02-02-2012 అవ్యక్త మురళి

                     02-02-2012         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

“ఇప్పుడు స్మృతి స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీలుగా అవ్వండి. జ్వాలాముఖి యోగం ద్వారా అందరికీ లైట్ మైట్ కిరణాల సహయోగాన్ని ఇవ్వండి." 

ఈ రోజు బాప్ దాదా తమ ఎదురుగా మరియు నలువైపుల ఉన్న తమ చిన్నని ప్రపంచాన్ని చూసి హర్షితులవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచం చిన్నదే అయినా కానీ ఈ ప్రపంచంలోని ఒక్కొక్క ఆత్మ శ్రేష్ఠ ఆత్మ. కోట్లలో కొద్దిమందిగా ఉన్న ఆత్మలు. బాబా వారసత్వానికి అధికారులు. బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కరూ రాజా పిల్లలు. బాప్ దాదా పిల్లలందరినీ స్వరాజ్యాధికారులుగా మరియు విశ్వ రాజ్యాధికారులుగా చేసారు. ఈ సమయంలో అందరూ స్వరాజ్య అధికారులుగా ఉన్నారు అనగా మనసు, బుద్ధి, సంస్కారాలు, కర్మేంద్రియాలకు రాజు. కర్మేంద్రియాలకు వశం కాదు. మనసుకు కూడా యజమానులు. మరి మీరు స్వయాన్ని ఈ విధంగా మనసుకు యజమానులుగా, సంస్కారాలకు కూడా యజమానులుగా భావిస్తున్నారా? ఒకసారి మనసు యజమానిగా, మరోసారి మీరు మనసుకు యజమానిగా అయితే లేరు కదా? ఎందుకంటే చెప్పడం కూడా 'నా మనసు' అనే అంటారు కానీ 'నేను మనసును' అని అనరు కదా! మరి 'నాది' అన్నదానికి మీరే యజమానులు కదా. ఒక్కోసారి మనసు యజమానిగా అయిపోవడం లేదు కదా అని పరిశీలించుకోండి. ఎందుకంటే ఈ సమయంలో బాప్ దాదా పిల్లలందరినీ స్వరాజ్య అధికారి అనే సీట్ పై కూర్చోబెట్టారు. వర్తమానంలో స్వరాజ్య అధికారులు మరియు భవిష్యత్తులో రాజ్యం అయితే మీదే. డబుల్ రాజ్య అధికారులు. పిల్లలు స్వరాజ్య అధికారులుగా ఉండటంతో పాటుగా స్వమానధారులుగా కూడా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. 'నేను స్వమానధారి ఆత్మను' అన్న స్మృతిలో కూర్చుంటే స్వమానాల లిస్టు ఎంత పెద్దది మీ ముందుకు వస్తుందో చూడండి. అనేక స్వమానాల మాల మీ ముందుకు వస్తుంది కదా!

బాప్ దాదా అయితే పిల్లలందరి మెడలో స్వమానాల మాలను వేసారు. స్వమానము అని వినగానే మీ ఎదురుగా మీకున్న స్వమానాలు గుర్తుకు వచ్చాయి కదా! గుర్తు తెచ్చుకోండి, అనాది స్వరూపంలో మీ స్వమానము ఎంత పెద్దది! అనాది స్వరూపంలోకి వెళ్ళిపోయారా? ప్రతి ఒక్కరి స్వమానము, ఒకటి, బాబాతో పాటు నేను మెరుస్తూ ఉన్న ఆత్మను. రెండు, బాబాతో ఉన్న కారణంగా విశేషంగా మెరుస్తూ ఉన్నట్లుగా కనిపిస్తున్నాను! చూస్తున్నారా? ఇక్కడ ఆకాశంలో ఎలా అయితే కొన్ని కొన్ని నక్షత్రాలు విశేషంగా మెరుస్తూ ఉంటాయో అలాగే అక్కడ బాబాతో ఉన్న కారణంగా విశేషంగా మెరుస్తూ ఉన్నారు. మీ అనాది స్వరూపం గుర్తుకు వచ్చిందా? సెకెండులో మీ అనాది స్వరూపంలో స్థితి అవ్వగలరా? ఇప్పుడు ఒక్క క్షణంలో ఆ అనాది స్వరూపంలో స్థితులవ్వండి. ఎంత నషా పెరుగుతుంది! ముందుకు పదండి! ఈ సృష్టి చక్ర ఆది సమయంలోకి వచ్చేసారా! ఈ డ్రిల్ చెయ్యండి, సత్యయుగ ఆది సమయంలోని తమ స్వరూపాన్ని చూసుకోండి. ఎంతటి శ్రేష్ఠమైన, సుఖ స్వరూపము! ఎంతటి సర్వ ప్రాప్తి స్వరూపము! దుఃఖము నామమాత్రానికి కూడా లేదు. ప్రకృతి ఎంత సుందరంగా సతో గుణిగా ఉంది! మీ దేవతా స్వరూపాన్ని అనుభవం చెయ్యండి. మీ స్వరూపాన్ని చూసుకుంటున్నారా? ఏ రాజులనైనా, మహాత్ములనైనా, నేతలనైనా ఇంతటి సర్వ ప్రాప్తి స్వరూపులుగా చూసారా? ఇప్పుడు ఒక్క సెకండు కోసం మీ దేవతా స్వరూపంలో స్థితులవ్వండి. స్వమానంలో ఉంటే మజా వస్తుంది కదా! హమ్ సో దేవతా... బాప్ దాదా ఈ డ్రిల్ ను చేయిస్తున్నారు. ఇప్పుడు క్రిందకు రండి, ఏ యుగము వచ్చింది? ద్వాపరంలో కూడా మీ స్వమానము పూజ్యనీయమైనది. పూజ్య స్వరూపము. మీ పూజ్య స్వరూపాన్ని చూసుకుంటున్నారా? అందరూ ఎంత భావనతో నియమానుసారంగా పూజలు చేస్తున్నారు! ఇంతటి నియమబద్దమైన పూజ మరెవ్వరికీ జరుగదు. మరి ఇప్పుడు మీ స్వమానాన్ని చూసుకున్నారా, అనుభవం చేసుకున్నారా? ఇప్పుడు సంగమంలోకి రండి. అందరూ చక్రంలో తిరుగుతున్నారా? వెనుక ఉన్నవారు తిరుగుతున్నారా? చేతులెత్తండి. మీ స్వమానాన్ని చూసుకోండి, ఎందుకంటే స్వరాజ్య అధికారులు కదా. సంగమ యుగంలో స్వయంగా భగవంతుడు, యజమాని అయిన భగవంతుడు పిల్లలైన మీలో పవిత్రతా విశేషతను నింపారు. ఈ పవిత్రత సర్వ అవినాశి సుఖాలకు గని. మరి అలా తయారు చేసేది ఎవరు? స్వయంగా భగవంతుడు. ఇప్పుడు కూడా ప్రత్యక్ష ప్రమాణంగా పవిత్రత అనే ఆస్తి మీకు వారసత్వంగా లభించింది. ఇప్పుడు పరిశీలించుకోండి - పవిత్రత సర్వ ప్రాప్తులకు ఆధారము. పవిత్రతతో మీరందరూ మాస్టర్ సర్వశక్తిమంతులుగా అయ్యారు. సర్వ శక్తులు ప్రాప్తి అయ్యాయా అని మరి పరిశీలించుకోండి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే బాబా అయితే సర్వ శక్తులూ ఇచ్చారు. కానీ ఒక్కోసారి ఏ శక్తి యొక్క అవసరముంటుందో అది కొంత ఆలస్యంగా వస్తుంది, ఆ విషయము పూర్తయ్యిపోయాక శక్తి వస్తుంది అని అంటారు. దీనికి కారణం ఏమిటి? వరదానంగా బాబా అయితే ఇచ్చారు కానీ అది సమయానికి రావడం లేదు అంటే అందుకు కారణం ఏమిటి? మాస్టర్ సర్వశక్తిమాన్ అన్న మీ సీట్ పై సెట్ అయ్యి ఉండరు. ఎవరైనా ఎవరి ఆర్డర్‌ను వింటారు, సీట్ పై ఉన్నవారి ఆర్డర్‌ను వింటారు కదా! ఎప్పుడైనా మీరు ఏదైనా శక్తిని ఆర్డర్ చేసినప్పుడు ముందుగా, 'నేను స్మృతి సీట్ పై ఉన్నానా' అని చూసుకోండి. స్వమానము అనే సీట్ పై ఉన్నారా? స్మృతి అనే సీట్ పై సెట్ అయినట్లయితే సర్వ శక్తులు మీ వద్ద సమయానికి రావడానికి బంధింపబడి ఉంటాయి. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన బాబా మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తిమంతులుగా చేసారు. మరి ఇంతటి పవర్ ఫుల్ స్వమానధారులుగా అయ్యి నడుచుకుంటున్నారా? మీ స్వమానాలను చూసుకున్నారా? సంగమం తర్వాత ఎక్కడకు వెళ్తారు? రిటర్న్ జర్నీ(తిరుగు ప్రయాణం) చెయ్యాలి కదా. అందుకే, ప్రతి ఒక్కరూ రోజంతటిలో ఈ ఎక్సర్ సైజ్ ను చేస్తూ ఉండాలని బాప్ దాదా కోరుకుంటున్నారు. సమయాన్ని కేటాయించండి. పదే పదే ఈ స్వమానాల మాలను వేసుకున్నప్పుడు, బాప్ దాదా మనకు ఇచ్చిన స్వరాజ్య అధికారాన్ని అనుభవం చేసినప్పుడు స్వమానాలు మీ ఆర్డర్ అనుసారంగా నడుచుకోకపోవడమన్నది జరుగని విషయము. కేవలం సీట్ పై సెట్ అయ్యి ఉండండి. బాప్ దాదా ఏమి చూసారంటే అందరూ అటెన్షన్ అయితే పెడ్తున్నారు. కానీ నియమిత రూపంలో మీ దినచర్యను సెట్ చేసుకోండి. మధ్య మధ్యలో ఈ స్వమానాల స్మృతి స్వరూపంలో స్థితులవ్వండి. ఎలా అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారో అలాగే, ఆది కాలం నుండి రిటర్న్ జర్నీ వరకు ఉన్న స్వమానాలను స్మృతి చేసుకోవడానికి సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ కూడా ఇది చెయ్యవచ్చు. ఎందుకంటే మనసును సీట్ పై కూర్చో పెట్టాలి. బాప్ దాదా చూసారు, ముందు కూడా చెప్పి ఉన్నారు, యోగము అందరూ చేస్తున్నారు కానీ ఇప్పుడు దేని అవసరముంది సమయపు పరిస్థితులను చూస్తూ ఇప్పుడు జ్వాలాముఖి యోగము అవసరమని ముందు కూడా చెప్పి ఉన్నాము. దీనితో డబుల్ పనులు జరుగుతాయి. ఒకటి, మీలోని పాత సంస్కారాల సంస్కారము జరుగుతుంది. సంస్కారాలను చంపుతున్నారు కానీ కాల్చేయడం లేదు. చంపేసిన తర్వాత కూడా అవి అప్పుడప్పుడూ లేస్తున్నాయి. ఎలా అయితే రావణుడ్ని కేవలం చంపడం కాక కల్చి వేస్తారో అలాగే మీరు కూడా మీ పాత సంస్కారాలను, మీ తీవ్ర పురుషార్థంలో లోటును తీసుకువచ్చే ఈ పాత సంస్కారాలను కాల్చి వేయడానికి జ్వాలాముఖి యోగము అవసరము. ఒకటి, స్వయం కోసం మరియు రెండు, జ్వాలాముఖి యోగం ద్వారా ఇతరులకు కూడా లైట్ మైట్ మీరున్న కారణంగా వారికి కూడా మీ కిరణాల ద్వారా సహయోగాన్ని ఇవ్వగలరు. మరి ఇప్పుడు అందరూ యోగాన్ని జ్వాలాముఖి యోగంలోకి పరివర్తన చేసారా? సమయానుసారంగా ఇప్పుడు ఆత్మలకు మీ సహయోగము చాలా అవసరము. బాప్ దాదా అయితే అమృతవేళలో పిల్లలందరికీ స్నేహాన్ని ఇస్తూనే ఉంటారు.

