31-12-1989 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘వాచా సేవతో పాటు మనసా సేవను కూడా న్యాచురల్ (సహజం) చేసుకోండి, శుభభావనా సంపన్నులుగా కండి’’
ఈ రోజు నవ విశ్వ-నిర్మాత, విశ్వానికి తండ్రి తన సమీప సాథీ, నవ-నిర్మాణ కర్తలైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలైన మీరందరూ తండ్రి యొక్క నవ నిర్మాణం చేసే కార్యంలో సమీప సంబంధం కలవారు. వాస్తవానికి విశ్వ నవ నిర్మాణ కార్యంలో ప్రకృతి కూడా సహయోగిగా అవుతుంది, వర్తమాన సమయంలోని ప్రసిద్ధి చెందిన వైజ్ఞానిక పిల్లలు కూడా సహయోగులుగా అవుతారు. కానీ మీరందరూ సమీపంగా ఉన్న సాథీలు. పిల్లలందరికీ ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన కర్తవ్యం లేదా సేవ ఏమిటి? రాత్రింబవళ్ళు సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలతో ఎగురుతున్నారు. ఏ కార్యం కోసము? విశ్వాన్ని కొత్తదిగా తయారుచేయడానికి. ప్రపంచం వారైతే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. కానీ మీ మనసులో ఈ తపన ఉంది - ఈ విశ్వాన్ని ఎలాంటి కొత్తదిగా తయారుచేయాలంటే, మొత్తం అన్ని విషయాలై కొత్తవిగా అయిపోవాలి. మనుష్యాత్మలైనా, ప్రకృతి అయినా సతోప్రధానంగా, కొత్తగా అయిపోవాలి. పాత ప్రపంచాన్ని అయితే చూస్తూనే ఉన్నారు. నలువైపులా హాహాకారాలున్నాయి. మరి హాహాకారాల ప్రపంచం నుండి జయ జయకారాల ప్రపంచాన్ని తయారుచేస్తున్నారు, అందులో ప్రతి ఘడియ, ప్రతి కర్మ, ప్రతి వస్తువు కొత్తదిగా అయిపోతుంది. సాధారణంగా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అన్నీ కొత్తవే మంచిగా అనిపిస్తాయి కదా. పాత వస్తువులు ఒకవేళ మంచిగా అనిపించినా కూడా, కేవలం స్మృతిచిహ్నాలుగా మాత్రమే, ఉపయోగించడానికి మంచిగా అనిపించవు. కేవలం మ్యూజియంలో స్మృతిచిహ్నాలుగా పెట్టుకుంటారు. కానీ కొత్త వస్తువు ప్రతి ఒక్కరికీ ఇష్టమనిపిస్తుంది. ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీరు పాత ప్రపంచంలో ఉంటూ కూడా, కొత్త ప్రపంచంలో ఉన్నారు. ఇతరాత్మలు పాత ప్రపంచంలో ఉన్నారు కానీ మీరు ఎక్కడున్నారు? మీరు కొత్త యుగం ‘‘సంగమము’’ లో ఉంటారు. పాత జీవితం సమాప్తమైపోయింది మరియు ఇప్పుడు కొత్త బ్రాహ్మణ జీవితంలో ఉన్నారు. ప్రపంచం వారు ఒక్కరోజు కోసం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. కానీ మీదైతే కొత్త యుగము, కొత్త జీవితము. ప్రతి కర్మ, ప్రతి సెకండు కొత్తది. మీరు సంగమంలో ఉన్నారు. ఒకవైపు పాత ప్రపంచాన్ని మరియు ఇంకొక వైపు కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు. మరి బుద్ధి ఎటువైపుకు వెళ్తుంది? కొత్తదాని వైపా లేదా అప్పుడప్పుడు పాత ప్రపంచం వైపు కూడా వెళ్తుందా? పాత ప్రపంచం ఏమైనా మంచిగా అనిపిస్తుందా? ఏ వస్తువైనా మంచిగా అనిపించకపోతే, అక్కడకు బుద్ధి ఎందుకు వెళ్తుంది? పాత ప్రపంచంతో దుఃఖం, అశాంతి, చింత యొక్క అనుభవం చేసేసారా లేదా ఇప్పుడింకా కొంచెం అనుభవం చేయాలా?
