చూశారు కాని అశరీరి స్థితి వాయుమండలము తక్కువ శ్రమతో అధిక ప్రభావమును కలుగజేస్తుంది. విన్నది బాగుందనిపిస్తుంది. కాని వాయుమండలము ద్వారా అశరీరిపన్ దృష్టి ద్వారా అనుభవము చేస్తారు, ఆ అనుభవమును మరచిపోలేరు. కనుక ఫరిస్తాపన్ యొక్క ధున్ (పట్టుదలతో స్థితిని తయారు చేసుకోవటము) ఇప్పుడు సేవలో విశేషముగా ఎడిషన్ (ఇంకను అధికముగా చేర్చుట | addition) చేయండి. శాంతి, ఖుషీ. సుఖము, ఆత్మిక ప్రేమలలో ఏదో ఒకదానిని అనుభవము చేయించండి. నడవడికలో ప్యార్ (ప్రీతి), ప్రేమ. ఇంకనూ సంబంధము ద్వారా పరివారము ద్వారా ఏ పాలనను (అతిథ్యము, గౌరవము, ఖాతరీ) ఇస్తారో దాని ద్వారా వారు అనుభవము చేసి వెళ్తారు, కాని అతీంద్రియ సుఖానుభూతి, శాంతి యొక్క ఆత్మిక నషా ఇప్పుడు వాయుమండలము. వైబ్రేషన్ల ద్వారా అనుభవమును చేయించుటను విశేషముగా అటెన్సన్లో (గమనికలో/attention ) ఉంచుకోండి. విశేషముగా అనుభవమును చేయించండి. ఏదో ఒక అనుభవమును చేయించండి. ఏ విధముగా సిస్టమ్ (System) సంస్థ అనుసరించు పద్ధతులలో ప్రభావితమై వెళ్తారు. అటువంటి సిస్టమ్, పరివారపు ప్రీతి పూర్వక సిస్టమ్, ఇంకెక్కడ కూడా లభించదు అని అంటారో అలా ఇప్పుడు ఏదో ఒక శక్తి, ఏదో ఒక ప్రాప్తి యొక్క అనుభవమును చేసి వెళ్లాలి. ఇప్పుడు 70 - 72 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఈ సమయములో ఫలితము(result) లో ఏమి గమనించారు! శ్రమ చేశారు. కాని ఇప్పటివరకు బ్రహ్మాకుమారీలు కర్తవ్యమును చేస్తున్నారు. బ్రహ్మాకుమారీల జ్ఞానము బాగున్నదని అంటారే కాని, వీరికి జ్ఞానమునిచ్చే వారెవరు ! నడిపించే వారెవరు! (సోర్స్ / Source) మూలమెవరు! అనేది రాలేదు. మీరంతా విలిచే "బాబా" అనే పదాన్ని విని "వీరి బాబా” అని అంటున్నారే కాని “వారే నా బాబా” అనేది రావటము లేదు. తండ్రి ప్రత్యక్షత ఇప్పుడు గుప్త రూపములో ఉన్నది. బాబా - బాబా అని అంటారు కాని "నా బాబా, నేను బాబా వాడిని, బాబా నా వారు" అనే వారు కోటిలో కొందరు మాత్రమే వెలువడుతున్నారు.

