02-01-1990 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘మొత్తం జ్ఞానం యొక్క సారము - స్మృతి’’
ఈ రోజు సమర్థుడైన తండ్రి నలువైపులా ఉన్న తమ సర్వ సమర్థులైన పిల్లలను చూస్తున్నారు. సమర్థులైన పిల్లలు ప్రతి ఒక్కరు తమ సమర్థత అనుసారంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సమర్థ జీవితానికి అనగా సుఖమయమైన, శ్రేష్ఠమైన, సఫలతా సంపన్నమైన, అలౌకిక జీవితానికి ఆధారం ఏమిటి? ఆధారము ఒక్క పదము - స్మృతి. మామూలుగా కూడా, మొత్తం డ్రామా ఆట అంతా విస్మృతి మరియు స్మృతికి సంబంధించినది. ఈ సమయంలో స్మృతి యొక్క ఆట నడుస్తుంది. బాప్ దాదా బ్రాహ్మణాత్మలైన మీ పరివర్తనను దేని ఆధారంగా చేసారు? మీరు ఆత్మ, శరీరం కాదు అని కేవలం ఈ స్మృతిని ఇప్పించారు. ఈ స్మృతి ఎంతటి అలౌకిక పరివర్తన చేసింది. అంతా మారిపోయింది కదా! మానవ జీవితం యొక్క విశేషతనే స్మృతి. బీజము స్మృతి, ఈ బీజం ద్వారా వృత్తి, దృష్టి, కృతి, మొత్తం స్థితి మారిపోతుంది. అందుకే, ‘ఎలాంటి స్మృతినో అలాంటి స్థితి’ అని అంటూ ఉంటారు. బాబా, పునాది అయినటువంటి స్మృతినే పరివర్తన చేసారు. ఎప్పుడైతే పునాది శ్రేష్ఠంగా అయ్యిందో, అప్పుడు స్వతహాగానే పూర్తి జీవితమంతా శ్రేష్ఠంగా అయిపోయింది. మీరు శరీరం కాదు, మీరు ఆత్మ అని ఎంత చిన్న విషయం యొక్క పరివర్తన చేసారు - ఈ పరివర్తన అవ్వడంతోనే, ఆత్మ మాస్టర్ సర్వశక్తివాన్ అయిన కారణంగా స్మృతి కలుగుతూనే సమర్థంగా అయ్యింది. ఇప్పుడు ఈ సమర్థ జీవితం ఎంత ప్రియంగా అనిపిస్తుంది! స్వయం కూడా స్మృతి స్వరూపులుగా అయ్యారు మరియు ఇతరులకు కూడా ఇదే స్మృతినిప్పించి ఎలా ఉన్నవారిని ఎలా తయారుచేస్తారు! ఈ స్మృతితో ప్రపంచాన్నే మార్చేసారు. ఈ ఈశ్వరీయ ప్రపంచం ఎంత ప్రియమైనది! సేవార్థం ప్రపంచంలోని ఆత్మలతో పాటు ఉంటున్నా కానీ మనసు సదా అలౌకిక ప్రపంచంలో ఉంటుంది. దీనినే స్మృతి స్వరూపము అని అంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ స్మృతి స్వరూప ఆత్మ సమర్థంగా ఉన్న కారణంగా పరిస్థితిని ఏమని భావిస్తుంది? ఇదైతే ఆట. ఎప్పుడూ భయపడదు. ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ సమర్థ ఆత్మ కోసం గమ్యానికి చేరుకునేందుకు ఇవన్నీ దారిలోని సైడ్ సీన్స్ అనగా దారిలోని దృశ్యాలు. సైడ్ సీన్స్ అయితే బాగా అనిపిస్తాయి కదా! ఖర్చు పెట్టి అయినా సరే, సైడ్ సీన్స్ చూసేందుకు వెళ్తారు. ఇక్కడ కూడా ఈ రోజుల్లో ఆబూ దర్శనం చేసుకునేందుకు వెళ్తారు కదా! ఒకవేళ దారిలో సైడ్ సీన్స్ లేకపోతే, ఆ దారి బాగా అనిపిస్తుందా? బోర్ అయిపోతారు. ఇటువంటి స్మృతి స్వరూప, సమర్థ ఆత్మ కోసం పరిస్థితులు అనండి, పరీక్షలు అనండి, విఘ్నాలు అనండి, సమస్యలు అనండి, ఇవన్నీ సైడ్ సీన్స్ వంటివి. గమ్యం యొక్క దారిలో ఉన్న ఈ సైడ్ సీన్స్ ను లెక్కలేనన్ని సార్లు దాటాము అని స్మృతిలో ఉంది. నథింగ్ న్యూ (కొత్తేమీ లేదు), దీనికి కూడా పునాది ఏమిటి? స్మృతి. ఒకవేళ ఈ స్మృతిని మర్చిపోతే అనగా పునాది కదిలితే, జీవితమనే భవనమంతా కదలడం మొదలుపెడుతుంది. మీరైతే చలించనివారు కదా!