బాప్ దాదా ఏమి చూసారంటే, లక్ష్యమును చాలా బాగా పెట్టుకుంటున్నారు, ధైర్యమును కూడా పెడ్తున్నారు కానీ రోజంతా అమృతవేళలో ఉన్నట్లుగా స్థితి ఉండటానికి ఏ అటెన్షన్ అయితే అవసరమో అది తక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి? కర్మల్లో పడ్డాక, కర్మయోగిగా అయ్యి కార్యాలను చెయ్యడంలో తేడా కనిపిస్తుంది. మీరు కేవలం యోగం చేసేవారు కాదు, యోగీ జీవితాన్ని గడిపేవారు. జీవితమన్నది సదా ఉంటుంది, అప్పుడప్పుడూ కాదు. మరి ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? ప్రేమలో అయితే చాలామంది పాస్ అయ్యారు. ప్రేమ యొక్క సబ్జెక్టులో మెజారిటీ మంది బాబాతో 'నా బాబా, నా బాబా' అని అనడంలో ప్రేమను అనుభవం చేస్తున్నారు. ప్రేమలో అయితే మెజారిటీ పాస్ అయ్యారు. ఇప్పుడు ఎందులో పాస్ అవ్వాలి? బాబా సమానంగా అవ్వడంలో. అందరూ ఏమి కోరుకుంటున్నారు? బాబా సమానంగా అవ్వాలా లేక బాబా, బాబాగానే, మీరు పిల్లలుగానే ఉంటారా! బాబా సమానంగా అయితే అవ్వాలి కదా? ప్రేమ అంటే ఏమిటి? ఎవరి మీద ప్రేమ ఉంటుందో వారు చెప్పింది చెయ్యాల్సిందే. మరి అందరూ బాబాకు ప్రియులు, బాబా ప్రేమ మీతో ఉంది. ఇందులో చేతులెత్తండి. ప్రేమ ఉన్నదా? అయితే బాప్ దాదా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారంటే ప్రేమ ఉన్నట్లుగానే, 'ఇప్పుడు నేను బాబా సమానంగా అవ్వాల్సిందే' అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. నిశ్చయముంది, చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాప్ దాదా చూస్తున్నారు.

బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే పిల్లలందరూ తమ ముఖము మరియు నడవడికతో సంతోష వదనం కలిగిన వారిగా, అదృష్టవంతులుగా కనిపించాలి. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా మీ ముఖము ఎంతో సేవ చేసేది ఉంది. ఆ అవసరము వస్తుంది. ఇందుకు ఇప్పటి నుండే లక్ష్యాన్ని పెట్టుకోమని బాప్ దాదా చెప్తున్నారు. ఎలా అయితే 75 సంవత్సరాల సందర్భంగా అందరికీ సేవ యొక్క ఉల్లాసం ఉన్నట్లుగా మీ ముఖముతో మీరు సేవను చెయ్యాలి అన్న లక్ష్యం పెట్టుకోండి. ఎందుకంటే రోజు రోజుకీ సమయం సున్నితంగా మారుతూ ఉంది. అటువంటి సమయంలో మీ ముఖము ఆత్మలను సంతోషంగా చేస్తుంది.

బాప్ దాదా ఈరోజు అమృతవేళ అంతటా తిరిగారు. మరి ఏమి చూసారు? అందరూ తమ స్వ శ్రద్ధతోటే కూర్చుంటారు కానీ అన్నిటికన్నా పెద్ద అథారిటీ అనుభవము. కూర్చోవడాన్ని చూస్తున్నాము కానీ అనుభవం యొక్క అథారిటీ? స్మృతిలో కూర్చుంటున్నారు కానీ స్మృతి స్వరూపం అనుభవం అవ్వాలి. అనుభవం యొక్క అథారిటీలోని ఆనందము ఆ కొద్ది సమయంలోనే ఉంటుంది. 'నేను బాప్ దాదా హృదయ సింహాసనాధికారిని' అని ఆలోచిస్తూ ఉంటారు కానీ స్మృతి స్వరూపంలో, అనుభవి మూర్తిగా అయ్యి అనుభవంలో మునిగిపోవడంలో ఇంకా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ అన్నిటికన్నా పెద్దది. స్మృతి స్వరూపంలో ఉండటాన్ని అనుభవం అని అంటారు. అనుభవంలో మునిగిపోవడం, స్వరూప స్మృతిలో ఉండటం, ఆ స్వరూప అనుభూతిలో ఉండటం ఇప్పుడు అవసరము ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. ఎవరికైనా మీరు ఎవరి అనుభవాన్నయినా వినిపిస్తారు ఎందుకంటే అనుభవం యొక్క ప్రభావం ఉంటుంది. కావున స్వయాన్ని ఏ స్మృతి స్వరూపంలో అయితే ఉంచుకుంటున్నారో ఆ స్వరూప అనుభూతిలో మునిగిపోండి. అనుభవం మీ పురుషార్థంలో కూడా చాలా సహాయపడుతుంది. అనుభవం యొక్క అథారిటీలో అందరూ నంబరువారీగా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. కావున ఇప్పుడు ఈ అనుభవం యొక్క అభ్యాసంతో చేసే అభ్యాసంపై అటెన్షన్ మరింత పెట్టండి. అనుభవ స్వరూప స్థితి సదా ఇమిడి ఉంటుంది. వారి ముఖము, నడవడిక సేవను చేస్తుంది.