కనుక సంగమయుగపు లక్ష్యమేమిటి? ఆత్మలైన మనందరి తండ్రి వచ్చేశారు అని తండ్రి ద్వారానే లభిస్తుంది కదా! ఆ ప్రభావము ఫరిస్తా స్థితి ద్వారానే వాయుమండలము వ్యాపిస్తుంది. వీరి దృష్టి నుండి ప్రకాశము (Light, లైట్) లభిస్తుంది. వీరి దృష్టి నుండి ప్రకాశము కనిపిస్తుంది అని అందరూ అనాలి. ఇప్పుడు తీవ్రపురుషార్థపు ఇదే లక్ష్యమునుంచుకుని - "నేను డబల్ లైట్ ఫరిస్తాను ". నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపము యొక్క అనుభూతిని పెంచుకోండి. అశరీరి స్థితి అనుభవమును ఎక్కువ చేసుకోండి. సెకండులో సంకల్పములనైనాగాని సమాప్తి చేయుటలో, సంస్కార- స్వభావములలో డబల్ లైట్ గా ఉండాలి. చాలా మంది పిల్లలు అంటారు - మేమైతే తేలికగానే ఉంటాము. కాని ఈ విషయము ఇతరులకు తెలియదు కాని ఇటువంటి డబల్ లైట్ ఫరిస్తా, డబల్ లైట్, వారి లైట్ (ప్రకాశము) దాగి ఉంటుందా? చిన్న లైటుగాని, టార్చిలైట్ (Torch Light) గాని, లేదా అగ్గిపుల్ల (మాచిస్ కి తీలీ, Match Stio వెలుగుగాని,) ఎక్కడ వెలుగు వున్నాగాని అది దాగదు. మరి ఇదైతే ఆత్మిక లైట్ అయిన వాయుమండలము ద్వారా వారికి - వీరెవరు! అనేది అనుభవము చేయించండి. జగదంబగానీ, దాదీగాని, నన్ను ఇతరులు గుర్తించలేదని అనలేదు. స్వ వాయుమండలము ద్వారా సర్వులకు ప్రియముగా ఉండేవారు. అందుకే దాదీని ఉదాహరణగా ఇస్తారు, ఎందుకంటే బ్రహ్మాబాబా కొరకు కూడా ఇలా ఆలోచిస్తారు - బ్రహ్మాబాబాలో శివబాబా ఉండేవారు కదా! ఇక శివబాబా కొరకు వారు నిరాకారి అనగా న్యారా(అతీతులు) మరియు నిరాకారులు, మేమేమో స్థూల శరీరధారులము. ఇంత పెద్ద సమూహములో ఉండేవారము. ప్రతి ఒక్కరి సంస్కారముల మధ్యలో నివనించేవారము అని అనుకుంటారు. సంస్కారాలను కలుపుకోవటమనగా ఫరిస్తాగా కావటము. ఇతరుల సంస్కారములను చూచి కొందరు పిల్లలు ఉదాసీనము (దిల్ శికస్త్)గా అవుతారు. బాబా చాలా మంచివారు. బ్రహ్మాబాబా చాలా మంచివారు, జ్ఞానము చాలా బాగున్నది. ప్రాప్తులు కూడా మంచిగా ఉన్నాయి కాని సంస్కార- స్వభావములను కలుపుకోవడమే కష్టము. సర్వులకు ప్రియముగా కావటము, కొంతమందికి మాత్రమే ప్రీతి పాత్రులుగా కావడం కాదు, ఎందుకంటే కొందరి విశేషతలను చూసి కూడా ప్రీతి కలుగుతుందని చాలా మంది పిల్లలంటారు - ఉదాహరణానికి వీరి భాషణము (Speech/ స్పీచ్) చాలా బాగుంటుంది. వీరిలో ఫలానా విశేషత చాలా బాగున్నది. వాణి చాలా బాగున్నది అని అంటారు. ఫరిస్తాగా కావటములో ఇవన్నీ విఘ్నాలుగా అవుతాయి... భలే ప్యారాగా చేయండి, కాని నేను ఆత్మ న్యారాగా ఉన్నాను. న్యారా అవస్థ ద్వారా ప్యారాగా కండి. విశేషత ఆధారముగా ప్యారా కాదు. వీరిలోని ఈ విశేషత నాకు చాలా ఇష్టమవుతుంది అని అంటారు కదా, భలే దానిని ధారణ చేయండి. కాని కేవలము దీని కారణముగా ప్యారాగా కావటము అనేది తప్పు. ఫరిస్తా సర్వులకు ప్యారాగా ఉంటారు, నా వారు అని ప్రతి ఒక్కరు చెప్పాలి. నా వారనే భావము . ఇటువంటి ఫరిస్తా అవస్థను పొందుటలో రెండు విషయాలు విఘ్నాలుగా అవుతాయి. ఒకటేమో దేహభాన్ (నేను దేహము అనెడు భ్రాంతి), ఇది సహజముగానే అందరికీ అనుభవమే.. 63 జన్మల దేహభానము మరలా మరలా ప్రకటితమవుతూంటుంది. ఇక రెండవది దేహాభిమానము. దేహభాన్ మరియు దేహాభిమానము. జ్ఞానములో ఎంతెంతగా ముందుకు వెళ్తారో అంతే స్వయం పట్ల కూడా అప్పుడప్పుడు దేహాభిమానము వచ్చేస్తుంది. ఆ అభిమానము క్రింద పడవేస్తుంది. దేహాభిమానము ఎలా వస్తుంది? ఏదేని విశేషత ఉంటుంది కదా! ఆ విశేషత కారణముగా అభిమానము ఉంటుంది. నేనేమైనా తక్కువనా, నా భాషణము అందరికీ ఇష్టమవుతుంది. నా సేవ యొక్క ప్రభావము పడుతుంది. ఏదో ఒక కళ, నేను బాగా సంభాళన(Handling) చేస్తాను. నేను కోర్సు చేయించుట చాలా బాగా ఉంటుంది............ ఇలా జ్ఞానములో ముందుకు పోవటములో సేవలో వృద్ధినొందుటలో ఈ అభిమానము స్వయం పట్ల కూడా వస్తుంది అంతేకాక ఇతరులు గుణాలు లేక కళ లేక విశేషతల పట్ల కూడా  ప్రేమ కలుగుతుంది. కానీ ఏమి గుర్తుకొస్తుంది? దేహభాన్ ఏ గుర్తుకొస్తుంది కదా! ఫలానావారిలో బుద్ది శక్తి చాలా బాగుంది. నేను సంభాళన చేయు విధానము బాగుంటుంది, ఈ అభిమానము సేవలో లేదా పురుషార్థములో వృద్ధి చెందేవారికి అభిమానం రూపములో వస్తుంది. కనుక ఇది కూడా చెక్ చేసుకోవాలి - అబిమానము గలవారికి అభిమానము కొద్దిగా ఏమైనా ఉందని పరిశీలించుకుని సాధనము - అభిమానము కలవారిని కొద్దిగా అయినా అవమానపరచినా, వారి విచారముల, వారి సలహాల, వారిలోని కళల, వారి సంభాళన చేయు విధానమునకుగాని అవమానము చాలా త్వరితముగా వారు ఫీల్ అవుతారు. ఇంకనూ అవమానము అనుభవమవుతున్నదనుటకు దానికి ఇంకా సూక్ష్మ గుర్తు క్రోధాంశము ఉత్పన్నమవుతుంది. రోబ్. అవి ఫరిస్తాగా కానివ్వవు. వర్తమాన సమయానుసారముగా బాప్ దాదా మరలా సూచన ఇస్తున్నారు - తమ సంగమయుగ చివరి స్వరూపమైన ఫరిస్తాస్థితిని ఇప్పుడు జీవనములో ప్రత్యక్షము చేయండి. సాకారములోనికి తీసుకురండి. ఫరిస్తాగా కావటము ద్వారా అశరీరిగా కావటము చాలా సహజమవుతుంది. మీ చెకింగ్ (పరిశీలన/ Checking) చేసుకోండి. సూక్ష్మరూపములో కూడా లగావ్ (తగుల్పాటు) - ఏ విశేషత, స్వయం యొక, లేదా ఇతరుల విశేషతల పట్లగాని కొద్దిగా కూడా అభిమానము లేదు కదా? కొందరు పిల్లలలో చిన్న విషయము జరిగినా గాని అవస్థ తలక్రిందులవుతుంది. దిల్ ఖుష్ (హృదయపూర్వక సంతోషము). ఖుషీతో కూడిన ముఖము ఉండుటకు బదులుగా చింతన చేయు ముఖము లేదా చింతతో కూడి ఉన్న ముఖముగా అవుతుంది. అంతేకాకుండా నడుస్తూ-నడుస్తూ దుఃఖితులు, ఉదాసీనులు (దిలే శికస్త్)గా అవుతారు. దిల్‌ఖుష్ కి బదులుగా దిల్ శికస్త్ అవుతారు. అర్థమయినదా ? మీ సంగమయుగ చివరి స్టేజ్ అయిన ఫరిస్తాపన్ యొక్క సంస్కారాలను ఎమర్జ్ చేసుకోండి. ఎలాగైతే బ్రహ్మాబాబాను చూశారో అలా ఫాలో ఫాదర్ (తండ్రిని అనుసరించుట Follow Father) చేయాలి కదా. మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా మంది పిల్లలకు అనుభవము ఉన్నది. సమాచారము వినిపించాలని వచ్చేవారు కాని సమాచారమునకు అతీతముగా, శబ్దాతీత స్థితిలో వుండుటను అనుభవము చేయుటను గమనించారు. మాటల ద్వారా ఏదో విషయమును గురించి సమాచారమును వినిపించుటకు, ఇది చెప్పాలి. ఇది చెప్పాలి, ఇది అడగాలని ఇలా ఎంతో ప్లాను చేసుకొని వచ్చేవారు కాని ఎదుటకు రాగానే ఏమి చెప్పాలనుకున్నారో అది మరచిపోయేవారు. ఇదే ఫరిస్తా స్థితి. మరి ఈరోజు ఏ పాఠమును పక్కాగా చేసుకున్నారు? నేనెవరు? ఫరిస్తా. ఏ విషయములతో గాని, ఏ విశేషతల పట్లగాని, స్వ విశేషత నుండి, దేహాభిమానము నుండి కూడా అతీతముగా డబల్ లైట్ ఫరిస్తా, ఎందుకంటే ఫరిస్తా కాకుండా ఉన్నతమైన దేవతాపదవి లభించదు. సత్యయుగములోనికైతే వస్తారు. ఎందుకంటే బిడ్డలుగా అయ్యారు. ఆస్తి అయితే లభిస్తుంది. కాని శ్రేష్ఠ పదవి లభించదు. సదా జతలో ఉంటాము. జతజతలో రాజ్యము చేస్తాము అనే ప్రతిజ్ఞ చేశారు కదా. భలే నింహాసనముపై జతలో కూర్చోకపోయినా రాజ్యాధికారులుగా అవుతారు. అక్కడి రాజ్యసభ చూశారు కదా. రాజ్యసభకు ఎవరెవరు అధికారులో వారు తిలకము మరియు కిరీటధారులుగా ఉంటారు. రాజ్వతిలకము. రాజ్యమునకు గుర్తు కిరీటము. కనుక చాలా సమయము నుండి స్వరాజ్యాధికారి, మధ్య మధ్యలో కాదు. చాలా కాలము నుండి స్వరాజ్యాధికారులు. భలే నింహాసనముపై కూర్చోకపోయినా రాయల్ ఫ్యామిలీకి అధికారులవుతారు. అచ్చా ! 