ఈ రోజు అయితే కలుసుకునేందుకు మరియు జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ దూరదేశం నుండి వచ్చి చేరుకున్నారు, కొత్త సంవత్సరం జరుపుకోవడానికి. కనుక కొత్త సంవత్సరం కోసం, స్వయం కోసం, విశ్వ సేవ కోసం మరియు తమ సమీప సాథీల కోసం, ప్రకృతి కోసం మరియు దూరంగా ఉన్న తమ పరివారం కోసం ఏం ఆలోచించారు? కొత్త సంవత్సరంలో కొత్తగా ఏం చేస్తారు? కేవలం తమ కోసమే ఆలోచించకూడదు కదా! అనంతమైన తండ్రికి పిల్లలు, మీరు కూడా అనంతమైనవారు. కనుక అందరి కోసం ఆలోచిస్తారు కదా ఎందుకంటే ఈ సమయం బాప్ దాదాతో పాటు మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తండ్రి చేయించేవారు కానీ చేయడానికి నిమిత్తులైతే మీరే కదా.
బాప్ దాదా రెండు సంవత్సరాల క్రితం కొత్త సంవత్సరంలో ఏ నవీనతను తీసుకురావాలి అన్న డైరెక్షన్ ఇచ్చారు. మధ్యలో ఒక సంవత్సరం అదనంగా లభించింది. కనుక ఈ రోజు అమృతవేళ బాప్ దాదా చూస్తున్నారు - ప్రతి ఒక్క బిడ్డ స్వయంలో నవీనతను ఎంతవరకు తీసుకువచ్చారు. మనసులో, వాచాలో, కర్మలో ఏ నవీనతను తీసుకువచ్చారు మరియు సేవా-సంపర్కంలో ఏ నవీనతను తీసుకువచ్చారు. గత సంవత్సరం మనసు యొక్క చార్టు ఎలా ఉండేది, ఇప్పుడు మనసు యొక్క చార్టు ఎలా ఉంది? ఇలా అన్ని విషయాల యొక్క చార్టు చెక్ చేసుకోండి. నవీనత అనగా విశేషత. అన్ని విషయాలలో విశేషతను తీసుకువచ్చారా? మనసు యొక్క విశేషత ఎగిరే కళ లెక్కలో ఎలా ఉంది? ఎగిరే కళ ఉన్నవారి విశేషత అనగా ప్రతి సమయం, ప్రతి ఆత్మ పట్ల స్వతహాగానే శుభభావన మరియు శభకామనల శుద్ధమైన వైబ్రేషన్లు స్వయానికి మరియు ఇతరులకు కూడా అనుభవమవ్వాలి అనగా మనసుతో ప్రతి సమయం సర్వాత్మల పట్ల దీవెనలు స్వతహాగానే వెలువడుతూ ఉండాలి. మనసు ఎల్లప్పుడూ ఈ సేవలో బిజీగా ఉండాలి. ఎలాగైతే వాచా సేవలో సదా బిజీగా ఉండే అనుభవీలుగా అయిపోయారో, ఒకవేళ సేవ లభించకపోతే తమను తాము ఖాళీగా అనుభవం చేస్తారో, అలాగే ప్రతి సమయం వాణితో పాటు మనసా సేవ స్వతహాగానే జరగాలి. వాచా సేవకు చాలా మంచి ప్లాన్లు తయారుచేస్తారు. ఈ కాన్ఫరెన్స్ లు చేస్తాము - నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తాము, ఇప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తాము, వర్గీకరణలవి చేస్తాము. కనుక వాచా సేవలో స్వయాన్ని బిజీగా పెట్టుకునేందుకు ఒకదాని తర్వాత మరొక ప్లాన్ ముందుగానే ఆలోచిస్తారు, దీనిలో బిజీగా ఉండడం వచ్చేసింది. మెజారిటీ మంచి ఉత్సాహంతో ఈ సేవలో ముందుకు వెళ్తున్నారు. బిజీగా ఉండే విధానం వచ్చేసింది. కానీ మనసా సేవలో కూడా బిజీగా ఉండడము - ఇందులో మైనారిటీ ఉన్నారు. మెజారిటీ లేరు. ఎప్పుడైనా ఏదైనా విషయం ఎదురుగా వచ్చినప్పుడు ఆ సమయం విశేషంగా మనసా సేవ స్మృతిలోకి వస్తుంది. కానీ నిరంతరం ఎలాగైతే వాచా సేవ సహజంగా అయిపోయిందో, అదే విధంగా మనసా సేవ కూడా తోడు-తోడుగా మరియు సహజం అయిపోవాలి. ఈ విశేషత ఇంకా ఎక్కువ కావాలి. వాణితో పాటు మనసా సేవ కూడా చేస్తూ ఉండండి. అప్పుడు మీరు తక్కువగా మాట్లాడవలసి వస్తుంది. మాట్లాడడంలో ఏ శక్తినైతే మీరు ఉపయోగిస్తారో, అది మనసా సేవ యొక్క సహయోగం కారణంగా వాణి యొక్క శక్తి జమ అయిపోతుంది మరియు మనసు యొక్క శక్తిశాలీ సేవ ఎక్కువ సఫలతను అనుభవం చేయిస్తుంది. ఎంతగా ఇప్పుడు తనువు, మనసు, ధనం మరియు సమయాన్ని పెడుతున్నారో అంతకన్నా చాలా తక్కువ సమయంలో సఫలత ఎక్కువగా లభిస్తుంది మరియు ఏదైతే స్వయం పట్ల కూడా అప్పుడప్పుడు శ్రమ చేయాల్సి వస్తుందో - తమ స్వభావాన్ని పరివర్తన చేసుకోవడానికి లేదా సంగఠనలో నడుచుకోవడానికి లేక అప్పుడప్పుడు సేవలో సఫలత తక్కువగా పొందడం చూసి నిరాశ చెందడము మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. చిన్న-చిన్న విషయాలు ఏవైతే పెద్దవిగా అయిపోతాయో, అవన్నీ ఎలా సమాప్తమైపోతాయంటే, ఇదైతే ఇంద్రజాలం అయిపోయింది అని మీరు స్వయంగా అనుకుంటారు. ఇప్పుడు ఇంద్రజాల మంత్రం ఇష్టమనిపిస్తుంది కదా. కనుక ఈ అభ్యాసం ఇంద్రజాలం యొక్క మంత్రం అయిపోతుంది. ఎక్కడైతే మంత్రముంటుందో అక్కడ తేడా త్వరగా వస్తుంది. అందుకే ఇంద్రజాల మంత్రమని అంటారు. కనుక కొత్త సంవత్సరంలో ఇంద్రజాలం యొక్క మంత్రాన్ని ఉపయోగించండి. ఈ నవీనత లేక విశేషతను చేయండి మరియు ఇంద్రజాలం యొక్క మంత్రం ఏమిటి? మనసా మరియు వాచా రెండింటినీ కలపండి. రెండింటి బ్యాలెన్స్ మరియు రెండింటి కలయిక - ఇదే ఇంద్రజాల మంత్రము. ఎప్పుడైతే మనసులో సదా శుభభావన లేక శుభ దీవెనలు ఇచ్చేటువంటి న్యాచురల్ అభ్యాసం అయిపోతుందో, అప్పుడు మీ మనసు బిజీ అయిపోతుంది. మనసులో ఏదైతే అలజడి అవుతుందో, దాని నుండి స్వతహాగానే మీరు దూరమైపోతారు. ఏదైతే తమ పురుషార్థంలో అప్పుడప్పుడు నిరాశ చెందుతారో, ఆ విధంగా అవ్వరు. ఇంద్రజాల మంత్రమైపోతుంది. సంగఠనలో అప్పుడప్పుడు భయపడతారు. నేనైతే ప్రతిజ్ఞ చేసాను - ‘‘తండ్రి మరియు నేను’’, సంగఠనలో ఉంటాను అని ఏమైనా ప్రతిజ్ఞ చేసానా అని ఆలోచిస్తారు. తండ్రి అయితే చాలా మంచివారు, తండ్రి తో పాటు ఉండడం కూడా చాలా మంచిది కానీ సంగఠనలో అందరి సంస్కారాలను అర్థం చేసుకొని నడుచుకోవడం - ఇది చాలా కష్టము. కానీ ఇది కూడా చాలా సహజమైపోతుంది ఎందుకంటే మనసులో, హృదయంలో