ఈరోజు బాప్ దాదా పిల్లల రికార్డును చూస్తున్నారు. ఒకటి, జ్వాలాముఖి యోగంపై మరింత అటెన్షను ఉంచండి. దీనితో స్వభావ సంస్కారాల పరివర్తనలో సహయోగము లభిస్తుంది. సంస్కారాలు, నేచర్ అని మీరు వేటినైతే అంటారో అవి ఇప్పటికీ మధ్య మధ్య వాటి పనిని చేస్తున్నాయి. ఇకపోతే బాప్ దాదా సంతోషంగా ఉన్నారు, ఏ విషయంలో? బాప్ దాదా ఏ విషయంలో సంతోషంగా ఉన్నారో తెలుసా? ఈ మధ్య మురళీలను వింటూ తమ దినచర్యపై అటెన్షన్ పిల్లలకు రావడాన్ని బాప్ దాదా చూసారు. అటెన్షన్ పెరిగితే టెన్షన్ సంస్కారాలు తగ్గిపోతాయి. బాప్ దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు, టెన్షన్ వచ్చినప్పుడు, దాని ముందు 'ఎ' (ఆంగ్ల భాషలోని మొదటి పదం) పెట్టండి, అది అటెన్షన్ అయిపోతుంది. అందరూ నడవవలసిందే. ఇది పక్కా ప్రతిజ్ఞ. కలిసి వెళ్తాము, కలిసి రాజ్యం చేస్తాము. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? లేక అప్పుడప్పుడూ సంతోషంగా ఉంటున్నారా? మేము సదా సంతోషంగా ఉంటున్నాము అనేవారు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి. చేతులు కూడా ఆలోచించి ఎత్తుతున్నారు. సంతోషము మీ వస్తువు కదా. మీ వస్తువు ఎందుకు వెళ్ళాలి మీ నుండి? మరిప్పుడు ఏమి చేస్తారు? ముందుకు వెళ్ళవలసిందే. ఇప్పుడిక ఏమి చేస్తారు? 

ప్రతి సెంటరు నిర్విఘ్నంగా, వ్యర్థ సంకల్పాల రహితంగా ఉందా? వీలవుతుందా? లేక దీని కోసం సమయం కావాలా? మా సెంటరు నిర్విఘ్నంగా ఉంది అని ఇప్పటివరకూ ఎవ్వరూ బాప్ దాదాకు రిపోర్టును ఇవ్వలేదు. తోటివారు కూడా. కేవలం స్వయం కాదు, తోటివారు కూడా నిర్విఘ్నంగా అవ్వాలి. ఆ సమయం కూడా రానుంది. జరిగిపోతుంది ఎందుకంటే అవ్వవలసింది పిల్లలే కదా. కొంతమంది ఉదాహరణ రూపంగా వెనుక వచ్చినా కానీ తీవ్ర పురుషార్థం చేసి ముందుకు వెళ్తారు కానీ మెజారిటీ అయితే మీరే ముందుకు వెళ్ళాలి కదా. మెజారిటీ మందికి మురళిపై ప్రేమ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. బాబా చెప్పింది చెయ్యవలసిందే అన్నది జగదాంబ ప్రత్యక్షంగా తమ జీవితంలో చేసి చూపించారు. లక్ష్యం పెట్టుకున్నారు మరియు పురుషార్థం వైపు అటెన్షన్ ఇచ్చారు. మీ దీదీ, దాదీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలో ఉన్నారో వారు కూడా అటెన్షన్ ఉంచారు. ఇప్పుడు మీకోసం వేచి ఉన్నారు. వారెప్పుడు సమాప్తి ద్వారాలు తెరుస్తారు అని అడ్వాన్స్ పార్టీవారు అడుగుతున్నారు. ఒకరిద్దరు తెరవలేరు కదా! ఇప్పుడు సమయాన్ని, ద్వారాలను తెరిచే సమయాన్ని సమీపంగా తీసుకురండి. సంపన్నంగా అవ్వడము అంటే సమీపంగా అవ్వడము అని అర్థము.

అచ్చా. నలువైపుల ఉన్న పిల్లలందరికీ బాప్ దాదా హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. బాప్ దాదా ఇచ్చిన రెండు నెలల హోమ్ వర్కును కూడా గుర్తు చేస్తున్నారు, ఎందుకని? చాలావరకు ఈ వ్యర్థ సంకల్పాలే పురుషార్థాన్ని తీవ్రంగా కాక సాధారణంగా చేసేస్తున్నాయి. అందుకే నలువైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులను ఇవ్వడమే కాక సంగమ సమయము ఎంత శ్రేష్ఠమైనది, సుందరమైనదో గుర్తుకు తెప్పిస్తున్నారు. ఈ సంగమ సమయంలోనే సర్వ ఖజానాలు బాబా ద్వారా ప్రాప్తి అవుతున్నాయి. సంగమంలోని ఒక్కొక్క క్షణము ఎంతో గొప్పది అందుకే సంగమ సమయ విలువను సదా మీ బుద్ధిలో పెట్టుకోండి. సంగమంలోని ఒక్క క్షణం ఎంత ప్రాప్తిని చేయిస్తుంది? మీకు ఏమి లభించింది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? 'బ్రాహ్మణులైన మా మనసులలో అప్రాప్తి అనేదే లేదు. పొందాల్సినదంతా పొందేసాము.' ఇప్పుడు దీనిని కార్యంలో పెడ్తూ తీవ్ర పురుషార్థీలుగా అయ్యి సమయాన్ని సమీపంగా తీసుకురండి. అచ్ఛా. అందరికీ ఉల్లాసం రావడం బాప్ దాదా చూసారు. ఈ ఉల్లాసాన్ని సదా పెంచుతూ ఉండండి. అచ్ఛా.

