03-11-2015 అవ్యక్త మురళి

 03-11-2015         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము    

“ప్రభుప్రియుల సంగఠన కేవలం ఈ సంగమ మహా సమయంలోనే జరుగుతుంది, పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో బాబా మరియు బాబా హృదయంలో ముద్దు పిల్లలు ఉన్నారు” 

* ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలను చూసి హర్షితులవుతున్నారు ఎందుకంటే పిల్లలందరూ బాబాను చూసి హర్షితులవుతూ మిలనాన్ని జరుపుకుంటున్నారు. ఈ మిలనము అమరులుగా చేసే మిలనము. పిల్లలందరూ అమర భవ అనే వరదానాన్ని పొందారు. ఏమి జరిగినా కానీ పిల్లలు తండ్రి నుండి మిలనము జరుపుకోవడంలో బిజీగా ఉంటారు. అందరి నోటి నుండి ఏమని వెలువడుతుంది? వాహ్ బాబా వాహ్! బాబా నోటి నుండి వస్తున్న మాటలు - వాహ్ నా ముద్దు పిల్లలు వాహ్! వాహ్! 

* పురుషార్థీలే అయి ఉండచ్చు, నంబరువారీగా కూడా ఉన్నారు కానీ అందరి హృదయపు ధ్వని ఒక్కటే - వాహ్ వాహ్! ఏమి ఆలోచిస్తున్నారు? వాహ్ వాహ్ చేస్తున్నారు. మీ అందరి హృదయపు ధ్వని వాహ్ వాహ్ కదా! 

* ఈరోజు, ఇక్కడ బాప్ దాదా వాహ్ వాహ్ సంగఠనను చూస్తున్నారు. నంబరువారీగా ఉన్నప్పటికీ వాహ్ వాహ్ గా ఉన్నారు. అందరూ ప్రభుప్రియులుగా ఉన్నారు. కనుక ఈ సంగఠన ప్రభుప్రియులది. ప్రతి ఒక్కరూ నంబరు వారీగా ఉన్నప్పటికీ అందరి మూలాధారము ఒక్కరే. 

* కల్పమంతటిలోకి మహాన్ సమయమంటే ఈ సమయమే, అందుకే సంగమయుగము మహాన్ యుగము అని గాయనం చేస్తారు. బాప్ దాదా ఈ మహానత తోటే పిల్లలను కలుస్తున్నారు. పిల్లలేమో బాబా మహనీయులు అంటారు, బాబా ఏమని అంటారు? పిల్లలు ఎలాంటి వారైనా కానీ బాబాకు మాత్రం అతి ప్రియులు. 

* బాబాకు పిల్లలందరిపై, దేశీయులైనా, విదేశీయులైనా, పిల్లలందరిపై హృదయపూర్వక ప్రేమ ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరికీ కూడా బాబాపై ప్రేమ ఉండటాన్ని బాబా చూసారు, అందుకే నడుస్తున్నారు. ఒకవేళ బాబాతో కనెక్షన్ లేకపోతే శక్తి ఎక్కడి నుండి తీసుకుంటారు? బాబా నుండే శక్తి తీసుకుని నడుస్తున్నారు కదా. బాబాను అసలు గుర్తు చెయ్యకపోతే శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది! ప్రతి ఒక్కరి సంబంధం బాబాతో ఉంది. 

* సదా బాబా తోడు ఉంది. పిల్లలందరికీ ఈ తోడు ఉంది. బాబా ఒక్కరైనప్పటికీ అందరికీ తోడుగా నిలవగలరు. కనుక బాబాను తోడుగా పెట్టుకోండి, ఒక్కొక్కరికీ బాబా తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు. 

పిల్లలందరూ పురుషార్థం మంచిగా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఏది ఏమైనా కానీ మీ పురుషార్థం మీతోటే ఉంటుంది, పూర్తి పరివారం కూడా మీతో ఉంది, ఒంటరిగా లేరు. తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు.

Comments