ప్రతి ఆత్మ పట్ల దీవెనలు, శుభ భావన, శుభ కామన శక్తిశాలీగా ఉన్న కారణంగా ఇతరుల సంస్కారాలు అణిగిపోతాయి, అవి మిమ్మల్ని ఎదుర్కోవు. అణిగిపోతూ, అణిగిపోతూ అవి సమాప్తమైపోతాయి. తర్వాత అంటారు - అవును, మేము 40 మందితో కూడా ఉండగలము. ఈ సంవత్సరం నలువైపులా ఉన్న దేశ విదేశాల పిల్లలు ప్రతి సమయం ఈ నవీనతను లేక విశేషతను స్వయంలో తీసుకురావాలి. అప్పుడప్పుడు ఆలోచిస్తారు కదా - ఇప్పుడింకా 9 లక్షలు పూర్తి అవ్వలేదు అని. అంతిమం వరకు 33 కోట్ల మంది దేవతలుంటారు - ఆ విషయమే విడిచిపెట్టండి. 9 లక్షల మంది మంచి ఆత్మలు కావాలి. మొదటి రాజధానిలోనైతే మంచి ఆత్మలు కావాలి. ప్రజలు కూడా మంచి నంబరువన్ కావాలి ఎందుకంటే వన్-వన్-వన్ (1-1-1) మొదలవుతుంది. కనుక అందులో కూడా ఏదైతే ప్రకృతి ఉంటుందో, వ్యక్తులుంటారో, వైభవాలుంటాయో - అవన్నీ నంబరువన్ గా ఉంటాయి. కనుక ఇప్పుడు నంబరువన్ ప్రజలు 9 లక్షల మందిని తయారుచేసారా? ఎన్ని లక్షల మందిని తయారుచేసారు? ఏదైతే మీరు రిపోర్టు తయారుచేస్తారో, అందులో అప్పుడప్పుడు వచ్చేవారిని కూడా కలుపుతారు కదా. కానీ ఇప్పుడైతే సగం కూడా అవ్వలేదు. నంబరువన్ ప్రజలు కూడా తక్కువలో తక్కువ తండ్రి స్నేహాన్ని అయితే తప్పకుండా అనుభవం చేస్తారు. సహయోగంలో ఉంటారు, ఇది మొదటి అడుగు, కానీ రెండవ అడుగు, సహయోగులుగా, స్నేహీలుగా అవుతారు. సమర్పణ అవ్వరు, అది వేరే విషయము. కానీ సదా తండ్రి యొక్క స్నేహంలో ఉండాలి. కేవలం పరివారం లేదా సోదరీ-సోదరుల స్నేహం కాదు. ఎవరైతే సేవ చేస్తారో వారి పట్ల స్నేహీలుగా అవుతారు - ఇప్పుడు ఇంతవరకు చేరుకున్నారు. కానీ తండ్రి స్నేహాన్ని అనుభవం చేయాలి. వారి హృదయం నుండి కూడా 'బాబా' అని వెలువడాలి. అప్పుడు ప్రజలుగా అవుతారు. బ్రహ్మా యొక్క ప్రజలు, మొదటి విశ్వ మహారాజుకు చెందినవారిగా అవుతారు. ఎవరికైతే ప్రజలుగా అవుతారో, వారి స్నేహమైతే ఇప్పటి నుండే కావాలి కదా. ఇప్పుడింకా చాలా సేవ ఉందని ఏదైతే ఆలోచిస్తారో, అది ఈ మనసా వాచా యొక్క సమ్మిళిత సేవలో విహంగ మార్గపు సేవ యొక్క ప్రభావం చూపిస్తుంది. మొదట చేసిన సేవతో చూస్తే ఇప్పటి సేవను విహంగ మార్గపు సేవ అని అంటారు. మున్ముందు ఇంకా విహంగ మార్గపు సేవను అనుభవం చేస్తారు. బాప్ దాదా పిల్లల యొక్క సేవతో సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే ఒక్కొక్కరి సేవను చూస్తారో, అప్పుడు ఒక్కొక్కరి పట్ల చాలా స్నేహం ఉత్పన్నమవుతుంది. దేశంలో కావచ్చు, విదేశంలో కావచ్చు సేవ యొక్క ఉత్సాహం అయితే చాలా మంచిగా ఉంది. ఎన్ని గ్రామాలలో నలువైపులా సేవ వ్యాపిస్తుంది. శ్రమ అయితే చేస్తారు కానీ స్నేహం కారణంగా శ్రమ అనిపించదు. పరుగు పెడుతూ స్వయాన్ని బిజీగా పెట్టుకునే