సేవ టర్న్ పంజాబ్ వారిది:- సగం హాలు పంజాబ్ వారే ఉన్నారు. మంచిది. పంజాబ్ వారు పంజాబ్లో సేవ అవకాశాన్ని తీసుకుని సేవాస్థానాలను, విద్యార్థులను మంచిగా తయారు చేసారు. పంజాబ్ లోని ఒక విశేషత ఏమిటంటే అందరికీ సందేశాన్ని అందించడంలో చాలా పురుషార్థాన్ని చేసారు మరియు పంజాబ్ లోని వి.ఐ.పీలను కూడా సంబంధ సంపర్కంలోకి తీసుకువచ్చారు. అందుకే బాప్ దాదా పంజాబ్ సేవాధారులను చూసి సంతోషిస్తున్నారు. ధైర్యము, టీచర్లు కూడా ధైర్యవంతులే. టీచర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చెయ్యగలరు. ఇప్పుడు నంబరును తీసేసుకోండి. ముందుగా పంజాబ్ వారు వారసులను తీసుకురండి, అందరూ చూస్తారు. ఇప్పుడింకా సీజన్ ఉంది, రాబోవు రోజుల్లో ఎటువంటి వారిని తీసుకురావాలంటే పంజాబ్ నంబర్ వన్ అయిపోవాలి. ఇదేమీ పెద్ద విషయము కాదు, కేవలం సంకల్పం చెయ్యాలి. మంచిగా ఉన్నారు, విద్యార్థులు కూడా మంచివారే. వారు కూడా మంచి ఉల్లాస ఉత్సాహాలను కలిగి ఉండటం బాప్ దాదా చూసారు. ఎక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయో అక్కడ సఫలత తప్పక ఉండనే ఉంటుంది. బాప్ దాదా పంజాబ్ పులి అంటారు కదా. మరి పంజాబ్ పులి పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పంజాబ్ వారసులను తీసుకురావడంలో నంబరు వన్ తీసుకోండి. ఇప్పుడు ఈ మార్జిన్ అయితే ఉంది. బాగుంది. ఇప్పుడు లభించిన ఈ అవకాశంతో శక్తి కూడా నిండుతుంది. ఒక్కటే జోన్ ఆల్ రౌండ్ సేవ చెయ్యడానికి నిమిత్తమయినందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. అవకాశమూ లభిస్తుంది మరియు భాగ్యము కూడా తయారవుతుంది. ఇప్పటివరకు ఏ జోన్లు అయితే చేసాయో, మెజారిటీ అందరూ సంతుష్టంగానే తిరిగి వెళ్ళారు కదా? అవునా? రిపోర్టు సక్రమంగా ఇస్తున్నాము కదా? అచ్ఛా. బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా.

నాలుగు వింగ్స్ మీటింగ్ ఉంది:- (స్పార్క్, మీడియా, స్పోర్ట్స్, ధార్మిక) అచ్ఛా, ఈ నాలుగు వింగ్స్ కూడా సేవకు ఎంతగానో సహయోగము చేస్తున్నాయి, ఇకముందు కూడా చేస్తూనే ఉంటాయి ఎందుకంటే నాలుగు వింగ్స్ అనేకులను కనెక్షనెలోకి తీసుకురాగలవు. మీడియా అయితే ఇప్పుడు ఇంటింటికి సందేశాన్ని అందించే ప్లాన్ మంచిగా చేస్తుంది. ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ముందుకు వెళ్ళారు, వెళ్తూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. ఇప్పుడు సమయానుసారంగా ప్రతి ఆత్మకు తన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలన్న ప్రేరణ కలగాలి. వింటారు చాలామంది, కానీ ఎంతమంది వారసులుగా అయ్యారు? మీడియా ద్వారా ఎంతమంది వారసులుగా అయ్యారు? ఆ లిస్టు రావాలి. పభావం మంచిగా ఉంది అని బాప్ దాదా విన్నారు. విద్యార్థులు కూడా పెరుగుతున్నారు కానీ లిస్టును వ్రాయండి. ప్రతి సెంటరులో, ప్రతి జోన్లో మీడియా సేవ ద్వారా ఎంతమంది వెలువడ్డారు అని లిస్టు తీయండి. అలాగే మిగతా వర్గాలవారు కూడా లిస్టును తయారు చెయ్యండి. కొంతమంది ఈ రోజు లిస్టును కూడా ఇచ్చారు. కనెక్షన్లోకి వచ్చేవారు, వి.ఐ.పీల లిస్టును ఇచ్చారు. ఇప్పుడు వారి సంగఠన చేసి వారికి ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చి ముందుకు పంపండి. కనెక్షన్లో అయితే వస్తున్నారు కానీ భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం చెయ్యాలంటే ఆ సంపర్కంలో ఉన్నవారికి కూడా వారు ఏమి చెయ్యాలో అర్థం కావాలి. విన్నారా? కానీ ముందుకు వెళ్ళాలి అన్న స్పష్టీకరణ వినిపించండి. ఈ వర్గంలో ఎంతమంది యాడ్ అవుతున్నారో వ్రాయండి. ఉంటారు, కానీ ఎంతమంది అని తెలియదు. ఇకపోతే బాప్ దాదా అన్ని వింగ్స్ వారికి అభినందనలు తెలుపుతున్నారు. సేవా వృద్ధి కోసం వింగ్స్ ప్రయత్నం కూడా చాలా చక్కగా ఉంది. వృద్ధి కోసం ప్లాన్‌ను కూడా తయారు చేసారు. నాలుగు వర్గాలవారు సేవను మంచిగా చేస్తున్నారు ఎందుకంటే మాకూ బాధ్యత ఉంది అని వింగ్స్ వారు భావిస్తున్నారు. మంచి ప్రయత్నం చేస్తారు. అందుకే వింగ్స్ ను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. వింగ్స్ సేవలను ఎంతో అటెన్షన్ ఇచ్చి చేస్తున్నారు. ఇంకా కూడా ఇలా చెయ్యండి. బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. ముందుకు వెళ్తున్నారు, వెళ్తూనే ఉంటారు. నాలుగు వింగ్స్ వారికి బాప్ దాదా చెప్తున్నారు. ఏ వింగ్ కూడా బలహీనంగా లేదు. తమ శక్తి అనుసారంగా ముందుకు వెళ్తున్నాయి. ఇకపోతే బాప్ దాదా ఇచ్చిన పని గుర్తుండే ఉంటుంది. ప్రతి వర్గం నుండి ఒక మంచి, తెలివైన వి.ఐ.పిని ఎంచుకుని వారిని తయారు చెయ్యండి. ఇటువంటి తెలివైన వి.ఐ.పిల గ్రూపును తయారు చెయ్యండి. ఇటువంటి భిన్న భిన్న వర్గాల వారందరూ కలిసి ఒక్కొక్క విషయాన్ని స్పష్టం చెయ్యాలి. ఈ కార్యం తప్పకుండా చెయ్యండి. ఈ పని ముందున్న వారు చెయ్యగలరు, ధైర్యాన్ని ఇవ్వగలరు. ఇప్పుడు ప్రాక్టికల్ గా బ్రహ్మకుమారీలు ఏమి కోరుకుంటున్నారు అన్న సందేశం అందరికీ అందాలి. ఈసారి 75 సంవత్సరాల సేవల ద్వారా అందరికీ బ్రహ్మకుమారీల మహత్వము తెలిసింది. 'అవసరము, చెయ్యగలరు' అని అనేంత వరకు వచ్చారు. అన్ని వర్గాల వారి సహయోగము ఉంది. కానీ పరమాత్మ వచ్చారు అని అర్థం కావాలి. ఇప్పుడింకా బ్రహ్మకుమారీల వరకే చేరుకున్నారు. పరమాత్మ వచ్చారు అని కూడా వింటారు కానీ వింటున్నంత సేపూ నషా ఉంటుంది కానీ మైదానంలో దిగే ధైర్యము ఇప్పుడింకా వస్తూ ఉంది. వస్తుంది. రావలసిందే. ఇప్పుడు బ్రహ్మకుమారీల వద్దకు వచ్చేంత ధైర్యము వచ్చింది. ఏ ప్రోగ్రామ్ అయినా డల్ గా జరగడం లేదు. సక్సెస్ ఉంది. మొదట్లో అయితే పేరు వింటూనే పారిపోయేవారు. ఇప్పుడేమో బ్రహ్మకుమారీలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, విధి పూర్వకంగా చేస్తున్నారు అనేంత వరకు వచ్చింది. ఇంతటి అటెన్షన్ అయితే వచ్చింది. బాప్ దాదా నాలుగు వింగ్స్ ఇచ్చిన పేర్లను కూడా చూసారు. కనెక్షన్లో అయితే మంచిగా ఉన్నారు కానీ వారిని కొంత ముందుకు తీసుకురండి. వారి ప్రోగ్రామ్ చెయ్యండి. మనం ఏమి చెయ్యవచ్చు అని వారికి ప్లాన్ ఇవ్వండి. భూమి తయారయ్యింది ఇప్పుడు ఫలాలు రావాలి అందుకే బాప్ దాదా సంతోషిస్తున్నారు. కృషి చేస్తున్నందుకు సంతోషిస్తున్నారు. నాలుగు వింగ్స్ కు అభినందనలు, అభినందనలు, అభినందనలు. మంచి పురుషార్థాన్ని చేస్తున్నారు. అచ్ఛా.