మొత్తం చదువులోని నాలుగు సబ్జెక్టులకు ఆధారం కూడా స్మృతి. అన్నింటికన్నా ముఖ్యమైన సబ్జెక్టు స్మృతి. స్మృతి అనగా, నేను ఎవరు, తండ్రి ఎవరు అన్న స్మృతి. రెండవ సబ్జెక్టు జ్ఞానము. రచయిత మరియు రచన యొక్క జ్ఞానం లభించింది. దానికి కూడా పునాది ఏమిటంటే - అనాది ఎవరు, ఆది ఎవరు మరియు వర్తమాన సమయం ఎవరు అనే స్మృతినిప్పించారు - బ్రాహ్మణ సో ఫరిశ్తా మరియు ఫరిశ్తా సో దేవత. ఇంకా ఎన్ని స్మృతులనిప్పించారు కనుక జ్ఞానం యొక్క స్మృతి అయినట్లు కదా. మూడవ సబ్జెక్టు దివ్య గుణాలు. ఇవి బ్రాహ్మణులైన మీ గుణాలు అని దివ్య గుణాల యొక్క స్మృతిని కూడా ఇప్పించారు. గుణాల లిస్ట్ కూడా స్మృతిలో ఉంటుంది, అప్పుడు సమయమనుసారంగా ఆ గుణాన్ని కార్యంలో, కర్మలో ఉపయోగిస్తారు. ఒక్కోసారి స్మృతి తక్కువ అవ్వడం వలన రిజల్టు ఏమవుతుంది! సమయానికి గుణాన్ని ఉపయోగించలేరు. సమయం గడిచిపోయిన తర్వాత స్మృతి వస్తుంది - ఇది చేయాలి అనుకోలేదు కానీ జరిగిపోయింది, ఇక ముందు ఇలా చేయము అని. కనుక దివ్య గుణాలను కర్మలోకి తీసుకువచ్చేందుకు కూడా సమయానికి స్మృతి ఉండాలి. అప్పుడప్పుడు ఇలా మీపై మీరు కూడా నవ్వుకుంటారు. మామూలుగా కూడా, సమయానికి ఏదైనా విషయాన్ని లేక ఏదైనా వస్తువును మర్చిపోతే, ఆ సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? వస్తువు ఉన్నా కానీ సమయానికి గుర్తు రాకపోతే గాభరా పడతారు కదా. అలాగే ఇది కూడా సమయానికి స్మృతిలో లేని కారణంగా అప్పుడప్పుడు గాభరా పడతారు. కనుక దివ్య గుణాల యొక్క ఆధారం ఏమైనట్లు? సదా స్మృతి స్వరూపము. నిరంతరంగా మరియు న్యాచురల్ గా దివ్య గుణాలు సహజంగా ప్రతి కర్మలో, కార్యంలో ఉపయోగపడుతూ ఉంటాయి. నాలుగవ సబ్జెక్టు సేవ. ఇందులో కూడా ఒకవేళ, విశ్వ కళ్యాణకారీ ఆత్మనైన నేను నిమిత్తమును అన్న స్మృతి స్వరూపంగా అవ్వకపోతే, సేవలో సఫలతను పొందలేరు. అప్పుడు, సేవ ద్వారా ఏ ఆత్మనూ స్మృతి స్వరూపంగా తయారుచేయలేరు. అయినా, సేవ అంటేనే స్వయం యొక్క మరియు తండ్రి యొక్క స్మృతినిప్పించడము.