ఈ రోజు మొదటిసారి వచ్చినవారు లేవండి. అచ్చా! సభలో మూడుభాగాలు (3/4 భాగము) లేచి నిల్చున్నారు. ఎవరెవరు మొదటిసారిగా వచ్చారో వారందరికీ తండ్రితో, సాకారములో కలుస్తున్నందుకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. వచ్చిన విల్లలందరికీ బాప్ దాదా ఇదే వరదానమిస్తున్నారు - టూలేట్ సమయములో వచ్చారు. కాని నూతనముగా వచ్చి వున్న పిల్లల పట్ల ఒక విశేష వరదానమేమంటే - మేము ఎలా ముందుకు వెళ్లగలము? అని ఎప్పుడూ సంకల్పము కూడా చేయకండి. టూలేట్ (అత్యంత ఆలస్యమ late) ఇక మీదట వచ్చేవారికి చెప్తారు. ఇప్పుడు లేట్ (ఆలస్వము/Late) గా వచ్చారే కాని టూ లేట్ లో రాలేదు. మీ అందరి పట్ల విశేషముగా బాప్ దాదా మరియు నిమిత్తమైవున్న బ్రాహ్మణ పరి సోదర సోదరీలకు విశేషముగా ఏ సహయోగ భావన వుందనగా - మీరు ఈ కొద్ది సమయము ఒక్కొక్క సెకండును సఫలము చేసుకోవాలి. ఎందుకంటే అతి తక్కువ సమయములోనే పొందాలి. ఒక సెకండు కూడా వ్యర్థముగా పోగొట్టుకోరాదు. కర్మయోగులై నడుచుకోండి. కర్మ వదలరాదు. కాని కర్మలో యోగమును జోడించుకొని కర్మ - యోగముల బ్యాలెన్స్ ను ఉంచుకోవాలి. బ్యాలెన్స్ ఉంచుకునేవారికి అదనముగా బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదములు Blessings) లభిస్తుంది. ఎవరెవరు లేటుగా వచ్చారో, టూలేట్ అనునది ఇక మున్ముందు రానున్నది. మీకు ఛాన్స్ (అవకాశము) ఉన్నది. కొద్ది సమయములోనే చాలా పురుషార్థము చేయవచ్చు. బాప్  దాదా వరదానమును ఇస్తున్నారు - పిల్లల ధైర్యమునకు తండ్రి సహయోగము వుండనే వుంటుంది (హిమ్మతే బచ్చే మదదే బాప్). 

సేవా టర్న్ గుజరాత్ వారిది: మంచిది. గుజరాత్ వారిలో మొదటిసారి క్రొత్తగా వచ్చినవారు లేవండి. గుజరాత్ వారిలో తండ్రితో మొదటిసారి మిలనము జరుపుటకు వచ్చిన వారు చేతులూపండి. (6వేల మంది గుజరాత్ వారు వచ్చారు). బాగున్నది. వచ్చేశారు కదా! మీ మధువనము. బాప్ దాదా యొక్క మధువనమును చూచారు. దీనికి కూడా శుభాకాంక్షలు. మంచిది. ఇప్పుడు గుజరాత్ వారందరు లేవండి, బాప్ దాదా ప్రారంభము నుండి గుజరాత్ ను మధువనపు ఒక గది (అత్యంత సమీపములో ఉండునది) అని భావిస్తారు. అందరికంటే సమీపములో ఉన్న సహయోగులు, స్నేహితులు మరియు ఇప్పుడు వర్తమాన సమయములో కూడా బాప్ దాదా గమనించారు - ఫలితములో, బాప్ దాదా ఇచ్చిన హోంవర్కులో - ప్రతి ఒక్క జోను వారు పరస్పరములో కలిని జోనును నిర్విఘ్నముగా తయారుచేయు ప్రోగ్రాము (కార్యక్రమము/Programme)ను రూపొందించుకుని నిర్విఘ్నముగా తయారు చేయండి అనే హోంవర్కులో బాప్ దాదా గమనించారు. అన్ని జోన్లవారు తమ తమ రూపములలో హోంవర్కును చేస్తూండవచ్చు కాని గుజరాత్ వారు ప్రతి మాసములో తమ రికార్డు (ఫలితము)ను చూపారు. ప్రతి మాసములో టాపిక్ ( విషయము/ Topic) మరియు సమాచారముల ఇచ్చిపుచ్చుకొనుటల ద్వారా సమూహములో ఉమంగము వస్తుంది. వేరువేరుగా పురుషార్థము చేస్తారు కదా. దాని కంటే సమూహములో, నియమ ప్రమాణముగా ప్రోగ్రామును ఏర్పరచుకుని చేనినట్లయితే దాని వల్ల మంచిగా గమనముంటుంది. నిర్విఘ్నముగా తయారైనదా? లేదా? అనే ఫలితము ఇప్పుడు రావాలి. ఈ ప్రోగ్రాములు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఏయే అంశములలో వ్యత్యాసము ఏర్పడినది, క్లాసు నడచినది. దీని కొరకు అభినందనలు. విషయమును తయారుచేశారు. దీని కొరకు కూడా అభినందనలు. కాని ప్రాక్టికల్ (ఆచరణాత్మకముగా/Practical) లో ఏ వ్యత్యాసము ఏర్పడినదనే ఫలితము ఇప్పుడు రావాలి. ఇచ్చిన హోంవర్కును బుద్ధిలో పెట్టుకుని పురుషార్థము చేసినందుకు బాప్ దాదా అభినందిస్తున్నారు. ఇలాగే చిన్న చిన్న సమూహములను ఏర్పరచండి. బాప్ దాదా ఈ వర్గీకరణల యొక్క ఏ సమూహములనైతే తయారు చేశారో ఆ సమూహాలు వంతులవారిగా పరస్పరములో కలుస్తూంటారు. చిన్న చిన్న సమూహాలైన కారణముగా పరస్పరములో ఇచ్చిపుచ్చుకోవటం కూడా చేయవచ్చునని బాప్ దాదా గమనించారు. అయితే వర్గములవారు కూడా చాలా మంది వచ్చారు. వారికి కూడా బాప్ దాదా ఇదే చెప్తున్నారు - ఏ విధముగా సేవా ప్రణాళిక తయారు చేస్తారో, దానిలో బాప్ దాదా గమనించారు. 3 - 4 వర్గాలవారి ఫలితము కూడా వచ్చినది. కానీ ఏవిధంగా సేవాప్లాను తయారు చేస్తారో, దానిని ఆచరణలోనికి తీసుకునివస్తారో, దాని ద్వారా ప్రాక్టికల్ లోఎవరు సహయోగులుగా అవుతారో. సహయోగులుగా తక్కువగా అయ్యారు. స్నేహితులుగా అయ్యారు అలా ఏ విధముగా రిజల్టు తీస్తారో అలాగే ప్రతి వర్గమువారు ధారణ కొరకు తమ వర్గమును నిర్విఘ్నముగా తయారు చేసుకొనుట కొరకు కూడా గమనికను ఇవ్వాలి. కొందరు గమనమును ఉంచుకుంటున్నారు. ధారణ కొరకు పాయింటును కూడా పెట్టుకుంటారు. కాని ఫలితము వృద్ధి చెందిందా లేదా? పరివర్తన జరిగినదా లేదా? ఏ ఫలితము ఉండినది అనే దాని ఫలితము కూడా రావాలి. పరివర్తనకు ఏదేని ఒక ఉదాహరణను చూపాలి. సేవలో ఏ విధముగా గమనికను ఉంచుకుంటున్నాం, సేవ వృద్ధి చెందినది కదా. బాప్ దాదా సంతోషపడ్డారు. అయితే ఇప్పుడు ధారణ పైన ఇంకా ఎక్కువ గమనమునుంచుకోవాలి. ఎందుకంటే అంతిమములో సేవ చేయాలనుకున్నా కూడా చేయలేరు. ఇప్పుడు చేస్తేనే చేసినట్లు. ఆ సమయములో ఫరిస్తా జీవనము లేదా అశరీరిగా కావటం. సెకండులో బిందువు పెట్టటము అనునవే వినియోగపడతాయి. అంతే కాకుండా అది అకస్మాత్తుగా సంభవిస్తుంది. సేవ చేసినా కూడా, నేవలో భలే నిమగ్నమైయున్నప్పటికి, సేవలో నిమగ్నము కావాలి కాని రెండింటి యొక్క బ్యాలన్స్ ఉంచుకోవాలి. రెండింటి అభ్యాసము చేయాలి. బాప్ దాదా పలుమార్లు సూచననిస్తున్నారు - అకస్మాత్తుగా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులలోనే జరుగనున్నది. అంతిమములో మీరు మాకు చెప్పలేదు - అని ఎవరూ కూడా తండ్రి వద్ద ఫిర్యాదు చేయరాదు. అందువల్లనే బాప్ దాదా పలుమార్లు భిన్నభిన్న సూచనలనిస్తున్నారు. సేవకు ఫలితము లభిస్తుంది. సేవకు మార్కులు, ఎందుకంటే నాలుగు సబ్జెక్టులు (విషయములు/Subject)న్నాయి కదా. సేవ అనే సబ్జెక్టులో మార్కులు లభిస్తాయి కాని మిగిలిన మూడు సబ్జెక్టులు, ఒకవేళ ఒక సబ్జెక్టులో మీరు మార్కులను పొందారు కాని మిగిలిన మూడింటిలో తక్కువ మార్కులను పొందినట్లయితే ఏమి లభిస్తుంది ? నాలిగింటిలోనూ ఫస్టు నెంబరు రావాలి. ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఇది బాప్ దాదాగారికి ఉన్న శుభ ఆశ. మరి తండ్రి యొక్క ఆ నక్షత్రాలు ఎవరు? చేతులెత్తండి. తండ్రి ఆశాదీపాలైతే నాలుగు సబ్జెక్టులలో మంచి నెంబరును తీసుకోండి అనునదే బాప్ దాదాగారి అన్నింటికంటే గొప్ప ఆశ. అలా పొందలేకపోతే పాస్ విత్ ఆనర్ లోనికి రాలేరు. నాలుగు సబ్జెక్టులలో మంచి నంబరును పొందినవారినే మహారథి అంటారు. ఊరకే చెప్పటానికి మహారథి, మహారథి అని వస్తుంది. ఒకవేళ నంబరును తీసుకోలేదంటే బాప్ దాదాగారి విశ్వసనీయ నక్షత్రములౌతారే (ఉమ్మీదోంకే తారే) కాని ఆశానక్షత్రాలుగా కాలేరు. మరి ఏమిగా కావాలి? విశ్వసనీయ నక్షత్రాలుగా కావాలా? కాదు. ఆశానక్షత్రాలుగా, సఫలతా నక్షత్రాలుగా కావాలి.  గుజరాత్ వారు మంచి లక్ష్యమునైతే ఉంచుకున్నారు. అయితే బాప్ దాదాకు ఫలితమును పంపించండి. ఎందుకంటే మిమ్ములను చూసి ఇతరులలో కూడా ఈ సమూహము ద్వారా ఏ లాభము కలిగినది అనే ఉమంగము వస్తుంది. ప్లాను బాగా తయారు చేశారు. అంతేకాకుండా రెగ్యులర్‌గా చేస్తూ వచ్చారు. దీనికి అభినందనలు. సరిగా ఉన్నది. అభినందనలు కూడా మరియు హోంవర్కు కూడా, రెండూ ఉన్నాయి. మంచిది. 