డబుల్ విదేశీ ముఖ్య సోదరసోదరీలు వచ్చారు:- డబుల్ విదేశీయులకు మధుబన అలంకరణ అని పేరు ఇవ్వడం జరిగింది. మధుబనంలో ఎంతో శోభను తెస్తారు. బాప్ దాదా పిల్లల పురుషార్థము మరియు పరివర్తనను చూసి సంతోషిస్తున్నారు. మొదట్లో వై, వై (ఎందుకు, ఎందుకు) అని అనేవారు, ఇప్పుడు వాహ్! వాహ్ అని అంటున్నారు. మంచి ఛేంజ్ వచ్చింది. ఇప్పుడు ఏ విషయంలోనూ కష్టం అనిపించదు. ఏ విషయమైనా, నియమము, బాప్ దాదా మురళిలో ఇచ్చే డైరెక్షన్లను పాటించడంలో ఎవరెడీగా ఉంటారు మరియు సహయోగం కూడా మంచిగా ఉంది. స్నేహము ఉంది కానీ దానితో పాటు సహయోగము కూడా మంచిగా ఉంది. బాప్ దాదా రికార్డును చూసినప్పుడు అందులో గుప్త సహయోగాన్ని కూడా ఇస్తున్నారు. మనసు కూడా పెద్దదే. చిన్న మనసున్న వారు కాదు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. నలువైపుల సేవ కూడా చాలా బాగా జరుగుతుంది. బాప్ దాదాకు రెండు కావాలి, ఒకటి, సేవలో వృద్ది. రెండు, నిర్విఘ్నంగా ఉండాలి. ఈ రెండు విషయాలలోనూ ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. నిమిత్తమయిన వారందరూ కలిస్తే బాప్ దాదాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒకటి, మధువనానికి అలంకారము, రెండు, వచ్చిన పరివర్తన గురించిన వివరాలు తెలుసుకోవచ్చు, అనుభవాలను కూడా వింటూ ఉంటారు. దీని వలన కూడా ప్రభావం పడటమే కాక, 'విదేశీయులే చేస్తున్నప్పుడు నేనెందుకు చెయ్యలేను' అని సంకల్పం వస్తుంది. ఉత్సాహం కలుగుతుంది. జ్వాలాముఖి యోగంలో ఇప్పుడు విదేశీయులు నంబర్ వన్ తీసుకోండి. ఎందుకంటే విదేశీయుల సంస్కారమేమిటంటే పెట్టుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. రెండు విషయాలలో నంబరు తీసుకోండి - ఒకటి, వ్యర్థము సమాప్తము మరియు రెండు, సేవలో నిర్విఘ్నము. ప్రేమ అయితే పరివారంలోని అందరికీ ఉంది. కేవలం బాప్ దాదా ప్రేమయే కాదు, పూర్తి పరివారం యొక్క ప్రేమ ఉంది. ఇప్పుడు ఈ రెండు విషయాలలోనూ విదేశీయులు ముందుండి చూపించండి. వెళ్తారా! పెద్ద విషయమేమీ కాదు. బాప్ దాదా విదేశాలను కూడా చుట్టి వస్తారు. ఇప్పుడింకా అనుభవి స్వరూపులుగా అయ్యి కూర్చోవడంలో ఇంకా అటెన్షన్ కావాలి ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ అన్నిటికన్నా పెద్దది. మంచి లక్ష్యంతో కూర్చుంటారు కానీ దాని ప్రభావము ఉదయం చేసే కర్మయోగంపై పడాలి, సెంటర్ వాతావరణంపై పడాలి, ఇది కొంచెం ఎడిషన్ చెయ్యండి. ఇకపోతే బాప్ దాదా సంతోషిస్తున్నారు. ధైర్యాన్ని విడిచి పెట్టరు. ధైర్యమును ఉంచుతారు మరియు ఒకరికొకరు కూడా ధైర్యాన్ని ఇచ్చుకుంటూ నడుస్తున్నారు మరియు బాబా కూడా సహాయం చేస్తారు. ఇందులో ముందంజ వేయండి. ముందు మేము అవుతాము. మేము ఇందుకు నిమిత్తంగా అయ్యి చూపిస్తాము అని అనండి. మంచిది. బాప్ దాదా సంతోషంగానూ ఉన్నారు, సంతోషంగా లేరు కూడా.