కనుక నాలుగు సబ్జెక్టుల యొక్క పునాది స్మృతి అయ్యింది కదా. మొత్తం జ్ఞానం యొక్క సారము ఒకటే పదము - స్మృతి. అందుకే, బాప్ దాదా చివరి పరీక్షలో ఏ ప్రశ్న రాబోతుంది అనేది కూడా ముందు నుండి వినిపించారు. పరీక్ష పెద్దదిగా, క్లిష్టంగా ఏమీ ఉండదు. ఒకే ప్రశ్న యొక్క పరీక్ష ఉంటుంది మరియు ఒకే క్షణం యొక్క పరీక్ష ఉంటుంది. ఏ ప్రశ్న ఉంటుంది? నష్టోమోహా స్మృతి స్వరూపము. ప్రశ్న కూడా ముందు నుండే విన్నారు కదా, ఇలా అయితే అందరూ పాస్ అవ్వాలి. అందరూ నంబరువన్ లో పాస్ అవుతారా లేక నంబరువారుగా పాస్ అవుతారా?
డబల్ విదేశీయులు ఏ నంబరులో పాస్ అవుతారు? (నంబరువన్). మరి మాలను సమాప్తం చేసేయాలా? లేదంటే వేరే మాలను తయారుచేయాలా? ఉల్లాసమైతే చాలా బాగుంది. లాస్ట్ సో ఫాస్ట్ గా వెళ్ళేందుకు డబల్ విదేశీయులకు విశేషమైన ఛాన్స్ ఉంది. ఈ అవకాశం ఉంది. ఒకవేళ వేరే మాలను తయారుచేసినట్లయితే, పిక్నిక్ స్థానాలు ఏవైతే తయారవుతాయో, అక్కడకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఇష్టమైతే వేరే మాలను తయారుచేయాలా? మీ కోసం మాలలోకి వచ్చే అవకాశం ఉంచాము, వచ్చేస్తారు. అచ్ఛా.
టీచర్లందరూ అయితే స్మృతి స్వరూపులు కదా! నాలుగు సబ్జెక్టులలోనూ స్మృతి స్వరూపులు. శ్రమతో కూడిన పని అయితే కాదు కదా! టీచర్లు యొక్క అర్థమే తమ స్మృతి స్వరూప ఫీచర్స్ (ముఖ వైఖరి) ద్వారా ఇతరులను కూడా స్మృతి స్వరూపులుగా తయారుచేయడము. మీ ఫీచర్స్ (ముఖ వైఖరి) యే ఇతరులకు, నేను ఆత్మను అనే స్మృతినిప్పిస్తుంది. మస్తకంలో ప్రకాశిస్తున్న ఆత్మను లేక ప్రకాశిస్తున్న మణినే చూడాలి. ఎలాగైతే, సర్పం యొక్క మణిని చూసి ఎవరి ధ్యాస సర్పం వైపుకు వెళ్ళదు, మణి వైపుకు వెళ్తుంది. ఇటువంటి అవినాశీ మెరుస్తున్న మణిని చూసి దేహ భానం స్మృతిలోకి రాకూడదు, అటెన్షన్ స్వతహాగానే ఆత్మ వైపుకు వెళ్ళా్లి. టీచర్లు ఈ సేవకే నిమిత్తము. విస్మృతిలో ఉన్నవారికి స్మృతినిప్పించడము - ఇదే సేవ. సమర్థులుగానే ఉన్నారా లేక అప్పుడప్పుడు గాభరా పడతారా. ఒకవేళ టీచర్లు గాభరా పడిపోతే, విద్యార్థులు ఏమవుతారు? టీచర్లు అనగా సదా న్యాచురల్, నిరంతర స్మృతి స్వరూపులు సో సమర్థ స్వరూపులు. ఎలాగైతే బ్రహ్మాబాబా ఫ్రంట్ లో ఉన్నారో, అలా టీచర్లు కూడా ముందు ఉన్నారు కదా. నిమిత్తము అనగా ముందు ఉండడము. సేవ కోసం సమర్పణ అవ్వడానికి ధైర్యం పెట్టారు, సమర్థులుగా అయ్యారు. కావున ఈ స్మృతి ఏమిటి, ఇది త్యాగం యొక్క భాగ్యము. త్యాగం చేసేసారు, ఇప్పుడు భాగ్యానిది ఏమంత పెద్ద విషయము. త్యాగమైతే చేసారు, కానీ త్యాగము, త్యాగము కాదు ఎందుకంటే ప్రాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఏం త్యాగం చేసారు? కేవలం తెల్లని చీరను ధరించారు. దానివల్ల ఇంకా అందంగా తయారయ్యారు. ఫరిశ్తాలుగా, దేవీలుగా అయ్యారు. ఇంకేమి కావాలి? ఇంకా, తినడం-తాగడం వదిలేసారు... ఇదైతే ఈ రోజుల్లో డాక్టర్లు కూడా ఎక్కువ తినకండి, తక్కువ తినండి, సాదాగా తినండి అని చెప్తున్నారు. ఈ రోజుల్లోనైతే డాక్టర్లు కూడా తిననివ్వరు. ఇంకేమి వదిలారు? నగలు ధరించడం వదిలారు... ఈ రోజుల్లోనైతే నగలు వెనక దొంగలు వెంటపడుతున్నారు. వదిలేసి మంచి పని చేసారు. తెలివైన పని చేసారు, అందుకే, త్యాగానికి పదమాగుణాల భాగ్యం లభించింది. అచ్ఛా!