ఈ గ్రూపులో 5 వర్గాల మీటింగు జరిగినది(బిజినెస్, మహిళా, సమాజసేవ, ట్రాన్స్ పోర్ట్ మరియు గ్రామవికాసము) : అందరూ వారి వారి గుర్తులనుంచుకున్నారు. ఎవరెవరు ఏ గుర్తులను ఏర్పరచుకున్నారో వారు ఒక్కొక్కరే ఎదుటకు రావాలి. బోర్డు ఉందా లేక సింబల్ ఉన్నదా? ఒకరిద్దరు వచ్చేయండి. అందరూ ముందుకు రండి. ఇది కూడా మంచిదే. ఇప్పుడు అటువైపు చూపించండి. మంచిది. బాగా చేశారు. ఇది కూడా అదనపు ఉమంగ ఉత్సాహాలను నింపుటకు సాధనము. ఇప్పుడు విమానము అందరూ చూసారా విమానమును చూసేసారు. (ట్రాన్స్ పోర్టు వారు ప్లెక్స్ లో విమానము తయారు చేసియున్నారు). మీ విమానములో అయితే ఎక్కుతారు కదా! ఈ విమానములో అయితే ఖర్చు అవుతుంది కాని మీ విమానము మనస్సు, బుద్దిల విమానము ద్వారా సెకండులో ఎక్కడి నుండి ఎక్కడికైనా ముల్లోకాలలో చేరుకోగలరు. బాగా శ్రమించారు. మంచిది.

అందరికి సంతోషము కలుగుతుంది కదా, మంచిది. ఏయే వర్గాలున్నాయి. బిజినెస్. చేతులెత్తండి. మరి ట్రాన్స్ పోర్టు రెండువర్గాలవారు చేతులెత్తారు. ఇద్దరూ చేతులెత్తండి.. మహిళలు, వీరి గుర్తును తెలియచేస్తున్నారు. బాబా యొక్క ఒక విషయమును ప్రాక్టికల్ లో తీసుకు రావటము మిగిలిపోయినది. ఆ సమూహమును ఎక్కడైనా సరే చేర్చండి. జోనులోనైనా చేర్చండి లేదా రెండు-మూడు జోనులు ఎవరు సమీపముగా ఉన్నారో వారిలో వి.ఐ.పి స్నేహీలు వచ్చారు, పోయారు అలా కాదు. స్నేహీలు, సంబంధములో ఉన్నవారు మరియు సంబంధము ఉంచుకున్నవారు, మురళి వినుటకు రోజూ రాకపోయినా కనీసము ఫోను ద్వారా వింటున్నా కానీ వరదానము, స్లోగన్ లేదా చివరిలో మురళి సారము ఉంటుంది కదా. అదైనా సరే వెళ్తూ వెళ్తూనే ఫోను ద్వారా అయినా విననీ. సంబంధమును ఉంచుకోవాలి. 6 నెలల తర్వాత మరలా పిలిచినప్పుడు రావటం కాదు. సంపర్కములో ఉన్నట్లయితే సంబంధము దృఢమౌతుంది. సంబంధము వారిని ఆకర్పిస్తుంది. వర్గీకరణ జరిగినప్పుడు ఒక సంవత్సరము తర్వాత వస్తారు. అటువంటివారిని సంబంధములో ఉన్నవారని అనరు. సమీప సంబంధము ఉండాలి. తాము హాజరైనట్లుగా ప్రజెంట్ మార్కునైనా వేయించుకోగలగాలి. ఫోనులో నైనా సరే వేయించుకొని, నేను ఉన్నాను - కనీసము ఈ ప్రెజెంటు మార్కునైనా వేయించుకోవాలి. అటువంటివారిని ఎంత వీలైతే అంత ఒక జోను కాని లేదా 2-3 జోనులవారైనా కాని కలిసి వచ్చి పోవటానికి వీలుగా ఉండే విధముగా సమీపములో మూడు నెలలకొకసారైనా, 6 నెలలకొకసారైనాగాని సమూహమును చేయండి. మొదట పరస్పరములో మీ మీ జోనులలో చేయండి. ఎవరెవరు అనుభవము చేస్తున్నారు. ఉదాహరణకు డాక్టర్స్ అనుకోండి. ఇప్పుడు గమనించినట్లయితే పెద్ద ,పెద్ద డాక్టర్లు కూడా అభ్యాసము చేస్తున్నారు మరి అటువంటప్పుడు ప్రభావము పడుతుంది కదా. ఇలాగే అన్ని వర్గాల వారికి ఒకరిని చూసి మరొకరికి ప్రభావము పడుతుంది. వీరు కూడా నడుస్తున్నారు. వీరు కూడా నడుస్తున్నారు.... అంతేకాకుండా పరస్పరములో అనుభవమును విన్నప్పుడు కూడా ప్రభావము పడుతుంది. ఇప్పుడు మీ మరొక టర్న్ (వంతు) వస్తే అప్పుడు ఫలితమును చెప్పండి. ఎన్ని సార్లు సమూహమును ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ చేశారు. ఎంతమంది వచ్చారు. దాని ఫలితమును వినిపించండి. ఇది సహజమే కదా. సహజమా లేక కష్టమా? అన్ని వర్గాలవారు చేస్తారా? ఇతరులు కూడా వింటారు. అచ్చా! 

డబల్ విదేశీ సోదర సోదరీలతో :- (80 దేశాల నుండి వచ్చారు) అచ్చా ! ఈ ప్రోగ్రాము ఏది చేస్తారో, మధువనములో అందరూ కలిని చేయాలి. ఇది బాప్ దాదాకు చాలా ఇష్టము. ఎందుకంటే మధువనములోనికి రావటము నుండి పరివారము ఎంత పెద్దదో చూడండి. సేవలు నలువైపులా ఏవిధముగా జరుగుచున్నాయో గమనించండి. భారతదేశమువారు ఫారిన్ (విదేశ) సేవ నుండి లాభమును తీసుకుంటారు. ఫారిన్లో ఇలా చేస్తున్నారు. మేము కూడా చేయాలి మరియు ఫారిన్ వారు ఇండియావారి సమాచారమును విని తమ స్థానములో కూడా ఎక్కడ వీలయితే అక్కడ లాభము తీసుకొంటారు. ఫారిన్ వారు ఫారిన్ లో కలవటము కష్టము, మధువనములో డబల్ లాభము ఉంటుంది. బాప్ దాదాతో కలవటము జరుగుతుంది మరియు పరివారముతోనూ కలుస్తారు. కనుక ఇప్పుడు కొద్ది సమయము పాటు నియమానుసారముగా మధువన మీటింగులో గాని, లేక చిన్న, చిన్న సమూహాలలోగాని కలవటము బాప్ దాదాకు చాలా ఇష్టమైనది. అంతేగాక ప్లాను కూడా మంచి మంచిగా రూపొందిస్తారు. ప్రాక్టికల్లో కూడా చేస్తున్నారు. దీని వృద్ధిని ప్రతి సంవత్సరము చూసి నలువైపులా ఉన్న డబల్ ఫారినర్స్  కు అభినందనలు తెలుపుచున్నారు. ఇప్పుడు ఎంతెంతగా సమూహము జరుగుతూ ఉంటుంది కదా, దానిలో పరస్పర అనుభవాలు వినుట ద్వారా అనేక మందికి అనుభవము ద్వారా కూడా బలము లభిస్తుంది. ఎవరైనా దుఃఖితులైనారనుకోండి, వారు ఇతరుల అనుభవాలు వింటారు. అప్పుడు వీరు సదా ఖుషీగా, ఆనందంగా ఉంటారు. వారి ముఖము ఎప్పుడూ వాడిపోదు. హృదయపూర్వక ఆనందము. ఇలా ఒకరు మరొకరి అనుభవమును వినుట వల్ల ఉమంగంలోకి వచ్చేస్తారు. ఒకరికంటే మరొకరి అనుభవము తక్కువగా ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికి డ్రామానుసారంగా ఏదో ఒక విశేషత తండ్రి ద్వారా లభించి ఉంది. కనుక ఆ అనుభవమును వినుట ద్వారా ఉమంగము వస్తుంది. వీరు చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను! ఎప్పుడు కూడా మనసును అల్పమైనదిగా చేసుకోకండి. విశాల హృదయము, గొప్ప తండ్రి. చిన్న తండ్రియా? అత్యంత గొప్ప (పెద్ద) తండ్రి. కనుక పిల్లల హృదయము సదా విశాలముగా ఉండాలి. బాప్ దాదా గారి స్లోగన్ పెద్దహృదయము, సత్యహృదయము, స్వచ్ఛ హృదయము. స్వచ్చ హృదయము ఉన్నట్లయితే వారి సర్వ మనోకామనలు నెరవేరుతాయి. ఏ చెత్త వచ్చినా గాని, దానిని దగ్గర ఉంచుకోకండి. ఏవిధముగా స్థూల గదిలో పడుకొంటే, చెత్త ఉన్నట్లయితే ఏమవుతుంది? శుభ్రపరచకపోతే దోమలు ఉత్పన్నమవుతాయి. తర్వాత రోగాలు వస్తాయి. కనుక ఇది కూడా ఒకవేళ మనస్సులో ఏదైనా విషయమును ఉంచుకున్నట్లయితే తీసివేయకపోతే, అది వృద్ధినొందుతుంది. బాబా, నా బాబా అని చెప్పినట్లయితే చాలు హాజరవుతారు. బంధించబడివున్నారు. బచ్చా, తండ్రికి బిడ్డ, భగవంతుడి బిడ్డ. నా బాబా అని స్మృతి చేస్తే, బాబా హాజరు కాకపోవటము ఇది అసంభవము, మీ వద్ద తండ్రిని బంధించే త్రాడు వుంది. ఏమిటది? హృదయపూర్వక ప్రేమ. అనేకమందికి తండ్రి పట్ల ప్రేమ ఉంది. లేదని చెప్పలేరు. కాని రెండు ప్రకారాల ప్రేమ ఉంది - ఒకటేమో జ్ఞాన ఆధారముతో ఉన్నది. నేను ఆత్మను. శరీరమునైతే కాను కదా, అంతేకాక ఆత్మల తండ్రి పరమాత్మయేనని మరియు పరమాత్మ జ్యోతి కాకుండా ఇంకెవరూ సర్వులకు పరమాత్మ కాజాలరు, మరి తండ్రి తండ్రియే. జ్యోతి స్వరూపము సహయోగము ఇస్తున్నారు. కాని ప్రతి సమయము హృదయపూర్వక స్నేహముతో నా బాబా అని స్వతహాగా వెలువడాలి. సమాయనుసారముగా సాథీ (జతగాడి)గా చేసుకోబడుతుంది. కష్టకాలములో సాథీ పనికొస్తారు. మరి మీ తండ్రిని మీరు కంబైండుగా ఉంచుకున్నారు. సాథీగా చేసుకున్నారు కనుక సమయములో జతను వినియోగించుకోండి. స్నేహముతో స్మృతి చేయండి. ఒకటేమో జ్ఞానము ఆధారముగా స్నేహము. రెండవది హృదయపూర్వకమైన, ప్రేమపూర్వకమైన స్నేహము. పరిశీలించుకోండి హృదయపూర్వక ప్రేమ వుందా? ప్రేమను మరవటము కష్టము. సర్వ సాధారణముగా వాడే వస్తువును గమనించండి. ఉదాహరణకు షుగర్ వ్యాధిగ్రస్తులకు తీపి తినుట అనుమతించబడదు. కాని వారికి ప్రేమ తీపి పట్లనే ఉంటుంది. కనుక తియ్యదనము గుర్తొస్తుంది కదా! డాక్టరు ఇచ్చిన మందులు కూడా వేసుకుంటారు కాని స్వీటును తింటారు అంటే ఆ వస్తువు పట్ల ప్రేమ ఉంది కదా, చెప్పినాగాని వదలరు. మరి ఇక్కడేమో తండ్రి. సర్వ ప్రాప్తుల అనుభవమును చేయించేవారు. అందరూ వింటున్నారు కదా. భలే నిమిత్తము ఫారినర్స్ కాని అందరూ వింటున్నారు కదా. కనుక ఇప్పుడు పరిశీలించుకోండి, హృదయపూర్వక ప్రేమ ఉందా? ఖుదాను దోస్త్ గా చేసుకున్నారా? దోస్త్ గా ఎందుకు చేసుకుంటారు? తండ్రి కంటే కూడా స్నేహితుడితో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మరి ఖుదాను దోస్త్ గా చేసుకున్నారు కదా! ఏ విషయమైనా రానీ, బాబా మీరు చూసుకోండి. చిన్న పిల్లలుగా అయిపోండి. పెద్దవారుగా కాకండి. అప్పుడు తండ్రి తీసేసుకుంటారు. ప్రేమ అనే త్రాడుతో కదలలేని విధముగా బంధించి ఉంచుకోండి. అర్థమైనదా! అందరికీ అర్థమైనదా! చాలా సార్లు చెప్తారు - బాబా! ఈ రోజు నేను బాబాను మరచిపోయాను అని. బాప్ దాదాకు విని ఆశ్చర్యము కలుగుతుండవచ్చు. మరచిపోయారా! 63 జన్మలు మరచిపోయారు. ఇప్పుడు కూడా మరచిపోయారు. ఒక్క జన్మ, అత్యంత చిన్నదైన జన్మ. 21 జన్మలు మరచిపోయారు. ఇప్పుడు కూడా మరచిపోవటమనేది మిగిలి వున్నదా? అందుకే ఇప్పుడు మాయ చతురతను అర్థము చేసుకోండి. అప్పుడప్పుడు మాయను కూడా పోషిస్తారు. మేము సమయములో తయారైపోతాము. ఇప్పుడు ఇంకొంచెము సమయము వున్నది కదా, ఇపుడు ఇంకనూ టూలేట్ బోర్డు పడలేదు కదా. మేము తయారైపోతాము..... ఇలా అంటూ ఉంటారు.  మాయను కూడా సహయోగమునిచ్చి, పోషించి, ఛాయ్ (టీ), పానీ(నీరును) త్రాగుతూ ఉండేలా చేస్తారు. తండ్రిని ఫాలోఫాదర్ చేయుటకు బదులుగా మాయను ఫాలో చేసేస్తారు. పురుషార్థీలము కదా! సంపూర్ణము ఇంకనూ కాలేదు కదా. ఇది జరుగుతూనే ఉంటుంది కదా.... ఇలా చేయడమే మాయకు ఫాలోయర్ (శిష్యులు)గా కావటము. కనుక ఇప్పుడు బాప్ దాదా ఎప్పుడూ కూడా తిరిగి చూచుటకు విహరించుటకు వచ్చినట్లయితే సదా ముఖమును చూస్తే ఏ ముఖమును చూడాలి? అప్పుడప్పుడు ముఖము బాగుండదు. ఆలోచనలో, ఆలోచనలు చాలా చేస్తారు. ఏమి చేయాలి? ఇది చేయనా, చేయకుండా ఉండనా? లాభముంటుందా? సరిగ్గా అవుతుందా? ఇలా చాలా ఆలోచిస్తారు, తండ్రిని ఫాలో చేయండి. బ్రహ్మా తండ్రి చేరుకున్నారు కదా. ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తారు? కేవలము ఫాలో చేయండి, వ్యర్థ సంకల్పాలు వస్తాయి. అల వస్తుంది. ఇది కేవలం ఫారినర్ కు మాత్రమే వినిపించుట లేదు. అందరికీ వినిపిస్తున్నాను.

(విదేశీ డేవిడ్ సోదరుడితో):- బాప్ దాదా చూశారు మరియు తెలుసుకున్నారు కూడా. ఈ బిడ్డకు చాలా ఉమంగ-ఉత్సాహాలున్నాయి. ఇప్పుడు ఉమంగ ఉత్సాహాలను ప్రాక్టికల్ లోనికి తీసుకు రావటములో సహయోగిగా అయి సహయోగమును తీసుకుంటూ ఉండాలి. సహయోగమును ఇస్తూ ఉంటే ముందుకు వెళ్లగలవు. ఉమంగ ఉత్సాహాలను ఎప్పుడూ డీలా చేసుకోవద్దు, విషయాలు వస్తాయి కాని ఉమంగ ఉత్సాహాల రెక్కలు వదులుగా చేసుకోకండి. ఎగురుతూ ఉండండి. రెక్కలు ఉన్నదే ఎగురుతూ ఉండుటకు. ఉమంగ ఉత్సాహాలు కొద్దిగా కూడా తక్కువైట్లయితే ఉన్నతముగా కాలేరు. విషయము గడిచిపోతుంది. తొలగిపోతుంది కాని ఖుషీ పోరాదు. ఉమంగ ఉత్సాహము వెళ్ళరాదు. ఇక బాప్ దాదా చూశారు - ఉమంగము బాగున్నది. ఇప్పుడు సదా స్థిరముగా ఉంచుకోవాలి. జంప్ చేయగలరు. 

ఫిలిప్పైన్స్ (Philiphines) కు చెందిన సహానీ అక్కయ్యతో :- వీరు పాతవారే. అచ్చా హై! సేవ చేసి జతలో తీసుకు వచ్చారు. అచ్చా హై విన్నారు కదా. ఉమంగ ఉత్సాహాలను ఎప్పుడూ వదలరాదు, ఎగురుతూ ఉండండి. ఏ విషయము రానీ మీరు ఎగరండి అప్పుడు ఆ విషయము క్రింద ఉండిపోతుంది. మీరు పైన ఉంటారు. 

నలువైపులలోని హృదయములో సంతోషముగా ఉండేవారు, సత్యహృదయులు, స్వచ్చ హృదయులకు ప్రతి సంకల్పము, సర్వ కోరికలు నెరవేరుతాయి. దీని అర్థమేమిటంటే ఏ సంకల్పము చేశారో దాని సఫలత ప్రాప్తమౌతుంది. కావున ఇలాంటి మూడు విశేషతలు - విశాలమైన హృదయము, స్వచ్ఛ హృదయము మరియు సత్యహృదయము గలవారు, ఇటువంటి నలువైపులా ఉన్న పిల్లలను బాప్ దాదా చూసి పదమంతులరెట్ల కంటే ఎక్కువగా ఖుషీ అవుతారు మరియు ఆటోమేటిక్ (స్వతహాగా) పాట పాడుతుంది, వాహ్ ! వాహ్ నా పిల్లలూ వాహ్! సదా అభినందనయోగ పిల్లలూ వాహ్! సదా తండ్రిని జతగాడిగా చేసుకుని నడిచేవారు, చేతిలో చేయి కలిపి, చేయి శ్రీమతమైనది, కావున సదా చేతిలో చేతిని పెట్టి ఎగిరేవారు, నడవడము సమాప్తమైనది, ఎగిరేవారు శ్రీమతమును అనగా ప్రతి అడుగులో బ్రహ్మబాబాను ఫాలో చేయువారు, ఆలోచించకండి, చేసేదా వద్దా? సరిగా అవుతుందా, అవ్వదా? ఇష్టమౌతుందో లేదో తెలియదు. ఫాలో చేయండి. బ్రహ్మబాబా ఏమి చేశారు. ఏది తండ్రి చేశారో అదే సరైనది, ఆలోచించే అవసరము లేదు. ఫాలో చేయడము సహజమే కదా, ఆలోచించే అవసరమేమున్నది, ఆలోచిస్తే తల భారమైపోతుంది. తర్వాత ఈ రోజు ఏమైనదో తెలియడము లేదు, భారభారముగా అయిపోయింది అని అంటారు ఎందుకంటే ఏదో ఒక విషయమును గురించి ఆలోచిస్తూండిపోతారు. కావున సర్వ నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదాగారి హృదయపూర్వక ఆశీర్వాదములు మరియు పదమారెట్ల అభినందనలు. ఎవరైతే శివరాత్రికి ఈ సేవలో ఉంటారో, వారికి ఇప్పటి నుండియే శివరాత్రి మీ జన్మదినపు ఆశీర్వాదములు మరియు శుభాకాంక్షలనిస్తున్నారు మరియు మున్ముందు రాబోయేవారికి లేక ఎవైతే పత్రాలు, ఈ-మెయిలు పంపుతారో వారికి ఇప్పటినుండియే క్షణము కంటే తక్కువ అవధిలో బాప్ దాదా వద్దకు చేరుకునేస్తుంది. వారికీ మరియు బాప్ దాదాగారి దప్పికగొనియున్న ఆత్మలు, బంధనములో ఉన్న వారు (బాంధేళీలు) దెబ్బలను కూడా కంఠహారముగా చేసుకునేస్తారు. ఇటువంటి ఆత్మలకు కూడా ప్రియస్మృతులు మరియు క్రొత్త క్రొత్త స్నేహ ఆత్మలు ఇప్పుడిప్పుడు తయారవుతున్నారు. కాని తక్కువగా తయారౌతున్నారు. స్నేహీ మరియు సహయోగి డబుల్ ఉండాలి. కావున నలుదిశలలోని సర్వ యువకులు, వృద్ధులు, పిల్లలు, మాతలు, పాండవులు అందరికి ముందుగానే, తండ్రి జన్మదినపు శుభాకాంక్షలు. మంచిది.