టీచర్లను చూసి సంతోషిస్తున్నారు. ధైర్యమునుంచి, ధైర్యమును ఇతరులకు ఇచ్చి ముందుకు సాగుతున్నారు. విశేషంగా టీచర్లు ఒకచోట చేరినప్పుడు బాప్ దాదాకు ఆ దృశ్యం చాలా ఇష్టము. అన్ని విషయాలు స్పష్టమవుతాయి. ఉల్లాస ఉత్సాహాలను నింపుకుని కూడా వెళ్లారు. మిమ్మల్ని చూసి ఉత్సాహము వస్తుంది. మంచిది. ఒక్కొక్క రత్నానికి బాప్ దాదా విశేషంగా హృదయపూర్వక ప్రేమతో పాటు ఉల్లాస ఉత్సాహాల అల ఇస్తున్నారు. అచ్చా.

అందరూ స్వయానికి ప్రియస్మృతులను తీసుకున్నారా లేక ఇది కేవలం వింగ్స్ వారికి మరియు డబుల్ విదేశీయులకే అనుకుంటున్నారా? అందరినీ బాప్ దాదా చూస్తున్నారు. అందరిపై దృష్టిని సారిస్తున్నారు మరియు దృష్టితో ప్రియస్మృతులను తెలుపుతున్నారు. అచ్చా.

ఈ రోజు మొదటి సారిగా వచ్చినవారు లేవండి. మొదటిసారి వచ్చారు కనుక అద్భుతం చేసి చూపించండి. ఏ అద్భుతాన్ని చేస్తారు? లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫస్ట్ వచ్చి చూపించండి. వీలవుతుంది, ఇటువంటి రత్నాలు కూడా వెలువడుతాయి. బాప్ దాదా సహకారం అందరికీ ఉంటుంది. తీవ్ర పురుషార్థం, రాగానే తీవ్ర పురుషార్ధము, సాధారణ పురుషార్థం కాదు. చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే. ముందుకు వెళ్ళవలసిందే. ఈ దృఢ సంకల్పాన్ని ఉంచండి మరియు ఉదాహరణగా తయారవ్వాలి. సమయం కంటే ముందే వచ్చినందుకు బాప్ దాదాకు సంతోషంగా ఉంది. వారసత్వానికి అధికారులుగా అయితే అయ్యారు కదా. అచ్చా, బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇక్కడకు స్వాగతం కానీ మీ సీజన్ కదా, కనుక అందరికంటే ముందుకు వెళ్ళి చూపించండి. మేము వెనుక వచ్చామే అని ఆలోచించవద్దు, ఇంకా ముందుకు వెళ్ళాలి. బాప్ దాదా మరియు డ్రామా సహకారం లభిస్తుంది. బాగుంది. చూడండి, ఎంతమంది వచ్చారో! సగం క్లాస్ వీరితోటే ఉంది. బాప్ దాదానైతే గుర్తు పట్టారు. వారసత్వానికి అధికారులుగా అయ్యారు. అందరికీ బాప్ దాదా మరియు పరివారం యొక్క అభినందనలు, అభినందనలు మరియు అభినందనలు.

మోహిని అక్కయ్యతో: - సంగఠన ఉంది కదా, ఇందులో ఉత్సాహము కలుగుతుంది. ఉత్సాహం వచ్చినప్పుడు చూసుకోకుండా చేసేస్తారు, అది కొంచెం చెయ్యద్దు. మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. సహకారం అయితే ఉంది. మంచిగా అయిపోతారు. మీ ఆరోగ్యాన్ని చూసుకుని అడుగులు వేయండి. నిశ్చింతగా ఉండండి.

దాదీ జానకితో:- చాలా మంచిగా అందరినీ రిఫ్రెష్ చేస్తున్నారు. చెయ్యవలసిందే. (చేయించేవారు చేయిస్తున్నారు) వారైతే ఉండనే ఉన్నారు కానీ నేనే చేస్తున్నాను అని రానివ్వకండి. మంచి పాత్రను వహిస్తున్నారు. (హంసా అక్కయ్యతో) మీరు కూడా పాత్రను మంచిగా పోషిస్తున్నారు. అందరూ సంతోషిస్తున్నారు.