ఇప్పుడిప్పుడే బాప్ దాదాకు ఏథెన్స్ వారు గుర్తుకొస్తున్నారు. (ఏథెన్స్ లో సేవ యొక్క పెద్ద కార్యక్రమం నడుస్తుంది). వారు కూడా చాలా గుర్తుచేస్తున్నారు. ఎప్పుడైనా, ఏదైనా విశాల కార్యం జరిగినప్పుడు, ఆ అనంతమైన కార్యంలో అనంతమైన తండ్రి మరియు అనంతమైన పరివారం తప్పకుండా గుర్తుకొస్తారు. ఏ పిల్లలైతే వెళ్ళారో, వారు ధైర్యం కల పిల్లలు. ఎవరైతే నిమిత్తులు అయ్యారో, వారి ధైర్యము, కార్యాన్ని శ్రేష్ఠంగా మరియు అచలంగా చేస్తుంది. తండ్రి స్నేహం మరియు విశేషాత్మల శుభభావన, శుభకామనలు పిల్లలతో పాటు ఉన్నాయి. బుద్ధివంతుల బుద్ధి అయినవారు, ఎవరినైనా నిమిత్తంగా చేసి వారి ద్వారా తమ కార్యాన్ని చేయించుకుంటారు. అందుకే నిశ్చింతా చక్రవర్తులుగా అయి లైట్ హౌస్, మైట్ హౌస్ గా అయి శుభభావన, శుభకామనల వైబ్రేషన్లను వ్యాపింపజేస్తూ ఉండండి. సర్వీసబుల్ (సేవా యోగ్యులైన) పిల్లలు ప్రతి ఒక్కరికీ, బాప్ దాదా పేరు మరియు విశేషతల సహితంగా ప్రియస్మృతులు ఇస్తున్నారు. అచ్ఛా!
సదా నిరంతర స్మృతి స్వరూప సమర్థ ఆత్మలకు, సదా స్మృతి స్వరూపులుగా అయి ప్రతి పరిస్థితిని సైడ్ సీన్ గా అనుభవం చేసే విశేషాత్మలకు, సదా తండ్రి సమానంగా నలువైపులా స్మృతి యొక్క అలను వ్యాపింపజేసే మహావీర్ పిల్లలకు, సదా తీవ్రగతితో వెళ్ళి పాస్ విత్ ఆనర్ గా అయ్యే మహారథీ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఢిల్లీ జోన్ వారితో అవ్యక్త బాప్ దాదా కలయిక - సదా తమ భాగ్యాన్ని చూసి హర్షిస్తారా! సదా వాహ్-వాహ్ యొక్క పాటలు పాడుతారా? అయ్యో-అయ్యో యొక్క పాటలు సమాప్తమైపోయాయా లేక ఎప్పుడైనా దుఃఖపు అల వచ్చేస్తుందా? దుఃఖం యొక్క ప్రపంచం నుండి అతీతంగా అయ్యారు మరియు తండ్రికి ప్రియంగా అయ్యారు, అందుకే దుఃఖపు అల స్పర్శించలేదు. సేవార్థం ఉన్నా కానీ కమలం సమానంగా ఉంటారు. కమల పుష్పం బురద నుండి బయటకు వచ్చేయదు, బురదలోనే ఉంటుంది, నీటిలోనే ఉంటుంది కానీ అతీతంగా ఉంటుంది. మరి ఇలా అతీతంగా అయ్యారా? అతీతంగా అయినదానికి గుర్తు - ఎంత అతీతమో, అంత తండ్రికి ప్రియంగా అవుతారు, స్వతహాగానే తండ్రి ప్రేమ అనుభవం అవుతుంది మరియు ఈ పరమాత్మ-ప్రేమ ఛత్రఛాయగా అవుతుంది. ఎవరిపైనైతే ఛత్రఛాయ ఉంటుందో, వారు ఎంత సురక్షితంగా ఉంటారు! ఎవరిపైనైతే పరమాత్మ ఛత్రఛాయ ఉంటుందో, వారిని ఎవరైనా ఏం చేయగలరు! కావున, మేము పరమాత్మ ఛత్రఛాయలో ఉండేటువంటివారము అన్న నషాలో ఉండండి. అభిమానం కాదు, కానీ ఆత్మిక నషా. దేహాభిమానులుగా ఉన్నట్లయితే