దాదీలతో:- అందరూ నెంబరువన్ కదా, ఎప్పుడు కూడా నంబరు వారులో రాకండి. నెంబరువన్. బాబా పిల్లలైన తర్వాత కూడా నంబరువారుగా అయితే ఇక గొప్పతనమేముంది! నంబరువన్. నంబరువన్ గా కండి, కాని నిమిత్తము మరియు నిర్మాణులే నంబరువన్. (నిర్మల శాంతదాదీగారి స్మృతిని ఇచ్చారు). 

శాంతమణి దాదీగారితో :- ధైర్వములో నెంబరువన్ అయినారు. కనుకనే బాప్ దాదా ధైర్యము పిల్లలది, సహాయము తండ్రిది, తండ్రి సంతోషిస్తారు. 

రమేష్ అన్నయ్యతో - (రమేష్ అన్నయ్యకు ఈ రోజు 75వ జన్మదినము అయినది). జన్మదినపు శుభాకాంక్షలు. ఈ జన్మదినమందు ఏదైనా కొంత బాప్ దాదాకు ఇవ్వాలి. మీకేమి తోస్తే అది, మంచిది. 

డబుల్ విదేశీయులైన పెద్ద అక్కయ్యలతో :- చూడండి, డ్రామానుసారముగా ఎవరైతే నిమిత్తమైయున్నారో అందరూ భారతదేశమువారే. (జయంతి అక్కయ్యతో) వీరి జన్మ కూడా భారతదేశములోనే జరిగింది. నేరుగా మా తండ్రి ద్వారా భారతదేశములోనే జరిగింది. మొట్టమొదట సేవాస్థానమునకు తండ్రియే పంపించారు. మరి అందరూ చూడండి, ఎందుకంటే మీ పునాది పక్కాగా ఉన్నది. పాలన కూడా తీసుకొనియున్నారు కదా. భలే ఆలస్వముగా వచ్చినా కాని ప్రత్యక్ష పాలనను తీసుకునియున్నారు. ఇది భాగ్వము. మీరు (జయంతి అక్కయ్య) మరియు రజని, రజనికి కూడా భాగ్యమున్నది. ఫోనులోనే మురళిని వినేది. 

(మురళి అన్నయ్య) ఇద్దరూ పాత్రను అభినయించారు కాని ఈ వైపు చాలా శక్తిశాలిగా ఉన్నారు. 
(గాయత్రి అక్కయ్య కూడా స్మృతులను పంపారు). 

(సర్వ పెద్ద అక్కయ్యలతో) సమూహములో చూడడానికి బాగుంటుంది. మీరందరూ వస్తే బాగుగా అనిపిస్తుంది కదా. అనేక లాభాలున్నాయి. తండ్రిని కలవడము, పరస్పరములో ఇచ్చి పుచ్చుకోవడము మరియు సర్వీసులో నవీనతను తీసుకుని రావడము. ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మీ మీ సేవలు చేస్తారు కాని పరస్పరములో అనుభవాలను వినడము వలన ఉమంగము వస్తుంది. బాప్ దాదా సంతోషముగా ఉన్నారు. 

సరళ అక్కయ్యతో :- బాగున్నారా. మంచి ధైర్యమునుంచావు. కష్టపడినావు. తప్పక ఫలము లభిస్తుంది. మంచిది. 

డాక్టర్ అశోక్ మెహతా మరియు రథ (గుల్జార్ దాదీగారి) సేవను చేస్తున్న అక్కయ్యలందరితో :- మంచిది. రథమును తయారు చేసేసారు. దీనికి అభినందనలు. అందరూ మీకు హృదయపూర్వకముగా ఆశీర్వాదములను ఇస్తున్నారు. బాగున్నది. మరియు ఇతర డాక్టర్ల సేవ కూడా అయిపోతుంది. వారు కూడా సమీపముగా వస్తున్నారు. చాలా బాగున్నది. వీరంతా సేవ చాలా బాగా చేస్తున్నారు. అభినందనలు. మంచిది. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు... 

వీడ్కోలు సమయములో :- ప్రతి బాబా బిడ్డ తండ్రికి అత్యంత ప్రియమైన వారు. కాని అందరిని విధి పూర్వకముగా కూర్చోబెట్టలేరు. కాని మీరందరు స్టేజు పైన ఉన్నారు. స్టేజు కంటే సమీపముగా హృదయములో కూర్చునియున్నారు. కొద్దిగా పెట్టవలసి ఉంటుంది. కొద్దిగా, కాని ఒక్కొక్కరు తండ్రికి ప్రియమైనవారు, ఒక్కరి కంటే మరొకరు తండ్రికి ప్రియమైనవారు. కావున బాప్ దాదా దృష్టి కేవలము సమీపముగా ఉన్న వారి పైన మాత్రమే కాదు, చివరి వరకు వెళ్తున్నది. ప్రతి ఒక్కరు మేము బాబా సన్ముఖములో కూర్చునియున్నామని భావించండి. బాప్ దాదా సన్ముఖములో ఎదురుగా కూర్చునే దృష్టినిస్తున్నారు. మంచిది.

Comments