పర్ దాదీతో: - మీరు కూడా ఒక ఉదాహరణ. మిమ్మల్ని చూస్తే అందరికీ బ్రహ్మ బాబా గుర్తుకు వస్తారు. కష్టమేమీ లేదు కదా! ఇలాగే ఉండండి. మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు.

రమేష్ అన్నయ్యతో: - మంచిది. కానీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి. టూ మచ్ లోకి వెళ్ళకండి. ఎందుకంటే మున్ముందు ఎంతో పని చెయ్యాలి. కేవలం స్టూడియో పని కాదు. ఇంకా కూడా మీరు ఎంతో చెయ్యాల్సి ఉంది అందుకు ఆరోగ్యం చూసుకోండి. (సోలార్ సేవ జరుగుతుంది) సోలార్ కోసం, మీరు పత్రిక కోసం తీసుకున్నట్లుగా దీనికీ తీసుకోవడం వీలవ్వదా? పెద్ద పెద్ద ఫర్మ్ లు ఎక్కడైతే వారు ఎడ్వర్టైజ్ కోసం తీసుకుంటారో, అలాగే ఇక్కడ కూడా చాలా కనెక్షన్లకు దీని గురించి తెలియదు. వారి వద్దకు వెళ్ళి తీసుకోవచ్చు ఎందుకంటే ఇది సేవ. తిని త్రాగే పని కాదు కదా ఇది. ఎవ్వరూ తాము తినడానికి, ఉండటానికి తీసుకోరు. ఇది సేవ. ఇలా చేసి చూడండి.

కిచెన్ కూడా తయారవుతుందని నిర్వైర్ అన్నయ్య చెప్పారు:- అయిపోతుంది.

ముగ్గురు అన్నయ్యలతో:- బాధ్యతగా భావించి పరస్పరంలో సలహాను తీసుకోండి. ఒకవేళ ఏదైనా సలహాలో తేడా ఉంటే ఒకరికొకరు స్పష్టం చేసుకుని కలిసి ఒక సలహాకు వచ్చి వీరి (దాదీలు) ముందుంచండి. ఇది బాధ్యతగా భావించండి.

మీటింగ్ లో సేవ కోసం ఏ లక్ష్యాన్ని పెట్టాలి:- సేవలో ఇప్పుడు మార్పు ఏమి రావాలంటే ఇతరులు మీకు ఆహ్వానాన్ని పంపాలి. ఎంతోమందికి మీరు సేవను చేసారు. ఇప్పుడు వారు చెయ్యవచ్చు. స్టేజి ఇస్తే మీరు వెళ్ళి సేవ చేసే విధంగా ఉండాలి. మన స్టేజిపై అయితే చాలా చేసారు, రిజల్టు కూడా బాగుంది. ఇప్పుడు కొద్దిగా ఛేంజ్ చేసి చూడండి.

(ఇంటింటికీ సందేశాన్ని చేర్చడానికి సాధనము మీడియానేనా) అది మీడియానే. కొద్దిగా పద్ధతి ప్రకారంగా ఉండాలి. ఇంతగా టి.వీ గురించి తీసుకున్నారు, అందులో ఎంతో చేస్తున్నారు. దాని రిజల్టు ఏమిటి? (సగం మంది క్రొత్తవారు టి.వి చూసే వస్తున్నారు) మంచిది. అది అందరికీ తెలియాలి. లేకపోతే ఏమి జరుగుతుందో అని అనుకుంటారు. దాని సమాచారం కొంత కావాలి. ఆ రిజల్టు అందరికీ తెలియాలి. అప్పుడు ఉల్లాసం వస్తుంది. తెలియకపోతే, జరుగుతుంది, నడుస్తుంది అన్నట్లు ఉంటుంది. (గీతా భగవంతుడు కోసం బృజ్ మోహన్ అన్నయ్య అడిగారు) - అదైతే మీకు ఇచ్చాము కదా పని. ముందుగా నలుగురు, ఐదుగురు, ముఖ్యమైనవారిని ఒక చోటకు తీసుకురండి. నలుగురు, ఐదుగురు అయితే వస్తారు. వారిని కొద్దిగా తయారు చేసి వారితో మీటింగ్ చెయ్యండి. వారి అభిప్రాయము ఏమిటో తెలుసుకోండి. మేము అనుకుంటున్నది ఎలా వీలవుతుంది, వారినే నిమిత్తం చెయ్యండి. (రమేష్ అన్నయ్యతో) ఆరోగ్యం జాగ్రత్త.

విదేశీ ముఖ్య సోదరీలతో: - మంచిది, ఒకరికొకరు ఉత్సాహాన్ని ఇచ్చుకుంటున్నారు. కొద్దిగా వారి పట్ల శ్రద్ధ వహిస్తే మంచిగా అయిపోతారు. తిరగండి, లేక ఎవరినైనా పంపండి. పంపిస్తూ ఉంటే వారికీ ఉత్సాహంగా ఉంటుంది మరియు ముందుకు వెళ్తారు. నిర్విఘ్నంగా ఉన్నామన్న సమాచారము బాగుంది. కలిసి ఉంటే ఇటువంటి శుభవార్తలను అందరికీ వినిపించండి. ఒకచోట 8 సెంటర్లు ఉన్నాయి, అవన్నీ మంచిగా జరుగుతున్నాయి. ధైర్యముంది. ఈ సమాచారాన్ని అందరికీ వినిపించండి.

గాయత్రి పూలను పంపారు, పూర్తి పరివారము స్మృతిని పంపారు:- రెండు, నాలుగు పరివారాలు చాలా భాగ్యశాలి. వారి (వజీహా) ఆరోగ్యం బాగాలేదు కదా, కానీ లాస్ట్ వచ్చి ఫాస్ట్ వెళ్ళారు. ఇలా మంచివారు వెలువడ్డారు. బాగుంది. చూడండి, మీరందరూ భారతీయులే. అందరూ భారతవాసులే. హెడ్ అయితే మీరే కదా.

Comments