అభిమానం వస్తుంది, ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే అభిమానం రాదు, కానీ ఆత్మిక నషా ఉంటుంది మరియు ఎక్కడైతే నషా ఉంటుందో, అక్కడ విఘ్నం ఉండలేదు. ఉంటే చింత ఉంటుంది లేదంటే నషా ఉంటుంది. రెండూ కలిసి ఉండవు. అత్యంత మంచి రొట్టె-పప్పును ఇచ్చేందుకు బాప్ దాదా బంధించబడి ఉన్నారు. రోజూ 36 రకాల భోజనాన్ని ఇవ్వరు కానీ ప్రేమతో కూడిన పప్పు-రొట్టె తప్పకుండా లభిస్తుంది. ఇది నిశ్చితము, దీనిని ఎవ్వరూ తప్పించలేరు. మరి ఏ విషయం గురించి చింత! ప్రపంచంలోని వారికి, మేము కూడా తినాలి, వెనుకవారు కూడా తినాలి అనే చింత ఉంటుంది. ఇక్కడ, మీరు కూడా ఆకలితో ఉండరు, మీ వెనుకవారు కూడా ఆకలితో ఉండరు. ఇంకేం కావాలి? డన్లప్ దిండు కావాలా ఏమిటి! ఒకవేళ డన్లప్ దిండు లేక పరుపు ఉన్నా, చింత యొక్క నిద్ర ఉంటే నిద్ర పడుతుందా? నిశ్చింతగా ఉన్నట్లయితే నేలపై పడుకున్నా కూడా నిద్ర పట్టేస్తుంది. బాహువులను తమ దిండుగా చేసుకున్నా కూడా నిద్ర పట్టేస్తుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, అక్కడ ఎండిపోయిన రొట్టె కూడా 36 రకాల భోజనంలా అనిపిస్తుంది, అందుకే నిశ్చింత చక్రవర్తులు. నిశ్చింతగా ఉండే ఈ రాజ్యాధికారము అన్ని రాజ్యాధికారాల కంటే శ్రేష్ఠమైనది. ఒకవేళ కిరీటాన్ని ధరించి, సింహాసనంపై కూర్చుని చింతిస్తూ ఉన్నట్లయితే, అది సింహాసనం అయినట్లా లేక చింత అయినట్లా? కావున భాగ్య విధాత భగవంతుడు మీ మస్తకంపై శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖను గీసారు. నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు. ఆ టోపీ లేక కుర్చీ ఉన్న చక్రవర్తి కాదు, నిశ్చింత చక్రవర్తి. ఏదైనా చింత ఉందా? మనవలు-మునిమనవల గురించిన చింత ఉందా? మీ కళ్యాణం జరిగింది అంటే వారిది కూడా తప్పకుండా జరుగుతుంది. కావున సదా తమ మస్తకంపై శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖను చూస్తూ ఉండండి. వాహ్ నా శ్రేష్ఠ ఈశ్వరీయ భాగ్యము! ధనం-సంపదల భాగ్యం కాదు, ఈశ్వరీయ భాగ్యము. ఈ భాగ్యం ఎదురుగా ఆ ధనం అసలు ఏమీ కాదు, అదైతే వెనుక వెనుకే వస్తుంది. నీడ అనేది దానంతట అదే వెనుక వెనుక వస్తుందా లేక వెనుక రమ్మని మీరు చెప్తారా? కనుక ఇవన్నీ నీడ వంటివి, కానీ ఈ భాగ్యము ఈశ్వరీయ భాగ్యము. ఒకవేళ పొందాలంటే సదా కోసం పొందాలి అన్న నషాలోనే సదా ఉండండి. తండ్రి మరియు ఆత్మ అవినాశీ అన్నప్పుడు, మరి ప్రాప్తి వినాశీది ఎందుకు? ప్రాప్తి కూడా అవినాశీది ఉండాలి.
బ్రాహ్మణ జీవితం ఉన్నదే సంతోషంతో కూడినది. సంతోషంగా తినాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా మాట్లాడాలి, సంతోషంగా పని చేయాలి. లేస్తూనే, కనులు తెరవగానే సంతోషం యొక్క అనుభవం అవుతుంది. రాత్రివేళ కనులు మూసుకోగానే సంతోషంగా విశ్రమిస్తారు - ఇదే బ్రాహ్మణ జీవితము. అచ్ఛా!
బాప్ దాదాతో వ్యక్తిగత కలయిక - ఆజ్ఞాకారులుగా అవ్వడంతో పరివారం యొక్క ఆశీర్వాదాలు
(బాప్ దాదా ఎదురుగా గాయత్రి మోదీ యొక్క పరివారం కూర్చున్నారు)
బాప్ దాదా ఈ పరివారంలో ఒక విషయాన్ని చూసి చాలా సంతోషిస్తున్నారు. ఏ విషయము? ఇది ఆజ్ఞాకారీ పరివారము. ఇంత దూరం నుండి వచ్చి చేరుకున్నారు కదా. ఆజ్ఞను పాటించినందుకు కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరి విషయంలోనైనా, ఒకరు చెప్పినది మరొకరు అంగీకరిస్తే సంతోషం అనిపిస్తుంది. మనసు నుండి ఒకరి పట్ల ఒకరికి ఆశీర్వాదాలు వెలువడతాయి. ఎవరైనా మంచి మిత్రుడు లేక సోదరుడు ఒకవేళ వీరు చాలా మంచి వారు అని అన్నట్లయితే, అవి ఆశీర్వాదాలు అయినట్లు కదా. ఎవరికైనా ‘హా జీ’ (సరేనండి) అని చెప్పడము లేక ఆజ్ఞను పాటించడము, దీనికి గుప్తమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు సమయానికి చాలా సహాయం చేస్తాయి. ఆ సమయంలో తెలియదు. ఆ సమయంలో సాధారణ విషయంలా అనిపిస్తుంది, సరేలే, అయిపోయింది అని అనిపిస్తుంది. కానీ ఈ గుప్తమైన ఆశీర్వాదాలు ఆత్మకు సమయానికి సహాయం చేస్తాయి. ఇవి జమ అవుతాయి, అందుకే బాప్ దాదా చూసి సంతోషించారు. ఏ కార్యం కోసం వచ్చినా సరే, రావడమైతే వచ్చారు కదా. మరియు ఇది కూడా గుర్తుంచుకోండి - పరమాత్మ స్థానానికి ఏ కారణం చేత వచ్చినా సరే, చూడడానికి వచ్చినా, తెలుసుకోవడానికి వచ్చినా, కాలు అయితే పెట్టారు కదా. దానికి కూడా ఫలం జమ అయిపోతుంది. ఇది కూడా తక్కువ భాగ్యం కాదు. ఈ భాగ్యాన్ని కూడా మున్ముందు అనుభవం చేస్తారు. ఏదో ఒక కారణం చేత మేము కాలు అయితే పెట్టేసాము అని ఆ సమయంలో స్వయాన్ని చాలా భాగ్యవంతులుగా భావిస్తారు. ఇప్పుడైతే అర్థం కాదు. ఇప్పుడైతే, ఇదేమిటో తెలియదు అని అనుకుంటూ ఉంటారు. కానీ తెలిసో-తెలియకో భాగ్యం జమ అయిపోయింది అని తండ్రికి తెలుసు. అది సమయం వచ్చినపుడు మీకు కూడా తెలుస్తుంది, పనికొస్తుంది. అచ్ఛా!
(చక్రధారి దీదీ రష్యా సోదరీ-సోదరుల స్మృతినిచ్చారు)
మంచిది, కొద్ది సమయంలోనే మంచి సఫలత, మరియు దాహంతో ఉన్న మంచి-మంచి ఆత్మలు వెలువడ్డారు. వారి స్నేహం తండ్రి వద్దకు చేరుకుంది. అందరికీ ప్రియస్మృతులను రాయండి మరియు చెప్పండి, బాప్ దాదా స్నేహము పిల్లలందరికీ సహయోగాన్ని ఇచ్చి ముందుకు తీసుకువెళ్తుంది అని. మంచి సేవ, పెంచుతూ వెళ్ళండి.
Comments
Post a Comment