యుక్తిని మంచిగా రచిస్తారు. తండ్రి స్నేహం మరియు తండ్రి సహాయం - ఈ విధంగా నడిపిస్తున్నాయి. బాప్ దాదా, ఎంత సేవ చేస్తున్నారు అని పిల్లలను చూసి సంతోషిస్తారు . ఎంతవరకు చేసారో, ఎలా చేసారో చాలా మంచిగా చేసారు. ఇప్పుడింకా విహంగ మార్గపు సేవ కోసం ఏ విధినైతే వినిపించారో, దీని ద్వారా క్వాలిటీ ఉన్న ఆత్మలు సమీపంగా వస్తారు మరియు క్వాలిటీ ఉన్న ఆత్మలు అనేకులకు నిమిత్తులుగా అవుతారు. ఒకరి నుండి అనేకులు అవుతూ విహంగ మార్గపు సేవ జరుగుతుంది. కానీ క్వాలిటీ యొక్క సేవలో వారిని నిమిత్తులుగా చేయడానికి లేదా వారి బుద్ధిని టచ్ చేయడానికి మీ మనసు చాలా శక్తిశాలీగా ఉండాలి ఎందుకంటే క్వాలిటీ ఉన్న ఆత్మలు వాణిలో అయితే ముందే తెలివైనవారిగా ఉంటారు కానీ అనుభూతిలో బలహీనంగా ఉంటారు, పూర్తిగా ఖాళీగా ఉంటారు. కనుక ఎవరు ఏ విషయంలో బలహీనంగా ఉంటారో, వారికి ఆ బలహీనత యొక్క బాణమే తగలగలదు. ఎప్పుడైతే అనుభూతి కలుగుతుందో, అప్పుడు వీరు మా కన్నా ఉన్నతమైనవారని అర్థం చేసుకుంటారు. లేదంటే అప్పుడప్పుడు మిక్స్ చేసేస్తారు - మీరు కూడా చాలా మంచివారు, మిగిలినవారు కూడా మంచివారే, మీకు కూడా భగవంతుడు ఆశీర్వదించాలి అని ఇదే చెప్పి సమాప్తం చేసేస్తారు. కానీ వీరు ఆశీర్వాదాలతో నడుస్తున్నారు, పరమాత్మ ఆశీర్వాదాలతో వీరి జీవితం ఉంది - ఇప్పుడు ఈ అనుభూతి చేయించాలి. ఇప్పుడైతే కొద్దిగా-కొద్దిగా అభిమానముంటుంది. తమను తాము పెద్దవారిగా భావించిన కారణంగా వీరికి ధైర్యాన్ని ఇస్తున్నామని అనుకుంటారు. కానీ తర్వాత అర్థం చేసుకుంటారు వీరు మాకు కూడా ధైర్యాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు ఇటువంటి ఇంద్రజాలం యొక్క మంత్రాన్ని నడిపించండి. ఇప్పుడైతే వాణి యొక్క సేవ ద్వారా ధరణిని తయారుచేసారు. నాగలితో దున్నారు, ధరణిని సరి చేసారు. ఇంత ఫలితాన్ని తీసుకొచ్చారు. బీజం కూడా వేసారు కానీ ఇప్పుడు ఆ బీజానికి ప్రాప్తి అనే నీరు కావాలి. అప్పుడు ఫలితం వెలువడిన అనుభవం చేస్తారు. మనసు యొక్క క్వాలిటీని పెంచుకోండి, అప్పుడు క్వాలిటీ సమీపంగా వస్తుంది. ఇందులో డబల్ సేవ ఉంది. స్వయానిది కూడా మరియు ఇతరులది కూడా. స్వయం కోసం వేరుగా శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రారబ్ధం ప్రాప్తించింది - ఇటువంటి స్థితి అనుభవమవుతుంది. భవిష్య ప్రారబ్ధమైతే విశ్వ యొక్క రాజ్యము కానీ ఈ సమయం యొక్క ప్రారబ్ధం - ‘‘సదా స్వయం సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉండడం మరియు, సంపన్నంగా చేయడము’’ ఈ సమయం యొక్క ప్రారబ్ధం అన్నింటికంటే శ్రేష్ఠమైనది. భవిష్యత్తుదైతే గ్యారంటీ ఉంది. భగవంతుడి యొక్క గ్యారంటీ ఎప్పుడూ మారజాలదు. కనుక ఇటువంటి కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు కదా. అందరికంటే ముందు సేవను ఎవరు ఆరంభిస్తారు? మధుబన్, ఎందుకంటే మధుబన్ వారిని అంటారు వారిని - పొయ్యి వద్ద కూడా ఉన్నారు మరియు హృదయంలో కూడా ఉన్నారు. అనంతమైన భండారీ నుండి సదా బ్రహ్మాభోజనం తినేవారు. వాస్తవానికి ఈ సమయంలో మీరంతా మధుబన్ లో కూర్చుని ఉన్నారు, మధుబన్ నివాసులు మరియు ఎవరైనా మిమ్మల్ని - మీ పర్మనెంట్ అడ్రస్ ఏమిటి అని అడిగితే మధుబన్ అనే అంటారు కదా! లేక ఎక్కడ ఉంటారో అదే పర్మనెంట్ అడ్రసా? బ్రహ్మాకుమార్-కుమారీలు అంటే పర్మనెంట్ అడ్రస్ ఒక్కటే, ఇకపోతే అక్కడకు సేవ కోసం పంపించడం జరిగింది. ఇలా కాదు - మేమైతే విదేశీయులము, కాదు. మేమైతే బ్రాహ్మణులము, సేవ కోసం తండ్రి అక్కడకు పంపించారు. బుద్ధి యొక్క టచింగ్ ద్వారా మిమ్మల్ని అక్కడకు పంపించడం జరిగింది. తండ్రి సంకల్పంతో అక్కడకు చేరుకున్నారు. రాజ్యం భారత్ లో చేస్తారా లేక లండన్ లోనా? ఎప్పుడూ కూడా ఇలా ఆలోచించవద్దు - మేమైతే విదేశంలో జన్మించాము కావున అక్కడకు చెందినవారము అని. బ్రహ్మా ద్వారా జన్మించారు, విదేశాల నుండి కాదు. లేదంటే విదేశీ కుమార్, విదేశీ కుమారీ అని పిలవబడతారు. బ్రహ్మాకుమార్-బ్రహ్మాకుమారీలు కదా! ఎలాగైతే భారత్ లో కొంతమంది యు.పి కి చెందినవారు, కొంతమంది ఢిల్లీకి చెందినవారు. అలాగే మీరు కూడా సేవ కోసం విదేశాలకు వెళ్ళారు, విదేశీయులు కారు. ఈ నషా ఉంది కదా. సేవా స్థానం అది, జన్మ స్థానం మధుబన్. ఆ లెక్కాచారం సమాప్తమైపోయింది అందుకే బ్రాహ్మణులుగా అయ్యారు. లెక్క సమాప్తమైపోయింది కనుక లెక్క యొక్క పుస్తకమే దహనమైపోయింది. గవర్నమెంట్ నుండి తప్పించుకునేందుకు కూడా పుస్తకాలను కాల్చేస్తారు కదా. కనుక పాత ఖాతాను సమాప్తం చేసేసారు కదా. ఎవరైనా తెలివైనవారుంటే, వారు పూర్తిగా తమ ఖాతాను సమాప్తం చేసేస్తారు. ఎవరైతే తెలివైనవారిగా ఉండరో, వారు ఎక్కడో ఒకచోట ఋణంలో చిక్కుకుని ఉంటారు, అప్పులో ఇరుక్కొని ఉంటారు. తెలివైనవారు ఎప్పుడూ కూడా ఇరుక్కొని ఉండరు. కనుక లెక్కాచారం యొక్క పుస్తకం సమాప్తం అనగా ఎటువంటి ఋణమూ లేదు, అన్ని ఖాతాలు శుభ్రమైపోతాయి. అందరికన్నా మంచి ఆచార-పద్ధతులు బ్రాహ్మణులవి. అచ్ఛా.
నలువైపులా ఉన్న సేవలో సమీప సాథీలందరికీ, ధైర్యవంతులు మరియు తండ్రి సహాయానికి పాత్రులైన ఆత్మలందరికీ, సదా మనసా మరియు వాచా డబల్ సేవను తోడు-తోడుగా చేసేటువంటి విహంగ మార్గపు సేవాధారులకు, సదా తండ్రి సమానంగా సర్వ ఆత్మలకు దీవెనలు ఇచ్చేటువంటి మాస్టర్ సద్గురు పిల్లలకు, సదా స్వయంలో ప్రతి సమయం నవీనత లేక విశేషతను తీసుకువచ్చేటువంటి సర్వ శ్రేష్ఠాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment